29 March 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

March 28, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - ఎంత ప్రేమతో యజ్ఞ సేవ చేస్తే, అంత సంపాదన. సేవ చేస్తూ-చేస్తూ మీరు బంధనముక్తులుగా అయిపోతారు, సంపాదన జమ అవుతుంది’’

ప్రశ్న: -

స్వయాన్ని సదా సంతోషంగా ఉంచుకోవడానికి ఏ యుక్తిని తమదిగా చేసుకోవాలి?

జవాబు:-

స్వయాన్ని సేవలో బిజీ పెట్టుకున్నట్లయితే, సదా సంతోషంగా ఉంటారు. సంపాదన జమ అవుతూ ఉంటుంది. సేవ చేసే సమయంలో విశ్రాంతి యొక్క ఆలోచన రాకూడదు. ఎంత సేవ లభిస్తే అంత సంతోషించాలి. నిజాయితీపరులై ప్రేమతో సేవ చేయాలి. సేవతో పాటు మధురంగా కూడా అవ్వాలి. పిల్లలైన మీలో ఎటువంటి అవగుణాలు ఉండకూడదు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఈ సమయం వెళ్ళిపోతోంది… (యహ్ వక్త్ జా రహా హై…)

ఓంశాంతి. ఇలా ఎవరన్నారు? తండ్రి పిల్లలతో అన్నారు. ఇది అనంతమైన విషయము. మనుష్యులు వృద్ధులుగా అయినప్పుడు – ఇప్పుడు చాలా గడచిపోయింది, ఇంకా కొద్ది సమయమే ఉంది, ఏవైనా మంచి పనులు చేయాలి అని భావిస్తారు, అందుకే వానప్రస్థ అవస్థలో సత్సంగాలకు వెళ్తారు. గృహస్థంలోనైతే చాలా చేసాము, ఇప్పుడు ఏవైనా మంచి పనులు కూడా చేయాలి అని భావిస్తారు. వానప్రస్థి అంటేనే వికారాలను విడిచిపెట్టడము, ఇళ్ళువాకిళ్ళతో సంబంధాన్ని విడిచిపెట్టడము, అందుకే సత్సంగాలకు వెళ్తారు. సత్యయుగంలోనైతే ఇటువంటి విషయాలు ఉండవు. ఇంకా కొద్ది సమయమే ఉంది. జన్మ-జన్మాంతరాల పాపాల భారం శిరస్సుపై ఉంది. ఇప్పుడే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి. వారు సాధువుల సాంగత్యమైతే చేస్తారు, కానీ లక్ష్యమేమీ లభించదు యోగం జోడించడానికి. ఇకపోతే, పాపాలు తగ్గుతాయి. పెద్ద పాపాలైతే వికారాల వలన జరుగుతాయి. వ్యాపార-వ్యవహారాలను విడిచిపెట్టేస్తారు. ఈ రోజుల్లోనైతే తమోప్రధాన అవస్థలో ఉన్నారు కనుక వికారాలను విడిచిపెట్టరు. 70-80 సంవత్సరాల వారు కూడా పిల్లలకు జన్మనిస్తూ ఉంటారు. తండ్రి అంటారు, ఇప్పుడు ఈ రావణ రాజ్యం సమాప్తం అవ్వనున్నది. సమయం చాలా కొద్దిగా ఉంది, అందుకే తండ్రితో యోగం జోడిస్తూ ఉండండి మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి. తిరిగి వెళ్ళడానికి కొద్ది రోజులే ఉన్నాయి. శిరస్సుపై పాపాల భారం చాలా ఉంది, అందుకే ఎంత వీలైతే అంత సమయం తీసి నన్ను స్మృతి చేయండి. వ్యాపార-వ్యవహారాలు మొదలైన కర్మలనైతే చేయాల్సిందే ఎందుకంటే మీరు కర్మయోగులు. 8 గంటలు దీనికి వినియోగించాలి. అది కూడా చివర్లోనే జరుగుతుంది. కేవలం వృద్ధులే స్మృతి చేయాలి అని భావించకండి. అలా కాదు, అందరి మృత్యువు ఇప్పుడు సమీపంగా ఉంది. ఈ శిక్షణ అందరి కోసము. చిన్న పిల్లలకు కూడా అర్థం చేయించాలి – మనం ఆత్మలము, పరంధామం నుండి వచ్చాము. ఇది చాలా సహజమైనది. గృహస్థాన్ని కూడా పాలన చేయాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ శిక్షణ తీసుకోవాలి. మళ్ళీ సర్వీసబుల్ గా అవ్వడంతో బంధనాలు వాటంతట అవే తొలగిపోతాయి. ఇంట్లోని వారు వారంతట వారే అంటారు – మీరు కావాలంటే సేవ చేయండి, మేము పిల్లలను సంభాళిస్తాము లేదా నౌకరును పెట్టుకుంటాము. ఇందులో వారికి కూడా లాభం ఉంది. ఇంట్లో 5-6 మంది పిల్లలు ఉన్నారనుకోండి, నేను ఈశ్వరీయ సేవ చేయాలి అని స్త్రీ కోరుకున్నట్లయితే మరియు మంచి సర్వీసబుల్ గా ఉన్నట్లయితే, పిల్లల కోసం నౌకర్లను పెట్టుకోవచ్చు ఎందుకంటే అందులో తమది కూడా కళ్యాణం మరియు ఇతరులది కూడా కళ్యాణం జరుగుతుంది. ఇరువురూ సేవలో నిమగ్నమవ్వచ్చు. సేవ యొక్క పద్ధతులైతే చాలా ఉన్నాయి. ఉదయం మరియు సాయంత్రం సేవ జరగవచ్చు. పగలు మాతల క్లాసు జరగడము తప్పనిసరి. బి.కె.లు సేవా సమయంలో నిద్రపోకూడదు. కొంతమంది కుమార్తెలు యుక్తిగా టైమ్ పెట్టుకుంటారు. పగలు ఎవ్వరూ రాకూడదని భావిస్తారు. వ్యాపారస్థులు లేక ఉద్యోగం చేసేవారు పగలు పడుకోరు. ఇక్కడైతే ఎంతగా బాబా యొక్క యజ్ఞ సేవ చేస్తారో, అంతగా సంపాదనే సంపాదన. చాలా లాభం ఉంటుంది. రోజంతా పనిలో బిజీగా ఉండాలి. ప్రదర్శినీలలో చాలా బిజీగా ఉంటారు. బాబా, చెప్తూ-చెప్తూ గొంతు ఎండిపోతుంది ఎందుకంటే అకస్మాత్తుగా ఏదైనా సేవ చేయవలసి వస్తుంది అని అంటారు. ఎల్లప్పుడూ ఇంత సేవ చేసేవారై ఉంటే, గొంతు పాడవ్వదు. అలవాటైపోతే ఇక అలసట ఉండదు. మరి అందరూ ఒకేలా ఉండరు. కొందరైతే చాలా నిజాయితీగా ఉన్నారు, ఎంతగా సేవ లభిస్తూ ఉంటే, అంతగా వారికి సంతోషం ఉంటుంది ఎందుకంటే ఎవరైతే మంచి రీతిలో సేవలో నిమగ్నమై ఉంటారో, వారికి ప్రతిఫలం కూడా లభిస్తుంది. మీరు చాలా మధురంగా అవ్వాలి, అవగుణాలు తొలగిపోవాలి. సర్వగుణ సంపన్నులు… అని శ్రీకృష్ణుని మహిమను పాడుతూ ఉంటారు. ఇక్కడ అందరిలో ఆసురీ గుణాలున్నాయి. ఏ లోపమూ ఉండకూడదు, అంతగా మధురంగా అవ్వాలి. ఎప్పుడైతే సేవ చేస్తారో, అప్పుడు అలా అవుతారు. ఎక్కడికైనా వెళ్ళి సేవ చేయాలి. రావణుడి సంకెళ్ళ నుండి అందరినీ విడిపించాలి. మొదట తమ జీవితాన్ని తయారుచేసుకోవాలి. మనం కూర్చుండిపోయినట్లయితే, నష్టం మనకే కలుగుతుంది. మొదటి అయితే ఈ ఆత్మిక సేవ. ఎవరికైనా మంచి చేయాలి, ఎవరినైనా నిరోగులుగా, ధనవంతులుగా, ఆయుష్మంతులుగా తయారుచేయాలి – రోజంతా ఈ ఆలోచనలు నడుస్తూ ఉండాలి. ఆ పిల్లలే హృదయాన్ని అధిరోహించగలరు మరియు సింహాసనాధికారులుగా కూడా అవుతారు. మొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రి స్వర్గ రచయిత, వారి గురించి తెలుసా? పరమపిత పరమాత్మతో మీకు ఏం సంబంధం ఉంది? పరిచయమివ్వాలి, అప్పుడే తండ్రితో ప్రేమ ఏర్పడుతుంది. తండ్రి అంటారు, నేను కల్పం యొక్క సంగమయుగంలో వచ్చి నరకాన్ని స్వర్గంగా తయారుచేస్తాను. కృష్ణుడైతే ఇలా అనలేరు. వారైతే స్వర్గం యొక్క రాకుమారుడు. రూపాలు మారుస్తూ ఉంటారు. కల్పవృక్షంపై అర్థం చేయించాలి, పైన పతిత ప్రపంచంలో బ్రహ్మా నిలబడి ఉన్నారు. వారు పతితంగా ఉన్నారు, కింద మళ్ళీ తపస్య చేస్తున్నారు. బ్రహ్మా యొక్క వంశావళి కూడా ఉంది. పరమపిత పరమాత్మనే వచ్చి పతితులను పావనంగా చేస్తారు. పతితులే మళ్ళీ పావనంగా అవుతారు. కృష్ణుడిని కూడా శ్యామ-సుందర్ అని అంటారు. కానీ దాని అర్థాన్ని అర్థం చేసుకోరు. మీరు అర్థం చేయించవచ్చు – వీరు పతితులు. అసలైన పేరు బ్రహ్మా కాదు, ఎలాగైతే మీ అందరి పేర్లు మార్చబడ్డాయో, అలాగే బాబా వీరిని కూడా దత్తత తీసుకున్నారు. లేదంటే శివబాబా బ్రహ్మాను ఎక్కడ నుండి తీసుకొచ్చారు! వారికి స్త్రీ అయితే లేరు. తప్పకుండా దత్తత తీసుకున్నారు. తండ్రి అంటారు, నేను వీరిలోనే ప్రవేశించాలి. ప్రజాపిత పైన అయితే ఉండజాలరు, ఇక్కడే కావాలి. మొదట అయితే ఈ నిశ్చయం ఉండాలి. నేను సాధారణ తనువులోకి వస్తాను. గోశాల అన్న పేరు ఉన్న కారణంగా ఎద్దు మరియు ఆవులను కూడా చూపిస్తారు. ఇప్పుడు ఆవులకు జ్ఞానమిచ్చారా లేక ఆవులను పెంచారా అన్నది రాయలేదు. చిత్రాలలో శ్రీకృష్ణుడిని గొల్లవానిగా చేసారు. ఇలాంటి-ఇలాంటి విషయాలు ఎంతగా ఈ ధర్మంలో ఉన్నాయో, అంతగా ఇతర ధర్మాలలో లేవు. ఇవన్నీ భక్తి మార్గంలో రచించబడి ఉన్నాయి. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, పాత ప్రపంచ వినాశనం, కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. బాబా అర్థం చేయిస్తారు – ఈ సృష్టి చక్రాన్ని తెలుసుకోవడంతోనే మీరు భవిష్య రాకుమారీ-రాకుమారులుగా అవుతారు. అమరలోకంలో ఉన్నత పదవిని పొందుతారు. మీరు ఏదైతే చదువుతున్నారో, అది భవిష్య కొత్త ప్రపంచం కోసము. మీరు ఈ పాత శరీరాన్ని వదిలి రాయల్ ధనవంతుల ఇంట్లో జన్మ తీసుకుంటారు. మొదట పిల్లవాని వలె ఉంటారు, తర్వాత పెద్దవారైనప్పుడు ఫస్ట్ క్లాస్ మహళ్ళను తయారుచేస్తారు. తతత్వమ్. శివబాబా అంటారు, ఏ విధంగా మమ్మా-బాబా మంచి రీతిగా చదువుకున్నారో, మీరు కూడా చదువుకున్నట్లయితే ఉన్నత పదవిని పొందుతారు. రాత్రి మేల్కోండి, విచార సాగర మథనం చేసినట్లయితే సంతోషం కలుగుతుంది. ఆ సమయంలోనే సంతోషం యొక్క పాదరసం ఎక్కుతుంది. పగలు వ్యాపారం మొదలైన బంధనం ఉంటుంది. రాత్రి వేళ అయితే ఏ బంధనమూ ఉండదు. రాత్రి బాబా స్మృతిలో నిద్రించినట్లయితే ఉదయం బాబా వచ్చి మంచాన్ని కదిలిస్తారు. ఇలాంటి అనుభవాలు కూడా చాలామంది రాస్తారు. పిల్లలు ధైర్యముంచితే తండ్రి సహాయం తప్పకుండా లభిస్తుంది. మీపై మీరు చాలా అటెన్షన్ పెట్టండి. సన్యాసుల ధర్మం వేరు. ఏ ధర్మానికి ఎంత వంశవృక్షం ఉంటుందో, అంతగానే తయారవుతుంది. ఎవరైతే ఇతర ధర్మాల్లోకి కన్వర్ట్ అయ్యి ఉంటారో, వారు మళ్ళీ తమ ధర్మంలోకి వస్తారు. సన్యాస ధర్మంలో 1 లేక 2 కోట్ల మంది పాత్రధారులు ఉన్నారనుకోండి, మళ్ళీ అంతమందే ఉంటారు. ఈ డ్రామా చాలా ఏక్యురేట్ (ఖచ్ఛితం) గా తయారుచేయబడి ఉంది. కొందరు ఒక ధర్మంలోకి, కొందరు ఇంకొక ధర్మంలోకి కన్వర్ట్ అయిపోయారు. వారంతా తమ-తమ ధర్మాల్లోకి వెళ్ళిపోతారు. ఈ జ్ఞానం బుద్ధిలో కూర్చోవాలి.

ఇప్పుడు మనం అంటాము, మనం ఆత్మలము, శివబాబా సంతానము. ఈ విశ్వమంతా మాదే. మేము రచయిత అయిన శివబాబాకు పిల్లలుగా అయ్యాము. మేము విశ్వానికి యజమానులము. ఇది బుద్ధిలోకి రావాలి, అప్పుడే అపారమైన సంతోషం ఉంటుంది. ఇతరులకు కూడా సంతోషాన్ని ఇవ్వాలి, మార్గాన్ని తెలియజేయాలి. దయాహృదయులుగా అవ్వాలి. ఏ గ్రామంలోనైతే ఉంటారో, అక్కడ కూడా సేవ చేయాలి. అందరికీ ఆహ్వానం ఇవ్వాలి, తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఒకవేళ ఎక్కువగా అర్థం చేసుకోవాలి అని అనుకుంటే, ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్నది కూడా మీకు అర్థం చేయిస్తాము అని చెప్పండి. సేవ అయితే చాలా ఉంది. కానీ మంచి-మంచి పిల్లలపై కూడా అప్పుడప్పుడు గ్రహచారం వచ్చేస్తుంది, అర్థం చేయించే అభిరుచి ఉండదు. లేదంటే బాబాకు రాయాలి – బాబా, సేవ చేసాము, దాని ఫలితం ఈ విధంగా వెలువడింది, ఇలా-ఇలా అర్థం చేయించాము. అప్పుడు, బాబా కూడా సంతోషిస్తారు. వీరికి సేవ పట్ల అభిరుచి ఉందని అర్థం చేసుకుంటారు. అప్పుడప్పుడు మందిరంలో, అప్పుడప్పుడు శ్మశానంలో, అప్పుడప్పుడు చర్చిలలోకి దూరిపోవాలి. గాడ్ ఫాదర్ తో మీకు ఏం సంబంధం ఉంది? అని అడగాలి. వారు ఫాదర్ అన్నప్పుడు, మేము పిల్లలము అని నోటితో అనాలి. హెవెన్లీ గాడ్ ఫాదర్ (స్వర్గ రచయిత) అని అంటారు కనుక తప్పకుండా హెవెన్ (స్వర్గము)ను రచిస్తారు. ఎంత సహజమైనది. మున్ముందు చాలా ఆపదలు రానున్నాయి. మనుష్యులకు వైరాగ్యం వస్తుంది. శ్మశానంలో మనుష్యులకు వైరాగ్యం వస్తుంది. ఇక ప్రపంచానికి ఇటువంటి పరిస్థితే ఏర్పడుతుంది! దీనికన్నా భగవంతుడిని పొందే మార్గాన్ని ఎందుకు పట్టుకోకూడదు. అప్పుడు గురువు మొదలైనవారి వద్దకు వెళ్ళి, ఈ బంధనాల నుండి విడుదలయ్యే మార్గాన్ని తెలియజేయండి అని అడుగుతారు.

మీరు మీ పిల్లలు మొదలైనవారి పాలన కూడా చేయాలి మరియు సేవ కూడా చేయాలి. మమ్మా-బాబాను చూడండి, ఎంతమంది పిల్లలున్నారు. అది హద్దు గృహస్థ వ్యవహారము, ఈ బాబా అయితే అనంతమైన యజమాని. అనంతమైన సోదరీ-సోదరులకు అర్థం చేయిస్తారు. ఇది అందరికీ అంతిమ జన్మ. తండ్రి వజ్రం వలె తయారుచేయడానికి వచ్చారు. మరి మీరు గవ్వల వెనుక ఎందుకు పడతారు! ఉదయం మరియు సాయంత్రం వజ్రం వలె తయారయ్యే సేవను చేయండి. పగలు గవ్వల యొక్క వ్యాపారం చేయండి. ఎవరైతే సేవకు అలవాటు పడిపోతారో, వారికి ఘడియ-ఘడియ బాబా బుద్ధిలో గుర్తుకొస్తూ ఉంటారు, అభ్యాసమైపోతుంది. ఎవరి వద్దనైతే పని చేస్తారో, వారికి కూడా లక్ష్యాన్ని ఇస్తూ ఉంటారు. కానీ కోటిలో కొద్దిమంది వెలువడుతారు. ఫలానా స్నేహితుడు మాకు ఈ విషయాన్ని చెప్పారు అని ఈ రోజు కాకపోతే రేపు అయినా గుర్తు చేస్తారు. ఒకవేళ పదవిని పొందాలంటే ధైర్యం కావాలి. భారత్ యొక్క సహజ యోగం మరియు జ్ఞానం అయితే ప్రసిద్ధమైనవి. కానీ అవేమిటి, ఎలా ఉంటాయి అన్నది తెలియదు. ఈ పండుగలు మొదలైనవన్నీ సంగమయుగానికి సంబంధించినవి. సత్యయుగంలోనైతే రాజ్యమే ఉంటుంది. చరిత్ర అంతా సంగమానికి సంబంధించినదే. సత్యయుగీ దేవతలకు రాజ్యం ఎక్కడ నుండి లభించింది అన్నది కూడా ఇప్పుడే తెలిసింది. మనమే రాజ్యాన్ని తీసుకుంటాము మరియు మనమే పోగొట్టుకుంటామని మీకు తెలుసు, ఎవరు ఎంత సేవ చేస్తారో అంత. ఇప్పుడైతే ప్రదర్శినీ సేవ వృద్ధి చెందుతూ ఉంటుంది. ప్రొజెక్టర్ కూడా గ్రామ-గ్రామాలలో వెళ్తుంది. ఈ సేవ చాలా విస్తారం చెందుతుంది. పిల్లలు కూడా వృద్ధి పొందుతూ ఉంటారు. తర్వాత ఈ భక్తి మార్గానికి విలువ ఉండదు. ఇది డ్రామాలో ఉంది. అంతేకానీ, ఇది ఎందుకు జరిగింది! ఇలా చేసి ఉండకపోతే ఇలా జరిగి ఉండేది కాదు! అని కూడా అనలేరు. ఏదైతే గతించిందో, అది సరైనది, ఇక ముందు కోసం అప్రమత్తంగా ఉండండి. మాయ ఎటువంటి వికర్మ చేయించకూడదు. మనసులో తుఫానులైతే వస్తాయి, కానీ కర్మేంద్రియాలతో ఎటువంటి వికర్మ చేయకూడదు. వ్యర్థ సంకల్పాలైతే చాలా వస్తాయి, అయినా కూడా పురుషార్థం చేసి శివబాబాను స్మృతి చేస్తూ ఉండండి. హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు. చాలామంది పిల్లలు రాస్తారు – బాబా, 15-20 సంవత్సరాల నుండి అనారోగ్యం కారణంగా పవిత్రంగా ఉంటున్నాము, అయినా మనసు చాలా అశుద్ధంగా ఉంటుంది. బాబా రాస్తారు – తుఫానులైతే చాలా వస్తాయి, మాయ హైరానా పరుస్తుంది, కానీ వికారాల్లోకి వెళ్ళకూడదు. ఇది మీ వికర్మల లెక్కాచారమే. యోగబలంతోనే సమాప్తమవుతాయి, భయపడకూడదు. మాయ చాలా బలశాలి. ఎవ్వరినీ విడిచిపెట్టదు. ఎవరు ఎంత చేసినా కూడా సేవ అయితే చాలా ఉంది. అచ్ఛా!

మధురాతి మధురమైన సర్వీసబుల్ సికీలధే పిల్లలకు నంబరువారు పురుషార్థానుసారంగా మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పగలు శరీర నిర్వహణార్థము కర్మలు మరియు ఉదయం-సాయంత్రం జీవితాన్ని వజ్ర తుల్యంగా చేసుకోవడానికి ఆత్మిక సేవ తప్పకుండా చేయాలి. అందరినీ రావణుడి సంకెళ్ళ నుండి విడిపించాలి.

2. మాయ ఎటువంటి వికర్మలు చేయించకుండా ఉండేందుకు చాలా-చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్మేంద్రియాలతో ఎప్పుడూ ఏ వికర్మ చేయకూడదు. ఆసురీ అవగుణాలను తొలగించి వేయాలి.

వరదానము:-

తపస్య చార్టులో తమకు తాము సర్టిఫికెట్ ఇచ్చుకునే వారైతే చాలామంది ఉన్నారు కానీ ఎప్పుడైతే హృదయపూర్వకమైన తపస్య ఉంటుందో, సర్వుల పట్ల హృదయపూర్వకమైన ప్రేమ ఉంటుందో, నిమిత్త భావం మరియు శుభ భావం ఉంటుందో, అప్పుడు సర్వుల సంతుష్టత యొక్క సర్టిఫికెట్ ప్రాప్తిస్తుంది. అటువంటి పిల్లలు సర్వుల ఆశీర్వాదాలకు అధికారులుగా అయిపోతారు. తక్కువలో తక్కువ 95 శాతం ఆత్మలు సంతుష్టత యొక్క సర్టిఫికెట్ ఇవ్వాలి, అందరి నోటి నుండి, అవును, వీరు నంబర్ వన్ అని వెలువడాలి, అలా అందరి హృదయాల నుండి ఆశీర్వాదాల సర్టిఫికెట్ ను ప్రాప్తి చేసుకునేవారే తండ్రి సమానంగా అవుతారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top