27 April 2021 TELUGU Murli Today – Brahma Kumaris

26 April 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Malayalam. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - మీ స్వధర్మము శాంతి, సత్యమైన శాంతి శాంతిధామములో లభించగలదు, ఈ విషయాన్ని అందరికీ వినిపించాలి, స్వధర్మములో ఉండాలి”

ప్రశ్న: -

ఒక్క తండ్రి వద్ద ఉన్న ఏ జ్ఞానాన్ని మీరు ఇప్పుడు మాత్రమే చదువుతారు?

జవాబు:-

 పాప పుణ్యాల జ్ఞానము. భారతవాసులు తండ్రిని నిందించడం మొదలు పెట్టినప్పుడు పాపాత్ములుగా అవుతారు, మళ్ళీ తండ్రిని మరియు డ్రామాను తెలుసుకున్నప్పుడు పుణ్యాత్ములుగా అవుతారు. ఈ చదువును పిల్లలైన మీరు ఇప్పుడే చదువుకుంటారు. అందరికీ సద్గతినిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమేనని మీకు తెలుసు. మనుష్యులు, మనుష్యులకు సద్గతిని అనగా ముక్తి-జీవన్ముక్తులను ఇవ్వలేరు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఈ పాపపు ప్రపంచం నుండి….. (ఇస్ పాప్ కీ దునియా సే…..)

ఓంశాంతి. బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు – ఇది పాపాత్ముల ప్రపంచము, భారత్ పుణ్యాత్ముల ప్రపంచముగా ఉండేదని, అక్కడ దేవీ దేవతల రాజ్యముండేదని భారత్ కోసమే చెప్తారు. ఈ భారత్ సుఖధామముగా ఉండేది, అప్పుడు ఇతర ఖండాలేవీ ఉండేవి కావు, ఒక్క భారత్ మాత్రమే ఉండేది. ప్రశాంతత మరియు సుఖము ఆ సత్యయుగంలో ఉండేవి, దానిని స్వర్గమని అంటారు. ఇది నరకము. భారత్ యే స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకంగా తయారయ్యింది. నరకంలో ప్రశాంతత మరియు సుఖ-శాంతులు ఎక్కడ నుండి వస్తాయి. కలియుగాన్ని నరకము అని అంటారు. కలియుగ అంతిమాన్ని ఇంకా రౌరవ నరకము అని అనడం జరుగుతుంది. దుఃఖధామము అని అనడం జరుగుతుంది. లక్ష్మీనారాయణుల రాజ్యం ఉన్నప్పుడు ఈ భారత్ యే సుఖధామంగా ఉండేది. భారతవాసుల గృహస్థ ధర్మము పవిత్రంగా ఉండేది. పవిత్రత కూడా ఉండేది, సుఖ-శాంతులు కూడా ఉండేవి, అపారమైన సంపద కూడా ఉండేది. ఇప్పుడు ఆ భారత్ యే పతితముగా అయిపోయింది, అందరూ వికారులుగా అయిపోయారు. ఇది దుఃఖధామము. భారత్ సుఖధామముగా ఉండేది. ఎక్కడైతే ఆత్మలమైన మనం నివసిస్తామో – అది శాంతిధామము. శాంతి ఆ శాంతిధామములోనే లభించగలదు. ఆత్మ అక్కడ మాత్రమే శాంతిగా ఉండగలదు, దానిని స్వీట్ హోమ్ (మధురమైన ఇల్లు), నిరాకారి ప్రపంచము అని అంటారు. అది ఆత్మల ఇల్లు. అక్కడ ఉన్నప్పుడు ఆత్మ శాంతిలో ఉంటుంది. అంతేకానీ, అడవులకు వెళ్ళినంత మాత్రాన ఏమీ శాంతి లభించదు. శాంతిధామము అదే. సత్యయుగంలో సుఖము కూడా ఉంటుంది, శాంతి కూడా ఉంటుంది. ఇక్కడ దుఃఖధామములో శాంతి ఉండజాలదు. శాంతి శాంతిధామములో లభిస్తుంది. సుఖధామములో కూడా కర్మలు జరుగుతాయి, శరీరం ద్వారా పాత్రను అభినయించవలసి ఉంటుంది. ఈ దుఃఖధామములో సుఖ-శాంతులు ఉన్న మనుష్యులు ఒక్కరు కూడా లేరు. ఇది భ్రష్టాచారీ పతితధామము, అందుకే పతితపావనుడిని పిలుస్తారు. కానీ ఆ తండ్రి గురించి ఎవరికీ తెలియదు, అందుకే అనాథలుగా అయిపోయారు. అనాథలుగా అయిన కారణంగా పరస్పరంలో కొట్లాడుకుంటూ-గొడవపడుతూ ఉంటారు. ఎంత దుఃఖము-అశాంతి, మారణహోమం ఉన్నాయి. ఇది రావణ రాజ్యము. రామ రాజ్యాన్ని కోరుకుంటారు. రావణ రాజ్యంలో సుఖము లేదు, శాంతి లేదు. రామ రాజ్యంలో సుఖము, శాంతి రెండూ ఉండేవి. అక్కడ పరస్పరంలో ఎప్పుడూ కొట్లాడుకునేవారు కాదు, అక్కడ 5 వికారాలు ఉండవు. ఇక్కడ 5 వికారాలున్నాయి. వాటిలో మొదట దేహాభిమానము ముఖ్యమైనది. ఆ తర్వాత కామము, క్రోధము. భారత్ స్వర్గంగా ఉన్నప్పుడు ఈ వికారాలు ఉండేవి కావు. అక్కడ దేహీ-అభిమానులుగా ఉండేవారు. ఇప్పుడు మనుష్యులందరూ దేహాభిమానులుగా ఉన్నారు. దేవతలు దేహీ-అభిమానులుగా ఉండేవారు. దేహాభిమానము కల మనుష్యులు ఎప్పుడూ ఎవరికీ సుఖాన్ని ఇవ్వలేరు. ఒకరికొకరు దుఃఖాన్నే ఇచ్చుకుంటారు. ఎవరైనా లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా, పదమపతులుగా ఉన్నా సరే, వారు సుఖంగా ఉన్నారని భావించకండి. ఇదంతా మాయ యొక్క ఆర్భాటము. ఇది మాయా రాజ్యము. ఇప్పుడు దీని వినాశనము కోసం ఈ మహాభారత యుద్ధం ఎదురుగా నిలబడి ఉంది. దీని తర్వాత స్వర్గ ద్వారాలు మళ్ళీ తెరుచుకోనున్నాయి. అర్ధకల్పం తర్వాత నరక ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. భక్తి చేసినప్పుడు భగవంతుడు లభిస్తారని భారతవాసులు అంటారు. బాబా అంటారు – భక్తి చేస్తూ-చేస్తూ పూర్తిగా కిందకు వచ్చినప్పుడు, స్వర్గ స్థాపన చేసేందుకు అనగా భారత్ ను స్వర్గంగా తయారుచేసేందుకు నేను రావలసి ఉంటుంది. స్వర్గంగా ఉన్న భారత్ నరకంగా ఎలా అయ్యింది? రావణుడు తయారుచేశాడు. గీతా భగవంతుని ద్వారా మీకు రాజ్యం లభించింది, 21 జన్మలు స్వర్గంలో రాజ్యం చేసారు. తర్వాత భారత్ ద్వాపరం నుండి కలియుగంలోకి వచ్చింది, అనగా దిగే కళ ఏర్పడింది, అందుకే ఓ పతితపావనా రండి, అని అందరూ పిలుస్తూ ఉంటారు. పతిత మనుష్యులకు పతిత ప్రపంచంలో సుఖ, శాంతులు లభించజాలవు. ఎంత దుఃఖాన్ని అనుభవిస్తారు. ఈ రోజు డబ్బు దొంగలించబడుతుంది, మరొక రోజు దివాలా తీస్తారు, ఇంకొక రోజు రోగగ్రస్థులుగా అవుతారు. దుఃఖమే దుఃఖము కదా. ఇప్పుడు మీరు సుఖ-శాంతుల వారసత్వాన్ని పొందేందుకు పురుషార్థం చేస్తున్నారు, తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థం చేస్తున్నారు. సదా సుఖమయంగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. సదా దుఃఖమయంగా చేసేవాడు రావణుడు. ఈ విషయాలు భారతవాసులకు తెలియవు. సత్యయుగంలో దుఃఖపు విషయాలు ఉండవు. ఎప్పుడూ ఏడవవలసిన అవసరముండదు. సదా సుఖమే సుఖముంటుంది. అక్కడ దేహాభిమానము లేదా కామము, క్రోధము మొదలైనవి ఉండవు. ఎప్పటివరకైతే 5 వికారాలను దానమివ్వరో, అప్పటివరకు దుఃఖం యొక్క గ్రహణం వదలదు. దానం ఇచ్చినట్లయితే గ్రహణం వదులుతుందని అంటారు కదా. ఈ సమయంలో మొత్తం భారత్ కు 5 వికారాల గ్రహణం పట్టి ఉంది. ఎప్పటివరకైతే ఈ 5 వికారాలను దానమివ్వరో, అప్పటివరకు 16 కళల సంపూర్ణ దేవతలుగా అవ్వలేరు. తండ్రి సర్వుల సద్గతిదాత. గురువు లేకుండా గతి లభించదని అంటారు. కానీ, గతి అన్న మాటకు అర్థం తెలుసుకోరు. మనుష్యుల గతి-సద్గతి అనగా ముక్తి-జీవన్ముక్తి. అవి తండ్రి మాత్రమే ఇవ్వగలరు. ఈ సమయంలో సర్వుల సద్గతి జరుగనున్నది.

ఢిల్లీని కొత్త ఢిల్లీ, పాత ఢిల్లీ అని అంటారు. కానీ ఇప్పుడైతే కొత్తగా లేదు. కొత్త ప్రపంచంలో కొత్త ఢిల్లీ ఉంటుంది. పాత ప్రపంచంలో పాత ఢిల్లీ ఉంటుంది. తప్పకుండా జమునా తీరం ఉండేది, ఢిల్లీ పరిస్తాన్ (స్వర్గము) గా ఉండేది. సత్యయుగం ఉండేది కదా. అక్కడ దేవీ-దేవతలు రాజ్యం చేసేవారు. ఇప్పుడు, పాత ప్రపంచంలో పాత ఢిల్లీ ఉంది. కొత్త ప్రపంచంలోనైతే ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. భారతవాసులు ఇది మర్చిపోయారు. కొత్త భారత్, కొత్త ఢిల్లీ ఉన్నప్పుడు, వారి రాజ్యముండేది, వేరే ఖండమేదీ ఉండేది కాదు. ఇది ఎవరికీ తెలియదు. గవర్నమెంట్ ఇది చదివించదు. వారు చదివించేది అసంపూర్ణ చరిత్ర అని వారికి తెలుసు. ఇస్లామీయులు, బౌద్ధులు వచ్చినప్పటి నుండి ఉన్న చరిత్ర ఉంది. లక్ష్మీనారాయణుల రాజ్యం గురించి ఎవరికీ తెలియదు. మొత్తం సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనేది తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తారు. భారత్ స్వర్గంగా ఉన్నప్పుడు బంగారు యుగముగా ఉండేది. ఇప్పుడు ఆ భారత్ ఎలా అయిపోయిందో చూడండి. మళ్ళీ భారత్ ను వజ్ర సమానంగా ఎవరు తయారుచేస్తారు? మీరు చాలా పాపాత్ములుగా అయినప్పుడు పుణ్యాత్ములుగా చేసేందుకు నేను వస్తాను అని తండ్రి అంటారు. ఈ డ్రామా రచించబడి ఉంది, దీని గురించి ఎవరికీ తెలియదు. ఈ జ్ఞానాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. తండ్రి ఒక్కరే నాలెడ్జ్ ఫుల్, వారు వచ్చి చదివిస్తారు. మనుష్యులు, మనుష్యులకు ఎప్పుడూ సద్గతిని ఇవ్వలేరు. దేవీ-దేవతలుగా ఉన్నప్పుడు అందరూ ఒకరికొకరు సుఖాన్ని ఇచ్చుకునేవారు. ఎవరూ అనారోగ్యంగా, రోగగ్రస్థులుగా అయ్యేవారు కారు. ఇక్కడైతే అందరూ రోగులే. ఇప్పుడు, మళ్ళీ స్వర్గముగా తయారుచేసేందుకు తండ్రి వచ్చారు. తండ్రి స్వర్గాన్ని తయారుచేస్తారు, రావణుడు నరకాన్ని తయారుచేస్తాడు. ఈ ఆట గురించి ఎవరికీ తెలియదు. శాస్త్రాల జ్ఞానము ఫిలాసఫీ, అది భక్తి మార్గము. అదేమీ సద్గతి మార్గము కాదు. ఇదేమీ శాస్త్రాల ఫిలాసఫీ కాదు. తండ్రి ఏ శాస్త్రాలను వినిపించరు. ఇక్కడున్నది స్పిరిచ్యువల్ నాలెడ్జ్. తండ్రిని స్పిరిచ్యువల్ ఫాదర్ అని అంటారు. వారు ఆత్మల తండ్రి. నేను మనుష్య సృష్టికి బీజ రూపుడను కావున నేను నాలెడ్జ్ ఫుల్ అని తండ్రి అంటారు. ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షం యొక్క ఆయువు ఎంత, ఇది ఎలా వృద్ధి చెందుతుంది, భక్తి మార్గం మళ్ళీ ఎలా మొదలవుతుంది అనేది నాకు తెలుసు. పిల్లలైన మీకు ఈ జ్ఞానాన్ని ఇచ్చి స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాను, అప్పుడు మీరు యజమానులుగా అయిపోతారు. ఈ జ్ఞానం మీకు ఒక్కసారి మాత్రమే లభిస్తుంది, తర్వాత మాయమైపోతుంది. మళ్ళీ, సత్య-త్రేతా యుగాలలో ఈ జ్ఞానం అవసరముండదు. ఈ జ్ఞానం కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే ఉంది. దేవతలలో ఈ జ్ఞానం లేదు. కావున ఈ జ్ఞానము పరంపరగా రాజాలదు. ఇది పిల్లలైన మీకు కేవలం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది, దీని ద్వారా మీరు జీవన్ముక్తులవుతారు. తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతారు. మీ వద్దకు చాలామంది వస్తారు, మనసుకు శాంతి ఎలా లభిస్తుంది అని అడుగుతారు. కానీ ఇలా అనడం తప్పు. ఎలాగైతే శరీరము యొక్క ఇంద్రియాలు ఉన్నాయో, అలా మనసు-బుద్ధి ఆత్మ యొక్క ఇంద్రియాలు. తండ్రియే వచ్చి ఆత్మను రాతిబుద్ధి నుండి పారసబుద్ధి కలదిగా చేస్తారు, అది సత్య-త్రేతా యుగాల వరకు కొనసాగుతుంది. మళ్ళీ రాతిబుద్ధి కలవారిగా అయిపోతారు. ఇప్పుడు మీరు మళ్ళీ రాతిబుద్ధి నుండి పారసబుద్ధి కలవారిగా అవుతారు. మీ పారసబుద్ధిలో మాలిన్యం చేరుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పారసబుద్ధి కలవారిగా ఎలా అవ్వాలి? తండ్రి అంటారు – హే ఆత్మ! నన్ను స్మృతి చేయండి. స్మృతి యాత్రతో మీరు పవిత్రంగా అవుతారు మరియు నా వద్దకు వచ్చేస్తారు. ఇకపోతే, మనసుకు శాంతి ఎలా లభిస్తుంది అని అడిగేవారికి ఇలా చెప్పండి – ఇక్కడ శాంతి ఎలా ఉంటుంది, ఇది దుఃఖధామము, ఎందుకంటే ఇక్కడ వికారాలు ప్రవేశించి ఉన్నాయి. శాంతి వారసత్వము అనంతమైన తండ్రి నుండి మాత్రమే లభించగలదు. తర్వాత రావణుడి సాంగత్యంతో పతితులుగా అయిపోతారు, మళ్ళీ తండ్రి ద్వారా పావనంగా అయ్యేందుకు ఒక్క క్షణం పడుతుంది. ఇప్పుడు మీరు తండ్రి నుండి జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. తండ్రి జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని ఇస్తారు మరియు రావణుడు జీవనబంధనం యొక్క శాపాన్ని ఇస్తాడు, కావుననే దుఃఖమే దుఃఖం ఉంది. డ్రామాను కూడా తెలుసుకోవాలి. దుఃఖధామంలో ఎవరికీ సుఖ-శాంతులు లభించజాలవు. శాంతి ఆత్మలైన మన స్వధర్మము, శాంతిధామము ఆత్మల ఇల్లు. ఆత్మ అంటుంది – నా స్వధర్మము శాంతి, అక్కడ ఈ బాజాను (శరీరాన్ని) మోగించను, నేను కూర్చుండిపోతాను. కానీ ఎంతవరకు కూర్చొని ఉంటారు. కర్మలనైతే చేయాలి కదా. ఎప్పటివరకైతే మనుష్యులు డ్రామాను అర్థం చేసుకోరో, అప్పటివరకు దుఃఖమయంగా ఉంటారు. నేను పేదల పాలిటి పెన్నిధిని, ఇక్కడకు పేదలే వస్తారు అని తండ్రి చెప్తారు. షావుకారులకు ఇక్కడే స్వర్గం ఉంది. వారి భాగ్యంలో స్వర్గ సుఖం లేదు. నేను పేదల పాలిటి పెన్నిధిని అని తండ్రి అంటారు. షావుకారులను పేదవారిగా మరియు పేదవారిని షావుకారులుగా చేస్తాను. షావుకారులు అంత ఉన్నత పదవిని పొందలేరు, ఎందుకంటే షావుకారులకు ఇక్కడ నషా ఉంటుంది. అయితే, ప్రజల్లోకి వస్తారు. స్వర్గంలోకైతే తప్పకుండా వస్తారు. కానీ ఉన్నత పదవిని పేదవారే పొందుతారు. పేదవారు షావుకారులుగా అవుతారు. ధనవంతులకు తాము ధనవంతులమనే దేహాభిమానము ఉంటుంది కదా. కానీ బాబా అంటారు – ఈ ధనము-వస్తువులన్నీ మట్టిలో కలిసిపోనున్నాయి. వినాశనం జరుగనున్నది. దేహీ-అభిమానులుగా అవ్వడంలో చాలా శ్రమ ఉంది. ఈ సమయంలో అందరూ దేహాభిమానులుగా ఉన్నారు. ఇప్పుడు మీరు దేహీ-అభిమానులుగా అవ్వాలి. నేను 84 జన్మలను పూర్తి చేసానని ఆత్మ అంటుంది. నాటకం పూర్తవుతుంది, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడిది కలియుగ అంతిమము, సత్యయుగ ఆది యొక్క సంగమము. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత భారత్ ను మళ్ళీ వజ్ర సమానంగా తయారుచేసేందుకు వస్తాను అని తండ్రి అంటారు. ఈ చరిత్ర-భూగోళాలను తండ్రి మాత్రమే తెలియజేయగలరు.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి నుండి జీవన్ముక్తి వారసత్వాన్ని తీసుకునేందుకు తప్పకుండా పావనంగా అవ్వాలి. డ్రామా జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకొని దుఃఖధామంలో ఉంటూ కూడా దుఃఖాల నుండి ముక్తులుగా అవ్వాలి.

2. ధన, సంపదల నషాను వదిలి దేహీ-అభిమానులుగా ఉండేందుకు పురుషార్థం చేయాలి.

వరదానము:-

ఉపరామ మరియు సాక్షితనపు అవస్థను తయారుచేసుకునేందుకు రెండు విషయాల పట్ల ధ్యానం ఉండాలి – ఒకటేమో ఆత్మనైన నేను మహాన్ ఆత్మను, రెండవది – ఆత్మనైన నేను ఇప్పుడు ఈ పాత సృష్టిలో మరియు ఈ పాత శరీరంలో అతిథిగా ఉన్నాను. ఈ స్మృతిలో ఉండడంతో స్వతహాగా మరియు సహజంగానే సర్వ బలహీనతలు మరియు మోహపు ఆకర్షణలు సమాప్తమైపోతాయి. మహాన్ గా భావించడం ద్వారా, సంస్కారాలకు వశమై జరిగే సాధారణమైన కర్మలు మరియు కలిగే సాధారణమైన సంకల్పాలు పరివర్తన అయిపోతాయి. మహాన్ మరియు అతిథి గా భావించి నడుచుకోవడం ద్వారా మహిమా యోగ్యులుగా కూడా అవుతారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top