28 June 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

June 27, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతో మాట్లాడినట్లయితే పుష్పంలో సుగంధం నిండుతూ ఉంటుంది, దేహాభిమానమనే దుర్గంధం తొలగిపోతుంది”

ప్రశ్న: -

తమ సుగంధాన్ని నలువైపులా వ్యాపింపజేసే సత్యమైన పుష్పాలు లేక దీపపు పురుగులు ఎవరు?

జవాబు:-

ఎవరైతే అనేకులను తమ సమానంగా సుగంధభరితమైన పుష్పాలుగా తయారుచేస్తారో, వారే సత్యమైన పుష్పాలు. శ్రీమతాన్ని అనుసరిస్తూ దీపంపై బలిహారమై మరణించేటువంటి అనగా పూర్తిగా బలిహారమయ్యేటువంటి, జీవిస్తూ మరణించేటువంటి సత్యమైన దీపపు పురుగుల సుగంధం లేక ఇటువంటి పుష్పాల సుగంధం స్వతహాగానే నలువైపులా వ్యాపిస్తుంది.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

సభలో దీపం వెలిగింది….. (మహఫిల్ మే జల్ ఉఠీ షమా…..)

ఓంశాంతి. దీపపు పురుగులు పాట విన్నారు. దీపపు పురుగులు అన్నా లేక పుష్పాలు అన్నా విషయం ఒక్కటే. మేము నిజంగా దీపపు పురుగులుగా అయ్యామా లేక కేవలం దీపం చుట్టూ తిరిగి వెళ్ళిపోయి దీపాన్ని మర్చిపోయేవారిమా అనేది పిల్లలు అర్థం చేసుకోగలరు. ప్రతి ఒక్కరు తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి – మేము ఎంతవరకు పుష్పాలుగా అయ్యాము మరియు ఎంతవరకు జ్ఞాన సుగంధాన్ని వ్యాపింపజేస్తున్నాము? ఎవరినైనా తమ వంటి పుష్పంలా తయారుచేసామా? తండ్రి జ్ఞాన సాగరుడని, వారి సుగంధం ఎంత ఉంటుందని పిల్లలకు తెలుసు. ఎవరైతే మంచి పుష్పాలు లేక దీపపు పురుగులు ఉన్నారో, వారి నుండి తప్పకుండా మంచి సుగంధం వస్తుంది. వారు సదా సంతోషంగా ఉంటారు, ఇతరులను కూడా తమ సమానంగా పుష్పాలుగా లేక దీపపు పురుగులుగా తయారుచేస్తారు. పుష్పలుగా కాకపోతే మొగ్గలగానైనా తయారుచేస్తారు. ఎవరైతే జీవిస్తూ మరణిస్తారో, బలిహారమవుతారో అనగా ఈశ్వరీయ సంతానంగా అవుతారో, వారే పూర్తి దీపపు పురుగులు. ఎవరైనా షావుకారు, పేదవారి బిడ్డను దత్తత తీసుకుంటే, ఆ షావుకారు ఒడిలోకి వచ్చిన తర్వాత ఆ బిడ్డకు ఆ తల్లిదండ్రులే గుర్తుకొస్తూ ఉంటారు, పేద తల్లిదండ్రులను మర్చిపోతాడు. నా మునపటి తల్లిదండ్రులు పేదవారని బిడ్డకు తెలుసు కానీ గుర్తు చేయడమైతే షావుకారు తల్లిదండ్రులనే గుర్తు చేస్తాడు, వారి నుండి ధనం లభిస్తుంది. సాధు సన్యాసులు మొదలైనవారు ముక్తిధామానికి వెళ్ళాలని సాధన చేస్తారు. అందరూ ముక్తి కోసమే పురుషార్థం చేస్తారు కానీ ముక్తి యొక్క అర్థం తెలియదు. కొంతమంది జ్యోతి జ్యోతిలో లీనమైపోతుందని అంటారు. కొంతమంది నిర్వాణధామానికి వెళ్ళిపోతుందని భావిస్తారు. నిర్వాణధామానికి వెళ్ళడాన్ని జ్యోతిలో లీనమైపోవడమని లేక కలిసిపోవడమని అనరు. మేము దూరదేశ నివాసులమని మీరు భావిస్తారు. ఈ అశుద్ధ ప్రపంచంలో ఉండి ఏమి చేస్తారు? తండ్రి పిల్లలకు అర్థం చేయించారు – మీరు ఎవరినైనా కలిసినప్పుడు, ఇది తయారై తయారవుతున్న డ్రామా అని అర్థం చేయించాల్సి ఉంటుంది. సత్యయుగం, త్రేతా….. అలా సంగమయుగం వస్తుంది. సత్యయుగానికి త్రేతాకు మధ్యన సంగమం ఉంటుందని కూడా అర్థం చేయించారు. అది యుగం మారడము మరియు ఇది కల్పము మారడము. తండ్రి, మనుష్యులు భావించినట్లుగా ప్రతి యుగంలోనూ రారు. తండ్రి అంటారు – అందరూ తమోప్రధానంగా అయినప్పుడు, కలియుగం యొక్క అంతం వచ్చినప్పుడు, కల్పం యొక్క ఆ సంగమంలో వస్తాను. యుగం పూర్తి అయినప్పుడు కళలు తగ్గుతాయి. అయితే, పూర్తి గ్రహణం పట్టినప్పుడు నేను వస్తాను. నేను ప్రతి యుగంలోనూ రాను. ఈ విషయాలను తండ్రి కూర్చొని దీపపు పురుగులకు అర్థం చేయిస్తారు. దీపపు పురుగులలో కూడా నంబరువారుగా ఉన్నారు. కొన్ని బలిహారమై మరణిస్తాయి, కొన్ని చుట్టూ తిరిగి వెళ్ళిపోతాయి. మీరు మాత్రమే శ్రీమతాన్ని అనుసరించగలరు. ఒకవేళ ఎక్కడైనా శ్రీమతాన్ని అనుసరించకపోతే, మాయ కింద పడేస్తూ ఉంటుంది. శ్రీమతానికి చాలా మహిమ ఉంది. శ్రీమత్ భగవద్గీత అని అంటారు. ఎవరైతే తర్వాత కూర్చొని శాస్త్రాలను తయారుచేసారో, ఆ సమయంలో వారి బుద్ధి రజోగా ఉన్న కారణంగా కృష్ణుడు ద్వాపరంలో వచ్చారని అనుకున్నారు. ఎప్పుడైతే ఆది సనాతన దేవీదేవతా ధర్మం ప్రాయః లోపమైపోతుందో, అప్పుడు నేను వస్తాను. అప్పటికి మిగిలిన ధర్మాలన్నీ ఉంటాయి. అలాగని దేవతా ధర్మానికి చెందిన మనుష్యులు మాయమైపోతారని కాదు, కానీ వారు మేము దేవీ దేవతా ధర్మానికి చెందినవారమని మర్చిపోతారు. అప్పుడు తమది హిందూ ధర్మమని చెప్పుకుంటారు, ఇది కూడా డ్రామాలో నిశ్చియించబడి ఉంది. వారు మర్చిపోయినప్పుడే కదా నేను మళ్ళీ వచ్చి దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను. ఒక్క తండ్రి మాత్రమే వచ్చి, దుఃఖధామం నుండి సుఖధామానికి యజమానులుగా తయారుచేస్తారు. ఇప్పుడు మేము నరకానికి యజమానులుగా ఉన్నామని మీరంటారు. ప్రపంచమైతే తమోప్రధానంగా అవ్వాల్సిందే. అందరూ పతితంగా ఉన్నారు కావుననే పావనంగా ఉన్నవారి ఎదురుగా వెళ్ళి నమస్కరిస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు – శ్రీమతాన్ని అనుసరించండి, జన్మ-జన్మల భారం తలపై చాలా ఉంది, లేదంటే త్రాహి-త్రాహి అనవలసి ఉంటుంది (దుఃఖంతో రక్షించమని అలమటిస్తారు). వారు ఆత్మ నిర్లేపి అని భావిస్తారు కానీ నిర్లేపి కాదు, ఆత్మయే సుఖ-దుఃఖాలను అనుభవిస్తుంది. ఇది ఎవరూ అర్థం చేసుకోరు. ఇది చాలా భారీ గమ్యమని బాబా పదే-పదే అర్థం చేయిస్తారు. మీరు దుఃఖితులుగా ఉన్నారు కావున ఈ సమయంలో పురుషార్థం చేస్తారు. సత్యయుగంలో మీరు చాలా సుఖంగా ఉంటారని మీకు తెలుసు. మేము మళ్ళీ దుఃఖధామానికి వెళ్ళాలి అనేది అక్కడ తెలియదు. మేము సుఖంలోకి ఎలా వచ్చాము, ఎన్ని జన్మలు తీసుకుంటాము అనేదేమీ అక్కడ తెలియదు. ఇప్పుడు మీకు తెలుసు, కనుక ఉన్నతమైనవారు ఎవరు? మీరు ఈశ్వరుని సంతానమైన కారణంగా, ఈశ్వరుడు ఎలాగైతే నాలెడ్జ్ ఫుల్ గా ఉన్నారో, అలాగే మీరు కూడా నాలెడ్జ్ ఫుల్ గా ఉంటారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానము కానీ నంబరువారుగా ఉంటారు. కొంతమందైతే చాలా ఆనందంగా ఉన్నారు, మేము బాబా మతాన్ని అనుసరిస్తున్నామని భావిస్తారు. వారి మతాన్ని ఎంతగా అనుసరిస్తారో, అంత శ్రేష్ఠంగా అవుతారు. తండ్రి సమ్ముఖంగా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు – పిల్లలూ, దేహాభిమానాన్ని వదలండి, దేహీ-అభిమానులుగా అవ్వండి, నిరంతరం స్మృతి చేయండి. తండ్రి అయితే సదా సుఖదాత. దుఃఖం కూడా తండ్రియే ఇస్తారని కాదు. తండ్రి ఎప్పుడూ పిల్లలకు దుఃఖమునివ్వరు. పిల్లలు తమ తప్పుడు నడవడిక వలన దుఃఖం పొందుతారు. తండ్రి దుఃఖం ఇవ్వలేరు. ఓ భగవంతుడా, కొడుకును ప్రసాదించండి, అప్పుడు మా కులం వృద్ధి చెందుతుంది అని అంటారు. కొడుకులను చాలా ప్రేమిస్తారు. ఇకపోతే, దుఃఖమనేది తమ కర్మల అనుసారంగానే పొందుతారు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మిమ్మల్ని చాలా సుఖమయంగా చేస్తారు. శ్రీమతాన్ని అనుసరించండి అని చెప్తారు. ఆసురీ మతాన్ని అనుసరించడంతో మీరు దుఃఖం పొందుతారు. పిల్లలు, తండ్రి లేక టీచరు లేక పెద్దల ఆజ్ఞను పాటించకపోవడంతో దుఃఖితులుగా అవుతారు. స్వయం దుఃఖితులు అవుతారు, మాయకు చెందినవారిగా అయిపోతారు. మీకు ఈశ్వరీయ మతం ఇప్పుడు మాత్రమే లభిస్తుంది. ఈశ్వరీయ మతం యొక్క రిజల్టు 21 జన్మల వరకు కొనసాగుతుంది, తర్వాత అర్ధకల్పం మాయ మతంపై నడుస్తారు. ఈశ్వరుడు ఒక్కసారి మాత్రమే వచ్చి మతాన్నిస్తారు. మాయ అయితే అర్ధకల్పం నుండి మతాన్ని ఇస్తూనే ఉంటుంది. తండ్రి ఒక్కసారి మాత్రమే మతాన్నిస్తారు. మాయ మతాన్ని అనుసరిస్తూ 100 శాతం దుర్భాగ్యశాలిగా అయిపోతారు. మంచి-మంచి పుష్పాలు ఎవరైతే ఉంటారో, వారు ఆ సంతోషంలోనే సదా నిమగ్నమై ఉంటారు. నంబరువారుగా ఉన్నారు కదా. కొన్ని దీపపు పురుగులు తండ్రికి చెందినవారిగా అయ్యి శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉంటారు. పేదవారే తమ లెక్కాపత్రాన్ని రాస్తారు. షావుకార్లకు, ఇక్కడ మా ధనం తీసేసుకుంటారేమోనని భయమనిపిస్తుంది. షావుకార్లకు ఇది చాలా కష్టము. తండ్రి అంటారు – నేను పేదల పెన్నిధిని. దానం కూడా సదా పేదలకే ఇవ్వడం జరుగుతుంది. సుదాముని విషయముంది కదా – పిడికెడు బియ్యం తీసుకొని అతనికి మహల్ ఇచ్చారు. మీరు పేదవారు. ఎవరి వద్దనైనా 25-50 రూపాయలు ఉన్నాయనుకోండి, అందులో నుండి 20-25 పైసలు ఇస్తారు. షావుకార్లు 50 వేలు ఇచ్చినా కూడా అది ఈ ధనానికి సమానమవుతుంది. అందుకే పేదల పెన్నిధి అనే పేరు గాయనం చేయబడింది. షావుకార్లు, మాకు తీరిక లభించడం లేదని అంటారు ఎందుకంటే వారికి పూర్తి నిశ్చయం లేదు. మీరు పేదవారు. పేదవారికి ధనం లభిస్తే సంతోషం కలుగుతుంది. ఇక్కడి పేదవారు అక్కడ షావుకార్లుగా అవుతారని మరియు ఇక్కడి షావుకార్లు అక్కడ పేదవారిగా అవుతారని బాబా అర్థం చేయించారు.

మేము యజ్ఞాన్ని చూసుకోవాలా లేక కుటుంబాన్ని చూసుకోవాలా అని చాలామంది అడుగుతారు. బాబా అంటారు – మీరు మీ కుటుంబాన్ని చాలా బాగా చూసుకోండి. ఈ సమయంలో మీరు పేదవారిగా అవ్వడం మంచిదైంది. షావుకార్లుగా అయ్యి ఉంటే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోలేకపోయేవారు. సన్యాసులు ఇలా అనరు. వారు ధనం తీసుకొని తమ ఆస్తులను తయారుచేసుకుంటారు. శివబాబా అలా తయారుచేసుకోరు. ఈ భవనాలు మొదలైనవన్నీ పిల్లలైన మీరు మీ కోసం నిర్మించుకున్నారు. ఇవి ఎవరి ఆస్తి కాదు, ఇవి తాత్కాలికమైనవి ఎందుకంటే అంతిమ సమయంలో పిల్లలకు ఇక్కడికి వచ్చి ఉండవలసి ఉంటుంది. మన స్మృతిచిహ్నము కూడా ఇక్కడే ఉంది. కనుక చివర్లో ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుంటారు. ఎవరైతే యోగయుక్తులుగా ఉంటారో, వారే తండ్రి వద్దకు పరుగెత్తుకొని వస్తారు. వారికి సహాయం కూడా లభిస్తుంది. తండ్రి నుండి చాలా సహాయం లభిస్తుంది. మీరు ఇక్కడ కూర్చొని వినాశనాన్ని చూడనున్నారు. ఎలాగైతే ప్రారంభంలో బాబా పిల్లలైన మిమ్మల్ని ఆహ్లాదపరిచారో, అలా మళ్ళీ చివర్లో ఆహ్లాదపరచడం మొదలుపెడతారు. వారు చాలా ప్రేమనిస్తారు. వైకుంఠంలో కూర్చున్నట్లుగా అనిపిస్తుంది, చాలా సమీపంగా వస్తూ ఉంటారు. మేము యాత్రలో ఉన్నామని అర్థం చేసుకుంటారు. కొద్ది సమయం తర్వాత వినాశనం జరుగుతుంది. మీరు చాలా సంతోషిస్తారు, ఇప్పుడిక మేము వెళ్ళి రాకుమారులుగా అవుతాము అని భావిస్తారు. రకరకాల పుష్పాలున్నాయి. పిల్లలు ప్రతి ఒక్కరు చూసుకోవాలి – నేను జ్ఞాన సుగంధాన్ని ఎంత ఇస్తున్నాను? ఎవరికైనా జ్ఞాన-యోగాల శిక్షణ ఇస్తున్నానా? ఎవరైతే అలా చేస్తారో, వారు లోలోపల హర్షితంగా ఉంటారు. ఫలానావారు ఏ అవస్థలో ఉన్నారు, వారు అవస్థలో ఎంతవరకు గ్యాలప్ చేయగలరు అనేది బాబాకు తెలుసు. ఎవరైతే దీపపు పురుగులుగా అయ్యి ఉంటారో, వారి అవస్థనే గ్యాలప్ చేస్తుంది. మాయా తుఫానులైతే చాలా వస్తాయని, వాటి నుండి స్వయాన్ని రక్షించుకోవాలని తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఈ రాజయోగాన్ని పరమపిత పరమాత్మ వచ్చి నేర్పిస్తారు. పరమాత్మ వచ్చి ఆత్మలకు అర్థం చేయిస్తారు. పరమాత్మ తండ్రి ఆత్మిక పిల్లలైన మనకు ఎలాగైతే అర్థం చేయిస్తారో, అలాగే ఆత్మనైన నేను నా ఈ సోదరాత్మకు అర్థం చేయిస్తున్నాను అనే జ్ఞానం ఆత్మకు ఉంది. నేను (బ్రహ్మా) కూడా ఆత్మనే. బాబా నాకు నేర్పిస్తారు, నేను మళ్ళీ ఈ ఆత్మలకు అర్థం చేయిస్తాను. కానీ ఆత్మ అనే నిశ్చయం లేకపోతే స్వయాన్ని మనుష్యులుగా భావిస్తూ, మనుష్యులకే అర్థం చేయిస్తారు. పరమ ఆత్మనైన నేను ఆత్మలైన మీతో మాట్లాడుతున్నాను. మీరు ఆత్మలకు వినిపిస్తారు. ఈ విధంగా మీరు దేహీ-అభిమానులుగా అయి ఎవరికైనా వినిపిస్తే బాణం వెంటనే తగులుతుంది. ఒకవేళ స్వయమే దేహీ-అభిమానులుగా ఉండలేకపోతే ధారణ చేయించలేరు. ఇది చాలా ఉన్నతమైన గమ్యము. మేము ఈ కర్మేంద్రియాల ద్వారా వింటున్నామనేది బుద్ధిలో ఉండాలి. నేను ఆత్మలతో (పిల్లలతో) మాట్లాడుతున్నానని తండ్రి అంటారు. అశరీరులుగా (వివస్త్రగా) అవ్వండి అనేది తండ్రి ఆజ్ఞ. దేహాభిమానాన్ని విడిచిపెట్టండి, నన్ను స్మృతి చేయండి – ఈ విషయం బుద్ధిలోకి రావాలి. నేను ఆత్మలతో మాట్లాడుతున్నాను, శరీరాలతో కాదు. ఫిమేల్ అయినా కూడా, వారి ఆత్మతోనే మాట్లాడుతున్నాను. మేము బాబాకు చెందినవారిగా అయితే అయిపోయాము అని పిల్లలైన మీరు భావిస్తారు కానీ అలా కాదు, ఇందులో బుద్ధి చాలా సూక్ష్మంగా నడుస్తుంది. నేను ఒక ఆత్మను, నేను వీరి ఆత్మకు అర్థం చేయిస్తున్నాను. వీరు నా సోదరుడు, వీరికి మార్గాన్ని తెలియజేయాలి. ఆత్మ ఈ విషయాలను అర్థం చేసుకుంటుంది. ఇలా భావించినప్పుడు ఆత్మకు బాణం తగులుతుంది. దేహాన్ని చూస్తూ వినిపించినట్లయితే ఆత్మ వినదు. నేను ఆత్మతో మాట్లాడుతున్నానని ముందు ఈ వార్నింగ్ ఇచ్చుకోండి. ఆత్మను మేల్ లేక ఫిమేల్ అని అనరు. ఆత్మ అతీతమైనది. మేల్ లేక ఫిమేల్ శరీరాల బట్టి పేర్లు ఉంటాయి. బ్రహ్మా-సరస్వతులను మేల్-ఫిమేల్ అని అంటారు. శివబాబాను మేల్ లేక ఫిమేల్ అని అనరు. కనుక తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఇది పెద్ద గమ్యము. ఈ పాయింటు చాలా శక్తివంతమైనది. ఆత్మకు ఇంజెక్షన్ ఇవ్వాలి, అప్పుడు దేహాభిమానం తొలగిపోతుంది. లేకపోతే సుగంధం రాదు, శక్తి ఉండదు. విషయం చాలా చిన్నది. మనం ఆత్మలతో మాట్లాడుతున్నాము. తండ్రి అంటారు – మీరు తిరిగి వెళ్ళాలి కావున దేహీ-అభిమానులుగా అవ్వండి. మన్మనాభవ. అప్పుడు ఆటోమేటిక్ గా మధ్యాజీభవ వచ్చేస్తుంది. ఇప్పుడు చాలా సూక్ష్మమైన బుద్ధి లభిస్తుంది. ఉదయాన్నే కూర్చొని విచార సాగర మథనం చేయాలి. పగలు సేవ చేయాలి ఎందుకంటే మీరు కర్మయోగులు. నిద్రను జయించేవారిగా అవ్వండి అని రాసి ఉంది కూడా. రాత్రుళ్ళు మేలుకొని సంపాదించండి. పగలు పూట మాయ చాలా విస్తరించి ఉంటుంది. అమృతవేళ వాయుమండలం చాలా బాగుంటుంది. ఫలానా సమయంలో లేచి విచార సాగర మథనం చేస్తున్నానని బాబాకు రాయరు. ఇందులో చాలా శ్రమ ఉంది. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇక్కడైతే హద్దు యజమానులుగా ఉన్నారు. నీటి హద్దుల గురించి కూడా ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. శతృత్వం ఏర్పడి ఉంది. పరస్పరంలో ఒకరినొకరు సోదరులుగా భావించటం లేదు. మేమంతా ఒక్కటేనని మాట వరుసకు అంటారు. ఒక్కటిగా అయితే అవ్వలేరు. అనేకమంది ఆత్మలున్నారు, అందరికీ తమ-తమ పాత్రలున్నాయి. మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. కల్పక్రితం కూడా కూర్చుని ఉంటారు. ఆకు కదిలింది అంటే అది డ్రామానుసారంగానే జరుగుతుంది. అంతేకానీ ప్రతి ఆకును పరమాత్మ కదిలిస్తారని కాదు. ఇటువంటి విషయాలను అర్థం చేసుకొని, అర్థం చేయించండి. ప్రతి ఒక్కరు స్వయం గురించి అర్థం చేసుకోగలరు – మేము దీపపు పురుగులుగా అయ్యామా, మేము బాబా మతాన్ని అనుసరిస్తూ ఉన్నామా! వ్యర్థమైన మాటలు మాట్లాడడం లేదు కదా! మా ధనాన్ని పాపం వైపు పెట్టడం లేదు కదా? అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతో మాట్లాడాలి. దేహీ-అభిమానులుగా అయి వినడము-వినిపించడముతో ధారణ బాగా జరుగుతుంది.

2. నిద్రను జయించేవారిగా అవ్వాలి, రాత్రుళ్ళు మేలుకొని సంపాదించుకోవాలి. విచార సాగర మథనం చేయాలి. ఎటువంటి వ్యర్థ విషయాలలోనూ తమ సమయాన్ని పోగొట్టుకోకూడదు.

వరదానము:-

ఎలాగైతే సత్యయుగీ ఆత్మలు వికారీ విషయాల నాలెడ్జ్ నుండి ఇన్నోసెంట్ గా (అమాయకులుగా) ఉంటారో, అలా ఆ సంస్కారము స్మృతిలో స్పష్టంగా ఉన్నట్లయితే, మాయ నాలెడ్జ్ నుండి ఇన్నోసెంట్ గా అవుతారు. కానీ ఆత్మిక స్వరూపపు స్మృతి సదా కాలానికి మరియు స్పష్టంగా ఉన్నప్పుడే, భవిష్య సంస్కారం స్మృతిలో స్పష్టంగా ఉంటుంది. ఎలాగైతే దేహం స్పష్టంగా కనిపిస్తుందో, అలా తమ ఆత్మ స్వరూపం స్పష్టంగా కనిపించాలి అనగా అనుభవమవ్వాలి. అప్పుడు మాయ నుండి ఇన్నోసెంట్ మరియు జ్ఞానంలో సెయింట్ అనగా సంపూర్ణ పవిత్రులని అంటారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top