30 July 2021 TELUGU Murli Today | Brahma Kumaris

30 July 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

29 July 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - ఈ పాత ప్రపంచంలో మనుష్యులు ఏ రకమైన ఆశలను పెట్టుకుంటారో, ఆ ఆశలను మీరు పెట్టుకోకూడదు, ఎందుకంటే ఈ ప్రపంచం వినాశనమవ్వనున్నది”

ప్రశ్న: -

సంగమయుగంలో ఏ ఆశ పెట్టుకున్నట్లయితే సదా కోసం మీ ఆశలన్నీ పూర్తవుతాయి?

జవాబు:-

నేను పావనంగా అయి, తండ్రిని స్మృతి చేసి, వారి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి అనే ఆశ మాత్రమే ఉండాలి. ఈ ఆశ ద్వారానే సదా కోసం అన్ని ఆశలు పూర్తవుతాయి. ఆయుష్మాన్ భవ, పుత్రవాన్ భవ, ధనవాన్ భవ….. ఈ వరదానాలన్నీ లభిస్తాయి. సత్యయుగంలో అన్ని ఆశలు పూర్తవుతాయి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నీవే తల్లివి, నీవే తండ్రివి….. (తుమ్ హీ హో మాతా, తుమ్ హీ పితా హో…..)

ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు అనగా ఆత్మలకు పరమపిత పరమాత్మ ఇది అర్థం చేయిస్తున్నారు. అనంతమైన తండ్రి మనకు వరదానాన్ని ఇస్తున్నారని మీకు తెలుసు. ఆ మనుష్యులు పుత్రవాన్ భవ, ఆయుష్మాన్ భవ, ధనవాన్ భవ అనే ఆశీర్వాదాలను ఇస్తారు. ఇప్పుడు తండ్రి మీకు ఆయుష్మాన్ భవ అనే వరదానాన్ని ఇస్తారు. మీ ఆయుష్షు చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ పుత్రుడు ఉంటాడు, ఆ పుత్రుడు కూడా సుఖమిచ్చేవాడిగా ఉంటాడు. ఇక్కడ, పిల్లలందరూ దుఃఖమిచ్చేవారే. సత్యయుగంలో అందరూ సుఖమిచ్చే పిల్లలే ఉంటారు. అనంతమైన తండ్రి అనంతమైన సుఖ వారసత్వాన్ని ఇస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. మనం తప్పకుండా ఆయుష్మంతులుగా మరియు ధనవంతులుగా కూడా అవుతాము. ఇప్పుడు మనసులో ఎలాంటి కోరికను పెట్టుకోకూడదు. మీ కోరికలన్నీ సత్యయుగంలో పూర్తవ్వనున్నాయి. ఈ నరకంలో ఎలాంటి కోరికను పెట్టుకోకూడదు. ధనం కావాలనే కోరికను కూడా పెట్టుకోకండి. చాలా ధనముండాలి, పెద్ద ఉద్యోగం లభించాలి – ఇలాంటి కోరికలను కూడా ఎక్కువగా పెట్టుకోకూడదు. కడుపు ఒక పావు పిండి రొట్టెను తింటుంది, ఎక్కువ లోభము ఉండకూడదు. ఎక్కువ ధనమున్నట్లయితే, అది సమాప్తం అవ్వబోతుంది. బాబా మనల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తారని పిల్లలకు తెలుసు. దానమిస్తే గ్రహణం తొలగిపోతుందని ఇప్పుడు తండ్రి అంటారు. ఏ దానమివ్వాలి? ఈ 5 వికారాలను దానమివ్వాలి. వీటిని దానమిచ్చినట్లయితే, గ్రహచారం తొలగిపోతుంది మరియు మీరు 16 కళల సంపూర్ణులుగా అవుతారు. మనం సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా ఇక్కడే తయారవ్వాలని మీకు తెలుసు. 5 వికారాలను దానమివ్వాల్సి ఉంటుంది. పిల్లలకు బాబా చెప్తారు – మధురమైన పిల్లలూ, అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలనే ఆశను తప్ప ఇంకెలాంటి ఆశలను పెట్టుకోకండి. ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. చాలా సమయం గడిచిపోయింది, కొద్దిగానే మిగిలి ఉంది అని అంటూ ఉంటారు. ఈ వినాశనానికి ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది, అందుకే, ఈ పాత ప్రపంచానికి సంబంధించిన ఆశలేమీ పెట్టుకోకండి. కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. స్మృతి ద్వారా పిల్లలు సతోప్రధానంగా అవ్వాలి. ఈ ప్రపంచంలో మనుష్యులు ఏ ఆశలనైతే పెట్టుకుంటారో, అవేవీ మీరు పెట్టుకోకండి. మనం ఒక్క శివబాబా నుండి మన స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలనే ఆశను మాత్రమే పెట్టుకోవాలి. ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖమివ్వకూడదు. ఒకరిపై ఒకరు కామ ఖడ్గాన్ని ఉపయోగించడం అన్నింటికన్నా పెద్ద దుఃఖము, అందుకే సన్యాసులు స్త్రీల నుండి వేరైపోతారు. వీరు అన్నీ వదిలేసారు అని అంటారు. ఈ సమయంలో రావణ రాజ్యంలో అందరూ పతితులు, పాపాత్ములే ఉన్నారు.

ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉంది, ఒకవేళ మీరు తండ్రి శ్రీమతంపై నడుచుకోకపోతే శ్రేష్ఠంగా అవ్వరు. పిల్లలు ఉన్నతోన్నతులుగా అవ్వాలి, అందుకే, 5 వికారాలను దానమివ్వాలి, అప్పుడు ఈ గ్రహణం తొలగిపోతుంది. అందరి పైన గ్రహచారం ఉంది, పూర్తిగా నల్లగా అయిపోయారు. తండ్రి అంటారు – ఒకవేళ నా నుండి వారసత్వాన్ని తీసుకోవాలంటే పావనంగా అవ్వండి. ద్వాపరం నుండి మొదలుకొని మీరు పతితులుగా అవుతూ-అవుతూ సతోప్రధానం నుండి తమోప్రధానంగా అయిపోయారు, అందుకే – పతిత పావనా రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని పాడుతారు. కావున తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు – పిల్లలూ, ఇప్పుడు పతితులుగా అవ్వకండి, కామము అనే మహాశత్రువుపై గెలవండి, దీని వలనే మీరు ఆదిమధ్యాంతాలు దుఃఖాన్ని పొందారు. తండ్రి అంటారు – మీరు స్వర్గంలో పూర్తిగా పవిత్రంగా ఉండేవారు. ఇప్పుడు రావణుని మతమనుసారంగా మీరు పతితులుగా అయ్యారు, అందుకే దేవతల ముందుకు వెళ్ళి – మీరు సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు, మేము వికారులము అని వారి మహిమను గాయనం చేస్తారు. నిర్వికారులుగా అయినట్లయితే సుఖమే సుఖముంటుంది. తండ్రి అంటారు – పిల్లలైన మిమ్మల్ని నిర్వికారులుగా తయారుచేసేందుకు ఇప్పుడు నేను వచ్చాను. ఇప్పుడు పిల్లలైన మీరు అన్ని కోరికలను వదలాలి. తమ వ్యాపార-వ్యవహారాలు మొదలైనవి చేసుకోండి మరియు ఒకరికొకరు జ్ఞానామృతాన్ని తాగించండి. అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తాగుతారని అంటారు. తండ్రి అంటారు – మీరు ఎలాంటి కోరికలు పెట్టుకోకండి. మనం స్మృతి యాత్రతో పూర్తిగా సతోప్రధానంగా అవుతాము. 63 జన్మలు ఏ పాపాలనైతే చేసామో, అవి స్మృతి ద్వారానే సమాప్తమవుతాయి. ఇప్పుడు నిర్వికారులుగా అవ్వాలి. మాయ తుఫాన్లు వచ్చినా కానీ పతితులుగా అవ్వకూడదు. మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి. మీరే సతోప్రధాన పూజ్య దేవతలుగా ఉండేవారు, తర్వాత మీరే పూజ్యుల నుండి పూజారులుగా అవుతారు. మనం నిరోగులుగా ఉండేవారము, తర్వాత రోగులుగా అవుతాము, ఇప్పుడు మళ్ళీ నిరోగులుగా అవుతున్నాము. నిరోగులుగా ఉన్నప్పుడు ఆయుష్షు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు చూడండి, కూర్చుని ఉండగానే మనుష్యులు మరణిస్తారు. కావున ఎలాంటి ఆశలను పెట్టుకోకూడదు. ఇవన్నీ ఛీ-ఛీ ఆశలు. ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యేందుకు ఒకే ఒక్క ఫస్ట్ క్లాస్ ఆశ ఉంది, తండ్రి అంటారు – నన్ను స్మృతి చేసినట్లయితే పుణ్యాత్ములుగా అవుతారు. ఈ సమయంలో అందరిపైన రాహు గ్రహణముంది. మొత్తం భారత్ పై రాహు గ్రహణముంది. ఇప్పుడు బృహస్పతి దశ కావాలి. ఇప్పుడు మనపై బృహస్పతి దశ కూర్చొని ఉందని మీకు తెలుసు. భారత్ స్వర్గంగా ఉండేది కదా. సత్యయుగంలో మీపై బృహస్పతి దశ ఉండేది. ఈ సమయంలో రాహు దశ ఉంది. ఇప్పుడు మళ్ళీ అనంతమైన తండ్రి ద్వారా బృహస్పతి దశ లభిస్తుంది. బృహస్పతి దశలో 21 జన్మల సుఖముంటుంది. త్రేతాలో శుక్ర దశ ఉంటుంది. ఎవరెంత స్మృతి చేస్తే అంత, ఎక్కువగా స్మృతి చేస్తే బృహస్పతి దశ ఉంటుంది. ఇది కూడా అర్థం చేయించారు – ఇప్పుడు అందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలి కావున తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు ఎగిరేందుకు యోగ్యులుగా అవుతారు. మాయ మీ రెక్కలను కట్ చేసేసింది. ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతం లభిస్తుంది, దీని ద్వారా మీరు సదా సుఖమయంగా అవుతారు. ఈశ్వరీయ మతంపై మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. మీరు విశ్వ రాజ్యాన్ని తీసుకుంటున్నారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే అంతమతి సో గతి జరుగుతుంది (అంతిమ సమయంలో ఎలాంటి ఆలోచనలతో చనిపోతారో, అలాంటి జన్మ లభిస్తుంది) – ఈ ఈశ్వరీయ మతం లభిస్తుంది. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి, పవిత్రంగా తయారవుతారు. పవిత్ర ఆత్మలే స్వర్గానికి యోగ్యులుగా అవుతారు. అక్కడ మీ శరీరం కూడా నిరోగిగా ఉంటుంది, ఆయుష్షు కూడా ఎక్కువగా ఉంటుంది, ధనం కూడా ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఎప్పుడూ పిల్లలను దత్తత తీసుకోరు. తండ్రి అంటారు – ఆయుష్మాన్ భవ, సంపత్తివాన్ భవ. ఒక పుత్రుడు తప్పకుండా ఉంటాడు. ఈ సమయంలో తండ్రి పిల్లలందరినీ దత్తత తీసుకుంటారు. సత్యయుగంలో దత్తత తీసుకోబడిన పిల్లలు ఎవరు ఉండరు. యోగబలంతో ఒక పుత్రుడు, ఒక పుత్రిక జన్మిస్తారు. అక్కడ పిల్లలు ఎలా జన్మిస్తారని అడుగుతారు, అక్కడ యోగబలము ఉంటుంది. ఇది డ్రామాలో నిశ్చయించబడి ఉంది. సత్యయుగంలో ఉన్నవారందరూ యోగులు. కృష్ణుడిని యోగేశ్వరుడని అంటారు. అలాగని కృష్ణుడు యోగంలో ఉంటారని కాదు. వారు పూర్తి పవిత్రమైన యోగి. ఈశ్వరుడు అందరినీ యోగేశ్వరులుగా తయారుచేసారు కావున భవిష్యత్తులో యోగులుగా ఉంటారు. తండ్రి యోగులుగా తయారుచేసారు. యోగుల ఆయుష్షు ఎక్కువగా ఉంటుంది. భోగుల ఆయుష్షు తక్కువగా ఉంటుంది. ఈశ్వరుడు పిల్లలను పవిత్రంగా తయారుచేసి, యోగాన్ని నేర్పించి దేవతలుగా తయారుచేసారు, వీరిని యోగులు అని అంటారు. యోగులు మరియు ఋషులు పవిత్రంగా ఉంటారు. మీరు రాజఋషులని మీకు అర్థం చేయించారు. రాజ్య పదవిని పొందేందుకు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ఈ సమయంలో తండ్రిని స్మృతి చేయాలి, పిల్లలు జన్మించాలనే తప్పుడు ఆశను ఇక్కడ పెట్టుకోకూడదు. దాని కొరకు వికారాల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది, కామ ఖడ్గాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. దేహాభిమానులు కామ ఖడ్గాన్ని ఉపయోగిస్తారు. దేహీ-అభిమానులు కామ ఖడ్గాన్ని ఉపయోగించరు. పవిత్రంగా అవ్వండి అని తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఈ కామ ఖడ్గాన్ని ఉపయోగించకండి, పవిత్రంగా అయితే మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి అని ఆత్మలతో మాట్లాడతారు. మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తారు. తండ్రి ఎంత సుఖాన్ని ఇస్తారు. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి.

తండ్రి పేదల పెన్నిధి. సుదాముడు 2 పిడికెళ్ళ బియ్యం ఇస్తే మహల్ లభించిందని అంటారు. బాబా 21 జన్మలకు వారసత్వాన్ని ఇచ్చేస్తారు. ఇప్పుడు అందరూ తిరిగి వెళ్ళాలని కూడా మీరు అర్థం చేసుకున్నారు. శివబాబా యొక్క స్థాపన కార్యంలో ఎవరెంత సహాయం చేయాలనుకుంటే అంత చేయవచ్చు. ఇంట్లో యూనివర్సిటీ మరియు హాస్పిటల్ ను తెరవండి. బోర్డుపై ఈ విధంగా రాయండి – సోదరీ-సోదరులు, మీరు 21 జన్మల కోసం సదా ఆరోగ్యంగా, సంపన్నంగా అవ్వాలనుకుంటే వచ్చి అర్థం చేసుకోండి, మేము ఒక్క సెకెండులో సదా ఆరోగ్యంగా, సంపన్నంగా అయ్యే మార్గాన్ని తెలియజేస్తాము అని. మీరు సర్జన్లు కదా. సర్జన్లు బోర్డు తప్పకుండా పెట్టుకుంటారు లేదంటే మనుష్యులకు ఎలా తెలుస్తుంది. మీరు కూడా మీ ఇంటి బయట బోర్డు పెట్టుకోండి. ఎవరు వచ్చినా సరే వారికి ఇద్దరు తండ్రుల రహస్యాన్ని అర్థం చేయించండి. హద్దు తండ్రి నుండి హద్దు వారసత్వాన్ని తీసుకుంటూ వచ్చారు. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే అనంతమైన వారసత్వం లభిస్తుందని అనంతమైన తండ్రి అంటారు. ఈ పురుషార్థం ద్వారా మీరు ఈ విధంగా అవుతారని ప్రొజెక్టర్లు మరియు ప్రదర్శినీల ద్వారా ముందు ఈ విషయాన్ని అర్థం చేయించండి. ఇప్పుడిది సంగమము. కలియుగం నుండి సత్యయుగంగా అవ్వాలి. భారతవాసులైన మీరు సతోప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమోప్రధానంగా అయ్యారు. నన్ను స్మృతి చేస్తే మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారని ఇప్పుడు తండ్రి అంటారు. రెండే పదాలున్నాయి. అల్ఫ్ (భగవంతుడు) ను స్మృతి చేస్తే బే (రాజ్యం) మీదవుతుంది. ఈ స్మృతితో సంతోషంగా ఉంటారు, ఈ ఛీ-ఛీ ప్రపంచంలో ఏ రకమైన ఆశలను పెట్టుకోకూడదు. ఇక్కడ మీరు జీవిస్తూ మరణించేందుకు పురుషార్థం చేస్తారు. వారైతే మరణించిన తర్వాత స్వర్గవాసులుగా అయ్యారని అంటారు. మేము స్వర్గవాసులుగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేస్తామని మీరు అందరికీ చెప్తారు. వారి నుండి అనంతమైన సుఖం లభిస్తుంది. తండ్రిని స్మృతి చేస్తే మీరెప్పుడు ఏడవరు, ఆర్తనాదాలు చేయరు. మాయ తుఫాన్లు వస్తాయి, వాటి గురించి ఆలోచించకండి. మాయ తుఫాన్లు అయితే వస్తాయి. ఇది యుద్ధము. సంకల్ప-వికల్పాలు వస్తే అనవసరంగా సమయం వృథా అవుతుంది. తుఫాన్లు అయితే వెళ్ళిపోతాయి, అవి సదా ఉండవు. ఉదయాన్నే లేచి తండ్రిని స్మృతి చేయాలి, తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. లోలోపల ఈ తపన ఉండాలి. తండ్రి ఇంకెటువంటి కష్టాన్ని ఇవ్వరు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. మిగిలినవారందరినీ మర్చిపోండి, వారంతా మరణించి ఉన్నారు. పరస్పరంలో ఈ విషయాలనే మాట్లాడుకుంటూ ఉండండి. బాబా, ఇప్పుడు కేవలం మిమ్మల్ని మాత్రమే స్మృతి చేస్తాము, మీ నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటాము. మేము 3-4 గంటలకు తప్పకుండా లేచి తండ్రిని స్మృతి చేస్తామని సమయం నిశ్చితం చేసుకోండి. చక్రాన్ని కూడా గుర్తుంచుకోవాలి. తండ్రి మనకు రచయిత మరియు రచనల జ్ఞానాన్ని ఇచ్చారు. మనకు ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షం గురించి తెలుసు. మనం 21 జన్మలు ఎలా తీసుకుంటాము అనేది బుద్ధిలో ఉంది. ఇప్పుడు మనం వెళ్తాము, స్వర్గంలోకి మళ్ళీ వచ్చి పాత్రను అభినయిస్తాము. మనం ఆత్మలము, ఆత్మకే రాజ్యం లభిస్తుంది. తండ్రిని స్మృతి చేయడంతో వారసత్వానికి హక్కుదారులుగా అవుతారు. ఇది రాజయోగము. తండ్రిని స్మృతి చేస్తారు. అనంతమైన తండ్రి ద్వారా అనేక సార్లు విశ్వానికి యజమానులుగా అయ్యారు, మళ్ళీ నరకవాసులుగా అయ్యారు. ఇప్పుడు ఒక్క తండ్రి స్మృతి ద్వారా మళ్ళీ స్వర్గవాసులుగా అవుతారు. తండ్రి స్మృతి ద్వారానే పాపాలు భస్మమవుతాయి, అందుకే దీనిని యోగాగ్ని అని అంటారు. బ్రాహ్మణులైన మీరు రాజఋషులు, ఋషులు సదా పవిత్రంగా ఉంటారు, తండ్రిని స్మృతి చేస్తారు మరియు రాజ్య వారసత్వాన్ని తీసుకుంటారు. ఇప్పుడు వికారాల కోసం ఆశ పెట్టుకోకూడదు. ఇది ఛీ-ఛీ ఆశ. ఇప్పుడు పారలౌకిక తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. మీరు అనారోగ్యంగా ఉన్నప్పటికీ స్మృతి చేయవచ్చు. తండ్రికి కూడా పిల్లలు ప్రియంగా అనిపిస్తారు. బాబా ఎంతమంది పిల్లలకు ఉత్తరాలు రాయాల్సి ఉంటుంది. శివబాబా రాయిస్తారు. మీరు కూడా శివబాబా, కేరాఫ్ బ్రహ్మా అని ఉత్తరాలు రాస్తారు. శివబాబాకు పిల్లలైన మనమంతా పరస్పరంలో సోదరులము. ఆత్మిక తండ్రి వచ్చి మనల్ని పావనంగా చేస్తారు, అందుకే వారిని పతితపావన అని అంటారు. వారు ఆత్మలందరినీ పావనంగా చేస్తారు. నేను ఎవరినీ విడిచిపెట్టను. ప్రకృతి కూడా పావనంగా అవుతుంది. సత్యయుగంలో ప్రకృతి కూడా పావనంగా ఉంటుందని మీకు తెలుసు. ఇప్పుడు శరీరం కూడా పతితంగా ఉంది కావున గంగలో శరీరాన్ని శుద్ధంగా చేసుకునేందుకు వెళ్తారు, కానీ దానితో ఆత్మ పావనంగా అవ్వదు. యోగాగ్ని ద్వారానే ఆత్మ పావనంగా అవుతుంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ కలియుగ ప్రపంచంలో ఎలాంటి తప్పుడు ఆశలను పెట్టుకోకూడదు. సంపూర్ణ సతోప్రధానంగా అయ్యేందుకు ఈశ్వరీయ మతంపై నడుచుకోవాలి.

2. పావనంగా అయి తిరిగి ఇంటికి వెళ్ళాలన్న ఒక్క ఆశను మాత్రమే పెట్టుకోవాలి. అంతమతి సో గతి అవుతుంది (అంతిమ సమయంలో ఎలాంటి ఆలోచనలతో చనిపోతారో, అలాంటి జన్మ లభిస్తుంది). మాయ తుఫాన్లలో సమయాన్ని వృథా చేసుకోకూడదు.

వరదానము:-

ఎలాగైతే పాత్ర ఉన్నంత వరకు శరీరం మరియు ఆత్మ వేరు అవ్వలేవో, అలా తండ్రి స్మృతి బుద్ధి నుండి వేరు అవ్వకూడదు, సదా తండ్రి తోడు ఉండాలి, ఇంకే స్మృతి తన వైపుకు ఆకర్షించకూడదు – ఇటువంటి వారినే సహజ యోగులు, స్వతహా యోగులని అంటారు. ఇటువంటి యోగులు ప్రతి సెకండు, ప్రతి సంకల్పం, ప్రతి మాట, ప్రతి కర్మలో సహయోగులుగా ఉంటారు. ఎవరి ఒక్క సంకల్పం కూడా సహయోగం లేకుండా ఉండదో, వారిని సహయోగులని అంటారు. ఇటువంటి యోగులు మరియు సహయోగులు శక్తిశాలిగా అవుతారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top