28 September 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
27 September 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - తండ్రి మిమ్మల్ని పూజారుల నుండి పూజ్యులుగా తయారుచేసేందుకు వచ్చారు, పూజ్యుల నుండి పూజారులుగా మరియు పూజారుల నుండి పూజ్యులుగా అయ్యేటువంటి పూర్తి కథ పిల్లలైన మీకు తెలుసు”
ప్రశ్న: -
ఏ విషయము ప్రపంచంలోని వారికి అసంభవం అనిపిస్తుంది కానీ మీరు సహజంగా మీ జీవితంలో ధారణ చేస్తారు?
జవాబు:-
గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండడం పూర్తిగా అసంభవమని ప్రపంచంలోని వారు భావిస్తారు కానీ మీరు దానిని సహజంగా ధారణ చేస్తారు ఎందుకంటే దీని ద్వారా స్వర్గ రాజ్యాధికారం లభిస్తుందని మీకు తెలుసు. కనుక ఇది చాలా చౌక బేరము కదా.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
ఈ రోజు ఉదయాన్నే ఎవరు వచ్చారు… (యహ్ కౌన్ ఆజ్ ఆయా సవేరే…)
ఓంశాంతి. అంధకారము మరియు ఉదయము – ప్రపంచం దృష్టిలో వీటి అర్థము పూర్తిగా వేరుగా ఉంటుంది. అదైతే సామాన్యమైన విషయము. పిల్లలైన మీ ఉదయము అసామాన్యమైనది. అంధకారం మరియు ఉదయం అని దేనిని అంటారో ప్రపంచానికి తెలియదు. వాస్తవానికి ఈ అంధకారం మరియు ఉదయం, కల్పం యొక్క ఈ పురుషోత్తమ సంగమయుగంలో ఉంటుంది. ఇప్పుడు అజ్ఞాన అంధకారం దూరమవుతుంది. జ్ఞానసూర్యుడు ఉదయించినప్పుడు అజ్ఞానాంధకారం సమాప్తమవుతుందని పాడుతారు కూడా. ఆ సూర్యుడు ప్రకాశాన్ని ఇచ్చేవాడు. ఇది జ్ఞానసూర్యునికి సంబంధించిన విషయము. భక్తిని అంధకారమని, జ్ఞానాన్ని ప్రకాశమని అంటారు. ఇప్పుడు ఉదయం వస్తుందని పిల్లలైన మీకు తెలుసు. భక్తి మార్గపు అంధకారం పూర్తి అయిపోతుంది. భక్తిని అజ్ఞానమని అంటారు ఎందుకంటే ఎవరినైతే భక్తి చేస్తున్నారో, వారి గురించిన జ్ఞానం ఏ మాత్రము లేదు. సమయం వృథా అవుతుంది. బొమ్మల పూజ జరుగుతూ ఉంటుంది. అర్ధకల్పం నుండి ఈ బొమ్మల పూజ జరుగుతుంది. ఎవరినైతే పూజిస్తున్నారో, వారి గురించిన పూర్తి జ్ఞానముండాలి. దేవీ-దేవతలది పూజ్య వంశము. ఆ పూజ్యులే, మళ్ళీ పూజారులుగా అవుతారు. పూజ్యుల నుండి పూజారులుగా, పూజారుల నుండి పూజ్యులుగా అయ్యే కథ ఎంత పెద్దది. మనుష్యులకు, పూజ్యులు మరియు పూజారులు యొక్క అర్థం కూడా తెలియదు. అంధకారం పూర్తి అయ్యే సమయంలో సంగమంలోనే పరమపిత పరమాత్మ వస్తారు. ఉదయమును తీసుకువచ్చేందుకు వస్తారు. కానీ వారు కల్పం యొక్క సంగమయుగానికి బదులుగా యుగే-యుగే అని రాసేసారు. 4 యుగాలు పూర్తి అయినప్పుడు, పాత ప్రపంచం సమాప్తమై మళ్ళీ కొత్త ప్రపంచం ప్రారంభమవుతుంది. కావున దీనిని కళ్యాణకారీ సంగమయుగమని అంటారు. ఈ సమయంలో అందరూ నరకవాసులుగా ఉన్నారు. ఎవరైనా మరణించినప్పుడు, స్వర్గానికి వెళ్ళారని అంటారు, అంటే వారు తప్పకుండా అప్పటివరకు నరకంలో ఉన్నారని అర్థము. కానీ తాము నరకంలో ఉన్నారని ఎవరూ అర్థం చేసుకోరు. రావణుడు అందరి బుద్ధికి పూర్తిగా తాళం వేసేసాడు. అందరి బుద్ధి పూర్తిగా హతమార్చబడింది. తండ్రి అర్థం చేయిస్తారు – భారతవాసుల బుద్ధి అందరికంటే విశాలంగా ఉండేది. తర్వాత ఎప్పుడైతే పూర్తి రాతిబుద్ధి కలవారిగా అయిపోతారో, అప్పుడే దుఃఖం పొందుతారు. డ్రామా ప్లాన్ అనుసారంగా వివేకహీనులుగా అవ్వాల్సిందే. వివేకహీనులుగా తయారుచేసేది మాయ. పూజ్యులను వివేకవంతులని, పూజారులను వివేకహీనులని అంటారు. మేము నీచులము, పాపులము అని కూడా అంటారు. కానీ, వివేకవంతులుగా ఎప్పుడు ఉండేవారు అనేది తెలియదు. రావణ రూపీ మాయ పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా తయారుచేస్తుంది. మనమే పూజ్యులుగా ఉండేవారము, తర్వాత పూజారులుగా అయ్యామని ఇప్పుడు మీకు అర్థమయ్యింది. ఇప్పుడు పిల్లలైన మీకు సంతోషం కలుగుతుంది. మాకు శాంతి లభించాలని మరియు జనన-మరణాల నుండి విముక్తులుగా అవ్వాలని చాలా రోజుల నుండి ఆర్తనాదాలు చేస్తూ వచ్చారు కానీ ఈ మాయ సంకెళ్ళ నుండి విముక్తులుగా అయ్యే జ్ఞానం ఎవరి బుద్ధిలోనూ లేదు. మెట్లు దిగుతూ వస్తామని మీకు తెలుసు. సత్యయుగంలోనైతే నెమ్మది-నెమ్మదిగా దిగుతారు, సమయం పడుతుంది. సుఖం యొక్క మెట్లు దిగడానికి సమయం పడుతుంది. దుఃఖం యొక్క మెట్లు త్వరత్వరగా దిగుతారు. సత్య-త్రేతా యుగాలలో 21 జన్మలు, ద్వాపర-కలియుగాలలో 63 జన్మలు ఉంటాయి, ఆయువు తగ్గిపోతుంది. ఒక్క చిటికెలో మనం ఎక్కే కళలోకి వెళ్తామని ఇప్పుడు మీకు తెలుసు. జనకునికి ఒక్క సెకండులో జీవన్ముక్తి లభించిందని అంటూ ఉంటారు. కానీ జీవన్ముక్తి యొక్క అర్థాన్ని తెలుసుకోరు. జీవన్ముక్తి ఒక్క జనకునికే లభించిందా లేక మొత్తం ప్రపంచానికి లభించిందా? ఇప్పుడు మీ బుద్ధి తాళము తెరుచుకుంది. ఎవరికైనా మందబుద్ధి ఉంటే – పరమాత్మ, వీరికి మంచి బుద్ధిని ఇవ్వండి అని అంటారు. సత్యయుగంలో ఇలాంటి విషయమేమీ ఉండదు. ఏ ఆత్మలైతే పరమాత్మ నుండి చాలా కాలం వేరుగా ఉంటారో, వారి లెక్క కూడా ఉంటుంది. తండ్రి పరంధామంలో ఉన్నప్పుడు, ఆ సమయంలో ఏ ఆత్మలైతే వారితో పాటు ముక్తిధామంలో ఉంటారో మరియు చివర్లో వస్తారో, వారు చాలా సమయం తండ్రితో పాటు ఉంటారు. మనమైతే అక్కడ కొంత సమయమే ఉంటాము. అందరికన్నా ముందు తండ్రి నుండి మనం వేరవుతాము, అందుకే ఆత్మ-పరమాత్మలు చాలా కాలం వేరుగా ఉన్నారు… అని అంటూ ఉంటారు. ఎవరైతే తండ్రి నుండి చాలా కాలం వేరుగా ఉన్నారో, ఇప్పుడు వారి మేళానే జరుగుతుంది. ఎవరైతే తండ్రితోపాటు అక్కడ చాలా సమయం ఉంటారో, వారిని కలుసుకోరు. తండ్రి అంటారు – విశేషంగా పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకే నేను వస్తాను. నేను పిల్లలైన మీతో ఉన్నప్పుడు అందరి కళ్యాణం జరుగుతుంది. ఇప్పుడిది అందరి వినాశన సమయము. ఇప్పుడు అందరూ లెక్కాచారాలను సమాప్తం చేసుకొని వెళ్ళిపోతారు. తర్వాత, మీరు రాజ్య భాగ్యాన్ని పొందుతారు. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. గాడ్ ఫాదర్, లిబరేటర్, గైడ్ అని కూడా పాడుతారు. దుఃఖం నుండి విడిపించి శాంతిధామానికి తీసుకువెళ్ళేందుకు గైడ్ గా అవుతారు. సుఖధామానికి తీసుకువెళ్ళేందుకు గైడ్ గా అవ్వరు. ఆత్మలను శాంతిధామానికి తీసుకువెళ్తారు, ఆత్మలు నివసించే ఆ ప్రపంచము నిరాకారీ ప్రపంచము. కానీ పతితులుగా ఉన్న కారణంగా అక్కడకు ఎవరూ వెళ్ళలేరు, అందుకే పతితపావనుడైన తండ్రిని పిలుస్తారు. విశేషంగా భారతవాసులు ఎప్పుడైతే తలక్రిందులుగా అవుతారో, అప్పుడు అనంతమైన తండ్రిని కుక్క-పిల్లి, రాయి-రప్పలలో ఉన్నారని అంటారు. ఇది ఆశ్చర్యం కదా. నన్ను తమ కన్నా కిందకు దిగజారుస్తారు. డ్రామా ఈ విధంగా తయారై ఉంది. ఇందులో ఎవరి దోషము లేదు, అందరూ డ్రామాకు వశమై ఉన్నారు. ఈశ్వరునికి వశమై లేరు. ఈశ్వరుని కన్నా డ్రామా శక్తివంతమైనది. తండ్రి అంటారు – నేను కూడా డ్రామానుసారంగా నా సమయానికి వస్తాను. నేను రావడమనేది ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. భక్తి మార్గంలో మనుష్యులు ఎన్ని ఎదురుదెబ్బలు తింటారు. మీకు తండ్రి లభించారు. తండ్రి నుండి చిటికెలో వారసత్వం తీసుకోవాలి. వారసత్వం లభించాక, ఇక ఎదురుదెబ్బలు తినాల్సిన అవసరం లేదు. భగవంతుడు స్వయంగా చెప్తున్నారు – నేను వచ్చి వేదశాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తాను. ముందు సత్యఖండంగా ఉండేది, తర్వాత అసత్యఖండంగా ఎలా అయ్యింది అనేది ఎవరికీ తెలియదు. గీతను ఎవరు వినిపించారో కూడా భారతవాసులకు తెలియదు. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం భారత్ కు సంబంధించిందే. దేవతా ధర్మం వారు సతోప్రధాన పూజ్యుల నుండి తమోప్రధాన పూజారులుగా అయినప్పుడు, దేవతా ధర్మం ప్రాయఃలోపమైపోతుంది, అప్పుడు తండ్రి వచ్చి మళ్ళీ ఆ ధర్మాన్ని స్థాపన చేస్తారు. చిత్రాలు కూడా ఉన్నాయి, శాస్త్రాలు కూడా ఉన్నాయి. భారతవాసుల శాస్త్రము శిరోమణి గీత ఒక్కటే. ప్రతి ఒక్కరు తమ ధర్మాన్నే మర్చిపోయారు, అందుకే పేరును మార్చి హిందువు అన్న పేరు పెట్టుకున్నారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. ఆత్మనే పునర్జన్మల్లోకి వస్తూ తమోప్రధానంగా అయిపోతుంది, మాలిన్యం చేరుకుంటుంది. మనం సత్యమైన నగలుగా ఉండేవారము, ఇప్పుడు అసత్యంగా అయిపోయామని మీకు తెలుసు. నగ అని శరీరాన్ని అంటారు. శరీరం ద్వారానే పాత్రను అభినయిస్తారు. మనకు ఎంత పెద్ద 84 జన్మల పాత్ర లభించింది. దేవతా, క్షత్రియ… అలా మీరే పూజ్యులుగా, మీరే పూజారులుగా అవుతారు. ఒకవేళ నేను పూజ్యం నుండి పూజారిగా అయితే, మిమ్మల్ని పూజ్యులుగా ఎవరు తయారుచేస్తారు. నేను సదా పావనుడను, జ్ఞాన సాగరుడను, పతిత-పావనుడను. మీరే పూజ్యులుగా, పూజారులుగా అయి పగలు మరియు రాత్రులలోకి వస్తారు. కానీ వారికి ఈ విషయం తెలియదు. తండ్రి అర్థం చేయిస్తారు – ప్రపంచం అసత్యంగా తయారవుతూ ఉన్నప్పుడు, ఇన్ని అసత్య కథలను కూర్చొని తయారుచేసారు. వ్యాసుడు కూడా అద్భుతం చేసారు. ఇప్పుడు వ్యాసుడైతే భగవంతుడు కాదు. భగవంతుడు వచ్చి బ్రహ్మా ద్వారా వేద-శాస్త్రాల సారాన్ని అర్థం చేయించారు. వారేమో బ్రహ్మా చేతిలో శాస్త్రాలను చూపించారు. మరి భగవంతుడు ఎక్కడ ఉన్నారు? విష్ణువు నాభి నుండి బ్రహ్మా వెలువడ్డారు కనుక విష్ణువు కూర్చొని శాస్త్రాల సారాన్ని తెలియజేసారని కాదు, బ్రహ్మా ద్వారా అర్థం చేయించడం జరుగుతుంది. త్రిమూర్తుల పైన శివబాబా ఉన్నారు, వారు కూర్చొని బ్రహ్మా ద్వారా సారాన్ని తెలియజేస్తారు. ఎవరి ద్వారానైతే అర్థం చేయిస్తారో, వారే మళ్ళీ పాలన చేస్తారు. మీరు బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలు. బ్రాహ్మణ వర్ణము ఉన్నతోన్నతమైనది. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానము. మీరు ఈశ్వరుడు రచించిన యజ్ఞాన్ని సంభాళిస్తారు. ఈ జ్ఞాన యజ్ఞంలో మొత్తం పాత ప్రపంచమంతా స్వాహా అవ్వనున్నది. దీనికి రాజస్వ అశ్వమేధ అవినాశీ రుద్ర జ్ఞాన యజ్ఞము అన్న పేరును పెట్టారు. రాజ్యాన్ని ప్రాప్తి చేయించేందుకు తండ్రి యజ్ఞాన్ని రచించారు. వాళ్లు యజ్ఞాలను రచించినప్పుడు మట్టితో శివలింగాన్ని మరియు సాలిగ్రామాలను తయారుచేస్తారు. వాటిని తయారుచేసి, పాలన చేసి, ఆ తర్వాత సమాప్తం చేసేస్తారు. దేవతల మూర్తులను కూడా ఇలానే చేస్తారు. చిన్న పిల్లలు బొమ్మలతో ఆడుకున్నట్లుగా ఇది కూడా చేస్తారు. భగవంతుడు స్థాపన, పాలన, ఆ తర్వాత వినాశనం చేస్తారని తండ్రి గురించి అంటారు. మొదట స్థాపన చేస్తారు.
ఇప్పుడు మీరు మృత్యులోకంలో అమరలోకం కోసం చదువుకుంటున్నారు. మృత్యులోకంలో ఇది మీ అంతిమ జన్మ. తండ్రి అమరలోకాన్ని స్థాపన చేసేందుకు వస్తారు. కేవలం ఒక పార్వతికే కథ వినిపిస్తే ఏమవుతుంది. శంకరుడిని అమరనాథుడని అంటారు, వారితో పార్వతిని చూపిస్తారు. ఇప్పుడు శంకరుడు మరియు పార్వతిని సూక్ష్మవతనంలో చూపించినప్పుడు వారు స్థూలంగా ఎలా రాగలరు? జగదంబ మరియు జగత్ పిత లక్ష్మీనారాయణులు అవుతారని ఇప్పుడు మీకు అర్థం చేయించారు. ఆ లక్ష్మీనారాయణులు 84 జన్మల తర్వాత జగదంబ, జగత్ పితలుగా అవుతారు. వాస్తవానికి జగదంబ పురుషార్థీ మరియు లక్ష్మి పావన ప్రారబ్ధము. ఎక్కువ మహిమ ఎవరికి ఉంది? జగదంబకు ఎన్ని మేళాలు జరుగుతాయో చూడండి. కలకత్తాలోని కాళీ చాలా ప్రసిద్ధమైనవారు. నల్ల విగ్రహ రూపంలో ఉన్న కాళీ మాత వద్ద నల్లని తండ్రిని ఎందుకు తయారుచేయలేదు? వాస్తవానికి ఆదిదేవి అయిన జగదంబ, జ్ఞాన చితిపై కూర్చొని నలుపు నుండి తెలుపుగా తయారవుతారు. ముందు జ్ఞాన-జ్ఞానేశ్వరిగా ఉంటారు, తర్వాత రాజ-రాజేశ్వరిగా అవుతారు. ఇక్కడకు మీరు ఈశ్వరుడి నుండి జ్ఞానాన్ని తీసుకొని రాజ-రాజేశ్వరిగా తయారయ్యేందుకు వచ్చారు. లక్ష్మీనారాయణులకు రాజ్యాన్ని ఎవరిచ్చారు? ఈశ్వరుడు. అమర కథ, సత్యనారాయణ కథ ఆ తండ్రియే వినిపిస్తారు, దీని ద్వారా సెకెండులో నరుని నుండి నారాయణునిగా తయారవుతారు.
ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధి తెరుచుకుంది – కామం మహాశత్రువని అర్థం చేసుకున్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండడం అసంభవమని అంటారు. తండ్రి స్వర్గ రచయిత కావున వారు తప్పకుండా తమ పిల్లలకు స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తారని అర్థం చేయించడం జరుగుతుంది. మరి స్వర్గ రాజ్యాధికారాన్ని పొందాలంటే ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉండాల్సి ఉంటుంది. ఇది చౌక బేరము కదా. వ్యాపారస్థులు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారు, ఎందుకంటే వ్యాపారస్థులు దానం కూడా చేస్తారు. ధర్మార్థం కొంత ధనాన్ని పక్కకు తీస్తారు. తండ్రి అంటారు – ఈ వ్యాపారం ఎవరో అరుదుగా చేస్తారు. ఇది ఎంత చౌక బేరము. కానీ చాలా మంది ఈ వ్యాపారం చేసి మళ్ళీ విడాకులు కూడా ఇచ్చేస్తారు. ఈ జ్ఞానం తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. జ్ఞానసాగరుడు ఒక్కరే, వారే అర్థం చేయిస్తారు. ఎవరైతే పావనంగా, పూజ్యునిగా ఉండేవారో, వారే మళ్ళీ 84 జన్మల అంతిమంలో పూజారిగా అయ్యారు. వారి తనువులో నేను ప్రవేశించాను. ప్రజాపిత అయితే ఇక్కడ ఉంటారు కదా. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి ఫరిశ్తాలుగా అవుతున్నారు. భక్తి మార్గపు రాత్రి తర్వాత ఇప్పుడు జ్ఞానం అనగా పగలు వస్తుంది. తిథి-తారీఖులైతే లేవు. శివబాబా ఎప్పుడు వచ్చారు అనేది ఎవరికీ తెలియదు. కృష్ణ జయంతిని వైభవంగా జరుపుకుంటారు. శివజయంతి గురించి ఎవరికీ పూర్తిగా తెలియదు. అచ్ఛా.
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈ కళ్యాణకారీ యుగంలో ఒక్క తండ్రి ద్వారానే సత్యమైన సత్యనారాయణ కథను, అమరకథను వినాలి. ఇంతవరకు విన్నదంతా మర్చిపోవాలి.
2. సత్యయుగ రాజ్యాధికారాన్ని తీసుకునేందుకు ఈ ఒక్క జన్మలో పవిత్రంగా ఉండాలి. ఫరిశ్తాలుగా అయ్యే పురుషార్థం చేయాలి.
వరదానము:-
మనం తండ్రి యొక్క సర్వ ఖజానాలకు బాలకుల నుండి యజమానులుగా అయ్యేవారము, న్యాచురల్ యోగులము, న్యాచురల్ స్వరాజ్య అధికారులము. ఈ స్మృతి ద్వారా సర్వ ప్రాప్తి సంపన్నులుగా అవ్వండి. ‘‘పొందాల్సినదంతా పొందేసాను’’ అనే పాటను సదా పాడుతూ ఉండండి. పోగొట్టుకున్నాను-పొందాను, పోగొట్టుకున్నాను-పొందాను అనే ఆటను ఆడుతూ ఉండకండి. పొందుతున్నాను, పొందుతున్నాను అనే మాటలు అధికారులు మాట్లాడే మాటలు కావు. ఎవరైతే సంపన్నమైన తండ్రికి పిల్లలుగా ఉన్నారో, సాగరుని పిల్లలుగా ఉన్నారో, వారు నౌకర్ల వలె శ్రమ పడజాలరు.
స్లోగన్:-
మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు – ‘‘రాజఋషులు సత్యయుగానికి చెందినవారు’’
ద్వాపరంలో రాజఋషులు ఉండేవారని, వారు త్రికాలదర్శులు అయిన కారణంగా కూర్చొని వేద-శాస్త్రాలను రచించారని మనుష్యులు అంటూ ఉంటారు. ఇప్పుడు వాస్తవానికి రాజఋషులని మనం సత్యయుగంలోనే అనగలము, ఎందుకంటే అక్కడ వికారాలను పూర్తిగా జయించి ఉన్నారు అనగా కమల పుష్ప సమానంగా జీవన్ముక్త అవస్థలో ఉంటూ రాజ్యాన్ని నడిపిస్తారు. ఇకపోతే, ద్వాపరంలో పరమాత్మను ప్రాప్తించుకునేందుకు తపస్సు చేసే ఋషులు ఎవరైతే ఉంటారో, వారు వేద-శాస్త్రాలను రచించారు. సత్యయుగంలోనైతే వేద-శాస్త్రాల అవసరమే ఉండదు, అలాగే వారిని త్రికాలదర్శులని కూడా అనలేము. మనం బ్రహ్మా, విష్ణు, శంకరులనే త్రికాలదర్శులని అనలేము అన్నప్పుడు ద్వాపర యుగానికి చెందిన రజోగుణీ సమయంలోని ఋషులు, మునులు త్రికాలదర్శులుగా ఎలా అవ్వగలరు. త్రికాలదర్శి అనగా త్రిమూర్తి, త్రినేత్రి అని కేవలం ఒక్క పరమాత్మ శివుడిని మాత్రమే అనగలము, వారు స్వయంగా ఈ కల్పం యొక్క అంతిమ సమయంలో వచ్చి, మొత్తం రచనను సమాప్తం చేస్తారు. అక్కడ సత్యయుగంలో పారబ్ధాన్ని అనుభవిస్తారు. బ్రహ్మా వంశీ బ్రాహ్మణులైన మనం మాత్రమే మాస్టర్ త్రినేత్రులుగా, త్రికాలదర్శులుగా తయారవుతాము అనే జ్ఞానం అక్కడ ఉండదు. ఇకపోతే, మొత్తం కల్పంలో ఇంకెవ్వరికీ జ్ఞానం లభించదు. దేవతలను గాని, మనుష్యులను గాని త్రికాలదర్శులని అనలేము. అచ్ఛా – ఓం శాంతి.
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!