27 May 2021 TELUGU Murli Today – Brahma Kumaris
26 May 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - ఇప్పుడు వినాశన సమయం చాలా సమీపంగా ఉంది కావున ఒక్క తండ్రి పట్ల సత్యమైన ప్రీతి పెట్టుకోండి, ఏ దేహధారుల పట్ల కాదు”
ప్రశ్న: -
ఏ పిల్లలకైతే ఒక్క తండ్రి పట్ల సత్యమైన ప్రీతి ఉంటుందో, వారి గుర్తులు ఏమిటి?
జవాబు:-
1. వారి బుద్ధియోగం ఏ దేహధారుల వైపుకు వెళ్ళదు. వారు పరస్పరంలో ఒకరికొకరు ప్రేయసీ-ప్రియులుగా అవ్వరు. 2. ఎవరికైతే సత్యమైన ప్రీతి ఉంటుందో, వారు సదా విజయులుగా అవుతారు. విజయులుగా అవ్వడం అనగా సత్యయుగ మహారాజా-మహారాణులుగా అవ్వడం. 3. ప్రీతి బుద్ధి కలవారు తండ్రితో సదా సత్యంగా ఉంటారు. ఏదీ దాచిపెట్టలేరు. 4. ప్రతిరోజు అమృతవేళ లేచి తండ్రిని ప్రేమగా స్మృతి చేస్తారు. 5. దధీచి ఋషి వలె సేవలో ఎముకలను ఇస్తారు. 6. వారి బుద్ధి ప్రాపంచిక విషయాలలో భ్రమించదు.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
వారు మా నుండి వేరు కారు….. (న వహ్ హమ్ సే జుదా హోంగే…..)
ఓంశాంతి. బ్రహ్మా ముఖవంశావళి, బ్రాహ్మణ కుల భూషణులు ఈ ప్రతిజ్ఞను చేస్తారు ఎందుకంటే వారి ప్రీతి ఒక్క తండ్రితో జోడించబడి ఉంది. ఇది వినాశన సమయమని మీకు తెలుసు. వినాశనమైతే జరగాల్సిందేనని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. వినాశన సమయంలో ఎవరి ప్రీతి అయితే తండ్రి పట్ల ఉంటుందో, వారే విజయాన్ని పొందుతారు అనగా సత్యయుగానికి యజమానులుగా అవుతారు. శివబాబా అంటారు – విశ్వానికి యజమానులుగా రాజులు కూడా అవుతారు మరియు ప్రజలు కూడా అవుతారు, కానీ పొజిషన్ (పదవి) లో చాలా తేడా ఉంటుంది. ఎంతగా తండ్రి పట్ల ప్రీతి పెట్టుకుంటారో, స్మృతిలో ఉంటారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. తండ్రి స్మృతి ద్వారానే మీ వికర్మల భారం భస్మమవుతుందని తండ్రి అర్థం చేయించారు. వినాశన సమయంలో విపరీత బుద్ధి….. అని మీరు రాయవచ్చు. ఇది రాయడానికి భయపడాల్సిన విషయమేమీ లేదు. వారి (విపరీత బుద్ధి కల వారి) వినాశనమవుతుందని మరియు ప్రీతి బుద్ధి కల వారికి విజయం కలుగుతుందని నేను స్వయంగా చెప్తున్నాను అని తండ్రి అంటారు. బాబా చాలా స్పష్టంగా చెప్తారు. ఈ ప్రపంచంలో ఎవరికీ ప్రీతి లేదు. మీకు మాత్రమే ప్రీతి ఉంది. బాబా అంటారు – పిల్లలూ, పరమాత్ముని మహిమను మరియు శ్రీకృష్ణుని మహిమను వేరు-వేరుగా రాసినట్లయితే గీతా భగవంతుడు ఎవరు అనేది నిరూపించబడుతుంది. ఇది తప్పనిసరి కదా. జ్ఞాన సాగరుడు, పతితపావనుడు పరమపితనా లేక నీటి నదులా? జ్ఞాన గంగనా లేదా నీటి గంగనా? అని కూడా బాబా అడుగుతారు. ఇది చాలా సహజమైన విషయము. రెండవ విషయం – ప్రదర్శనీలు పెట్టినప్పుడు మొట్టమొదటగా గీతా పాఠశాల వారికి నిమంత్రణ ఇవ్వాలి. వారు చాలా మంది ఉన్నారు. వారికి విశేషంగా నిమంత్రణ ఇవ్వాలి. ఎవరైతే శ్రీమత్ భగవద్గీతను అభ్యాసం చేస్తారో, వారికి ముందు నిమంత్రణ ఇవ్వాలి ఎందుకంటే వారే మర్చిపోయారు మరియు అందరినీ మరపింపజేస్తూ ఉంటారు. మీరు వచ్చి జడ్జి చేయండి, ఆ తర్వాత ఏమి అర్థమైతే అది చేయండి అని వారిని పిలవాలి. అప్పుడు, గీత చదివేవారిని కూడా పిలుస్తున్నారు, వీరు కూడా గీతనే ప్రచారం చేస్తున్నారేమో అని మనుష్యులు కూడా భావిస్తారు. గీత ద్వారానే స్వర్గ స్థాపన జరిగింది. గీతకు చాలా మహిమ ఉంది కానీ భక్తి మార్గంలోని గీతకు కాదు. తండ్రి అంటారు – నేను మీకు అంతా సత్యమే చెప్తాను. మనుష్యులు ఏవైతే అర్థాలు తీస్తారో, అవి పూర్తిగా తప్పు. ఎవరూ సత్యాన్ని చెప్పరు, నేను మాత్రమే సత్యాన్ని తెలియజేస్తాను. పరమాత్మను సర్వవ్యాపి అని అనడం కూడా సత్యం కాదు, వారంతా వినాశనం చెందుతారు మరియు కల్ప-కల్పము ఇలాగే జరుగుతుంది. మీరు మొట్టమొదట ఈ ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించాలి. తండ్రి అంటారు – యూరోప్ వాసులైన యాదవులది వినాశకాలే విపరీత బుద్ధి. వినాశనం కోసం మంచి రీతిలో ఏర్పాట్లను చేస్తున్నారు కానీ రాతిబుద్ధి కలవారు అర్థం చేసుకోలేరు. మీరు కూడా రాతిబుద్ధి కలవారిగా ఉండేవారు, ఇప్పుడు పారసబుద్ధి కలవారిగా తయారవ్వాలి. పారసబుద్ధి కలవారిగా ఉండేవారు మళ్ళీ రాతిబుద్ధి కలవారిగా ఎలా అయ్యారు! ఇది కూడా అద్భుతము. తండ్రిని నాలెడ్జ్ ఫుల్ (జ్ఞానసాగరుడు), మెర్సిఫుల్ (దయాసాగరుడు) అని అంటారు. ఇకపోతే ఎవరికైతే తమ కళ్యాణం చేసుకోవడమే రాదో, వారు ఇతరుల కళ్యాణాన్ని ఎలా చేయగలరు! ఎవరైతే జ్ఞానాన్ని ధారణ చేయరో, వారు పదవి కూడా అలాంటిదే పొందుతారు, ఎవరైతే సేవాధారులుగా ఉంటారో, వారే ఉన్నత పదవిని పొందుతారు. తండ్రి కూడా వారినే ప్రేమిస్తారు. వారు నంబరువారు పురుషార్థానుసారంగా ఉంటారు. మాకు తండ్రి పట్ల ప్రీతి లేదు కావున పదవి కూడా లభించదని కొందరు అర్థం చేసుకోరు. సొంత పిల్లలైనా లేక సవతి పిల్లలైనా, వినాశన సమయంలో ప్రీతి బుద్ధి లేకపోతే, తండ్రిని ఫాలో చేయకపోతే, తక్కువ పదవిని పొందుతారు. దైవీ గుణాలు కూడా ఉండాలి. ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు. తండ్రి అంటారు – నేను సత్యం చెప్తాను, ఎవరైతే నా పట్ల ప్రీతి కలిగి ఉండరో, వారికి పదవి కూడా లభించదు. ప్రయత్నం చేసి 21 జన్మలకు పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. కావున ప్రదర్శనీలకు, మేళాలకు ముందు గీతా పాఠశాల వారికి నిమంత్రణ ఇవ్వాలి, ఎందుకంటే వారు భక్తులు కదా. గీతా పాఠకులు తప్పకుండా కృష్ణుడిని స్మృతి చేస్తూ ఉంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. కృష్ణుడు మురళీ వాయించారు, మరి రాధ ఎక్కడికి వెళ్ళినట్లు. సరస్వతికి వీణను ఇచ్చారు, కృష్ణుడికి మురళీని ఇచ్చారు. మమ్మల్ని అల్లా సృష్టించారని మనుష్యులు అంటారు కానీ అల్లా గురించి తెలియదు. ఇది భారత్ కు సంబంధించిన విషయమే. భారత్ లోనే దేవతల రాజ్యముండేది, వారి చిత్రాలు మందిరాలలో పూజించబడతాయి. ఇకపోతే రాజులు మొదలైనవారి విగ్రహాలను బయట పెడతారు, వాటిపై పక్షులు రెట్టలు వేస్తూ ఉంటాయి. లక్ష్మీ-నారాయణులు, రాధా-కృష్ణులు మొదలైనవారిని ఎంత ఫస్ట్ క్లాస్ స్థానాలలో కూర్చోబెడతారు. వారిని మహారాజా-మహారాణి అని అంటారు, కింగ్ అనేది ఇంగ్లీషు పదము. ఎన్ని లక్షల రూపాయలను ఖర్చు చేసి మందిరాలను తయారుచేస్తారు, ఎందుకంటే ఆ మహారాజులు పవిత్రంగా ఉండేవారు. యథా రాజా-రాణి, తథా ప్రజ అందరూ పూజ్యులే. మీరే పూజ్యులుగా, మళ్ళీ పూజారులుగా అవుతారు. కావున మొదటి విషయం – తండ్రిని స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చేసినట్లయితే ధారణ జరుగుతుంది. ఆ ఒక్కరి పట్ల ప్రీతి లేదంటే, ఇక ఇతరుల పట్ల ప్రీతి కలుగుతుంది. ఎటువంటి పిల్లలు ఉన్నారంటే, వారు పరస్పరంలో ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకుంటారంటే, శివబాబాను కూడా అంతగా ప్రేమించరు. శివబాబా అంటారు – మీరు నాతో బుద్ధియోగాన్ని జోడించాలా లేదా ఒకరికొకరు ప్రేయసీ-ప్రియులుగా అవ్వాలా! అప్పుడిక నన్ను పూర్తిగా మర్చిపోతారు. మీరు బుద్ధియోగాన్ని నాతో జోడించాలి, ఇందులో శ్రమించాల్సి ఉంటుంది. ఇతరుల నుండి బుద్ధి అసలు తొలగడం లేదు. రాత్రింబవళ్ళు శివబాబాకు బదులుగా ఒకరినొకరు స్మృతి చేసుకుంటూ ఉంటారు. బాబా వారి పేర్లను చెప్పినట్లయితే, ద్రోహులుగా అయిపోతారు, ఇక నిందించేందుకు కూడా ఆలస్యం చేయరు. ఈ బాబాను నిందించినట్లయితే శివబాబా కూడా వెంటనే వింటారు. బ్రహ్మా ద్వారా చదువుకోకపోతే శివబాబా ద్వారా చదువుకోలేరు. బ్రహ్మా లేకుండా శివబాబా కూడా వినలేరు, అందుకే సాకారుని వద్దకు వెళ్ళి అడగండి అని అంటారు. కొందరు మంచి-మంచి పిల్లలు ఉన్నారు, వారు సాకారుడిని అంగీకరించరు, వీరు కూడా పురుషార్థీ అని భావిస్తారు. అందరూ పురుషార్థులే కానీ మీరు తల్లిదండ్రులనే ఫాలో చేయాలి. కొందరు అర్థం చేయిస్తే అర్థం చేసుకుంటారు, ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే అర్థం చేసుకోరు. సేవాధారులుగా అవ్వరు. కానీ బుద్ధిని ఒక్క తండ్రి పట్ల మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్య, నాలో శివబాబా వస్తారు అని అనేవారు చాలామంది వెలువడ్డారు, ఇందులో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాయ చాలా ప్రవేశిస్తూ ఉంటుంది, ఎవరిలోనైతే ముందు శ్రీ నారాయణుడు మొదలైనవారు వచ్చేవారో, వారు కూడా ఈ రోజు లేరు. కేవలం ప్రవేశించడంతో ఏమీ జరగదు. తండ్రి అంటారు – నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇకపోతే నాలో వీరు వస్తారు, వారు వస్తారు….. ఇదంతా మాయ. నా స్మృతియే లేకపోతే ఏమి ప్రాప్తి కలుగుతుంది, తండ్రితో డైరెక్టుగా యోగం జోడించనంత వరకు పదవిని ఎలా పొందుతారు, ధారణ ఎలా జరుగుతుంది.
తండ్రి అంటారు – మీరు నన్నొక్కరినే స్మృతి చేయండి. బ్రహ్మా ద్వారానే నేను అర్థం చేయిస్తాను, బ్రహ్మా ద్వారానే స్థాపన జరిగింది. త్రిమూర్తులు కూడా తప్పకుండా కావాలి. కొందరు బ్రహ్మా చిత్రాన్ని చూసి కోపగించుకుంటారు. మరి కొందరు కృష్ణుని 84 జన్మలను చూసి కోపగించుకుంటారు. చిత్రాలను చింపేస్తారు కూడా. అరే, ఈ చిత్రాలను తండ్రి తయారు చేయించారు. కావున తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు – మర్చిపోకండి, కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. బంధనంలో ఉన్నవారు కూడా మొర పెట్టుకోకూడదు. ఇంట్లో కూర్చొని తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. బంధనంలో ఉన్నవారికైతే ఇంకా ఉన్నత పదవి లభించగలదు. పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇచ్చేవారు జ్ఞానసాగరుడు ఒక్కరే. ఆధ్యాత్మిక జ్ఞానం ఒక్క తండ్రిలో తప్ప ఇంకెవరిలోనూ లేదు. జ్ఞానసాగరుడు ఒక్క పరమపిత పరమాత్మయే, వారినే లిబరేటర్ (ముక్తిదాత) అని అంటారు, ఇందులో భయపడే విషయమేముంది. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు, ఆ తర్వాత పిల్లలు ఇతరులకు అర్థం చేయించాలి. తండ్రి అంటారు – నన్ను స్మృతి చేసినట్లయితే సద్గతిని పొందుతారు. సత్యయుగంలో రామరాజ్యం ఉంటుంది, కలియుగంలో ఉండదు. సత్యయుగంలో ఒకే రాజ్యముంటుంది. ఈ విషయాలన్నీ మీలో కూడా నంబరువారుగా ఉన్నాయి, కొందరి బుద్ధిలో ధారణ జరుగుతుంది, కొందరికి ధారణ జరగదు, వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు, అటువంటివారు పదవిని పొందలేరు. అందరూ వినాశనమవ్వాల్సిందే. ఇవేమైనా తక్కువ విషయాలా! వినాశకాలే ప్రీతి బుద్ధి కలవారిగా అవ్వండి అని శివబాబా అంటారు. ఇది మీ అంతిమ జన్మ, ఒకవేళ ఇక్కడ మీరు ప్రీతి పెట్టుకోకపోతే పదవి కూడా లభించదు. సత్యమైన హృదయంపై సాహెబ్ రాజీ అవుతారు. దధీచి ఋషి వలె సేవలో ఎముకలను ఇవ్వాలి. ఎప్పుడైనా ఎవరిపైనైనా గ్రహచారం కూర్చొంటే, నషాయే తొలగిపోతుంది, అప్పుడిక అనేక రకాల తుఫానులు వస్తూ ఉంటాయి. దీని కన్నా లౌకికం వారి వద్దకు వెళ్తే బాగుంటుంది, ఇక్కడ ఎలాంటి మజా లేదు అని నోటితో అంటారు. అక్కడైతే నాటకాలు, సినిమాలు మొదలైనవి చాలా ఉంటాయి, ఎవరైతే ఈ విషయాలకు అలవాటు పడి ఉంటారో, వారు ఇక్కడ నిలవలేరు, చాలా కష్టము. పురుషార్థంతో ఉన్నత పదవిని కూడా పొందగలరు, మీరు సంతోషంగా ఉండాలి. ఉదయాన్నే లేచి కూర్చోకపోతే నాకు మజాయే రాదు అని బాబా స్వయంగా అంటారు. పడుకుని ఉంటే అప్పుడప్పుడు కునికిపాట్లు వస్తాయి. లేచి కూర్చోవడంతో మంచి పాయింట్లు వస్తాయి, చాలా మజా వస్తుంది.
ఇప్పుడు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి, మనం తండ్రి నుండి విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకుంటున్నాము. కూర్చొని ఇది గుర్తు చేసుకున్నా సరే సంతోషపు పాదరసం పైకెక్కుతుంది. ఉదయాన్నే చింతన నడిచినట్లయితే, రోజంతా సంతోషం ఉంటుంది. ఒకవేళ సంతోషం లేకపోతే, తప్పకుండా తండ్రి పట్ల ప్రీతి బుద్ధి లేనట్లు. అమృతవేళ ఏకాంతం చాలా బాగుంటుంది, ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా సంతోషపు పాదరసం పైకెక్కుతుంది. ఈ చదువులో గ్రహచారం కూర్చొంటుంది ఎందుకంటే తండ్రిని మర్చిపోతారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలంటే మనసా-వాచా-కర్మణా సేవ చేయాలి. ఈ సేవలోనే ఈ అంతిమ జన్మను గడపాలి. ఒకవేళ వేరే ప్రాపంచిక విషయాలలో నిమగ్నమైనట్లయితే, ఈ సేవను ఎప్పుడు చేస్తారు! రేపు-రేపు అంటూనే మరణిస్తారు. తండ్రి స్వర్గంలోకి తీసుకువెళ్ళేందుకే వచ్చారు. ఇక్కడ యుద్ధంలో ఎంతమంది మరణిస్తారు, ఎంతమందికి దుఃఖం కలుగుతూ ఉండవచ్చు. అక్కడ యుద్ధాలు మొదలైనవి జరగవు. ఇవన్నీ అంతిమ సమయానికి చెందినవి, అంతా సమాప్తమవ్వనున్నది. అనాథలు అలానే మరణిస్తారు, సనాథలు రాజ్య భాగ్యాన్ని పొందుతారు.
మేము మా సంపాదన ద్వారా, మా తనువు-మనస్సు-ధనముల ద్వారా మా రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నామని ప్రదర్శనీలలో కూడా అర్థం చేయించాలి. మేము భిక్ష అడగము, అవసరమే లేదు. అనేకమంది సోదరీ-సోదరులము కలిసి రాజధానిని స్థాపన చేస్తాము. మీరు కోట్లు జమ చేసి మిమ్మల్ని మీరు వినాశనం చేసుకుంటారు, మేము పైసా-పైసా జమ చేసి విశ్వానికి యజమానులుగా అవుతాము. ఎంత అద్భుతమైన విషయము. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. అమృతవేళ ఏకాంతంలో కూర్చొని బాబాను ప్రేమగా స్మృతి చేయాలి. ప్రాపంచిక విషయాలను వదిలి ఈశ్వరీయ సేవలో నిమగ్నమవ్వాలి.
2. తండ్రి పట్ల సత్యమైన హృదయం పెట్టుకోవాలి. పరస్పరంలో ఒకరికొకరు ప్రేయసీ-ప్రియులుగా అవ్వకూడదు. ఒక్క తండ్రితో ప్రీతి జోడించాలి. దేహధారులతో కాదు.
వరదానము:-
ఈ రోజుల్లో ఒకరి పట్ల ఒకరికి ఉండే మోహం స్నేహంతో కాదు, స్వార్థంతో ఉంటుంది. స్వార్థం కారణంగా మోహం ఉంటుంది మరియు మోహం కారణంగా అతీతంగా అవ్వలేరు, అందుకే స్వార్థం అనే పదం యొక్క అర్థంలో స్థితులవ్వండి అనగా ముందు స్వయం యొక్క రథాన్ని స్వాహా చేయండి. ఈ స్వార్థం పోయిందంటే తప్పకుండా అతీతంగా అవుతారు. ఈ ఒక్క పదం యొక్క అర్థాన్ని తెలుసుకుంటే, సదా ఒక్కరికి చెందినవారిగా మరియు ఏకరసంగా అవుతారు, ఇదే సహజ పురుషార్థము.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!