27 June 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

June 26, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - ఈ శరీరము రూపీ రథముపై విరాజమానమై ఉన్న ఆత్మ రథ సారథి, రథ సారథిగా భావిస్తూ కర్మలు చేసినట్లయితే దేహాభిమానము తొలగిపోతుంది’’

ప్రశ్న: -

తండ్రి మాట్లాడే విధానము, మనుష్యులు మాట్లాడే విధానానికి పూర్తిగా భిన్నమైనది, ఎలా?

జవాబు:-

తండ్రి ఈ రథానికి రథ సారథిగా అయి మాట్లాడుతారు మరియు ఆత్మలతోనే మాట్లాడుతారు. శరీరాలను చూడరు. మనుష్యులు స్వయాన్ని ఆత్మగానూ భావించరు మరియు ఆత్మలతోనూ మాట్లాడరు. పిల్లలైన మీరు ఇప్పుడు ఈ అభ్యాసం చేయాలి. ఏ ఆకారీ లేక సాకారీ చిత్రాన్ని చూస్తూ కూడా చూడకండి. ఆత్మను చూడండి మరియు ఒక్క విదేహీని స్మృతి చేయండి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నీవే తల్లివి-తండ్రివి…(తుమ్హీహో మాతా-పితా…)

ఓంశాంతి. పిల్లలకు ఓం శాంతి అన్నదాని అర్థాన్ని పూర్తిగా సహజంగా అర్థం చేయించడము జరుగుతుంది. ప్రతి విషయమూ సహజమైనది. సహజంగా రాజ్యాన్ని ప్రాప్తి చేసుకోవాలి, ఎక్కడి కోసము? సత్యయుగము కోసము. దానిని జీవన్ముక్తి అని అంటారు. అక్కడ రావణుడి ఈ భూతాలు ఉండవు. ఎవరికైనా క్రోధము వస్తే, నీలో ఈ భూతముంది అని అంటారు. యోగమంటే అర్థము – స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్మను స్మృతి చేయడము. నేను ఆత్మను, ఇది నా శరీరము. ప్రతి ఒక్కరి శరీరం రూపీ రథములో రథ సారథి అయిన ఆత్మ కూర్చుని ఉంది. ఆత్మ శక్తితో ఈ రథము నడుస్తుంది. ఆత్మకు ఈ శరీరాన్ని మళ్ళీ-మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది మరియు విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఇదైతే పిల్లలకు తెలుసు, భారత్ ఇప్పుడు దుఃఖధామముగా ఉంది. కొంతకాలము క్రితం సుఖధామముగా ఉండేది. ఆల్మైటీ గవర్నమెంట్ ఉండేది, ఎందుకంటే ఆల్మైటీ అథారిటీ భారత్ లో దేవతల రాజ్యాన్ని స్థాపన చేసారు. అక్కడ ఒకే ధర్మముండేది. నేటికి 5000 సంవత్సరాల క్రితం తప్పకుండా లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది. ఆ రాజ్యాన్ని స్థాపన చేసినవారు తప్పకుండా తండ్రే అయి ఉంటారు. తండ్రి నుండి వారికి వారసత్వం లభించి ఉంటుంది. వీరి ఆత్మ 84 జన్మల చక్రములో తిరిగింది. భారతవాసులే ఈ వర్ణాలలోకి వస్తారు. శూద్ర వర్ణము తర్వాత సర్వోత్తమమైన బ్రాహ్మణ వర్ణము వస్తుంది. బ్రాహ్మణ వర్ణము అనగా బ్రహ్మా ముఖవంశావళి. ఆ బ్రాహ్మణులు కుఖ వంశావళి. మేము బ్రహ్మా ముఖవంశావళి అని వారు అనలేరు. ప్రజాపిత బ్రహ్మాకు తప్పకుండా దత్తత తీసుకోబడిన పిల్లలు ఉంటారు. ఈ భారత్ పూజ్యముగా ఉండేదని, ఇప్పుడు పూజారిగా ఉందని పిల్లలకు తెలుసు. తండ్రి అయితే సదా పూజ్యులు, వారు పతితులను పావనంగా చేయడానికి తప్పకుండా వస్తారు. సత్యయుగము పావన ప్రపంచము. సత్యయుగంలో పతిత-పావని గంగ అన్న పేరే ఉండదు ఎందుకంటే అది ఉన్నదే పావన ప్రపంచము. అక్కడ అందరూ పుణ్యాత్ములే. పాపాత్ములు ఉండరు. కలియుగంలోనేమో పుణ్యాత్ములు ఉండరు. అందరూ పాపాత్ములే. పుణ్యాత్మ అని పవిత్రమైనవారిని అంటారు. భారత్ లోనే చాలా దాన-పుణ్యాలు చేస్తారు. ఈ సమయంలో, ఎప్పుడైతే తండ్రి వస్తారో, అప్పుడు వారిపై బలిహారమవుతారు. సన్యాసులైతే ఇళ్ళు-వాకిళ్ళను వదిలి వెళ్ళిపోతారు. ఇక్కడైతే ఇలా అంటారు, బాబా, ఇదంతా మీదే. మీరు సత్యయుగంలో అపారమైన ధనాన్ని ఇచ్చారు, తర్వాత మాయ గవ్వ సమానంగా చేసేసింది. ఇప్పుడు ఈ ఆత్మ కూడా పతితంగా అయ్యింది. తనువు, మనస్సు, ధనము అన్నీ పతితంగా ఉన్నాయి. ఆత్మ మొట్టమొదట పవిత్రంగా ఉంటుంది, తర్వాత చక్రములో తిరిగి చివర్లో తమోప్రధానంగా, అసత్యమైన ఆభరణంగా అయ్యింది. పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ పతితంగా అవుతుంది. గోల్డెన్, సిల్వర్… ఈ స్థితులలోకి మనుష్యులు తప్పకుండా రావాల్సిందే. నీవే తల్లివి, తండ్రివి… అని పాడుతారు కూడా. లక్ష్మీ-నారాయణుల ఎదురుగా కూడా వెళ్ళి ఈ మహిమను చేస్తారు. కానీ వారికి తమకంటూ ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉంటారు. రాజా-రాణులకు ఏ విధమైన సుఖము ఉంటుందో, పిల్లలకు కూడా అటువంటి సుఖమే ఉంటుంది. అందరికీ అపారమైన సుఖము ఉంటుంది. ఇప్పుడైతే 84వ అంతిమ జన్మలో అపారమైన దుఃఖము ఉంటుంది. తండ్రి అంటారు, ఇప్పుడు మళ్ళీ నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. ఈ రథములో రథ సారథి అయిన ఆత్మ కూర్చుని ఉందని పిల్లలకు అర్థం చేయించారు. ఈ రథ సారథి మొదట 16 కళల సంపూర్ణంగా ఉండేది. ఇప్పుడు ఏ కళ లేదు. నిర్గుణుడినైన నాలో ఇప్పుడు ఏ గుణము లేదు, మీరే దయ చూపించండి అని అంటారు కూడా. ఎవరిలోనూ గుణాలు లేవు. పతితంగా ఉన్నారు, అందుకే గంగలో పాపాలు కడుక్కునేందుకు వెళ్తారు. సత్యయుగంలో అలా వెళ్ళరు. నది అయితే అదే కదా. ఇకపోతే, ఆ సమయంలో ప్రతి వస్తువు సతోప్రధానంగా ఉంటుందని అంటారు. సత్యయుగంలో నదులు కూడా చాలా శుభ్రంగా, స్వచ్ఛంగా ఉంటాయి. నదులలో చెత్త మొదలైనవేవీ ఉండవు. ఇక్కడైతే చూడండి, చెత్త చేరుకుంటూ ఉంటుంది. మొత్తం చెత్త అంతా సాగరంలోకి వెళ్తుంది. సత్యయుగంలో అలా జరగదు. అక్కడ ఏదైనా అపవిత్రముగా అవ్వడము అనే నియమము లేదు. అన్ని వస్తువులు పవిత్రంగా ఉంటాయి. కనుక తండ్రి అర్థం చేయిస్తారు, ఇప్పుడిది అందరికీ అంతిమ జన్మ. ఆట పూర్తవుతుంది. ఈ ఆట యొక్క లిమిట్ 5000 సంవత్సరాలు. ఇది నిరాకార శివబాబా అర్థం చేయిస్తారు. వారు నిరాకారుడు, అందరికన్నా ఉన్నతమైనవారు, పరంధామములో నివసించేవారు, పరంధామము నుండి అయితే మనమంతా కూడా వస్తాము. ఇప్పుడు కలియుగాంతములో డ్రామా పూర్తయ్యి మళ్ళీ చరిత్ర రిపీట్ అవ్వనున్నది. మనుష్యులు ఈ గీతా శాస్త్రాలు మొదలైనవి ఏవైతే చదువుతారో, అవన్నీ ద్వాపరము నుండి తయారయ్యాయి. ఈ జ్ఞానము కనుమరుగైపోతుంది. రాజయోగాన్ని అయితే ఎవ్వరూ నేర్పించలేరు, కేవలం వారి స్మృతిచిహ్నముగా పుస్తకాలను తయారుచేస్తూ ఉంటారు. వారైతే స్వయం ధర్మ స్థాపన చేసి పునర్జన్మల్లోకి రావడం మొదలుపెడతారు. వారి స్మృతిచిహ్నాలుగా పుస్తకాలు ఉంటాయి. ఇప్పుడు సంగమములో దేవీ-దేవతా ధర్మ స్థాపన జరుగుతుంది. తండ్రి వచ్చి ఈ రథములో విరాజమానమవుతారు. గుర్రపు బండి యొక్క విషయము కాదు. ఈ సాధారణ వృద్ధ రథములో ప్రవేశిస్తారు. వారు రథ సారథి. బ్రహ్మాకుమార-కుమారీలు, బ్రహ్మా యొక్క ముఖవంశావళి అని అంటూ ఉంటారు. ఈ బ్రహ్మా కూడా దత్తత తీసుకోబడినవారు. తండ్రి స్వయంగా అంటారు, నేను ఈ రథంలోకి వచ్చి రథ సారథిగా అవుతాను, వీరికి జ్ఞానాన్ని ఇస్తాను. వీరితోనే ప్రారంభిస్తాను. మాతలకు కలశాన్ని ఇస్తాను. వీరు కూడా మాత అయినట్లే. మొట్టమొదట వీరు వింటారు, ఆ తర్వాత మీరు, వీరిలోనైతే విరాజమానమై ఉన్నాను, మరి ఎదురుగా ఎవరికి వినిపిస్తాను. అప్పుడు ఆత్మలతో కూర్చుని మాట్లాడుతారు, ఈ విధంగా ఆత్మలతో కూర్చుని మాట్లాడే విద్వాంసులు మొదలైనవారు ఇంకెవ్వరూ ఉండరు. నేను మీ తండ్రిని. ఆత్మలైన మీరు నిరాకారీ, నేను కూడా నిరాకారుడిని. నేను జ్ఞాన సాగరుడను, స్వర్గ రచయితను. నేను నరకాన్ని రచించను. నరకాన్ని అయితే మాయ తయారుచేస్తుంది. తండ్రి అంటారు, నేను ఉన్నదే రచయితను, కనుక స్వర్గాన్నే తయారుచేస్తాను. భారతవాసులైన మీరు స్వర్గవాసులుగా ఉండేవారు. ఇప్పుడు నరకవాసులుగా అయ్యారు. రావణుడు నరకవాసులుగా చేసాడు ఎందుకంటే ఆత్మ రావణుని మతంపై నడుస్తుంది. ఈ సమయంలో ఆత్మలైన మీరు రాముడైన శ్రీ శ్రీ శివబాబా మతంపై నడుస్తారు. తండ్రి అర్థం చేయిస్తారు, ఇప్పుడు అందరి పాత్ర పూర్తయ్యింది. ఎప్పుడైతే ఆత్మలన్నీ చేరుకుంటాయో, పై నుండి అన్నీ వచ్చేస్తాయో, అప్పుడు తిరిగి వెళ్ళడము మొదలవుతుంది. ఇక అప్పుడు వినాశనం మొదలవుతుంది. భారత్ లో ఇప్పుడు అనేక ధర్మాలున్నాయి. కేవలం ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము లేదు. ఎవరూ స్వయాన్ని దేవతలమని చెప్పుకోరు. సర్వగుణ సంపన్నులు… అని దేవతల మహిమను పాడుతారు. మళ్ళీ స్వయాన్ని, మేము పాపులము, నీచులము… అని అంటారు. ద్వాపరము నుండి రావణ రాజ్యం మొదలవుతుంది. రామ రాజ్యము బ్రహ్మా యొక్క పగలు, రావణ రాజ్యము బ్రహ్మా యొక్క రాత్రి. ఇప్పుడు తండ్రి ఎప్పుడు రావాలి? ఎప్పుడైతే బ్రహ్మా యొక్క రాత్రి పూర్తవుతుందో, అప్పుడే వస్తారు కదా. మరియు ఈ బ్రహ్మా తనువులోకి వచ్చినప్పుడే బ్రహ్మా ముఖము ద్వారా బ్రాహ్మణులు జన్మిస్తారు. ఆ బ్రాహ్మణులకే రాజయోగాన్ని నేర్పిస్తారు. తండ్రి అంటారు, ఏవైతే ఆకారీ, సాకారీ మరియు నిరాకారీ చిత్రాలున్నాయో – వాటిని మీరు గుర్తు చేయకూడదు. మీకైతే లక్ష్యము ఇవ్వడము జరుగుతుంది. మనుష్యులైతే చిత్రాలను చూస్తూ స్మృతి చేస్తారు. బాబా అయితే అంటారు, చిత్రాలను చూడడము ఇప్పుడు ఆపు చేయండి. అది భక్తి మార్గము. ఇప్పుడైతే ఆత్మలైన మీరు తిరిగి నా వద్దకు రావాలి. పాపాల భారం తలపై ఉంది, పాపాత్ములుగా అయ్యేదే ఉంది. అలాగని, గర్భ జైలులో ప్రతి జన్మ యొక్క పాపాలు సమాప్తమవుతాయని కాదు. కొన్ని సమాప్తమవుతాయి, కొన్ని మిగిలిపోతాయి. ఇప్పుడు నేను మార్గదర్శకుడినై వచ్చాను. ఈ సమయంలో ఆత్మలందరూ మాయ మతంపై నడుస్తున్నారు. తండ్రి అంటారు, నేనైతే పతిత-పావనుడిని, స్వర్గ రచయితను. నరకాన్ని స్వర్గముగా చేయడమే నా వ్యాపారము. స్వర్గంలోనైతే ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉంటాయి. అక్కడ ఎటువంటి విభజనలు ఉండేవి కాదు. తండ్రి అంటారు, నేను విశ్వానికి యజమానిగా అవ్వను. మిమ్మల్ని తయారుచేస్తాను. తర్వాత రావణుడు వచ్చి మీ నుండి రాజ్యాన్ని లాక్కుంటాడు. ఇప్పుడు అందరూ తమోప్రధానంగా, రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు. సంగమయుగంలో మీరు పారసబుద్ధి కలవారిగా అవుతారు. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి, బుద్ధియోగాన్ని పైన వ్రేలాడదీయండి. ఎక్కడికైతే వెళ్ళాలో, వారినే స్మృతి చేయాలి. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు. వారే సత్యమైన చక్రవర్తి, సత్యాన్ని వినిపించేవారు. కావున ఏ చిత్రాన్ని స్మరించకూడదు. ఈ శివుని చిత్రము ఏదైతే ఉందో, దానిపై కూడా ధ్యానము పెట్టకూడదు, ఎందుకంటే శివుడు ఆ విధంగానైతే ఉండరు. ఏ విధంగా ఆత్మలమైన మనము భృకుటి మధ్యలో ఉంటామో, అలా బాబా కూడా అంటారు, నేను కొంచెం స్థానాన్ని తీసుకుని ఈ ఆత్మ ప్రక్కన కూర్చుండిపోతాను. రథ సారథిగా అయి కూర్చుని వీరికి జ్ఞానాన్ని ఇస్తాను. వీరి ఆత్మలో కూడా ఇంతకుముందు జ్ఞానం లేదు. ఏ విధంగా రథ సారథి అయిన ఈ ఆత్మ శరీరము ద్వారా మాట్లాడుతారో, అలా నేను కూడా ఈ ఇంద్రియాల ద్వారా మాట్లాడుతాను. లేదంటే నేను ఎలా అర్థం చేయించాలి. బ్రాహ్మణులను రచించడానికి బ్రహ్మా తప్పకుండా కావాలి. ఆ బ్రహ్మానే తర్వాత నారాయణుడిగా అవుతారు. ఇప్పుడు మీరు బ్రహ్మా సంతానము, తర్వాత సూర్యవంశీ శ్రీ నారాయణుని వంశంలోకి వెళ్తారు. ఇప్పుడైతే పూర్తిగా నిరుపేదలుగా అయ్యారు. కొట్లాడుకుంటూ, గొడవపడుతూ ఉన్నారు. కోతి కన్నా హీనంగా ఉన్నారు. కోతిలో 5 వికారాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కామము, క్రోధము… అన్ని వికారాలు కోతిలో ఎంతగా ఉంటాయంటే, ఇక అడగకండి. కోతిపిల్ల మరణిస్తే దాని అస్తిపంజరాన్ని కూడా విడిచిపెట్టదు. మనుష్యులు కూడా ఈ రోజుల్లో అలాగే ఉన్నారు. కొడుకు మరణించినట్లయితే 6-8 మాసాలు ఏడుస్తూ ఉంటారు. సత్యయుగంలోనైతే అకాల మృత్యువులు సంభవించదు. అక్కడ ఎవ్వరూ ఏడవరు, పెడబొబ్బలు పెట్టరు. అక్కడ ఏ విధమైన సైతాను ఉండదు.

తండ్రి ఈ సమయంలో పిల్లలైన మీతో మాట్లాడుతున్నారు. ఇళ్ళు-వాకిళ్ళను కూడా సంభాళించండి. అక్కడ ఉంటూనే సన్యాసులు చేయలేనటువంటి అద్భుతాన్ని చేసి చూపించండి. ఈ సతోప్రధానమైన సన్యాసాన్ని పరమాత్మనే నేర్పిస్తారు. వారు అంటారు, ఈ పాత ప్రపంచము ఇప్పుడు సమాప్తమవ్వనున్నది, అందుకే దీని నుండి మమకారాన్ని తొలగించండి. అందరూ తిరిగి వెళ్ళాలి. దేహ సహితంగా ఏవైతే పాత వస్తువులున్నాయో, వాటిని మర్చిపోండి. 5 వికారాలను నాకు ఇచ్చేయండి. ఒకవేళ అపవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచంలోకి రాలేరు. ఈ అంతిమ జన్మకు తండ్రికి ప్రతిజ్ఞ చేయండి. ఇక అప్పుడు పవిత్రత స్థిరంగా నిలిచిపోతుంది. 63 జన్మలైతే విషములో మునకలు వేసారు, పూర్తిగా మురికిగా అయ్యారు. మీ ధరాన్ని, కర్మను మర్చిపోయారు. హిందూ ధర్మమని అంటూ ఉంటారు. తండ్రి అంటారు, భారత్ యే స్వర్గంగా ఉండేదని, మేమే దేవీ-దేవతలుగా ఉండేవారమని ఎందుకు అర్థం చేసుకోరు? నేను మీకు రాజయోగాన్ని నేర్పించాను. కానీ మీరేమో కృష్ణుడు నేర్పించారని అంటారు. కృష్ణుడేమైనా అందరికీ తండ్రి, స్వర్గ రచయితనా? తండ్రి అయితే నిరాకారుడు, సర్వాత్మల తండ్రి. కానీ వారిని సర్వవ్యాపి అని అంటారు. శివ-శంకరులను కూడా కలిపేస్తారు. శివుడైతే పరమాత్మ. పరమాత్మ అంటారు, నేను దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేయడానికే వస్తాను. ఇప్పుడు స్థాపన చేసిన దానిని విష్ణువు యొక్క రెండు రూపాలైన లక్ష్మీ-నారాయణులు రాజ్యం చేస్తారు. విష్ణువు అన్న పదము నుండే వైష్ణవ అన్న పదము వెలువడుతుంది.

ఈ రోజుల్లోనైతే అందరూ పాపాత్ములే. అక్కడ ఈ కామ ఖడ్గాన్ని ఉపయోగించి ఒకరినొకరు హతమార్చుకోరు. సత్యఖండాన్ని స్థాపన చేసేవారు ఒక్క సద్గురువు మాత్రమే. మిగిలినవారందరూ ముంచేవారు. సంగమము మరియు స్వర్గము, ఇవి ఒకదానికొకటి దగ్గరగా ఉండడం కారణంగా నరకం యొక్క విషయాలను స్వర్గంలోకి తీసుకువెళ్ళారు. వాస్తవానికి కంసుడు, రావణుడు మొదలైనవారంతా ఇప్పుడే ఉన్నారు. అక్కడ వీరు ఉండజాలరు. రథములో రథసారథిని చూపిస్తారు – వాస్తవానికి వీరి శరీరమే రథము, వీరిని నందీ గణమని, భగీరథుడని కూడా అంటారు. మీరంతా అర్జునులు, మీకు చెప్తున్నారు – యుద్ధ మైదానంలో మీకు మాయపై విజయం ప్రాప్తి చేయించేందుకు నేను ఈ రథములో వచ్చాను. సత్యయుగంలో రావణుడూ ఉండడు, కాల్చరు కూడా. ఇప్పుడైతే వినాశనం అవ్వనంతవరకు రావణుడిని కాలుస్తూనే ఉంటారు. ఎన్ని ఆపదలు వచ్చినా సరే, దసరా నాడు రావణుడిని తప్పకుండా కాలుస్తారు. ఇక ఆఖరికి ఈ రావణ సంప్రదాయము అంతమైపోతుంది. సద్గతిదాత ఒక్కరే. మనుష్యులు, మనుష్యులకు సద్గతిని ఇవ్వలేరు. ఈ దేవతల రాజ్యం ఉన్నప్పుడు మొత్తము విశ్వముపై వీరి రాజ్యమే ఉండేది, ఇతర ధర్మాలేవీ లేనే లేవు. ఇప్పుడు ఇతర ధర్మాలన్నీ ఉన్నాయి, దేవతల ధర్మము లేదు. అది ఇప్పుడు స్థాపనవుతూ ఉంది. దేవతా ధర్మం వారే వచ్చి శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సతోప్రధాన సన్యాసము చేయాలి. ఈ పాత ప్రపంచములో ఉంటూ దీని నుండి మమకారాన్ని తొలగించాలి. దేహ సహితంగా ఏవైతే పాత వస్తువులున్నాయో, వాటిని మర్చిపోవాలి.

2. తమ బుద్ధియోగాన్ని పైన వ్రేలాడదీయాలి. ఏ చిత్రమును లేక దేహధారినీ స్మృతి చేయకూడదు. ఒక్క తండ్రినే స్మరణ చేయాలి.

వరదానము:-

సంగమయుగంలో శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మలైన మీకు పరమాత్మ శ్రీమతము ఏదైతే లభిస్తుందో – ఆ శ్రీమతమే శ్రేష్ఠమైన పాలన. శ్రీమతము లేకుండా అనగా పరమాత్మ పాలన లేకుండా ఒక్క అడుగును కూడా వేయకూడదు. ఇటువంటి పాలన సత్యయుగంలో కూడా లభించదు. ఇప్పుడు ప్రత్యక్ష అనుభవముతో – మా పాలన చేసేవారు స్వయంగా భగవంతుడు అని అంటారు. ఈ నషా సదా ఇమర్జ్ అయి ఉన్నట్లయితే స్వయాన్ని అనంతమైన ఖజానాలతో నిండుగా, అవినాశీ వారసత్వానికి అధికారులుగా అనుభవం చేస్తారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

ಹೃದಯದ ಆಸರೆ ತುಂಡಾಗದಿರಲಿ…….

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top