26 May 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

25 May 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - విజయ మాలలోకి రావాలంటే నిశ్చయబుద్ధి కలవారిగా అవ్వండి, నిరాకార తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు, వారు తమతో పాటు తీసుకువెళ్తారు, ఈ నిశ్చయంలో ఎప్పుడూ సంశయం రాకూడదు’’

ప్రశ్న: -

విజయీ రత్నాలుగా అయ్యే వారి ముఖ్యమైన గుర్తులేమిటి?

జవాబు:-

వారికెప్పుడూ ఏ విషయంలోనూ సంశయం రాదు. వారు నిశ్చయబుద్ధి కలవారిగా ఉంటారు. వారికి నిశ్చయముంటుంది, ఇది సంగమ సమయము. ఇప్పుడు దుఃఖధామం పూర్తి అయి సుఖధామం రానున్నది. 2 – తండ్రే రాజయోగాన్ని నేర్పిస్తున్నారు, వారు దేహీ-అభిమానులుగా తయారుచేసి తమతో పాటు తీసుకువెళ్తారు. వారిప్పుడు ఆత్మలైన మనతో మాట్లాడుతున్నారు. మనం వారి సమ్ముఖంలో కూర్చున్నాము. 3 – పరమాత్మ మన తండ్రి కూడా, రాజయోగ శిక్షణనిస్తారు కావున శిక్షకుడు కూడా మరియు శాంతిధామానికి తీసుకువెళ్తారు కావున సద్గురువు కూడా. ఇటువంటి నిశ్చయబుద్ధి కలవారు ప్రతి విషయంలోనూ విజయులుగా అవుతారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

మిమ్మల్ని పొంది మేము… (తుమ్హే పాకె హమ్నే…)

ఓంశాంతి. తండ్రి పిల్లలకు ఓం శాంతి అర్థాన్ని అయితే అర్థం చేయించారు. ప్రతి విషయము సెకెండులో అర్థం చేసుకునేటువంటిది. ఏ విధంగా పిల్లలు కూడా ఓం అని అంటారు, అనగా నేను ఆత్మను, ఇది నా శరీరము. అదే విధంగా తండ్రి కూడా, నేను ఆత్మను, పరంధామంలో నివసించేవాడిని అని అంటారు. వారు పరమాత్మ అవుతారు. ఓం… అని తండ్రి కూడా అనవచ్చు, అలాగే పిల్లలు కూడా అనవచ్చు. ఆత్మనైన నేను మరియు పరమాత్మ, ఇరువురి స్వధర్మము శాంతి. మీకు తెలుసు, ఆత్మ శాంతిధామంలో నివసించేటువంటిది. అక్కడి నుండి ఈ కర్మక్షేత్రంపైకి పాత్రను అభినయించేందుకు వచ్చింది. ఇది కూడా తెలుసు, ఆత్మలమైన మన రూపం ఏమిటి మరియు తండ్రి రూపం ఏమిటి. ఈ విషయం మనుష్య సృష్టిలో ఎవ్వరికీ తెలియదు. తండ్రే వచ్చి అర్థం చేయిస్తారు. పిల్లలు కూడా అర్థం చేయిస్తారు, మన తండ్రి పరమపిత పరమాత్మ, వారు శిక్షకుడు కూడా, అలాగే మన సత్యమైన సుప్రీమ్ గురువు కూడా, వారు మనల్ని తమతో పాటు తీసుకువెళ్తారు. గురువులనైతే చాలామంది ఆశ్రయిస్తారు. ఇప్పుడు పిల్లలకు నిశ్చయం కలిగింది, పరమపిత పరమాత్మ తండ్రి కూడా, సహజ రాజయోగం మరియు జ్ఞానం యొక్క శిక్షణను కూడా ఇస్తున్నారు మరియు తమతో పాటు తీసుకువెళ్తారు కూడా. ఈ నిశ్చయంలోనే పిల్లలైన మీ విజయముంది. విజయ మాలలో కూర్చబడతారు. రుద్ర మాల మరియు విష్ణు మాల. భగవానువాచ – నేను పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. కావున టీచరు కూడా అయినట్లు. మతమైతే లభించాలి కదా. తండ్రి మతం వేరు, టీచరుది వేరు, గురువుది వేరుగా ఉంటుంది. భిన్న-భిన్న మతాలు లభిస్తాయి. ఇక్కడైతే అందరిదీ ఒక్కటే ఉంటుంది, ఇందులో సంశయం మొదలైన విషయమేమీ లేదు. మనం ఈశ్వరీయ పరివారం లేక వంశావళి అని తెలుసు. గాడ్ ఫాదర్ యే రచయిత. మీరే తల్లి, తండ్రి, మేము మీ పిల్లలము అని పాడుతారు కూడా. కనుక తప్పకుండా పరివారం అయినట్లు. భారత్ లోనే పాడుతారు. అది గతములోని విషయము. ఇప్పుడు వర్తమానంలో మీరు వారి పిల్లలుగా అయ్యారు. దానికోసమే శిక్షణ తీసుకుంటారు. బాబా, మేము మీ శ్రీమతముపై నడుస్తాము, అప్పుడు పాపాలు ఏవైతే ఉన్నాయో అవి యోగబలంతో సమాప్తమైపోతాయి. తండ్రినే పతితపావనుడు, సర్వశక్తివంతుడు అని అంటారు. తండ్రి అయితే ఒక్కరే. తప్పకుండా తల్లి, తండ్రి అని కూడా అంటారు, వారి ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. అర్ధకల్పం మీరు ఎటువంటి వారసత్వాన్ని పొందుతారంటే అక్కడ దుఃఖం యొక్క పేరే ఉండదు. అది ఉన్నదే సుఖధామము. ఎప్పుడైతే దుఃఖధామం యొక్క అంతం జరుగుతందో, అప్పుడే తండ్రి వస్తారు కదా. అది కూడా సంగమ సమయమే అవుతుంది. మీకు తెలుసు, బాబా మనకు రాజయోగాన్ని కూడా నేర్పిస్తారు. దేహీ-అభిమానులుగా తయారుచేసి తమతో పాటు తీసుకువెళ్తారు కూడా. మిమ్మల్ని మనుష్యులేమీ చదివించడం లేదు. ఇక్కడైతే నిరాకార తండ్రి చదివిస్తారు. ఆత్మలైన మీతో మాట్లాడుతున్నారు. ఇందులో సంశయం లేక తికమక చెందే విషయమేమీ లేదు. ఎదురుగా కూర్చుని ఉన్నారు. ఇది కూడా తెలుసు, మనమే దేవతలుగా ఉన్నప్పుడు పవిత్ర ప్రవృత్తి మార్గానికి చెందినవారిగా ఉండేవారము. 84 జన్మల పాత్రను పూర్తి చేసారు. మీరు 84 జన్మలు తీసుకున్నారు. ఆత్మలు మరియు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు… అని పాడుతారు కూడా. సత్యయుగ ఆదిలో మొట్టమొదట దేవీ-దేవతలే ఉంటారు, వారే మళ్ళీ కలియుగ అంతిమంలో పతితులుగా అవుతారు. పూర్తి 84 జన్మలను తీసుకుంటారు. తండ్రి లెక్క కూడా చెప్తారు. సన్యాసుల ధర్మమే వేరు. వృక్షంలో అనేక రకాల ధర్మాలున్నాయి. మొట్టమొదట పునాది అయిన దేవీ-దేవతా ధర్మం ఉంటుంది. మనుష్యులెవ్వరూ ఆ దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేయలేరు. దేవీ-దేవతా ధర్మం ప్రాయః లోపమైపోయింది, ఇప్పుడు మళ్ళీ స్థాపన అవుతూ ఉంది. మళ్ళీ సత్యయుగంలో మీరు మీ ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. ఇది చాలా గొప్ప సంపాదన.

పిల్లలైన మీరు ఇప్పుడు తండ్రి ద్వారా సత్యమైన సంపాదన చేసుకుంటున్నారు, తద్వారా మీరు సత్య ఖండంలో సదా సుఖమయంగా అవుతారు. కావున అటెన్షన్ పెట్టాల్సి ఉంటుంది. తండ్రి ఇళ్ళు-వాకిళ్ళను విడిచిపెట్టమని చెప్పరు. అక్కడ సన్యాసులకైతే వైరాగ్యం కలుగుతుంది. తండ్రి అంటారు, అది తప్పు, దాని ద్వారా సృష్టి యొక్క కళ్యాణమేమీ జరగదు. కానీ ఎంతైనా భారత్ లో ఈ సన్యాసుల ధర్మం మంచిది. భారత్ ను నిలబెట్టేందుకు సన్యాస ధర్మం స్థాపన అవుతుంది ఎందుకంటే దేవతలు వామ మార్గంలోకి వెళ్ళిపోతారు. భవనానికి సగం సమయం పూర్తయిన తర్వాత కొద్దిగా మరమ్మతులు చేయించడం జరుగుతుంది. ఒకటి రెండు సంవత్సరాలలో సున్నాలు వేయడం మొదలైనవి చేస్తారు. కొంతమంది అయితే, లక్ష్మిని ఆహ్వానించాలని భావిస్తారు, కానీ ఎప్పుడైతే శుద్ధంగా ఉంటుందో, వారు అప్పుడే వస్తారు. భక్తి మార్గంలో ధనం తీసుకునేందుకు మహాలక్ష్మిని పూజిస్తారు. జగదంబ వద్ద ఎప్పుడూ ధనాన్ని యాచించరు. ధనం కోసం లక్ష్మి వద్దకు వెళ్తారు. దీపావళి రోజున వ్యాపారస్థులు కూడా రూపాయలను పూజలో పెడతారు. వృద్ధి జరుగుతుందని, మనోకామనలు పూర్తి అవుతాయని భావిస్తారు. జగదంబకు కేవలం మేళా జరుపుతారు. మేళా అంటేనే – ఈ జగత్పితను, జగదంబను కలుసుకునేటువంటి మేళా. ఇది సత్యమైన మేళా, దీని ద్వారా లాభం కలుగుతుంది. ఆ మేళాలలో కూడా చాలా భ్రమిస్తూ ఉంటారు. ఒక్కో చోట పడవలు మునిగిపోతాయి. ఒక్కో చోట బస్సు ప్రమాదాలు జరుగుతాయి. చాలా ఎదురు దెబ్బలు తినవలసి ఉంటుంది. భక్తిలోని మేళాల పట్ల చాలా అభిరుచి ఉంటుంది ఎందుకంటే ఆత్మలు మరియు పరమాత్మ యొక్క మేళా జరుగుతుందని విన్నారు కదా. ఈ మేళా ప్రసిద్ధమైనది, దీనినే మళ్ళీ భక్తి మార్గంలో జరుపుకుంటారు. ఇది రామునికి మరియు రావణునికి మధ్య కాంపిటీషన్. కనుక తండ్రి మంచి రీతిలో అర్థం చేయిస్తారు – మూర్ఛితులవ్వకూడదు. రాముడు మరియు రావణుడు ఇరువురూ సర్వశక్తివంతులే. మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు. చాలామంది అయితే ఘడియ-ఘడియ మాయతో ఓడిపోతూ ఉంటారు. తండ్రి అంటారు, మీరు ఉస్తాదునైన నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఎప్పుడూ ఓడిపోరు. తండ్రి స్మృతితోనే విజయాన్ని పొందుతూ ఉంటారు. జ్ఞానమైతే సెకెండుకు సంబంధించినది. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనేది తండ్రి విస్తారంగా అర్థం చేయిస్తారు. సారంలో పిల్లలైన మీకు బీజము మరియు వృక్షము గురించి తెలుసు. దీనికి కల్పవృక్షము అన్న పేరు కూడా ఉంది. దీని ఆయువు లక్షల సంవత్సరాలైతే ఉండలేదు. ఇది వెరైటీ ధర్మాల వృక్షము, ఒక ధర్మం వారి ముఖ కవళికలు వేరొకరితో కలవవు. పూర్తిగా భిన్నంగా ఉంటారు. ఇస్లాములు మొదలైనవారు ఎంత నల్లగా ఉంటారు, అక్కడ కూడా ధనం చాలా ఉంటుంది. ధనం వెనకైతే అందరూ ఉన్నారు. భారతవాసుల ముఖ కవళికలు పూర్తిగా వేర్వేరుగా ఉన్నాయి. ఇది భిన్నమైన, వెరైటీ ధర్మాల వృక్షము. ఎలా వృద్ధి చెందుతుంది అనేది మీరు అర్థం చేసుకున్నారు, దీనిని మర్రి వృక్షంతో పోల్చడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా చూస్తున్నారు, దీని పునాది సమాప్తమైపోయింది, మిగిలిన ధర్మాలు నిలిచి ఉన్నాయి. దేవీ-దేవతా ధర్మం లేదు. కలకత్తాలో మొత్తం వృక్షమంతా పచ్చగా నిలబడి ఉండడాన్ని మీరు చూస్తారు. దానికి పునాది లేదు. దీనికి కూడా పునాది లేదు, అది స్థాపన అవుతూ ఉంది.

ఇప్పుడు నాటకం పూర్తి అవుతుందని, ఇప్పుడు బాబా వద్దకు తిరిగి వెళ్ళాలని పిల్లలు అర్థం చేసుకున్నారు. మీరు నా వద్దకు వచ్చేస్తారు. ఇది కూడా తెలుసు, కేవలం భారత ఖండం తప్ప ఇతర ఏ ఖండమూ స్వర్గంగా అవ్వలేదు. ప్రాచీన భారత్ అని పాడుతారు కూడా. కానీ గీతలో కృష్ణుని పేరు వేసేసారు. తండ్రి అంటారు, శ్రీకృష్ణుడిని పతిత-పావనుడు అని ఎవ్వరూ అనరు. నిరాకారుడిని అలా భావిస్తారు. కృష్ణుడైతే సత్యయుగ రాకుమారుడు. అవే నామ, రూప, దేశాలతో కృష్ణుడు మళ్ళీ స్వర్గంలోనే వస్తారు. అవే ముఖ కవళికలు మళ్ళీ ఎప్పుడైనా ఉంటాయా ఏమిటి. ఒక్కొక్కరి ముఖ కవళికలు వేర్వేరుగా ఉంటాయి. అందరి కర్మలు కూడా అందరివీ వేర్వేరుగా ఉంటాయి. ఈ అనాది డ్రామా తయారై ఉంది. ప్రతి ఆత్మకు పాత్ర లభించి ఉంది. ఆత్మ అవినాశీ. ఇకపోతే, ఈ శరీరము వినాశీ. ఆత్మనైన నేను ఒక శరీరాన్ని విడిచి మరొకటి తీసుకుంటాను. కానీ ఈ ఆత్మ జ్ఞానం కూడా ఎవ్వరికీ లేదు. తండ్రి వచ్చి కొత్త విషయాలను వినిపిస్తారు, మీరు నా చాలాకాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలు. పిల్లలు కూడా అంటారు, బాబా, మిమ్మల్ని కలిసి 5000 సంవత్సరాలయ్యింది. యోగబలంతో మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు. మొదటి హింస, ఒకరిపై ఒకరు కామ ఖడ్గాన్ని ఉపయోగించడము. ఇది కూడా అర్థం చేయించడం జరిగింది, బాహుబలం యొక్క యుద్ధంతో ఎప్పుడూ ఎవ్వరూ విశ్వానికి యజమానులుగా అవ్వలేరు. యోగబలంతో అలా అవుతారు. కానీ శాస్త్రాలలోనేమో, దేవతలు మరియు అసురుల యుద్ధాన్ని చూపించారు. అటువంటి విషయమే లేదు. ఇక్కడ మీరు తండ్రి ద్వారా యోగబలముతో విజయాన్ని పొందుతారు. తండ్రి విశ్వ రచయిత, కనుక వారు తప్పకుండా కొత్త విశ్వాన్నే రచిస్తారు. లక్ష్మీ-నారాయణులు కొత్త ప్రపంచమైన స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. మనమే స్వర్గానికి యజమానులుగా ఉండేవారము, తర్వాత 84 జన్మలు తీసుకొని పతితులుగా, పైసకు కొరగాని వారిగా అయ్యాము. ఇప్పుడు మీరే పావనంగా అవ్వాలి. భక్తులైతే చాలామంది ఉన్నారు. కానీ ఎక్కువ భక్తి ఎవరు చేసారు? ఎవరైతే వచ్చి బ్రాహ్మణులుగా అవుతారో, వారే ప్రారంభం నుండి మొదలుకొని భక్తి చేసారు. వారే వచ్చి బ్రాహ్మణులుగా అవుతారు. ప్రజాపిత సూక్ష్మవతనంలోనైతే లేరు. బ్రహ్మా అయితే ఇక్కడే కావాలి కదా. వారిలో ప్రవేశిస్తారు. మీకు తెలుసు, ఏ మమ్మా బాబా అయితే ఇక్కడ ఉన్నారో, వారు అక్కడా ఉన్నారు. ఈ విషయాలు బాగా అర్థము చేసుకోవాల్సినవి. ఇలా-ఇలా మీరు సేవ చేయండి అని బాబా డైరెక్షన్లు ఇస్తూ ఉంటారు. పిల్లలు కొత్త-కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఉంటారు. ఎవరైనా ఏ వస్తువునైనా కనుగొంటే, కల్పక్రితము కూడా ఇది కనుగొన్నారు అని అంటారు, తర్వాత దానిని అభివృద్ధి చేయడం జరుగుతుంది. స్వర్గము, నరకము ఉన్న గోళములు ఏవైతే తయారుచేసారో, అవి చాలా బాగున్నాయి. కృష్ణుడు అందరికీ ప్రియమనిపిస్తారు. కానీ వీరే నారాయణుడిగా అవుతారని వారికి తెలియదు, ఇప్పుడిది యుక్తిగా అర్థం చేయించాలి. మీ ఈ గోళమైతే చాలా పెద్దదిగా ఉండాలి. ఇంటి కప్పును తాకేంత పెద్దదిగా ఉండాలి, అందులో నారాయణుడి చిత్రం ఉండాలి, కృష్ణుడిది కూడా ఉండాలి. పెద్ద వస్తువును మనుష్యులు మంచి రీతిలో చూడగలగుతారు. ఏ విధంగానైతే పాండవులవి ఎంత పెద్ద-పెద్ద చిత్రాలు తయారుచేసారు. పాండవులైతే మీరే కదా, కానీ ఇక్కడ అంత పెద్దగా అయితే ఎవ్వరూ లేరు. 6 అడుగుల మనుష్యులు ఎలా ఉంటారో, వారు అలాగే ఉంటారు. సత్యయుగంలో ఎక్కువ ఆయువు ఉంటుంది కావున పొడవాటి శరీరం కలవారు ఉంటారని అనుకోకండి. మనుష్యులు ఎక్కువ పొడుగ్గా ఉన్నా శోభించదు. కావున అర్థం చేయించేందుకు పెద్ద-పెద్ద చిత్రాలు కావాలి. సత్యయుగ చిత్రాన్ని కూడా ఫస్ట్ క్లాస్ గా తయారుచేయాలి. ఇందులో లక్ష్మీ-నారాయణులను, కింద రాధే-కృష్ణులను కూడా చూపించాలి. వీరు రాకుమారుడు-రాకుమార్తె. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. బ్రహ్మా-సరస్వతులే మళ్ళీ లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. మనం బ్రాహ్మణులు నుండి మళ్ళీ దేవతలుగా అవుతాము. మనమే లక్ష్మీ-నారాయణులుగా అవుతాము, మళ్ళీ మనమే సీతా-రాములుగా అవుతాము అని ఇప్పుడు తెలుసు. ఈ విధంగా రాజ్యం చేస్తాము. పిల్లలు కూర్చుని ఇటువంటి చిత్రాలపై ఎవరికైనా అర్థం చేయిస్తే చాలా ఆనందం కలుగుతుంది. ఇది చాలా ఫస్ట్ క్లాస్ జ్ఞానం అని అంటారు. తప్పకుండా హఠయోగులైతే ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. సత్యయుగంలోనైతే పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది. ఇప్పుడు అపవిత్రమైనది ఉంది. తండ్రి తప్ప అనంతమైన వారసత్వాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. బాబా మనకు విశ్వానికి యజమానులుగా తయారుచేసే శిక్షణను ఇస్తున్నారని తెలుసు. దానిని మంచి రీతిలో ధారణ చేయాలి. చదువుతో మనుష్యులు చాలా ఉన్నతులుగా అవుతారు. మీరు కూడా ఇప్పుడు అహల్యలు, కుబ్జలు మొదలైనవారిగా ఉన్నారు. తండ్రి కూర్చుని చదివిస్తారు. ఈ చదువుతో మళ్ళీ మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. జ్ఞాన సాగరుడు కూడా వారే. ఇప్పుడు తండ్రి అంటారు, స్వయాన్ని అశరీరిగా భావించండి. వివస్త్రగా వచ్చాము, మళ్ళీ వివస్త్రగానే వెళ్ళాలి.

మీకు తెలుసు, మన ఈ 84 జన్మల చక్రం ఇప్పుడు పూర్తి అవ్వనున్నది. ఇది చాలా అద్భుతమైనది. ఇంత చిన్న ఆత్మలో ఎంత పెద్ద భారీ పాత్ర నిండి ఉంది. అది కూడా ఎప్పుడూ చెరగనే చెరగదు. దీనికి ఆది లేదు, అంత్యము లేదు. ఇవి ఎంత అద్భుతమైన విషయాలు. ఆత్మలైన మనం 84 జన్మల చక్రంలో తిరుగుతాము, ఇది ఎప్పుడూ అంతమవ్వదు. ఇప్పుడు మనం పురుషార్థం చేస్తున్నాము. వారిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. స్టార్ కే విలువ ఉంటుంది. స్టార్ ఎంత బాగుంటుందో, ధర అంత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ ఒక్క స్టార్ లో ఎంత జ్ఞానం ఉంది. భృకుటి మధ్యలో అద్భుతమైన సితార మెరుస్తుంది అని పాడుతారు కూడా. ఈ అద్భుతం గురించి మీకు తెలుసు. తండ్రి అంటారు, నేను కూడా సితారనే, వారి సాక్షాత్కారము కూడా జరగగలదు. కానీ వారు ఎంతో తేజోమయుడు, అఖండ జ్యోతి, సూర్యుని వలె ఉంటారు అని విన్నారు కదా. కనుక బాబా ఒకవేళ సితార రూపాన్ని చూపిస్తే నమ్మరు. ఈ విధంగా ఎంతోమంది ధ్యానంలోకి వెళ్ళినప్పుడు, ఇటువంటి తేజోమయమైన సాక్షాత్కారము కలిగేది. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, పరమాత్మ సితార వలె ఉన్నారు అని. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సత్యఖండానికి యజమానులుగా అయ్యేందుకు తండ్రి ద్వారా సత్యమైన సంపాదనను చేయాలి. ఉస్తాదు అయిన తండ్రి స్మృతిలో ఉంటూ మాయాజీతులుగా అవ్వాలి.

2. తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు, తండ్రి ద్వారా ఏవైతే శిక్షణలు లభిస్తాయో, వాటి పట్ల పూర్తి శ్రద్ధ ఉంచాలి. ఆ శిక్షణలను మంచి రీతిలో ధారణ చేయాలి.

వరదానము:-

మహాన్ ఆత్మలు ఎవరైతే ఉంటారో, వారు సదా ఉన్నతమైన స్థితిలో ఉంటారు. ఉన్నతమైన స్థితే ఉన్నతమైన ఆసనము. ఎప్పుడైతే ఉన్నతమైన స్థితి అనే ఆసనంపై ఉంటారో, అప్పుడు మాయ రాలేదు. మాయ మిమ్మల్ని మహానులుగా భావించి మీ ఎదురుగా తల వంచుతుంది, దాడి చేయదు, ఓటమిని స్వీకరిస్తుంది. ఎప్పుడైతే ఉన్నతమైన ఆసనం నుండి కిందకు వస్తారో, అప్పుడు మాయ దాడి చేస్తుంది. మీరు సదా ఉన్నతమైన ఆసనంపై ఉన్నట్లయితే మాయకు వచ్చేందుకు శక్తి ఉండదు. అది పైకి ఎక్కలేదు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top