27 August 2022 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
26 August 2022
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
‘‘మధురమైన పిల్లలూ - మీకు ఈ అనంతమైన లీల రూపీ నాటకము గురించి తెలుసు, మీరు హీరో పాత్రధారులు, తండ్రి వచ్చి మిమ్మల్ని ఇప్పుడు జాగృతం చేసారు’’
ప్రశ్న: -
తండ్రి యొక్క ఆజ్ఞ ఏమిటి? దానిని పాలన చేయడము ద్వారా వికారాల పీడ నుండి రక్షింపబడగలరు?
జవాబు:-
తండ్రి ఆజ్ఞ ఏమిటంటే – మొదట 7 రోజుల భట్టీలో కూర్చోండి. పిల్లలైన మీ వద్దకు ఏ ఆత్మ అయినా 5 వికారాలతో పీడింపబడి వచ్చినప్పుడు, వారికి 7 రోజులు సమయం పడుతుందని చెప్పండి. తక్కువలో తక్కువ 7 రోజులు ఇచ్చినట్లయితే మేము మీకు 5 వికారాల వ్యాధి ఎలా దూరమవ్వగలదో అర్థం చేయిస్తాము. ఎక్కువగా ప్రశ్నోత్తరాలు చేసేవారికి మొదట 7 రోజుల కోర్సు చేయండి అని మీరు చెప్పవచ్చు.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
ఓం నమః శివాయ.
ఓంశాంతి. పిల్లలు తండ్రి మహిమను విన్నారు. ఈ అనంతమైన లీలా రూపీ నాటకము ఏదైతే ఉందో, ఆ లీల యొక్క ఆది మధ్యాంతాల గురించి పిల్లలైన మీకు తెలుసు. ఈశ్వరుని మాయ అంతులేనిది అని మనుష్యులు భావిస్తారు. ఇప్పుడు మీ బుద్ధిలోకి జాగృతి వచ్చింది మరియు మీరు మొత్తం అనంతమైన లీలను గురించి తెలుసుకున్నారు. కానీ యథార్థ రీతిగా తండ్రి ఏ విధంగానైతే అర్థం చేయిస్తున్నారో, అదే విధంగా పిల్లలు నంబరువారు పురుషార్థానుసారంగానే అర్థం చేయించగలరు. మనుష్యులు ఆ యాక్టర్లను చూసేందుకు వారి వెనుక పరుగెడతారు. ఇది అనంతమైన డ్రామా, దీని గురించి ప్రపంచంలోని మనుష్యులకు తెలియదని మీరు అర్థం చేసుకున్నారు. మనుష్యులు కుంభకర్ణుని ఆసురీ నిద్రలో నిదురిస్తున్నారని అంటూ ఉంటారు. ఇప్పుడు ప్రకాశము లభించింది, అందుకే మీరు మేల్కొన్నారు. మీరు మేము అందరము నిద్రిస్తూ ఉండేవారము అని కూడా అంటారు. ఇప్పుడు మీరు పురుషార్థము చేయాలి. వారు ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటారు. వారు తమతో తాము ఇలాంటి-ఇలాంటి విషయాలను మాట్లాడుకోలేరు. మీతో మీరు మాట్లాడుకోవాలి. ఆత్మలమైన మనము తండ్రిని కలుసుకున్నాము, తండ్రి ఎంతగా జాగృతము చేసారు. ఇది అనంతమైన లీల. ఇందులో ముఖ్యమైన యాక్టర్స్, డైరెక్టర్, క్రియేటర్ ఎవరు అన్నది తెలుసు, అందుకే మీరు అడుగుతారు, ఈ నాటకంలో ఎవరెవరు ముఖ్యమైన యాక్టర్లు? శాస్త్రాలలో కౌరవ సైన్యంలో పెద్దవారు ఎవరు, పాండవ సైన్యంలో పెద్దవారు ఎవరు అన్నది రాసేసారు. ఇక్కడ మళ్ళీ అనంతమైన విషయము. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము యొక్క ఆదిమధ్యాంతాలను తెలుసుకోవాలి. బ్రహ్మా మరియు విష్ణువుల పాత్ర ఇక్కడ నడుస్తుంది. విష్ణువు రూపమే మన లక్ష్యము-ఉద్దేశ్యము. ఈ పదవిని పొందాలి. బ్రహ్మా దేవతాయ నమః… అని పాడుతారు కూడా. మళ్ళీ శివ పరమాత్మాయ నమః అని అంటారు, వారిని నిరాకారుడు అనే అంటారు. పరమపిత పరమాత్మ అని అన్నప్పుడు వారు తండ్రి అయినట్లు కదా! కేవలం పరమాత్మ అనడము వలన తండ్రి అన్న పదము రాదు, అప్పుడు సర్వవ్యాపి అని అనేస్తారు, అందుకే మనుష్యులకు ఏమీ అర్థము కాదు, ఇంతకుముందు మీకు కూడా ఏమీ అర్థమవ్వలేదు. తండ్రి వచ్చి పతితులను పావనముగా చేస్తారు అన్నది ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీరిప్పుడు ఎంత వివేకవంతులుగా అయ్యారు. ఆది నుండి అంతిమము వరకు మీరు అంతా తెలుసుకున్నారు. డ్రామాను చూసేందుకు ఎవరైతే మొదట వెళ్తారో, వారు తప్పకుండా ఆది మధ్యాంతాలను అంతా చూస్తారు మరియు మేము ఇది-ఇది చూసాము అని బుద్ధిలో ఉంటుంది. అయినా మళ్ళీ చూడాలనుకుంటే చూడవచ్చు. అది హద్దు నాటకము అయినట్లు. మీరైతే అనంతమైన నాటకము గురించి తెలుసుకున్నారు. సత్యయుగానికి వెళ్ళి ప్రారబ్ధాన్ని పొందుతారు. తర్వాత ఈ నాటకాన్ని మర్చిపోతారు. మళ్ళీ సమయానికి ఈ జ్ఞానము లభిస్తుంది. మరి ఇవి కూడా అర్థము చేసుకునే విషయాలు. ఏ విషయంలోనైనా ప్రశ్నోత్తరాలు జరపవలసిన అవసరము ఉండదు. 7 రోజులు భట్టీ కోసం చెప్పడము జరుగుతుంది. కానీ 7 రోజులు కూర్చోవడము కూడా చాలా కష్టము. వినడముతోనే గాభరా పడతారు. ఇలా ఎందుకు చెప్పడం జరుగుతుంది అన్నది అర్థము చేయించబడుతుంది ఎందుకంటే అర్థకల్పము నుండి మీరు రోగులుగా అయ్యారు. 5 వికారాల రూపీ భూతాలు పట్టుకొని ఉన్నాయి, ఇప్పుడు వాటి వలన మీరు పీడింపబడుతున్నారు. ఈ పీడ నుండి ఎలా విడుదల అవ్వగలరో మీకు యుక్తిని తెలియజేస్తాము. తండ్రిని స్మృతి చేయాలి, దానితో మీ పీడ సదా కోసము సమాప్తమైపోతుంది. తండ్రి ఆజ్ఞ ఏమిటంటే, 7 రోజులు భట్టిలో కూర్చోవాలి. గీత, భాగవతము యొక్క పఠనము పెట్టుకుంటారు, అప్పుడు కూడా 7 రోజులు కూర్చోబెడతారు. ఇది భట్టీ. అందరూ అయితే కూర్చోలేరు. కొందరు ఒకచోట, మరికొందరు మరొక చోట ఉంటారు. మున్ముందు చాలా వృద్ధి చెందుతారు. ఇవన్నీ రుద్ర జ్ఞాన యజ్ఞం యొక్క శాఖలు. ఎలాగైతే తండ్రికి చాలా పేర్లు పెట్టారో, అలాగే ఈ రుద్ర జ్ఞాన యజ్ఞానికి కూడా చాలా పేర్లు పెట్టేసారు. రుద్రుడు అని పరమపిత పరమాత్మను అంటారని మీకు తెలుసు. రాజస్వ అశ్వమేధము అనగా ఈ రథాన్ని ఈ యజ్ఞములో స్వాహా చేయాలి. ఇక ఆత్మలు మిగులుతాయి. అందరి శరీరాలు స్వాహా అవ్వనున్నాయి. హోలిక జరుగుతుంది కదా. వినాశన సమయంలో అందరి శరీరాలు ఈ యజ్ఞంలో స్వాహా అవుతాయి. అందరి శరీరాలు ఆహుతి అవ్వనున్నాయి. కానీ మొదట మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. వెళ్ళడమైతే అందరూ వెళ్ళాలి. రావణుడిది చాలా పెద్ద పరివారము. మీది కేవలం చిన్నని దైవీ పరివారము. ఆసురీ పరివారమైతే ఎంత పెద్దది. వారెవ్వరూ దేవతలుగా అయ్యేవారు కాదు. ఎవరైతే ఇతర ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయారో, వారు వెలువడి వస్తారు. పరమపిత పరమాత్మ బ్రహ్మా ముఖం ద్వారా ముఖ వంశావళిని రచిస్తారు. బాబా అర్థం చేయించారు – ఎల్లప్పుడూ మొదట స్త్రీని దత్తత తీసుకుంటారు, తర్వాత రచనను రచిస్తారు. వారైతే కుఖ వంశావళి. ఈ రచన అంతా ముఖ వంశావళి. మీరు ఉత్తములు ఎందుకంటే మీరు శ్రేష్ఠాచారిగా అవుతారు. మీరు కేవలం తండ్రినే స్మృతి చేయాలి ఎందుకంటే బ్రాహ్మణులు తండ్రి వద్దకే వెళ్ళాలి.
మీకు తెలుసు, తిరిగి ఇంటికి వెళ్ళి మళ్ళీ సత్యయుగంలోకి వచ్చి సుఖం యొక్క పాత్రను అభినయించాలి. చాలామంది అర్థము చేసుకుంటారు కూడా, అయినా 7 రోజులను ఇవ్వరు. అప్పుడు, వారు మన వంశానికి చెందిన అనన్యులు కారు అని అర్థము చేసుకోవడం జరుగుతుంది. అనన్యులైతే వారికి చాలా మంచిగా అనిపిస్తుంది. చాలామంది 5-8-15 రోజులు కూడా ఉండిపోతారు. తర్వాత సాంగత్యం లభించని కారణంగా మాయమైపోతారు. వినాశనం సమీపంగా వచ్చినప్పుడు అందరూ ఇక్కడికి రావాల్సిందే. రాజధాని యొక్క స్థాపన జరగాల్సిందే. నంబరువారుగా కల్పక్రితము ఎలాగైతే పురుషార్థము చేసారో, అలాగే ఇప్పుడు కూడా చేస్తారు. మేము తండ్రి నుండి పురుషార్థానుసారముగా వారసత్వము తీసుకుంటున్నామని మీ బుద్ధిలో ఉంది. ఎంతగా మనం స్మృతి చేస్తామో, కర్మాతీతులుగా అవుతామో, అంత ఉన్నత పదవిని పొందుతాము. మొట్టమొదట సృష్టి సతోప్రధానముగా ఉండేది. ఇప్పుడైతే తమోప్రధానముగా ఉంది. భారత్ నే ప్రాచీనమైనది అని అంటారు. మీకు తెలుసు, మనమే దేవతలుగా ఉండేవారము, తర్వాత 84 జన్మలను దాటాము. ఇప్పుడు మళ్ళీ వారసత్వాన్ని తీసుకునేందుకు తండ్రి వద్దకు వచ్చాము. తండ్రి పావనంగా చేయడానికి వచ్చారు. పతితంగా చేసేది రావణుడు. మనం అనంతమైన ముఖ్యమైన ఆల్ రౌండ్ పాత్రధారులము. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు… చక్రము తిరిగి ఇప్పుడు సూర్యవంశీయుల నుండి మళ్ళీ బ్రాహ్మణ వర్ణములోకి వచ్చారు. బ్రాహ్మణులైతే తప్పకుండా కావాలి కదా. బ్రాహ్మణులు పిలక వంటివారు. బ్రాహ్మణులు పిలకను పెట్టించుకుంటారు. దేవతా ధర్మం కూడా గొప్పది. ఇదైతే బుద్ధిలో ఉంది కదా. మనము అనంతమైన డ్రామాలో ఆల్ రౌండ్ పాత్రను అభినయించేవారము. ఈ వర్ణాలు భారత్ కోసమే చెప్పబడ్డాయి. తరచుగా విష్ణువునే చూపిస్తారు. అందులో శివబాబాను మరియు పిలక భాగమైన బ్రాహ్మణులను తీసేసారు. వారిని చూపించరు. ఇప్పుడు మీ బుద్ధిలో 84 జన్మల రహస్యము కూర్చుని ఉంది – మీరు ఎన్ని జన్మలు తీసుకుంటారు, ఇతర ధర్మాలవారు ఎన్ని జన్మలు తీసుకుంటారు. ఒకే విధంగా జన్మలు తీసుకోలేరు. చివర్లో వచ్చేవారి జన్మలు తగ్గిపోతాయి. మొట్టమొదట వచ్చేవారి గురించే 84 జన్మలు అని అంటారు. అందరూ సూర్యవంశంలోకి ఏమైనా వస్తారా. ఇది కూడా ఒక లెక్క, దీనినే విస్తారము అని అంటారు. చాలామంది పిల్లలు మర్చిపోతారు. స్కూల్లో కూడా ఫస్ట్, సెకండ్ గ్రేడ్ ఉంటాయి కదా. టీచరు దృష్టి మొట్టమొదట ఫస్ట్ గ్రేడ్ వారి వైపుకు వెళ్తుంది. కనుక మీ బుద్ధిలో మొత్తం ప్రకాశము ఉంది. ఇకపోతే, ఒక్కొక్కరి గురించి విస్తారంలోకైతే వెళ్ళలేరు. ముఖ్యమైన ధర్మాల గురించి అర్థం చేయించడము జరుగుతుంది. మొత్తము డ్రామా లీలను బుద్ధిలో ఉంచుకుంటూ కూడా, ఇప్పుడు మేము తిరిగి వెళ్ళాలని మీరు అర్థం చేసుకుంటారు. ఎప్పుడైతే మనము కర్మాతీత అవస్థను పొందుతామో, అప్పుడే బంగారు యుగానికి యోగ్యులుగా అవుతాము. తండ్రిని స్మృతి చేయడము వలన మన ఆత్మ పవిత్రంగా అయిపోతుంది, తర్వాత వస్త్రము కూడా పవిత్రమైనది లభిస్తుంది. తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ మనము బంగారు యుగంలోకి వెళ్ళిపోతాము. తమ ఉష్ణోగ్రతను చూసుకోవాల్సి ఉంటుంది, ఎంతగా ఉన్నతంగా వెళ్తారో, అంతగా సంతోషమనే పాదరసం ఎక్కుతుంది. కిందికి దిగడము వలన సంతోషమనే పాదరసం కూడా కిందికి దిగిపోతుంది. సతోప్రధానము నుండి కిందకి దిగుతూ-దిగుతూ ఇప్పుడు పూర్తిగా తమోప్రధానముగా అయ్యారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, అయినా మాయ ఘడియ-ఘడియ మరపింపజేస్తుంది. ఇది మాయతో యుద్ధము. మాయకు చాలామంది వశమైపోతారు. తండ్రి అంటారు, సత్యమైన హృదయముపై సాహెబ్ రాజీ అవుతారు. ఎంతమంది అబలలు తండ్రి స్మృతిలో సత్యమైన హృదయంతో ఉంటారు. మేము వికారాలలోకి ఎప్పుడూ వెళ్ళము అని ప్రతిజ్ఞ చేసారు. విఘ్నాలైతే చాలా వస్తాయి. ప్రదర్శనీ మొదలైన వాటిలో ఎన్ని విఘ్నాలు వేస్తారు. చాలా గర్వముతో వస్తారు, అందుకే చాలా సంభాళించాలి కూడా. మనుష్యుల వృత్తి చాలా చెడుగా ఉంటుంది. ఇది పంచాయతీ రాజ్యం కదా. మళ్ళీ సత్యయుగంలో 100 శాతము ధార్మికమైన, రైటియస్, లా ఫుల్, సంపన్నమైన డైటీ గవర్నమెంట్ ఉంటుంది. కనుక పిల్లలైన మీరు చాలా శ్రమ చేయాలి, చిత్రాలు కూడా చాలా తయారవుతూ ఉంటాయి. ఎంత పెద్ద చిత్రాలు ఉండాలంటే మనుష్యులు దూరం నుండే చదవగలగాలి. ఇది చాలా అర్థము చేసుకోవాల్సిన మరియు అర్థం చేయించాల్సిన విషయము, వీటి ద్వారా మనుష్యులు అర్థము చేసుకోవాలి, తప్పకుండా మేము స్వర్గవాసులుగా ఉండేవారము, ఇప్పుడు నరకవాసులుగా అయ్యాము, మళ్ళీ పావనంగా అవ్వాలి. డ్రామా రహస్యాన్ని కూడా అర్థం చేయించాలి – ఈ చక్రము ఎలా తిరుగుతుంది, ఎంత సమయం పడుతుంది. మనమే విశ్వానికి యజమానిగా ఉండేవారము, ఈ రోజు అయితే పూర్తిగా నిరుపేదగా అయిపోయాము. రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇది కూడా తమ వికర్మల యొక్క ఫలము, దానిని అనుభవించవలసి ఉంటుంది. ఇప్పుడు తండ్రి కర్మాతీత అవస్థను తయారుచేయడానికి వచ్చారు. భారత్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. ఇప్పుడు ఈ యుద్ధంలో మొత్తం ప్రపంచము స్వాహా అవ్వనున్నది. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు. తండ్రి అంటారు, చాలా పురుషార్థము చేసి మహారాజ-మహారాణిగా అయ్యి చూపించండి. చిత్రాల పైనా చాలా మంచి రీతిలో అర్థము చేయించాలి. బుద్ధిలో ఇదే గుర్తుండాలి, మనము ఎంత ఉన్నతంగా ఉండేవారము, ఎంత కిందకు పడిపోయాము. మీ వద్దకు పడిపోయిన వారైతే చాలా మంది వస్తారు. వేశ్యలను, అహల్యలను కూడా పైకి లేపాలి. వారిని ఎప్పుడైతే మీరు పైకి లేపుతారో, అప్పుడే మీ పేరు ప్రఖ్యాతి చెందుతుంది. ఇప్పటి వరకు ఎవరి బుద్ధిలోనూ ఇది కూర్చోలేదు. ఢిల్లీ నుండి శబ్దము వెలువడాలి, అక్కడ వెంటనే పేరు ప్రఖ్యాతమవుతుంది. కానీ ఇంకా ఆలస్యమవ్వడము కనిపిస్తుంది. అబలలు, వేశ్యలను తండ్రి వచ్చి ఎంత ఉన్నతంగా పైకి లేపుతారు. మీరు ఇలాంటి-ఇలాంటివారి ఉద్ధరణ ఎప్పుడైతే చేస్తారో, అప్పుడు మీ పేరు ప్రఖ్యాతమవుతుంది. బాబా అంటారు కదా – ఇప్పటికీ ఆత్మ ఇంకా రజో వరకే వచ్చింది, ఇప్పుడు సతో వరకు రావాలి. బాబా అయితే అంటారు, ఏదైనా చేసి చూపించండి. పిల్లలైన మీరైతే చాలా సేవ చేయాలి. కానీ నడుస్తూ-నడుస్తూ ఏదో ఒక గ్రహచారం కూర్చుంటుంది. సంపాదనలో గ్రహచారం ఉంటుంది కదా. మాయ పిల్లి స్పృహలేనివారిగా చేస్తుంది. గులేబకావళి ఆట కూడా ఉంది కదా. బాప్ దాదా హృదయం పైకి ఎవరు ఎక్కగలరు అన్నది పిల్లలైన మీరు స్వయము అర్థం చేసుకోగలరు. సంశయం యొక్క విషయము లేదు. ఇలా ఎలా అవ్వగలదు అని చాలామంది ప్రశ్నిస్తారు. అరే, మీరు సాక్షిగా అయి చూడండి. డ్రామాలో ఏదైతే నిశ్చయించబడిందో ఆ విధంగా పాత్ర నడవాలి. డ్రామా యొక్క పట్టాల నుండి పడిపోతారు. ఎవరికైతే అర్థమవుతుందో, వారు పడిపోరు. మీరెందుకు పడిపోతారు, డ్రామాలో ఏదైతే నిశ్చయించబడిందో అదే జరుగుతుంది కదా. భారత్ లో వేలాది మందికి సాక్షాత్కారము జరుగుతుంది. ఇదేమిటి? ఇంతమంది ఆత్మలు ఇక్కడికి వస్తారా ఏమిటి? ఇదంతా అర్థము చేసుకోవాల్సిన డ్రామా యొక్క ఆట. ఇందులో సంశయం యొక్క విషయమే ఉండజాలదు. ఎంతమంది సంశయంలోకి వచ్చి చదువును విడిచిపెడతారు. వారి భాగ్యాన్ని వారే పాడు చేసుకుంటారు. ఎటువంటి పరిస్థితిలోనూ సంశయబుద్ధికలవారిగా అవ్వకూడదు. తండ్రిని గుర్తించిన తర్వాత తండ్రిపై సంశయం వస్తుందా ఏమిటి? పిల్లలకు తెలుసు, మనము పతితపావనుడైన తండ్రి వద్దకు పావనముగా అయి వెళ్తాము. పతిత-పావనుడు రావాలి మరియు పతితులను పావనముగా చేయాలి అని అంటూ ఉంటారు. ఎవరైతే పావనంగా అవుతారో, వారే పవిత్ర ప్రపంచంలోకి వెళ్తారు మరియు అమరులుగా అవుతారు. ఇకపోతే, ఎవరైతే పవిత్రంగా అవ్వరో, వారు అమరులుగా అవ్వరు. మీరు అమర ప్రపంచానికి యజమానిగా అవుతారు. తండ్రి ఎంత ఉన్నతమైన వారసత్వాన్ని ఇస్తారు. ఎంత పవిత్రంగా అవుతారంటే, మళ్ళీ 21 జన్మలు పవిత్రంగా ఉంటారు. సన్యాసులైతే ఎంతైనా వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు. అమరపురికి యోగ్యులుగా అవ్వరు. అమరపురికి యోగ్యులుగా బాబా తయారుచేస్తారు. ఈ అమరకథను పార్వతులకు అమరనాథుడైన శివబాబానే వినిపిస్తున్నారు. అనంతమైన తండ్రి వద్దకు పిల్లలు వచ్చారు. వారసత్వమైతే తీసుకోవాల్సిందే కదా. ఇక్కడ సాగరుని వద్దకు రిఫ్రెష్ అవ్వడానికి వస్తారు. మళ్ళీ వెళ్ళి తమ సమానంగా తయారుచేయాలి. కనుక పిల్లల వ్యాపారము కూడా ఇదే. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఏ విషయములోనూ సంశయము కలగకూడదు. డ్రామాను సాక్షీగా అయి చూడాలి. ఎప్పుడూ కూడా తమ రిజిస్టరును పాడు చేసుకోకూడదు.
2. కర్మాతీత అవస్థను చేరుకోవడము కోసము స్మృతిలో ఉండే పూర్తి పురుషార్థము చేయాలి. సత్యమైన హృదయంతో తండ్రిని స్మృతి చేయాలి. మీ స్థితి యొక్క ఉష్ణోగ్రతను మీకు మీరే చూసుకోవాలి.
వరదానము:-
ఎవరి వద్దనైతే సంతుష్టత యొక్క ఖజానా ఉంటుందో, వారి వద్ద అన్నీ ఉంటాయి, ఎవరైతే కొంచెములో సంతుష్టము అవుతారో, వారికి సర్వ ప్రాప్తుల అనుభూతి ఉంటుంది మరియు ఎవరి వద్దనైతే సంతుష్టత లేదో, వారి వద్ద అన్నీ ఉన్నా కూడా ఏమీ లేనట్లు ఎందుకంటే అసంతుష్ట ఆత్మ సదా కోరికలకు వశమై ఉంటుంది, వారి ఒక కోరిక పూర్తి అయిన తర్వాత ఇంకా 10 కోరికలు ఉత్పన్నమవుతాయి, అందుకే హద్దు కోరికలంటే ఏమిటో తెలియనివారిగా అవ్వండి… అప్పుడే సంతుష్టమణి అని అంటారు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!