28 April 2021 TELUGU Murli Today – Brahma Kumaris

27 April 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Malayalam. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - యోగం ద్వారానే ఆత్మలోని మాలిన్యం తొలగిపోతుంది, తండ్రి నుండి పూర్తి వారసత్వం లభిస్తుంది, అందుకే ఎంత వీలైతే అంత యోగబలాన్ని పెంచండి”

ప్రశ్న: -

దేవీ దేవతల కర్మలు శ్రేష్ఠంగా ఉండేవి, ఇప్పుడు అందరి కర్మలు భ్రష్టంగా ఎందుకు అయ్యాయి?

జవాబు:-

ఎందుకంటే తమ అసలైన ధర్మాన్ని మర్చిపోయారు. ధర్మాన్ని మర్చిపోయిన కారణంగానే, ఏ కర్మలు చేస్తున్నా అవి భ్రష్టమవుతున్నాయి. తండ్రి మీకు మీ సత్య ధర్మము యొక్క పరిచయాన్నిస్తారు, దీనితో పాటు మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర-భూగోళాలను వినిపిస్తారు, ఇది అందరికీ వినిపించాలి, తండ్రి యొక్క సత్య పరిచయాన్ని ఇవ్వాలి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ముఖాన్ని చూసుకో ప్రాణీ….. (ముఖ్డా దేఖ్ లే ప్రాణీ…..)

ఓంశాంతి. ఇది ఎవరు అన్నారు మరియు ఎవరితో అన్నారు? తండ్రి పిల్లలతో అన్నారు. ఏ పిల్లలనైతే పతితుల నుండి పావనంగా చేస్తున్నారో వారితో అన్నారు. దేవీ దేవతలుగా ఉండే భారతవాసులైన మేము, ఇప్పుడు 84 జన్మల చక్రం తిరిగి, సతోప్రధానతను దాటి సతో, రజో, తమోగా మరియు ఇప్పుడు తమోప్రధానంగా అయిపోయాము అని పిల్లలు తెలుసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ పతితులను పావనంగా తయారుచేసే తండ్రి చెప్తున్నారు – నేను ఎంతవరకు పుణ్యాత్మగా అయ్యాను అని మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. మొదట్లో దేవి-దేవతలుగా పిలువబడే సమయంలో మీరు సతోప్రధానులుగా, పవిత్రాత్మలుగా ఉండేవారు, దానిని ఆది సనాతన దేవీ దేవతా ధర్మము అని అనేవారు. ఇప్పుడు భారతవాసులెవరూ తమను తాము దేవీ దేవతా ధర్మము వారిగా పిలుచుకోరు. హిందూ అనే ధర్మమేదీ లేదు కానీ పతితులుగా అయిన కారణంగా తమను తాము దేవతలుగా పిలుచుకోలేరు. సత్యయుగంలో దేవతలు పవిత్రంగా ఉండేవారు, పవిత్ర ప్రవృత్తి మార్గముండేది. యథా రాజా-రాణి తథా ప్రజా, అందరూ పవిత్రంగా ఉండేవారు. భారతవాసులకు తండ్రి స్మృతినిప్పిస్తున్నారు – పవిత్ర ప్రవృత్తి మార్గము వారైన మీరు, ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారు, దానిని స్వర్గము అని అనేవారు, అక్కడ ఒకే ధర్మముండేది. మొదటి నంబర్ మహారాజా-మహారాణిగా లక్ష్మీనారాయణులు ఉండేవారు. వారి వంశం కూడా ఉండేది మరియు భారత్ చాలా సంపన్నంగా ఉండేది, అది సత్యయుగము. తర్వాత త్రేతాలోకి వచ్చారు, అప్పుడు కూడా పూజ్య దేవీ దేవతలుగా, క్షత్రియులుగా పిలువబడేవారు. అది లక్ష్మీ-నారాయణుల రాజ్యము, తర్వాత సీతా-రాముల రాజ్యము, వారి వంశము కూడా నడిచింది. క్రిస్టియన్లలో ఎడ్వర్డ్ ది ఫస్ట్, సెకెండ్….. అని ఏ విధంగా నడుస్తుందో, భారత్ లో కూడా అదే విధంగా ఉండేది. ఇది 5 వేల సంవత్సరాల నాటి విషయము అనగా 5 వేల సంవత్సరాల క్రితం భారత్ లో ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. కానీ వారు ఈ రాజ్యాన్ని ఎప్పుడు మరియు ఎలా పొందారు అన్నది ఎవరికీ తెలియదు. ఆ సూర్యవంశీ రాజ్యమే మళ్ళీ చంద్ర వంశంలోకి వచ్చింది ఎందుకంటే పునర్జన్మలను తీసుకుంటూ-తీసుకుంటూ మెట్లు దిగాల్సిందే. భారత్ యొక్క ఈ చరిత్ర-భూగోళాలు ఎవరికీ తెలియవు. తండ్రి రచయిత, కనుక తప్పకుండా వారు సత్యయుగ కొత్త ప్రపంచానికి రచయిత అవుతారు. తండ్రి అంటారు – పిల్లలూ, నేటికి 5 వేల సంవత్సరాల క్రితం మీరు స్వర్గంలో ఉండేవారు, ఈ భారత్ స్వరంగా ఉండేది, తర్వాత నరకంలోకి వచ్చారు. ప్రపంచంలోని వారికి ఈ ప్రపంచం యొక్క చరిత్ర-భూగోళాలు తెలియవు. వారికి అసంపూర్ణమైన చరిత్ర అనగా కేవలం చివర్లో జరిగిన చరిత్ర గురించి తెలుసు. సత్య-త్రేతాయుగాల చరిత్ర-భూగోళాల గురించి ఎవరికీ తెలియవు. ఋషులు, మునులు కూడా, మాకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల గురించి తెలియదని అంటూ వచ్చారు. అయినా, ఎవరికైనా ఎలా తెలుస్తుంది, తండ్రి కూర్చొని మీకు మాత్రమే అర్థం చేయిస్తారు. శివబాబా భారత్ లోనే దివ్య జన్మను తీసుకుంటారు, వారి పేరు మీద శివ జయంతి కూడా జరుగుతుంది. శివ జయంతి తర్వాత గీతా జయంతి జరగాలి. దానితోపాటు కృష్ణ జయంతి జరగాలి, కానీ శివ జయంతి ఎప్పుడు జరిగింది అని, ఈ జయంతి గురించిన రహస్యం భారతవాసులకు తెలియదు. బుద్ధ జయంతి, క్రీస్తు జయంతి ఎప్పుడు జరిగాయి అనేది ఇతర ధర్మాల వారైతే వెంటనే చెప్తారు. శివ జయంతి ఎప్పుడు జరిగింది అని భారతవాసులను అడగండి. ఎవ్వరూ చెప్పలేరు. శివుడు భారత్ లో వచ్చారు, వచ్చి ఏమి చేసారు, ఇది ఎవరికీ తెలియదు. శివుడు ఆత్మలందరికీ తండ్రి. ఆత్మ అవినాశీ. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. ఇది 84 జన్మల చక్రము. శాస్త్రాలలోనైతే 84 లక్షల జన్మలు అని వ్యర్థ ప్రలాపము రాసారు. తండ్రి వచ్చి రైట్ విషయాన్ని అర్థం చేయిస్తారు. తండ్రి తప్ప మిగిలిన వారంతా రచయిత మరియు రచనల గురించి అసత్యమే చెప్తారు ఎందుకంటే ఇది మాయా రాజ్యము. ముందు మీరు పారసబుద్ధి కలవారిగా ఉండేవారు, భారత్ పారసపురిగా ఉండేది. బంగారం, వజ్ర వైఢూర్యాల మహళ్ళు ఉండేవి. తండ్రి కూర్చొని రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అనగా ప్రపంచ చరిత్ర-భూగోళాలను తెలియజేస్తారు. వారే మొట్టమొదట దేవీ-దేవతలుగా ఉండేవారని, ఇప్పుడు పతితంగా, నిరుపేదగా, అధర్మయుక్తంగా అయిపోయారని, తమ ధర్మాన్ని మర్చిపోయారని, భారతవాసులకు తెలియదు. ఇది కూడా డ్రామానుసారంగా జరగాల్సి ఉంది. మరి ఈ ప్రపంచ చరిత్ర-భూగోళాలు బుద్ధిలోకి రావాలి కదా. ఉన్నతాతి ఉన్నతమైన సర్వాత్మల తండ్రి మూలవతనంలో ఉంటారు, తర్వాత సూక్ష్మవతనము ఉంటుంది, ఇది స్థూలవతనము. సూక్ష్మవతనములో కేవలం బ్రహ్మా, విష్ణు, శంకరులు ఉంటారు. వారికి వేరే చరిత్ర-భూగోళాలేమీ ఉండవు. ఇవి మూడు అంతస్థులు. గాడ్ ఈజ్ వన్ (భగవంతుడు ఒక్కరే). వారి రచన కూడా ఒక్కటే, ఆ చక్రము తిరుగుతూ ఉంటుంది. సత్యయుగం నుండి త్రేతాలోకి, తర్వాత ద్వాపర, కలియుగాల్లోకి రావాల్సి ఉంటుంది. 84 జన్మల లెక్క ఉండాలి కదా, ఇది ఎవరికీ తెలియదు, అలానే ఇది ఏ శాస్త్రాలలోనూ లేదు. 84 జన్మల పాత్రను పిల్లలైన మీరే అభినయిస్తారు. తండ్రి అయితే ఈ చక్రంలో రారు. పిల్లలే పావనుల నుండి పతితులుగా అవుతారు, అందుకే – బాబా, మీరు వచ్చి మమ్మల్ని మళ్ళీ పావనంగా చేయండి అని ఆర్తనాదము చేస్తారు. అందరూ ఒక్కరినే పిలుస్తారు – రావణ రాజ్యంలో దుఃఖితులుగా ఉన్నవారందరినీ, మీరు వచ్చి విముక్తులుగా చేయండి, మళ్ళీ రామరాజ్యంలోకి తీసుకువెళ్ళండి అని అంటారు. అర్ధ కల్పము రామ రాజ్యము, అర్ధ కల్పము రావణ రాజ్యము. పవిత్రంగా ఉండే భారతవాసులే పతితంగా అవుతారు. వామ మార్గంలోకి వెళ్ళడంతో పతితులుగా అవ్వడం మొదలుపెడతారు. భక్తి మార్గము ప్రారంభమవుతుంది. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానము వినిపించడం జరుగుతుంది, దీనితో అర్ధ కల్పము, 21 జన్మలకు మీరు సుఖ వారసత్వాన్ని పొందుతారు. అర్ధకల్పం జ్ఞానం యొక్క ప్రారబ్ధము నడుస్తుంది, తర్వాత రావణ రాజ్యం వస్తుంది, కింద పడిపోవడము మొదలవుతుంది. మీరు దైవీ రాజ్యంలో ఉండేవారు, తర్వాత ఆసురీ రాజ్యంలోకి వచ్చారు. దీనిని హెల్ (నరకము) అని కూడా అంటారు. మీరు హెవెన్ (స్వర్గము) లో ఉండేవారు, తర్వాత 84 జన్మలను దాటి హెల్ లోకి వచ్చి చెరుకున్నారు. అది సుఖధామముగా ఉండేది. ఇది దుఃఖధామము, 100 శాతం నిరుపేదగా ఉన్నారు. 84 జన్మల చక్రాన్ని తిరుగుతూ, అదే భారతవాసులు పూజ్యుల నుండి పూజారులుగా అయ్యారు. దీనినే ప్రపంచ చరిత్ర-భూగోళాలని అంటారు. ఈ చక్రమంతా భారతవాసులైన మీదే. ఇతర ధర్మాల వారు 84 జన్మలను తీసుకోరు. వారు సత్యయుగంలో ఉండరు. సత్య-త్రేతా యుగాలలో కేవలం భారత్ యే ఉండేది. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు, తర్వాత వైశ్యవంశీయులు, శూద్రవంశీయులు ఉంటారు….. ఇప్పుడు మీరు దేవతా వంశీయులుగా అయ్యేందుకు, బ్రాహ్మణ వంశీయులుగా అయ్యారు. ఇవి భారత్ యొక్క వర్ణాలు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అవ్వడంతో శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. తండ్రి మిమ్మల్ని 5 వేల సంవత్సరాల క్రితం వలె చదివిస్తున్నారు. కల్ప-కల్పము మీరు పావనంగా అయి, మళ్ళీ పతితంగా అవుతారు. సుఖధామానికి వెళ్ళి మళ్ళీ దుఃఖధామంలోకి వస్తారు. మళ్ళీ శాంతిధామానికి వెళ్ళాలి, దానిని నిరాకారీ ప్రపంచమని అంటారు. ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఎవరు అనేది మనుష్యులెవరికీ తెలియదు. ఆత్మ కూడా ఒక నక్షత్రం వలె ఉండే బిందువు. భృకుటి మధ్యలో నక్షత్రము మెరుస్తుంది అని అంటారు. ఆత్మ ఒక చిన్న బిందువు, దానిని దివ్యదృష్టి ద్వారా చూడవచ్చు. వాస్తవానికి ఆత్మను నక్షత్రమని కూడా అనకూడదు. నక్షత్రము చాలా పెద్దగా ఉంటుంది, కేవలం దూరంగా ఉన్న కారణంగా చిన్నగా కనిపిస్తుంది. కేవలం ఒక ఉదాహరణగా ఇలా చెప్పబడుతుంది. ఏ విధంగా పైనున్న నక్షత్రం చిన్నగా కనిపిస్తుందో, అలా ఆత్మ కూడా అంతే చిన్నగా ఉంటుంది. తండ్రి ఆత్మ కూడా ఒక బిందువులా ఉంటుంది. వారిని సుప్రీమ్ ఆత్మ అని అంటారు, వారి మహిమ వేరు. మనుష్య సృష్టికి చైతన్య బీజ రూపుడైన కారణంగా, వారిలో జ్ఞానమంతా ఉంది. మీ ఆత్మకు కూడా ఇప్పుడు నాలెడ్జ్ లభిస్తుంది. ఆత్మయే నాలెడ్జ్ ను గ్రహిస్తుంది, ఇంత చిన్న బిందువులో 84 జన్మల పాత్ర రచించబడి ఉంది. అది కూడా అవినాశీగా ఉంది, 84 జన్మల చక్రం తిరుగుతూ వచ్చారు. దీనికి అంతం ఉండజాలదు. దేవతలుగా ఉండేవారు, దైత్యులుగా అయ్యారు, మళ్ళీ దేవతలుగా అవ్వాలి. ఈ చక్రం తిరుగుతూ వచ్చింది. మిగిలినవన్నీ శాఖలు. ఇస్లాములు, బౌద్ధులు మొదలైనవారెవరూ 84 జన్మలను తీసుకోరు. భారత్ లో ఈ సత్యయుగము ధర్మయుక్తంగా, సంపన్నంగా ఉండేది, తర్వాత 84 జన్మలు తీసుకొని వికారులుగా అయ్యారు. ఇది వికారీ ప్రపంచము. 5 వేల సంవత్సరాల క్రితం పవిత్రత ఉండేది, శాంతి కూడా ఉండేది, సంపద కూడా ఉండేది. తండ్రి పిల్లలకు స్మృతినిప్పిస్తున్నారు. ముఖ్యమైనది పవిత్రత. అందుకే వికారులను నిర్వికారులుగా తయారుచేసేవారా రండి, అని అంటారు. వారే సద్గతినిచ్చేవారు, అందుకే వారే సద్గురువు. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా నిరుపేద నుండి రాకుమారులుగా అవుతున్నారు అనగా నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అవుతారు. ఇది మీ రాజయోగము. ఇప్పుడు తండ్రి ద్వారా భారత్ కే రాజ్యం లభిస్తుంది. ఆత్మయే 84 జన్మలను తీసుకుంటుంది. ఆత్మయే శరీరం ద్వారా చదువుకుంటుంది, శరీరం చదువుకోదు. ఆత్మ సంస్కారాలను తీసుకువెళ్తుంది. ఆత్మనైన నేను ఈ శరీరం ద్వారా చదువుకుంటాను – దీనిని దేహీ-అభిమానమని అంటారు. ఆత్మ వేరైపోతే, ఇక శరీరం దేనికీ పనికి రాదు. ఇప్పుడు నేను పుణ్యాత్మగా అవుతున్నానని ఆత్మ అంటుంది. మనుష్యులు దేహాభిమానంలోకి వచ్చి, నేను ఇది చేస్తాను….. అని అంటారు. నేను ఒక ఆత్మ, నా ఈ శరీరం పెద్దది అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. పరమాత్మ తండ్రి ద్వారా ఆత్మనైన నేను చదువుకుంటున్నాను. నన్నొక్కడినే స్మృతి చేయండి అని తండ్రి అంటారు. మీరు స్వర్ణిమ యుగంలో సతోప్రధానంగా ఉండేవారు, తర్వాత మీలో మాలిన్యం చేరుకుంది. మాలిన్యం చేరుకుంటూ-చేరుకుంటూ మీరు పావనుల నుండి పతితులుగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ పావనంగా అవ్వాలి, అందుకే ఓ పతితపావనా రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని అంటారు. కనుక తండ్రి సలహానిస్తారు – ఓ పతితాత్మ, తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే, మీ నుండి మాలిన్యం తొలగిపోతుంది మరియు మీరు పావనంగా అయిపోతారు. దీనిని ప్రాచీన యోగమని అంటారు. ఈ స్మృతి ద్వారా అనగా యోగాగ్ని ద్వారా మాలిన్యం భస్మమైపోతుంది. ముఖ్యమైన విషయము – పతితుల నుండి పావనులుగా అవ్వడము. సాధు-సన్యాసులు మొదలైన వారంతా పతితులుగానే ఉన్నారు. పావనంగా అయ్యే ఉపాయమును తండ్రియే తెలియజేస్తారు – నన్నొక్కరినే స్మృతి చేయండి. ఈ అంతిమ జన్మ పవిత్రంగా అవ్వండి. తింటూ-తాగుతూ, నడుస్తూ-తిరుగుతూ నన్నొక్కరినే స్మృతి చేయండి ఎందుకంటే ఆత్మలైన మీ అందరికీ (ప్రేయసులకు) ప్రియుడిని నేను. నేను మిమ్మల్ని పావనంగా చేసాను, మీరు మళ్ళీ పతితంగా అయ్యారు. భక్తులందరూ ప్రేయసులు. కర్మలు కూడా చేయండి కానీ బుద్ధితో నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే, వికర్మలు వినాశనమవుతాయని ప్రియుడు అంటారు. ఇందులో శ్రమ ఉంది. కనుక వారసత్వాన్ని పొందేందుకు, తండ్రిని స్మృతి చేయాలి కదా. ఎవరైతే ఎక్కువగా స్మృతి చేస్తారో, వారికి వారసత్వం కూడా ఎక్కువగా లభిస్తుంది. ఇది స్మృతి యాత్ర. ఎవరైతే ఎక్కువగా స్మృతి చేస్తారో, వారే పావనంగా అయి, నా కంఠ హారంగా అవుతారు. నిరాకారీ ప్రపంచంలో, ఆత్మలందరిదీ ఒక వంశ వృక్షం తయారై ఉంది, దానిని నిరాకారీ వృక్షమని అంటారు. ఇది సాకార వృక్షము, నిరాకారీ ప్రపంచం నుండి అందరూ నంబరువారుగా రావాల్సి ఉంటుంది, అలా వస్తూనే ఉంటారు. వృక్షం ఎంత పెద్దది. ఆత్మ పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వస్తుంది. ఆత్మలందరూ ఈ డ్రామాలోని పాత్రధారులు. ఆత్మ అవినాశీ, ఆత్మలోని పాత్ర కూడా అవినాశీగా ఉంటుంది. డ్రామా ఎప్పుడు తయారయ్యింది అనేది చెప్పలేము. ఇది నడుస్తూనే ఉంటుంది. భారతవాసులు మొట్టమొదట సుఖంలో ఉండేవారు, తర్వాత దుఃఖంలోకి వచ్చారు, తర్వాత శాంతిధామానికి వెళ్ళాలి. తర్వాత తండ్రి సుఖధామంలోకి పంపిస్తారు. ఇందులో ఎవరు ఎంత పురుషార్థం చేస్తే, అంత ఉన్నత పదవిని పొందుతారు. తండ్రి రాజ్యాన్ని స్థాపన చేస్తారు. పురుషార్థానుసారంగా ఆ రాజ్యంలో పదవిని పొందుతారు. సత్యయుగంలోనైతే తప్పకుండా కొద్దిమంది మనుష్యులుంటారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మపు వృక్షం చిన్నది, ఇక మిగిలినదంతా వినాశనమైపోతుంది. ఈ ఆది సనాతన దేవీ దేవతా ధర్మము స్థాపనవుతుంది అనగా స్వర్గం యొక్క గేట్లు తెరుచుకుంటున్నాయి. 5 వేల సంవత్సరాల క్రితం కూడా ఈ యుద్ధం తర్వాత స్వర్గ స్థాపన జరిగింది, అనేక ధర్మాలు వినాశనమైపోయాయి. ఈ యుద్ధాన్ని కళ్యాణకారీ యుద్ధమని అంటారు. ఇప్పుడు నరకం యొక్క గేట్లు తెరిచి ఉన్నాయి తర్వాత స్వర్గం యొక్క గేట్లు తెరుచుకుంటాయి. స్వర్గ ద్వారాలను తండ్రి తెరుస్తారు, నరక ద్వారాలను రావణుడు తెరుస్తాడు. తండ్రి వారసత్వాన్నిస్తారు, రావణుడు శాపాన్నిస్తాడు. ఈ విషయాలు ప్రపంచంలోని వారికి తెలియవు, పిల్లలైన మీకు అర్థం చేయిస్తాను. ఎడ్యుకేషన్ మినిష్టర్ కూడా అనంతమైన జ్ఞానాన్ని కావాలనుకుంటారు. అది మీరు మాత్రమే ఇవ్వగలరు. కానీ మీరు గుప్తంగా ఉన్నారు. మిమ్మల్ని గుర్తించరు. మీరు యోగబలంతో మీ రాజ్యాన్ని తీసుకుంటున్నారు. లక్ష్మీ నారాయణులు ఈ రాజ్యాన్ని ఎలా పొందారు అనేది మీకు తెలుసు. దీనిని శుభప్రదమైన కళ్యాణకారీ యుగమని అంటారు. ఈ సమయంలో తండ్రి వచ్చి పావనంగా చేస్తారు. కృష్ణుడినైతే అందరూ తండ్రి అని అనరు. తండ్రి అని నిరాకారుడినే అంటారు, ఆ తండ్రిని స్మృతి చేయాలి, పావనంగా కూడా అవ్వాలి. వికారాలను తప్పకుండా వదలాల్సి ఉంటుంది. భారత్ నిర్వికారీ సుఖధామంగా ఉండేది. ఇప్పుడు వికారీగా, దుఃఖధామంగా ఉంది. పైసకు కొరగానిదిగా ఉంది. ఇది డ్రామా ఆట, దీనిని బుద్ధిలో ధారణ చేసి, ఇతరులకు కూడా చేయించాలి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్మృతితో పావనంగా అయి తండ్రికి కంఠ హారంగా అవ్వాలి. కర్మలు చేస్తూ కూడా, తండ్రి స్మృతిలో ఉంటూ, వికర్మాజీతులుగా అవ్వాలి.

2. పుణ్యాత్ములుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థాన్ని చేయాలి. దేహాభిమానాన్ని వదిలి, దేహీ-అభిమానులుగా అవ్వాలి.

వరదానము:-

ఏ పిల్లలైతే తమతో తాము, తమ పురుషార్థంతో, తమ సేవతో, బ్రాహ్మణ పరివారపు సంపర్కంతో సదా సంతుష్టంగా ఉంటారో, వారినే సంతుష్టమణులు అని అంటారు. సర్వాత్మల సంపర్కంలో స్వయాన్ని సంతుష్టంగా ఉంచుకోవడము మరియు సర్వులను సంతుష్టపరచడము – ఇందులో ఎవరైతే విజయులుగా అవుతారో, వారే విజయమాలలోకి వస్తారు. పాస్ విత్ ఆనర్ గా అయ్యేందుకు, సర్వుల ద్వారా సంతుష్టత యొక్క పాస్ పోర్టు లభించాలి. ఈ పాస్ పోర్టు తీసుకునేందుకు, కేవలం సహనం చేసే మరియు ఇముడ్చుకునే శక్తిని ధారణ చేయండి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top