27 September 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
26 September 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - యోగబలంతోనే మీరు మీ వికర్మలపై విజయం పొంది వికర్మాజీతులుగా అవ్వాలి”
ప్రశ్న: -
ఏ ఆలోచన పురుషార్థీ పిల్లలను కూడా పురుషార్థ హీనులుగా చేస్తుంది?
జవాబు:-
ఒకవేళ పురుషార్థులు ఎవరికైనా, ఇప్పుడు ఇంకా చాలా సమయముంది, చివర్లో గ్యాలప్ చేస్తాము అనే ఆలోచన వస్తే వారు పురుషార్థ హీనులుగా అయిపోతారు. కానీ తండ్రి అర్థం చేయిస్తారు – పిల్లలూ, మృత్యువు వచ్చే సమయం నిశ్చితం కాదు, రేపు-రేపు అంటూ మరణిస్తే ఇక ఏం సంపాదన జరుగుతుంది. అందుకే ఎంత వీలైతే అంత శ్రీమతాన్ని అనుసరిస్తూ తమ కళ్యాణాన్ని మరియు ఇతరుల కళ్యాణాన్ని చేస్తూ ఉండండి. సమయం ఉంది కదా అని ఆలోచిస్తూ పురుషార్థ హీనులుగా అవ్వకండి.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
ఓం నమః శివాయ…..
ఓంశాంతి. నిరాకారుడు, సాకారుడు లేకుండా ఏ కర్మ చేయలేరని, పాత్రను అభినయించలేరని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ఆత్మిక తండ్రి వచ్చి బ్రహ్మా ద్వారా ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. యోగబలంతోనే సతోప్రధానంగా అవ్వాలి మరియు విశ్వానికి యజమానులుగా అవ్వాలి. కల్ప-కల్పము తండ్రి వచ్చి బ్రహ్మా ద్వారా రాజయోగాన్ని నేర్పిస్తారని మరియు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారని అనగా మనుష్యులను దేవతలుగా తయారుచేస్తారని పిల్లల బుద్ధిలో ఉంది. దేవీ-దేవతలుగా, పావనంగా ఉన్న మనుష్యులే ఇప్పుడు 84 జన్మల తర్వాత మారిపోయి పతితులుగా అయిపోయారు. భారత్ పారసపురిగా ఉన్నప్పుడు పవిత్రత, సుఖ-శాంతులు అన్నీ ఉండేవి. ఇది 5 వేల సంవత్సరాల నాటి విషయము. తిథి-తారీఖులతో సహా తండ్రి మొత్తం లెక్క అంతటినీ అర్థం చేయిస్తారు. వీరి కంటే ఉన్నతమైనవారు ఎవరూ లేరు. సృష్టి లేక వృక్షము, దేనినైతే కల్పవృక్షమని అంటారో, దాని ఆదిమధ్యాంతాల రహస్యాన్ని కూడా తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు. ఒకప్పుడు భారత్ లో ఉన్న దేవీ-దేవతా ధర్మము ఇప్పుడు ప్రాయఃలోపమైపోయింది. కేవలం చిత్రాలు మాత్రం ఉన్నాయి. సత్యయుగంలో లక్ష్మీనారాయణుల రాజ్యముండేదని భారతవాసులకు తెలుసు. అయితే, శాస్త్రాలలో కృష్ణుడిని ద్వాపరంలోకి తీసుకువెళ్ళి పొరపాటు చేసారు. తండ్రియే వచ్చి దారితప్పిన వారికి దారిని తెలియజేస్తారు. వారిని ముక్తి-జీవన్ముక్తుల గైడ్ అని అంటారు. సర్వులకు ముక్తి-జీవన్ముక్తులను ఇచ్చేవారు ఒక్కరే. భారత్ జీవన్ముక్తిలో ఉన్నప్పుడు మిగిలిన ఆత్మలన్నీ ముక్తిధామంలో ఉన్నాయి, అందుకే వారిని ముక్తి-జీవన్ముక్తి దాత అని అంటారు. రచయిత ఒక్కరే, సృష్టి కూడా ఒక్కటే, ప్రపంచ చరిత్ర-భూగోళాలు కూడా ఒక్కటే. అవే రిపీట్ అవుతాయి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం….. ఆ తర్వాత సంగమయుగం ఉంటుంది. కలియుగం పతిత యుగము, సత్యయుగం పావన యుగము. సత్యయుగం రానున్నది అంటే, అంతకుముందు తప్పకుండా కలియుగ వినాశనం జరుగుతుంది. వినాశనానికి ముందే స్థాపన జరుగుతుంది. సత్యయుగంలో స్థాపన జరగదు. పతిత ప్రపంచాన్ని పావనంగా తయారుచేయాల్సి వచ్చినప్పుడు భగవంతుడు వస్తారు. ఇప్పుడు తండ్రి సహజమైన యుక్తిని తెలియజేస్తారు – దేహ సహితంగా దేహ సంబంధాలన్నింటినీ తెంచి దేహీ-అభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేయండి. తండ్రి భక్తులకు ఫలాన్నిచ్చేవారు. భక్తులకు పావనంగా అయ్యేందుకు జ్ఞానం ఇస్తారు. అందరినీ పావనం తయారుచేసేది యోగము. జ్ఞానసాగరుడు వచ్చి నోటి ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తారు, పతితులను పావనంగా తయారుచేస్తారు. ఈ సమయంలో ఆత్మలందరూ పతితంగా తయారయ్యారు, అందుకే తండ్రిని పిలుస్తారు ఎందుకంటే తండ్రి తప్ప ఇంకెవ్వరూ పావనంగా తయారుచేయలేరు. ఒకవేళ గంగ పతితపావని అయితే, మళ్ళీ పతితపావన సీతారామ అని ఎందుకు పిలుస్తారు. పరమపిత పరమాత్మ తప్పకుండా మళ్ళీ కొత్త ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచ వినాశనం కోసం వస్తారని బుద్ధి చెప్తుంది. కల్పవృక్షానికి కూడా ఆయువు ఉంటుంది. ఏ వస్తువైతే శిథిలావస్థకు చేరుకుంటుందో, దానినే తమోప్రధానము అని అంటారు. దీనిని కొత్త ప్రపంచమని అనరు, ఇది ఇనుపయుగ ప్రపంచము. ఇతరులకు అర్థం చేయించేందుకు ఈ విషయాలన్నీ బుద్ధిలో కూర్చోబెట్టడం జరుగుతుంది. ఇంటి-ఇంటికి సందేశం ఇవ్వాలి. పరమాత్మ వచ్చేసారని నేరుగా చెప్పకూడదు. యుక్తిగా అర్థం చేయించాలి. లౌకిక తండ్రి మరియు పారలౌకిక తండ్రి – ఇద్దరు తండ్రులున్నారని చెప్పండి. దుఃఖం సమయంలో పారలౌకిక తండ్రినే స్మృతి చేయడం జరుగుతుంది. సుఖధామంలో పరమాత్మను ఎవరూ స్మృతి చేయరు. సత్యయుగంలో, లక్ష్మీ-నారాయణుల రాజ్యంలో సుఖం, శాంతి, పవిత్రత అన్నీ ఉండేవి. తండ్రి వారసత్వం లభించిన తర్వాత ఇక వారిని ఎందుకు పిలుస్తారు? అక్కడ అంతా సుఖమే ఉంటుంది. తండ్రి దుఃఖం కొరకు ప్రపంచాన్ని రచించలేదు. ఇది తయారై తయారవుతున్న ఆట. ఎవరి పాత్ర అయితే చివర్లో ఉంటుందో, వారు 2-4 జన్మలు తీసుకుంటారు, మిగతా సమయం శాంతిధామంలో ఉంటారు. ఇకపోతే, ఈ ఆట నుండి ఎవరైనా బయటకు వెళ్ళిపోవడమనేది జరగదు. 1-2 జన్మలు తీసుకుంటారు, మిగిలిన సమయమంతా మోక్షంలో ఉన్నట్లు. ఆత్మ పాత్రధారి. కొందరిది ఉన్నతమైన పాత్ర, కొందరిది తక్కువ పాత్ర ఉంటుంది. ఈశ్వరుని అంతాన్ని ఎవరూ పొందలేరని అంటూ ఉంటారు. ఈశ్వరుడే వచ్చి రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. తండ్రి అర్థం చేయిస్తారు – నేను సాధారణ తనువులోకి ప్రవేశిస్తాను, నేను ఏ తనువులోకైతే ప్రవేశిస్తానో, వారికి తమ జన్మల గురించి తెలియదు, నేను వీరి 84 జన్మల కథను వినిపిస్తాను. ఎవరి పాత్రా మారదు. ఇది తయారై తయారవుతున్న ఆట. ఇది ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. పవిత్రంగా అయి అర్థం చేసుకున్నప్పుడే బుద్ధిలో కూర్చుంటుంది. మంచి రీతిగా అర్థం చేసుకునేందుకు 7 రోజుల భట్టీలో ఉండాలి. భాగవతం మొదలైనవి కూడా 7 రోజులు వినిపిస్తారు. కొందరు 7 రోజుల్లో బాగా అర్థం చేసుకుంటారు. కొందరైతే, మా బుద్ధిలో ఏమీ కూర్చోలేదని అంటారు. ఉన్నత పదవి పొందేది లేదు అన్నప్పుడు బుద్ధిలో ఎలా కూర్చుంటుంది. అచ్ఛా, అయినా కళ్యాణమైతే జరిగింది కదా! ప్రజలు ఈ విధంగానే తయారవుతారు. రాజ్య భాగ్యం తీసుకోవడంలో శ్రమ ఉంది. తండ్రిని స్మృతి చేయడంతోనే వికర్మలు వినాశనమవుతాయి. ఇక చేయండి, చేయకపోండి, మీ ఇష్టం. కానీ తండ్రి అయితే డైరెక్షన్ ఇచ్చారు. ప్రియమైన వస్తువును గుర్తు చేయడం జరుగుతుంది కదా! భక్తి మార్గంలో కూడా, ఓ పతిత పావనా, రండి, అని అంటారు. ఇప్పుడు వారు లభించారు. వారంటారు – నన్ను స్మృతి చేసినట్లయితే తుప్పు తొలగిపోతుంది. రాజ్యాధికారం ఊరికే లభించదు కదా. స్మృతిలోనే కొంత శ్రమ ఉంది. చాలా స్మృతి చేసేవారే కర్మాతీత అవస్థను పొందుతారు. పూర్తిగా స్మృతి చేయకపోతే వికర్మలు వినాశనమవ్వవు. యోగబలంతోనే వికర్మాజీతులుగా అవ్వాలి. కలియుగాంతంలో పవిత్రమైనవారు ఎవ్వరూ లేనప్పుడు లక్ష్మీనారాయణులు ఇంత పవిత్రంగా ఎలా అయ్యారు? ఈ సమయంలో గీతా జ్ఞాన అధ్యాయం రిపీట్ అవుతుంది. శివ భగవానువాచ, పొరపాట్లు అయితే అందరి ద్వారా జరుగుతూ ఉంటాయి. నేను వచ్చి అందరినీ పొరపాట్లు చేయనివారిగా తయారుచేస్తాను. భారత్ యొక్క శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి. తండ్రి అంటారు – నేను వచ్చి ఏవైతే తెలియజేస్తానో, అవి ఎవరికీ తెలియవు. ఎవరైతే నా ద్వారా విన్నారో, వారు 21 జన్మల ప్రారబ్ధాన్ని పొందారు, తర్వాత జ్ఞానం ప్రాయః లోపమైపోతుంది. మీరే చక్రమంతా తిరిగి మళ్ళీ ఈ జ్ఞానాన్ని వింటున్నారు.
మనం మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసే అంటు కడుతున్నామని మీకు తెలుసు. ఇది దైవీ వృక్షపు అంటు. వారు ఆ వృక్షాలకు అంటు కడుతూ ఉంటారు. తండ్రి వచ్చి తేడాను తెలియజేస్తారు. వారి ప్లాన్ ఏమిటి, మీ ప్లాన్ ఏమిటి అనేది మీరు చూపిస్తారు కూడా. ప్రపంచం వృద్ధి చెందకూడదని వారు ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తారు. తండ్రి అయితే చాలా మంచి విషయం తెలుపుతున్నారు – అనేక ధర్మాలు వినాశనమవుతాయి మరియు దేవీ-దేవతా ధర్మం యొక్క ఫ్యామిలీ స్థాపనవుతుంది. సత్యయుగంలో ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క ఫ్యామిలీ ఉండేది, అప్పుడు ఇంకే ఇతర ఫ్యామిలీలు ఉండేవి కావు. ఈ సమయంలో భారత్ లో ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయో చూడండి. గుజరాతీ ఫ్యామిలీ, సిక్కు ఫ్యామిలీ….. వాస్తవానికి భారత్ లో ఒకే ఫ్యామిలీ ఉండాలి. చాలా ఫ్యామిలీలు ఉంటే తప్పకుండా గొడవలు జరుగుతాయి, తర్వాత సివిల్ వార్ (అంతర్యుద్ధాలు) జరుగుతాయి. ఫ్యామిలీలలో కూడా అంతర్యుద్ధాలు జరుగుతాయి. ఉదాహరణకు క్రైస్తవులు పరస్పరంలో ఒక ఫ్యామిలీ, ఒకే ఫ్యామిలీలో సోదరులిరువురూ పరస్పరంలో కలవరు. ఘర్షణ జరుగుతుంది. నీటిని కూడా పంచుకుంటారు. సిక్కు ధర్మం వారు, మేము మా ధర్మానికి చెందిన ఫ్యామిలీకి ఎక్కువ సుఖం ఇవ్వాలి అని భావిస్తారు, మోహముంటుంది కదా! తల కొట్టుకుంటూ (ఎంతో కష్టపడుతూ) ఉంటారు. అంతిమ సమయం వచ్చినప్పుడు పరస్పరంలో కొట్లాడుకోవడం మొదలుపెడతారు. వినాశనమైతే జరగాల్సిందే. ఎన్నో బాంబులను తయారుచేస్తూ ఉంటారు. పెద్ద యుద్ధం జరిగినప్పుడు రెండు బాంబులు వేసారు. ఇప్పుడు అలాంటివి ఎన్నో తయారుచేసారు. ఇది అర్థం చేసుకునే విషయం కదా! ఇది అదే మహాభారత యుద్ధమని మీరు అర్థం చేయించాలి. ఒకవేళ యుద్ధం ఆపకపోతే ప్రపంచమంతటికీ నిప్పు అంటుకుంటుందని పెద్ద-పెద్దవారు కూడా చెప్తూ ఉంటారు. నిప్పు అయితే అంటుకోవాల్సిందేనని మీకు తెలుసు.
తండ్రి ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. రాజయోగమనేది సత్యయుగం కోసము. ఏ దేవీ-దేవతా ధర్మమైతే ప్రాయః లోపమైపోయిందో, దానిని మళ్ళీ స్థాపన చేస్తారు. ఇప్పుడిది కలియుగము, దీని తర్వాత సత్యయుగం కావాలి. ఇప్పుడు కలియుగ వినాశనం కోసం ఈ మహాభారీ మహాభారత యుద్ధం ఉంది. ఈ విషయాలన్నింటినీ మంచి రీతిలో ధారణ చేసి అర్థం చేయించాలి ఎందుకంటే మనుష్యులు ఆసురీ సంప్రదాయానికి చెందినవారిగా ఉన్నారు, అందుకే జాగ్రత్తగా ఉండాలి. కల్పక్రితం వలె ఏ విఘ్నాలైతే రానున్నాయో, అవి తప్పకుండా వస్తాయి. ఇది తయారై-తయారవుతున్న డ్రామా. ఇందులో మనం బంధించబడి ఉన్నాము. స్మృతి యాత్రను ఎప్పుడూ మర్చిపోకూడదు. రాత్రి ప్రయాణీకుడా అలసిపోకు….. అనే పాట ఉంది కదా. దీని అర్థాన్ని ఎవరూ తెలుసుకోలేరు. రాత్రి పూర్తి అయ్యి పగలు రానున్నది. అర్ధకల్పం పూర్తయ్యింది, ఇప్పుడు సుఖం మొదలవుతుంది. తండ్రి ‘మన్మనాభవ’ అర్థాన్ని కూడా తెలియజేసారు. కేవలం గీతలో కృష్ణుని పేరు రాయడంతో అందులో అంత శక్తి లేదు. కృష్ణుడిని ఎప్పుడూ సర్వశక్తివంతుడు అని అనలేరు. వారు పూర్తి 84 జన్మలు తీసుకుంటారు, అందుకే గీతలో అంత శక్తి లేదు. ఇప్పుడు మనం మనుష్యమాత్రులందరి కళ్యాణం చేస్తున్నాము. ఎవరైతే కళ్యాణకారులుగా అవుతారో, వారికి వారసత్వం లభిస్తుంది. స్మృతి యాత్ర లేకుండా కళ్యాణం జరగదు. ఈ సమయంలో అందరూ విపరీత బుద్ధి కలవారిగా ఉన్నారు. వారు పరమాత్మ సర్వవ్యాపి అని అంటారు. వారు అనంతమైన తండ్రి అని మీరు అర్థం చేయించాలి. అనంతమైన తండ్రి నుండే భారతవాసులకు అనంతమైన వారసత్వం లభించింది. భారతవాసులే 84 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా చూస్తున్నారు, జ్ఞానమైతే మీరు వింటూనే ఉంటారు. రోజు-రోజుకు మీ వద్దకు చాలామంది కొత్త-కొత్త వారు వస్తూ ఉంటారు. ఒకవేళ ఇప్పుడే పెద్ద-పెద్దవారు వస్తే, ఇక సమయం పట్టదు, వెంటనే శబ్దం వ్యాపిస్తుంది. అలజడి ప్రారంభమవుతుంది. అందుకే యుక్తిగా, నెమ్మది-నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది. ఇది గుప్త జ్ఞానము. మీరు ఏం చేస్తున్నారు అనేది ఎవరికీ తెలియను కూడా తెలియదు. భక్తిలో దుఃఖం ఉంటుంది, జ్ఞానంలో సుఖముంటుంది. రావణునితో మీ యుద్ధం ఎటువంటిదో మీకు మాత్రమే తెలుసు, ఇంకెవ్వరూ తెలుసుకోలేరు. భగవానువాచ, తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వాలంటే నన్ను స్మృతి చేయండి, అప్పుడు మీ పాపాలు వినాశనమవుతాయి. పవిత్రంగా అయినట్లయితే నాతో పాటు తీసుకువెళ్తాను. ముక్తి అయితే అందరికీ లభించనున్నది. అందరూ రావణ రాజ్యం నుండి ముక్తులవుతారు. శివశక్తులైన బ్రహ్మాకుమార-కుమారీలే శ్రేష్ఠాచారీ ప్రపంచాన్ని స్థాపన చేస్తారని మీరు చెప్తారు. అది కూడా పరమపిత పరమాత్ముని శ్రీమతాన్ని అనుసరిస్తూ కల్ప క్రితం వలె చేస్తారు. 5 వేల సంవత్సరాల క్రితం శ్రేష్ఠాచారీ ప్రపంచము ఉండేదని బుద్ధిలో కూర్చోబెట్టాలి. ముఖ్యమైన పాయింట్లు బుద్ధిలో ధారణ అయినప్పుడు స్మృతి యాత్రలో ఉంటారు. కొంతమంది, ఇప్పుడింకా సమయముంది, చివర్లో పురుషార్థం చేసేస్తాము అని భావిస్తారు. కానీ మృత్యువుకు నియమం అంటూ లేదు. రేపే చనిపోతే! అందుకే చివర్లో గ్యాలప్ చేసేస్తాము అని భావించకండి. ఈ ఆలోచన ఇంకా పడేస్తుంది. ఎంత వీలైతే అంత పురుషార్థం చేస్తూ ఉండండి. శ్రీమతాన్ని అనుసరిస్తూ ప్రతి ఒక్కరు తమ కళ్యాణం చేసుకోవాలి. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తున్నాను మరియు వారి సేవను ఎంతగా చేస్తున్నాను అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ఆత్మిక ఈశ్వరీయ సేవాధారులు మీరే కదా. మీరు ఆత్మలను రక్షిస్తారు. ఆత్మ పతితం నుండి పావనంగా ఎలా తయారవుతుంది అనే యుక్తిని తెలుపుతారు. కృష్ణుడిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం కావు. వారు రాకుమారుడు, వారు ప్రారబ్ధాన్ని అనుభవించారు, వారిని మహిమ చేయాల్సిన అవసరం కూడా లేదు. దేవతలను ఏమి మహిమ చేస్తారు! అయితే, జన్మ దినాన్ని అందరూ జరుపుకుంటారు. ఇది కామన్ విషయము. ఇకపోతే వారు ఏం చేసారని? మెట్లు దిగుతూనే వచ్చారు. మంచి లేదా చెడు మనుష్యులైతే ఉంటారు. ప్రతి ఒక్కరికి తమ-తమ పాత్ర ఉంది. ఇది అనంతమైన విషయము. ముఖ్యమైన కొమ్మలు-రెమ్మలు లెక్కించబడతాయి. ఇకపోతే, ఆకులైతే ఎన్నో ఉన్నాయి. వాటిని ఎంతవరకని మీరు లెక్కిస్తూ ఉంటారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు – పిల్లలూ, శ్రమించండి. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇస్తే తండ్రితో బుద్ధి యోగం జోడించబడుతుంది. తండ్రి అంటారు – పవిత్రంగా అయినట్లయితే ముక్తిధామానికి వెళ్ళిపోతారని అందరికీ చెప్పండి. మహాభారత యుద్ధం వలన ఏం జరుగుతుంది అనేది ప్రపంచం వారికి తెలియదు. కొత్త ప్రపంచం కావాలి కావున తండ్రి ఈ యజ్ఞాన్ని రచించారు. మన యజ్ఞం పూర్తి అయితే, అందరూ ఈ యజ్ఞంలో స్వాహా అయిపోతారు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. సత్యాతి-సత్యమైన ఈశ్వరీయ సేవాధారులుగా అయి ఆత్మలందరినీ రక్షించే సేవ చేయాలి. అందరి కళ్యాణం చేయాలి. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి.
2. అత్యంత ప్రియమైన వస్తువును (తండ్రిని) ప్రేమగా స్మృతి చేయాలి. తయారై-తయారవుతున్న డ్రామాపై స్థిరంగా ఉండాలి. విఘ్నాలకు భయపడకూడదు.
వరదానము:-
ఏ విధమైన ‘నేను’ అనేది వచ్చినా, భారం తలపైకి వచ్చేస్తుంది. కానీ తండ్రి, భారమంతా నాకిచ్చేయండి, మీరు కేవలం నాట్యం చేయండి, ఎగరండి….. అని ఆఫర్ చేస్తున్నప్పుడు, ఇక ఈ ప్రశ్నలు ఎందుకు – సేవ ఎలా జరుగుతుంది, భాషణ ఎలా చేయాలి – మీరు కేవలం స్వయాన్ని నిమిత్తులుగా భావిస్తూ కనెక్షన్ ను పవర్ హౌస్ తో జోడించి కూర్చుండిపోండి, నిరుత్సాహ పడకండి, అప్పుడు బాప్ దాదా స్వతహాగా అంతా చేయిస్తారు. బాలకుల నుండి యజమానులుగా అవుతాము అని భావిస్తూ శ్రేష్ఠ స్థితిలో స్థితులై ఉన్నట్లయితే ప్రత్యక్ష ఫలాన్ని అనుభవం చేస్తూ ఉంటారు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!