27 March 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

March 26, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“రూలింగ్ మరియు కంట్రోలింగ్ పవర్ తో స్వరాజ్య ప్రాప్తి”

♫ వినండి ఆడియో (audio)➤

ఈ రోజు పిల్లల స్నేహీ అయిన బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ విశేషంగా రెండు విషయాలలో చెక్ చేస్తున్నారు. స్నేహానికి ప్రత్యక్ష స్వరూపంగా పిల్లలను సంపన్నంగా మరియు సంపూర్ణంగా తయారుచేయాలి. ప్రతి ఒక్కరిలో రూలింగ్ పవర్ మరియు కంట్రోలింగ్ పవర్ ఎంతవరకు వచ్చింది – ఈ రోజు ఇది చూస్తున్నారు. శరీరం యొక్క స్థూల కర్మేంద్రియాలు ఆత్మ కంట్రోల్ తో నడుస్తాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా మరియు ఎక్కడ కావాలంటే అక్కడ నడిపించగలరు మరియు నడిపిస్తూ ఉంటారు. కంట్రోలింగ్ పవర్ కూడా ఉంది. ఏ విధంగానైతే చేతులు-కాళ్ళు స్థూలమైన శక్తులో, అలా మనసు, బుద్ధి, సంస్కారాలు ఆత్మ యొక్క సూక్ష్మ శక్తులు. సూక్ష్మ శక్తులను కంట్రోల్ చేసే పవర్ అనగా మనసు-బుద్ధిని, సంస్కారాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా, ఎంత సమయము కావాలంటే అంత సమయము – ఇటువంటి కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ వచ్చిందా? ఎందుకంటే ఈ బ్రాహ్మణ జీవితంలో మాస్టర్ ఆల్మైటీ అథారిటీగా (సర్వశక్తివంతులుగా) అవుతారు. ఈ సమయంలోని ప్రాప్తి మొత్తం కల్పమంతా రాజ్య రూపంలో మరియు పూజారి రూపంలో నడుస్తూ ఉంటుంది. ఎంతగా అర్ధకల్పం విశ్వం యొక్క రాజ్య సత్తాను ప్రాప్తి చేసుకుంటారో, దాని అనుసారంగా ఎంతటి శక్తిశాలి రాజ్య పదవి లేక పూజ్య పదవి లభిస్తుందో, అంతగానే భక్తి మార్గంలో కూడా శ్రేష్ఠ పూజారులుగా అవుతారు. భక్తిలో కూడా శ్రేష్ఠాత్మకు మనసు-బుద్ధి-సంస్కారాలపై కంట్రోలింగ్ పవర్ ఉంటుంది. భక్తులలో కూడా నంబరువారుగా శక్తిశాలి భక్తులు తయారవుతారు అనగా ఏ ఇష్టదేవత యొక్క భక్తి చేయాలనుకుంటారో, ఎంత సమయం చేయాలనుకుంటారో, ఏ విధితో చేయాలనుకుంటారో – ఆ భక్తికి ఫలంగా, భక్తి యొక్క విధి అనుసారంగా సంతుష్టతను, ఏకాగ్రతను, శక్తిని మరియు సంతోషాన్ని ప్రాప్తి చేసుకుంటారు. కానీ, రాజ్య పదవిని మరియు భక్తి యొక్క శక్తిని ప్రాప్తి చేసుకునేందుకు ఆధారము, ఈ బ్రాహ్మణ జన్మ. కావున ఈ సంగమయుగంలోని ఈ ఒక్క చిన్న జన్మ మొత్తం కల్పంలోని అన్ని జన్మలకు ఆధారము! ఏ విధంగానైతే రాజ్యం చేయడంలో విశేషమైనవారిగా అవుతారో, అలా భక్తులలో కూడా విశేషమైనవారిగా అవుతారు, సాధారణమైనవారిగా కాదు. భక్తమాలలోని భక్తులు వేరు, కానీ పూజ్యులు మరియు పూజారి ఆత్మలైన మీ భక్తి కూడా విశేషమైనది. కనుక ఈ రోజు బాప్ దాదా పిల్లల యొక్క ఈ మూలాధార జన్మను చూస్తున్నారు. ఆది నుండి ఇప్పటివరకు బ్రాహ్మణ జీవితంలో రూలింగ్ పవర్, కంట్రోలింగ్ పవర్ సదా మరియు ఎంత శాతంలో ఉన్నాయి. ఇందులో కూడా మొదట, తమ సూక్ష్మ శక్తుల రిజల్టును చెక్ చేసుకోండి. రిజల్టులో ఏం కనిపిస్తుంది? ఈ విశేషమైన మూడు శక్తులు, ‘‘మనసు, బుద్ధి, సంస్కారాల’’ పై కంట్రోల్ ఉంటే, వీరినే స్వరాజ్య అధికారి అని అంటారు. కనుక ఈ సూక్ష్మ శక్తులే స్థూల కర్మేంద్రియాలను సంయమ, నియమాలతో నడిపించగలవు. రిజల్టులో ఏం చూసారు? ఎప్పుడు, ఎక్కడ మరియు ఎలా – ఈ మూడు విషయాలలోనూ ఇప్పుడు యథాశక్తిగా ఉన్నారు. సర్వశక్తి కలవారిగా లేరు కానీ యథాశక్తి కలవారిగా ఉన్నారు. దీనికే డబల్ విదేశీయులు తమ భాషలో ‘సంథింగ్’ అనే పదాన్ని ఉపయోగిస్తారు. మరి దీనిని ఆల్మైటీ అథారిటీ (సర్వశక్తివంతులు) అని అంటారా? శక్తివంతులుగా అయితే ఉన్నారు కానీ సర్వ శక్తులు ఉన్నాయా? వాస్తవానికి దీనినే బ్రాహ్మణ జీవితం యొక్క పునాది అని అనడం జరుగుతుంది. ఎవరికి ఎంతగా స్వయంపై రాజ్యముందో అనగా స్వయాన్ని నడిపించే మరియు సర్వులనూ నడిపించే విధి వస్తుందో, వారే ముందు నంబరు తీసుకుంటారు. ఈ పునాదిలో ఒకవేళ యథాశక్తి కలవారిగా ఉంటే స్వతహాగా నంబరు వెనుక పడిపోతుంది. ఎవరికైతే స్వయాన్ని నడిపించడం మరియు నడుచుకోవడం వస్తుందో, వారు ఇతరులను కూడా సహజంగా నడిపించగలరు అనగా హ్యాండ్లింగ్ పవర్ వస్తుంది. కేవలం ఇతరులను హ్యాండిల్ చేయడానికి హ్యాండ్లింగ్ పవర్ అవసరం లేదు. ఎవరైతే తమ సూక్ష్మ శక్తులను హ్యాండిల్ చేయగలరో, వారు ఇతరులను కూడా హ్యాండిల్ చేయగలరు. కనుక స్వయంపై కంట్రోలింగ్ పవర్ మరియు రూలింగ్ పవర్ అనేది సర్వుల కొరకు యథార్థ హ్యాండ్లింగ్ పవర్ అవుతుంది. అజ్ఞానీ ఆత్మలను సేవ ద్వారా హ్యాండిల్ చేసినా, బ్రాహ్మణ పరివారంలో స్నేహ సంపన్నమైన, సంతుష్టతా సంపన్నమైన వ్యవహారం చేసినా – రెండింటిలోనూ సఫలురవుతారు, ఎందుకంటే చాలామంది పిల్లలు ఎలా ఉన్నారంటే, తండ్రిని తెలుసుకోవడము, తండ్రికి చెందినవారిగా అవ్వడము మరియు తండ్రితో ప్రీతి యొక్క రీతిని నిర్వర్తించడము, వీటన్నింటినీ చాలా సహజంగా అనుభవం చేస్తారు కానీ బ్రాహ్మణ ఆత్మలందరితోనూ కలిసి నడుచుకోవడంలో ‘సంథింగ్’ అని అంటారు. దీనికి కారణమేమిటి? తండ్రితో నిర్వర్తించడం సహజమెందుకు అనిపిస్తుంది? ఎందుకంటే ఎడతెగని హృదయపూర్వక ప్రేమ ఉంది. ప్రేమలో నిర్వర్తించడం సహజమవుతుంది. ఎవరి పట్లనైతే ప్రేమ ఉంటుందో, వారి ద్వారా ఏదైనా శిక్షణకు సంబంధించిన సూచన లభించడం కూడా ప్రియంగా అనిపిస్తుంది మరియు సదా హృదయంలో ఏమని అనుభవమవుతుందంటే, వీరు ఏదైతే చెప్పారో, అది నా కళ్యాణం కోసమే చెప్పారు ఎందుకంటే వారి పట్ల హృదయంలో శ్రేష్ఠ భావన ఉంటుంది. కావున ఎలాగైతే మీ హృదయంలో వారి పట్ల శ్రేష్ఠ భావన ఉందో, అలానే మీ శుభభావనకు రిటర్న్ ఇతరుల ద్వారా కూడా ప్రాప్తిస్తుంది. ఎలాగైతే గుమ్మటంలో శబ్దం చేస్తే, అదే శబ్దం మళ్ళీ తిరిగి మీ వద్దకు వస్తుంది. కనుక ఎలాగైతే తండ్రి పట్ల ఎడతెగని, అఖండమైన, స్థిరమైన ప్రేమ ఉందో, శ్రేష్ఠ భావన ఉందో, నిశ్చయం ఉందో, అలా బ్రాహ్మణాత్మలు నంబరువారుగా ఉన్నా కానీ ఆత్మిక ప్రేమ ఎడతెగనిదిగా, అఖండంగా ఉందా? వెరైటీ నడవడికను, వెరైటీ సంస్కారాలను చూసి ప్రేమిస్తే అది ఎడతెగనదిగా మరియు అఖండంగా ఉండదు. స్వయం పట్ల లేక ఇతరుల పట్ల, ఏ ఆత్మ యొక్క నడవడిక అయినా అనగా చరిత్ర లేక సంస్కారాలు మనసుకు నచ్చేవిగా లేకపోతే ప్రేమ యొక్క శాతం తగ్గిపోతుంది. కానీ ఆత్మకు శ్రేష్ఠ ఆత్మ యొక్క భావంతో ఆత్మిక ప్రేమ ఉన్నట్లయితే అందులో శాతం అనేది ఉండదు. ఎలాంటి సంస్కారాలున్నా, నడవడిక ఉన్నా కానీ బ్రాహ్మణాత్మలకు మొత్తం కల్పంలో ఎడతెగని సంబంధముంది. అంతా ఈశ్వరీయ పరివారము. బాబా ప్రతి ఆత్మను విశేషంగా ఎన్నుకొని ఈశ్వరీయ పరివారంలోకి తీసుకొచ్చారు. తమంతట తాము రాలేదు, తండ్రి తీసుకొచ్చారు. కనుక తండ్రిని ఎదురుగా ఉంచుకోవడంతో ప్రతి ఆత్మ పట్ల ఎడతెగని ఆత్మిక ప్రేమ ఏర్పడుతుంది. ఏ ఆత్మకు సంబంధించిన ఏ విషయమైనా మీకు ఇష్టం లేకపోతే, అప్పుడే ప్రేమలో తేడా వస్తుంది. ఆ సమయంలో బుద్ధిలో ఇదే ఉంచుకోండి – ఈ ఆత్మను తండ్రి ఇష్టపడ్డారు, తప్పకుండా ఏదో విశేషత ఉంది కావుననే తండ్రి ఇష్టపడ్డారు. మొదటి నుండి బాబా పిల్లలకు ఇది వినిపిస్తూ ఉన్నారు, ఏమనంటే – ఒకవేళ ఎవరిలోనైనా 36 గుణాలలో 35 గుణాలు లేకపోయినా కానీ ఒక్క గుణమైనా విశేషంగా ఉంది, అందుకే తండ్రి వారిని ఇష్టపడ్డారు. తండ్రి వారిలోని 35 అవగుణాలను చూసారా లేక ఆ ఒక్క గుణాన్నే చూసారా? ఏం చూసారు? అన్నింటికన్నా అత్యంత పెద్ద గుణం లేక విశేషత ఏమిటంటే – తండ్రిని గుర్తించే బుద్ధి, తండ్రికి చెందినవారిగా అయ్యే ధైర్యం, తండ్రిని ప్రేమించే విధి తెలుసు, ఇది మొత్తం కల్పంలో ధర్మ పితలలో కూడా లేదు, రాజ్య నేతలలో కూడా లేదు, ధనవంతులలో కూడా లేదు కానీ ఆ ఆత్మలో ఉంది. తండ్రి మీ అందరినీ అడుగుతున్నారు, మీరు తండ్రి వద్దకు వచ్చినప్పుడు గుణ సంపన్నులుగా అయి వచ్చారా? తండ్రి మీ బలహీనతలను చూసారా? మీరు నా వారిగానే ఉండేవారు, ఉన్నారు మరియు సదా అలా ఉంటారు అని అంటూ ధైర్యాన్ని పెంచారు కదా. కనుక ఫాలో ఫాదర్ చేయండి కదా! ఎప్పుడైతే విశేష ఆత్మగా భావిస్తూ ఎవరినైనా చూస్తారో, సంబంధ-సంపర్కంలోకి వస్తారో, అప్పుడు తండ్రిని ఎదురుగా పెట్టుకోవడంతో ఆత్మలో స్వతహాగానే ఆత్మిక ప్రేమ ఇమర్జ్ అవుతుంది. మీ స్నేహంతో సర్వులకు స్నేహీలుగా అవుతారు మరియు ఆత్మిక స్నేహంతో సదా అందరి నుండి సద్భావన, సహయోగం యొక్క భావన స్వతహాగానే మీ పట్ల ఆశీర్వాదాల రూపంలో ప్రాప్తిస్తాయి. దీనినే ఆత్మిక యథార్థమైన శ్రేష్ఠ హ్యాండ్లింగ్ అని అంటారు.

బాప్ దాదా ఈ రోజు చిరునవ్వు నవ్వుతున్నారు. పిల్లలలో మూడు పదాల కారణంగా కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ తగ్గిపోతుంది. ఆ మూడు పదాలు ఏమిటంటే – 1. వై (ఎందుకు), 2. వాట్ (ఏమిటి), 3. వాంట్ (కావాలి). ఈ మూడు పదాలను సమాప్తం చేసి ఒక్క పదాన్ని ఉపయోగించండి. ఎందుకు అనేది వచ్చినా ఒకే పదాన్ని పలకండి – ‘‘వాహ్’’, ఏమిటి అనే పదం వచ్చినా కూడా ‘‘వాహ్’’ అని అనండి! ‘‘వాహ్’’ అన్న పదాన్ని పలకడం వచ్చు కదా. వాహ్ బాబా! వాహ్ నేను! మరియు వాహ్ డ్రామా! కేవలం ‘‘వాహ్’’ అని అన్నట్లయితే ఈ మూడు పదాలు సమాప్తమైపోతాయి. బాప్ దాదా ఏ ఆటను చూసారు అనేది ఇంతకుముందు కూడా వినిపించారు కదా! ఇంతకుముందు మీది ఒక చిత్రం తయారుచేయబడి ఉండేది, అందులో ఏం చూపించారంటే – యోగి యోగం జోడిస్తున్నారు, బుద్ధిని ఏకాగ్రచిత్తం చేస్తున్నారు, బ్యాలెన్స్ పెడుతున్నారు, బ్యాలెన్స్ యొక్క త్రాసును చూపించారు, ఎంతగా బుద్ధిని బ్యాలన్స్ చేస్తారో, అంతగా ఏదో ఒక కోతి వచ్చి కూర్చుండిపోతుంది. ఈ మూడు మాటల కోతులు వస్తే, బ్యాలెన్స్ ఏమవుతుంది! అలజడి ఏర్పడుతుంది, బ్యాలెన్స్ ఉండదు. కావున ఈ మూడు పదాలు బ్యాలెన్స్ ను సమాప్తం చేస్తాయి, బుద్ధిని నాట్యం చేయించడం మొదలుపెడతాయి. కోతి ప్రశాంతంగా కూర్చోగలదా? వేరే ఏమీ చేయకపోయినా కానీ తోకనైనా కదిలిస్తూ ఉంటుంది. కనుక ఇందులో కూడా బ్యాలెన్స్ లేని కారణంగా తండ్రి ద్వారా ప్రతి అడుగులో ఏవైతే ఆశీర్వాదాలు లభిస్తాయో మరియు ఆత్మిక స్నేహం కారణంగా పరివారం నుండి ఏవైతే ఆశీర్వాదాలు లభిస్తాయో, వాటి నుండి వంచితులవుతారు. ఎలాగైతే తండ్రితో సంబంధం పెట్టుకోవడం అవసరమో, అలా ఈశ్వరీయ పరివారంతో సంబంధం పెట్టుకోవడం కూడా అత్యంత అవసరము. మొత్తం కల్పంలో నంబరువన్ ఆత్మ అయిన బ్రహ్మాబాబా యొక్క మరియు ఈశ్వరీయ పరివారం యొక్క సంబంధ-సంపర్కంలోకి రావాలి. అచ్ఛా, తండ్రి అయితే మా వారే, మేము తండ్రికి చెందినవారిమే అని ఇలా అనుకోకూడదు. ఇది కూడా పాస్ విత్ ఆనర్ గా (గౌరవప్రదంగా ఉత్తీర్ణులు) అయ్యేవారి గుర్తు కాదు ఎందుకంటే మీరు సన్యాసి ఆత్మలు కాదు. ఋషి-ముని ఆత్మలు కాదు. మీరు విశ్వానికి దూరమయ్యేవారు కాదు, విశ్వానికి ఆధారంగా అయ్యే ఆత్మలు. విశ్వానికి దూరంగా ఉండేవారు కాదు, విశ్వ కళ్యాణకారులు. బ్రహ్మణాత్మల విషయాన్ని పక్కన పెట్టండి, కానీ ప్రకృతిని కూడా పరివర్తన చేసేందుకు ఆధారం మీరు! పరివారం యొక్క అవినాశీ ప్రేమ అనే దారం మధ్య నుండి బయటకు రాలేరు. విజయీ రత్నాలు ప్రేమ యొక్క దారం మధ్య నుండి బయటకు రాలేరు, అందుకే ఎప్పుడూ కూడా, ఏ విషయంలోనూ, ఏ స్థానంలోనూ, ఏ సేవ నుండి, ఏ సహచరుల నుండి దూరమై, తమ అవస్థను మంచిగా చేసుకుని చూపిస్తాను అన్న సంకల్పం కూడా చేయకండి. ఇలా అంటూ ఉంటారు కదా – మేము వీరితో పాటు ఉండలేము, వారితో ఉంటాము, ఈ స్థానంలో ఉన్నతి జరగదు, వేరే స్థానంలో జరుగుతుంది, ఈ సేవలో విఘ్నాలున్నాయి, వేరే సేవలో బాగుంటుంది, ఇవన్నీ దూరం చేసే విషయాలు. ఒకవేళ ఒక్కసారి మీలో ఈ అలవాటు చేసుకున్నట్లయితే, ఇక ఈ అలవాటు మిమ్మల్ని ఎక్కడా నిలవనివ్వదు, బుద్ధిని ఏకాగ్రంగా ఉండనివ్వదు ఎందుకంటే బుద్ధిని మార్చుకునే అలవాటు ఏర్పడింది. ఇది కూడా బలహీనతగా లెక్కించబడుతుంది, ఉన్నతిగా లెక్కించబడదు. సదా స్వయంలో శుభమైన ఆశలు ఉంచుకోండి, నిరాశావాదులుగా అవ్వకండి. తండ్రి పిల్లలు ప్రతి ఒక్కరి పట్ల శుభమైన ఆశలు పెట్టుకున్నారు. వారు ఎలా ఉన్నా సరే, తండ్రి లాస్ట్ నంబరు వారి విషయంలో కూడా ఎప్పుడూ నిరాశ చెందలేదు. సదా ఆశనే పెట్టుకున్నారు. కనుక మీరు కూడా స్వయం పట్ల గాని, ఇతరుల పట్ల గాని, సేవ పట్ల గాని నిరాశ చెందకండి, వ్యాకులపడకండి. గొప్ప మనసున్నవారిగా కండి. మహారాజు అనగా విశాల హృదయులు, సదా పెద్ద మనసున్నవారు. ఎటువంటి బలహీన సంస్కారాన్ని ధారణ చేయకండి. మాయ భిన్న-భిన్న రూపాలలో బలహీనంగా చేసేందుకు ప్రయత్నిస్తుంది. కానీ మీరు మాయ విషయంలో కూడా జ్ఞాన సంపన్నులు కదా లేక అసంపూర్ణ జ్ఞానం ఉందా? ఇది కూడా గుర్తుంచుకోండి, మాయ కొత్త-కొత్త రూపాలలో వస్తుంది, పాత రూపంలో రాదు ఎందుకంటే వీరు గుర్తుపట్టేస్తారని దానికి కూడా తెలుసు. విషయం అదే ఉంటుంది కానీ కొత్త రూపాన్ని ధరిస్తుంది. అర్థమయ్యిందా! అచ్ఛా!

టీచర్లు మాయ విషయంలో జ్ఞానసంపన్నులుగా ఉన్నారా? కేవలం జ్ఞానం కలిగి ఉండడం కాదు, జ్ఞానసంపన్నులుగా ఉన్నారా? తండ్రిని గుర్తించాము కదా అని కేవలం ఇదే ఆలోచించకండి, మాయను కూడా గుర్తించాలి. ఇప్పుడు బంధనంలో బంధించబడ్డారా లేక కఠినంగా అనిపిస్తుందా? మధురమైన బంధనం అనిపిస్తుందా లేక కొద్దిగా కష్టమైన బంధనం అనిపిస్తుందా? ఇక్కడ చాలా మరణించాల్సి ఉంటుంది, తండ్రికి చెందినవారిగా అయ్యాము, ఇప్పుడు మళ్ళీ ఇది చేయాలి, అది చేయాలి, ఎంతవరకని చేస్తాము అని అనుకుంటారా! ఒకవేళ ఇది తెలిసి ఉంటే వచ్చేవారమే కాదు – ఇలాంటి ఆలోచన నడుస్తుందా? ఎక్కడైతే ప్రేమ ఉంటుందో, అక్కడ ఏ కష్టమూ ఉండదు. దీపం పురుగు కూడా దీపంపై బలిహారమవుతుంది. మరి శ్రేష్ఠాత్మలైన మీరు పరమాత్మ ప్రేమ వెనుక కష్టాన్ని అనుభవం చేయగలరా? దీపం పురుగు బలిహారం అవ్వగలదు అన్నప్పుడు మీరు చేయలేనిది ఏమిటి? ఏ ఘడియలోనైతే కష్టం అనుభవం అవుతుందో, అప్పుడు తప్పకుండా ప్రేమ యొక్క శాతంలో తేడా వస్తుంది. అందుకే కొంత సమయం కష్టమనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే కష్టంగా ఉంటే, సదా కష్టమనిపించాలి, అప్పుడప్పుడు ఎందుకు కష్టం అనిపిస్తుంది? పరమాత్మకు మరియు మీకు మధ్యన ఏదో ఒక విషయం వస్తుంది, అందుకే కష్టమవుతుంది మరియు శాతంలో తేడా వచ్చేస్తుంది. ఆ విషయాన్ని మధ్యలో నుండి తీసేసినట్లయితే మళ్ళీ సహజమైపోతుంది.

బాప్ దాదా సదా అంటారు, టీచర్లు అనగా సదా స్వయం ధైర్యంగా ఉండేవారు మరియు ఇతరులకు ధైర్యాన్ని ఇచ్చేందుకు నిమిత్తంగా అయ్యేవారు. లేదంటే టీచరుగా అయ్యింది ఎందుకు? టీచరు అంటేనే విద్యార్థులకు నిమిత్తులు. బలహీనులకు ధైర్యాన్ని ఇచ్చి ముందుకు తీసుకువెళ్ళే సేవకు నిమిత్తులు. సఫల టీచరు యొక్క మొట్టమొదటి లక్షణం ఇదే – వారెప్పుడూ ధైర్యహీనులుగా అవ్వరు. ఎవరైతే స్వయం ధైర్యంగా ఉంటారో, వారు ఇతరులకు కూడా తప్పకుండా ధైర్యాన్ని ఇస్తారు. స్వయంలోనే ధైర్యం తక్కువగా ఉన్నట్లయితే ఇతరులకు కూడా ఇవ్వలేరు. అచ్ఛా!

నలువైపులా కల ధైర్యం చేసే పిల్లలకు సహాయం చేసే తండ్రి అన్న అధికారాన్ని అనుభవం చేసేవారు, సదా స్వరాజ్య శక్తులను సమయ ప్రమాణంగా ప్రయోగంలోకి తీసుకొచ్చేవారు, సదా తండ్రి మరియు సర్వాత్మల ఎడతెగని స్నేహీలు, సదా ప్రతి కార్యంలో, సంబంధ-సంపర్కంలో వాహ్, వాహ్ యొక్క పాటలు పాడేవారు – ఇటువంటి ఆల్మైటీ అథారిటీ (సర్వశక్తివంతులు) పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

వరదానము:-

ఎవరైతే స్వ మరియు సర్వుల సేవను కలిపి-కలిపి చేస్తారో, వారినే యథార్థ సేవాధారులని అంటారు. స్వ సేవలో సర్వుల సేవ ఇమిడి ఉండాలి. ఇతరుల సేవ చేయడము మరియు స్వ సేవలో నిర్లక్ష్యులుగా అవ్వడము కాదు. సేవలో, సేవ మరియు యోగం, రెండూ కలిసి-కలిసి ఉండాలి. దీని కోసం ప్లెయిన్ బుద్ధి కలవారిగా అయి సేవా ప్లాన్లు తయారుచేయండి. ప్లెయిన్ బుద్ధి అనగా నిమిత్తము మరియు నిర్మాన భావము తప్ప ఇంకే విషయమూ బుద్ధిని టచ్ చేయకూడదు. హద్దు పేరు, హద్దు గౌరవం కాదు, కానీ నిర్మానముగా ఉండాలి. ఇదే శుభభావన మరియు శుభకామన యొక్క బీజము.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top