27 November 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

November 26, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - జ్ఞాన ధనాన్ని దానం చేసేందుకు విచార సాగర మథనం చేయండి, దానం చేయాలనే అభిరుచి పెట్టుకున్నట్లయితే మథనం నడుస్తూ ఉంటుంది”

ప్రశ్న: -

జ్ఞాన మార్గంలో స్వయాన్ని సదా ఆరోగ్యంగా ఉంచుకునేందుకు సాధనమేమిటి?

జవాబు:-

తమను తాము సదా ఆరోగ్యంగా ఉంచుకునేందుకు బాబా ద్వారా ఏదైతే జ్ఞానమనే గడ్డి (మురళీ) లభిస్తుందో, అది తిని, తర్వాత నెమరు వేయాలి అనగా మథనం చేయాలి. ఏ పిల్లలకైతే మథనం చేసే అనగా జీర్ణం చేసుకునే అలవాటు ఉందో, వారు అనారోగ్యం పాలవ్వరు. ఎవరిలోనైతే వికారాల వ్యాధి ఉండదో, వారే సదా ఆరోగ్యవంతులు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నీవు ప్రేమ సాగరుడవు…

ఓంశాంతి. పిల్లలు పాటను విన్నారు. మనుష్యులు పాటలు మొదలైనవాటిని ఏవైతే తయారుచేస్తారో, శాస్త్రాలు మొదలైనవి ఏవైతే వినిపిస్తారో, వాటి గురించి ఏమీ అర్థం చేసుకోరు. ఏవైతే చదువుతూ వచ్చారో, వాటి ద్వారా ఎవరి కళ్యాణం జరగలేదు, ఇంకా అకళ్యాణమే జరుగుతూ వచ్చింది. సర్వుల కళ్యాణకారీ ఒక్క ఈశ్వరుడు మాత్రమే. మన కళ్యాణం చేసేవారు వచ్చి ఉన్నారని మీరు అర్థం చేసుకుంటారు. వారు కళ్యాణం యొక్క మార్గాన్ని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా భారతవాసులైన మీకు మరియు మొత్తం ప్రపంచానికి కళ్యాణం చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. సత్యయుగంలో అందరి కళ్యాణం జరిగి ఉంది, మీరంతా సుఖధామంలో ఉండేవారు మరియు మిగిలినవారంతా శాంతిధామంలో ఉండేవారు. ఈ విషయం పిల్లల బుద్ధిలో ఉంది కానీ ఈ పాయింట్ జారిపోతుంది, పూర్తిగా ధారణ చేయరు. ఒకవేళ ఒక్క పాయింటుపై విచార సాగర మథనం చేస్తూ ఉన్నా కూడా, ఇలా జరగదు. జంతువులలో ఉన్నంత తెలివి కూడా నేటి మనుష్యులలో లేదు. జంతువు (ఆవు) గడ్డి తిన్న తర్వాత నెమరు వేస్తూ ఉంటుంది. మీకు కూడా భోజనం లభిస్తుంది. కానీ మీరు దానిని రోజంతా నెమరు వేయరు. ఆవులైతే రోజంతా నెమరు వేస్తూనే ఉంటాయి. ఇక్కడ మీకు ఈ జ్ఞానమనే గడ్డి లభిస్తుంది. యోగము మరియు జ్ఞానము. దీని గురించి రోజంతా విచార సాగర మథనం చేస్తూ ఉండాలి. ఎవరికైతే సేవ పట్ల అభిరుచి ఉండదో, వారు విచార సాగర మథనం చేసి ఏం చేస్తారు. అభిరుచి లేకపోతే ఏమీ చేయరు కూడా. కొంతమందికి జ్ఞాన ధనాన్ని ఇచ్చే అభిరుచి ఉంటుంది. మనుష్యులు గోశాలకు వెళ్ళి ఆవులకు గడ్డి మొదలైనవి ఇస్తారు. దానిని కూడా పుణ్యంగా భావిస్తారు. తండ్రి మీకు ఈ జ్ఞానమనే గడ్డిని తినిపిస్తారు. దీనిపై విచార సాగర మథనం చేస్తూ ఉన్నట్లయితే సంతోషం కూడా ఉంటుంది మరియు సేవ పట్ల అభిరుచి కూడా ఉంటుంది. కొందరు చెంబు నిండా తీసుకుంటారు లేక ఒక్క బిందువే తీసుకుంటారు, వారు కూడా స్వర్గంలోకి వెళ్తారు. స్వర్గ ద్వారాలైతే తెరుచుకునేదే ఉంది. వాస్తవానికి జ్ఞాన సాగరుడిని మింగేయాలి. కొందరు పూర్తిగా మింగేస్తారు, కొందరు ఒక్క బిందువును తీసుకుంటారు, అయినా వారు స్వర్గంలోకైతే వెళ్తారు. ఇకపోతే, ఎంతగా ధారణ చేస్తారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. ఇకపోతే స్వర్గంలోకైతే ఒక్క బిందువును తీసుకున్నా కూడా వెళ్తారు. మనుష్యులు మరణించేటప్పుడు వారికి గంగ యొక్క ఒక్క బిందువును అందిస్తారు. కొందరి ఇళ్ళలో ఎప్పుడూ గంగా జలాన్నే తాగుతారు. ఎంతగా తాగుతూ ఉండవచ్చు. గంగ అయితే ప్రవహిస్తూ ఉంటుంది. దానినైతే ఎవరూ మింగలేరు. సాగరాన్ని మింగేశారని మీ గురించి అంటూ ఉంటారు. ఎవరైతే జ్ఞాన సాగరునికి సమీపంగా వస్తారో, ఎక్కువ సేవ చేస్తారో, వారే విజయ మాలలో కూర్చబడతారు. ఎవరు ఎంతగా మింగుతారో మరియు ఇతరుల కళ్యాణం చేస్తారో, వారు పదవిని కూడా పొందుతారు. ఎంతగా ధారణ చేస్తారో, అంత సంతోషం కూడా ఉంటుంది. ధనవంతులకు సంతోషం ఉంటుంది కదా. ఎవరి వద్దనైతే ఎంతో అపారమైన ధనముంటుందో, దానం చేస్తారో, కాలేజీలు, ధర్మశాలలు, మందిరాలు మొదలైనవి కట్టిస్తారో, వారికి అంత సంతోషం కూడా ఉంటుంది. ఇక్కడ మీకు లభించేవి అవినాశీ జ్ఞాన రత్నాలు, 21 జన్మల కోసం అవినాశీ ఖజానా. ఎవరైతే మంచి రీతిగా ధారణ చేసి, తర్వాత దానం కూడా చేస్తారో, వారికి మంచి పదవి లభిస్తుంది. కొందరు పిల్లలు రాస్తారు – బాబా, ఉద్యోగం వదిలేసి ఈ ఆత్మిక సేవలో నిమగ్నమవ్వాలని, ప్రొజెక్టరు, ప్రదర్శినీ తీసుకొని తిరుగుతూ ఉండాలి అని నాకు అనిపిస్తుంది. ఎవరికైనా ఒక్క బిందువు లభించినా సరే, వారి కళ్యాణం జరుగుతుంది, సేవ పట్ల నాకు చాలా అభిరుచి ఉంది అని అంటారు. ఇకపోతే, ప్రతి ఒక్కరి అవస్థ గురించి బాబాకు తెలుసు. సేవతో పాటు గుణాలు కూడా కావాలి. క్రోధము ఉండకూడదు, అలాగే తప్పుడు ఆలోచనలేవీ రాకూడదు. వికారాల వ్యాధి ఏదీ ఉండకూడదు. మంచి ఆరోగ్యం ఉండాలి. ఎవరిలోనైతే వికారాలు తక్కువగా ఉన్నాయో, వారిని బాబా ఆరోగ్యవంతులని అంటారు. బాబా మహిమ చేస్తారు కదా. ఎవరెవరు మంచి మహారథులు అని అంటూ ఉంటారు కూడా. వారు అసురులకు మరియు దేవతలకు యుద్ధం జరిగినట్లుగా, దేవతలు విజయం పొందినట్లుగా చూపించారు. ఇప్పుడు మనకు 5 వికారాల రూపీ అసురులతో యుద్ధం జరుగుతుంది. అంతేకానీ, అసురులు అంటే వేరే రకమైన మనుష్యులెవరూ కారు. ఎవరిలోనైతే ఆసురీ స్వభావం ఉంటుందో, వారినే అసురులని అంటారు. నంబరువన్ ఆసురీ స్వభావం కామము. అందుకే సన్యాసులు కూడా దీనిని వదిలి పారిపోతారు. ఈ ఆసురీ అవగుణాలను వదలడంలో శ్రమ అనిపిస్తుంది. ఉండడం కూడా గృహస్థంలోనే ఉండాలి కానీ ఆసురీ స్వభావాన్ని విడిచిపెట్టాలి. పవిత్రంగా అవ్వడంతో ముక్తి-జీవన్ముక్తి లభిస్తుంది. ఇది ఎంత భారీ ప్రాప్తి. వారైతే ఇళ్ళు-వాకిళ్ళను వదిలి పారిపోతారు కానీ ప్రాప్తి ఏమీ లేదు. ఈ చిత్రాలలో ఎంతో మంచి-మంచి అర్థం చేసుకోవాల్సిన విషయాలున్నాయి. వారు కేవలం చిత్రాల షో చేస్తారు. కేవలం చిత్రాలను చూసేందుకు ఎంతమంది వెళ్తారు. లాభమేమీ ఉండదు. ఇక్కడ ఈ చిత్రాలలో ఎంత జ్ఞానముంది. వీటితో చాలా లాభం కలుగుతుంది. ఇందులో ఆర్ట్ మొదలైనవాటి విషయమేమీ లేదు, అలాగే తయారుచేసేవారి తెలివితేటలు కూడా లేవు. మనుష్యులు తయారుచేసిన చిత్రాలపైనైతే వారి పేర్లు వ్రాయబడి ఉంటాయి. ఆర్టిస్టుకు కూడా బహుమతి లభిస్తుంది. చాలామంది, తండ్రినైతే తప్పకుండా స్మృతి చేయాలి అని ఈ మాత్రం అయితే అర్థం చేసుకుంటారు. ఈ మాత్రం అన్నా కూడా, ప్రజలుగా అవుతారు. ప్రజలైతే అనేకులు తయారయ్యేది ఉంది. నేను జ్ఞాన సాగరుడను. ఎవరికైనా ఒక్క బిందువు లభించినా కూడా, స్వర్గంలోకి తప్పకుండా వస్తారు.

ప్రదర్శనీలు, మేళాల ద్వారా చాలామంది కళ్యాణం జరుగుతుందని మీరు అర్థం చేసుకుంటారు. ఈశ్వరుడు కళ్యాణకారి కదా. మీ కళ్యాణం కూడా జరుగుతూ ఉంది. కానీ దీని కోసం మళ్ళీ స్వయం విచార సాగర మథనం చేస్తూ ఉండాలి. స్మృతిలోకి తీసుకొస్తూ ఉంటే చాలా లాభముంటుంది. తప్పుడు మాటలను ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయాలి. తండ్రి అంటారు – నేను మీకు చాలా మంచి విషయాలను వినిపిస్తాను. నంబర్ వన్ ముఖ్యమైన విషయం ఒక్కటే – ఎవరికైనా సరే, తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. కేవలం ఒక్క తండ్రిని స్మృతి చేయండి, అంతా వారే. భక్తి మార్గంలో ఇలాంటి వారు చాలామంది ఉంటారు. వారికి చెప్పండి – మీరు చాలా మంచి పని చేస్తున్నారు, అంతా పరమాత్మనే చేయిస్తారని వేలితో పైకి సూచిస్తారు, ఆ సర్వుల కళ్యాణకారి పైన ఉంటారు. వాస్తవానికి ఆత్మలైన మీరు కూడా అక్కడే ఉంటారు. జ్ఞానానికి సంబంధించిన ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు.

తండ్రి అంటారు – పిల్లలూ, ఇప్పుడు మీ ఈ వస్త్రం (శరీరం) కుళ్ళిపోయింది. సత్య-త్రేతా యుగాలలో ఎంత మంచి వస్త్రము ఉండేది. ఇప్పుడు కుళ్ళిపోయిన వస్త్రాన్ని ఎంతవరకని ధరిస్తారు. కానీ ఈ విషయాన్ని ఎవరూ అర్థం చేసుకోరు. తండ్రి వచ్చి అర్థం చేయించినప్పుడే అర్థం చేసుకుంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు – జ్ఞానాన్ని ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారు సాగరుడు. ఎవరైతే సాగరాన్ని మింగేస్తారో, వారే విజయ మాలలో పూసలుగా అవుతారు. వారు సదా సేవలోనే తత్పరులై ఉంటారు. బాబా పిల్లలను పావనంగా తయారుచేయడానికే వచ్చారు. పావనంగా అయి తిరిగి వెళ్ళాలి. ఎక్కడ నుండైతే వచ్చారో, మళ్ళీ అక్కడికే నంబరువారుగా వెళ్తారు. ముందు-వెనుక వెళ్ళలేరు. నాటకంలో పాత్రధారుల పాత్ర సమయమనుసారంగా జరుగుతుంది కదా. ఇందులో కూడా, ఎవరైతే పాత్రధారులున్నారో, వారు నంబరువారుగా తమ-తమ సమయమనుసారంగా వస్తూ ఉంటారు. ఇది తయారుచేయబడిన అనంతమైన నాటకము. బ్రహ్మతత్వంలో ఆత్మలైన మనం బిందువుల వలె ఉంటాము. అక్కడ ఇంకేం ఉంటుంది. బిందువైన ఆత్మ ఎక్కడ, ఇంత పెద్ద శరీరం ఎక్కడ. ఆత్మ ఎంత తక్కువ స్థానం తీసుకుంటుంది. బ్రహ్మ మహతత్వం ఎంత పెద్దది. ఎలాగైతే పోలార్ కు అంతం లేదో, అలా బ్రహ్మ మహతత్వానికి కూడా అంతం ఉండదు. అంతాన్ని పొందేందుకు ఎంతగా ప్రయత్నిస్తారు కానీ పొందలేరు. ఎంతగా తల బాదుకుంటూ ఉంటారు. కానీ దానిని పట్టుకునేందుకు లేక దాటి వెళ్ళేందుకు అది ఒక వస్తువేమీ కాదు. సైన్స్ యొక్క గర్వం ఎంతగా ఉంది. దాని వలన లాభమేమీ లేదు. ఆకాశమే ఆకాశము, పాతాళమే పాతాళము అని విన్నారు కదా. చంద్రునిలో ప్రపంచం ఉంటుందని భావిస్తారు. ఇది కూడా డ్రామాలో వారి పాత్ర. లాభమేమీ లేదు. తండ్రి వచ్చి మనల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. ఎంత లాభముంది. ఇకపోతే, చంద్రునిపైకి వెళ్ళడము, ఛూ మంత్రంతో (ఇంద్రజాలం) విభూతి మొదలైనవాటిని తీయడం… వీటితో ఏం లాభము. ఇప్పుడు మనం అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటాము. కల్ప-కల్పము తీసుకుంటూ వచ్చాము. ప్రపంచ చరిత్ర-భూగోళాలు రిపీట్ అవుతాయి. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. ప్రపంచంలో మొట్టమొదట కేవలం భారత్ మాత్రమే ఉండేది. భారతవాసులే విశ్వానికి యజమానులుగా ఉండేవారు. అక్కడ దేవతలకు ఇతర ఏ ఖండాల గురించి తెలియదు. ఇవి తర్వాత వృద్ధి చెందుతాయి. కొత్త-కొత్త ధర్మ స్థాపకులు వచ్చి తమ-తమ ధర్మాలను స్థాపన చేస్తారు. ఇకపోతే, వారేమీ సద్గతినివ్వరు, కేవలం ధర్మ స్థాపన చేస్తారు. వారికి మహిమ ఏం ఉంటుంది. ముక్తిధామం నుండి పాత్రను అభినయించేందుకు వస్తారు. మనుష్యులంటారు – మోక్షంలోనే కూర్చుండిపోవాలి, ఈ ఆవాగమన (రాకపోకల) చక్రంలోకి అసలు ఎందుకు రావాలి అని. కానీ ఇందులోకి రావాల్సిందే, పునర్జన్మలు తీసుకోవాల్సిందే, మళ్ళీ తిరిగి వెళ్ళాలి. ఇది తయారై-తయారవుతున్న డ్రామా చక్రము. లక్షల సంవత్సరాల డ్రామా ఏదీ ఉండనే ఉండదు. ఇది సహజమైన అనాది డ్రామా. దీనిని ఈశ్వరీయ సృష్టి రచన అని అంటారు. రచయిత మరియు రచనల అద్భుతం ఏదైతే ఉందో, దానిని తెలుసుకోవాల్సి ఉంటుంది. సృష్టి చక్రాన్ని తెలుసుకునేందుకు పురుషార్థం చేసే మనుష్యులెవరూ ఉండరు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనే ఆలోచన అసలు రానే రాదు. అన్నిటికంటే అతి పురాతనమైన చిత్రము శివలింగము. ఖుదా వచ్చి ఉన్నారు, తర్వాత వారి స్మృతిచిహ్నాన్ని తయారుచేస్తారు. ముందుగా శివుని పూజ మొదలైనప్పుడు వజ్రాల లింగాన్ని తయారుచేస్తారు. తర్వాత భక్తి రజో, తమోగా అయినప్పుడు రాతితో కూడా తయారుచేస్తారు. శివబాబా అయితే వజ్రాలతో తయారుచేయబడి లేరు. వారు ఒక బిందువు, పూజ కోసం పెద్దదిగా తయారుచేస్తారు. మేము వజ్రాల శివలింగాన్ని తయారుచేయాలని భావిస్తారు. అంత పెద్ద సోమనాథుని మందిరంలో ఒక్క బిందువును పెడితే అర్థం కాదు కూడా. భక్తి మార్గంలో ఏమేమి జరుగుతుందో తండ్రి అర్థం చేయిస్తారు. సైన్స్ వారు ఆవిష్కరణలు చేస్తూ ఉంటారు. మంచి-మంచి వస్తువులను కనిపెడుతూ ఉంటారు. వినాశనం కోసం కూడా కనిపెడుతూ ఉంటారు. ఇంతకుముందు విద్యుత్తు ఉండేది కాదు, మట్టి దీపాలను వెలిగించేవారు.

తండ్రి అర్థం చేయిస్తారు – మధురాతి-మధురమైన పిల్లలూ, కొద్దిలోనే రాజీ పడకండి. మంచి రీతిలో ధారణ చేసి సాగరాన్ని మింగేయండి. ఎవరైతే మంచి సేవ చేస్తారో, వారు పదవి కూడా మంచిదే పొందుతారు. రోజంతా సంతోషం యొక్క పాదరసం ఎక్కి ఉండాలి. ఇది ఛీ-ఛీ ప్రపంచము. ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోతాము. పాత ప్రపంచమైతే తప్పకుండా సమాప్తమవ్వనున్నది, ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి. ఈ లోపు ఎంత సేవ చేయాలి. కేవలం భారత్ లో మాత్రమే కాదు, విదేశాలలో కూడా అన్ని వైపులా చుట్టి రావాలి. వార్తాపత్రికల ద్వారా విదేశాలలోని మూల-మూలల వరకు కూడా తెలిసిపోవాలి. ఈ మెట్ల చిత్రం మొదలైనవాటితో వెంటనే అర్థం చేసుకుంటారు. తండ్రి పిల్లలను మళ్ళీ స్వర్గవాసులుగా తయారుచేసేందుకే వస్తారు. తప్పకుండా లక్ష్మీనారాయణులు భారత్ లోనే రాజ్యం చేసి వెళ్ళారు. భారత్ ప్రాచీన దేశమని చాలా మహిమ చేస్తారు. భారత్ అలా ఉండేదని, భారత్ లో అటువంటి పవిత్రమైన దేవీలు ఉండేవారని చాలా మహిమ చేస్తారు. మనం తండ్రి నుండి 21 జన్మల ప్రారబ్ధాన్ని పొందుతామని మీకు తెలుసు. తండ్రి పూర్తిగా సహజంగా చదివిస్తారు. ద్రౌపది పాదాలను ఒత్తారని చూపిస్తారు, అలాంటిదేమీ లేదు. ఇక్కడ బాబా అంటారు – పిల్లలు భక్తి మార్గంలో ఎదురుదెబ్బలు తిని అలసిపోయారు, ఇప్పుడు నేను మీ అలసటను దూరం చేస్తాను, మీరు ఎదురుదెబ్బలు తింటూ-తింటూ పతితులుగా అయ్యారు. తండ్రి అంటారు – నేను మీ అలసటను దూరం చేస్తున్నాను, ఇక తర్వాత ఎప్పుడు దుఃఖాన్ని చూడరు. కొద్దిగా కూడా దుఃఖం అన్న పేరే ఉండదు. ఇకపోతే, పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందాలి. మంచి పదవిని పొందితే అంటారు కదా – వీరు గత జన్మలో మంచి కర్మలు చేసారు అని. మహిమ అయితే జరుగుతుంది కదా. కానీ వీరు ఎప్పుడు పురుషార్థం చేసి ఈ పదవిని పొందారో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి మీకు అటువంటి కర్మలను నేర్పిస్తారు. మీకు కూడా చెప్తారు – మంచి కర్మలు చేసి ఉన్నత పదవిని పొందండి అని. ఇక్కడ మనుష్యుల కర్మలు వికర్మలుగా అవుతాయి. అక్కడ ఉన్నదే స్వర్గము. అక్కడ కర్మలు అకర్మలుగా ఉంటాయి. అక్కడ ఈ జ్ఞానం ఉండదు. తండ్రి అంటారు – కర్మల గతి గురించి నాకు తెలుసు. ఈ సమయంలో ఎవరైతే మంచి కర్మలు చేస్తారో, వారు ఫలాన్ని కూడా మంచిదే పొందుతారు. ఇది కర్మక్షేత్రము. కొందరు చాలా మంచి కర్మలు చేస్తారు. కొంతమందికి కేవలం సేవా గురించి మాత్రమే చింత ఉంటుంది. బాబా, మాలో ఏవైనా లోపాలున్నాయా అని అడుగుతారు. లేదు, సేవను అయితే ఎంత చేయగలరో, అంత చేస్తారు, సేవ వృద్ధి చెందుతూ ఉంటుంది. సేవ చేసేవారు కూడా వెలువడుతూ ఉంటారు. ఇంకా కొద్ది రోజులే ఉన్నాయని మనస్సులో ధైర్యముంది. ఇప్పుడు ఎలాంటి పురుషార్థం చేయాలంటే, అక్కడ కూడా ఉన్నత పదవిని పొందాలి. బాబా ఈ జ్ఞానమనే గడ్డిని తినిపిస్తారు. బాబా అంటారు – దీనిని నెమరు వేస్తూ ఉంటే ధారణ పక్కా అవుతుంది, సంతోషం యొక్క పాదరసం కూడా ఎక్కుతుంది. చాలా సేవ చేయాలి, చాలామందికి సందేశాన్ని ఇవ్వాలి. మీరు సందేశకుని పిల్లలు, సందేశకులు. ఒకానొక రోజు పెద్ద వార్తాపత్రికలలో కూడా మీ చిత్రాలు ముద్రించబడతాయి. విదేశాల వరకు పత్రికలు వెళ్తాయి కదా. ఈ జ్ఞానమైతే గాడ్ ఫాదర్ అందించినది అని చిత్రాల ద్వారా అర్థం చేసుకుంటారు. ఇకపోతే, మన్మనాభవగా అవ్వడంలోనే శ్రమ ఉంది. ఆ భారతవాసులే శ్రమిస్తారు. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి ఏవైతే మంచి-మంచి విషయాలను వినిపిస్తారో, వాటిపై విచార సాగర మథనం చేసి అనేకుల కళ్యాణకారిగా అవ్వాలి. తప్పుడు మాటలను ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయాలి.

2. ఏదైనా ఆసురీ స్వభావముంటే, దానిని వదిలేయాలి. తండ్రి జ్ఞానమనే గడ్డిని ఏదైతే తినిపిస్తారో, దానిని నెమరు వేస్తూ ఉండాలి.

వరదానము:-

హోలీ హంసలైన మీది పవిత్ర స్వరూపము మరియు సదా గుణాల రూపీ ముత్యాలను ఏరుకోవడం మీ కర్తవ్యము. అవగుణాల రూపీ రాళ్ళను బుద్ధిలో ఎప్పుడూ స్వీకరించకూడదు. కానీ ఈ కర్తవ్యాన్ని పాలన చేసేందుకు సదా ఒక ఆజ్ఞ గుర్తుండాలి – చెడు ఆలోచించకూడదు, చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు….. ఎవరైతే ఈ ఆజ్ఞను సదా స్మృతిలో ఉంచుకుంటారో, వారు సదా సాగర తీరంలో ఉంటారు. హంసల నివాస స్థానమే సాగరము.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top