30 December 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

December 29, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - సత్యమైన తండ్రితో సత్యంగా ఉండండి, ఒకవేళ సత్యం చెప్పకపోతే పాపాలు వృద్ధి చెందుతూ ఉంటాయి’’

ప్రశ్న: -

ఎప్పుడైతే పిల్లలైన మీరు కర్మాతీత అవస్థకు సమీపంగా చేరుకుంటారో, అప్పుడు ఏ అనుభూతి చేస్తారు?

జవాబు:-

మాయా తుఫానులన్నీ సమాప్తమైపోయినట్లుగా అనుభవమవుతుంది. ఏ విఘ్నములోనూ భయపడరు. అవస్థ చాలా నిర్భయంగా ఉంటుంది. ఎప్పటివరకైతే ఆ అవస్థ దూరంగా ఉంటుందో, అప్పటివరకు మాయా తుఫాన్లు చాలా హైరానా పెడతాయి. బాబా అంటారు – మధురమైన పిల్లలూ, మీరు ఎంతగా బలశాలిగా అవుతారో, అంతగా మాయ కూడా బలశాలిగా అయి వస్తుంది. కానీ మీరు విజయాన్ని ప్రాప్తి చేసుకోవాలి, భయపడకూడదు. సత్యమైన తండ్రితో సత్యతతో, స్వచ్ఛతతో నడుస్తూ ఉండండి. ఎప్పుడూ ఏ విషయాన్నీ దాచిపెట్టకండి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

మేల్కోండి ప్రేయసులారా, మేల్కోండి..

ఓంశాంతి. ఇక్కడ ఉండే పిల్లలైతే ఈ పాటను రోజూ వింటారు. సెంటర్లలో ఉండే బి.కె.లు కూడా వింటారు. బయట ఉండేవారైతే వినరు. వాస్తవానికి ఈ పాటను అనన్యులైన పిల్లలందరి ఇళ్ళలో పెట్టుకోవాలి. అందరినీ మేల్కొల్పాలి ఎందుకంటే ఈ పాటలోని రహస్యము చాలా బాగుంది. కొత్త యుగం వస్తూ ఉంది. కొత్త యుగం అనగా సత్యయుగము. ఇది కలియుగము. కలియుగ వినాశనం జరగనున్నది. సత్యయుగంలో భారతవాసుల రాజధాని మాత్రమే ఉంటుంది. దానిని బంగారు యుగ ప్రపంచమని అంటారు. బంగారు యుగ ప్రపంచంలో బంగారు యుగ భారత్. ఇనుప యుగ ప్రపంచంలో ఇనుప యుగ భారత్. ఇది కూడా మీకే తెలుసు. బంగారు యుగంలో ఏ ఇతర ఖండము గాని లేక ధర్మం గాని ఉండవు. ఇప్పుడిది ఇనుప యుగము. ఇందులో అన్ని ధర్మాలు ఉన్నాయి. భారత్ యొక్క ధర్మం కూడా తప్పకుండా ఉంది. కానీ ఆ దేవీ-దేవతలు లేరు. మరి తప్పకుండా మళ్ళీ ఉండాలి. కావున తండ్రి అంటారు, నేను వచ్చి స్థాపన చేస్తాను. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఎవరైనా శాస్త్రాల గురించి మాట్లాడితే, వారికి చెప్పండి, ఇవి భక్తి మార్గపు శాస్త్రాలు, జ్ఞాన మార్గం యొక్క శాస్త్రము ఉండదు అని. జ్ఞానసాగరుడు అని పరమపిత పరమాత్మను అనడం జరుగుతుంది. ఎప్పుడైతే వారు వచ్చి జ్ఞానాన్ని ఇస్తారో, అప్పుడు సద్గతి జరుగుతుంది. ఈ గీత మొదలైనవి కూడా భక్తి మార్గానికి చెందినవి. నేను వచ్చి పిల్లలైన మీకు జ్ఞానాన్ని మరియు యోగాన్ని నేర్పిస్తాను. ఆ తర్వాత, వారు శాస్త్రాలను తయారుచేస్తారు, అవి మళ్ళీ భక్తి మార్గంలో ఉపయోగపడతాయి. ఇప్పుడు మీది ఎక్కే కళ. మీకు తండ్రి వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తారు. తండ్రి స్వయంగా అంటారు, నేను మీకు సద్గతి కొరకు ఏదైతే జ్ఞానాన్ని ఇస్తానో, అది ప్రాయః లోపమైపోతుంది. ఇప్పుడు తండ్రి అంటారు, మీరు ఏ శాస్త్రాలు మొదలైనవి వినకండి. ఆ ఆత్మిక తండ్రి అయితే అందరికీ ఒక్కరే. సద్గతి వారసత్వము కూడా వారి నుండి లభిస్తుంది. ఇది ఉన్నదే దుర్గతి ధామము, సద్గతి ధామమని సత్యయుగాన్ని అంటారు. ఎప్పుడైనా ఎవరైనా శాస్త్రాల గురించి, వేదాల గురించి లేక గీత గురించి మాట్లాడితే, వారికి చెప్పండి, మాకు అన్నీ తెలుసు కానీ అవి భక్తి మార్గానికి చెందినవి, ఇప్పుడు జ్ఞానసాగరుడైన పరమపిత పరమాత్మ మమ్మల్ని చదివిస్తున్నప్పుడు మేము అసలు వాటి పేరు ఎందుకు తీసుకోవాలి! తండ్రి అంటారు – స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి, అప్పుడు ఈ యోగ అగ్నితో మీ వికర్మలు వినాశనమైపోతాయి. భక్తి మార్గంలోనైతే ఇంకా వికర్మలు జరుగుతూ వచ్చాయి. మాకు తండ్రి చెప్పారు – మన్మనాభవ. వారే జ్ఞానసాగరుడు, పతితపావనుడు. పతితపావనుడు అని కృష్ణుడిని అనరు. ఇప్పుడు మేము ఒక్క తండ్రిదే వింటాము. వారిని శివ పరమాత్మాయ నమః అని అంటారు, మిగిలిన వారందరినీ దేవతాయ నమః… అని అంటారు. ఈ సమయంలోనైతే అందరూ తమోప్రధానంగా ఉన్నారు. సతోప్రధానంగా అయ్యే మార్గం ఒక్క తండ్రే వచ్చి తెలియజేస్తారు. ఇప్పుడు ఆ ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. బ్రహ్మమును స్మృతి చేయకూడదు. అది ఇల్లు. ఇంటిని స్మృతి చేయడంతో వికర్మలు వినాశనమవ్వవు. కానీ ఇంటిలో ఉండే పరమపిత పరమాత్మను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమైపోతాయి. మరియు ఆత్మ సతోప్రధానంగా అయి తన ఇంటికి వెళ్ళిపోతుంది, మళ్ళీ పాత్రను అభినయించడానికి వస్తుంది. చక్రము రహస్యాన్ని అర్థం చేయించాలి. మొదట ఇది అర్థం చేసుకోవాలి, వీరికి జ్ఞానాన్ని వినిపించేవారు నిరాకార పరమపిత పరమాత్మ అని. మీరు బ్రహ్మా నుండి వింటారా అని ఎవరైనా అంటే, లేదు, మేము మనుష్యుల నుండి వినము, వీరి ద్వారా మాకు పరమపిత పరమాత్మ అర్థం చేయిస్తారు అని చెప్పండి. మేము వీరిని (బ్రహ్మాను) పరమాత్మ అని భావించము. అందరి తండ్రి శివుడే, వారసత్వం కూడా వారి నుండి లభిస్తుంది. వీరు మాధ్యమము. బ్రహ్మా నుండి ఏమీ లభించదు. వారి మహిమ ఏమిటి? మహిమ అంతా ఒక్క శివునిదే. వారు ఒకవేళ వీరిలోకి రాకపోతే, మీరు ఎలా వస్తారు. శివబాబా బ్రహ్మా ద్వారా మిమ్మల్ని దత్తత తీసుకున్నారు, అందుకే మీరు బి.కె.లుగా పిలవబడతారు. బ్రాహ్మణ కులం కావాలి కదా. ఏ మనిషి లేక శాస్త్రము మొదలైనవి, ముక్తి-జీవన్ముక్తుల మార్గాన్ని తెలియజేయలేవు. నిరాకార పరమపిత పరమాత్మ, సద్గతిదాతనే మార్గాన్ని తెలియజేస్తారు. చాలా ఎక్కువగా మాట్లాడకూడదు. వారికి వెంటనే చెప్పాలి, మేము జన్మ-జన్మాంతరాలుగా భక్తి చేసాము, ఇప్పుడు మాకు తండ్రి చెప్తారు, ఈ అంతిమ జన్మ గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి మరియు నన్ను స్మృతి చేయండి, అప్పుడు మీ ఈ అంతిమ జన్మ యొక్క మరియు గత జన్మల యొక్క పాపాలు ఏవైతే ఉన్నాయో, అవి భస్మమైపోతాయి మరియు మీరు మీ ఇంటికి వెళ్ళిపోతారు. పవిత్రంగా అవ్వకుండానైతే ఎవరూ వెళ్ళలేరు. మొట్టమొదటిగా ఒక విషయాన్ని అర్థం చేయించండి, నిరాకార శివబాబా అంటారు, ఓ ఆత్మలు, నేను బ్రహ్మా తనువులో ప్రవేశించి జ్ఞానాన్ని ఇస్తాను, బ్రహ్మా ద్వారా స్థాపన చేయిస్తాను, బ్రాహ్మణులకు శిక్షణనిస్తాను. జ్ఞాన యజ్ఞాన్ని సంభాళించేందుకు కూడా బ్రాహ్మణులు కావాలి కదా. మీరు ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. ఈ మృత్యులోకము ఇప్పుడు సమాప్తమవ్వనున్నదని మీకు తెలుసు. కలియుగాన్ని మృత్యులోకమని మరియు సత్యయుగాన్ని అమరలోకమని అంటారు. భక్తి యొక్క రాత్రి ఇప్పుడు పూర్తి అవుతుంది. బ్రహ్మా పగలు ప్రారంభమవుతుంది. బ్రహ్మా నుండి విష్ణువు, ఇది కూడా ఎవరూ అర్థం చేసుకోరు. ఎప్పుడైతే పూర్తిగా 7 రోజులు వచ్చి వింటారో, అప్పుడు అర్థం చేసుకుంటారు. ప్రదర్శనీలో ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. కేవలం ఈ మార్గం బాగుంది, అర్థం చేసుకోదగినదిగా ఉంది అని మాత్రం అంటారు. గీతా భగవంతుడు నిరాకార శివుడు అన్న ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించాలి. వారు అంటారు, నన్ను స్మృతి చేయండి. మిగిలిన వీటన్నింటినీ జన్మ-జన్మాంతరాలుగా చదువుతూ దిగుతూనే వచ్చారు. తర్వాత, మెట్ల చిత్రం నుండి వృక్షము వద్దకు తీసుకువెళ్ళా్లి. మీరు నివృత్తి మార్గం వారు. మేము ప్రవృత్తి మార్గం వారము. మాది అనంతమైన సన్యాసము. ఎప్పుడైతే భక్తి పూర్తి అయిపోతుందో, అప్పుడు మొత్తం ప్రపంచం పట్ల వైరాగ్యము కలుగుతుంది మరియు భక్తి పట్ల కూడా వైరాగ్యం కలుగుతుంది. భక్తి రావణ రాజ్యంలో ఉంటుంది. ఇప్పుడు శివబాబా శివాలయాన్ని స్థాపన చేస్తున్నారు. శివజయంతి కూడా భారత్ లోనే జరుపుకోబడుతుంది. కావున శివబాబానే వచ్చి భారత్ ను స్వర్గంగా తయారుచేసారు మరియు నరకాన్ని వినాశనం చేసారు అనేది పక్కా అయిపోవాలి. కొత్త ప్రపంచంలోకి వచ్చేవారే ఈ రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. స్వర్గంలో పవిత్రత, శాంతి, సుసంపన్నత అన్నీ ఉంటాయి. ఇక్కడ సన్యాసులు మొదలైనవారు ఎవరైతే ఉన్నారో, వారు అర్ధ పవిత్రతలో ఉన్నారు, వారు గృహస్థీ వికారుల ఇళ్ళలో జన్మ తీసుకుని, ఆ తర్వాత సన్యాసం చేస్తారు. ఇది అర్థం చేయించాల్సి ఉంటుంది. శివబాబా, పతితపావనుడు, మాకు బ్రహ్మా ద్వారా అర్థం చేయిస్తారు. బ్రహ్మా ద్వారా రాజయోగాన్ని నేర్పించి ఇలా తయారుచేస్తున్నారు. రాజయోగం ద్వారానే రాజ్యం స్థాపన అవుతూ ఉంది. ఈ గీతా అధ్యాయము ఇప్పుడు రిపీట్ అవుతూ ఉంది. మీరు కూడా రాజయోగాన్ని నేర్చుకోవాలనుకుంటే, వచ్చి నేర్చుకోండి. ఈ జ్ఞానము ప్రవృత్తి మార్గానికి చెందినది.

భగవానువాచ – గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అయి నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి, పావనంగా అయ్యేందుకు ఇంకే ఉపాయము లేనే లేదు. కొద్దిగానే మాట్లాడాలి. తికమకపడకూడదు. బాబా అర్థం చేయించారు, రాత్రివేళ కూర్చొని ఆలోచించండి – ఈ రోజంతటిలో ఏదైతే గతించిందో, ఏ సేవ అయితే జరగాల్సి ఉందో, డ్రామా ప్లాన్ అనుసారంగా జరిగింది. పురుషార్థమైతే నడవాలి కదా. ప్రదర్శనీలో పిల్లలు ఎంత శ్రమ చేస్తారు. మాయా తుఫానులు చాలా కఠినమైనవని కూడా తెలుసు. చాలా మంది పిల్లలంటారు, బాబా, వీటిని ఆపుచేయండి, మాకు ఏ వికల్పాలు రాకూడదు. బాబా అంటారు – వీటికి ఎందుకు భయపడతారు? నేనైతే ఇంకా వేగంగా తుఫానులు తీసుకురమ్మని మాయకు చెప్తాను. బాక్సింగ్ లో ఒకరితో ఒకరు ఏమైనా అంటారా, మేము కింద పడిపోయేలా మమ్మల్ని గట్టిగా కొట్టవద్దు, ఎక్కడంటే అక్కడ కొట్టవద్దు అని. మీరు కూడా యుద్ధ మైదానంలో ఉన్నారు కదా. తండ్రిని మర్చిపోయినట్లయితే మాయ చెంపదెబ్బ వేస్తుంది. మాయా తుఫానులు అయితే అంతిమం వరకు వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే కర్మాతీత అవస్థ ఏర్పడుతుందో, అప్పుడు ఇవి సమాప్తమైపోతాయి. తుఫానులు చాలా వస్తాయి, భయపడే విషయమేమీ లేదు. బాబాతో సత్యంగా ఉంటూ నడుచుకోవాలి. సత్యమైన చార్టును పంపించాలి. చాలామంది పిల్లలు ఉదయాన్నే లేచి స్మృతిలో కూర్చోరు, నిద్రిస్తూ ఉంటారు. ఒకవేళ మేము శ్రీమతంపై నడుచుకోకపోతే, కల్ప-కల్పాంతరాలకు మమ్మల్ని మేము సర్వనాశనం చేసుకుంటామని అర్థం చేసుకోరు. చాలా పెద్ద దెబ్బ తింటున్నారు. ఎప్పుడూ సత్యం చెప్పని పిల్లలు కూడా ఉన్నారు, మరి వారి గతి ఏమవుతుంది. పడిపోతారు. మాయ చెంపదెబ్బను చాలా గట్టిగా వేస్తుంది. తెలియనే తెలియదు. రోజంతా వారి గురించి, వీరి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సత్యం చెప్పకపోతే ఇక వృద్ధి చెందుతూ ఉంటుంది. లేదంటే, ఈ రోజు ఈ పొరపాటు చేసాను, అబద్ధం చెప్పాను అని సత్యం చెప్పాలి. ఒకవేళ సత్యం చెప్పకపోతే, ఇక వృద్ధి చెందుతూ ఉంటుంది, ఇక మళ్ళీ ఎప్పుడూ సత్యంగా అవ్వరు. మేము ఈ-ఈ డిస్సర్వీస్ చేసాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పాలి. సత్యం చెప్పకపోతే, హృదయాన్ని అధిరోహించరు. సత్యత ఆకర్షిస్తుంది. ఎవరెవరు మంచి సేవ చేస్తారు అనేది స్వయం పిల్లలకు కూడా తెలుసు. మంచి-మంచి పిల్లలు చాలా కొద్దిమంది ఉన్నారు. పల్లెటూర్లకు కూడా మంచి-మంచి కుమార్తెలను పంపించాలని కోరుకుంటాను, అప్పుడు అందరూ సంతోషిస్తారు, బాబా మా వద్దకు బొంబాయి హెడ్ ను, కలకత్తా హెడ్ ను పంపించారు అని భావిస్తారు. ఎవరు కలిసినా వారికి నేరుగా వినిపించండి, పతితపావనుడైన పరమపిత పరమాత్మ సంగమంలో వచ్చి నన్నొక్కరినే స్మృతి చేయండి అనే మహామంత్రాన్ని ఇస్తారు అని. రాజయోగాన్ని అయితే బాబా మీకే నేర్పిస్తారు. మీ పని ఇతరులకు కూడా మార్గాన్ని తెలియపరచడము. కలకత్తాకు పదండి అని పిల్లలు అంటారు. ఇప్పుడు బాబా పిల్లలతో తప్ప ఇంకెవ్వరితోనూ మాట్లాడలేరు. అప్పుడు, వీరు ఎవ్వరితోనూ కలవరు, వీరు ఎవరు అనేది మేమెలా అర్ధం చేసుకోగలము అని అంటారు. ఎందుకంటే వారివైతే భక్తి యొక్క విషయాలు. ఆత్మల తండ్రి ఎవరు, ఇదైతే ఎవ్వరూ తెలియజేయలేరు. శివబాబా అయితే భారత్ లోనే వస్తారు. ఇలాంటి-ఇలాంటి విషయాలను అర్థం చేయించడంలో గంటలు పడతాయి. బాబా అయితే ఎవ్వరినీ కలవరు. పిల్లలే కష్టపడాలి. ఇక్కడ కూడా చూడండి, తీర్చిదిద్దేందుకు పిల్లలతో ఎంత కష్టపడాల్సి ఉంటుంది. బాబాకు ఎవ్వరూ సత్యమైన సమాచారాన్ని ఇవ్వరు. బాబా, మేము సన్యాసితో మాట్లాడాము, ఫలానా ప్రశ్నకు మేము జవాబు ఇవ్వలేకపోయాము. మేము ఈ పొరపాటు చేశాము. రోజంతా ఏమేమి చేస్తారో, రాయాలి. బాబా పిల్లలకు అర్థం చేయించారు – నన్ను అడగకుండా ఎవ్వరికీ ఉత్తరం రాయకండి. బాబాను అడిగినట్లయితే బాబా ఎలాంటి మతాన్ని ఇస్తారంటే, దాని ద్వారా ఎవరో ఒకరి కళ్యాణం జరుగుతుంది. బాబా వద్దకు రాసి పంపించినట్లయితే, బాబా సరిదిద్దుతారు. బాబా అయితే యుక్తిని తెలియజేస్తారు. దేహీ-అభిమానులుగా అయి రాసినట్లయితే, వారు చదివి ఆనందంతో పులకరించిపోతారు. చాలా మంచి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మీ లక్ష్యము-ఉద్దేశ్యము, లక్ష్మీ-నారాయణులుగా అవ్వడము. వీరు మీ తండ్రి, టీచర్, గురువు, సోదరుడు మరియు సర్వస్వము. ప్రతి విషయంలోనూ సలహా ఇస్తూ ఉంటారు. అప్పుడు బాధ్యత మీపై నుండి తొలగిపోతుంది. ఎందుకంటే శ్రీమతంపై నడిచారు కదా. వ్యాపారం మొదలైనవాటి గురించి కూడా అర్థం చేయిస్తారు. ఎక్కడైనా తప్పనిసరి పరిస్థితిలో ఎవరి చేతిదైనా తినాల్సి ఉంటుంది లేదంటే వ్యాపారం పోతుంది, టీ తాగకపోతే మినిస్టర్ అలుగుతారు అని అంటారు. అప్పుడు యుక్తిగా చెప్పాలి, మేము ఈ సమయంలో టీ తాగము, మాకు ఇబ్బంది కలుగుతుంది అని. ఎక్కడైనా వివాహం మొదలైనవాటికి వెళ్ళకపోతే కోప్పడతారు, అప్పుడు ఇలా-ఇలా చేయండి అని బాబా చెప్తారు. అన్ని యుక్తులు తెలియజేస్తారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రితో సదా సత్యంగా ఉండాలి. హృదయ సింహాసనాధికారులుగా అయ్యేందుకు శ్రీమతంపై పూర్తి-పూర్తిగా నడుచుకోవాలి.

2. యుద్ధ మైదానంలో మాయ వికల్పాలకు, విఘ్నాలకు భయపడకూడదు. తమ సత్యమైన చార్టును పెట్టుకోవాలి. వారి గురించి, వీరి గురించి మాట్లాడుకోకూడదు.

వరదానము:-

ఎప్పుడైతే అవ్యక్త స్థితి యొక్క అభ్యాసం చేసే అలవాటు ఏర్పడుతుందో, అప్పుడు స్వ-స్థితి ద్వారా ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలుగుతారు మరియు ఈ అలవాటు న్యాయస్థానానికి వెళ్ళడం నుండి రక్షిస్తుంది. అందుకే, ఈ అభ్యాసాన్ని ఎప్పుడైతే సహజంగా మరియు స్వభావంగా చేసుకుంటారో, అప్పుడు ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి ఎందుకంటే ఎప్పుడైతే ఎదుర్కొనేవారు స్వ-స్థితితో ప్రతి పరిస్థితిని దాటే శక్తిని ధారణ చేస్తారో, అప్పుడు పరదా తెరుచుకుంటుంది. దీని కోసం పాత అలవాట్ల నుండి, పాత సంస్కారాల నుండి, పాత విషయాల నుండి… పూర్తి వైరాగ్యం కావాలి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

30 December 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

December 29, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - అల్ఫ్ (భగవంతుడు) మరియు బే (వారసత్వం) ను స్మృతి చేసినట్లయితే రమణీయకంగా తయారవుతారు, తండ్రి రమణీయకమైనవారు కనుక వారి పిల్లలు కూడా రమణీయకంగా ఉండాలి”

ప్రశ్న: -

దేవతల చిత్రాల పట్ల అందరికీ ఆకర్షణ ఎందుకు కలుగుతుంది? వారిలో ఏ విశేషమైన గుణముంది?

జవాబు:-

దేవతలు చాలా రమణీయకమైనవారు మరియు పవిత్రమైనవారు. రమణీయకత కారణంగా వారి చిత్రాల పట్ల కూడా ఆకర్షణ కలుగుతుంది. దేవతలలో పవిత్రత యొక్క విశేషమైన గుణముంది, ఈ గుణం కారణంగానే అపవిత్రమైన మనుష్యులు వారి ఎదురుగా తల వంచుతూ ఉంటారు. ఎవరిలోనైతే సర్వ దైవీ గుణాలు ఉంటాయో, ఎవరైతే సదా సంతోషంగా ఉంటారో, వారే రమణీయకంగా ఉంటారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

భాగ్యాన్ని మేల్కొలుపుకొని వచ్చాను….. (తక్దీర్ జగాకర్ ఆయీహూ…..)

ఓంశాంతి. ఆత్మలు మరియు పరమాత్మ యొక్క మేళా ఎంత అద్భుతమైనది. ఇటువంటి అనంతమైన తండ్రికి మీరందరూ పిల్లలు కావున పిల్లలైన మీరు కూడా ఎంత రమణీయకంగా ఉండాలి. దేవతలు కూడా రమణీయకమైనవారు కదా. కానీ రాజధాని చాలా పెద్దది. అందరూ ఒకేలా రమణీయకంగా ఉండలేరు. అయినా తప్పకుండా కొందరు పిల్లలు చాలా రమణీయకంగా ఉన్నారు. రమణీయకంగా ఎవరు ఉంటారు? ఎవరైతే సదా సంతోషంగా ఉంటారో, ఎవరిలోనైతే దైవీ గుణాలు ఉంటాయో, వారు రమణీయకంగా ఉంటారు. ఈ రాధాకృష్ణులు మొదలైనవారు రమణీయకమైనవారు కదా. వారిలో చాలా ఆకర్షణ ఉంది. ఏ ఆకర్షణ ఉంది? పవిత్రత యొక్క ఆకర్షణ ఉంది, ఎందుకంటే వీరి ఆత్మ కూడా పవిత్రమైనది మరియు శరీరం కూడా పవిత్రమైనది. కావున పవిత్ర ఆత్మలు అపవిత్ర ఆత్మలను ఆకర్షిస్తారు. వారి చరణాలకు నమస్కరిస్తారు. వారిలో ఎంత శక్తి ఉంటుంది. సన్యాసులైనా సరే, దేవతల ఎదురుగా తప్పకుండా తల వంచుతారు. కొందరు చాలా అహంకారులుగా ఉంటారు కానీ దేవతల ఎదురుగా లేదా శివుని ఎదురుగా తప్పకుండా తల వంచుతారు. దేవీల చిత్రాల ఎదురుగా కూడా తల వంచుతారు ఎందుకంటే తండ్రి రమణీయకమైనవారు కావున తండ్రి తయారుచేసిన దేవీదేవతలు కూడా రమణీయకమైనవారే. వారిలో పవిత్రత యొక్క ఆకర్షణ ఉంది. వారి ఆ ఆకర్షణ ఇప్పటికీ కొనసాగుతుంది. కావున – మేము ఈ లక్ష్మీనారాయణులు వలె అవుతామని ఎవరైతే అనుకుంటున్నారో, మరి వీరిలో ఎంత ఆకర్షణ ఉందో, అంత ఆకర్షణ మీలో కూడా ఉండాలి. ఈ సమయంలోని మీ ఆకర్షణ ఇక అవినాశీగా అయిపోతుంది. అందరి విషయంలోనూ ఇలా జరగదు. నంబరువారుగా ఉన్నారు కదా. ఎవరైతే భవిష్యత్తులో ఉన్నత పదవిని పొందుతారో, వారిలో ఇక్కడి నుండే ఆకర్షణ ఉంటుంది ఎందుకంటే ఆత్మ పవిత్రంగా తయారవుతుంది. మీలో ఎవరైతే ముఖ్యంగా స్మృతియాత్రలో ఉంటారో, వారిలో ఎక్కువ ఆకర్షణ ఉంటుంది. యాత్రలో పవిత్రత తప్పకుండా ఉంటుంది. పవిత్రతలోనే ఆకర్షణ ఉంటుంది. పవిత్రత యొక్క ఆకర్షణ అనేది, చదువు పట్ల కూడా ఆకర్షణను కలిగిస్తుంది. ఈ విషయం మీకు ఇప్పుడే తెలిసింది. మీకు వారి (లక్ష్మీనారాయణుల) కర్తవ్యం గురించి తెలుసు. వారు కూడా తండ్రిని ఎంతగా స్మృతి చేసి ఉంటారు. వారు అంతటి రాజ్యాన్ని ఏదైతే పొందారో, అది తప్పకుండా రాజయోగం ద్వారానే పొంది ఉంటారు. ఈ సమయంలో మీరు ఈ పదవిని పొందేందుకు వచ్చారు. తండ్రి కూర్చొని మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఈ నిశ్చయాన్ని పక్కా చేసుకొని ఇక్కడకు వచ్చారు కదా. తండ్రి కూడా వారే, చదివించేవారు కూడా వారే. తమతో పాటు తీసుకువెళ్ళేవారు కూడా వారే. కావున ఈ గుణాలు సదా ఉండాలి. సదా హర్షితముఖులుగా ఉండండి. అల్ఫ్ అయిన తండ్రి స్మృతిలో ఉన్నప్పుడు సదా హర్షితంగా ఉంటారు. అప్పుడు బే అనగా వారసత్వం కూడా స్మృతిలో ఉంటుంది, మరియు దీని ద్వారా చాలా రమణీయకంగా కూడా అవుతారు. మనమిక్కడ రమణీయకంగా అయ్యి మళ్ళీ భవిష్యత్తులో ఇలా రమణీయకంగా అవుతామని పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడి చదువే అమరపురిలోకి తీసుకువెళ్తుంది. ఈ సత్యమైన తండ్రి మీకు సత్యమైన సంపాదనను చేయిస్తున్నారు. ఈ సత్యమైన సంపాదనయే 21 జన్మలు మీతో పాటు వస్తుంది. తర్వాత భక్తి మార్గంలో మీరు చేసే సంపాదన అల్పకాలికమైన సుఖం కోసమే. అది సదా మీతో పాటు ఉండదు. కావున పిల్లలు ఈ చదువులో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు సాధారణమైనవారు, మిమ్మల్ని చదివించేవారు కూడా పూర్తిగా సాధారణ రూపంలో ఉన్నారు కావున చదువుకునేవారు కూడా సాధారణంగానే ఉంటారు, లేదంటే సిగ్గుగా అనిపిస్తుంది. మేము ఉన్నతమైన వస్త్రాలను ఎలా ధరించగలము. మా మమ్మా-బాబాలు ఎంత సాధారణంగా ఉన్నారు, కావున మేము కూడా సాధారణంగా ఉంటాము. వీరెందుకు సాధారణంగా ఉంటారు? ఎందుకంటే వనవాహంలో ఉన్నారు కదా. ఇప్పుడు మీరు వెళ్ళాలి, ఇక్కడేమీ వివాహం చేసుకోరు. వారు వివాహం చేసుకున్నప్పుడు కుమారి వనవాహంలో ఉంటుంది. మురికి బట్టలను ధరిస్తుంది, మొత్తం నూనె పెట్టుకుంటుంది, ఎందుకంటే అత్తవారింటికి వెళ్తుంది. బ్రాహ్మణుడి ద్వారా నిశ్చితార్థం జరుగుతుంది. మీరు కూడా అత్తవారింటికి వెళ్ళాలి. రావణపురి నుండి రామపురిలోకి అనగా విష్ణుపురిలోకి వెళ్ళాలి. ఎటువంటి దేహాభిమానం లేదా వస్త్రాల అభిమానం కలగకూడదని ఈ వనవాహ పద్ధతిని పెట్టారు. ఎవరి వద్దనైనా సాధారణమైన చీర ఉన్నప్పుడు, వారు ఇతరుల వద్ద ఖరీదైన చీర ఉండడం చూస్తే, ఆలోచన నడుస్తుంది. వీరు వనవాహంలో లేరు కదా అని భావిస్తారు. కానీ మీరు వనవాహంలో ఇలా సాధారణంగా ఉంటూ కూడా, ఎవరికైనా ఇంత ఉన్నతమైన జ్ఞానాన్ని ఇచ్చినట్లయితే, అంతటి నషా కలిగి ఉంటే, వారికి కూడా బాణం తగులుతుంది. పాత్రలు తోముతున్నా లేదా బట్టలు ఉతుకుతున్నా సరే, మీ ముందుకు ఎవరైనా వస్తే వారికి వెంటనే అల్ఫ్ యొక్క స్మృతిని కలిగించండి. మీకు ఆ నషా ఎక్కి ఉండాలి. సాధారణ వస్త్రాలను ధరించి ఎవరికైనా జ్ఞానాన్ని ఇచ్చినట్లయితే, వీరిలో ఎంత ఉన్నతమైన జ్ఞానముంది అని వారు కూడా ఆశ్చర్యపోతారు. ఇది గీతా జ్ఞానము మరియు భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానము. రాజయోగము అంటే గీతా జ్ఞానమే. మరి ఈ విధంగా నషా కలుగుతుందా? బాబా తమ ఉదాహరణను చెప్తారు. నేను పిల్లలతో ఏదైనా ఆట ఆడుతున్నప్పుడు, ఎవరైనా జిజ్ఞాసువు ఎదురుగా వచ్చారంటే, వారికి వెంటనే తండ్రి పరిచయాన్నిస్తాను. యోగ శక్తి, యోగబలం ఉన్న కారణంగా, ఆ వ్యక్తి కూడా అక్కడే నిలబడిపోయి, వీరు ఇంత సాధారణంగా ఉన్నారు కానీ వీరిలో ఎంతటి శక్తి ఉంది అని ఆశ్చర్యపోతారు. అప్పుడిక ఆ వ్యక్తి ఏమీ మాట్లాడలేరు. నోటి నుండి ఏ మాట రాదు. ఎలాగైతే మీరు వాణి నుండి అతీతంగా ఉన్నారో, అలా అతను కూడా వాణి నుండి అతీతంగా అయిపోతారు. లోలోపల ఈ నషా ఉండాలి. సోదరి లేదా సోదరుడు ఎవరైనా వస్తే, వారిని అలా నిలబెట్టి, విశ్వానికి యజమానులుగా తయారుచేసే మతాన్ని ఇవ్వవచ్చు. లోలోపల అంతటి నషా ఉండాలి. మీ తపనతో నిలబడిపోవాలి. మీ వద్ద జ్ఞానమైతే ఉంది కానీ యోగము యొక్క పదును లేదు అని బాబా సదా అంటూ ఉంటారు. పవిత్రతతో మరియు స్మృతిలో ఉండడంతోనే పదును వస్తుంది. స్మృతి యాత్ర ద్వారా మీరు పవిత్రంగా అవుతారు. శక్తి లభిస్తుంది. జ్ఞానము ధనానికి సంబంధించిన విషయము. ఉదాహరణకు స్కూల్లో చదువుకుని ఎమ్.ఎ., బి.ఎ. మొదలైనవి చేస్తే, వారికి దానికి తగినంత ధనం లభిస్తుంది. కానీ ఇక్కడి విషయం వేరు. భారత్ యొక్క ప్రాచీన యోగము ప్రసిద్ధమైనది. ఇది స్మృతి. తండ్రి సర్వశక్తివంతుడు కావున పిల్లలకు తండ్రి నుండి శక్తి లభిస్తుంది. పిల్లలకు లోలోపల ఏమని ఉండాలంటే – ఆత్మలమైన మేము బాబా సంతానము, కానీ మేము బాబా అంత పవిత్రంగా లేము, ఇప్పుడు అలా తయారవ్వాలి. ఇదే మీకు లక్ష్యము-ఉద్దేశ్యము. యోగం ద్వారానే మీరు పవిత్రంగా అవుతారు. అనన్యులైన పిల్లలెవరైతే ఉన్నారో, వారు రోజంతా ఇవే ఆలోచనలతో ఉంటారు. ఎవరైనా వస్తే, మేము వీరికి మార్గాన్ని చూపించాలి, పాపం వీరు అంధులుగా ఉన్నారు అని వారి పట్ల దయ కలగాలి. అంధులకు చేతికర్రను అందించి తీసుకువెళ్తారు కదా. వీరంతా అంధులే, జ్ఞాన నేత్రం లేదు.

ఇప్పుడు మీకు జ్ఞానము యొక్క మూడవ నేత్రం లభించింది కావున అంతా తెలుసుకున్నారు. మనమిప్పుడు మొత్తం సృష్టి యొక్క ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నాము. ఇవన్నీ భక్తి మార్గపు విషయాలు. హియర్ నో ఈవిల్, సీ నో ఈవిల్ (చెడు వినకండి, చెడు చూడకండి)…… ఈ చిత్రం ఎందుకు తయారుచేయబడింది అనేది మీకు ఇంతకుముందేమైనా తెలుసా? ప్రపంచంలోని వారెవరికీ దీని అర్థం తెలియదు, మీకు ఇప్పుడు తెలుసు. ఎలాగైతే తండ్రి నాలెడ్జ్ ఫుల్ గా ఉన్నారో, అలా వారికి పిల్లలైన మీరు కూడా ఇప్పుడు నంబరువారు పురుషార్థమనుసారంగా నాలెడ్జ్ ఫుల్ గా అవుతున్నారు. కొంతమందికి చాలా నషా ఎక్కుతుంది. వాహ్! బాబాకు బిడ్డగా అయి బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోలేదంటే, వారికి బిడ్డగా అయి ఏమి చేసినట్లు! రోజూ రాత్రి తమ లెక్కాపత్రాన్ని చూసుకోవాలి. బాబా వ్యాపారి కదా. వ్యాపారస్థులకు లెక్కలు తీయడం సహజమనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు లెక్కలు తీయడం రాదు, వారు వ్యాపారస్థులు కూడా కారు. వ్యాపారస్థులు బాగా అర్థం చేసుకుంటారు. మీరు వ్యాపారస్థులు. మీరు మీ లాభ-నష్టాలను అర్థం చేసుకుంటారు, రోజూ ఖాతాను చూసుకోండి. లెక్కలను సంభాళించండి. నష్టముందా లేదా లాభముందా అని చూడండి. మీరు వ్యాపారస్థులు కదా. బాబా వ్యాపారస్థుడు, రత్నాకరుడు అన్న గాయనముంది కదా. అవినాశీ జ్ఞాన రత్నాల వ్యాపారాన్ని ఇస్తారు. ఇది కూడా నంబరువారు పురుషార్థం అనుసారంగా మీకు తెలుసు. అందరూ చురుకైన బుద్ధి కలవారు కాదు, ఒక చెవితో వింటారు, మరొక చెవి నుండి బయటకు వెళ్ళిపోతుంది. జోలిలో ఉన్న రంధ్రము నుండి బయటకు వెళ్ళిపోతుంది. జోలి నిండదు. ధనం ఇచ్చినట్లయితే ధనం తరగదు అని తండ్రి అంటారు. ఇవి అవినాశీ జ్ఞాన రత్నాలు కదా. తండ్రి రూప్-బసంత్. వారు కూడా ఆత్మనే, వారిలో జ్ఞానముంది. వారి పిల్లలైన మీరు కూడా రూప్ (యోగయుక్తులు) మరియు బసంత్ (జ్ఞానయుక్తులు). ఆత్మలో జ్ఞానం నింపబడుతుంది. ఆత్మకు రూపముంది. ఆత్మ చిన్నదే కానీ రూపమైతే ఉంది కదా. ఆత్మను తెలుసుకోవడం జరుగుతుంది, పరమాత్మను కూడా తెలుసుకోవడం జరుగుతుంది. సోమనాథుని భక్తి చేస్తారు, అప్పుడు ఇంత చిన్న నక్షత్రానికి ఎలా పూజ చేస్తారు. పూజ కోసం ఎన్ని లింగాలను తయారుచేస్తారు. శివలింగాన్ని పైకప్పంత పెద్దదిగా కూడా తయారు చేస్తారు. వాస్తవానికి చిన్న రూపమే కానీ వారి పదవి ఉన్నతమైనది కదా.

ఈ జప-తపాలు మొదలైనవాటి ద్వారా ఏ ప్రాప్తి ఉండదని తండ్రి కల్పక్రితం కూడా చెప్పారు. ఇవన్నీ చేస్తూ కిందకే పడిపోతూ ఉంటారు. మెట్లు కిందకే దిగుతారు. ఇప్పుడు మీది ఎక్కే కళ. బ్రాహ్మణులైన మీరు మొదటి నంబరు జిన్ను భూతము వంటివారు. కథ ఉంది కదా – నాకు పని ఇవ్వకపోతే నేను తినేస్తాను అని జిన్ను అంటుంది. అప్పుడు మెట్లు ఎక్కుతూ, దిగుతూ ఉండమని ఆ జిన్నుకు పని ఇవ్వడం జరిగింది. కావున దానికి ఇక పని దొరికింది. ఈ అనంతమైన మెట్లను మీరు దిగుతారు, మళ్ళీ ఎక్కుతారని బాబా కూడా అన్నారు. మీరే మెట్లన్నీ దిగుతారు, మళ్ళీ ఎక్కుతారు. జిన్ను భూతం మీరే. ఇతరులెవ్వరూ మెట్లన్నీ ఎక్కరు. మెట్లు అన్నింటి యొక్క జ్ఞానాన్ని పొందడం ద్వారా మీరు ఎంత ఉన్నత పదవిని పొందుతారు. మళ్ళీ దిగుతారు, ఎక్కుతారు. తండ్రి అంటారు – నేను మీ తండ్రిని, మీరు నన్ను పతితపావనుడని అంటారు కదా, నేను సర్వశక్తివంతుడను, ఆల్మైటీని ఎందుకంటే నా ఆత్మ సదా 100 శాతం పవిత్రంగా ఉంటుంది. నేను బిందురూపుడను, అథారిటీని. నాకు శాస్త్రాలన్నింటి రహస్యము తెలుసు. ఇది ఎంత అద్భుతము. ఇదంతా అద్భుతమైన జ్ఞానము. ఆత్మలో 84 జన్మల అవినాశీ పాత్ర ఉంటుందని ఎప్పుడూ విని ఉండరు. అది ఎప్పుడూ అరగదు. అలా నడుస్తూనే ఉంటుంది. 84 జన్మల చక్రం తిరుగుతూ ఉంటుంది. ఆత్మలో 84 జన్మల రికార్డు నిండి ఉంది. ఇంత చిన్న ఆత్మలో ఎంత జ్ఞానముంది. ఈ జ్ఞానం బాబాలో కూడా ఉంది మరియు పిల్లలైన మీలో కూడా ఉంది. ఎంత పాత్రను అభినయిస్తారు. ఈ పాత్ర ఎప్పటికీ అంతమవ్వదు. ఆత్మను ఈ కళ్ళ ద్వారా చూడలేము. అది ఒక బిందువు, నేను కూడా అలాంటి బిందువునేనని బాబా కూడా అంటారు. ఇది కూడా పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు. మీరు అనంతమైన త్యాగులు మరియు రాజఋషులు. మీకు ఎంత నషా ఎక్కాలి. రాజఋషులు పూర్తిగా పవిత్రంగా ఉంటారు. రాజఋషులు అనగా సూర్యవంశీయులు, చంద్రవంశీయులు, కానీ మీలానే వారు కూడా రాజ్యాన్ని ఇక్కడే పొందుతారు. మేము వెళ్తున్నామని, నావికుని స్టీమర్లో కూర్చొన్నామని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇది పురుషోత్తమ సంగమయుగమని కూడా మీకు తెలుసు. తప్పకుండా పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచానికి వయా శాంతిధామం వెళ్ళాలి అని పిల్లల బుద్ధిలో సదా ఉండాలి. మనము సత్యయుగంలో ఉన్నప్పుడు వేరే ఖండమేదీ ఉండేది కాదు. మన రాజ్యమే ఉండేది. ఇప్పుడు మళ్ళీ యోగబలంతో మన రాజ్యాన్ని తీసుకుంటున్నాము ఎందుకంటే యోగబలంతోనే విశ్వరాజ్యాన్ని పొందగలమని అర్థం చేయించడం జరిగింది. బాహుబలంతో ఎవరూ పొందలేరు. ఇది అనంతమైన డ్రామా. ఈ ఆట తయారై ఉంది. ఈ ఆటను గురించిన వివరణ బాబానే ఇస్తారు. ప్రారంభం నుండి మొదలుకొని మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర-భూగోళాలను వినిపిస్తారు. మీకు సూక్ష్మవతనం, మూలవతనం యొక్క రహస్యాలు కూడా మంచి రీతిలో తెలుసు. స్థూలవతనంలో వీరి రాజ్యముండేది అనగా మన రాజ్యముండేది. మీరు మెట్లు ఎలా దిగుతారు అనేది కూడా గుర్తుకొచ్చింది. మెట్లు ఎక్కడము మరియు దిగడమనే ఆట పిల్లల బుద్ధిలో కూర్చొంది. ఈ ప్రపంచం యొక్క చరిత్ర-భూగోళాలు ఎలా రిపీట్ అవుతాయి అనేది ఇప్పుడు బుద్ధిలో ఉంది, ఇందులో మనది హీరో-హీరోయిన్ల పాత్ర. మనమే ఓడిపోతాము, మళ్ళీ మనమే గెలుపొందుతాము, కావుననే హీరో-హీరోయిన్ అన్న పేర్లు పెట్టడం జరిగింది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఇప్పుడు మనం వనవాహములో ఉన్నాము కావున చాలా-చాలా సాధారణంగా ఉండాలి. ఏ రకమైన దేహాభిమానం లేక వస్త్రాలు మొదలైనవాటి పట్ల అభిమానం ఉండకూడదు. ఏ కర్మ చేస్తున్నా సరే తండ్రి స్మృతి యొక్క నషా ఎక్కి ఉండాలి.

2. మేము అనంతమైన త్యాగులము మరియు రాజఋషులము అనే నషాలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి. జ్ఞాన ధనంతో నిండుగా అయి దానం చేయాలి. సత్యాతి-సత్యమైన వ్యాపారులుగా అయి తమ లెక్కాపత్రాన్ని పెట్టుకోవాలి.

వరదానము:-

సేవాధారి ఆత్మల మస్తకంపై విజయ తిలకం దిద్దబడి ఉంటుంది, కానీ ఏ స్థానం యొక్క సేవ చేయాలో, ఆ స్థానంలో ముందు నుండే సెర్చ్ లైట్ యొక్క ప్రకాశాన్ని ప్రసరింపజేయాలి. స్మృతి యొక్క సెర్చ్ లైట్ ద్వారా ఎటువంటి వాయుమండలం తయారవుతుందంటే, దాని ద్వారా అనేక ఆత్మలు సహజంగా సమీపంగా వచ్చేస్తారు. అప్పుడిక తక్కువ సమయంలో సఫలత వేయి రెట్లు లభిస్తుంది. దీని కోసం – మేము విజయీ రత్నాలము కావున ప్రతి కర్మలో విజయం ఇమిడి ఉంది అనే దృఢ సంకల్పం చేయండి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top