27 May 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

May 26, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - విచార సాగర మథనం చేసి భారత్ యొక్క చరిత్ర-భౌగోళికాన్ని మరియు కొత్త ప్రపంచం యొక్క శకాన్ని ఋజువు చేసి చెప్పండి, అప్పుడు కల్పం యొక్క ఆయువు ఋజువవుతుంది’’

ప్రశ్న: -

పిల్లలైన మీకు ఇప్పుడు మనుష్యులకు భిన్నమైన ఏ తపన ఏర్పడింది?

జవాబు:-

మీకు ఏ తపన ఉందంటే – విశ్వం యొక్క నావ ఏదైతే మునిగిపోయి ఉందో, దానిని మేము రక్షించాలి, అందరికీ సత్యాతి-సత్యమైన సత్యనారాయణ కథను లేక అమరకథను వినిపించాలి, తద్వారా అందరి ఉన్నతి జరుగుతుంది. ఇంత పెద్ద-పెద్ద మహళ్ళు, విద్యుత్తు మొదలైనవన్నీ ఉన్నాయి కానీ వారికి, ఇదంతా కృత్రిమమైన, అసత్యమైన ఉన్నతి అని తెలియదు. సత్యమైన ఉన్నతి అయితే సత్యయుగంలో ఉండేది, దానిని ఇప్పుడు తండ్రి వచ్చి కలిగిస్తారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

చివరికి నేటికి ఆ రోజు వచ్చింది… (ఆఖిర్ వహ్ దిన్ ఆయా ఆజ్…)

ఓంశాంతి. పేదల పెన్నిధి రావడమైతే వచ్చారు, కానీ ఎవ్వరూ సరైన తిథి-తారీఖులను రాయరు. ఏదో ఒక తేదీ, సంవత్సరం అయితే ఉండాలి కదా. ఏ విధంగానైతే, ఈ రోజు ఫలానా తారీఖు, ఫలానా మాసము, ఫలానా సంవత్సరం అని చెప్తారు కదా. పేదల పెన్నిధి ఎప్పుడు వచ్చారు? ఈ విషయాన్ని రాయలేదు. ఏ విధంగానైతే లక్ష్మీ-నారాయణులు సత్యయుగ ఆదిలో ఉండేవారు, కావున ఫలానా శకంలో వీరి రాజ్యం ఉండేదని వారి శకం కూడా ఉండాలి కదా. లక్ష్మీ-నారాయణుల శకం కూడా ఉంది మరియు ఇతరులకు కూడా తమ తమ శకాలున్నాయి. గురునానక్ గురించి కూడా, ఫలానా శకంలో జన్మించారని రాసి ఉండవచ్చు. శకం లేకుండా ఏమీ తెలియదు. ఈ లక్ష్మీ-నారాయణులు భారత్ లో రాజ్యం చేసేవారు, కనుక తప్పకుండా శకం ఉండాలి, వీరి శకము అనగా స్వర్గం యొక్క శకము. లక్ష్మీ-నారాయణులు సత్యయుగంలో రాజ్యం చేసారు, ఏ శకం నుండి ఏ శకం వరకు అని చెప్పాలి, అప్పుడు 5000 సంవత్సరాలనే చెప్తారు. గీతా జయంతికి కొద్దిగా వేరే సమయము చూపించాలి. శివ జయంతి మరియు గీత జయంతి సమయంలో తేడా ఉండదు. కృష్ణ జయంతి సమయము వేరేగా ఉంటుంది. లక్ష్మీ-నారాయణులది కూడా అదే శకమని రాయాల్సి ఉంటుంది. ఇది కూడా విచార సాగర మథనం చేయాల్సి ఉంటుంది. పబ్లిక్ కు ఇది ఎలా తెలియజేయాలి. లక్ష్మీ-నారాయణుల శకాన్ని ఎందుకు చూపించరు. విక్రమ శకాన్ని చూపిస్తారు, మరి వికర్మాజీత్ శకం ఎక్కడ ఉంది! ఇప్పుడు పిల్లలైన మీకు మంచి రీతిలో తెలుసు. భారత్ యొక్క చరిత్ర-భౌగోళికాలను, కొత్త ప్రపంచ శకాన్ని కూడా చూపించాలి. కొత్త ప్రపంచంలో ఆది సనాతన దేవీ-దేవతల రాజ్యం ఉండేది, కనుక దానిని వారి శకము అని కూడా అంటారు. లెక్క తీస్తే వారు వచ్చి 5000 సంవత్సరాలైనట్లు. ఈ విషయాన్ని ఋజువు చేసి చెప్పినట్లయితే కల్పము యొక్క ఆయువు ఋజువు అవుతుంది మరియు లక్షల సంవత్సరాలని ఏదైతే రాసారో, అది అసత్యమవుతుంది. ఈ విషయాలను తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. వారు మనుష్య సృష్టికి బీజరూపుడు, సృష్టి ఆది మధ్యాంతాలు తెలిసినవారు. లక్ష్మీ-నారాయణుల వంశము వచ్చి 5000 సంవత్సరాలయ్యింది మరియు సీతా-రాములు వచ్చి 3,750 సంవత్సరాలయ్యింది, ఆ తర్వాత వారి వంశము నడిచింది. ఆ తర్వాత విక్రమ శకం ప్రారంభమవుతుంది. విక్రమ రాజు యొక్క శకం ఏదైతే ఉందో, అది కూడా యథార్థమైనది కాదు, మధ్యలో కొన్ని సంవత్సరాలు మాయమైపోయాయి. వాస్తవానికి 2500 సంవత్సరాలు క్రితం అని ఉండాలి. ఇస్లాములది, బౌద్ధులది కూడా కొంత సమయం తర్వాత ప్రారంభమవుతుంది. వీరు 2000 సంవత్సరముల క్రితం నుండి తమ శకాన్ని చూపించారు.

మీకు తెలుసు, మనమంతా దేవీ-దేవతలుగా ఉండేవారము, మనమే చక్రంలో తిరిగి ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము. ఈ చరిత్ర-భౌగోళికాలను మంచి రీతిలో అర్థం చేయించాలి. బ్రాహ్మణుల నుండి మళ్ళీ దేవతలుగా అవుతారు. చరిత్ర-భౌగోళికాలను అర్థం చేసుకుంటారు, అలాగే శకము గురించి కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మెట్ల చిత్రంలో శకము కూడా రాయబడి ఉంది. భారత్ యొక్క శకమే మాయమైపోయింది. ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో, వారి శకాన్నే మాయం చేసేసారు. పూజారుల శకము ప్రారంభమయ్యింది. చూడండి, అశోక స్థూపము అని అంటారు. ద్వాపరంలో అశోకులు (శోకం లేనివారు) అయితే ఎవ్వరూ లేరు. అశోక స్థూపమైతే అర్ధకల్పము సత్య-త్రేతా యుగాల వరకు నడుస్తుంది. దానిదే ఈ మహిమ అంతా. శోక స్థూపానికి మహిమ లేదు. ఇక్కడైతే దుఃఖమే దుఃఖముంది. అశోక హోటల్ అని పేరు పెట్టారు, కానీ అలా లేదు. అర్ధకల్పము పాటు క్షణభంగుర సుఖాన్ని అశోకము అని అన్నారు. ఇక్కడ అశోకము (శోకం రహితమైనది) ఏదీ లేదు. మాంసము-మద్యము, అశుద్ధమైనవి తింటూ ఉంటారు. మనం దుఃఖితులుగా ఎలా అయ్యాము? కారణమేమిటి అనేది ఏమీ అర్థం చేసుకోరు.

ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, ఎవరైతే కల్పక్రితము స్వర్గంలో సుఖమయంగా ఉండేవారో, వారే ఈ విషయాలను వింటారు. ఎవరైతే అక్కడ ఉండేవారు కారో, వారు వినరు కూడా. ఎవరైతే భక్తి పూర్తి చేసి ఉంటారో, వారు వచ్చి ఎంతో కొంత శిక్షణ తీసుకుంటారు. జ్ఞానాన్ని విని మనుష్యులు సంతోషిస్తారు. చిత్రాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. శకము కూడా రాయబడి ఉంది. బ్రహ్మా, విష్ణువుల జన్మ కూడా ఇక్కడే ఉండాలి. ఇకపోతే, శంకరుడైతే సూక్ష్మవతనంవారు మరియు శివుడు మూలవతనంలో ఉంటారు. సూక్ష్మ, మూలవతనాల గురించి కూడా తెలియదు, అందుకే శివ శంకరులను కలిపేసారు. శివుడు పరమపిత పరమాత్మ, శంకరుడు దేవత. ఇరువురిని కలపలేము. ఇప్పుడు పిల్లలైన మీకు ఎంత వివేకం లభించింది, ఎంత నషా ఎక్కుతుంది. మనుష్యులకు ఎలా అర్థం చేయించాలి అని రాత్రింబవళ్ళు ఇదే చింత ఉండాలి. వివేకహీనులకే అర్థం చేయించడం జరుగుతుంది. భారత్ మొదట ఎలా ఉండేది, మళ్ళీ ఎలా దిగజారిపోయింది అనేది మీరు అర్థం చేసుకున్నారు. ప్రపంచమైతే, మేము చాలా ఉన్నతి పొందామని భావిస్తుంది. ఇంతకుముందు అయితే ఇంత పెద్ద మహళ్ళు, విద్యుత్తు మొదలైనవేవీ ఉండేవి కావు. ఇప్పుడైతే చాలా ఉన్నతిలోకి వెళ్తున్నారు ఎందుకంటే ఇది కృత్రిమమైనది, అసత్యమైనదని వారికి తెలియనే తెలియదు. సత్యమైన ఉన్నతి అయితే సత్యయుగంలో ఉండేది. ఈ విషయాన్ని అర్థం చేయించాలి, వారు వారి నషాలో ఉన్నారు, మీ నషా మీదే. విశ్వం యొక్క నావ ఏదైతే మునిగిపోయి ఉందో, దానిని మనం బాబా జ్ఞానం ద్వారా రక్షిస్తున్నామని మీకు సంతోషం ఉంది. బాబా మనకు సత్య నారాయణ కథను లేక అమర కథను మళ్ళీ వినిపిస్తున్నారు. భక్తి మార్గంలోనైతే అనేక కథలను వినిపిస్తారు. అవన్నీ అసత్యమైన కథలని, వాటి వలన లాభమేమీ లేదని మీరు అర్థం చేసుకున్నారు. ఈ శాస్త్రాలు మొదలైనవి చదువుతూ వచ్చారు, అయినా కూడా సృష్టి అయితే తమోప్రధానంగానే అవుతూ ఉంటుంది. మెట్లు దిగుతూనే వచ్చారు, లాభమేం కలిగింది? సిక్కు ధర్మంవారి మేళా కూడా జరుగుతుంది. అక్కడ సరస్సులో స్నానం చేస్తారు. వారు గంగ, యమున మొదలైనవాటిని నమ్మరు. కుంభ మేళాలకు సిక్కులు వెళ్ళరు. వారు తమ సరస్సుకే వెళ్తూ ఉండవచ్చు. దానికోసం వారికి ప్రత్యేకమైన కార్యక్రమం ఉంటుంది. అప్పుడప్పుడు దానిని శుభ్రం చేయడానికి కూడా వెళ్తారు. సత్యయుగంలోనైతే ఈ విషయాలు ఉండవు. సత్యయుగంలోనైతే నదులు మొదలైనవి పూర్తిగా శుభ్రంగా అయిపోతాయి. అక్కడ ఎప్పుడూ గంగ, యమునలో చెత్త, మురికి చేరవు. అక్కడి గంగా జలానికి మరియు ఇక్కడి గంగా జలానికి రాత్రికి-పగలకు ఉన్నంత తేడా ఉంది. ఇక్కడైతే చాలా చెత్త పడుతుంది. అక్కడైతే ప్రతి వస్తువు ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది.

మన రాజధాని ఆ విధంగా ఉంటుందని ఇప్పుడు పిల్లలైన మీకు చాలా సంతోషం ఉంది. మనం మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత శ్రీమతము ఆధారంగా స్వర్గ స్థాపన చేస్తున్నాము. దాని పేరే స్వర్గము, వైకుంఠము, అక్కడ లక్ష్మీ-నారాయణుల రాజ్యం ఉండేది. శాంతిధామము అన్నా లేక నిర్వాణధామము అన్నా ఒక్కటే. మనం శాంతిధామంలో ఎలా ఉంటామో అన్నది మీకు తెలుసు. పైన శివబాబా ఉంటారు, తర్వాత బ్రహ్మా, విష్ణు, శంకరులు, ఆ తర్వాత దేవతల మాల, ఆ తర్వాత క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఉంటారు. నిరాకారీ వృక్షం నుండి ఆత్మలు నంబరువారుగా వస్తూ ఉంటాయి. ఎవరైతే సత్యయుగంలోకి రారో, వారు చదువుకోవడానికి ఎప్పుడూ రారు. హిందూ ధర్మము అనేది వేరుగా అయిపోయినట్లు ఉంది. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం ఉండేదని ఎవ్వరికీ తెలియదు. ఆ ధర్మం, ఏ విధంగా మరియు ఎప్పుడు స్థాపన అయ్యింది, ఇది ఎవ్వరికీ తెలియదు. ఇతరులకు కూడా అర్థం చేయించమని మీకు ఈ జ్ఞానం ఇప్పుడు ఇవ్వడం జరిగింది. చిత్రాలైతే చాలా సహజంగా ఉన్నాయి. ఎవరికైనా ఇవి అర్థం చేయించవచ్చు – వీరు ఈ రాజ్యాన్ని ఎప్పుడు మరియు ఎలా తీసుకున్నారు? మరియు ఎంత సమయం వరకు రాజ్యం చేసారు? సీతా-రాముల విషయంలో కూడా, ఫలానా సంవత్సరం నుండి ఫలానా సంవత్సరం వరకు వీరు రాజ్యం చేసారు అని ఉండాలి. ఆ తర్వాత పతిత రాజులు ప్రారంభమవుతారు. ఈ దేవతలు ముఖ్యమైనవారు, వీరి పూజ జరుగుతుంది. వాస్తవానికి మహిమ అంతా ఒక్క పూజ్యునికే జరగాలి. భక్తి మార్గంలోనైతే అందరినీ పూజిస్తూ ఉంటారు. తమ తమ సమయమనుసారంగా ప్రతి ఒక్కరికి మహిమ జరుగుతుంది. మందిరాలకు వెళ్ళి పూజ మొదలైనవి చేస్తారు, కానీ వారి గురించి తెలియనే తెలియదు. ఇప్పుడు మీరు అర్థం చేయిస్తే విని సంతోషిస్తారు, అందుకే సెంటర్లు తెరుస్తారు. ఈ జ్ఞానంతో మనం దేవతలుగా అవుతామని భావిస్తారు. తండ్రి వచ్చి పేదవారిని షావుకార్లుగా చేసారు. తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తారు, పిల్లలు మళ్ళీ ఇతరులకు అర్థం చేయించి వారి భాగ్యాన్ని తెరవాలి. ప్రపంచం యొక్క చరిత్ర-భౌగోళికం గురించి ఇప్పుడు మీరు తండ్రి ద్వారా వింటారు. దానిని అర్థం చేసుకోవడంతో మీరు మొత్తం అంతా తెలుసుకుంటారు. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలనైతే తప్పకుండా విశ్వ రచయిత అయిన బీజరూపుడే వినిపిస్తారు. వారే నాలెడ్జ్ ఫుల్. వారు నిరాకార శివుడు. దేహధారిని భగవంతుడు, రచయిత అని అనలేరు. నిరాకారుడే ఆత్మలందరికీ తండ్రి. వారే కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తారు – నేను పరంధామంలో నివసించేవాడిని, ఇప్పుడు నేను ఈ శరీరంలోకి వచ్చాను, నేను కూడా ఆత్మను, నేను బీజరూపుడను, నాలెడ్జ్ ఫుల్ అయిన కారణంగా పిల్లలైన మీకు అర్థం చేయిస్తాను. ఇందులో ఆశీర్వదించడము, కృప చూపించడము మొదలైన విషయమేమీ లేదు. అలాగే అల్పకాలికమైన సుఖం యొక్క విషయమూ లేదు. అల్పకాలికమైన సుఖాన్ని అయితే మనుష్యులు ఇస్తారు. ఒక్కరికి ఏదైనా లాభం కలిగిందంటే, ఇక అంతే, వారి పేరు ప్రసిద్ధమైపోతుంది. మీ ప్రాప్తి అయితే 21 జన్మల కోసం ఉంటుంది. ఇటువంటి ప్రాప్తిని తండ్రి తప్ప ఎవ్వరూ కలిగించలేరు. 21 జన్మల కోసం నిరోగీ శరీరాన్ని ఎవ్వరూ తయారుచేయలేరు. భక్తి మార్గంలో మనుష్యులకు కొద్దిగా సుఖం లభించినా కూడా సంతోషపడిపోతారు. ఇక్కడైతే 21 జన్మల కోసం ప్రారబ్ధాన్ని పొందుతారు. అయినా కూడా, పురుషార్థం చేయని వారు చాలామంది ఉన్నారు. వారి అదృష్టంలో లేదు. పురుషార్థమైతే అందరి చేత ఒకే విధంగానే చేయిస్తారు. ఆ చదువులోనైతే అప్పుడప్పుడు వేరే టీచరు కూడా లభిస్తారు. ఇక్కడైతే ఒకే టీచరు ఉన్నారు. మీరు ఎవరికైనా ప్రత్యేకంగా కూర్చొని అర్థం చేయిస్తూ ఉండవచ్చు, కానీ జ్ఞానమైతే ఒక్కటే, కేవలం ప్రతి ఒక్కరు దానిని తీసుకోవడంపై ఆధారపడి ఉంటుంది. ఇది కూడా ఒక కథ, ఇందులో మొత్తం రహస్యమంతా వచ్చేస్తుంది. బాబా సత్యనారాయణ కథను వినిపిస్తారు. మీరు తిథి-తారీఖులు అన్నీ చెప్పగలరు. సత్యనారాయణ కథను వినిపించేవారిలో కొంతమంది ప్రసిద్ధమైనవారు ఉంటారు. వారికి మొత్తము కథ కంఠస్థమై ఉంటుంది. అలాగే మీరు ఈ సత్యమైన సత్య నారాయణ కథను కంఠస్థం చేయండి. ఇది చాలా సహజమైనది. తండ్రి మొదట మన్మనాభవ అని చెప్తారు, ఆ తర్వాత కూర్చుని చరిత్రను అర్థం చేయించండి. ఈ లక్ష్మీ-నారాయణుల శకము గురించి అయితే చెప్పగలరు కదా. రండి, తండ్రి సంగమయుగంలో ఎలా వస్తారు అన్నది మేము మీకు అర్థం చేయిస్తాము. బ్రహ్మా తనువులోకి వచ్చి వినిపిస్తారు. ఎవరికి? బ్రహ్మా ముఖవంశావళికి. వారే మళ్ళీ దేవతలుగా అవుతారు, ఇది 84 జన్మల కథ. బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు. పూర్తి జ్ఞానముంది, దీనిని విని మళ్ళీ కూర్చొని రిపీట్ చేయండి, అప్పుడు – మనమే దేవతలుగా ఉండేవారము, మళ్ళీ ఈ విధంగా చక్రంలో తిరిగాము అని బుద్ధిలోకి మొత్తం అంతా వచ్చేస్తుంది. ఇది సత్యనారాయణ కథ. ఇది ఎంత సహజంగా ఉంది, రాజ్యాన్ని ఎలా తీసుకున్నారు, మళ్ళీ ఎలా పోగొట్టుకున్నారు… ఎంత సమయం రాజ్యం చేసారు. లక్ష్మీ-నారాయణులు మరియు వారి కులము, వంశము ఉండేది కదా. సూర్యవంశము, తర్వాత చంద్రవంశము, మళ్ళీ సంగమంలో తండ్రి వచ్చి శూద్ర వంశీయులను బ్రాహ్మణ వంశీయులుగా తయారుచేస్తారు. ఈ సత్యాతి-సత్యమైన కథను మీరు వింటున్నారు. సత్యయుగంలో లక్ష్మీ-నారాయణులకు వజ్ర వైఢూర్యాల మహళ్ళు ఉండేవి. ఇప్పుడేమున్నాయి? తండ్రి వచ్చి ఈ కథను వినిపించారు కదా.

ఇప్పుడు తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మాలిన్యం తొలగిపోతుంది. ఎంతగా మాలిన్యం తొలగుతుందో, అంతగా ఉన్నత పదవిని పొందుతారు. నంబరువారుగా అర్థం చేసుకుంటారు. ఎవరెవరు మంచి రీతిలో బుద్ధిలో ధారణ చేయగలరు అన్నది బాబాకు తెలుసు. అర్థం చేయించడంలో కష్టమేమీ లేదు. చాలా సహజము. మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడమైతే ప్రసిద్ధము. ఘడియ-ఘడియ ఈ సత్యనారాయణ కథనే వినిపిస్తూ ఉండండి. అది అసత్యమైనది, ఇది సత్యమైనది. సెంటర్ లో కూడా సత్యనారాయణ కథను వినిపిస్తూ ఉండండి లేక మురళీ వినిపిస్తూ ఉండండి, ఇది చాలా సహజము. ఎవరైనా సెంటరును నడిపించవచ్చు. కానీ లక్షణాలు కూడా మంచిగా ఉండాలి. పరస్పరంలో ఉప్పు నీరుగా కాకూడదు. పరస్పరంలో మధురంగా ఉంటూ నడుచుకోకపోతే పరువు పోగొడతారు. తండ్రి అంటారు, నన్ను నిందింపజేసినట్లయితే ఉన్నత పదవిని పొందలేరు. ఈ మాటను ఆ గురువులు తమ కోసము చెప్పుకున్నారు. ఇప్పుడు వారైతే ఉన్నత స్థానం గురించి చెప్పరు. ఉన్నత స్థానం గురించి చెప్పేవారు ఒక్కరే, వారిని నిందింపజేస్తే నష్టం పొందేందుకు పాత్రులుగా అవుతారు. ఇంకా, పదవి కూడా భ్రష్టమైపోతుంది. నల్ల ముఖం చేసుకున్నట్లయితే తమను తాము సర్వనాశనం చేసుకుంటారు. ఓడిపోయేవారు కూడా కొందరు ఉంటారు, వారిలో కొందరు సత్యంగా రాస్తారు, కొందరు అసత్యం కూడా చెప్తారు. ఒకవేళ సత్యమైన కథను వినిపిస్తూ ఉన్నట్లయితే బుద్ధిలో నుండి అసత్యము తొలగిపోతుంది. తండ్రిని నిందింపజేసేటువంటి నడవడికను నడుచుకోకూడదు. ఎవరికైతే ఇటువంటి అవస్థ ఉంటుందో, వారు ఎక్కడకు వెళ్ళినా సరే అటువంటి నడవడికే నడుచుకుంటారు. మేము బాగుపడలేము అని స్వయం కూడా అర్థం చేసుకుంటారు, అప్పుడిక సలహా ఇవ్వడం జరుగుతుంది – ఇంట్లో గృహస్థంలో ఉండండి, ఎప్పుడైతే ధారణ జరుగుతుందో అప్పుడు సేవ చేయండి. ఇంట్లో ఉన్నట్లయితే మీపై ఇంతటి పాపము రాదు. ఇక్కడ ఒకవేళ అటువంటి సాధారణ నడవడికను నడుచుకుంటే నిందింపజేస్తారు, దీని కన్నా గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండడము మంచిది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. లోపలి నుండి అసత్యత తొలగిపోవాలి, దాని కోసం సదా సత్య నారాయణ కథను వినాలి మరియు వినిపించాలి. తండ్రిని నిందింపజేసే విధమైన నడవడికను ఎప్పుడూ నడుచుకోకూడదు.

2. పరస్పరంలో చాలా మధురంగా ఉండాలి, ఎప్పుడూ ఉప్పు నీరుగా కాకూడదు. మంచి లక్షణాలను ధారణ చేసి, ఆ తర్వాత సేవ చేయాలి.

వరదానము:-

సంగమయుగంలో విశేషంగా సంతోషాలతో నిండిన అభినందనలతోనే బ్రాహ్మణులందరూ వృద్ధిని ప్రాప్తి చేసుకుంటున్నారు. బ్రాహ్మణ జీవితం యొక్క పాలనకు ఆధారము అభినందనలు. తండ్రి స్వరూపంలో ప్రతి సమయము అభినందనలు ఉన్నాయి, శిక్షకుని స్వరూపంలో ప్రతి సమయము శభాష్-శభాష్ అనే మాటలు పాస్ విత్ ఆనర్గా చేస్తున్నాయి, సద్గురువు రూపంలో ప్రతి శ్రేష్ఠ కర్మ యొక్క దీవెనలు సహజమైన మరియు ఆనందమయమైన జీవితాన్ని అనుభవం చేయిస్తున్నాయి, అందుకే పదమాపదమ భాగ్యవంతులు ఎందుకంటే భాగ్యవిధాత అయిన భగవంతుని పిల్లలుగా అయ్యారు, సంపూర్ణ భాగ్యానికి అధికారులుగా అయ్యారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top