29 November 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

November 28, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - ప్రపంచంలో ఇంకెవ్వరికీ భయపడకపోయినా కానీ ఈ తండ్రి అంటే తప్పకుండా భయపడండి, భయపడడం అనగా పాప కర్మల నుండి రక్షించబడటము”

ప్రశ్న: -

బాబా ప్రతి బిడ్డకి తమను తాము చెక్ చేసుకునే (చార్టు పెట్టే) శ్రీమతాన్ని ఎందుకు ఇస్తారు?

జవాబు:-

ఎందుకంటే ఈశ్వరీయ నియమాలు చాలా కఠినమైనవి. ఒకవేళ బ్రాహ్మణులుగా అయిన తర్వాత కూడా చిన్న-చిన్న పొరపాట్లు జరుగుతూ ఉన్నట్లయితే చాలా కఠినమైన శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. అందుకే స్వయాన్ని చెక్ చేసుకోమని బాబా అంటారు. ఒకవేళ ఏవైనా పాత లెక్కాచారాలు మిగిలి ఉంటే, శిక్షలు అనుభవించి చిన్న పదవిని పొందాల్సి ఉంటుంది. ఇప్పుడు వినాశన సమయం చాలా సమీపంగా ఉంది, అందుకే తమ లెక్కాచారాలన్నింటినీ యోగబలంతో సమాప్తం చేసుకోండి.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. తండ్రి స్మృతిలోనైతే పిల్లలు తమంతట తామే ఉంటారు. పదే-పదే చెప్పవలసిన అవసరం కూడా ఉండదు. తండ్రి డైరెక్షన్ ఏమిటంటే – నడుస్తూ-తిరుగుతూ, లేస్తూ-కూర్చొంటూ తండ్రిని స్మృతి చేసినట్లయితే, ఏ రావణుడైతే మిమ్మల్ని పతితంగా చేసాడో, అతనిపై విజయాన్ని పొందుతారు. దీని కోసం మీకు ఆయుధాలు మొదలైనవేవీ ఇవ్వరు, మీరు కేవలం యోగబలంతో రావణుడిపై విజయాన్ని పొందుతారు. తప్పకుండా విజయం పొందాలి, అది కూడా సంగమంలోనే పొందుతారు, రావణ రాజ్యం సమాప్తమై రామరాజ్య స్థాపన జరగనున్నప్పుడు పొందుతారు. తండ్రి హింసనైతే ఎప్పుడూ నేర్పించలేరు. దేవతలది అహింసా పరమోధర్మము. అక్కడ కామ ఖడ్గం యొక్క హింస ఉండదని ప్రపంచానికి తెలియదు. ఎవరైతే కల్పక్రితం నిర్వికారులుగా అయ్యి ఉంటారో, వారే మీ మాటలను అంగీకరిస్తారు. ఇప్పుడు మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు. శివ శక్తి సైన్యం అని కూడా అంటూ ఉంటారు. మీరు గుప్త యోధులు, ప్రతి ఒక్కరు స్వయం కోసమే చేసుకుంటున్నారు. మాయాజీతులుగా, జగత్ జీతులుగా అవ్వాలి. మీరు మీ కోసమే చేసుకుంటారు, అనగా మీ భారతదేశం కోసం చేస్తారు. ఇందులో ఎవరైతే మంచి రీతిగా పురుషార్థం చేస్తారో, వారే పొందుతారు. ఎవరైతే 5 వికారాలపై విజయం పొందుతారో, వారే జగత్ జీతులుగా అవుతారు. ఇంకా దేనిపైనా విజయం పొందాల్సిన అవసరం లేదు. మీరు రావణ రాజ్యంపై విజయాన్ని పొందాలి అనగా దైవీ గుణాలను ధారణ చేయాలి. దైవీ గుణాలను ధారణ చేయకుండా సత్యయుగంలోకి వెళ్ళలేరు. కనుక మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి – నేను ఎంత వరకు దైవీ గుణాలను ధారణ చేసాను. దైవీ గుణాలను ధారణ చేయడం అనగా రావణునిపై విజయాన్ని పొందడము. రామ రాజ్యముండేది అని అంటారు అంటే ఒక్క రాముడు మాత్రమే రాజ్యం చేసి ఉండరు కదా? ప్రజలు కూడా ఉంటారు. ఇక్కడ రాజా, రాణి మరియు ప్రజలు, అందరూ రావణునిపై విజయాన్ని పొందుతున్నారు. దైవీ గుణాలను ధారణ చేస్తున్నారు. దైవీ గుణాలు అనగా ఆహార పానీయాలు, మాట్లాడడము, చేయడము అన్నీ శుద్ధంగా, పవిత్రంగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ సత్యమే చెప్పాలి. తండ్రి సత్యమైనవారు. మరి అటువంటి తండ్రితో ఎంత సత్యంగా ఉండాలి. ఒకవేళ సత్యంగా ఉండకపోతే ఎంత దుర్గతి ఏర్పడుతుంది. గతి అయితే ఉన్నతమైనదే పొందాలి. నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అవ్వాలి. మీ గతి, మతము మీకే తెలుసు అని కూడా అంటారు. తండ్రి ఏ మతాన్ని అయితే ఇస్తారో, దాని ద్వారా ఎంత ఉన్నతమైన గతి ఏర్పడుతుంది. ఉన్నతోన్నతమైన తండ్రి ఉన్నతోన్నతమైన గతిని ప్రాప్తింపజేస్తారు. కనుక ఇప్పుడు శ్రీమతాన్ని అనుసరిస్తూ దైవీ గుణాలను ధారణ చేయాలి. జన్మ-జన్మల పాపాలు యోగబలం లేకుండా సమాప్తమవ్వవు. దీని కోసం స్మృతి యాత్ర చాలా బాగుండాలి. స్మృతి అనేది అమృతవేళ బాగుంటుంది. ఆ సమయంలో వాయుమండలం బాగుంటుంది. పగటి పూట ఎంత సమయం కూర్చొన్నా సరే, అమృతవేళ వంటి సమయం ఉండదు. మన విషయాలు గుప్తమైనవి. ఇంగ్లీషులో – ‘‘వి యార్ ఎట్ వార్’’ (మేము యుద్ధంలో ఉన్నాము) అని అంటారు. మన యుద్ధం రావణునితో జరుగుతుంది. ఇతడు నంబర్ వన్ శత్రువు. రామ సంప్రదాయం వారు శ్రీమతం ఆధారంగా రావణ సంప్రదాయం వారిపై విజయాన్ని పొందారు. తండ్రి సర్వశక్తివంతుడు కదా. ప్రపంచం ఈ సమయంలో పాపం ఘోర అంధకారంలో ఉంది. మేము ఓడిపోయాము అని వారికి తెలియను కూడా తెలియదు. మాయతో ఓడిపోతే ఓడిపోయినట్లే. మాయ అని దేనినంటారో కూడా ఎవ్వరికీ తెలియదు. మొత్తం లంక అంతటిపై రావణుని రాజ్యముండేది. శాస్త్రాలలో భక్తి మార్గానికి సంబంధించి ఎన్ని కట్టుకథలు రాసేసారు. వాటిని జన్మ-జన్మలుగా చదివారు. శాస్త్రాలను తప్పకుండా చదవాలని ఇప్పటికీ అంటూ ఉంటారు. వారు అంటారు – ఎవరైతే శాస్త్రాలను చదవరో, వారు నాస్తికులు అని మరియు తండ్రి అంటారు – శాస్త్రాలను చదువుతూ-చదువుతూ అందరూ నాస్తికులుగా అయిపోయారు అని. ఈ విషయాలను పిల్లలు బాగా అర్థం చేయించాలి – భారత్ సతోప్రధానంగా ఉన్నప్పుడు దానిని స్వర్గము అని అనేవారు. ఆ భారతవాసులే 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ ఇప్పుడు పతితంగా, తమోప్రధానంగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పావనంగా ఎలా అవ్వాలి. తండ్రి అంటారు – నన్ను స్మృతి చేసినట్లయితే సతోప్రధానంగా, పావనంగా అవుతారు. ఇంకే దేహధారిని గుర్తు చేయకండి. ఎవ్వరినీ గురువుగా చేసుకోకండి. గురువు లేకపోతే ఘోర అంధకారముంటుందని అంటారు. ఎంతోమంది గురువులున్నారు. కానీ అందరూ అంధకారంలోకి తీసుకువెళ్ళేవారే. తండ్రి అంటారు – జ్ఞాన సూర్యుడు వచ్చినప్పుడు ఘోర అంధకారం దూరమవుతుంది. సన్యాసులు పావనంగా అవుతారు కానీ వారు జన్మ అయితే వికారాల ద్వారానే తీసుకుంటారు కదా. దేవీ-దేవతలైతే వికారాల ద్వారా జన్మ తీసుకోరు. ఇక్కడ అందరి శరీరాలు మురికి పట్టిన వస్త్రాల వలె ఉన్నాయి. తండ్రి ఇటువంటి మురికి పట్టిన వస్త్రాలను శుభ్రం చేస్తారు. ఆత్మ పవిత్రంగా అయినట్లయితే శరీరం కూడా మంచిదే లభిస్తుంది. దాని కోసం పురుషార్థం చేయాలి. నా ద్వారా ఏ చెడు పని జరగడం లేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ఈశ్వరీయ నియమాలు కూడా కఠినమైనవి. ఏదైనా చెడు పని చేస్తే, దానికి శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. ఇది వినాశన సమయము. లెక్కాచారాలన్నింటినీ యోగబలంతో సమాప్తం చేసుకోవాలి. ఒకవేళ సమాప్తం చేసుకోకపోతే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. శిక్షలు మరియు పదవి అని అంటూ ఉంటారు. పదవి (రొట్టె ముక్క) అయితే అందరికీ లభిస్తుంది. ముక్తి మరియు జీవన్ముక్తుల పదవినైతే అందరికీ ఇస్తారు. కొందరు పాస్ విత్ ఆనర్ గా అవుతారు, కొందరికి శిక్షలు లభించిన తర్వాత చిన్న పదవి లభిస్తుంది, అది కూడా గౌరవపూర్వకంగా లభించదు. వారు సింహాసనంపై కూర్చోలేరు. ఏదైనా చెడు పని చేస్తే పరువు పోతుంది, అది కూడా తండ్రి ఎదురుగా. శివబాబా కూర్చుని ఉన్నారు కదా. మీకు సాక్షాత్కారాలు చేయిస్తారు – నేను వీరిలో ఉన్నప్పుడు నీకు ఎంతగా అర్థం చేయించాను. ఇప్పుడు నేను సంపూర్ణ బ్రహ్మాలో ఉన్నాను. కుమార్తెలైన మీరు సంపూర్ణ బాబా వద్దకు వెళ్తారు. శివబాబా వారి ద్వారా డైరెక్షన్ మొదలైనవి ఇస్తారు కదా. మీకు బాబా సాక్షాత్కారం చేయిస్తారు – వీరిలో కూర్చుని మిమ్మల్ని ఎంతగా చదివించేవాడిని, దైవీ గుణాలను ధారణ చేయండి, సేవ చేయండి అని అర్థం చేయించేవాడిని. ఎవ్వరినీ నిందించకండి. అయినా నీవు ఈ పని చేసావు, ఇప్పుడు శిక్ష అనుభవించు. ఎంతెంతగా పాపాలు చేసి ఉంటారో, అంతగా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. కొందరు చాలా శిక్షలు అనుభవిస్తారు, కొందరు తక్కువగా అనుభవిస్తారు. అందులో కూడా నంబరువారుగా ఉన్నారు. ఎంత వీలైతే అంత యోగబలంతో వికర్మలను సమాప్తం తొలగించుకుంటూ ఉండాలి. పిల్లలు ఈ అతి పెద్ద చింతను పెట్టుకోవాలి – నేను సంపూర్ణంగా పక్కా బంగారంగా ఎలా అవ్వాలి అని. లేస్తూ-కూర్చొంటూ ఇదే బుద్ధిలో ఉండాలి – ఎంతగా స్మృతి చేస్తానో, అంత ఉన్నత పదవిని పొందుతాను అని. మాయ తుఫానులను లెక్క చేయకూడదు. ఎంత సమయం లభిస్తే అంత తండ్రిని స్మృతి చేయాలి. నేను తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వాలి. తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాలు తొలగిపోతాయి. ఏ పాపము చేయకూడదు. లేదంటే 100 రెట్లు అయిపోతుంది. క్షమాపణ తీసుకోలేదంటే అది మళ్ళీ వృద్ధి అవుతూ-అవుతూ అంతా సర్వనాశనమైపోతుంది. మాయ ఒక పాపం తర్వాత ఇంకొక పాపం చేయిస్తూ ఉంటుంది. ఇది అనంతమైన తండ్రిని అగౌరవపరిచినట్లు అవుతుంది. ఈ విషయం కూడా చాలా మందికి తెలియదు. బాబా ఎల్లప్పుడూ అర్థం చేయిస్తూ ఉంటారు – శివబాబా మురళీ నడిపిస్తున్నారు, శివబాబా డైరెక్షన్ ఇస్తున్నారు అని భావించండి, అప్పుడు స్మృతి కూడా ఉంటుంది, భయం కూడా ఉంటుంది. చాలా పాపాలు చేస్తూ ఉంటారు. బాబా, నా వల్ల ఈ తప్పు జరిగింది అని స్పష్టంగా చెప్పాలి. తలపై పాపాల భారం చాలా ఉందని తండ్రి అర్థం చేయిస్తారు. ఏమేమి చేసారో అది చెప్పండి. సత్యం చెప్తే సగం భారం తగ్గిపోతుంది.

తండ్రి అర్థం చేయించారు – ఎవరైతే నంబరువన్ పుణ్యాత్మగా అవుతారో, వారే తర్వాత నంబరువన్ పాపాత్మగా కూడా అవుతారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు – ఇది మీ అనేక జన్మలలో కూడా అంతిమ జన్మ. మీరు పుణ్యాత్ములుగా ఉండేవారు, ఇప్పుడు పాపాత్ములుగా అయ్యారు. మళ్ళీ పుణ్యాత్ములుగా అవ్వాలి. మీ కళ్యాణమైతే చేసుకోవాలి. ఇక్కడ మీరు తల వంచి నమస్కరించాల్సిన అవసరం కూడా లేదు, కేవలం తండ్రిని స్మృతి చేయాలి. వీరు కూడా వృద్ధుడే, అయినా నమస్కరిస్తారు. పిల్లలు ఇంట్లో పదే-పదే నమస్కరించరు. ఒక్కసారి నమస్కరించారు అంటే దానికి బదులుగా నమస్కారం చేయబడుతుంది. తండ్రి అంటారు – మీరు నన్ను పెద్దవారిగా భావిస్తూ నమస్కరిస్తారు, నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా భావిస్తూ నమస్కరిస్తాను. దీనికి అర్థముంది కదా. మనుష్యులు రామా-రామా అని అంటారు కానీ అర్థమేమీ తెలుసుకోరు. వాస్తవానికి రాముడు అనగా శివబాబా. రాముడు అనగా ఆ రఘుపతి కాదు, ఈ రాముడు నిరాకారుడు. వీరి పేరు శివబాబా. నేను రాముడిని పూజిస్తాను అని శివుని ఎదురుగా ఎవ్వరూ అనరు. ఇప్పుడు తండ్రి అంటారు – మీరు మందిరాలకు వెళ్ళి అర్థం చేయించండి – వీరు (దేవతలు) కూడా మనుష్యులే, మీరు వీరి ముందుకెళ్ళి మహిమను పాడుతారు – మీరు నిర్వికారులు, సర్వగుణ సంపన్నులు, మేము పాపులము, నీచులము అని. ఈ తనువులు కూడా మనుష్యులవే మరియు ఆ తనువులు కూడా మనుష్యులవే కానీ వారిలో దైవీ గుణాలున్నాయి కావున వారు దేవతలు అయ్యారు. మాలో ఆసురీ గుణాలున్నాయి కావుననే కోతుల వలె ఉన్నామని మీరే స్వయంగా చెప్తారు. ముఖాలు ఇరువురివి ఒకే విధంగా ఉంటాయి. కానీ గుణాలలో తేడా ఉంది. భారతవాసులే కిరీటధారులుగా ఉండేవారు. ఇప్పుడు కిరీటం లేదు, పేదవారిగా కూడా భారతవాసులే ఉన్నారు. తండ్రి కూడా భారత్ లోనే వస్తారు, ఎక్కడైతే స్వర్గాన్ని తయారుచేసేది ఉందో అక్కడికే తండ్రి వస్తారు కదా. కళంగీ అవతారమని అంటారు, ఎన్ని కళంకాలను మోపారు. ఒకవేళ ఇతర ధర్మాల వారు కూడా ఏమైనా అంటే, వారు కూడా భారతవాసులనే ఫాలో చేస్తున్నట్లు. రాతిబుద్ధి కలవారిగా ఉన్న కారణంగా నన్ను కూడా రాళ్ళు-రప్పలలో ఉన్నారని అంటారు. తండ్రి గురించి తెలియనే తెలియదు – తండ్రి వీరిలో ప్రవేశించి భారత్ ను ఎంతటి కిరీటధారిగా తయారుచేస్తారు అని. భారత్ కు ఎంత సేవ చేస్తారు. తండ్రి అంటారు – మీరు నన్ను నిందిస్తారు. నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాను. మీరు ఎంత అపకారం చేస్తారు. రావణుడు మీ మతాన్ని ఎంతగా హతమార్చాడు. దుర్గతి పట్టింది, అప్పుడే, పతితపావనా రండి అని పిలుస్తారు. ఎంత సహజమైన వివరణ లభిస్తుంది. అయినా చాలా మంది పిల్లలు మర్చిపోతారు. యోగం లేకపోతే ధారణ కూడా జరగదు. అందుకే బాబా అంటారు – బంధనంలో ఉన్నవారు అందరికంటే ఎక్కువగా స్మృతి చేస్తారు. శివబాబా స్మృతిలో సహనం కూడా చేస్తారు. భారతవాసులలో ఎవరైతే దేవీ-దేవతలుగా అయ్యేది ఉందో, వారే ఇక్కడకు వస్తారు. ఆర్యసమాజం వారైతే దేవతల మూర్తులను అసలు నమ్మరు. వృక్షంలోని చివరి శాఖలలో ఉన్నవారు కష్టం మీద 2-3 జన్మలు తీసుకుంటారు.

వికారాలు లేకుండా ప్రపంచం ఎలా నడుస్తుందని చాలామంది భావిస్తారు. అరే, దేవతలను సంపూర్ణ నిర్వికారులని అంటారు కదా. అక్కడ అసలు వికారాలే ఉండవని కూడా ఎవ్వరికీ తెలియదు. కల్పక్రితం వచ్చిన వారు వెంటనే అర్థం చేసుకుంటారు. భగవానువాచ – కామం మహాశత్రువు అని అంటూ ఉంటారు. కానీ భగవంతుడు ఎప్పుడు చెప్పారు అనేది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు జగత్ జీతులుగా అవుతున్నారు. కానీ ఉన్నత పదవిని పొందేందుకు శ్రమించాలి. తండ్రి అంటారు – గృహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలం బుద్ధి యోగాన్ని నాతో జోడించండి. తండ్రికి చెందినవారిగా అయినప్పుడు తండ్రి పట్ల ప్రేమ ఉండాలి. ఇకపోతే, పని నడిపించడం కోసం ఇతరులతో ప్రేమనుంచాలి. పాపం వారిని స్వర్గవాసులుగా ఎలా చేయాలి అని బుద్ధిలో ఈ ఆలోచన పెట్టుకోవాలి. సత్యమైన యాత్రను చేసే యుక్తిని తెలపాలి. అవి దైహిక యాత్రలు, వాటిని జన్మ-జన్మలుగా చేస్తూ వచ్చారు. ఇదొక్కటే స్మృతి యాత్ర. ఇప్పుడు మన 84 జన్మలు పూర్తయ్యాయి, మళ్ళీ సత్యయుగ చరిత్ర రిపీట్ అవ్వనున్నది. పతితులు ఇంటికి వెళ్ళలేరు. పావనంగా తయారుచేసేందుకు పతితపావనుడైన తండ్రి కావాలి. సన్యాసులు పావనంగా అవుతారు కానీ తిరిగి వెళ్ళలేరు. అందరినీ తీసుకువెళ్ళేవారు తండ్రి మాత్రమే. తండ్రి వచ్చి అందరినీ రావణుడి నుండి విడిపించి ముక్తులుగా చేస్తారు. సత్యయుగంలో దుఃఖాన్నిచ్చే వస్తువేదీ ఉండదు. దాని పేరే సుఖధామము, ఇది దుఃఖధామము. అది క్షీర సాగరము, ఇది విషయ సాగరము.

స్వర్గంలో ఎంత సుఖంగా, విశ్రాంతిగా ఉంటారో ఇప్పుడు మీకు తెలుసు. క్షీర సాగరం నుండి బయటకు అనగా విషయ సాగరంలోకి ఎలా వస్తాము అనేది ఎవ్వరికీ తెలియదు. తండ్రి అర్థం చేయిస్తారు – శ్రీమతమనుసారంగా నడుచుకోవాలి, అప్పుడిక బాధ్యత వారిదే. శ్రీమతం చెప్తుంది – అయితే వెళ్ళండి, పిల్లలను సంభాళించుకోండి, వారికి భూ-భూ చేస్తూ ఉండండి, అప్పుడు ఎంతో కొంత కళ్యాణం జరుగుతుంది, స్వర్గంలోకైతే వస్తారు. తండ్రి వచ్చి 21 జన్మల కోసం నరకవాసుల నుండి స్వర్గవాసులుగా తయారుచేస్తారు. ఈ విషయం కూడా మీ బుద్ధిలో ఉంది. మనుష్యులకు ఏమీ తెలియదు. వీరికి కూడా ఇంతకుముందు ఏమీ తెలియదు. ఎలాగైతే వీరి 84 జన్మల కథ ఉందో, అలా – ‘‘తతత్వమ్’’ వీరు కూడా రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. మీరు రాజఋషులు, వారు హఠయోగ ఋషులు. మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ రాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటున్నారు. మీరందరూ శరణాగతిని పొందేందుకు వచ్చారు కదా. ఇప్పుడు మేము స్వర్గంలో కూర్చొన్నామని వారు భావిస్తారు. ప్రపంచంలో మాయ ఆర్భాటం ఉంది. నరకం వినాశనమవ్వనంత వరకు స్వర్గం ఎలా ఏర్పడగలదు. మాయావి పురుషులు దీనినే స్వర్గంగా భావిస్తూ కూర్చొన్నారు. బాబాకు కొత్త ప్రపంచం స్థాపన చేయడానికి ఎంత శ్రమ అనిపిస్తుంది. అందరూ నరకవాసులుగా ఉన్నారు. స్వర్గవాసులుగా అవ్వనే అవ్వరు. తండ్రి ఎంత ప్రేమగా అర్థం చేయిస్తారు. అచ్ఛా! మధురాతి-మధురమైన పిల్లలూ, మీరు రావణుడిపై విజయాన్ని పొందడం ద్వారానే జగత్ జీతులుగా అవుతారు. దానికోసం పూర్తి పురుషార్థం చేయాలి. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అప్రతిష్టపాలు చేసే పనులేవీ చేయకూడదు, శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. మాయ తుఫానులను లెక్క చేయకుండా ఎంత సమయం లభిస్తే అంత తండ్రిని స్మృతి చేయాలి. ఒక్క తండ్రి పట్ల సత్యాతి-సత్యమైన ప్రేమనుంచుకోవాలి.

2. తమ గతిని ఉన్నతంగా తయారుచేసుకునేందుకు సత్యమైన తండ్రితో సత్యంగా ఉండాలి. ఏ విషయాన్నీ దాచి పెట్టకూడదు.

వరదానము:-

పిల్లలైన మీరు ఆల్మైటీ గవర్నమెంట్ యొక్క మెసెంజర్లు (సందేశకులు). అందుకే ఎవ్వరితోనూ చర్చించడంలో తమ మైండ్ ను డిస్టర్బ్ చేసుకోకండి. స్మృతి అనే మంత్రాన్ని ఉపయోగించండి. ఎలాగైతే, ఎవరైనా వాణితో లేక ఇతర ఏ విధానంతోనూ వశమవ్వకపోతే, మంత్ర-తంత్రాలను ప్రయోగిస్తారో, అలాగే మీ వద్ద ఆత్మిక దృష్టి అనే నేత్రం మరియు మన్మనాభవ అనే మంత్రం ఉన్నాయి. వీటితో తమ సంకల్పాలను సిద్ధి చేసుకొని సిద్ధి స్వరూపులుగా అవ్వగలరు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top