26 June 2021 TELUGU Murli Today | Brahma Kumaris

26 june 2021 Read and Listen today’s Gyan Murli in Telugu 

June 25, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - తండ్రి శ్రీమతమేమిటంటే - ఈ పాత ప్రపంచం నుండి మీ ముఖాన్ని తిప్పేసుకోండి, జీవన్ముక్తి కోసం దైవీ మ్యానర్స్ ను ధారణ చేయండి”

ప్రశ్న: -

ఏ మ్యానర్స్ ను తండ్రి తప్ప ఇంకెవ్వరూ నేర్పించలేరు?

జవాబు:-

పవిత్రంగా అవ్వడము మరియు ఇతరులను పవిత్రంగా తయారుచేయడము – ఇవి అన్నింటికన్నా గొప్ప దైవీ మ్యానర్స్. మీరు గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఉండండి, ఈ శిక్షణ ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు, ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. పిల్లలైన మీది అనంతమైన సన్యాసము. మీరు బుద్ధి ద్వారా ఈ పాత ప్రపంచాన్నే మర్చిపోతారు. పవిత్రత యొక్క ధారణతో మిగిలిన మ్యానర్స్ అన్నీ స్వతహాగా వస్తాయని మీకు తెలుసు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నేటి మానవులైన మనము అంధకారంలో ఉన్నాము….. (ఆజ్ అంధేరే మే హై ఇన్సాన్….. )

ఓంశాంతి. పిల్లలు పాటలోని ఒక లైన్ ను విన్నారు. ఒక వైపు – ప్రపంచమంతా ఉంది, భక్తి మార్గం వారు ఉన్నారు మరియు ఇంకొక వైపు – జ్ఞాన మార్గంలో ఉన్న పిల్లలైన మీరు ఉన్నారు. వారు భక్తి యొక్క మెట్లు ఎక్కుతూ ఉంటారు మరియు పిల్లలైన మీరు జ్ఞానం యొక్క మెట్లు ఎక్కుతారు, భక్తి యొక్క మెట్లు దిగుతారు. అర్ధకల్పం నుండి భక్తి యొక్క మెట్లు ఎక్కవలసి ఉంటుందని పిల్లలకు తెలుసు. భక్తి కూడా ముందు అవ్యభిచారిగా ఉంటుంది, తర్వాత వ్యభిచారిగా అవుతుంది. పూర్తిగా అంధశ్రద్ధలో చిక్కుకుపోతారు. ఏమీ అర్థం చేసుకోరు. మేము అంధకారంలో ఉన్నాము, సద్గురువు లేకపోతే భయంకరమైన అంధకారమని పాడుతారు కూడా. ఇక్కడైతే చాలామంది గురువులు ఉన్నారు. ఇప్పుడు సత్యమైన గురువు ఎవరు? సాధు-సత్పురుషులు, మహాత్ములు, భక్తులు మొదలైనవారంతా సాధన చేస్తారు అనగా స్మృతి చేస్తారు. శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు మొదలైనవి చదువుతారు, అయినా కూడా, భగవంతుడు వచ్చినప్పుడే మాకు సద్గతినిస్తారని అంటారు. సద్గతిదాతనే పతితపావనుడని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు భయంకరమైన అంధకారంలో లేరు. మీరు జ్ఞాన ప్రకాశంలోకి వచ్చారు. పతితపావనుడైన తండ్రిని తెలుసుకున్నారు మరియు వారిని స్మృతి చేస్తారు. పిల్లల్లో ఎవరు ఎంతగా స్మృతి చేస్తారో మరియు జ్ఞాన ధారణను చేస్తారో, అంతగా వారి అజ్ఞాన అంధకారం వినాశనమవుతుంది. ఇప్పుడు ప్రకాశంలోకి తీసుకువెళ్ళేవారు ఒక్క తండ్రి మాత్రమే. జ్ఞాన అంజనాన్ని సద్గురువు ఇచ్చారు….. అదేమీ కాటుక కాదు. ఇది జ్ఞానానికి సంబంధించిన విషయము. జ్ఞానంతో పాటు యోగం కూడా ఉంటుంది. వాస్తవానికి ఏ మనుష్యులైతే భక్తి నేర్పిస్తారో వారితో కూడా యోగముంటుంది. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధియోగం నిరాకార పరమపిత పరమాత్మతో జోడించబడి ఉంది. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. పిల్లలైన మీకు తప్ప ఇతర మనుష్యమాత్రులెవ్వరికీ సర్వశక్తివంతుడైన పరమపిత పరమాత్మునితో యోగం లేదు. మీరు తండ్రితో మరియు ముక్తి, జీవన్ముక్తిధామాలతో యోగం జోడించవలసి ఉంటుంది. జీవన్ముక్తి కోసం దైవీ మ్యానర్స్ కూడా చాలా బాగుండాలి. ఈ సమయంలో అందరి మ్యానర్స్ ఆసురీగా ఉన్నాయి. పరమపిత పరమాత్ముని గుణాలు కూడా మహిమ చేయబడతాయి కదా. వారు మనుష్య సృష్టికి బీజరూపుడు, సత్యమైనవారు, చైతన్యమైనవారు, ఆనంద సాగరుడు, జ్ఞాన సాగరుడు. వారు సదా పవిత్రతా సాగరుడు. వారి ఈ పదవి అవినాశీ అయినది, ఇతర మనుష్యులెవరికీ ఈ అవినాశీ పదవి ఉండదు. ఇప్పుడు మీరు జ్ఞాన సాగరులుగా, పవిత్రతా సాగరులుగా అవుతారు కానీ లిమిటెడ్ గా అవుతారు. తండ్రి అంటారు – నేను అన్ లిమిటెడ్ (అనంతమును). మిమ్మల్ని అన్ లిమిటెడ్ గా (అనంతంగా) తయారుచేయలేను. లేదంటే సృష్టి ఆట ఎలా నడుస్తుంది? 84 జన్మలను ఎలా అనుభవిస్తారు? మీరు సదా కోసం అవ్వలేరు. మిమ్మల్ని లిమిటెడ్ గా తయారుచేస్తాను, మీరు 21 జన్మల కోసం తయారవుతారు. 21 తరాలు అని కూడా రాసి ఉంది. మీరు సదా కోసం అవ్వడమనే నియమం ఈ డ్రామాలో లేదు. నేను అయితే సదా పవిత్రుడను. నేను ఉండడం కూడా పరంధామంలో ఉంటాను. నా వద్ద జ్ఞానం, పవిత్రత మొదలైనవి ఎలాగూ ఉన్నాయి. మీరు మర్చిపోతారు, అందుకే ఈ సమయంలో తండ్రి వచ్చి పిల్లలను భయంకరమైన అంధకారం నుండి బయటకు తీసి జ్ఞానం మరియు యోగంతో పవిత్రంగా చేస్తారు. నేను పరంధామం నుండి వచ్చాను, ఇప్పుడు నన్ను స్మృతి చేయండి అని ఇతరులెవ్వరూ అనలేరు. నా ఈ మహావాక్యాలను ఎవరూ కాపీ చేయలేరు. నేను పిల్లలైన మిమ్మల్ని 21 జన్మలకు రాజులకే రాజుగా తయారుచేయడానికి వచ్చాను కావున అలా తయారవ్వాలి కదా. ఎవరైతే కల్పక్రితం తయారయ్యారో, వారే తయారవుతారు.

ఎంతమంది పిల్లలు పవిత్రంగా అవుతారు, ఎంతమంది అజామిళుడు వంటి పాపాత్ములుగా అవుతారు అనేది మీకు తెలుసు. ఎంతమంది అశుద్ధంగా, మలినంగా అవుతారు. తండ్రికి మురికి పట్టిన వస్త్రాలను వచ్చి శుభ్రం చేయవలసి ఉంటుంది. ఆత్మయే మలినంగా అవుతుంది. తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తారు – మాయ మిమ్మల్ని ఎంత మలినంగా చేసింది, కేవలం ఈ ఒక్క జన్మ విషయం కాదు, ఇది జన్మ జన్మల విషయము. ఆత్మను శుభ్రం చేసుకునేందుకు లక్ష్యం అనే సబ్బును ఇస్తాను. నన్ను స్మృతి చేసినట్లయితే, ఆరిపోయిన మీ ఆత్మ, ఈ యోగంతో వెలుగుతుంది – తండ్రినైన నన్ను ఎంతెంతగా స్మృతి చేస్తూ ఉంటారో, అంతగా వెలుగుతుంది. తండ్రి స్మృతినిప్పిస్తున్నారు – నేను మిమ్మల్ని స్వర్గంలోకి పంపించాను, తర్వాత మాయ మలినంగా చేసేసింది, ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేయడానికి నేను వచ్చాను. నేను ఈ బ్రహ్మా తనువు ద్వారా శిక్షణనిస్తున్నాను. ఆత్మలతో మాట్లాడుతారు – ఓ పిల్లలూ, లౌకిక తండ్రిని మర్చిపోండి. దేహ సహితంగా దేహ సంబంధీకులందరినీ మరచి తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీ ఆత్మ శుభ్రమవుతూ ఉంటుంది. తర్వాత భవిష్యత్తులో మీకు శరీరం కూడా కొత్తది లభిస్తుంది. తత్వాలు మొదలైనవన్నీ కొత్తగా, సతోప్రధానంగా అవుతాయి. తండ్రి అంటారు – ఇప్పుడు ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోతూ వెళ్ళండి. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు నా వద్దకు వచ్చి, తర్వాత స్వర్గంలోకి వెళ్తారు. ఇది పాత ప్రపంచము. ఇక్కడ ఏదైనా వస్తువును తయారు చేసినప్పుడు, దానికి కొత్త పేరు పెడతారు. ఉదాహరణకు కొత్త ఢిల్లీ, పాత ఢిల్లీ అని అంటారు కానీ ప్రపంచమైతే పాతదే కదా. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ పాత ప్రపంచం నుండి పూర్తి బుద్ధియోగం తొలగిపోవాలి. ఆత్మలైన మనది స్వీట్ హోమ్ లేక నిర్వాణధామము, అక్కడకు వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాల్సి ఉంటుంది. నన్ను స్మృతి చేసినట్లయితే, అంతమతి సో గతి ఏర్పడుతుంది (అంతిమ సమయంలో ఎటువంటి ఆలోచనలతో చనిపోతారో, అలాంటి గతి లభిస్తుంది) అని తండ్రి అంటారు. మనుష్యులు అనేక మందిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది గురువులను, కొంతమంది కృష్ణుడిని గుర్తు చేసుకుంటారు. కృష్ణుడు మొదలైనవారు ఎక్కడకు వెళ్ళారు? ఇది ఎవరికీ తెలియదు. అందరూ పునర్జన్మల్లోకి రావాల్సిందేనని అర్థం చేసుకోరు. ఈ పద్ధతి సృష్టి ఆది నుండి కొనసాగుతూ వస్తుంది. సత్యయుగం ఆదిలో దేవీ దేవతలుంటారు. పునర్జన్మలనేవి తప్పకుండా అక్కడి నుండే ప్రారంభమై ఉంటాయి. మొట్టమొదటి వారు శ్రీకృష్ణుడు, వారు ఫస్ట్ పవిత్ర మానవుడు, వారి మహిమ అందరికన్నా ఎక్కువ. లక్ష్మీనారాయణులకు అంత మహిమ లేదు, ఎందుకంటే పిల్లలు పవిత్రంగా, సతోప్రధానంగా ఉంటారు కనుక పిల్లలను మహిమ చేయడం జరుగుతుంది. కృష్ణునికి చాలా మహిమ ఉంది కానీ కృష్ణపురి ఎక్కడ ఉంది అనేది ఎవరికీ తెలియదు. సత్యయుగాన్ని వైకుంఠమని కూడా అంటారు కానీ కృష్ణుడు ద్వాపరంలో ఉంటారని ఎందుకన్నారో తెలియదు. ఆ కృష్ణుడు ఇంకే ఇతర నామ-రూప-దేశాలలో రాలేరు. అవే నామ రూపాలు వేరే జన్మలో ఉండవు. కృష్ణుడైతే సత్యయుగంలో ఉండేవారు. ఈ జగదంబ, జగత్పితలు లక్ష్మీనారాయణులుగా అవుతారని మీకు తెలుసు. సత్యయుగాన్ని కృష్ణపురి అని అంటారు. ఇప్పుడిది కంసపురి. ఇవన్నీ ఆసురీ పేర్లు. అక్కడ దైవీ సంప్రదాయముండేది. ఇక్కడ ఆసురీ సంప్రదాయముంది. తండ్రి కూర్చొని పిల్లలకు సంగమంలో అర్థం చేయిస్తారు, ఆ తండ్రి రచయిత. వారిని మనుష్య సృష్టికి బీజరూపుడని అంటారు కనుక తప్పకుండా కొత్త మనుష్య సృష్టిని రచిస్తారు. మీరు పాడుతారు కూడా – బాబా, మీరు పతితపావనుడు, మీరు వచ్చి ఈ పతిత సృష్టిని పావనంగా చేయండి, పావన సృష్టిని రచించి పతిత సృష్టిని వినాశనం చేయించండి అని. తప్పకుండా బ్రహ్మా ద్వారా పావన సృష్టిని రచించి, శంకరుని ద్వారా పతిత సృష్టిని వినాశనం చేయిస్తారు. ఈ విషయాలు ఇతరులెవరికీ తెలియవు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రితో యోగం జోడిస్తారు. బాబా మురికి పట్టిన వస్త్రాలను ఉతికి శుభ్రం చేయడాన్ని మీరు చూస్తారు. అప్పుడు కొన్ని చిరిగిపోతాయి, కొన్ని ముక్కలుగా అయిపోతాయి. కొందరైతే చాలా మలినంగా, అజామిళుడు వంటి పాపాత్ముల వలె ఉన్నారు, వారికి ఏ మాత్రం ధారణ అవ్వదు. తండ్రి ఎంత మంచి విషయాలను అర్థం చేయిస్తారు. మధురమైన గారాబాల పిల్లలూ – అత్యంత ప్రియమైన తండ్రినైన నన్ను స్మృతి చేయండి. అత్యంత ప్రియమైన సుఖధామాన్ని స్మృతి చేయండి. ఈ విషయాలు కూడా ఇప్పుడు మీకు తెలుసు. ప్రపంచంలో ఎవరికీ తెలియవు. ఇప్పుడిది అతి దుఃఖధామము. మనుష్యులు దుఃఖంలో రక్షణ కోసం అలమటిస్తూ ఉంటారు, ఒకరినొకరు హతమార్చుకుంటూ ఉంటారు. మళ్ళీ, భగవంతుడా, రక్షించండి అని అంటారు. నోటి నుండి ఈ మాటలు తప్పకుండా వెలువడుతాయి. తండ్రి అయితే ముక్తిదాత.

ముఖ్యంగా పిల్లలైన మనల్ని మరియు మామూలుగా మిగతా అందరినీ సుఖధామానికి తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారని మీకు తెలుసు. పిల్లలైన మీలో కూడా ఈ నషా ఉన్నవారు నంబరువారుగా ఉన్నారు. ఈ చదువు తక్కువైనదేమీ కాదు, చదివించడం కూడా ఎవరిని చదివిస్తున్నారో చూడండి. అజామిళుడు వంటి పాపాత్ములను చదివించి స్వర్గానికి యజమానులుగా చేస్తారు. అందరూ తమోప్రధానంగా ఉన్నారు, వారిని సతోప్రధాన ప్రపంచంలోకి తీసుకువెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ దైవీ గుణాలను ధారణ చేయాలని పిల్లలకు పదే-పదే అర్థం చేయిస్తారు. ఇక్కడ మీకు లక్ష్యము-ఉద్దేశ్యము బుద్ధిలో ఉంది. పవిత్రత యొక్క ఈ మ్యానర్స్ ను ఇతరులెవ్వరూ నేర్పించరు. సన్యాసులైతే ఇళ్ళు-వాకిళ్ళను వదిలేలా చేస్తారు. ఇక్కడ తండ్రి అంటారు – మీరు ఇళ్ళు-వాకిళ్ళను వదలకూడదు. మీరు ఈ పాత ప్రపంచాన్ని వదిలేయాలి. అది హద్దు సన్యాసము, ఇది అనంతమైన సన్యాసము. ఆ సన్యాసులకు కూడా ఎంత గౌరవం లభిస్తుంది. సాధు సమాజం వారు గవర్నమెంట్ కు కూడా సలహాలనిస్తారు. మున్ముందు ఈ సన్యాసులు మొదలైనవారు కూడా మాతలైన మీ చరణాలపై పడతారు. మాతలు లేకుండా సన్యాసుల ఉద్ధరణ జరగదు ఎందుకంటే మీరు జ్ఞానాన్ని ఇస్తారు. ఇకపోతే చరణాలపై పడే విషయమేమీ లేదు. అయితే, ఒకవేళ ఎవరైనా నమస్తే లేక రామ్-రామ్ అని అంటే బదులివ్వవలసి ఉంటుంది. బాబా కూడా, పిల్లలూ, నమస్తే అని అంటారు. నేను పిల్లలైన మిమ్మల్ని నా కన్నా ఉన్నతంగా తయారుచేస్తాను. మిమ్మల్ని బ్రహ్మాండానికి మరియు సృష్టికి, రెండింటికీ యజమానులుగా చేస్తాను మరియు నేను వానప్రస్థంలోకి వెళ్ళిపోతాను. కానీ మీరు శ్రీమతాన్ని కూడా అనుసరించవలసి ఉంటుంది. ఈ పాత ప్రపంచం నుండి ముఖం తిప్పుకోవాల్సి ఉంటుంది. రాముడు, రావణుడు మరియు సీతకు సంబంధించిన ఆట వస్తువు ఉంది కదా. సీత రావణునికి వెన్ను చూపుతుంది, రాముని వైపుకు ముఖం తిప్పుతుంది. కృష్ణుని చిత్రం కూడా ఉంది – నరకాన్ని కాలదన్నుతున్నారు మరియు స్వర్గ గోళం చేతిలో ఉంది. తండ్రి చాలా మంచి రీతిగా అర్థం చేయిస్తారు కానీ ఎవరో అరుదైన వ్యాపారస్థుడు మాత్రమే ఈ వ్యాపారాన్ని చేస్తారు – తండ్రికి తమ పాత తనువు, మనసు, ధనాలను ఇచ్చి కొత్తవి తీసుకుంటారు. ఇది చాలా ఫస్ట్ క్లాస్ ఇన్షూరెన్స్. తండ్రి అంటారు – మీరు మీ ఆత్మను పవిత్రంగా చేసుకున్నట్లయితే శరీరం కూడా పవిత్రమైనది లభిస్తుంది. అప్పుడు మీరు స్వర్గంలో రాజ్యం చేస్తారు, అందుకే వారిని వ్యాపారస్థుడు, ఇంద్రజాలికుడు అని అంటారు. పతితులను పావనంగా చేయడము – దీనిని ఈశ్వరీయ ఇంద్రజాలమని అంటారు కదా. తండ్రి అంటారు – నరకవాసులను స్వర్గవాసులుగా చేయండి, ఇది ఎంతటి ఫస్ట్ క్లాస్ ఇంద్రజాలము. ఇందులో చాలా ప్రాప్తి ఉంది. తండ్రి అంటారు – రాజులకే రాజుగా అవ్వండి, ఫాలో చేయండి. తండ్రి కూర్చొని ఉన్నారు కదా. వీరు అధర్ కుమార్, మమ్మా కుమారి కన్య. కావున వీరిని ఫాలో చేయవలసి ఉంటుంది. వారసత్వం తండ్రి నుండి లభించనున్నది. సోదరీ-సోదరులైన మేము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటామని మీరంటారు. వాస్తవానికి లౌకిక పరంగా సోదరికి వారసత్వం లభించదు, సోదరునికి వారసత్వం లభిస్తుంది. ఇక్కడైతే మీ అందరికీ లభించనున్నది ఎందుకంటే మీరందరూ ఆత్మలు కదా. తండ్రి అంటారు – మీరంతా నా వద్దకు రావాలి. అప్పుడిక ఈ సోదరీ-సోదరుల సంబంధం కూడా తెగిపోతుంది. అక్కడ నిర్వాణధామంలో తండ్రి మరియు పిల్లల సంబంధం ఉంటుంది, అందుకే మనమంతా సోదరులము అని అంటారు. ఒకవేళ ఈశ్వరుడిని సర్వవ్యాపి అన్నట్లయితే ఫాదర్ హుడ్ అయిపోతుంది. ఈ సర్వవ్యాపి జ్ఞానం ఎంతగా నష్టపరిచింది.

ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి స్మృతి ఉంది. తండ్రిని స్మృతి చేయడంలోనే ఎక్కువ శ్రమ ఉంటుంది. అలాగని ఎవరైనా మిమ్మల్ని యోగంలో కూర్చోబెట్టాలని కాదు. మీకైతే లక్ష్యం లభించి ఉంది. ఇక్కడైతే మీరు కేవలం కూర్చొని, మురళీ వినిపిస్తారు. యోగమైతే మీకు సదా ఉంటుంది. మురళీ విన్న తర్వాత నడుస్తూ-తిరుగుతూ స్మృతిలో ఉండాలి. మనం యాత్రకు వెళ్తున్నాము. ఎంత వీలైతే అంత స్మృతిలో ఉండాలి. 8 గంటలు ఉద్యోగం చేసుకోండి, దానికి కూడా అనుమతి ఉంది. మిగతా సమయాన్ని ఇవ్వాలి. ముఖ్యమైన విషయము పవిత్రత. ఇది ముళ్ళ అడవి అని మీకు తెలుసు. ఒకరికొకరు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు తండ్రి అంటారు – శ్రీమతాన్ని అనుసరించండి. శివబాబా కూడా మాట్లాడుతారు, బ్రహ్మా కూడా మాట్లాడుతారు. కానీ శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. మీరు విద్యార్థులు. వారు మాకు తండ్రి కూడా, టీచరు మరియు సద్గురువు కూడా అని మీరంటారు. మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్తానని గ్యారంటీ ఇస్తారు. ఈ విధంగా ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. బాబా అంటారు – గాడ్ ఫాదర్ మాత్రమే సుఖాన్నిచ్చే ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఈ తండ్రి గురించి ఎవరికీ తెలియదు. ఒకవేళ తండ్రిని తెలుసుకున్నట్లయితే, తండ్రి ఆస్తి గురించి కూడా తెలుసుకుంటారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. లక్ష్యము-ఉద్దేశ్యమును సదా ఎదురుగా ఉంచుకొని దైవీ గుణాలను ధారణ చేయాలి. సతోప్రధాన ప్రపంచంలోకి వెళ్ళడానికి పవిత్రత యొక్క మ్యానర్స్ ను అలవరచుకోవాలి. బుద్ధి ద్వారా అనంతమైన సన్యాసం చేయాలి.

2. అత్యంత ప్రియమైన తండ్రిని మరియు తమ సుఖధామాన్ని స్మృతి చేయాలి. ఈ దుఃఖధామం నుండి బుద్ధియోగాన్ని తొలగించాలి.

వరదానము:-

ఎవరు ఎంత యోగి అయి ఉంటారో, వారికి అంతగా సర్వుల సహయోగం తప్పకుండా ప్రాప్తిస్తుంది. యోగి యొక్క కనెక్షన్ మరియు స్నేహం బీజంతో ఉన్న కారణంగా స్నేహానికి రిటర్న్ లో అందరి సహయోగం ప్రాప్తిస్తుంది. కనుక బీజంతో యోగం జోడించేవారు, బీజానికి స్నేహమనే నీటిని ఇచ్చేవారు సర్వాత్మల ద్వారా సహయోగం రూపీ ఫలాన్ని ప్రాప్తించుకుంటారు ఎందుకంటే బీజంతో యోగమున్న కారణంగా మొత్తం వృక్షంతో కనెక్షన్ ఏర్పడుతుంది.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top