27 December 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
26 December 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
‘‘మధురమైన పిల్లలూ - భారతభూమి సుఖదాత తండ్రి యొక్క జన్మభూమి, తండ్రే వచ్చి పిల్లలందరినీ దుఃఖం నుండి విముక్తులుగా చేస్తారు’’
ప్రశ్న: -
అన్నింటికన్నా ఉన్నతమైన, చాలా పెద్ద కథ ఏది, అది పిల్లలైన మీకు సాధారణమైనది?
జవాబు:-
ఈ డ్రామా యొక్క ఆదిమధ్యాంతాల కథ చాలా పెద్దది మరియు ఉన్నతమైనది. ఈ కథను మనుష్యులు అర్థం చేసుకోలేరు. పిల్లలైన మీ కొరకు ఈ కథ చాలా సాధారణమైనది. ఈ డ్రామా ఉన్నది ఉన్నట్లు ఎలా రిపీట్ అవుతుంది, ఈ మెట్లు ఎలా తిరుగుతూ ఉంటాయి అనేది మీకు తెలుసు.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
ఓం నమః శివాయ..
ఓంశాంతి. మధురాతి మధురమైన, చాలా కాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలు మహిమ యొక్క పాటను విన్నారు. ఎవరి మహిమ? ఉన్నతాతి ఉన్నతమైన భగవంతునిది. వారిని పతితపావనుడు, దుఃఖహర్త, సుఖకర్త అని కూడా అంటారు. సుఖమిచ్చేవారిని గుర్తు చేసుకోవడం జరుగుతుంది. సుఖమిచ్చేవారు ఒక్క పరమపిత పరమాత్మనే అని పిల్లలకు తెలుసు. మనుష్యమాత్రులందరూ వారినే స్మృతి చేస్తారు, ఇతర ధర్మాల వారు కూడా తండ్రి వచ్చి దుఃఖం నుండి విముక్తులుగా చేసి సుఖమిస్తారు అని అంటారు. కానీ తండ్రి సుఖమిస్తారు అనేది తెలియదు. మళ్ళీ దుఃఖాన్ని ఎవరు మరియు ఎప్పుడు ఇస్తారు, ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారు. కొత్త ప్రపంచం మళ్ళీ పాతదిగా అయినప్పుడు దానిని దుఃఖధామం అని అంటారు. కలియుగ అంతిమం తర్వాత మళ్ళీ సత్యయుగం తప్పకుండా వస్తుంది. సృష్టి అయితే ఒక్కటే. మనుష్యులకు ఈ సృష్టి యొక్క చక్రం గురించి ఏ మాత్రము తెలియదు, అందుకే బాబా అడుగుతారు – మిమ్మల్ని ఇటువంటి తెలివిహీనులుగా తయారుచేసేది ఎవరు? తండ్రి అయితే ఎవ్వరికీ దుఃఖమివ్వరు. తండ్రి అయితే సదా సుఖమిస్తారు. మీకు తెలుసు, సుఖమిచ్చేవారి జన్మ స్థలం కూడా భారత్ లో ఉంది, అలాగే దుఃఖమిచ్చేవారి జన్మ స్థలం కూడా భారత్ లో ఉంది. భారతవాసులు శివజయంతిని అయితే జరుపుకుంటారు, కానీ ఏం అర్థం తెలియదు, అది ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుని జయంతి. వారి పేరు శివ. ఇది ఎవ్వరికీ తెలియదు. రావణుడిని సంవత్సరం-సంవత్సరం కాలుస్తూ ఉంటారు. కానీ అతడు ఏమిటి, ఎప్పటి నుండి వచ్చాడు? ఎందుకు కాలుస్తారు? ఇదేమీ కూడా తెలియదు. డ్రామా ప్లాన్ అనుసారంగా వారికి ఇది తెలిసేదే లేదు. తండ్రి అర్థం చేయిస్తారు, ప్రతి ఒక్కరి పాత్ర వేర్వేరు. మనుష్యుల పాత్ర గురించే చెప్తూ ఉంటారు. మనుష్యులే తెలివైనవారు. జంతువులైతే తెలివిహీనమైనవి. ఈ సమయంలో మనుష్యులు కూడా తెలివిహీనులుగా అయిపోయారు. ఇది తెలియనే తెలియదు, దుఃఖహర్త, సుఖకర్త, పతితపావనుడు ఎవరు? పతితులుగా ఎలా అయ్యారు మరియు పావనులుగా ఎలా అవుతారు? పిలుస్తారు కానీ అర్థం తెలియదు. ఈ సమయంలో ఉన్నదే భక్తి మార్గము. శాస్త్రాలు కూడా అన్నీ భక్తి మార్గానివి. శాస్త్రాలలో సద్గతి యొక్క జ్ఞానమేమీ లేదు. జ్ఞానము, భక్తి, వైరాగ్యము… అని మాత్రం అంటారు. ఈ మాత్రం బుద్ధిలోకి వస్తుంది. దీని అర్థం కూడా తెలియదు. జ్ఞానసాగరుడు ఒక్క పరమపిత పరమాత్మ మాత్రమే, తప్పకుండా వారే జ్ఞానమివ్వాలి. వారే సద్గురువు, సద్గతిదాత, అందుకే, వచ్చి దుర్గతి నుండి రక్షించండి అని వారిని పిలుస్తారు. ద్వాపరంలో మనం మొదట సతోప్రధాన పూజారులుగా అవుతాము, మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ దిగుతూ వస్తాము. మనుష్యులు ఎవరైతే వస్తారో, తప్పకుండా మెట్లు దిగి తీరుతారు. అయితే, బుద్ధుడు మొదలైనవారి పేర్లు మెట్ల చిత్రంలో చూపించలేదు. ఒకవేళ వారిని చూపించినా, వారు కూడా మెట్లు అయితే దిగాల్సిందే కదా. వారు సతో, రజో, తమోలలోకి అయితే రావాల్సిందే. ఇప్పుడు అందరూ తమోప్రధానంగా ఉన్నారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు – ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గానివి, ఇందులో అనేక రకాల కర్మకాండలున్నాయి. జ్ఞానమిచ్చేవారు ఒక్క తండ్రినే. జ్ఞానసాగరుడే వచ్చి సత్యమైన జ్ఞానాన్ని వినిపిస్తారు. అర్ధకల్పం పగలు, అందులో భక్తి యొక్క విషయమే లేదు. పగలులో ఎప్పుడూ ఎదురుదెబ్బలు తినరు, అక్కడైతే సుఖమే సుఖముంటుంది. ఆ తండ్రి వారసత్వము మీకు కల్పం యొక్క సంగమంలో లభిస్తుంది. ఎవరికైతే కల్పక్రితం ఇచ్చారో, ఆ పిల్లలకే తండ్రి ఈ జ్ఞానాన్ని ఇస్తారు మరియు కల్ప-కల్పం ఇస్తూనే ఉంటారు. వారి బుద్ధిలోనే కూర్చొంటుంది, రచయితనే రచన యొక్క జ్ఞానాన్ని ఇస్తున్నారు అని. ఎన్ని చిత్రాలను తయారుచేస్తారు. తర్వాత వాటి క్యాలెండర్లు కూడా తయారవుతాయి. కొత్త వస్తువు ఏదైనా వెలువడితే అది వ్యాపిస్తుంది, ఇప్పుడు భారత్ లో రచయిత అయిన తండ్రి వచ్చి రచయిత మరియు రచన యొక్క జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఇది కూడా వ్యాపిస్తుంది మరియు బయట అందరి వద్దకు వెళ్తుంది, అప్పుడు వారు, మేము స్వర్గంలోకి ఎందుకు వెళ్ళము అని అనలేరు. అందరికీ తెలిసిపోతుంది. ఇది తయారై తయారవుతున్న డ్రామా, ఇందులో అసలు తేడానే రాజాలదు. ప్రపంచంలోనైతే అనేక మతాలున్నాయి. కొందరు ప్రకృతి అని అంటారు, కొందరు ఆత్మ నిర్లేపి అని అంటారు… చివర్లో ఒక్క తండ్రిదే వింటారు. తప్పకుండా మేము ఈ డ్రామా యొక్క పాత్రధారులము కూడా అని అర్థం చేసుకుంటారు. ఇది వెరైటీ ధర్మాల వృక్షము. అందరి బుద్ధి తాళం తెరుచుకుంటుంది. ఇప్పుడు తాళం వేయబడి ఉంది. మీ ధర్మం యొక్క విషయం వేరు. ఇకపోతే, డ్రామా ప్లాన్ అనుసారంగా ఇతర ధర్మాల వారు స్వర్గంలోకి రాలేరు. మా ధర్మ స్థాపకుడు ఫలానా సమయంలో వచ్చారు అని అంటారు. క్రైస్టు స్వర్గంలోకి ఏమైనా వచ్చారా? ఈ విషయాలన్నీ ఈ వృక్షంతోనే బుద్ధిలోకి వస్తాయి, మెట్ల చిత్రంతో కాదు. వృక్షం చాలా బాగుంది. ఇది తయారై తయారవుతున్న నాటకమని అర్థం చేసుకుంటారు. ఇకపోతే యోగం యొక్క విషయం మీరు అర్థం చేసుకుంటారు. మనం పావనంగా అయి తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఎప్పుడైతే యోగయుక్తంగా అయిపోతారో, అప్పుడు స్వయం గురించి కూడా తెలిసిపోతుంది. రచయిత మరియు రచన యొక్క జ్ఞానాన్ని మున్ముందు అందరూ అర్థం చేసుకుంటారు, ఇప్పుడు కాదు. డ్రామా కూడా చాలా యుక్తిగా తయారుచేయబడి ఉంది. యుద్ధమైతే జరిగేదే ఉంది. ఇప్పుడు మీ బుద్ధిలో ఈ డ్రామా యొక్క రహస్యముంది. ఒకవేళ ఎవరైనా కొత్తవారు వస్తే, అప్పుడు ప్రారంభం నుండి మొదలుకొని అర్థం చేయించాల్సి ఉంటుంది. ఇది చాలా పెద్ద కథ. వాస్తవానికి చాలా ఉన్నతమైనది కానీ మీ కొరకు సాధారణమైనది. ఈ మెట్ల చక్రం ఎలా తిరుగుతుందో మీకు తెలుసు.
తండ్రి అంటారు – మధురమైన పిల్లలూ, భక్తి మార్గంలో మీరు ఎన్ని కష్టాలు పడ్డారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. ఈ సుఖ-దుఃఖాల ఆట మీ ఆధారంగా తయారుచేయబడి ఉంది. మీరు చాలా ఉన్నతంగా కూడా అవుతారు, అలాగే చాలా నీచంగా కూడా అవుతారు. తండ్రి అంటారు – మధురమైన పిల్లలూ, నేను ఈ మనుష్య సృష్టికి బీజరూపుడను. వృక్షం యొక్క పూర్తి జ్ఞానమైతే తప్పకుండా నా వద్దనే ఉంటుంది. మర్రి వృక్షం ఉదాహరణ కూడా దీని పైనే ఉంది. సన్యాసులు కూడా ఉదాహరణలను ఇస్తూ ఉంటారు. కానీ వారి బుద్ధిలో అసలేమీ లేదు. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం ఎలా ప్రాయః లోపమైపోతుంది అనేది మీకైతే తెలుసు. ఇప్పుడు ఆ పునాది లేదు. మిగతా వృక్షమంతా నిలబడి ఉంది. అన్ని ధర్మాలు ఉన్నాయి, కేవలం ఒక్క ధర్మము లేదు. మర్రి వృక్షాన్ని కూడా చూడండి, ఎలా నిలబడి ఉంది. కాండము లేదు. అయినా కూడా వృక్షం ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుంది. ఇతర వృక్షాలు పునాది లేకపోతే ఎండిపోతాయి, ఎందుకంటే కాండం లేకుండా నీరు ఎలా లభిస్తుంది. కానీ ఆ మర్రి వృక్షం మొత్తం తాజాగా నిలబడి ఉంది. ఇది ఆశ్చర్యం కదా. అలాగే ఈ వృక్షంలో కూడా దేవీ-దేవతా ధర్మం లేదు. స్వయాన్ని అలా భావించడమే లేదు, దేవతా ధర్మానికి బదులుగా హిందువులు అని అనేసారు. ఎప్పటి నుండైతే రావణ రాజ్యం ప్రారంభమైందో, అప్పటి నుండి దేవీ-దేవతలుగా పిలవబడేందుకు యోగ్యులుగా లేరు. కావున పేరు మార్చి హిందువులు అని పెట్టుకున్నారు. కేవలం దేవతల జడ చిత్రాలు గుర్తులుగా మిగిలిపోయాయి, వీటి ద్వారా స్వర్గంలో వారి రాజ్యముండేదని అర్థం చేసుకుంటారు. కానీ, ఆ స్వర్గం ఎప్పుడుండేది, ఇది అసలు ఎవ్వరికీ తెలియదు, సత్యయుగం యొక్క ఆయువును చాలా పెద్దగా చేసేసారు. ఏదైతే గతించిపోయిందో, అది మళ్ళీ దాని సమయానికే రిపీట్ అవుతుంది. అవే రూపురేఖలు ఇప్పుడు ఏమైనా ఉండగలవా. అవి మళ్ళీ స్వర్గంలోనే ఉంటాయి. ఈ జ్ఞానాన్ని మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. మిగిలిన వారంతా భక్తి చేస్తూ పతితులుగా అవుతూ ఉంటారు. ఒకప్పుడు పావన ప్రపంచముండేది. మీకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు, మీరు నన్ను సర్వం తెలిసినవారని అంటారు కూడా. తండ్రి అంటారు, నేను ఏమైనా ఒక్కొక్కరి మనసులో ఏముందో కూర్చుని తెలుసుకుంటానా. బాబా, మీకైతే అన్నీ తెలుసు అని కొంతమంది అంటారు. మేము వికారాలలోకి వెళ్తాము – మీకన్నీ తెలిసే ఉంటాయి. తండ్రి అంటారు, నేను రోజంతా కూర్చుని ఇది తెలుసుకుంటానా ఏమిటి? నేనైతే పతితులను పావనంగా చేయడానికి వచ్చాను.
మీకు తెలుసు, మేము బాబా నుండి సుఖపు వారసత్వాన్ని తీసుకుంటున్నాము. మిగిలిన వారంతా తిరిగి ముక్తిధామానికి వెళ్ళిపోతారు. ఎలా వెళ్తారు? ఇందులో మీదేం పోతుంది? తండ్రే వచ్చి ముక్తి-జీవన్ముక్తిలోకి తీసుకువెళ్తారు. లెక్కాచారాలను సమాప్తం చేసుకుని అందరూ వెళ్ళాల్సి ఉంటుంది. మీరు సతోప్రధానంగా అవ్వాలి. మీరు ఇతరుల విషయంలోకి ఎందుకు వెళ్తారు? తమోప్రధానం నుండి సతోప్రధానంగా తయారుచేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. భక్తి మార్గంలో జ్ఞానం అంశమాత్రము కూడా ఉండజాలదు. జ్ఞానం మరియు భక్తి అని అంటారు. జ్ఞానం ఎంత సమయం నడుస్తుంది మరియు భక్తి ఎంత సమయం నడుస్తుంది అని అడగండి. అప్పుడు ఏమీ చెప్పలేరు. భక్తి వేరు. నేను ఎలా వస్తాను, ఎవరిలోకి ప్రవేశిస్తాను అని స్వయం తండ్రే అర్థం చేయిస్తారు. మనుష్యులు భక్తి మార్గంలో చిక్కుకుని ఉన్న కారణంగా నన్ను కష్టం మీద గుర్తిస్తారు, అందుకే మీరు శివ-శంకరుల చిత్రంపై అర్థం చేయిస్తారు. వారు ఇరువురినీ ఒకటిగా కలిపేస్తారు. వారు సూక్ష్మవతన వాసి, వీరు పరంధామ వాసి. ఇరువురి స్థానాలు వేర్వేరు. మరి ఒకే పేరు ఎలా పెట్టగలరు! వారు నిరాకారి, వీరు ఆకారి. శంకరునిలో శివుడు ప్రవేశించారని ఏమైనా అంటారా, అందుకే మీరు శివ-శంకరులు అని అంటారు. తండ్రి అర్థం చేయిస్తారు – నేనైతే ఈ బ్రహ్మాలో ప్రవేశిస్తాను. శివశంకరులు ఒక్కరేనని మీకు ఎవరు చెప్పారు? శంకరుడినైతే ఎప్పుడూ ఎవ్వరూ గాడ్ ఫాదర్ అని అనరు. వారికైతే మెడలో సర్పాన్ని వేసి, రూపాన్నే ఎలా తయారుచేసేసారు. మళ్ళీ ఎద్దుపై సవారీ చేసినట్లుగా చూపిస్తారు. శంకరుడిని భగవంతునిగా అయితే ఏ మాత్రము అంగీకరించరు. ఒక్క శివబాబానే భక్తిలో అందరి మనోకామనలను పూర్తి చేస్తారు. శంకరుని కోసమైతే, నేత్రము తెరవగానే వినాశనమైపోయింది అని మాత్రమే చెప్తారు. ఇకపోతే, సూక్ష్మవతనంలో ఎద్దు, సర్పం మొదలైనవి ఏమైనా ఉంటాయా. అవి ఇక్కడ జన్మ తీసుకునేవి. ఎంత రాతిబుద్ధి కలవారిగా అయిపోయారు. మేము పతితులుగా ఉన్నామని కూడా అర్థం చేసుకోరు. తండ్రి అంటారు – నేను ఈ సాధువులను కూడా ఉద్ధరించేందుకు వచ్చాను. సాధన అనేది ఏదైనా ప్రాప్తి కోసం చేయడం జరుగుతుంది. అటువంటప్పుడు సాధువులు తమను తాము శివుడు లేక భగవంతుడు అని ఎలా చెప్పుకోగలరు? శివునికైతే సాధన చేయాల్సిన అవసరమే లేదు. వారి పేరే సన్యాసులు, భగవంతునికి ఎప్పుడైనా సన్యాసం చేయాల్సి ఉంటుందా? సన్యాసాన్ని ధరించేవారికి కాషాయ వస్త్రాలు ధరించాల్సి ఉంటుంది. భగవంతునికి కూడా ఈ వేషాన్ని ధరించాల్సి ఉంటుందా ఏమిటి? వారు ఉన్నదే పతితపావనుడు, నేను ఈ వేషధారులను కూడా ఉద్ధరిస్తాను అని వారంటారు. డ్రామానుసారంగా ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రను అభినయిస్తారు. భక్తి మార్గంలో మనుష్యులు ఏదైతే చేస్తారో, దానిని అర్థం చేసుకోరు. శాస్త్రాలతో ఎవరి సద్గతి జరగదు. సద్గతి ఒక్క సత్యమైన తండ్రి ద్వారానే జరుగుతుంది. డ్రామానుసారంగా ఈ శాస్త్రాలు కూడా అవసరము. గీతలో ఏమేమి రాసి ఉంది. గీతను ఎవరు వినిపించారు, అది కూడా ఎవ్వరికీ తెలియదు. మీరు ముఖ్యంగా గీతపై జోరు పెట్టాలి. గీతనే సర్వశాస్త్రమయి శిరోమణి. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఎవరు మరియు ఎప్పుడు రచించారు, అలానే దీని ద్వారా ఏమి జరిగింది? ఎవరికీ తెలియదు. గీతలో ఏదైతే రాస్తూ వచ్చారో, అది మళ్ళీ రిపీట్ అవుతుంది. మనం దానిని మంచి లేక చెడు అని ఏమీ అనము, కానీ అది భక్తి మార్గపు సామాగ్రి, దాని ద్వారా మనుష్యులు దిగిపోతూ ఉంటారని అర్థం చేసుకుంటారు. 84 జన్మలు పూర్తిగా తీసుకుంటూ-తీసుకుంటూ దిగే కళలోకి అయితే రావాల్సిందే. ఎప్పుడైతే అందరూ తమ-తమ పాత్రను అభినయించేందుకు వచ్చేస్తారో, అప్పుడు అందరినీ తీసుకువెళ్ళేందుకు చివర్లో తండ్రి వస్తారు, అందుకే వారిని పతితపావనుడు, సర్వుల సద్గతిదాత అని అంటారు. వారు ఎప్పుడైతే వస్తారో, అప్పుడే రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. ఇప్పుడు తండ్రి కూర్చుని చదివిస్తున్నారు. దీనిని కూడా మాయ పదే-పదే మరపింపజేస్తుంది లేదంటే భగవంతుడు మనల్ని చదివించి విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారంటే ఎంత సంతోషముండాలి. సత్యయుగంలో ఈ జ్ఞానము ఉండదు. మళ్ళీ భక్తి మార్గంలో అవే భక్తి శాస్త్రాలు ఉంటాయి. 2500 సంవత్సరాలు ఈ పాత్రను అభినయించాల్సిందే. ఈ చక్రం యొక్క జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. వారికైతే పతితపావనుడి గురించి తెలియదు, అలాగే పావనుల నుండి పతితులుగా ఎవరు తయారుచేస్తారు అనేది కూడా తెలియదు. కేవలం బొమ్మలను తయారుచేసి ఆడుకుంటూ ఉంటారు, ఏమీ అర్థం చేసుకోరు. మీతో అంటారు, మీరు కూడా భారతవాసులే, మరి కేవలం భారతవాసులే ఏమీ అర్ధం చేసుకోరు, తెలివిహీనులు అని మీరెలా అంటారు. మీరు చెప్పండి – ఇది అనంతమైన తండ్రి చెప్తున్నారు, వారే జ్ఞానం ఇస్తున్నారు, మేము వారి ద్వారా తెలివైనవారిగా అయ్యాము. ప్రదర్శనీకి చాలామంది వస్తారు, ఈ జ్ఞానం చాలా బాగుంది అని అంటారు. బయటకు వెళ్ళగానే సమాప్తము, ఎందుకంటే వారంతా రావణుడి దాసులు. మీరు ఇప్పుడు రామునికి దాసులుగా అయ్యారు. పిల్లలైన మీ బుద్ధిలో ఉంది, మాకు రచయిత అయిన తండ్రి అర్థం చేయిస్తున్నారు, పతితులను పావనంగా తయారు చేస్తున్నారు. తండ్రి మన కళ్యాణం చేస్తున్నారు. మనం మళ్ళీ ఇతరుల కళ్యాణం చేయాలి. ఎంతగా అనేకుల కళ్యాణం చేస్తారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. ఇది ఆత్మిక సేవ. ఆత్మలకే అర్థం చేయించాల్సి ఉంటుంది. అర్థం చేసుకునేది కూడా ఆత్మనే. అర్ధకల్పము మీరు దేహాభిమానులుగా అవుతారు. దేహీ-అభిమానులుగా అవ్వడంతో అర్ధకల్పము సుఖము, దేహ-అభిమానులుగా అవ్వడంతో అర్ధకల్పము దుఃఖము. ఎంత తేడా ఉంది. మీరు విశ్వానికి యజమానులుగా ఉన్నప్పుడు ఏ ఇతర ధర్మమూ లేదు. ఇప్పుడు ఎంతమంది మనుష్యులున్నారు. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. అచ్ఛా!
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. స్మృతి బలంతో అన్నీ లెక్కాచారాలు సమాప్తం చేసుకొని సతోప్రధానంగా అయి తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇతర ఏ విషయాలలోకి వెళ్ళకూడదు.
2. భగవంతుడు మమ్మల్ని చదివించి విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు, ఈ సంతోషంలో ఉండాలి. ఆత్మిక సేవ చేయాలి.
వరదానము:-
ఎలాగైతే ఏదైనా సింపుల్ వస్తువు స్వచ్ఛంగా ఉంటే, అది తన వైపుకు తప్పకుండా ఆకర్షిస్తుంది. అలా మనసా సంకల్పాలలో, సంబంధాలలో, వ్యవహారంలో, నివసించడంలో, ఎవరైతే సింపుల్ గా మరియు స్వచ్ఛంగా ఉంటారో, వారు శ్యాంపుల్ గా అయి సర్వులను తమ వైపుకు స్వతహాగానే ఆకర్షిస్తారు. సింపుల్ అనగా సాధారణము. సాధారణత ద్వారానే మహానత ప్రసిద్ధమవుతుంది. ఎవరైతే సాధారణంగా అనగా సింపుల్ గా ఉండరో, వారు సమస్యాస్వరూపులుగా అయిపోతారు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!