28 May 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

May 27, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - మీ ప్రేమ ఆత్మ పట్ల ఉండాలి, నడుస్తూ-తిరుగుతూ అభ్యాసం చేయండి, నేను ఆత్మను, ఆత్మతో మాట్లాడుతున్నాను, నేను ఎటువంటి చెడు కర్మను చేయకూడదు’’

ప్రశ్న: -

తండ్రి ద్వారా రచించబడిన యజ్ఞం ఎప్పటివరకైతే నడుస్తుందో, అప్పటివరకు బ్రాహ్మణులు తండ్రి యొక్క ఏ ఆజ్ఞను తప్పకుండా పాలన చేయాలి?

జవాబు:-

తండ్రి ఆజ్ఞ ఏమిటంటే – పిల్లలూ, ఎప్పటివరకైతే ఈ రుద్ర యజ్ఞం నడుస్తుందో, అప్పటివరకు మీరు పవిత్రంగా తప్పకుండా ఉండాలి. మీరు బ్రహ్మా యొక్క పిల్లలు, బ్రహ్మాకుమారులు-కుమారీలు ఎప్పుడూ వికారాల్లోకి వెళ్ళలేరు. ఒకవేళ ఎవరైనా ఈ ఆజ్ఞను ఉల్లంఘించినట్లయితే చాలా కఠినమైన శిక్షకు పాత్రులుగా అవుతారు. ఒకవేళ ఎవరిలోనైనా క్రోధం యొక్క భూతం ఉన్నా కూడా, వారు బ్రాహ్మణులు కారు. బ్రాహ్మణులు దేహీ-అభిమానులుగా ఉండాలి, ఎప్పుడూ వికారాలకు వశీభూతులుగా అవ్వకూడదు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఓ దూరపు బాటసారి… (ఓ దూర్ కే ముసాఫిర్…)

ఓంశాంతి. దూరపు బాటసారి గురించి బ్రాహ్మణులైన మీకు తప్ప మనుష్యమాత్రులెవ్వరికీ తెలియదు. ఓ పరంధామంలో నివసించే పరమపిత పరమాత్మా రండి, అని పిలుస్తారు. తండ్రి అని అంటారు, కానీ ఆ తండ్రి రూపమేమిటి అన్నది వారి బుద్ధిలోకి రాదు. ఆత్మ అనగా ఏమిటి? ఆత్మ భృకుటి మధ్యలో సితార వలె ఉంటుందని అనుకుంటారు. కేవలం అంతే, ఇంకేమీ తెలియదు. మన ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఈ విషయాల గురించిన జ్ఞానము ఏ మాత్రము లేదు. ఆత్మ ఈ శరీరంలో ఎలా ప్రవేశిస్తుంది, ఈ విషయం కూడా తెలియదు. ఎప్పుడైతే లోపల కదలిక జరుగుతుందో, అప్పుడు ఆత్మ ప్రవేశించిందని తెలుస్తుంది. ఇంకా, ఎప్పుడైతే పరమపిత పరమాత్మ అని అంటారో, అప్పుడు ఆత్మనే పిత అని అంటుంది. ఆత్మకు తెలుసు, ఈ శరీరం లౌకిక తండ్రి ద్వారా లభించినది. మన తండ్రి అయితే ఆ నిరాకారుడు. తప్పకుండా మన తండ్రి కూడా మన వలె బిందు స్వరూపులుగా ఉంటారు. వారి మహిమను కూడా ఏమని పాడుతారంటే – మనుష్య సృష్టికి బీజరూపుడు, జ్ఞానసాగరుడు, పతితపావనుడు. కానీ ఎంత పెద్దగా లేక చిన్నగా ఉంటారు అనేది అందరి బుద్ధిలోనూ కూర్చోదు. మన ఆత్మ అంటే ఏమిటి అన్నది మొదట మీ బుద్ధిలో కూడా ఉండేది కాదు. ఓ పరమపిత… అని అంటూ పరమాత్మను స్మృతి అయితే చేసేవారు కానీ ఏమీ తెలిసేది కాదు. తండ్రి అయితే నిరాకారుడు, మరి వారు పతిత-పావనుడిగా ఎలా అవుతారు. ఏం ఇంద్రజాలం చేస్తారు? పతితులను పావనంగా చేయడానికి తప్పకుండా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఏ విధంగానైతే మన ఆత్మ కూడా శరీరంలో ఉంటుందో, అదే విధంగా తండ్రి కూడా నిరాకారుడు, వారికి కూడా తప్పకుండా శరీరంలోకి రావలసి ఉంటుంది, అందుకే శివరాత్రిని లేక శివ జయంతిని జరుపుకుంటారు. కానీ వారు వచ్చి పావనంగా ఎలా చేస్తారు, ఇది ఎవ్వరికీ తెలియదు, అందుకే సర్వవ్యాపి అని అంటారు. ప్రదర్శనీలో లేక ఎక్కడికైనా భాషణ మొదలైనవి చేయడానికి వెళ్ళినప్పుడు మొట్టమొదట తండ్రి పరిచయాన్నే ఇవ్వాలి, ఆ తర్వాత ఆత్మ పరిచయము. ఆత్మ అయితే భృకుటి మధ్యన ఉంటుంది. ఆత్మలోనే మొత్తం సంస్కారాలన్నీ ఉంటాయి. శరీరమైతే సమాప్తమైపోతుంది. ఏమి చేసినా సరే, అది ఆత్మనే చేస్తుంది. శరీరం యొక్క ఇంద్రియాలు ఆత్మ ఆధారంగానే నడుస్తాయి. ఆత్మ రాత్రివేళ అశరీరిగా అవుతుంది. ఆత్మనే అంటుంది – ఈ రోజు నేను చాలా బాగా విశ్రాంతి తీసుకున్నాను, ఈ రోజు నాకు విశ్రాంతి లభించలేదు, నేను ఈ శరీరం ద్వారా ఈ వ్యాపారం చేస్తున్నాను. ఈ విధంగా పిల్లలైన మీకు అలవాటైపోవాలి. ఆత్మనే అంతా చేస్తుంది. ఆత్మ శరీరం నుండి బయటకు వెళ్ళిపోతే దానిని శవము అని అంటారు. ఇక అది దేనికీ పనికిరాదు. ఆత్మ బయటకు వెళ్ళిపోవడంతో శరీరం నుండి దుర్గంధం వస్తుంది. శరీరాన్ని తీసుకువెళ్ళి కాలుస్తారు. కావున మీకు ఆత్మ పట్లనే ప్రేమ ఉంది. పిల్లలైన మీకు, నేను ఆత్మను అన్న శుద్ధ అభిమానం ఉండాలి. పూర్తిగా ఆత్మాభిమానిగా అవ్వాలి. శ్రమ అంతా ఇందులోనే ఉంది. ఆత్మనైన నేను ఈ ఇంద్రియాల ద్వారా ఎటువంటి చెడు కర్మను చేయకూడదు లేదంటే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మకు శరీరం ఉంటుందో, అప్పుడే భోగమును అనుభవించడం జరుగుతుంది. శరీరం లేకుండా ఆత్మ దుఃఖాన్ని అనుభవించలేదు. కావున మొదట ఆత్మాభిమానులుగా అయి, ఆ తర్వాత పరమాత్మ అభిమానులుగా అవ్వాలి. నేను పరమపిత పరమాత్ముని సంతానాన్ని. పరమాత్మ మనకు జన్మనిచ్చారు అని అంటారు కూడా. వారు రచయిత, కానీ వారు రచయితగా ఎలా అవుతారు, ఇది ఎవ్వరికీ తెలియదు. పరమపిత పరమాత్మ పాత ప్రపంచంలో ఉంటూ కొత్త ప్రపంచాన్ని ఎలా స్థాపన చేస్తారు అనేది ఇప్పుడు మీకు తెలుసు. ఇది ఎటువంటి యుక్తినో చూడండి. వారేమో ప్రళయాన్ని చూపించారు. రావి ఆకుపై ఒక బాలుడు వచ్చారని అంటారు, కానీ బాలికనైతే చూపించరు. దీనినే అజ్ఞానమని అంటారు. భగవంతుడు శాస్త్రాలను తయారుచేసారని అంటారు. వ్యాసుడు భగవంతుడు కాలేరు. భగవంతుడు కూర్చుని శాస్త్రాలను రాస్తారా ఏమిటి? వారు అన్ని శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారని వారి కోసం చెప్తూ ఉంటారు. ఇకపోతే, ఈ వేద శాస్త్రాలను చదవడంతో ఎవరి కళ్యాణము జరగజాలదు. బ్రహ్మ జ్ఞానులు ఉన్నారనుకోండి, బ్రహ్మములో లీనమైపోతామని భావిస్తారు. బ్రహ్మమైతే మహాతత్వము. ఆత్మలు అక్కడ నివసిస్తాయి. ఈ విషయం తెలియని కారణంగా ఏది తోస్తే అది మాట్లాడుతూ ఉంటారు మరియు మనుష్యులు కూడా సత్యం-సత్యం అని అంటూ ఉంటారు. చాలామంది హఠయోగాలు, ప్రాణాయామము మొదలైనవి చేస్తారు, మీరైతే చేయలేరు. నాజూకుగా ఉండే కన్యలు, మాతలైన మీకు ఏం కష్టం ఇస్తారు. ఇంతకుముందు మాతలైతే లౌకిక చదువును కూడా చదువుకునేవారు కాదు. ఏదో కొద్దిగా భాష నేర్చుకునేందుకు స్కూలుకు పంపించేవారు. ఇకపోతే, ఉద్యోగమైతే చేసేది లేదు. ఇప్పుడైతే మాతలకు చదువుకోవాల్సి వస్తుంది. సంపాదించేవారు లేకపోతే తమ కాళ్ళపై తాము నిలబడగలిగేందుకు, యాచించాల్సిన అవసరం లేకుండా ఉండేందుకు చదువుకోవాల్సి వస్తుంది. లేదంటే నియమానుసారంగా కుమార్తెలకు ఇంటి పని నేర్పించడం జరుగుతుంది. ఇప్పుడైతే బ్యారిస్టరీ, డాక్టరీ మొదలైనవన్నీ నేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడైతే మీకు ఇంకేమీ చేయాల్సిన అవసరం ఉండదు, కేవలం మొట్టమొదట ఎవరికైనా తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. నిరాకారుడినైతే అందరూ శివబాబా అని అంటారు, కానీ వారి రూపమేమిటి, ఇది ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మమైతే తత్వము. ఏ విధంగానైతే ఈ ఆకాశం ఎంత పెద్దగా ఉంది. దీని అంతాన్ని పొందలేరు. అదే విధంగా బ్రహ్మ తత్వానికి కూడా అంతం లేదు. దాని అంశమాత్రములో ఆత్మలమైన మనం ఉంటాము. మిగిలినదంతా అనంతమైన ఆకాశమే. సాగరము కూడా అపారమైనది, ఎంతగా వెళ్ళినా ఉంటూనే ఉంటుంది. ఆకాశం యొక్క అంతాన్ని కూడా పొందలేరు. పైకి వెళ్ళేందుకు ప్రయత్నిస్తారు కానీ వెళ్తూ-వెళ్తూ వారి సామానంతా తరిగిపోతుంది. అదే విధంగా మహాతత్వము కూడా చాలా పెద్దగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఏమీ వెతకాల్సిన అవసరం లేదు. అక్కడ ఆత్మలకు ఈ సంకల్పం చేయాల్సిన అవసరం కూడా ఉండదు. వెతకడం వలన వచ్చే లాభమేముంటుంది. నక్షత్రాలలోకి వెళ్ళి ప్రపంచాన్ని వెతికారనుకోండి, కానీ దాని వలన లాభమేముంటుంది? అక్కడ తండ్రిని పొందే మార్గమేమీ ఉండదు. భక్తులు భగవంతుడిని పొందేందుకు భక్తి చేస్తారు. కనుక వారికి భగవంతుడు లభిస్తారు. వారు ముక్తి-జీవన్ముక్తులనిస్తారు. భగవంతుడిని వెతకాల్సి ఉంటుంది, అంతేకానీ, ఆకాశాన్ని కాదు. దాని నుండి ఏమీ లభించదు. గవర్నమెంట్ ఎంత ఖర్చు చేస్తుంది. ఇది కూడా ఆల్మైటీ గవర్నమెంట్. పాండవులు మరియు కౌరవులు, ఇరువురికీ కిరీటాలను చూపించరు. తండ్రి వచ్చి మీకు అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. మీరు ఇంత జ్ఞానాన్ని పొందుతున్నప్పుడు మీరు చాలా సంతోషంగా ఉండాలి. మనల్ని చదివించేవారు అనంతమైన తండ్రి. మీ ఆత్మ అంటుంది – మేమే మొదట దేవీ-దేవతలుగా ఉండేవారము. చాలా సుఖమయంగా ఉండేవారము. పుణ్యాత్ములుగా ఉండేవారము. ఈ సమయంలో మేము పాపాత్ములుగా అయ్యాము ఎందుకంటే ఇది రావణ రాజ్యము. వీరు రావణుని మతముపై ఉన్నారు. మీరు ఈశ్వరీయ మతముపై ఉన్నారు. రావణుడు కూడా గుప్తంగా ఉన్నాడు, అలాగే ఈశ్వరుడు కూడా గుప్తంగా ఉన్నారు. ఇప్పుడు ఈశ్వరుడు మీకు మతాన్ని ఇస్తున్నారు. రావణుడు మతాన్ని ఎలా ఇస్తాడు? రావణుడికైతే ఏ రూపము లేదు. వీరైతే రూపాన్ని ధరిస్తారు. రావణుడికైతే అన్ని రూపాలూ ఉన్నాయి. మీకు తెలుసు, మన ఆత్మలో 5 వికారాలు ఉన్నాయి. మనం ఆసురీ మతంపై నడుస్తున్నాము. స్త్రీ-పురుషులు ఇరువురిలోనూ 5 వికారాలు ఉన్నాయి. మనల్ని చదివించేవారు నిరాకార పరమపిత పరమాత్మ అని ఎప్పుడైతే వారు తెలుసుకుంటారో, అప్పుడే ఈ విషయాలన్నీ మనుష్యుల బుద్ధిలో కూర్చుంటాయి. పరమాత్మ నిరాకారుడు. ఎప్పుడైతే వారు సాకారంలోకి వస్తారో, అప్పుడే మనం బ్రాహ్మణులుగా అవుతాము. తండ్రి కూడా రాత్రి వేళలోనే వస్తారు. శివరాత్రియే బ్రహ్మా రాత్రిగా అయ్యింది. బ్రహ్మా ద్వారానే బ్రాహ్మణులుగా అవుతారు. యజ్ఞంలో బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. బ్రాహ్మణులకు ఎప్పటివరకైతే యజ్ఞాన్ని సంభాళించవలసి ఉంటుందో, అప్పటివరకు పవిత్రంగా ఉండాలి. దైహిక బ్రాహ్మణులు కూడా యజ్ఞాన్ని రచించినప్పుడు వికారాల్లోకి వెళ్ళరు. వారు వికారులే, కానీ యజ్ఞాన్ని రచించే సమయంలో వికారాల్లోకి వెళ్ళరు. ఏ విధంగానైతే తీర్థ యాత్రలకు వెళ్తారు, అప్పుడు, ఎప్పటివరకైతే తీర్థయాత్రలలో ఉంటారో, అప్పటివరకు వికారాల్లోకి వెళ్ళరు. బ్రాహ్మణులైన మీరు కూడా యజ్ఞంలో ఉంటారు, మళ్ళీ ఒకవేళ ఎవరైనా వికారాల్లోకి వెళ్తే చాలా పాపాత్ములుగా అవుతారు. యజ్ఞము నడుస్తూ ఉంది కావున అంతిమం వరకు మీరు పవిత్రంగా ఉండాలి. బ్రహ్మా పిల్లలైన బ్రహ్మాకుమార-కుమారీలు ఎప్పుడూ వికారాల్లోకి వెళ్ళలేరు. తండ్రి ఆజ్ఞాపించారు – మీరెప్పుడూ వికారాల్లోకి వెళ్ళకండి. లేదంటే చాలా శిక్షకు పాత్రులవుతారు. వికారాల్లోకి వెళ్ళారంటే, ఇక సర్వనాశనమైనట్లు. అటువంటివారు బ్రహ్మాకుమారులు-కుమారీలు కాదు, కానీ శూద్రులు, మలినమైనవారు. బాబా ఎప్పుడూ అడుగుతూ ఉంటారు – మీరు పవిత్రంగా ఉంటానని ప్రతిజ్ఞ చేసారు. ఒకవేళ తండ్రికి ప్రతిజ్ఞ చేసి బ్రాహ్మణులుగా అయి మళ్ళీ వికారాల్లోకి వెళ్ళారంటే చండాలుని జన్మను పొందుతారు. ఇక్కడైతే వేశ్య వంటి అశుద్ధమైన జన్మ ఇంకేదీ ఉండదు. ఇది ఉన్నదే వేశ్యాలయము. ఇరువురు ఒకరికొకరు విషాన్ని తాగించుకుంటూ ఉంటారు. బాబా అంటారు, మాయ ఎన్ని సంకల్పాలను తీసుకొచ్చినా కానీ వివస్త్రగా అవ్వకూడదు. చాలామంది అయితే బలవంతంగా కూడా వివస్త్రగా చేస్తారు. కుమార్తెలకు శక్తి తక్కువగా ఉంటుంది. పవిత్రతతో పాటు నడవడిక కూడా చాలా బాగుండాలి. నడవడిక చెడుగా ఉంటే వారు కూడా ఎందుకూ పనికిరారు. లౌకిక తల్లిదండ్రులలో వికారాలు ఉన్నట్లయితే పిల్లలు కూడా తల్లిదండ్రుల నుండే నేర్చుకుంటారు. పారలౌకిక తండ్రి అయితే మీకు ఈ శిక్షణనివ్వరు. తండ్రి అయితే దేహీ-అభిమానులుగా తయారుచేస్తారు. ఎప్పుడూ క్రోధం చేయకండి. ఆ సమయంలో మీరు బ్రాహ్మణులు కాదు, చండాలులు ఎందుకంటే క్రోధమనే భూతము ఉంది. భూతాలు మనుష్యులకు దుఃఖాన్ని ఇస్తాయి. తండ్రి అంటారు, బ్రాహ్మణులుగా అయి ఎటువంటి ఆసురీ పనులు చేయకూడదు. వికారాల్లోకి వెళ్ళడంతో మీరు యజ్ఞాన్ని అపవిత్రంగా చేస్తారు, ఇందులో చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. బ్రాహ్మణులుగా అవ్వడము పిన్నమ్మ ఇంటికి వెళ్ళడము వంటిదేమీ కాదు. యజ్ఞంలో ఎటువంటి అశుద్ధమైన పనులు చేయకూడదు. 5 వికారాల్లో ఏ వికారమూ ఉండకూడదు. అంతేకానీ, క్రోధం చేస్తే ఫర్వాలేదని భావించడం కాదు. ఈ భూతం వచ్చిందంటే మీరు బ్రాహ్మణులు కాదు. ఈ గమ్యము చాలా ఉన్నతమైనదని కొంతమంది అంటారు. నడవలేకపోతే వెళ్ళి అశుద్ధంగా అవ్వండి. ఈ జ్ఞానంలోనైతే సదా పవిత్రంగా, హర్షితంగా ఉండాల్సి ఉంటుంది. పతిత-పావనుడైన తండ్రికి పిల్లలుగా అయ్యి తండ్రికి సహాయాన్ని అందించాలి. ఏ వికారమూ ఉండకూడదు. కొంతమంది అయితే రావడంతోనే వెంటనే వికారాలను విడిచిపెట్టేస్తారు. ఏమని భావించాలంటే, నేను రుద్ర జ్ఞాన యజ్ఞం యొక్క బ్రాహ్మణుడిని. మనసు తినేటువంటి పనులేవీ నా ద్వారా జరగకూడదు. నేను యోగ్యునిగా ఉన్నానా? అని మనసు రూపీ దర్పణంలో చూసుకోవాలి. భారత్ ను పవిత్రంగా చేయడానికి మనం నిమిత్తులము కనుక యోగంలో కూడా తప్పకుండా ఉండాలి. సన్యాసులు కేవలం పవిత్రంగా అవుతారు, తండ్రి గురించైతే తెలియనే తెలియదు. హఠయోగాలు మొదలైనవి చాలా చేస్తారు. కానీ ఏమీ పొందరు. శాంతిధామానికి తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారని మీకు తెలుసు. ఆత్మలమైన మనము అక్కడి నివాసులము. మనం సుఖధామంలో ఉండేవారము, ఇప్పుడు దుఃఖధామంలో ఉన్నాము. ఇప్పుడిది సంగమము. ఈ స్మరణ నడుస్తూ ఉన్నా కూడా సదా హర్షితంగా ఉంటారు. (బెంగుళూరుకు చెందిన) ఈ అంగనా బిడ్డను చూడండి, వీరు సదా హర్షితంగా ఉంటారు. బాబా అని అనడంతోనే సంతోషంతో నిండుగా అయిపోతారు. నేను బాబా బిడ్డను అన్న సంతోషం వీరికి ఉంటుంది. ఎవరు కలిసినా సరే వారికి జ్ఞానాన్ని ఇస్తూ ఉండండి. అయితే కొంతమంది వేళాకోళం కూడా చేస్తారు ఎందుకంటే ఇది కొత్త విషయము. భగవంతుడు వచ్చి చదివిస్తారు అన్న విషయం ఎవ్వరికీ తెలియదు. కృష్ణుడైతే ఎప్పుడూ వచ్చి చదివించరు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. రుద్ర జ్ఞాన యజ్ఞం యొక్క బ్రాహ్మణులుగా అయ్యి మనసు తినేటువంటి కర్మలేవీ చేయకూడదు. ఏ భూతానికి వశమవ్వకూడదు.

2. పతిత-పావనుడైన తండ్రికి పూర్తి సహాయకులుగా అయ్యేందుకు సదా పవిత్రంగా మరియు హర్షితంగా ఉండాలి. జ్ఞానం యొక్క స్మరణ చేస్తూ హర్షితంగా ఉండాలి.

వరదానము:-

ఎవరైతే స్వయంతో, సేవతో మరియు సర్వులతో సంతుష్టంగా ఉంటారో, వారిని సంతుష్టమణి అని అంటారు. తపస్య ద్వారా సంతుష్టత రూపీ ఫలాన్ని ప్రాప్తి చేసుకోవడము – ఇదే తపస్య యొక్క సిద్ధి. ఎవరి చిత్తమైతే సదా ప్రసన్నంగా ఉంటుందో, వారే సంతుష్టమణి. ప్రసన్నత అనగా మనసు-బుద్ధి సదా విశ్రామముగా, సుఖ-శాంతుల స్థితిలో ఉండాలి. ఇటువంటి సంతుష్టమణులు స్వయాన్ని సర్వుల ఆశీర్వాదాల విమానంలో ఎగురుతూ ఉన్నట్లుగా అనుభవం చేస్తారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top