27 January 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

January 26, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - మీ సుఖం యొక్క రోజులు ఇప్పుడు వస్తున్నాయి, లోక మర్యాదలను, కలియుగీ కుల మర్యాదలను వదిలి ఇప్పుడు మీరు సంపాదన చేసుకోండి, తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోండి’’

ప్రశ్న: -

అంత మతి సో గతి ఏ పురుషార్థంతో ఏర్పడుతుంది?

జవాబు:-

బాబా అంటారు, పిల్లలూ, మీరు ఇప్పటివరకు ఏదైతే చదివారో, దానిని మరచి కేవలం ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి – మౌనంగా ఉండండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి స్మృతిలో ఉండే పురుషార్థం చేయండి, తండ్రి పిల్లలకు ఏ కష్టమూ ఇవ్వరు కానీ నిరాశ్రయులుగా అవ్వడం నుండి రక్షిస్తారు. పేద పిల్లలు వివాహం మొదలైనవాటి కోసం ఏవైతే అప్పులు చేస్తారో, బాబా వాటి నుండి కూడా విడిపిస్తారు. బాబా అంటారు, పిల్లలూ, మీరు పవిత్రంగా అయినట్లయితే అంత మతి సో గతి ఏర్పడుతుంది.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఓర్పు వహించు మానవా..

ఓంశాంతి. ఈ పాట భక్తి మార్గానికి చెందినది. వారు దీని అర్థాన్ని అర్థం చేసుకోరు. కేవలం పిల్లలకు మాత్రమే తెలుసు. ఇప్పుడు తప్పకుండా మన సుఖం యొక్క రోజులు వస్తున్నాయి, వాటి కోసం మనం పురుషార్థం చేస్తున్నాము. ఎంత పురుషార్థం చేస్తారో, అంత సుఖం లభించనున్నది. శ్రీమతం ఆధారంగా జోలిని నింపుకుంటారు. భక్తి మార్గాన్ని బ్రహ్మా రాత్రి అని అంటారు. పతిత-పావనుడైన తండ్రి ఎప్పుడు వస్తారు అనేది వారికి తెలియదు. కలియుగ అంతిమము మరియు సత్యయుగ ఆదినే సంగమయుగం అని అంటారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మీరు వారిని కుంభకర్ణుని నిద్ర నుండి మేల్కొల్పుతారు. మనుష్యులు ఒక్క పతిత-పావనుడైన, జ్ఞానసాగరుడైన తండ్రిని స్మృతి చేస్తారు. ఏ సాగరం నుండి అయితే ఈ నీటి నదులు వెలువడతాయో, దానిని స్మృతి చేయరు. అక్కడైతే నదుల సంగమం ఉంది, సాగరం మరియు నదుల సంగమం కాదు. ప్రత్యేకత అయితే సాగరం మరియు నదుల మేళాలో ఉంటుంది. సాగరమైతే తప్పకుండా కావాలి కదా. సత్యయుగాన్ని స్థాపన చేసేవారే సత్యమైన తండ్రి, వారు నరుని నుండి నారాయణునిగా తయారయ్యే సత్యమైన కథను వినిపిస్తారు. ఓ పతిత-పావనా రండి, అని కూడా వారినే స్మృతి చేస్తారు. కనుక ఎప్పుడైతే పరమాత్మ వస్తారో, అప్పుడే ఆత్మలు మరియు పరమాత్మ యొక్క సంగమ మేళా అని అంటారు. ఇది సత్యాతి-సత్యమైన మేళా. ఆత్మలు మరియు పరమాత్మకు ఒక్క పురుషోత్తమ సంగమయుగంలోనే మేళా జరుగుతుంది అని, దీనితో పతిత సృష్టి మారి పావనంగా తప్పకుండా అవుతుంది అని మీరు రాయవచ్చు. అది పావన ప్రపంచము, ఇది పతిత ప్రపంచము. ఇది సత్యమైన మేళా, ఇప్పుడు పతిత-పావనుడైన తండ్రి వచ్చి పతితాత్మలను పావనంగా తయారుచేసి తమతో పాటు తీసుకువెళ్తారు. పతిత ప్రపంచాన్ని పావనంగా చేసేందుకు పరమాత్మ మరియు ఆత్మల మేళా జరుగుతుంది. కనుక దీని కార్టూన్ కూడా తయారుచేయాలి. బాబా ఇవన్నీ ముందుగానే అర్థం చేయిస్తారు. త్రివేణి సంగమానికి చాలావరకు శివరాత్రి నాడే వెళ్తారు. కనుక ఇవన్నీ అర్థం చేయించే నషా కూడా ఎక్కాలి. బాగా అర్థం చేయించేవారు ఎవరైతే ఉంటారో, వారు యుక్తిగా అర్థం చేయిస్తారు. లేదంటే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. సత్యమైన కుంభ మేళాను మరియు అసత్యమైన కుంభ మేళాను నిరూపించాలి. ఇది సంగమము, ఇప్పుడు పతిత ప్రపంచం పావన ప్రపంచంగా అవుతుంది. కనుక సత్యాతి-సత్యమైన మేళా ఇది. వారు కుంభకర్ణుని యొక్క అజ్ఞాన నిద్రలో నిద్రించి ఉన్నారు. పరమాత్మ కోసం సర్వవ్యాపి అని అంటారు. వారు పతిత-పావనుడు, వారు పావనంగా చేయడానికి రావలసి ఉంటుంది. ఇది ఒక్కటే పురుషోత్తమ సంగమయుగం అని, ఇందులో ఎక్కే కళ ఉంటుందని మీకు తెలుసు. సత్యయుగం తర్వాత మళ్ళీ కిందకు పడిపోవాల్సిందే. ఏ సమయమైతే గతించిందో, అది పూర్తి అయిపోయింది అని అంటారు. పాతదిగా అవుతూ-అవుతూ పూర్తిగా పాతదిగా అయిపోతుంది. మీ స్వస్తిక్ కూడా ఈ విధంగా తయారుచేయబడి ఉంది – సతోప్రధానము, సతో, రజో, తమో… మనం ఇప్పుడు తండ్రి నుండి సదా సుఖం యొక్క వారసత్వాన్ని పొందే పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు. బాబా పురుషార్థాన్ని కూడా చాలా సహజంగా చేయిస్తారు. ఇందులో ఏ కష్టమూ లేదు, ఇంకా నిరాశ్రయులుగా అవ్వడం నుండి రక్షిస్తారు. వివాహం మొదలైనవాటిలో ఎంత ఖర్చు అవుతుంది. పేదవారికైతే అప్పు తీసుకొని కూడా, వివాహం చేయించవలసి వస్తుంది. బాబా ఈ అప్పులు మొదలైనవాటి నుండి కూడా విడిపిస్తారు, నరకంలోకి పడిపోవడం నుండి కూడా రక్షిస్తారు, అలాగే ఖర్చు మొదలైనవాటి నుండి కూడా రక్షిస్తారు, అందుకే ఇక్కడకు పేదవారు చాలామంది వస్తారు. ఎంత మంచి-మంచి కన్యలు వచ్చేవారు, అకస్మాత్తుగా కామం యొక్క తుఫాను వచ్చింది, నిశ్చితార్థం చేసుకున్నారు, వివాహం చేసేసుకున్నారు. వివాహం చేసుకుని, చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది అని మళ్ళీ పశ్చాత్తాపపడతారు. సమయం పడుతుంది కదా. కనుక తండ్రి రక్షించేందుకు ఎంతగా ప్రయత్నిస్తారు. షావుకార్లు అయితే రాలేరు. వారు స్వయము వారసత్వాన్ని పొందరు, అలాగే రచనను సత్యమైన సంపాదన చేసుకోనివ్వరు. పేదవారిలో కూడా చాలా అశుద్ధమైన ఆచార-వ్యవహారాలు ఉన్నాయి. లోక మర్యాదలు, కుల మర్యాదలు హతమారుస్తాయి. కొందరు పుత్రులు-పుత్రికలు సరిగ్గా చదువుకోకపోతే నరకంలోకి వెళ్ళిపోతారు. తండ్రి నరకం నుండి బయటకు తీయడానికి వచ్చారు. కొంతమంది బయటకు రారు. ముక్కుకు తాడు వేసి రక్షించేందుకు జంతువులైతే కారు. అర్థం చేయిస్తూ ఉంటారు. తండ్రి పిల్లలకు రచయిత అయిన కారణంగా అర్థం చేయిస్తారు, పిల్లలూ, మీరు సత్యమైన సంపాదన చేసుకోండి, పిల్లల చేత కూడా చేయించండి. అయినా కూడా ఎన్ని గొడవలు జరుగుతాయి. పత్ని వస్తే పతి రారు, పతి వస్తే కొడుకు రారు – అందుకే గొడవలు జరుగుతాయి. అర్థం చేయించడమైతే చాలా బాగా అర్థం చేయిస్తారు. ముఖ్యమైన విషయం పవిత్రతకు సంబంధించినది.

బాబా, క్రోధం వచ్చేసింది అని పిల్లలు రాస్తారు. అప్పుడు, మీరు పిల్లలపై క్రోధం ఎందుకు చేస్తారు అని అర్థం చేయించడం జరుగుతుంది. యశోద చేతులు కట్టేసి రోలుకు బంధించేసేవారు అని కృష్ణుని కోసం చూపిస్తారు. కానీ అటువంటి విషయం లేదు. అక్కడైతే మర్యాదా పురుషోత్తములైన చాలా రమణీయకమైన పిల్లలు ఉంటారు. ఇక్కడ కూడా కొందరు పిల్లలు చాలా మంచిగా ఉంటారు. మాట్లాడడంలో చాలా సభ్యత ఉంటుంది. ఇక్కడైతే చాలా మంది పిల్లలున్నారు. కొందరైతే శ్రీమతంపై నడుచుకోనే నడుచుకోరు, నియమాలపై నడుచుకోరు. నియమాలు కూడా ఉన్నాయి కదా. మిలటరీలో పని చేసేవారు అడుగుతారు – అక్కడ తినవలసి వస్తుంది బాబా, ఏం చేయాలి? బాబా అంటారు, శుద్ధమైన పదార్థాలను తినే ప్రయత్నం చేయండి, తప్పనిసరి పరిస్థితిలో దృష్టినిచ్చి తినండి, ఇంకేం చేస్తారు. బ్రెడ్ అయితే లభించగలదు. తేనె, వెన్న, బంగాళదుంపలు తీసుకోవచ్చు. ఏ వస్తువైతే అలవాటు అయిపోయిందో, అది ఇక నడుస్తూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ అడగవలసి ఉంటుంది. బాబా అయితే చాలా సహజం చేస్తారు. పవిత్రంగా అవ్వడము అన్నింటికన్నా మంచిది. కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే, వారు ఇంటిదంతా వ్యర్థంగా ఖర్చు చేసేస్తారు. తండ్రి ఆస్తిని వ్యర్థంగా ఖర్చు చేసి పేరును అప్రతిష్టపాలు చేస్తారు. మన సుఖం యొక్క రోజులు వస్తున్నాయి కావున మేము పురుషార్థం చేసి ఉన్నతోన్నతమైన పదవిని ఎందుకు పొందకూడదు అని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. పురుషార్థంతోనే పదవి లభిస్తుంది. మమ్మా, బాబా సింహాసనాధికారులుగా అవుతారు. జ్ఞాన-జ్ఞానేశ్వరి నుండి మళ్ళీ రాజ-రాజేశ్వరిగా అవుతారు. మీకు కూడా ఈశ్వరుడు జ్ఞానాన్ని ఇస్తారు. కనుక మీరు కూడా ఈ జ్ఞానాన్ని తీసుకొని మళ్ళీ తమ సమానంగా తయారుచేసినట్లయితే రాజ-రాజేశ్వరిగా అవుతారు. తల్లిదండ్రులను ఫాలో చేయాలి. ఇందులో అంధ శ్రద్ధ యొక్క విషయమేమీ లేదు. సన్యాసులకు ఫాలోవర్స్ (అనుచరులు) గా అవుతారు, కానీ ఫాలో అయితే చేయరు. ఎవరైతే సన్యాస ధర్మంలోకి వెళ్ళేది ఉంటుందో, వారు ఇంట్లో ఉండరు. వారి ద్వారా సన్యాసిగా అయ్యే పురుషార్థం తప్పకుండా జరుగుతుంది. డ్రామానుసారంగానే భక్తి మార్గం మొదలయ్యింది. సతో, రజో, తమోలలోకి అయితే అందరూ రావాల్సిందే. అందరికంటే ముందు, శ్రీకృష్ణుడిని చూడండి, వారు కూడా 84 జన్మలు తప్పకుండా తీసుకోవాల్సిందే. ఇప్పుడు అంతిమ జన్మలో ఉండి ఉంటారు, అందుకే మళ్ళీ మొదట్లో వస్తారు. లక్ష్మీ-నారాయణులు నంబరువన్ నుండి మళ్ళీ లాస్ట్ లో ఉన్నారు, మళ్ళీ నంబరువన్ లోకి వస్తారు. వారిని జగన్నాథునిగా ఎవరు తయారుచేసారు? వారసత్వం ఎప్పుడు లభించింది? వారికి సంగమంలో ఈ వారసత్వం లభించింది అని పిల్లలైన మీకు తెలుసు. మొత్తం రాజధాని స్థాపన అవ్వనున్నది. బ్రాహ్మణులు 84 జన్మలు తీసుకున్నారు, వారు ఇప్పుడు పాత్రను అభినయిస్తున్నారు. ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. కానీ కొందరు ఒకటి ధారణ చేస్తారు, మరికొందరు ఇంకొకటి… ఇందులో ఉన్నది పురుషార్థం యొక్క విషయము. తండ్రి ప్రజాపిత బ్రహ్మా ముఖం ద్వారా సమ్ముఖంగా అంటారు – నేను వచ్చాను, నన్ను స్మృతి చేసినట్లయితే యోగంతో మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఆత్మ అంటుంది, అవును బాబా, నేను ఈ చెవుల ద్వారా వింటాను. శరీరం లేకుండా మీరు రాజయోగాన్ని ఎలా నేర్పిస్తారు. శివ జయంతి కూడా తప్పకుండా ఉంది. నేను వస్తాను కానీ ఎవ్వరికీ తెలియదు.

తండ్రి అర్థం చేయిస్తారు, నేను కల్ప-కల్పము 84 జన్మలు తీసుకున్న బ్రహ్మా తనువులోనే వస్తాను, ఇందులో మార్పు జరగజాలదు. వీరు రాజ-రాజేశ్వరునిగా ఉండేవారు, మళ్ళీ ఇప్పుడు జ్ఞాన-జ్ఞానేశ్వరునిగా అయ్యి మళ్ళీ రాజ-రాజేశ్వరునిగా అవుతారు. ఇది తయారై తయారుచేయబడిన డ్రామా. బ్రహ్మా, విష్ణు, శంకరులు అని అంటూ ఉంటారు కూడా. ప్రజాపిత అని బ్రహ్మానే అంటారు. విష్ణువును లేక శంకరుడినైతే అనరు. ప్రజా అనగా మనుష్యులు. మనుష్యులనే దేవతలుగా తయారుచేస్తాను అని అంటారు. రచనను కొత్తగా ఏమీ రచించరు. బాబా అడుగుతారు, పిల్లలూ, ఇప్పుడు స్వర్గంలోకి వెళ్తారా? బలిహారమవుతారా? నేను వచ్చాను – ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. ఎంత వీలైతే అంత దేహధారుల స్మృతిని తగ్గిస్తూ వెళ్ళండి. అవును, మీరు కర్మయోగులు, కావాలంటే పగలు అన్నీ చేసుకోండి కానీ దానితో పాటు ఎలాంటి స్మృతిలో ఉండాలంటే, అంతిమంలో కూడా నా స్మృతి ఉండాలి. లేదంటే ఎవరి పట్ల లగనము (ప్రేమ) ఉంటుందో, అక్కడ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ తండ్రిని స్మృతి చేయడంలో శ్రమ అనిపిస్తుంది. తండ్రి అంటారు, రాత్రి మేల్కొని ఉండండి. మీ ఆరోగ్యం పాడవ్వదు. యోగంతోనైతే ఇంకా బలం లభిస్తుంది. స్వదర్శన చక్రధారులుగా అయి చక్రాన్ని తిప్పండి. ఓ నిద్రను జయించే ప్రియమైన బిడ్డ అని – ఎవరి రథాన్ని అయితే తీసుకున్నారో వారితో అంటారు.

మీకు తెలుసు, వీరు రాజ-రాజేశ్వరునిగా కూడా అవుతారు కనుక నిద్రను జయించాలి. పగలైతే సేవ చేయాలి. ఇకపోతే, సంపాదనను రాత్రి వేళలోనే చేసుకోవాలి. భక్తులు ఉదయం ఉదయమే లేస్తారు. మాలను తిప్పాలి అని గురువులు వారికి చెప్తారు. వ్యాపారంలోనైతే తిప్పలేరు. కొందరు లోపల జేబులో మాలను తిప్పుతారు. కనుక ఉదయాన్నే లేచి స్మృతి చేయాలి. విచార సాగర మథనం చేయాలి. స్మృతితోనే వికర్మలు వినాశనం అవుతాయి. సదా ఆరోగ్యవంతులుగా అవ్వాలంటే సదా స్మృతి చేయాలి, అప్పుడు అంత మతి సో గతి ఏర్పడుతుంది. చాలా భారీ పదవి లభిస్తుంది, ఇందులో ఎదురుదెబ్బలు తినాల్సిన విషయమేమీ లేదు. మౌనంగా ఉండాలి మరియు చదువుకోవాలి. ఇకపోతే, ఏదైతే ఇంతకుముందు చదువుకున్నారో, దానిని మర్చిపోవాలి. పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. ఆత్మనే శరీరం ద్వారా పని చేయిస్తుంది. చేయించేది చేసేది ఆత్మ, పరమపిత పరమాత్మ కూడా వచ్చి వీరి ద్వారా పని చేస్తారు. ఆత్మ కూడా చేస్తుంది మరియు చేయిస్తుంది. ఈ పాయింట్లు అన్నింటినీ మంచి రీతిగా ధారణ చేయాలి, అప్పుడు యోగ్యులుగా అవుతారు. ఎవరైతే అర్థం చేసుకొని మళ్ళీ ఇతరులకు అర్థం చేయిస్తారో – బాబా వారిని యోగ్యులుగా భావిస్తారు. స్వర్గంలో ఉన్నత పదవిని పొందేందుకు వారు యోగ్యులు. ఎవరైతే అసలు అర్థం చేయించరో, వారు ఉన్నత పదవి పొందేందుకు అయోగ్యులుగా భావిస్తారు. తండ్రి అయితే అంటారు, రాజా-రాణులుగా అయ్యేందుకు యోగ్యులుగా అవ్వండి. వారినే సుపుత్రులైన పిల్లలు అని అంటారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు, ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. బాబా అన్ని విషయాల నుండి విడిపించేస్తారు, కేవలం ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంతిమ కాలంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో…

ఎవరైతే సర్వీసబుల్ (సేవా యోగ్యులు) పిల్లలు ఉంటారో, వారు బాబా మురళీ నుండి వెంటనే కార్టూన్ తయారుచేస్తారు. విచార సాగర మథనం చేస్తారు. పిల్లలు సేవ చేయాలి. తండ్రి ఆశీర్వాదము సర్వీసబుల్ (సేవా యోగ్యులు) పిల్లలపై ఉంటుంది. ఆశీర్వాదము కూడా నంబరువారుగా ఉంటుంది. ఈ అనంతమైన తండ్రి అందరి కోసం చెప్తారు – ఫాలో మదర్, ఫాదర్ (తల్లిదండ్రులను అనుసరించండి). వీరైతే శివబాబా నుండి జ్ఞానాన్ని తీసుకుంటారు. బ్రహ్మా ఉన్నత పదవిని పొందుతారు, మీరు ఎందుకు పొందరు? ఇప్పుడు ఫాలో చేసినట్లయితే, కల్ప-కల్పాంతరాలు ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడు ఫెయిల్ అయినట్లయితే, కల్ప-కల్పాంతరాలు ఫెయిల్ అవుతారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. బాబా ఆశీర్వాదాన్ని తీసుకునేందుకు సర్వీసబుల్ (సేవా యోగ్యులు) గా అవ్వాలి. తమ సమానంగా తయారుచేసే సేవ చేయాలి. ఇప్పుడు జ్ఞాన-జ్ఞానేశ్వరిగా అయి మళ్ళీ రాజ-రాజేశ్వరిగా అవ్వాలి.

2. ఒక్క తండ్రి స్మృతిలో ఉండే శ్రమ చేయాలి. ఏ దేహధారి పట్ల మోహం పెట్టుకోకూడదు. నిద్రను జయించేవారిగా అయ్యి రాత్రి వేళ సంపాదనను జమ చేసుకోవాలి.

వరదానము:-

స్నేహానికి రిటర్న్ లో వరదాత తండ్రి పిల్లలకు ఇదే వరదానాన్ని ఇస్తారు – ‘‘సదా ప్రతి సమయము, ప్రతి ఒక్క ఆత్మతో, ప్రతి పరిస్థితిలో స్నేహీ మూర్త భవ’’. ఎప్పుడూ కూడా తమ స్నేహీ మూర్తిని, స్నేహపు వ్యక్తిత్వాన్ని, స్నేహీ వ్యవహారాన్ని, స్నేహపు సంబంధ-సంపర్కాలను వదలకండి, మర్చిపోకండి. ఎటువంటి వ్యక్తి అయినా, ప్రకృతి అయినా, మాయ అయినా, ఎలాంటి వికరాల రూపాన్ని, జ్వాలా రూపాన్ని ధారణ చేసి ఎదురుగా వచ్చినా, వాటిని సదా స్నేహం యొక్క శీతలత ద్వారా పరివర్తన చేస్తూ ఉండండి. స్నేహపు దృష్టి, వృత్తి మరియు కృతి ద్వారా స్నేహీ సృష్టిని తయారుచేయండి.

స్లోగన్:-

లవలీన స్థితిని అనుభవం చేయండి

లవలీన స్థితి కల సమాన ఆత్మలు సదా యోగులు. యోగం జోడించేవారు కాదు కానీ ఉన్నదే లవలీనులుగా. వేరుగానే లేనప్పుడు ఇక స్మృతి ఏం చేస్తారు! స్మృతి స్వతహాగానే ఉంటుంది. ఎక్కడైతే తోడు ఉంటుందో, అక్కడ స్మృతి స్వతహాగానే ఉంటుంది. కనుక సమాన ఆత్మల స్థితి కలిసి ఉండేటువంటిది, ఇమిడి ఉండేటువంటిది.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top