26 March 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

March 25, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడు అనంతమైన రాత్రి పూర్తి అవుతుంది, పగలు రానున్నది, తిరిగి ఇంటికి వెళ్ళాలి, అందుకే ఇప్పుడు ఇటు-అటు భ్రమించడము ఆపి వేయండి’’

ప్రశ్న: -

ఏ అభ్యాసం యొక్క ఆధారంపైన పిల్లలైన మీరు మంచి రీతిలో సేవ చేయగలరు?

జవాబు:-

ఒకవేళ తక్కువలో తక్కువ 8 గంటల వరకు స్మృతి నిలిచి ఉండేటువంటి ఈ అభ్యాసం అయినట్లయితే సేవ చాలా మంచి రీతిలో చేయగలరు ఎందుకంటే స్మృతితోనే మొత్తం విశ్వంలో పవిత్రత మరియు శాంతి యొక్క వైబ్రేషన్లు వ్యాపిస్తాయి. స్మృతితోనే వికర్మలు కూడా వినాశనమవుతాయి మరియు పదవి కూడా ఉన్నతమైనది లభిస్తుంది, అందుకే ఈ ఆత్మిక యాత్రలో ఎప్పుడూ కూడా అలసిపోకూడదు. దేహ భానాన్ని విడిచి దేహీ-అభిమానిగా అయ్యే నిరంతర అభ్యాసం చేస్తూ ఉండాలి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఓ రాత్రి ప్రయాణీకుడా, అలసిపోకు… (రాత్ కే రాహీ థక్ మత్ జానా…)

ఓంశాంతి. పిల్లలు సావధానాన్ని విన్నారు. ఓ రాత్రి ప్రయాణీకుడా, అని తండ్రి పిల్లలకు సావధానపరిచారు ఎందుకంటే ఇప్పుడు మీ కోసం పగలు రానున్నది. ఇది అనంతమైన రాత్రి మరియు పగలు. అనంతమైన రాత్రి పూర్తి అవుతుంది మరియు అనంతమైన పగలు యొక్క స్థాపన జరుగుతుంది. ఇప్పుడు పిల్లలైన (ఆత్మలైన) మీరు తమ ఇంటికి వెళ్ళా్లి. దానికోసమే మీరు అర్ధకల్పము భక్తి చేసారు, కానీ మీరు తండ్రిని వెతకలేకపోయారు ఎందుకంటే వారి నామ-రూపాలను మార్చివేసారు. ఇప్పుడు మీకు తెలుసు, తండ్రి పగలులోకి అనగా కలియుగం నుండి సత్యయుగంలోకి వెళ్ళడానికి మార్గాన్ని చెప్తున్నారు. ఎవరైతే వికారాల ద్వారా జన్మ తీసుకుంటారో, వారిని భ్రష్టాచారులు అని అనడం జరుగుతుందని బాబా అర్థం చేయించారు. భారతవాసులు తండ్రిని మర్చిపోయారు, గీతా భగవంతుడు నిరాకారుడు, వారికి బదులుగా సాకార కృష్ణుడి పేరును వేసేసారు. ఇది అన్నింటికన్నా పెద్ద పొరపాటు. ఈ కారణంగా అర్ధకల్పము దుఃఖం అనుభవించాల్సి వచ్చింది. దుఃఖాన్ని అనుభవింపజేయడానికి ఈ పొరపాటు నిమిత్తంగా అయ్యింది. భక్తి మార్గంలో భ్రమిస్తూ ఉంటారు. ఇది కూడా డ్రామా యొక్క పాత్ర రచింపబడి ఉంది. ఒకవేళ తండ్రిని తెలుసుకున్నట్లయితే భ్రమించాల్సిన అవసరం లేదు. మీరిప్పుడు తండ్రిని తెలుసుకున్నారు. శ్రీకృష్ణుడు ఒకవేళ అదే రూపంలో వచ్చినట్లయితే, అప్పుడు వారిని గుర్తించడంలో ఎటువంటి కష్టమూ ఉండదు. వెంటనే అందరూ తెలుసుకుంటారు. కానీ వీరైతే ఎంత గుప్తంగా ఉన్నారంటే, పిల్లలైన మీరు కూడా మర్చిపోతారు. కృష్ణుడినైతే ఎవ్వరూ మర్చిపోలేరు. మొత్తం ప్రపంచమంతా ఒక్కసారిగా అతుక్కుపోతారు. శ్రీకృష్ణుడు మమ్మల్ని స్వర్గానికి తీసుకువెళ్తారని భావిస్తారు ఎందుకంటే వారైతే స్వర్గానికి యజమాని. వారిని ఎవ్వరూ వదలనే వదలరు. కానీ అర్థం చేయించడానికి చాలా యుక్తి కావాలి. ఒకవేళ అర్థం చేయించే యుక్తి రాకపోయినట్లయితే, అక్కడక్కడ డిస్ సర్వీస్ చేసేస్తారు ఎందుకంటే ఎవరికైనా మంచి రీతిలో నిరూపించి ఆ లెక్కలను తెలియజేయగలిగేందుకు స్వయమే పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఈ సమయంలో అందరూ పతితులుగా ఉన్నారు. పతిత-పావన సీతా రామా, అని పాడుతారు కూడా. కానీ పావనంగా తయారుచేసేది ఎవరు అన్నది ఎవ్వరికీ తెలియదు. గీతా భగవంతుడు కృష్ణుడు అని భావించారు. రాముడికైతే ఏ శాస్త్రామూ లేదు. రామాయణం రామచంద్రుని శాస్త్రమేమీ కాదు. క్షత్రియ ధర్మాన్ని రాముడేమీ స్థాపన చేయలేదు. బ్రాహ్మణ, దేవతా మరియు క్షత్రియ, మూడు ధర్మాలను ఒకేసారి శివబాబా స్థాపన చేస్తారు. విషయాన్ని అర్థం చేసుకునేవారు మీలో కూడా కొద్దిమందే ఉన్నారు. రాజు-రాణి అయితే ఒక్కరే ఉంటారు. ఇకపోతే, ప్రజలు మరియు దాస-దాసీలుగా అనేకమంది అవుతారు. ఒకప్పుడు రాజుల వద్ద చాలామంది దాస-దాసీలు ఉండేవారు, కొందరు ఆహ్లాదపరిచేందుకు, కొందరు నాట్యం చేసేందుకు. నాట్యంపై అభిరుచి అక్కడ కూడా ఎంతగానో ఉంటుంది. ఇకపోతే, రాజు-రాణులుగా చాలా కొద్దిమందే వెలువడుతారు. ఎవరైతే మంచి రీతిలో అర్థం చేసుకొని, అర్థం చేయించగల్గుతారో, వారే అవుతారు. ఎవరెవరు మంచి రీతిలో అర్థం చేయించగలరో, ప్రదర్శినీ సేవలో తెలిసిపోతుంది. భగవంతుడిని తెలుసుకోని కారణంగా సర్వవ్యాపి అనేసారు అని మొట్టమొదట ఈ విషయాన్ని అర్థం చేయించాలి. రెండవది, కృష్ణుడిని భగవంతుడు అని అనడంతో స్వర్గాన్ని రచించేటువంటి శివబాబా పేరును మాయం చేసారు. నిరాకార తండ్రే అందరి రచయిత. వారొక్కరినే స్మృతి చేయాలి. వారే రాజయోగాన్ని నేర్పిస్తారు. కానీ గీతలో ఏదైతే కృష్ణ భగవానువాచ అని రాసారో, దాని కారణంగానే చేతిలో గీతను పట్టుకొని అసత్య ప్రమాణాలు తీసుకుంటారు. ఇప్పుడు చెప్పండి, శ్రీకృష్ణుడు ఏమైనా అన్ని చోట్ల వ్యాపించి ఉన్నారా లేక నిరాకార పరమాత్మ అన్ని చోట్ల వ్యాపించి ఉన్నారా? అందరూ తికమక చెంది ఉన్నారు.

ఇప్పుడు పిల్లలైన మీరు ఉదయాన్నే లేచి అర్థం చేయించేందుకు అభ్యాసం చేయాలి. (జనక మహారాజు యొక్క ఉదాహరణ) అష్టావక్రుడు జనకునికి జ్ఞానాన్ని ఇచ్చారని అంటారు! కానీ ఇదేమీ బ్రహ్మ జ్ఞానమైతే కాదు, ఇది బ్రహ్మా జ్ఞానము. బ్రహ్మాకుమారీలు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు. బ్రహ్మాకుమారీలు కాదు. వారైతే బ్రహ్మ తత్వాన్ని ఈశ్వరుడని భావిస్తారు, కానీ అలా కాదు. ఈశ్వరుడైతే తండ్రి. తండ్రి యొక్క పేరే ఉంది శివ. బ్రహ్మమైతే తత్వము. ఈ విషయాలన్నింటినీ మందబుద్ధి కలవారు అర్థం చేసుకోలేరు. నంబరువారుగా దాస-దాసీలుగా కూడా అవుతారు. ఒకవేళ ఎవరికైనా మనం మంచి రీతిలో అర్థం చేయించలేకపోతే మన పాత్ర చివర్లో ఉందని అర్థం చేసుకోవాలి, కావున పురుషార్థం చేయాలి. మొత్తం ప్రపంచంలో ఏదైతే నేర్పిస్తారో, దానిని దేహాభిమానంతోనే నేర్పిస్తారు. బ్రాహ్మణులైన మీరు తప్ప ఇంకెవ్వరూ దేహీ-అభిమానులుగా లేరు. మీలో కూడా ఆత్మాభిమానిగా అయ్యేవారు నంబరువారుగా ఉన్నారు. మేము ఆత్మలకు వినిపిస్తున్నాము. ఆత్మ ఈ ఇంద్రియాల ద్వారా మాట్లాడుతుంది. నేను వినలేను, నా ఇంద్రియాలు పాడైపోయాయి అని ఆత్మనే అంటుంది. కావున దేహీ-అభిమానిగా అవ్వడంలో శ్రమ ఉంది. సత్యయుగంలో దేహీ-అభిమానిగా ఉంటారు. ఇకపోతే, పరమాత్మ జ్ఞానం ఉండదు. తండ్రి అంటారు, అక్కడ నా స్మరణ ఎవ్వరూ చేయరు, అక్కడ అవసరమే లేదు. స్మరణ లేక స్మృతి రెండూ ఒక్కటే. వారు మాలను చేతిలోకి తీసుకుంటారు, నోటితో రామ-రామ అని అంటారు. ఇక్కడైతే రామ అన్న పదం అనడం కూడా తప్పే అవుతుంది. శివబాబా అన్నది సరైన పదము. కానీ శివ శివ అని కూడా అనకూడదు. తండ్రిని స్మృతి చేయడం కోసం పేరును ఏమైనా తీసుకోవడం జరుగుతుందా. తండ్రిని స్మృతి చేయడము – ఇది యాత్ర. దైహిక యాత్రకు వెళ్ళినప్పుడు కూడా, మేము అమరనాథ్ కు వెళ్తున్నాము అని గుర్తు పెట్టుకుంటారు. ఆ పేరైతే తీసుకోవలసి ఉంటుంది కదా. మీరు ఏదీ జపించకూడదు. మీరు తెలుసుకున్నారు – నాటకం పూర్తి అవ్వనున్నది, మా 84 జన్మలు పూర్తయ్యాయి. ఈ పాత వస్త్రాన్ని విడిచిపెట్టాలి. పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ పతితంగా అవ్వాల్సిందే. తండ్రి అంటారు – ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షం ఏదైతే ఉందో, దాని కాండం కుళ్ళిపోయింది. ఇకపోతే, కొమ్మలు, రెమ్మలు మిగిలి ఉన్నాయి. ఇవి కూడా తమోప్రధానంగా అయిపోయాయి. వృక్షం యొక్క ఆయువు ఇప్పుడు పూర్తి అయ్యింది. మళ్ళీ నాటకం రిపీట్ అవ్వవలసి ఉంది. ప్రతి ఒక్కరూ తమ-తమ పాత్రను అభినయిస్తారు. ఇంకొక ప్రపంచమేదీ లేదు. ఒకవేళ ఉన్నట్లయితే మనం ఎందుకు చదువుతాము? బాబా, మళ్ళీ వచ్చి రాజయోగాన్ని నేర్పించండి, గీతా జ్ఞానాన్ని వినిపించండి, పావనంగా తయారుచేయండి అని అంటారు. కానీ మనం పతితులుగా ఎలా అయ్యాము అన్నది ఎవ్వరికీ తెలియదు. మేమే పావనంగా ఉండేవారము అని ఇప్పుడు మీకు తెలుసు. మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుంది.

ఇప్పుడు తండ్రి అంటారు, తిరిగి ఇంటికి వెళ్ళా్లి. ఇంట్లోనైతే తండ్రే ఉంటారు. పరంధామంలో ఉంటారని అంటారు కానీ మర్చిపోతారు. ఆత్మలు కూడా బ్రహ్మాండంలో ఉంటాయి. ఇది సృష్టి, ఇందులో మనుష్యులుంటారు. బ్రహ్మాండంలో ఆత్మలుంటాయి, తర్వాత ఇక్కడకు పాత్రను అభినయించడానికి వస్తాయి. పైన ఆకాశ తత్వముంది. అందరి కాళ్ళు భూమిపై ఉన్నాయి. మరి శరీరం ఎక్కడుంది? అది ఆకాశ తత్వంలోనే ఉంది. బ్రహ్మాండంలోనైతే ఆత్మలు నక్షత్రాల వలె ఉంటాయి. మనం పడిపోతాము అనుకోవడానికి అక్కడ పడిపోయే వస్తువేదీ ఉండదు. సైన్సువారు చుట్టూ తిరిగేందుకు రాకెట్ లో వెళ్తారు, మళ్ళీ దాని నుండి బయటకు కూడా వస్తారు. వారు రాస్తారు కూడా, పడిపోయే భయం ఉండదు, మనుష్యులు ఆకాశ తత్వంలో నిలవగలిగేంతటి ఆకర్షణ ఉంటుంది అని. అటువంటప్పుడు ఇంత చిన్న ఆత్మ మహాతత్వంలో ఎందుకు నిలవలేదు. నివసించే స్థానం అదే, ఈ సూర్యుడు, చంద్రుడు నక్షత్రాలు చాలా పెద్దవి. అవి ఎలా నిలిచి ఉన్నాయి. తాడు మొదలైనవైతే ఏవీ లేవు. ఇదంతా డ్రామా తయారై ఉంది. మనం 84 జన్మల చక్రంలోకి వస్తాము. ఇది వృక్షము. ఎంత పెద్ద కొమ్మలు, రెమ్మలు ఉన్నాయి. మిగిలిన చిన్న-చిన్న శాఖలను ఏమైనా చూడగలరా. బాబా కూడా సారంలో అర్థం చేయిస్తారు, ఎవరైతే తర్వాత వస్తారో, వారు తప్పకుండా కొన్ని జన్మలే తీసుకుంటారు. ఇకపోతే, ఒక్కొక్కరి లెక్కను చెప్పరు. బ్రహ్మా ద్వారా బ్రాహ్మణ, దేవత, క్షత్రియ ధర్మాల స్థాపన జరుగుతూ ఉందని మీకు తెలుసు. ఎవరి ద్వారానైతే స్థాపన జరిగిందో, వారే మళ్ళీ పాలన చేయాలి. బ్రహ్మా, విష్ణు, శంకరులు ముగ్గురు దేవతలు వేర్వేరు. అంతేకానీ, బ్రహ్మాకు 3 ముఖాలున్నాయని కాదు. అలా ఉండజాలదు. తండ్రి అంటారు – పిల్లలూ, మీరు పూర్తిగా తెలివితక్కువవారిగా అయిపోయారు. తండ్రి వచ్చి తెలివైనవారిగా తయారుచేస్తారు. ఇప్పుడు సీతలైన మీరంతా రావణుడి జైలులో ఉన్నారు. మీరే కోతులుగా ఉండేవారు, మీ సైన్యాన్నే తీసుకున్నారు. మిమ్మల్నే మందిర యోగ్యంగా తయారుచేసారు. ఇప్పుడు రాజధాని స్థాపన అవుతుంది, ఎవరు ఎంతగా శ్రీమతంపై నడుస్తారో, అంతగానే ఉన్నత పదవిని పొందుతారు. మన మమ్మా-బాబా నంబరువన్ లో వెళ్తారని మీకు తెలుసు. స్థూలవతనంలో మీ ఎదురుగా కూర్చున్నారు. సూక్ష్మవతనంలో కూడా కూర్చుని ఉండడము చూస్తారు, మళ్ళీ వైకుంఠంలో కూడా చూస్తారు. మొదట చాలామందికి సాక్షాత్కారాలు చేయించడం జరిగింది, అయితే, అందరూ కృష్ణుడిగా ఏమైనా అయిపోతారా. పురుషార్థం చేయించేందుకు బాల్య-లీలలు మొదలైనవి చూపించడం జరుగుతుంది. పురుషార్థం లేకుండా మహారాజ-మహారాణిగా అయితే అవ్వరు. ఎవరైతే పక్కా నిశ్చయబుద్ధి కలవారిగా ఉంటారో, వారు పూర్తిగా నిలిచిపోతారు. బాబా, మేమైతే మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టము. చాలామంది ఇలా అంటూ-అంటూ తర్వాత విడిచిపెట్టేస్తారు కూడా. ఆశ్చర్యవంతులై వింటారు, వర్ణిస్తారు, పారిపోతారు. ఇది ఒకప్పటి సామెత. ఇప్పుడు కూడా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కల్పక్రితము కూడా ఇలా పారిపోయారని అంటారు, ఎవ్వరి శ్వాసపై భరోసా లేదో, అలాగే ఎవ్వరిపైనా భరోసా లేదు. బాబాకు చెందినవారిగా అయ్యి మళ్ళీ మరణిస్తారు. ఈశ్వరీయ జన్మ దినాన్ని జరుపుకొని కూడా మరణిస్తారు అనగా చేతిని విడిచిపెట్టేస్తారు. బాబా ఘడియ-ఘడియ చెప్తూ ఉంటారు, మీరు ఏమని భావించండి అంటే, మేము ఇప్పుడు మా మధురమైన ఇంటికి వెళ్ళాలి, అందుకే తండ్రి మరియు ఇల్లు గుర్తుకొస్తాయి. భక్తి మార్గంలో కూడా అర్ధ కల్పము స్మృతి చేసారు. కానీ ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. అసలు తెలియనే తెలియనప్పుడు ఎలా వెళ్ళగలరు. వారు ఆత్మిక యాత్రికులుగా ఎలా అవ్వగలరు! మీరిప్పుడు పూర్తి యాత్రికులుగా అయ్యారు. ఎవరైతే ఎక్కువగా స్మృతి చేస్తారో, వారి పాపాలు కట్ అవుతూ ఉంటాయి. యాత్రపై కూడా అటెన్షన్ పెట్టాలి. చివర్లో 8 గంటలు మీ ఈ సేవ ఉన్నట్లయితే చాలా మంచిది. ఇది శాంతి మరియు పవిత్రత వైబ్రేషన్లను వ్యాపింపజేయడము. స్మృతితో వికర్మలు కూడా వినాశనమవుతాయి మరియు పదవి కూడా ఉన్నతమైనది లభిస్తుంది, అందుకే అనడం జరుగుతుంది – రాత్రి ప్రయాణికుడా, అలసిపోకు అని. కలియుగాంతము అనగా బ్రహ్మా రాత్రి పూర్తి అవ్వడము. అందరూ తప్పకుండా తిరిగి వెళ్ళనున్నారు. ఆత్మిక ఇంటిని స్మృతి చేయాలి. ఆత్మ ఇప్పుడు వెళ్ళా్లి. శరీర భానాన్ని విడిచిపెట్టాలి. దేహీ-అభిమానిగా అవ్వాలి. ఇదే స్మృతి యాత్ర. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి చేతిని ఎప్పుడూ విడిచిపెట్టము అని పక్కా నిశ్చయబుద్ధిగా అయి దృఢ సంకల్పం చేయాలి. తండ్రిని మరియు ఇంటిని ఘడియ-ఘడియ సృతి చేయాలి.

2. దేహీ-అభిమానులుగా అయ్యేందుకు శ్రమ చేయాలి. 5 వికారాల రూపీ రావణుడి జైలు నుండి విడుదలయ్యేందుకు శ్రీమతంపై నడుచుకోవాలి. మందిర యోగ్యులుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి.

వరదానము:-

ఎవరైతే జ్ఞాన స్వరూప యోగీ ఆత్మలో, వారు సదా సర్వ శక్తుల అనుభూతిని చేస్తూ విజయులుగా అవుతారు. ఎవరైతే కేవలం స్నేహీ లేక భావనా స్వరూపులో, వారి మనసు మరియు నోటిలో సదా బాబా-బాబా అనే ఉంటుంది, అందుకే ఎప్పటికప్పుడు సహయోగం లభిస్తుంది. కానీ సమానంగా అవ్వడంలో జ్ఞానీ-యోగి ఆత్మలే సమీపులు, అందుకే ఎంత భావన ఉందో, అంత జ్ఞాన స్వరూపులుగా ఉండాలి. జ్ఞాన యుక్త భావన మరియు స్నేహ సంపన్న యోగము – ఈ రెండింటి బ్యాలెన్స్ ఎగిరే కళ యొక్క అనుభవం చేయిస్తూ తండ్రి సమానంగా తయారుచేస్తుంది.

స్లోగన్:-

మాతేశ్వరిగారి అమూల్యమైన మహా వాక్యాలు – ఓం శివోహమ్హమ్ సో, సో హమ్  ఈ పదాల యథార్థమైన అర్థము

ఓం శాంతి, ఈ పదాలు ఏవైతే ఉచ్చరిస్తారో, హమ్ సో, సో హమ్, శివోహమ్, అహమ్ ఆత్మ సో పరమాత్మ, ఇప్పుడు ఈ మహా వాక్యాలను ఎవరు ఉచ్ఛరిస్తారు మరియు ఈ పదాల యొక్క యథార్థమైన అర్థం ఏమిటి? ఎప్పుడైతే ఓం అన్న పదం అంటారో, అప్పుడు, ఓం యొక్క అర్థము, నేను ఆత్మ శాంత స్వరూపాన్ని, ఈ నిశ్చయం ఏర్పడినప్పుడు, ఆత్మనైన నేనే పరమాత్మను, అన్న ఈ పదాలను అనలేరు. అప్పుడు నేను ఆత్మ, పరమాత్మ సంతానాన్ని అని ఈ విధంగానే భావిస్తారు, కావున ఈ ఓం అన్న పదాన్ని అనడము ఆత్మల యొక్క అధికారము. మళ్ళీ ఎప్పుడైతే హమ్ సో, సో హమ్ అన్న పదాలను అంటారో, మేమే పూజ్యులము, మేమే ఇప్పుడు పూజారులుగా అయ్యాము అన్నది ఈ పదాలకు అర్థము. హమ్ సో పూజ్య, ఇప్పుడు ఈ పదాన్ని కూడా ఆత్మనే అనగలదు. అహమ్ ఆత్మ సో పరమాత్మ అని మనుష్యులు ఏదైతే అంటారో, ఇప్పుడు ఈ పదాలను కేవలం పరమాత్మనే అనగలరు ఎందుకంటే ఆ ఆత్మ ఒక్కరే పరమ ఆత్మ, మళ్ళీ శివోహమ్ అన్న పదాన్ని ఏదైతే అంటారో, అది కూడా పరమాత్మనే అనగలరు ఎందుకంటే వారు శివ. కనుక ఎప్పుడైతే పరమాత్మ వచ్చి ఈ జ్ఞానాన్ని ఇస్తారో, అప్పుడు ఈ పదాల యొక్క అర్థాన్ని కూడా తెలుసుకుంటాము, ఇకపోతే, ఇతర ధర్మాల వారికి, క్రిస్టియన్లు మొదలైనవారికి మేమే పోప్ గా అవుతాము అన్నది తెలియదు. వారికి ఈ జ్ఞానమే లేదు. ఇప్పుడు మనకు ఈ జ్ఞానం లభించింది, మేమే దేవతగా అవుతాము అని, మన ఎదురుగా దేవతల సృతి చిహ్నాలైన చిత్రాలు ఉన్నాయి మరియు దానితో పాటు వారి జీవిత చరిత్ర హిస్టరీ, గీత, భాగవతాలు ఎదురుగా ఉన్నాయి ఎందుకంటే మనం ఆది నుండి అంతిమం వరకు మొత్తం కల్పం యొక్క చక్రంలో ఉన్నాము మరియు ఆ ధర్మ పితలు ఎప్పుడైతే వస్తారో, వారు కల్పం మధ్యలో వస్తారు, అందుకే వారు హమ్ సో అన్న పదాన్ని అనలేరు, ఓం పదాన్ని అనగలరు. అచ్ఛా – ఓం శాంతి.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top