26 October 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
25 October 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - మీరు ఎవరినైతే ఈ రోజు వరకు మహిమ చేస్తూ వచ్చారో, వారే ఇప్పుడు మీ ముందు హాజరై ఉన్నారు, కావున సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉండండి, ఏ విషయానికి సంబంధించిన దుఃఖము ఉండకూడదు”
ప్రశ్న: -
పురుషార్థీ పిల్లలు తమ హృదయంలో ఏ చెకింగ్ ను తప్పకుండా చేసుకుంటారు?
జవాబు:-
ఇప్పటివరకు ఆత్మనైన నాలో చిన్న-చిన్న ముళ్ళు ఏవీ లేవు కదా? కామమనే ముల్లు అన్నింటికంటే తీవ్రమైనది. క్రోధమనే ముల్లు కూడా చాలా చెడ్డది. దేవతలెప్పుడూ క్రోధితులుగా అవ్వరు. కనుక మధురమైన పిల్లలూ, ఏదైనా ముల్లు ఉంటే, దానిని తొలగించి వేయండి. మిమ్మల్ని మీరు నష్టపరచుకోకండి.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
నీవే తల్లివి, తండ్రివి..
ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు తమ తండ్రి మహిమను విన్నారు. వారు పాడుతూ ఉంటారు, ఇక్కడ మీరు ప్రాక్టికల్ గా ఆ బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మీకు తెలుసు – బాబా మన ద్వారా భారత్ ను స్వర్గంగా తయారుచేస్తున్నారు. ఎవరి ద్వారానైతే తయారుచేస్తున్నారో, తప్పకుండా వారే సుఖధామానికి యజమానులుగా అవుతారు. పిల్లలకు చాలా సంతోషముండాలి. బాబా మహిమ అపారమైనది, వారి నుండి మనం వారసత్వాన్ని పొందుతున్నాము. ఇప్పుడు పిల్లలైన మీ పై మాత్రమే కాదు, మొత్తం ప్రపంచంపై బృహస్పతి దశ ఉంది. ఈ విషయం ఇప్పుడు బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. ముఖ్యంగా భారత్ మరియు ప్రపంచమంతటిపైనా, అందరిపై బృహస్పతి దశ కూర్చొని ఉంది, ఎందుకంటే ఇప్పుడు 16 కళల సంపూర్ణులుగా అవుతారు. ఈ సమయంలో కళలేవీ లేవు. పిల్లలకు చాలా సంతోషముండాలి. అలాగని ఇక్కడ సంతోషముండి, బయటకు వెళ్ళగానే అది మాయమైపోవడం కాదు. ఎవరి మహిమనైతే పాడుతూ ఉంటారో, వారిప్పుడు మీ వద్ద హాజరై ఉన్నారు. తండ్రి అంటారు – 5 వేల సంవత్సరాల క్రితం కూడా రాజ్యం ఇచ్చి వెళ్ళాను. ఇప్పుడు నెమ్మది-నెమ్మదిగా అందరూ పిలవడం మీరు చూస్తారు. మీ స్లోగన్లు కూడా వెలువడుతూ ఉంటాయి. ఒకే ధర్మముండాలి, ఒకే రాజ్యముండాలి, ఒకే భాష ఉండాలి అని కొందరు అంటారు. ఆత్మలే అలా అంటారు కదా. భారత్ లో తప్పకుండా దేవీ-దేవతల రాజధాని ఒకటే ఉండేదని ఆత్మకు తెలుసు. ఈ సుగంధం వ్యాపిస్తూ ఉంటుంది. మీరు ఈ సుగంధాన్ని వెదజల్లుతూ ఉంటారు. డ్రామా ప్లాన్ అనుసారంగా యుద్ధానికి సంబంధించిన గుర్తులు కూడా ఎదురుగా నిలబడి ఉన్నాయి. ఇది కొత్త విషయమేమీ కాదు. భారత్ 16 కళల సంపూర్ణంగా తప్పకుండా తయారవ్వాలి. మనం ఈ యోగబలంతో 16 కళల సంపూర్ణులుగా అవుతున్నామని మీకు తెలుసు. దానమిస్తే గ్రహణం తొలగుతుందని అంటారు కదా. తండ్రి కూడా – వికారాలను, అవగుణాలను దానమివ్వండి అని చెప్తారు. ఇది రావణ రాజ్యం కదా. తండ్రి వచ్చి దీని నుండి విడిపిస్తారు, ఇందులో కూడా కామ వికారము చాలా పెద్ద అవగుణము. మీరు దేహాభిమానులుగా అయిపోయారు. ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వాలి. శరీర భానాన్ని కూడా వదలాల్సి ఉంటుంది. ఈ విషయాలను పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు, ఇవి ప్రపంచానికి తెలియవు. భారత్ 16 కళల సంపూర్ణంగా ఉండేది, అక్కడ సంపూర్ణ దేవతల రాజ్యముండేది. ఈ లక్ష్మీ-నారాయణుల రాజధాని ఉండేది. భారత్ స్వర్గంగా ఉండేది. ఇప్పుడు 5 వికారాల గ్రహణం పట్టి ఉంది, అందుకే తండ్రి అంటారు – దానమిస్తే గ్రహణం తొలగుతుంది. ఈ కామ వికారమే కింద పడేస్తుంది, అందుకే తండ్రి అంటారు – దీనిని దానమిచ్చినట్లయితే 16 కళల సంపన్నులుగా అవుతారు. దానమివ్వకపోతే అవ్వరు. ఆత్మలకు తమ-తమ పాత్రలు లభించి ఉన్నాయి కదా. ఇది కూడా మీ బుద్ధిలో ఉంది కదా. ఆత్మలైన మీలో ఎంత పాత్ర ఉంది. మీరు విశ్వ రాజ్య భాగ్యాన్ని తీసుకుంటారు. ఇది అనంతమైన డ్రామా, ఇందులో చాలా మంది పాత్రధారులున్నారు. ఇందులో ఈ లక్ష్మీ-నారాయణులు ఫస్ట్ క్లాస్ పాత్రధారులు, వారిది నంబర్ వన్ పాత్ర. విష్ణువే బ్రహ్మా-సరస్వతులుగా, మళ్ళీ బ్రహ్మా-సరస్వతులే విష్ణువుగా అవుతారు. వీరు 84 జన్మల చక్రం ఎలా తిరుగుతారో, అంతా మీ బుద్ధిలోకి వచ్చేస్తుంది. వ్యాపారస్థులు ఖాతా పుస్తకాలు పెట్టినప్పుడు, దానిపై స్వస్తిక్ గుర్తును వేస్తారు. గణేశుడి పూజ చేస్తారు. ఇది అనంతమైన ఖాతా. స్వస్తిక్ లో 4 భాగాలుంటాయి. పూరీలో కుండలో అన్నం వండుతారు. అది ఉడికిన తర్వాత 4 భాగాలుగా అవుతుంది. అక్కడ అన్నమునే భోగ్ గా పెడతారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు? అతి ప్రియమైన తండ్రి వచ్చి మీకు సేవకునిగా అయ్యారు, మీ సేవ చేస్తారు. మనుష్యులు, ఆత్మను నిర్లేపి అని అంటారు. ఆత్మలో 84 జన్మల పాత్ర ఉందని ఇప్పుడు మీకు తెలుసు. మరి ఆత్మను నిర్లేపి అంటే రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా అవుతుంది కదా. ఇదంతా ఎవరైనా ఒక నెల, ఒకటిన్నర నెల కూర్చొని మంచి రీతిలో అర్థం చేసుకున్నట్లయితే, అప్పుడు బుద్ధిలో పాయింట్లు కూర్చొంటాయి. రోజు-రోజుకు చాలా పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. ఇది కస్తూరి వంటిది. శాస్త్రాలలో సారమేమీ లేదు. బాబా అంటారు – ఇప్పుడు వాటిని బుద్ధి నుండి తొలగించండి. నేనొక్కడినే జ్ఞానసాగరుడను. పూర్తి నిశ్చయం ఏర్పడినప్పుడు – నిజానికి ఇవన్నీ భక్తి మార్గం కోసమని అర్థం చేసుకుంటారు. పరమపిత పరమాత్మనే వచ్చి దుర్గతి నుండి సద్గతిని కలిగిస్తారు. మెట్ల చిత్రంలో కూడా స్పష్టంగా చూపించాలి. భక్తి మార్గం ప్రారంభమైనప్పుడు రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. ఇప్పుడు గీతా అధ్యాయము రిపీట్ అవుతుంది. తండ్రి అంటారు – నేను కల్ప-కల్పము, కల్పం యొక్క సంగమయుగంలో వస్తాను. వారు కూర్మావతారం, మత్స్యావతారం అని అన్నారు. 24 అవతారాలని అంటారు. బాబా అంటారు – ఇప్పుడు మీ పై బృహస్పతి దశ ఉంది. నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేసాను. ఇప్పుడు రావణుడు మీపై రాహు దశను కూర్చోబెట్టాడు. ఇప్పుడు స్వర్గానికి యజమానులుగా చేసేందుకు తండ్రి మళ్ళీ వచ్చారు. కనుక మిమ్మల్ని మీరు నష్టపరచుకోకూడదు. వ్యాపారస్థులు ఎప్పుడూ తమ ఖాతాను సరిగ్గా ఉంచుకుంటారు. నష్టపరచుకునే వారిని బుద్ధిహీనులని అంటారు. ఇప్పుడు వీరు అందరికంటే పెద్ద వ్యాపారి. ఎవరో అరుదుగా ఈ వ్యాపారాన్ని చేస్తారు. ఇదే అవినాశీ వ్యాపారము, మిగిలిన వ్యాపారాలన్నీ మట్టిలో కలిసిపోనున్నాయి. ఇప్పుడు మీ సత్యమైన వ్యాపారం జరుగుతుంది. తండ్రి అనంతమైన వ్యాపారస్థుడు, రత్నాకరుడు… మరియు జ్ఞానసాగరుడని పిలవబడతారు. ప్రదర్శనీలకు ఎంతమంది వస్తారో చూడండి. సెంటర్ కు ఎవరో కష్టం మీద వస్తారు. భారత్ చాలా విస్తారమైనది కదా. మీరు అన్ని చోట్లకు వెళ్ళాలి. నీటి గంగలు మొత్తం భారత్ అంతటా లేవు. నీటి గంగ పతితపావని కాదు అని కూడా మీరు అర్థం చేయించాల్సి ఉంటుంది. జ్ఞాన గంగలైన మీరు వెళ్ళాల్సి ఉంటుంది. నలువైపులా ప్రదర్శనీలు, మేళాలు చేస్తూ ఉంటారు. రోజు-రోజుకు మంచి-మంచి చిత్రాలు కూడా తయారవుతూ ఉంటాయి. శోభాయమానమైన చిత్రాలు ఎలా ఉండాలంటే – వాటిని చూడగానే, వీరు సత్యమే తెలియజేస్తారు అని సంతోషం కలగాలి. ఇప్పుడు లక్ష్మీ-నారాయణుల రాజధాని స్థాపనవుతుంది. ఇప్పుడు బ్రాహ్మణ ధర్మం స్థాపనవుతుంది. ఈ బ్రాహ్మణులే దేవీ-దేవతలు అవుతారు. ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు కనుక హృదయంలో తమను తాము ప్రశ్నించుకోండి – నాలో చిన్న-చిన్న ముళ్ళు ఏవీ లేవు కదా, కామమనే ముల్లు లేదు కదా. క్రోధమనే చిన్న ముల్లు కూడా చాలా చెడ్డది. దేవతలు ఎప్పుడూ క్రోధితులుగా అవ్వరు. శంకరుడి నేత్రం తెరుచుకుంటూనే వినాశనమవుతుందన్నట్లు చూపిస్తారు. ఇది కూడా ఒక కళంకమే. వినాశనమైతే జరగాల్సిందే. సూక్ష్మవతనంలో శంకరునికి సర్పాలు మొదలైనవేవీ ఉండవు. సర్పాలు మొదలైనవి రావడానికి అక్కడ భూమి ఎక్కడ ఉంది. ఆకాశంలో సర్పాలు విహరించవు. సూక్ష్మవతనం మరియు మూలవతనంలో తోటలు, ఉద్యానవనాలు, సర్పాలు మొదలైనవేవీ ఉండవు. అవన్నీ ఇక్కడ ఉంటాయి. స్వర్గం కూడా ఇక్కడే ఉంటుంది. ఈ సమయంలో మనుష్యులు ముళ్ళ వలె ఉన్నారు కనుక దీనిని ముళ్ళ అడవి అని అంటారు. సత్యయుగం పుష్పాల తోట. తండ్రి తోటను ఎలా తయారుచేస్తారు అనేది మీరు చూస్తారు. చాలా సుందరంగా తయారుచేస్తారు. అందరినీ సుందరమైన వారిగా తయారుచేస్తారు. వారు సదా సుందరంగా ఉంటారు. ప్రేయసులందరినీ అనగా పిల్లలను సుందరంగా తయారుచేస్తారు. రావణుడు పూర్తిగా నల్లగా తయారుచేసాడు. మా పై బృహస్పతి దశ కూర్చొని ఉందని ఇప్పుడు పిల్లలైన మీకు సంతోషముండాలి. అర్ధ సమయం దుఃఖముండి, అర్ధ సమయం సుఖముంటే, దీని వలన లాభమేముంది? అలా కాదు, 3 వంతులు సుఖముంటుంది. ఈ డ్రామా తయారై ఉంది. డ్రామాను ఇలా ఎందుకు తయారుచేసారని చాలా మంది అడుగుతారు. అరే, ఇది అనాది డ్రామా కదా. ఇది ఎందుకు తయారయ్యింది అన్న ప్రశ్నే తలెత్తదు. ఇది అనాది, అవినాశీ, తయారై తయారవుతున్న డ్రామా. ఈ సృష్టి నాటకము తయారై సిద్ధముగా ఉన్నది, అదే ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు కొత్తగా ఏమీ తయారయ్యేది లేదు… ఎవ్వరికీ మోక్షం లభించదు. ఈ సృష్టి అనాదిగా నడుస్తూ వస్తుంది, అది నడుస్తూనే ఉంటుంది. ప్రళయం జరగదు. బాబా కొత్త ప్రపంచాన్ని తయారుచేస్తారు కానీ దీనికి ఇంకా ఎంత సమయముంది. మనుష్యులు పతితులుగా, దుఃఖితులుగా అయినప్పుడే పిలుస్తారు. బాబా వచ్చి అందరి శరీరాలను కల్పవృక్ష సమానంగా తయారుచేస్తారు. ఆత్మలైన మీరు పవిత్రంగా అయితే శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. కనుక తండ్రి మీ శరీరాన్ని కల్పతరువుగా తయారుచేస్తారు. అర్ధకల్పం మీకు ఎప్పుడూ అకాల మృత్యువు సంభవించదు. మీరు కాలుడిపై విజయం పొందుతారు. పిల్లలైన మీరు చాలా పురుషార్థం చేయాలి. ఎంత ఉన్నత పదవిని పొందితే అంత మంచిది. ప్రతి ఒక్కరు ఎక్కువ సంపాదన కోసం పురుషార్థం చేస్తారు. కట్టెలు కొట్టేవారు కూడా – మేము ఎక్కువ కట్టెలు తీసుకువెళ్తే ఎక్కువ సంపాదన జరుగుతుందని అంటారు. కొందరైతే మోసం చేసి కూడా సంపాదిస్తారు. అక్కడ ఇలా దుఃఖానికి సంబంధించిన విషయమేమీ ఉండదు. ఇప్పుడు మీరు తండ్రి నుండి ఎంత వారసత్వాన్ని పొందుతున్నారు. మేము స్వర్గానికి వెళ్ళేందుకు యోగ్యులుగా ఉన్నామా అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి. (నారదుని ఉదాహరణ) శాస్త్రాలలో చాలా విషయాలు రాసేసారు. ఈ తీర్థ యాత్రలు మొదలైనవన్నీ విడిచిపెట్టండి. పాట కూడా ఉంది కదా – నలువైపులా తిరిగి వచ్చాము, కానీ నిత్యం దూరంగానే ఉన్నాము… అని. ఇప్పుడు తండ్రి మీకు ఎంత మంచి యాత్రను నేర్పిస్తారు, ఇందులో ఏ కష్టము లేదు. తండ్రి కేవలం ఇలా అంటారు – నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి, మీకు చాలా మంచి యుక్తిని వినిపిస్తాను. పిల్లలూ, వింటున్నారా! ఇది నేను అద్దెకు తీసుకున్న రథము. ఈ తండ్రికి (బ్రహ్మాకు) ఎంత సంతోషం కలుగుతుంది – నేను తండ్రికి నా శరీరాన్ని అద్దెకు ఇచ్చాను, తండ్రి నన్ను విశ్వానికి యజమానిగా చేస్తారు అని. భగీరథుడు అన్న పేరు కూడా ఉంది. మీకు తెలుసు – బాంబులు మొదలైనవి తయారవుతున్నాయి, నిప్పు అంటుకోనున్నది. అంతం చేసేందుకు రావణుని దిష్టిబొమ్మను కూడా తయారుచేస్తారు. కానీ ఇక్కడ అలా హతమార్చే విషయమేమీ లేదు. రావణుడిని హతమార్చే విషయమెక్కడ, ఈ రావణపురి సమాప్తమయ్యే విషయమెక్కడ. పిల్లలైన మీరు రామపురిలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు. కావున పూర్తి పురుషార్థం చేయాలి, ముల్లుగా అవ్వకూడదు.
మీరు బ్రాహ్మణ-బ్రాహ్మణీలు. మీకు అంతా మురళీపై ఆధారపడి ఉంటుంది. మీకు మురళీ లభించకపోతే ఏమి చేస్తారు. ఒక్క బ్రాహ్మణి మాత్రమే మురళీని వినిపించాలని కాదు, ఎవరైనా మురళీని చదివి వినిపించవచ్చు. ఈ రోజు మీరు వినిపించండి అని చెప్పాలి. ఇప్పుడు అర్థం చేయించేందుకు చిత్రాలు కూడా చాలా చక్కగా తయారయ్యాయి. ఈ ముఖ్యమైన చిత్రాలను మీ దుకాణంలో పెట్టుకొని అనేకుల కళ్యాణం చేయండి. ఆ వ్యాపారంతో పాటు ఈ వ్యాపారాన్ని కూడా చేయండి. ఇది బాబా యొక్క అవినాశీ జ్ఞాన రత్నాల దుకాణము. ఇల్లు మొదలైనవి కట్టుకోకండి అని బాబా ఏమీ అనరు. కట్టుకుంటే కట్టుకోండి, ధనమైతే మట్టిలో కలిసిపోతుంది. దాని కన్నా ఇల్లు కట్టుకొని విశ్రాంతిగా ఎందుకు ఉండకూడదు. ధనాన్ని కార్యంలో వినియోగించాలి. ఇల్లు కూడా కట్టుకోండి, తినడానికి కూడా పెట్టుకోండి, దాన-పుణ్యాలు కూడా చేయండి. కాశ్మీరు రాజు మరణించినప్పుడు తమ వ్యక్తిగత ఆస్తి ఏదైతే ఉండేదో, అదంతా ఆర్య సమాజం వారికి దానంగా ఇచ్చి వెళ్ళారు. తమ ధర్మం కోసం చేసుకుంటారు కదా. ఇక్కడ అలాంటి విషయమేమీ లేదు. అందరూ పిల్లలే. దానము మొదలైనవాటి విషయాలేవీ లేవు. అది హద్దు దానము. నేను మీకు విశ్వ రాజ్యాధికారాన్ని ఇస్తాను. డ్రామానుసారంగా భారతవాసులే రాజ్య భాగ్యాన్ని తీసుకుంటారు. భక్తి మార్గంలో వ్యాపారస్థులు ధర్మార్ధం ఎంతో కొంత తప్పకుండా పక్కకు తీస్తారు. దానికి కూడా మరుసటి జన్మలో అల్పకాలికముగా లభిస్తుంది. ఇప్పుడు నేను డైరెక్టుగా వచ్చాను కనుక మీరు ఈ కార్యంలో వినియోగించండి. నాకు ఏమీ వద్దు. శివబాబా తమ కోసం ఇల్లు ఏమైనా కట్టుకోవాలా ఏమిటి! ఇదంతా బ్రాహ్మణులది. పేదవారు, షావుకారులు అందరూ కలిసి ఉంటారు. కనుక ఇదంతా పిల్లలదే. తమ ఇళ్ళలో వారు ఎంత సుఖంగా ఉంటారు అనేది చూసి ఆ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది, అందుకే అందరినీ బాగా చూసుకోండి అని ఉంటారు. ఏదైనా వస్తువు లేదు అంటే అది లభించగలదు. తండ్రికి పిల్లల పట్ల ప్రేమ ఉంటుంది. ఇంతటి ప్రేమ ఇంకెవ్వరికీ ఉండదు. పిల్లలకు ఎంతగా అర్థం చేయిస్తారు – పురుషార్థం చేయండి, ఇతరుల గురించి కూడా యుక్తులను రచించండి అని. దీనికి కేవలం మూడు అడుగుల నేల కావాలి, అందులో పిల్లలు అర్థం చేయిస్తూ ఉండాలి. ఎవరైనా గొప్ప వ్యక్తుల హాలు ఉంటే – మేము అవసరమైన చిత్రాలను పెడతాము, ఒకటి రెండు గంటలు ఉదయము, సాయంత్రము క్లాస్ చేసి వెళ్ళిపోతాము, ఖర్చంతా మాది, పేరు మీది, చాలా మంది వచ్చి గవ్వ నుండి వజ్ర సమానంగా తయారవుతారు అని చెప్పండి. అచ్ఛా.
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. అవినాశీ తండ్రితో సత్యాతి-సత్యమైన అవినాశీ వ్యాపారం చేయాలి. ఆ వ్యాపారంతో పాటు ఈ వ్యాపారానికి కూడా సమయాన్ని ఇవ్వాలి. జ్ఞాన గంగలుగా అయి అందరినీ పావనంగా తయారుచేయాలి.
2. బ్రాహ్మణ జీవితానికి ఆధారము ‘మురళి’, దానిని ప్రేమగా వినాలి మరియు వినిపించాలి. లోపల ఏదైనా ముల్లు ఉంటే దానిని తొలగించి వేయాలి. అవగుణాలను దానమివ్వాలి.
వరదానము:-
ఎవరిలోనైతే సహనశీలతా గుణముంటుందో, వారు ముఖం ద్వారా సదా సంతుష్టంగా కనిపిస్తారు. ఎవరైతే స్వయం సంతుష్టమూర్తులుగా ఉంటారో, వారు ఇతరులను కూడా సంతుష్టం చేస్తారు. సంతుష్టంగా ఉండడం అంటే సఫలతను పొందడము. ఎవరైతే సహనశీలురుగా ఉంటారో, వారు తమ సహనశీలతా శక్తి ద్వారా కఠిన సంస్కారాలను మరియు కఠిన కార్యాలను శీతలంగా మరియు సహజంగా చేసుకుంటారు. వారి ముఖము గుణమూర్తిలా కనిపిస్తుంది. వారే డ్రామా డాలుపై నిలవగలరు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!