29 September 2021 TELUGU Murli Today | Brahma Kumaris

29 September 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

28 September 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - ఈ అంతిమ జన్మలో గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా అవ్వండి, ఒక్క తండ్రిని స్మృతి చేయండి, ఇదే గుప్తమైన శ్రమ”

ప్రశ్న: -

జ్ఞానము యొక్క మూడవ నేత్రం లభిస్తూనే ఏ తేడా స్పష్టంగా అనుభవమవుతుంది?

జవాబు:-

భక్తిలో భగవంతుడిని పొందేందుకు ఎంతగా ప్రతి ద్వారం వద్ద భ్రమిస్తూ ఉండేవారు, ఎన్ని ఎదురు దెబ్బలు తింటూ ఉండేవారు. ఇప్పుడు మనకు వారు లభించారు. 2. దానితో పాటు, పాపం మనుష్యులు ఇప్పటికీ ఇంకా భ్రమిస్తున్నారు, మార్గం వెతుకుతున్నారు, అని వారిపై దయ కలుగుతుంది. బాబా మనల్ని భ్రమించడం నుండి విడిపించారు. మనం బాబాతో పాటు వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాము.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నేడు మానవుడు అంధకారంలో ఉన్నాడు….. (ఆజ్ అంధేరే మే హై ఇన్సాన్…..)

ఓంశాంతి. ఒకవైపు భక్తులు స్మృతి చేస్తున్నారు. ఇంకొక వైపు ఆత్మలకు మూడవ నేత్రం లభించింది అనగా ఆత్మలకు తండ్రి పరిచయం లభించింది. వారేమో, మేము ఇంకా భ్రమిస్తున్నామని అంటారు. కానీ మీరు ఇప్పుడు భ్రమించరు. ఎంత తేడా ఉంది. తండ్రి పిల్లలైన మిమ్మల్ని తనతో పాటు తీసుకువెళ్ళేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మనుష్యులు గురువుల వెనుక, అలానే తీర్థయాత్రలు, మేళాలు మొదలైన వాటి వెనుక ఎంతగా భ్రమిస్తున్నారు. మీ భ్రమించడం ఇప్పుడు సమాప్తమైపోయింది. ఈ భ్రమించడం నుండి విడిపించేందుకు తండ్రి వచ్చి ఉన్నారని పిల్లలకు తెలుసు. కల్పక్రితం ఎలాగైతే తండ్రి వచ్చి చదివించారో మరియు రాజయోగాన్ని నేర్పించారో, మళ్ళీ అదే విధంగా చదివిస్తున్నారు. మనం 5 వికారాలపై విజయం పొందుతున్నామని పిల్లలకు తెలుసు. మాయను జయిస్తే జగత్తును జయిస్తారని అంటారు. మాయ అని 5 వికారాల రూపీ రావణుడిని అంటారు. మాయ శత్రువు వలె ఉంది. ధన-సంపదలను మాయ అని అనరు. పంచ వికారాల రూపీ రావణుడు లేక మాయ….. అని వ్రాయాలి కూడా. అప్పుడు మనుష్యులు కొద్దిగానైనా అర్థం చేసుకుంటారు. లేదంటే అర్థం చేసుకోలేరు. మాయను జయిస్తే జగత్తును జయిస్తారు. ఇందులో యాదవులు మరియు కౌరవులు లేక అసురులు మరియు దేవతల విషయమేమీ లేదు. స్థూలమైన యుద్ధమేమీ జరగదు. యోగబలంతో మాయా రావణునిపై విజయం పొందడంతో జగత్ జీతులుగా అవుతారని అంటూ ఉంటారు. జగత్తు అని విశ్వాన్ని అంటారని పిల్లలైన మీకు తెలుసు. విశ్వంపై విజయం ప్రాప్తింపజేసేందుకు విశ్వ యజమానియే వస్తారు. వారే సర్వశక్తివంతుడు. తండ్రిని స్మృతి చేస్తేనే పాపాలు భస్మమవుతాయని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. స్మృతియే ముఖ్యమైన విషయము. స్మృతి చేస్తే మీ ద్వారా ఎలాంటి వికర్మలు జరగవు మరియు సంతోషంగా ఉంటారు. పతితపావనుడైన తండ్రి పావనంగా తయారుచేసేందుకు వచ్చారు కనుక మనం వికర్మలు ఎందుకు చేయాలి? స్వయాన్ని సంభాళించుకోవాలి. మనుష్యులకు బుద్ధి అయితే ఉంటుంది కదా! ఇందులో యుద్ధం చేసే విషయమేమీ లేదు. కేవలం పంచ వికారాలను జయించేందుకు తండ్రిని స్మృతి చేయడం చాలా సహజము. అయితే, ఇందులో శ్రమ అనిపిస్తుంది, సమయం పడుతుంది. మాయ, దీపాన్ని ఆర్పి వేసేందుకు పదే-పదే తుఫాన్లు తీసుకొస్తుంది. ఇకపోతే, ఇందులో యుద్ధం విషయమేమీ లేదు. అక్కడ ఉండేదే దేవతల రాజ్యము, అసురులెవ్వరూ ఉండరు. మనం బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులము. ఎవరైతే బ్రాహ్మణ కులానికి చెందినవారో, వారే తమను తాము బ్రాహ్మణులుగా భావిస్తారు. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మలైన మనకు జ్ఞానాన్ని ఇస్తారు. జ్ఞాన సాగరుడు, పతితపావనుడు, సద్గతిదాత కేవలం ఒక్కరే. వారే స్వర్గ స్థాపన చేసేవారు. పిల్లలైన మీకైతే చాలా సంతోషముండాలి. విదేశీయులకు కూడా తెలిసిపోతుంది – వీరు సింధ్ దేశములోని ఆ బ్రహ్మాకుమార-కుమారీలే, వీరే శ్రీమతాన్ని అనుసరించి ప్యారడైజ్ ను (స్వర్గాన్ని) స్థాపన చేసి చూపిస్తామని అంటారు. ఆత్మ శరీరం ద్వారా అంటుంది కదా. ఆత్మనే వింటుంది మరియు డైరెక్షన్ పై నడుస్తుంది. కల్ప-కల్పము తండ్రియే వచ్చి యుక్తిని తెలియజేస్తారు. తండ్రి గుప్తంగా ఉన్నారు. వారి గురించి ఎవ్వరికీ తెలియదు. వారు ఎంతమంది మనుష్యులకు అర్థం చేయిస్తారు కానీ కోట్లలో ఏ ఒక్కరో మాత్రమే అర్థం చేసుకుంటారు. మనది ఆల్ రౌండ్ పాత్ర అని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. తండ్రి అర్థం చేయించారు – మీరు మాత్రమే రాజ్యం తీసుకుంటారు, ఇతరులెవ్వరూ తీసుకోలేరు. స్వయాన్ని హిందువులుగా పిలుచుకునే భారతవాసులైన మీరు తప్ప ఇంకెవ్వరూ ఆ రాజ్యాన్ని తీసుకోలేరు. జనాభా లెక్కలలో కూడా మనం ఏ పేరు చెప్పినా సరే, హిందువు అనే రాస్తారు. వాస్తవానికి మనం ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారము. వారు దైవీ ధర్మ భ్రష్టులుగా, కర్మ భ్రష్టులుగా అయిన కారణంగా తమను తాము హిందువులని చెప్పుకుంటారు. హిందువు అనే పేరు ఎందుకు వచ్చింది అనేది కూడా ఎవ్వరికీ తెలియదు. మీ హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపించారో చెప్పండి అని అడగాలి. హిందుస్థాన్ అనేది దేశం పేరు, దీని గురించి ఎవ్వరూ చెప్పలేరు. ఇప్పుడు బ్రాహ్మణ, దేవత, క్షత్రియ ధర్మాలు స్థాపన అవుతున్నాయని పిల్లలైన మీకు తెలుసు. బ్రాహ్మణ దేవీ దేవతాయ నమః అని అంటారు. బ్రాహ్మణులు సర్వోత్తములు, మొదటి నంబరువారు. వాస్తవానికి స్వర్గం అని సత్యయుగాన్ని అంటారు. రామచంద్రుని రాజ్యాన్ని కూడా స్వర్గము అని అనలేము. అర్ధకల్పం రామ రాజ్యము, అర్ధకల్పం ఆసురీ రాజ్యము ఉంటాయి. వీటన్నింటినీ హృదయంలో ధారణ చేయాలి. ఇప్పుడు మనం స్వర్గంలోకి వెళ్ళేందుకు ఏం చేయాలి? పవిత్రంగానైతే తప్పకుండా ఉండాల్సిందే. తండ్రి అంటారు – పిల్లలూ, కామము మహాశత్రువు. దీనిపై విజయం పొంది పవిత్రంగా ఉండాలి, అందుకే కమలపుష్పం గుర్తును కూడా చూపించారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా తయారవ్వాలి. ఈ ఉదాహరణ మీకు సంబంధించినదే. హఠయోగులైతే గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా ఉండలేరు. వారు తమ నివృత్తి మార్గపు పాత్రను అభినయిస్తారు, వారు గృహస్థ వ్యవహారంలో ఉండలేరు. అందుకే ఇళ్ళు-వాకిళ్ళను వదిలి వెళ్ళిపోతారు. మీరు రెండు రకాల సన్యాసాలను పోల్చవచ్చు. ప్రవృత్తి మార్గంలో ఉండేవారి సన్యాసానికి మహిమ ఉంది. తండ్రి అంటారు – గృహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలం ఈ ఒక్క అంతిమ జన్మ ధైర్యం పెట్టి కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి. మీరు మీ గృహస్థ వ్యవహారంలోనే ఉండండి. ఆ సన్యాసులైతే ఇళ్ళు-వాకిళ్ళను వదిలి వెళ్ళిపోతారు. భోజనం ఇవ్వాల్సి వచ్చే సన్యాసులు ఎంతోమంది ఉన్నారు. ముందు వారు కూడా సతోప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు తమోప్రధానంగా అయిపోయారు. డ్రామాలో వారికి ఈ పాత్ర ఉంది. మళ్ళీ ఇదే విధంగా జరుగుతుంది. ఈ పతిత ప్రపంచ వినాశనమైతే జరగాల్సిందేనని తండ్రి అర్థం చేయిస్తారు. ఒకవేళ ఇలా జరగకపోతే పెద్ద యుద్ధం జరుగుతుంది – అని అంటూ చిన్న-చిన్న విషయాలకే ఒకరినొకరు బెదిరించుకుంటూ ఉంటారు. కల్పక్రితం కూడా ఇలాగే జరిగిందని పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. కడుపు నుండి ముసలం వెలువడింది, ఇలా జరిగింది….. అని శాస్త్రాలలో రాసేసారు. హోలీ నాడు మారువేషాలు తయారుచేస్తారు. వాస్తవానికి అవి ముసలాలకు చిహ్నము, వాటి ద్వారా వినాశనం చేస్తారు. ఏదైతే గడిచిపోయిందో, అది మళ్ళీ జరుగుతుందని కూడా పిల్లలకు తెలుసు. ఇది తయారై తయారవుతున్న డ్రామా….. ఈ సృష్టి నాటకం తయారై సిద్ధంగా ఉన్నది, అదే ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు కొత్తగా ఏమీ తయారయ్యేది లేదు, జరగరానిదేదైనా జరిగినా చింతించాల్సిన అవసరమేమీ లేదు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం రహస్యమంతా ఉంది. ఇది కేవలం నోటితో చెప్పే విషయం కాదు. ఎవరిపైనా దోషం మోపలేము. డ్రామాలో పాత్ర అలా ఉంది. మీరు కేవలం తండ్రి సందేశాన్ని వినిపించాలి. ఇది అనాది, అవినాశీ డ్రామా. విధి అంటే ఏమిటి అనేది కూడా మీరు అర్థం చేసుకున్నారు. కలియుగాంతం మరియు సత్యయుగ ఆది యొక్క ఈ సంగమము ప్రసిద్ధమైనది. దీనినే పురుషోత్తమ యుగమని అంటారు. ఈ రోజుల్లో పిల్లలకు పురుషోత్తమ యుగం గురించి బాగా అర్థం చేయిస్తున్నారు. ఇది ఉత్తమ పురుషులుగా తయారయ్యే యుగము. అందరూ సతోప్రధానంగా, ఉత్తములుగా తయారవుతారు. ఇప్పుడు తమోప్రధానంగా, కనిష్టులుగా ఉన్నారు. ఈ పదాలను కూడా మీరు అర్థం చేసుకుంటారు. కలియుగం పూర్తయ్యి సత్యయుగం వస్తుంది. అప్పుడిక జయ జయ కారాలు జరుగుతాయి. దీని గురించి కథ చెప్తారు కదా. ఇది అతి సులభమైనది. అసత్యపు కథలైతే చాలా ఉన్నాయి. ఇప్పుడు తండ్రి స్వయంగా కూర్చుని అర్థం చేయిస్తారు – భక్తి మార్గంలో మీరు నా మహిమను పాడుతూ వచ్చారు. ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్ గా సుఖధామము మరియు శాంతిధామాలకు మార్గం తెలియజేస్తున్నాను. సద్గతిని సుఖ గతి అని, దుర్గతిని దుఃఖ గతి అని అంటారు. కలియుగంలో దుఃఖముంటుంది, సత్యయుగంలో సుఖముంటుంది. అర్థం చేయిస్తే అందరూ అర్థం చేసుకుంటారు. మున్ముందు అర్థం చేసుకుంటూ ఉంటారు. సమయం చాలా కొద్దిగా ఉంది. గమ్యం చాలా ఉన్నతమైనది. మీరు కాలేజీలకు వెళ్ళి అర్థం చేయిస్తే, వారు ఈ జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకుంటారు. తప్పకుండా ఈ డ్రామా చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇంకే ప్రపంచము లేదు. వారు, పైన ఇంకొక ప్రపంచం ఉందని భావిస్తారు. అందుకే, నక్షత్రాల వైపుకు వెళ్తూ ఉంటారు. వాస్తవానికి అక్కడేమీ లేదు. భగవంతుడు ఒక్కరే, సృష్టి కూడా ఒక్కటే. మనుష్య సృష్టి ఇదొక్కటే. మనుష్యులు మనుష్యులే. కేవలం దేహ ధర్మాలు అనేకమున్నాయి. ఎన్ని వెరైటీలున్నాయి. సత్యయుగంలో ఒకే ధర్మముండేది. దానిని సుఖధామమని అంటారు. కలియుగం దుఃఖధామము. ఇది సుఖ-దుఃఖాల ఆట కదా. తండ్రి ఎప్పుడు పిల్లలకు దుఃఖం ఇవ్వరు. తండ్రి వచ్చి దుఃఖం నుండి విముక్తులుగా చేస్తారు. దుఃఖహర్త అయిన వారు ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వరు. ఇప్పుడిది రావణ రాజ్యము. మనుష్యులలో పంచ వికారాలు ప్రవేశించి ఉన్నాయి కావుననే దీనిని రావణ రాజ్యమని అంటారు. ఇప్పుడు ప్రపంచ చరిత్ర-భూగోళాల రహస్యాలు పిల్లలైన మీ బుద్ధిలోకి వచ్చాయి. మీరు వీటిని ప్రతి రోజూ వింటున్నారు, ఇది చాలా గొప్ప చదువు. కావున తండ్రి అర్థం చేయిస్తారు – ఇప్పుడు ఇంకా కొద్ది సమయమే ఉంది. ఈ సమయంలోనే తండ్రి నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలి. ఈశ్వరుని మార్గాన్ని తప్పకుండా వీరే అర్థం చేయిస్తారు – అని మనుష్యులు కూడా నెమ్మది-నెమ్మదిగా అర్థం చేసుకుంటారు. ప్రపంచంలో ఇంకెవ్వరూ కూడా ఈశ్వరుడిని పొందే మార్గాన్ని తెలపరు. ఈశ్వరుడిని చేరుకునే మార్గాన్ని ఈశ్వరుడే తెలియజేస్తారు. వారి సంతానమైన మీరు సందేశాన్ని ఇచ్చేవారు. కల్పక్రితం కూడా ఎవరైతే నిమిత్తులుగా అయ్యారో, వారే ఇప్పుడు కూడా అవుతారు మరియు వారే ఇతరులను కూడా తయారుచేస్తూ ఉంటారు. పిల్లలు విచార సాగర మథనం చేయాలి. సలహా ఇవ్వాలి – బాబా, ఫలానా చిత్రం ఉండాలనిపిస్తుంది, దీని ద్వారా మనుష్యులు బాగా అర్థం చేసుకుంటారు అనిపిస్తుంది. బాబా తక్కువ చిత్రాలు ఉండాలని ఎందుకు చెప్తారంటే, చాలా సెంటర్లు చాలా చిన్నవిగా ఉన్నాయి. 5-7 చిత్రాలు కూడా కష్టం మీద పెట్టగలుగుతారు.

ఇంటి-ఇంటిలోనూ గీతా పాఠశాల ఉండాలి అని బాబా అంటారు. ఒకే గదిలో అంతా నడిపించేవారు కూడా చాలా మంది ఉన్నారు. అక్కడ ముఖ్యమైన చిత్రాలను పెడితే మనుష్యులకు, చివరికి భగవంతుడు అని ఎవరిని అంటారు, వారి నుండి ఏం లభిస్తుంది అనేది అర్థమవుతుంది. భగవంతుడిని బాబా అని అంటారు. బాబుల్ నాథ్ బాబా అని అనరు, రుద్ర బాబా అని కూడా అనరు. శివబాబా అనే పేరు ప్రసిద్ధి గాంచినది. ఇది కల్పక్రితం జరిగిన ఆ జ్ఞాన యజ్ఞమేనని బాబా అంటారు. అనంతమైన తండ్రి అయిన శివుడు యజ్ఞాన్ని రచించారు. బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులను రచించారు. బ్రహ్మాలో ప్రవేశించి స్థాపన చేసారు. ఇది రాజయోగం యొక్క జ్ఞానము. అంతేకాక, ఇది యజ్ఞము కూడా, ఇందులో మొత్తం పాత ప్రపంచమంతా ఆహుతి అవుతుంది. వారొక్కరే తండ్రి కూడా, టీచరు కూడా, గురువు కూడా, జ్ఞానసాగరుడు కూడా. ఈ విధంగా ఇంకెవ్వరూ లేరు. ఈ రోజుల్లో యజ్ఞం రచిస్తే దానికి నలువైపులా శాస్త్రాలను పెడతారు. ఆహుతి చేయడానికి ఒక యజ్ఞ కుండాన్ని కూడా తయారుచేస్తారు. వాస్తవానికి ఇది జ్ఞాన యజ్ఞము, దీనిని వారు కాపీ చేసారు. ఇక్కడ స్థూల వస్తువులు మొదలైనవేవీ లేవు. ఇప్పుడు పిల్లలైన మీకు అనంతమైన తండ్రి లభించారు, అనంతమైన జ్ఞానం లభించింది. ఇతరులెవ్వరికీ ఈ విషయం తెలియదు. అనంతమైన ఆహుతి జరగనున్నదని మీకు తెలుసు. పాత ప్రపంచం సమాప్తమైపోతుంది. రామ రాజ్యం స్థాపనవుతుంది, ఇది చాలా మంచిదని సంతోషం కలుగుతూ ఉంటుంది. కానీ ఎవరైనా ఏదైనా స్థాపన చేస్తే, అది తమ కోసమే చేసుకుంటారు కదా. అందరూ స్వయం కోసమే శ్రమిస్తారు. మహాభారత యుద్ధం కూడా ఈ యజ్ఞం నుండి ప్రజ్వలితమయిందని మీకు తెలుసు. హద్దు విషయాలెక్కడ, ఈ అనంతమైన విషయాలెక్కడ. మీరు మీ కోసమే పురుషార్థం చేస్తారు. తండ్రిని తెలుసుకోనంతవరకు వారసత్వం లభించదు. తండ్రియే వచ్చి ఆత్మలకు శిక్షణనిస్తారు. మీదంతా గుప్తము. హింసాత్మకంగా తయారైన ఆత్మ అహింసాత్మకంగా తయారవ్వాలి. ఎవరిపైనా క్రోధం చేయకూడదు. పంచ వికారాలను దానమిచ్చినప్పుడు గ్రహణం వదిలిపోతుంది. ఈ వికారాల వలనే నల్లగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా ఎలా తయారవ్వాలి అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఈ లక్ష్మీనారాయణులను ఈ విధంగా ఎవరు తయారుచేసారు? ఎవరైనా గురువులు లభించారా? వీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. తప్పకుండా ముందు జన్మలో మంచి కర్మలు చేసారు కావుననే మంచి జన్మ లభించింది. మంచి కర్మలతో మంచి జన్మ లభిస్తుంది. బ్రహ్మా మరియు విష్ణువుకు సంబంధం కూడా తప్పకుండా ఉంది. ఒక్క సెకండులో బ్రహ్మా నుండి విష్ణువుగా అవుతారు, మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు, దీనినే సెకండులో జీవన్ముక్తి అని అంటారు. తండ్రికి చెందినవారిగా అయ్యారు, ఇక జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని పొందారు. అక్కడ రాజా, ప్రజలు అందరూ జీవన్ముక్తులుగానే ఉంటారు. అక్కడకు వెళ్ళేవారంతా జీవన్ముక్తులుగా తప్పకుండా అవుతారు. తండ్రి అయితే అందరికీ అర్థం చేయిస్తారు. అయినా ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేయాలి. అంతా పురుషార్థం పైనే ఆధారపడి ఉంది. మనం పురుషార్థం చేస్తూ-చేస్తూ ఉన్నత పదవిని ఎందుకు పొందకూడదు! తండ్రిని చాలా స్మృతి చేసినట్లయితే తండ్రి హృదయాన్ని అనగా సింహాసనాన్ని అధిరోహిస్తారు. తండ్రి ఏ శ్రమను ఇవ్వరు. అబలల చేత ఇంకేం శ్రమ చేయిస్తారు? తండ్రి స్మృతి గుప్తమైనది. జ్ఞానమైతే ప్రత్యక్షమవుతుంది. ఫలానావారి భాషణ చాలా బాగుంది అని అంటారు కానీ వారు యోగంలో ఎంతవరకు ఉన్నారు? తండ్రిని స్మృతి చేస్తున్నారా? ఎంత సమయం స్మృతి చేస్తున్నారు? స్మృతితోనే జన్మ-జన్మల వికర్మలు వినాశనమవుతాయి. ఈ స్పిరిచ్యుల్ నాలెడ్జ్ ను కల్ప-కల్పము ఆత్మిక తండ్రి అయిన శివుడే వచ్చి ఇస్తారు. ఇతరులెవ్వరూ ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అవినాశీ డ్రామా రహస్యాలను బుద్ధిలో ఉంచుకొని ఎవ్వరినీ దోషిగా చేయకూడదు. పురుషోత్తములుగా తయారయ్యే పురుషార్థం చేయాలి. ఈ కొద్ది సమయంలో తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి.

2. డబల్ అహింసకులుగా తయారయ్యేందుకు ఎప్పుడూ, ఎవరిపైనా క్రోధం చేయకూడదు. వికారాలను దానమిచ్చి సర్వగుణ సంపన్నులుగా తయారయ్యే పురుషార్థం చేయాలి.

వరదానము:-

ఏదైనా స్థూల పదార్థాన్ని తయారుచేసేటప్పుడు, అందులో అన్ని వస్తువులను వేస్తారు. అందులో ఉప్పు లేక పంచదార వంటి సాధారణమైన పదార్థాలు తక్కువైనా సరే, చాలా మంచి పదార్ధము కూడా తినేందుకు యోగ్యంగా ఉండదు. అదే విధంగా, విశ్వ పరివర్తన యొక్క ఈ శ్రేష్ఠమైన కార్యంలో ప్రతి రత్నము యొక్క అవసరముంది, అందరి వేలు కావాలి. అందరూ తమ-తమ రీతిలో చాలా-చాలా అవసరమైనవారు, శ్రేష్ఠమైన మహారథులు. అందుకే మీ కార్యంలోని శ్రేష్ఠత యొక్క విలువను తెలుసుకోండి. అందరూ మహానాత్మలే కానీ ఎంతటి మహానులో, అంతటి నిర్మానులుగా కూడా అవ్వండి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top