29 June 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

June 28, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - మీరు ఆత్మిక పండాలు (మార్గదర్శకులు), మీరు గృహస్థ వ్యవహారాన్ని సంభాళిస్తూ, కమలపుష్ప సమానంగా అయి స్మృతి యాత్రను చేయాలి మరియు చేయించాలి”

ప్రశ్న: -

తండ్రి పిల్లలకు ఏ అలంకరణ చేస్తారు? ఏ అలంకరణను నిరాకరిస్తారు?

జవాబు:-

బాబా అంటారు – మధురమైన పిల్లలూ, నేను మీకు ఆత్మిక అలంకరణ చేసేందుకు వచ్చాను, మీరు ఎప్పుడూ దైహిక అలంకరణను చేసుకోవద్దు. మీరు బెగ్గర్లు, మీకు ఫ్యాషన్ పట్ల అభిరుచి ఉండకూడదు. ప్రపంచం చాలా పాడైపోయి ఉంది, అందుకే కొద్దిగా కూడా శరీరం యొక్క ఫ్యాషన్ చేసుకోకండి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఆఖరికి ఆ రోజు నేటికి వచ్చింది….. (ఆఖిర్ వహ్ దిన్ ఆయా ఆజ్…..)

ఓంశాంతి. అనంతమైన తండ్రి కూర్చొని అనంతమైన పిల్లలకు అర్థం చేయిస్తారు. అనంతము అనగా ఎలాంటి హద్దులు ఉండవు. ఎంతమంది పిల్లలున్నారు. లెక్కలేనంత మంది పిల్లలందరికీ తండ్రి ఒక్కరే, వారిని రచయిత అని అంటారు. వారు హద్దు తండ్రులు, వీరు అనంతమైన ఆత్మలకు తండ్రి. వారు హద్దుకు సంబంధించిన దైహిక తండ్రులు, వీరు అనంతమైన ఆత్మలకు ఒకే ఒక్క తండ్రి. భక్తి మార్గంలో ఆత్మలందరూ వీరినే స్మృతి చేస్తారు. భక్తి మార్గం కూడా ఉంది, దానితో పాటు రావణ రాజ్యం కూడా ఉందని పిల్లలైన మీకు తెలుసు. మమ్మల్ని రావణ రాజ్యం నుండి రామ రాజ్యంలోకి తీసుకువెళ్ళండి అని మనుష్యులు ఇప్పుడు పిలుస్తారు. చూడండి, ఒకప్పుడు భారత్ కు యజమానులుగా ఉన్న దేవీదేవతలు ఇప్పుడు లేరు అని తండ్రి అర్థం చేయిస్తారు. వారెవరు అనేది కూడా ఇప్పుడు మీకు తెలుసు. మనమే సత్యయుగీ సూర్యవంశానికి యజమానులుగా ఉండేవారము. రాజా-రాణి అయితే ఉంటారు కదా. ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతి కలిగింది. పిల్లలైన మనకు రాజ్య భాగ్యం యొక్క వారసత్వాన్ని ఇవ్వడానికి, విశ్వానికి యజమానులుగా చేయడానికి బాబా వచ్చి ఉన్నారు. ఇప్పుడు అందరూ భక్తి మార్గంలో ఉన్నారని, భక్తి మార్గాన్నే రావణ రాజ్యం అంటారని తండ్రి చెప్తారు. కేవలం ఒక్క తండ్రి మాత్రమే పిల్లలైన మీకు జ్ఞాన మార్గాన్ని నేర్పిస్తారు. భక్తి మార్గంలో ఆ అనంతమైన తండ్రిని అందరూ స్మృతి చేస్తారు. ఇప్పుడు మీకు 21 జన్మలకు జ్ఞానం యొక్క రాజధాని లభిస్తుంది. ఇక తర్వాత అర్ధకల్పం వరకు మీరు పిలవనే పిలవరు. అయ్యో రామా….. అయ్యో ప్రభూ అని పలికే అవసరమే ఉండదు. దుఃఖంలో ఉన్నప్పుడు అయ్యో రామా అని అంటారు. అక్కడ మీకు దుఃఖం ఉండనే ఉండదు. ఈ ఆట తయారుచేయబడి ఉందని ఇప్పుడు మీకు తెలుసు. అర్ధకల్పం జ్ఞానమనే పగలు, అర్ధకల్పం భక్తి అనే రాత్రి ఉంటాయి. భక్తి మనల్ని కిందకు దించేస్తుంది. పిల్లలైన మీ బుద్ధిలో మెట్ల చిత్రం యొక్క నాలెడ్జ్ తప్పకుండా ఉండాలి. ఇది 84 జన్మల చక్రమని, ఈ చక్రాన్ని తెలుసుకోవడంతో మీరు చక్రవర్తీ రాజులుగా అవుతారని తండ్రి అర్థం చేయిస్తారు. అందుకే బాబా చిత్రాలను కూడా తయారుచేయిస్తున్నారు, ఈ చక్రాన్ని తెలుసుకోవడంతో మనం 21 జన్మల రాజ్య భాగ్యాన్ని తీసుకుంటామని ఈ చిత్రాల ద్వారా ఋజువవుతుంది.

ఇప్పుడు మీరు చాలామంది తయారయ్యారు. పెద్ద ఆత్మిక శక్తి సైన్యం తయారయ్యింది. మీరంతా పండాలు (మార్గదర్శకులు). బాబా కూడా పండానే. వారిని గైడ్ అని అంటారు. పండా అనే పదం శుభప్రదమైనది. యాత్రలకు తీసుకువెళ్ళేవారిని పండాలని అంటారు. యాత్రికులు వెళ్ళినప్పుడు, వారికి అన్నీ చూపించడానికి ఒక గైడ్ ను నియమిస్తారు. తీర్థ యాత్రలలో కూడా పండాలు ఉంటారు. తండ్రి అంటారు – జన్మ జన్మలుగా తీర్థ యాత్రలు చేస్తూ వచ్చారు. అమరనాథ యాత్రకు వెళ్తారు, తీర్థయాత్రలకు వెళ్తారు, ప్రదక్షిణలు చేస్తారు. అక్కడకు వెళ్ళినప్పుడు అవే గుర్తుంటాయి. ఇళ్ళు-వాకిళ్ళు, వ్యాపార వ్యవహారాలు, అన్నింటి నుండి మనసు తొలగిపోతుంది. మీ గృహస్థ వ్యవహారంలో ఉంటూ, వ్యాపార వ్యవహారాలు కూడా చేసుకుంటూ ఉండండి మరియు ఈ గుప్త యాత్ర కూడా చేస్తూ ఉండండి అని ఇక్కడ మీకు అర్థం చేయించడం జరుగుతుంది. ఇది ఎంత బాగుంటుంది. ఎంత పెద్ద వ్యాపారం చేయాలనుకుంటే అంత చేసుకోండి. ఎవరికీ వద్దని చెప్పరు. కానీ మీ రాజ్యాన్ని కూడా సంభాళించుకోండి. జనక మహారాజుకు కూడా సెకెండులో జీవన్ముక్తి లభించింది. మీకేమీ బయటి యాత్రలు మొదలైనవాటిలో ఎదురుదెబ్బలు తినవలసిన అవసరం లేదు. మీ ఇళ్ళు-వాకిళ్ళను కూడా పూర్తిగా సంభాళించాలి. ఎవరైతే తెలివైన మంచి పిల్లలుంటారో, వారు, మేము గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా ఉండాలని భావిస్తారు. గృహస్థ వ్యవహారంతో విసిగిపోకూడదు. కుమార-కుమారీలైతే సన్యాసుల వంటివారు, వారిలో వికారాలుండవు. 5 వికారాల నుండి దూరంగా ఉంటారు. మన అలంకరణ వేరుగా ఉంటుంది, బయటివారిది వేరుగా ఉంటుందని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. వారిది తమోప్రధాన అలంకరణ, మీది సతోప్రధాన అలంకరణ. దీనితో మీరు సతోప్రధాన సూర్యవంశీ రాజ్యంలోకి వెళ్ళాలి. తమోప్రధాన దైహిక అలంకరణను కొద్దిగా కూడా చేసుకోకండి అని తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. ప్రపంచం చాలా పాడైపోయి ఉంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఫ్యాషనబుల్ గా అవ్వకండి. ఫ్యాషన్ ఆకర్షిస్తుంది. ఈ సమయంలో అందం మంచిది కాదు. నల్లగా ఉంటే మంచిది, ఎవరూ పంజా విసరరు. అందంగా ఉన్నవారి చుట్టూ తిరుగుతూ ఉంటారు. కృష్ణుడిని కూడా నల్లగా చూపిస్తారు. మీరు శివబాబా ద్వారా తెల్లగా (సుందరంగా) అవ్వాలి. వారు పౌడర్ మొదలైనవాటితో తెల్లగా అవుతారు. ఎంత ఫ్యాషన్ ఉంది అంటే ఇక అడగకండి. షావుకార్లయితే సర్వనాశనం అవుతున్నారు. పేదవారు బాగున్నారు. పల్లెలకు వెళ్ళి పేదవారి కళ్యాణం చేయాలి. కానీ శబ్దాన్ని వ్యాపింపజేసే పెద్ద మనుష్యులు కూడా కావాలి. మీరందరూ పేదవారు కదా. ఎవరైనా షావుకార్లుగా ఉన్నారా? మీరు ఎంత సాధారణంగా కూర్చున్నారో చూడండి. బొంబాయిలో ఫ్యాషన్లు ఎలా ఉన్నాయో చూడండి. బాబా వద్దకు కలవడానికి వచ్చినప్పుడు ఏమంటారంటే – మీరు ఈ దైహిక అలంకరణ చేసుకున్నారు, ఇప్పుడు వస్తే మీకు జ్ఞాన అలంకరణ చేస్తాను, దీనితో మీరు 21 జన్మలకు స్వర్గంలోని దేవతలుగా అవుతారు, సదా సుఖమయంగా అవుతారు. ఇక ఎప్పుడూ ఏడవరు, దుఃఖముండదు. ఇప్పుడు మీరు ఈ దైహిక అలంకరణను వదిలేయండి. నేను మీకు జ్ఞాన రత్నాలతో ఎంతటి ఫస్ట్ క్లాస్ అలంకరణ చేస్తానంటే, ఇక అడగకండి. ఒకవేళ నా మతాన్ని అనుసరించినట్లయితే, మిమ్మల్ని పట్టపురాణులుగా చేస్తాను. ఇది మంచిదే కదా. భారతవాసులైన మిమ్మల్నందరినీ ఈ తమోప్రధాన ఆసురీ ప్రపంచమైన నరకం నుండి తీసుకువెళ్ళి స్వర్గంలోని మహారాణులుగా తయారుచేస్తాను.

ఈ రోజు మనం తెల్లని వస్త్రాలలో ఉన్నామని, మరుసటి జన్మలో స్వర్గంలో బంగారు స్పూనుతో పాలు తాగుతామని పిల్లలైన మీకు తెలుసు. ఇది చాలా ఛీ-ఛీ ప్రపంచము. స్వర్గమంటే స్వర్గమే, ఇక అడగకండి. ఇక్కడ మీరు బెగ్గర్లుగా ఉన్నారు. భారత్ బెగ్గర్ గా ఉంది. బెగ్గర్ నుండి ప్రిన్స్ అని అంటూ ఉంటారు. ఈ భారత్ లోనే మళ్ళీ జన్మ తీసుకుంటారు. తండ్రి మనల్ని స్వర్గానికి యజమానులుగా చేసారు, రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. తినడానికి కూడా ఏమీ లేని మహాన్ నిరుపేదలకు దానం ఇవ్వడం జరుగుతుంది. భారత్ యే మహాన్ నిరుపేదగా ఉంది. ఈ సమయంలో అందరూ తమోప్రధానంగా ఉన్నారని కూడా పాపం వారికి తెలియదు. రోజు రోజుకు మెట్లు కిందకు దిగుతూనే ఉంటారు. ఇప్పుడు ఎవరూ మెట్లు ఎక్కలేరు. 16 కళల నుండి 14 కళలు, తర్వాత 12 కళలు….. కిందకు దిగుతూనే ఉంటారు. ఈ లక్ష్మీనారాయణులు కూడా ముందు 16 కళల సంపూర్ణులుగా ఉండేవారు, తర్వాత 14 కళలలోకి దిగుతారు కదా. ఈ విషయాలు కూడా మంచి రీతిగా గుర్తుంచుకోవాలి. మెట్లు దిగుతూ దిగుతూ పూర్తి పతితంగా అయిపోయారు. మళ్ళీ స్వర్గానికి యజమానులుగా ఎవరు తయారుచేస్తారు? ఈ ప్రపంచ చరిత్ర-భూగోళం రిపీట్ అవుతుందని కూడా అందరూ అంటారు కానీ ఇప్పుడు ఏ చరిత్ర రిపీట్ అవుతుంది అనేది ఎవరికీ తెలియదు. సత్యయుగం ఆయువు లక్షల కోట్ల సంవత్సరాలని శాస్త్రాలలో రాసేసారు. సత్యయుగం ఎప్పుడు వస్తుంది అని వారిని అడగండి. ఇంకా 40 వేల సంవత్సరాలు పడుతుందని అంటారు. పూర్తి కల్పం ఆయువే 5 వేల సంవత్సరాలని మీరు ఋజువు చేసి చెప్తారు. వారు కేవలం సత్యయుగానికే లక్షల సంవత్సరాలని చెప్తారు. ఘోర అంధకారం కదా. మరి మనుష్యులు, భగవంతుడు వచ్చి ఉంటారని ఎలా నమ్ముతారు. కలియుగాంతము జరిగేటప్పుడు భగవంతుడు వస్తారని వారు భావిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకున్నారు. వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. వినాశనానికి ముందే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి అని పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. కానీ కుంభకర్ణుని నిద్రలో నిదురిస్తున్నారు. కనుక పాపం, వారు అయ్యో అయ్యో అని అంటూ మరణిస్తారు. మీ జయ-జయకారాలు జరుగుతాయి. వినాశనంలో అయ్యో అయ్యో అని అంటూనే ఉంటారు. విపరీత బుద్ధి కలవారు అయ్యో అయ్యో అనే అంటారు. ఇప్పుడు మీరు సత్యమైనవారికి సత్యమైన సంతానము. నరకం యొక్క వినాశనం జరగకుండా స్వర్గమెలా తయారవుతుంది. ఇది మహాభారత యుద్ధమని మీరంటారు. దీని ద్వారానే స్వర్గ ద్వారాలు తెరుచుకోనున్నాయి. మనుష్యులకేమీ తెలియదు. ఇప్పుడు మాకు దైవీ స్వరాజ్యమనే వెన్న లభిస్తుందని మీ బుద్ధిలో ఉంది. వారు పరస్పరంలో కొట్లాడుకుంటూ ఉంటారు. వారు కూడా మనుష్యులే, మీరు కూడా మనుష్యులే కానీ వారు ఆసురీ సంప్రదాయానికి చెందినవారు, మీరు దైవీ సంప్రదాయానికి చెందినవారు. తండ్రి పిల్లలకు సమ్ముఖంగా అర్థం చేయిస్తారు. పిల్లలైన మీ లోపల సంతోషం ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే తీసుకుంటున్నారో, అలా అనేక సార్లు మీరు ఈ రాజధానిని తీసుకున్నారు. వారు పరస్పరంలో రెండు పిల్లుల వలె కొట్లాడుకుంటారు. మొత్తం విశ్వం యొక్క రాజ్యాధికారమనే వెన్న మీకు లభిస్తుంది. మీరు ఇక్కడకు విశ్వానికి యజమానులుగా అయ్యేందుకే వచ్చారు. మనం బాబాతో యోగం జోడించి కర్మాతీత అవస్థను పొందుతామని మీకు తెలుసు. వారు పరస్పరంలో కొట్లాడుకుంటారు, మనం విశ్వ రాజ్యాధికారాన్ని తప్పకుండా పొందుతాము. ఇది కామన్ విషయము. ఆ బాహుబలం కలవారు విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకోలేరు. మీరు యోగబలంతో విశ్వానికి యజమానులుగా అవుతారు. మీది అహింసా పరమో దైవీ ధర్మము. అక్కడ రెండు రకాల హింసలు ఉండవు. కామ ఖడ్గం యొక్క హింస అన్నింటికన్నా చెడ్డది, ఇది మీకు ఆదిమధ్యాంతాలు దుఃఖాన్నిస్తుంది. రావణ రాజ్యం ఎప్పుడు ఉంటుంది అనేది ఎవరికీ తెలియదు. మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని ఇప్పుడు పిలుస్తున్నారంటే తప్పకుండా ఏదో సమయంలో పావనంగా ఉండేవారనే కదా. దుఃఖం నుండి విముక్తులుగా చేయండి, శాంతిధామానికి తీసుకువెళ్ళండి, దుఃఖాన్ని హరించి సుఖమివ్వండి అని భారతవాసి పిల్లలే పిలుస్తారు. కృష్ణుడిని హరి అని కూడా అంటారు. బాబా, మమ్మల్ని హరి యొక్క ద్వారానికి తీసుకువెళ్ళండి అని అంటారు. కృష్ణపురియే హరిద్వారము. ఇది కంసపురి. ఈ కంసపురి మనకు ఇష్టమనిపించదు. మాయా మశ్చీంద్రుని ఆటను చూపిస్తారు. రావణ రాజ్యం ద్వాపరం నుండి మొదలవుతుందని మీకు తెలుసు. పావనంగా ఉండే దేవతలు పతితంగా అవ్వడం ప్రారంభిస్తారు, దీని గుర్తులు కూడా జగన్నాథపురిలో ఉన్నాయి. ప్రపంచంలో చాలా అశుద్ధత ఉంది. ఇప్పుడు మనం ఆ విషయాలన్నింటి నుండి బయటపడి పరిస్తాన్ లోకి వెళ్తాము. ఇందులో చాలా ధైర్యం, మహావీరత కావాలి. బాబాకు చెందినవారిగా అయి పతితంగా అవ్వకూడదు. స్త్రీ-పురుషులు కలిసి ఉంటూ, నిప్పు అంటుకోకుండా ఉండటమనేది సాధ్యం కాదు అని వారు భావిస్తారు. అందుకే, ఇక్కడ స్త్రీ-పురుషులను సోదరీ-సోదరులుగా చేస్తున్నారు, ఈ విధంగా ఎక్కడా రాసి లేదు, ఇక్కడ ఏమి ఇంద్రజాలముందో తెలియదు అని అంటూ హంగామా చేస్తారు. అరే, మీరు బ్రహ్మాకుమారీల వద్దకు వెళ్ళినట్లయితే ఇక అంతే, వారు మిమ్మల్ని కట్టిపడేస్తారని అంటారు. ఈ విధంగా అక్కడ రేకెత్తిస్తూ ఉంటారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. ఎవరి పాత్ర అయితే ఉంటుందో, వారు ఎలాగైనా సరే వచ్చేస్తారు, ఇందులో భయపడే విషయమేమీ లేదు. శివబాబా అయితే జ్ఞాన సాగరుడు, పతితపావనుడు, సర్వుల సద్గతిదాత. బ్రహ్మా ద్వారా పతితం నుండి పావనంగా చేస్తారు. ఎవరైనా వచ్చి చదివగలిగే విధంగా ఈ పదాలను పెద్ద అక్షరాలతో రాయండి. పవిత్రత విషయంలోనే ఎన్ని విఘ్నాలు వేస్తారు.

పిల్లలూ, ఏ దేహధారుల పట్ల మోహం యొక్క బంధం ఉండకూడదని బాబా అంటారు. ఒకవేళ ఎక్కడైనా మోహం యొక్క బంధం ఉన్నట్లయితే, చిక్కుకుపోతారు. ఇక్కడైతే, అమ్మ మరణించినా కూడా హల్వా తినాలి….. బాబా తమ ఎదురుగా కూర్చోబెట్టుకొని అడుగుతారు – రేపు మీ వారెవరైనా మరణిస్తే ఏడవరు కదా. కన్నీరు వచ్చిందంటే ఫెయిల్ అయినట్లు. ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకున్నారు – ఇందులో ఏడవాల్సిన విషయమేముంది. ఇతరులెవరైనా ఈ మాటలు వింటే, నోటితో మంచి మాటలు మాట్లాడండి కదా అని అంటారు. అరే, మంచి మాటలే మాట్లాడుతున్నాము. సత్యయుగంలో ఏడవడమనేది ఉండనే ఉండదు, మీ ఈ జీవితం దానికన్నా ఉన్నతమైనది. మీరు అందరినీ ఏడవడం నుండి రక్షించేవారు, అటువంటప్పుడు మీరెలా ఏడుస్తారు? మనకు పతులకే పతి లభించారు, వారు మనల్ని స్వర్గంలోకి తీసుకువెళ్తారు. అటువంటప్పుడు నరకంలోకి పడేసే వారికోసం మనమెందుకు ఏడవాలి! వారసత్వం తీసుకునేందుకు, బాబా ఎంతటి మధురాతి-మధురమైన విషయాలను వినిపిస్తారు. ఈ సమయంలో భారత్ కు ఎంతటి అకళ్యాణం జరిగింది. తండ్రి వచ్చి కళ్యాణం చేస్తారు. భారత్ ను మగధ దేశమని అంటారు. సింధీల అంతటి ఫ్యాషనబుల్ గా ఎవరూ ఉండరు. విదేశాల నుండి ఫ్యాషన్లు నేర్చుకొని వస్తారు. ఈ రోజుల్లో జుట్టును అలంకరించుకునేందుకు ఆడపిల్లలు ఎంత ఖర్చు చేస్తారు. వీరిని నరకం యొక్క దేవదూతలని అంటారు. తండ్రి మిమ్మల్ని స్వర్గం యొక్క దేవతలుగా తయారుచేస్తారు. మాకైతే ఇక్కడే స్వర్గం ఉంది, ఈ సుఖాన్ని అయితే తీసుకోనివ్వండి, రేపు ఏమి జరుగుతుంది అనేది మాకేమి తెలుసు అని అంటారు. ఈ విధంగా రకరకాల ఆలోచనల కలవారు వస్తారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సత్యాతి-సత్యమైన ఆత్మిక పండాలుగా అయ్యి అందరికీ ఇంటి మార్గాన్ని తెలియజేయాలి. శరీర నిర్వహణార్థము వ్యాపారము చేసుకుంటూ స్మృతి యాత్రలో ఉండాలి. కార్య వ్యవహారాలతో విసిగిపోకూడదు.

2. జ్ఞాన అలంకరణ చేసుకొని స్వయాన్ని స్వర్గం యొక్క దేవతగా తయారుచేసుకోవాలి. ఈ తమోప్రధాన ప్రపంచంలో దైహిక అలంకరణ చేసుకోకూడదు. కలియుగీ ఫ్యాషన్లను వదిలేయాలి.

వరదానము:-

సహజయోగి జీవితాన్ని అనుభవం చేసేందుకు, జ్ఞాన సహితంగా అతీతంగా అవ్వండి. కేవలం బాహ్యంగా అతీతం అవ్వడం కాదు, మనసు యొక్క మోహం ఉండకూడదు. ఎవరు ఎంత అతీతంగా అవుతారో, అంత ప్రియంగా తప్పకుండా అవుతారు. అతీతమైన అవస్థ ప్రియమనిపిస్తుంది. ఎవరైతే బాహ్య మోహాల నుండి అతీతంగా అవ్వరో, వారు ప్రియంగా అయ్యేందుకు బదులుగా చింతాగ్రస్తులుగా అవుతారు. అందుకే సహజయోగి అనగా అతీతంగా మరియు ప్రియంగా ఉండే యోగ్యత కలవారు, సర్వ మోహాల నుండి ముక్తులుగా ఉండేవారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top