29 January 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

January 29, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - ఆత్మను నిరోగిగా తయారుచేసుకునేందుకు ఆత్మిక చదువును చదవండి మరియు చదివించండి, ఆత్మిక హాస్పిటల్ ను తెరవండి’’

ప్రశ్న: -

ఏ ఒక్క ఆశను పెట్టుకోవడంతో మిగిలిన ఆశలన్నీ స్వతహాగా పూర్తి అయిపోతాయి?

 

జవాబు:-

కేవలం తండ్రిని స్మృతి చేస్తూ సదా ఆరోగ్యవంతులుగా అయ్యే ఆశ పెట్టుకోండి. జ్ఞాన-యోగాల ఆశను పూర్తి చేసుకున్నట్లయితే మిగిలిన ఆశలన్నీ స్వతహాగా పూర్తి అయిపోతాయి. పిల్లలు ఎటువంటి అలవాటును పెట్టుకోకూడదు. ఆల్రౌండర్ గా అవ్వాలి. లోపాలు ప్రతి ఒక్కరిలోనూ ఉండి ఉండవచ్చు కానీ సేవను తప్పకుండా చేయాలి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఓర్పు వహించు మానవా..

ఓంశాంతి. పిల్లలు పాటను విన్నారు. ఈ సమయంలో ఆత్మలందరికీ ఓర్పునివ్వడం జరుగుతుంది. ఆత్మలోనే మనసు-బుద్ధి ఉన్నాయి. ఆత్మనే దుఃఖితంగా అవుతుంది, అప్పుడు తండ్రిని పిలుస్తుంది, ఓ పతిత-పావన పరమపిత పరమాత్మ రండి, అని. బ్రహ్మా-విష్ణు-శంకరులను ఎప్పుడూ పతిత-పావనా అని అనడం జరగదు. వారిని అననప్పుడు లక్ష్మీ-నారాయణులు, సీతా రాములు మొదలైనవారిని కూడా అనడం జరగదు. పతిత-పావనుడైతే ఒక్కరే. విష్ణువు చిత్రమైతే ఉన్నదే పావనముగా. వారు విష్ణుపురికి యజమాని. విష్ణుపురిని స్థాపన చేసేవారు శివబాబా. వారే ఈ సమయంలో విష్ణుపురిని స్థాపన చేస్తున్నారు. అక్కడ దేవీ-దేవతలు మాత్రమే ఉంటారు. విష్ణు వంశావళి అని అన్నా లేక లక్ష్మీ-నారాయణుల వంశావళి అని అన్నా విషయం ఒక్కటే. ఈ పాయింట్లన్నీ ధారణ చేయాల్సినవి. తండ్రి ఆత్మికమైనవారు మరియు ఇది ఆత్మిక చదువు, ఆత్మిక సర్జరీ, అందుకే బోర్డుపై పేరు కూడా ‘‘బ్రహ్మాకుమారీ ఆత్మిక ఈశ్వరీయ విశ్వ విద్యాలయము’’ అని రాయాలి. ఆత్మిక అనే పదాన్ని తప్పకుండా వేయాలి. ఆత్మిక హాస్పిటల్ అని కూడా అనవచ్చు ఎందుకంటే తండ్రిని అవినాశీ సర్జన్ అని కూడా అంటారు, పతిత-పావనుడు, జ్ఞానసాగరుడు అని కూడా అంటారు. పిల్లలూ, నేను వచ్చాను అని వారు ఓర్పునిస్తున్నారు. నేను ఆత్మలను చదివించేవాడిని. నన్ను పరమ ఆత్మ అని అంటారు. ఆత్మకే రోగం పట్టి ఉంది, మాలిన్యం చేరుకుని ఉంది. సత్యయుగంలో పవిత్ర ఆత్మలు ఉంటారు, ఇక్కడ అపవిత్ర ఆత్మలు ఉన్నారు. అక్కడ పుణ్యాత్ములు ఉంటారు, ఇక్కడ పాపాత్ములు ఉన్నారు. ఆత్మ పైనే అంతా ఆధారపడి ఉంది. ఆత్మకు శిక్షణ ఇచ్చేవారు – పరమాత్మ. వారినే స్మృతి చేస్తారు. అన్నీ వారి నుండే కోరుకోవడం జరుగుతుంది. ఎవరైనా దుఃఖితులుగా, నిరుపేదగా ఉంటే – దయ చూపించండి, షావుకార్ల ద్వారా కొంత ధనాన్ని ఇప్పించండి అని అంటారు. అప్పుడు, ధనం లభిస్తే ఈశ్వరుడు ఇచ్చారు లేక ఇప్పించారు అని అంటారు. కార్పెంటర్ ఎవరైనా ఉంటే, వారికి సేఠ్ నుండి లభిస్తుంది. పిల్లలకు తండ్రి నుండి లభిస్తుంది. కానీ పేరు అక్కడ ఈశ్వరునిది ప్రసిద్ధమవుతుంది. ఇప్పుడు ఈశ్వరుని గురించి అయితే మనుష్యులకు తెలియనే తెలియదు, అందుకే ఈ యుక్తులు అన్నింటినీ రచించడం జరుగుతుంది. ఇలా అడగడం జరుగుతుంది – పరమపిత పరమాత్మతో మీకున్న సంబంధం ఏమిటి? ప్రజాపిత బ్రహ్మా మరియు జగదంబతో మీకున్న సంబంధం ఏమిటి? రాజ-రాజేశ్వరులైన లక్ష్మీ-నారాయణులతో మీకున్న సంబంధం ఏమిటి? వారైతే స్వర్గానికి యజమానులు. తప్పకుండా స్వర్గాన్ని స్థాపన చేసేవారు వారికి వారసత్వాన్ని ఇచ్చి ఉంటారు. వీరు విష్ణుపురికి యజమానులు కదా. ముఖ్యమైన చిత్రము శివబాబాది మరియు బ్రహ్మా-విష్ణు-శంకరులది. విష్ణువుకు కూడా అలంకరించబడిన రూపాన్ని చూపిస్తారు. విష్ణువు ద్వారా పాలన చేస్తారు, శంకరుని ద్వారా వినాశనము. శంకరునికి అంత కర్తవ్యమేమీ లేదు. మహిమా యోగ్యుడు శివబాబా మరియు విష్ణువు కూడా అలా తయారవుతారు. శంకరుని పాత్ర వేరు. త్రిమూర్తి అనే పేరు పెట్టేసారు. సీతా-రాములు, లక్ష్మీ-నారాయణులు, ఇవే ముఖ్యమైన చిత్రాలు. వీటి తర్వాత రావణుడి చిత్రం ఉంటుంది. దానిని కూడా పెద్దగా 4×6 అడుగులది తయారుచేయాలి. రావణుడిని సంవత్సరం-సంవత్సరం కాలుస్తారు, ఇతనితో మీకున్న సంబంధం ఏమిటి? ఇతడిని కాలుస్తున్నారంటే తప్పకుండా పెద్ద శత్రువు అయినట్లు. ప్రదర్శినీలో ఇతడిది పెద్ద చిత్రం ఉండాలి. ఎప్పుడైతే ద్వాపరంలో దేవీ-దేవతలు వామ మార్గంలో పడిపోతారో, అప్పుడు ఇతడి రాజ్యం ప్రారంభమవుతుంది. ఇవి కాకుండా మిగతా చిత్రాలేవైతే ఉన్నాయో, వాటిని, ఇవన్నీ కలియుగీ చిత్రాలంటూ మళ్ళీ వేర్వేరు ప్రదర్శినీలలో చూపించాలి. గణేశుడు, హనుమంతుడు, తాబేలు, చేప మొదలైన చిత్రాలన్నింటినీ పెట్టాలి. ఇలాంటి రకరకాల చిత్రాలు ఎన్నో లభిస్తాయి. ఒకవైపు కలియుగీ చిత్రాలు, ఒకవైపు మీ చిత్రాలు ఉంటాయి. వీటిపై మీరు అర్థం చేయించవచ్చు. ముఖ్యమైన చిత్రము శివబాబాది మరియు లక్ష్యము-ఉద్దేశ్యానికి చెందినది. లక్ష్మీ-నారాయణులది వేరు, సంగమానిది వేరు, కలియుగానిది వేరు. చిత్రాల ప్రదర్శినీ కోసం చాలా పెద్ద గది కావాలి.

ఢిల్లీలో చాలా మంది వస్తారు. మంచివారు మరియు చెడ్డవారు అయితే ఉండనే ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ అవగాహన ఉండాలి. ఛీఫ్ జస్టిస్ తో ప్రారంభోత్సవం చేయిస్తారు, వారు కూడా ప్రసిద్ధమైనవారు, నంబరువన్. ప్రెసిడెంట్ మరియు ఛీఫ్ జస్టిస్ సమానమైనవారు. ఒకరిచేత ఒకరు ప్రతిజ్ఞ చేయిస్తారు. తప్పకుండా ఏదో అర్థం చేసుకుంటారు కావుననే ప్రారంభోత్సవం చేస్తారు కదా. నిర్మాణ కార్యాన్నే ప్రారంభోత్సవం చేస్తారు, వినాశన కార్యాన్ని అయితే చేయరు.

ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలూ, మీ సుఖం యొక్క రోజులు వస్తున్నాయి. బోర్డుపై కూడా హాస్పిటల్ అన్న పేరును తప్పకుండా రాయాలి. మరియు ఎవరు స్థాపన చేసారు? అవినాశీ సర్జన్ అయిన, పతిత-పావనుడైన తండ్రి కదా. పావన ప్రపంచంలోనైతే పావన మనుష్యులకు ఎప్పుడూ వ్యాధులు మొదలైనవి ఉండవు. పతిత ప్రపంచంలోనైతే చాలా వ్యాధులు ఉన్నాయి. కావున ఏమేమి చిత్రాలు పెట్టాలి, ఎలా అర్థం చేయించాలి అని సేవ కోసం ఆలోచనలు నడిపించాలి. ఒకవేళ ఎవరైనా తెలివితక్కువవారు అర్థం చేయిస్తే ఏమీ అర్థం చేసుకోలేరు. ఇక్కడైతే ఏమీ లేదు, ప్రగల్భాలు పలుకుతూ ఉంటారని అంటారు, అందుకే ప్రదర్శినీలలో ఎప్పుడూ అర్థం చేయించడం కోసం అవివేకులను నిలబెట్టకూడదు. అర్థం చేయించేవారు కూడా తెలివైనవారు కావాలి. రకరకాల మనుష్యులు వస్తారు. పెద్ద వ్యక్తులకు ఎవరైనా మందబుద్ధి కలవారు అర్థం చేయించినట్లయితే, మొత్తం ప్రదర్శినీ పేరును అప్రతిష్ఠపాలు చేసేస్తారు. ఫలానా-ఫలానావారు ఏ రకమైన టీచరు అనేది బాబా తెలియజేయగలరు. అందరూ ఒకే విధమైన తెలివైనవారు కూడా కారు. చాలామంది దేహాభిమానులు కూడా ఉన్నారు.

ఇప్పుడు తండ్రి అంటారు, ఓ ఆత్మలూ, మీ సుఖం యొక్క రోజులు వస్తున్నాయి. స్వర్గం యొక్క పేరునైతే అందరూ మహిమ చేస్తారు. కానీ స్వర్గంలో కూడా నంబరువారు పదవులు ఉన్నాయి. నరకంలో కూడా నంబరువారు పదవులు ఉన్నాయి. విజయమాలలో కూర్చబడేవారు రాజ-రాజేశ్వరులుగా అవుతారు. జ్ఞాన-జ్ఞానేశ్వరి అయిన జగదంబతో మీకున్న సంబంధం ఏమిటి అని మనం అడుగుతాము కూడా. జ్ఞాన-జ్ఞానేశ్వరికి ఈశ్వరుడు జ్ఞానమిచ్చినట్లయితే రాజ-రాజేశ్వరిగా అవుతారు. జగదంబకు కూడా చాలా మంది పిల్లలున్నారు మరియు ప్రజాపిత బ్రహ్మాకు కూడా చాలా మంది పిల్లలు ఉన్నారు. ఎంత సూక్ష్మమైన విషయాలు. ప్రజాపిత బ్రహ్మా మరియు జగదంబ ఎవరు అనేది మనుష్యులు అసలు అర్థం చేసుకోలేరు. ప్రజాపిత బ్రహ్మాకు ముఖవంశావళి ఉంటారు కదా. ఎవరైతే తెలివైనవారు ఉంటారో, వారు వెంటనే అడుగుతారు, ప్రజాపిత బ్రహ్మాకు మరియు జగదంబకు పరస్పరంలో ఏం సంబంధముంది అన్న విషయం మాకు అర్థం కావడం లేదు, ఇంతమంది పిల్లలు నోటి ద్వారా ఎలా జన్మించారు? ఇలాంటి-ఇలాంటి ప్రశ్నలు అడగడం వలన వచ్చేవారి బుద్ధి గురించి కూడా తెలిసిపోతుంది. తండ్రి అన్ని రహస్యాలను అర్థం చేయిస్తారు. త్రిమూర్తి, వృక్షము, చక్రము, లక్ష్మీ-నారాయణుల చిత్రము, వీటిలో లక్ష్యం-ఉద్దేశ్యం కూడా ఉంది, వారసత్వాన్ని ఇచ్చేవారు కూడా పైన ఉన్నారు. కనుక అర్థం చేయించేవారు చాలా తెలివైనవారు కావాలి. ప్రశ్నావళి కూడా చాలా బాగుంది. రావణుడితో మీకున్న సంబంధం ఏమిటి? ఇంత పెద్ద-పెద్ద విద్వాంసులు, పండితులు మొదలైనవారు అతడు శత్రువు ఎలా అవుతాడు అనేదేమీ కూడా అర్థం చేసుకోరు. మనం కూడా ఇంతకుముందు అర్థం చేసుకునేవారిమి కాదు. బాబా అంటారు, ఈ బ్రహ్మా, ఎవరినైతే నేను దత్తత తీసుకున్నానో, వారికి కూడా ఇంతకుముందు తెలియదు. ఇప్పుడు తెలుసు కనుక ఇతరులకు కూడా అర్థం చేయించాలి అనే అభిరుచి చాలా ఉండాలి. ఈ ప్రదర్శనీ పూర్తిగా కొత్తది. ఒకవేళ ఎవరైనా కాపీ చేసినా కూడా అర్థం చేయించలేరు. ఇది అద్భుతము. చాలా నషా కావాలి. సేవలో పూర్తిగా నిమగ్నమైపోవాలి. మీ చిత్రాలను ఎన్నో అడుగుతారు కనుక చాలా ఉండాలి. సేవ కోసం విశాల బుద్ధి కావాలి. ఖర్చు అయితే అవుతుంది. ధనమైతే ఖర్చు చేసేందుకే ఉంది. ఖర్చును చేస్తూ వెళ్ళినట్లయితే వస్తూ ఉంటుంది. ధనం ఇచ్చినా ధనం తరగదు. పిల్లలైతే ఎంతో మంది తయారవుతూ ఉంటారు. ధనాన్ని అయితే సేవలోనే పెట్టాలి. రాజధాని అయితే సత్యయుగంలో ఉండేది ఉంది. ఇక్కడైతే మహళ్ళు మొదలైనవి తయారుచేసుకోకూడదు. అందులో గవర్నమెంట్ కు ఎంత ఖర్చు అవుతుంది. ఇక్కడ చిత్రాలు తయారుచేసే ఖర్చు ఉంది. రోజు-రోజుకు చాలా మంచి పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. రావణ రాజ్యం ఎప్పటి నుండి మొదలయ్యింది అనేది చాలా యుక్తిగా అర్థం చేయించడం జరుగుతుంది. అర్ధ సమయం రావణ రాజ్యము, అర్ధ సమయం రామ రాజ్యము. ఈ రావణుడి నుండి బాబానే వచ్చి విడిపిస్తారు, ఇతరులెవ్వరూ విడిపించలేరు. దీని కోసమైతే సర్వశక్తివంతుడే కావాలి. వారే మాయపై విజయాన్ని ప్రాప్తి చేయించగలరు. ఇక తర్వాత సత్యయుగంలో ఈ శత్రువైన రావణుడు ఉండనే ఉండడు. నెమ్మది-నెమ్మదిగా మీ ప్రభావం చాలా వెలువడుతుంది. అప్పుడు బంధనంలో ఉన్న మాతలు, కన్యలు అందరూ విముక్తులవుతారు. ఇది మంచి విషయము అని అర్థం చేసుకుంటారు. కళంకాలు తప్పకుండా వచ్చేదే ఉంది. కృష్ణునిపై కూడా కళంకాలు వచ్చాయి కదా. స్థాపన సమయంలో కూడా ఎత్తుకువెళ్ళిపోయారు అంటూ కళంకాలు వేసారు, నిందిస్తూ ఉండేవారు. మళ్ళీ స్వర్గంలో కూడా, సర్పం కాటేసింది అని, అది-ఇది చేసారు అని… కళంకాలు వేసారు. ఎంత వ్యర్థమైన విషయాలు. ప్రదర్శినీలకు చాలా మంది వస్తారు. అప్పుడు వారికి చెప్పడం జరుగుతుంది – సెంటరుకు వచ్చి అర్థం చేసుకోండి, వచ్చి మీ జీవితాన్ని తయారుచేసుకోండి, కాలుడిపై విజయాన్ని పొందండి. అక్కడ కాలుడు కబళించడు. ఒక కథ ఉంది – యమదూతలు తీసుకువెళ్ళడానికి వచ్చారు, అప్పుడు, మీరు లోపలకి రాలేరు… అని వారికి చెప్పారు. ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇందులో చాలా విశాల బుద్ధి కావాలి మరియు దేహీ-అభిమానులుగా ఉండాలి. మేము ఆత్మ, పాత సంబంధాలు మరియు పాత శరీరం యొక్క భానం ఉంచుకోకూడదు. ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది, మనం తిరిగి వెళ్తున్నాము. స్వర్గంలోకి వెళ్ళి మనం కొత్త సంబంధాలలో జోడించబడాలి. ఈ జ్ఞానం బుద్ధిలో ఉంది. ఈ పాత ప్రపంచమైతే సమాప్తం అవ్వనున్నది. మన సంబంధం తండ్రితో మరియు కొత్త ప్రపంచంతో ఉంది. ఈ విషయాలను స్మరణ చేయాల్సి ఉంటుంది. ఈ జ్ఞానం మీకు భవిష్య కొత్త ప్రపంచం కోసం లభిస్తుంది. ఈ పాత ప్రపంచమైతే శ్మశానవాటికగా కానున్నది, దీనితో ఏం మనసు పెట్టుకోవాలి. దేహ సహితంగా అంతా సమాప్తం అవ్వనున్నది. దేహీ-అభిమానులుగా అవ్వడం మంచిది. మనం బాబా వద్దకు వెళ్తాము. తమతో తాము మాట్లాడుకోవాలి, అప్పుడు ఎవరికైనా అర్థం చేయించగలరు.

మా సుఖం యొక్క రోజులు వస్తున్నాయని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఎంతగా పాస్ అయ్యే పురుషార్థం చేస్తారో, అంతగా పదవి కూడా ఉన్నతమైనది పొందుతారు. సర్టిఫికెట్ అయితే టీచరే ఇస్తారు కదా. వారికి తెలుసు – వీరిలో ఎంత సత్యత ఉంది, వీరు ఎంత సర్వీసబుల్ (సేవా యోగ్యులు) గా ఉన్నారు, వీరు స్థాపనా కార్యం చేస్తారు, వినాశన కార్యమైతే చేయరు అని! సర్వీసబుల్ (సేవా యోగ్యులు) అయిన వారే హృదయాన్ని అధిరోహిస్తారు. ఇప్పుడైతే ఎవరూ పరిపూర్ణంగా లేరు. లోపాలైతే అందరిలోనూ ఉంటాయి. పరిపూర్ణంగా అయితే మున్ముందు అయ్యేది ఉంది. మనుష్యుల జీవితాలను ఎలా తీర్చిదిద్దాలి అనే అభిరుచిని పెట్టుకోవాలి. ముళ్ళను పుష్పాలుగా తయారుచేయాలి. తండ్రి కూడా ముళ్ళ వంటి మనుష్యులను పుష్పాలుగా తయారుచేస్తారు. దేవతలుగా తయారుచేస్తారు. జ్ఞానం మరియు యోగం కూడా కావాలి. పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు, అప్పుడిక ఎవరూ విరోధించరు. అందరూ చక్కబడతారు. ఇక్కడ దేవతలైతే ఎవరూ లేరు. ప్రతి విషయంలోనూ ధ్యానం ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్రౌండ్ బుద్ధి కావాలి. సేవను సరైన రీతిలో చేస్తున్నారా లేక చేయడం లేదా. ఎవరూ విశ్రాంతి ప్రియులుగా అయితే లేరు కదా! రోజంతా ఇది కావాలి, అది కావాలి అన్నట్లు అయితే లేరు కదా! దీనినే లోభం అని అంటారు. మంచి బట్టలు కావాలి, మంచి భోజనం కావాలి. ఆశలు చాలా ఉంటాయి. వాస్తవానికైతే యజ్ఞం నుండి ఏది లభిస్తుందో, అది మంచిది. సన్యాసులు ఎప్పుడూ ఇంకొక వస్తువును తీసుకోరు. ఈ అలవాటు మంచిది కాదు అని భావిస్తారు. శివబాబా యజ్ఞం నుండి అన్నీ సరిగ్గా లభిస్తాయి. అయినా కూడా ఏదో ఒక ఆశ ఉంటుంది. మొదట జ్ఞాన-యోగాల ఆశనైతే పూర్తి చేసుకోండి. ఆ ఆశలనైతే జన్మ-జన్మాంతరాలుగా పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడైతే బాబాను స్మృతి చేయడంతో మనం సదా ఆరోగ్యవంతులుగా అవుతాము అనే ఈ ఆశను పెట్టుకోవాలి. కనుక ఇది ఆత్మిక హాస్పిటల్ అని తప్పకుండా రాయాలి, దీని ద్వారా ఇది హాస్పిటల్ మరియు కాలేజ్ కూడా అని మనుష్యులు అర్థం చేసుకుంటారు. బాబా, ఈ ఇంటిని కూడా హాస్పిటల్ మరియు కాలేజ్ అన్న పద్ధతిలోనే తయారుచేయించారు. కాలేజీలలో అలంకరణలు ఏమీ ఉండవు, సింపుల్ గా ఉంటాయి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

 

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. విశ్రాంతి-ప్రియులుగా అవ్వకూడదు. సేవ పట్ల చాలా-చాలా అభిరుచి పెట్టుకోవాలి. సేవలోనే ధనాన్ని ఖర్చు చేయాలి. మనుష్యుల జీవితాలను ముళ్ళ నుండి పుష్పాలుగా తయారుచేయాలి.

2. సదా నిర్మాణ కార్యాలనే చేయాలి, వినాశన కార్యాలను కాదు. మేము ఎక్కడికి వెళ్తున్నాము! ఏమి అవుతున్నాము! అని తమతో తాము మాట్లాడుకోవాలి.

వరదానము:-

శక్తిశాలి స్మృతి ఒకే సమయంలో డబల్ అనుభవాన్ని చేయిస్తుంది. ఒకవైపు స్మృతి, అగ్నిగా అయి భస్మం చేసే పని చేస్తుంది, పరివర్తన చేసే పని చేస్తుంది మరియు రెండవవైపు, సంతోషము మరియు తేలికదనాన్ని అనుభవం చేయిస్తుంది. ఇటువంటి విధి పూర్వకమైన, శక్తిశాలి స్మృతినే యథార్థమైన స్మృతి అని అంటారు. ఇటువంటి యథార్థ స్మృతిలో ఉండేటువంటి స్మృతి స్వరూప పిల్లలే సమర్థులు. ఈ స్మృతి సో సమర్థతనే నంబరువన్ ప్రైజ్ కు అధికారులుగా చేస్తుంది.

స్లోగన్:-

లవలీన స్థితిని అనుభవం చేయండి

పరమాత్మ ప్రేమ ఈ శ్రేష్ఠ బ్రాహ్మణ జన్మకు ఆధారము. ప్రేమ ఉంటే ప్రపంచం ఉంది, ప్రాణం ఉంది అని కూడా అంటారు. ప్రేమ లేకపోతే ప్రాణమూ లేదు, ప్రపంచమూ లేదు. ప్రేమ లభించింది అంటే ప్రపంచం లభించింది. ప్రపంచం ఒక్క బిందువు కోసం దాహంతో ఉంది మరియు పిల్లలైన మీకు ఈ ప్రభువు ప్రేమ ఆస్తి వంటిది. ఈ ప్రభువు ప్రేమతోనే పాలించబడతారు అనగా బ్రాహ్మణ జీవితంలో ముందుకు వెళ్తారు. కనుక సదా ప్రేమ సాగరునిలో లవలీనులై ఉండండి.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top