26 April 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

April 26, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - శ్రీమతంపై నడుస్తూ తమ కర్మలను సరిదిద్దుకోండి, వికర్మలను భస్మం చేయండి, మాలలోని పూసగా అవ్వాలంటే ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు’’

ప్రశ్న: -

ఏ పిల్లల రక్షణ తండ్రి స్వతహాగానే చేస్తారు?

జవాబు:-

ఎవరెంత శుభ్రతతో నడుచుకుంటారో, తండ్రితో సదా సత్యంగా ఉంటారో, వారి రక్షణ స్వతహాగానే జరుగుతూ ఉంటుంది. అసత్యంగా నడిచేవారి రక్షణ జరగజాలదు. మాయ వారిని చాలా ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక వారికి శిక్షలు నిశ్చితమైపోతాయి.

ప్రశ్న: -

పిల్లలు ఆత్మిక సర్జన్ నుండి తమ అనారోగ్యాన్ని ఎందుకు దాచిపెడతారు?

జవాబు:-

ఎందుకంటే వారికి తమ గౌరవం యొక్క భయముంటుంది. మాయ మమ్మల్ని మోసం చేసింది, కళ్ళు అశుద్ధంగా అయిపోయాయి అని కూడా తెలుసు, అయినా కూడా తండ్రి నుండి దాచిపెడతారు. బాబా అంటారు, పిల్లలూ, మీరు ఎంతగా దాచిపెడతారో, అంతగా కింద పడిపోతూ ఉంటారు. మాయ తినేస్తుంది. అప్పుడిక చదువు దూరమవుతుంది, కావున చాలా జాగ్రత్తగా ఉండండి. మన్మతము లేక ఆసురీ మతముపై నడవకండి.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు, ఆత్మిక తండ్రే ఆత్మలను చదివిస్తారని పిల్లలు ఈ నిశ్చయాన్ని అయితే చేసుకున్నారు, అందుకే ఆత్మ పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు… అని గాయనముంది. మూలవతనంలోనైతే ఆత్మలన్నీ కలిసి ఉంటాయి, వేరుగా ఉండవు, మళ్ళీ అక్కడ నుండి ఆత్మలు వేరైపోతాయి. ఇక్కడకు వచ్చి తమ-తమ పాత్రలను అభినయిస్తాయి. సతోప్రధానం నుండి దిగుతూ-దిగుతూ తమోప్రధానంగా అయిపోతాయి. ఓ పతితపావనా రండి, వచ్చి పావనంగా చేయండి అని పిలుస్తారు కూడా. నేను ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వస్తానని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. ఈ సృష్టి చక్రమే 5 వేల సంవత్సరాలది. నిరాకార శివబాబా కూడా తప్పకుండా తనువు ద్వారానే వినిపిస్తారు. పై నుండి ప్రేరణ మొదలైనవేమీ చేయరు. ఏ విధంగానైతే ఆత్మలైన మీరు శరీరాన్ని ధారణ చేసి మాట్లాడుతారో, అలాగే తండ్రి కూడా – నేను ఈ తనువు ద్వారా మీతో మాట్లాడుతానని అంటారు. పిల్లలైన మీకు డైరెక్షన్ ఇస్తాను, ఎవరెంతగా డైరెక్షన్లపై నడుస్తారో, వారు తమ కళ్యాణాన్నే చేసుకుంటారు. తండ్రి అయితే అర్థం చేయిస్తారు, ఇక ఎవరైనా శ్రీమతంపై నడవండి లేక నడవకపోండి, టీచర్ చెప్పింది వినండి లేక వినకపోండి. వారైతే తమకు తామే లాభాన్ని పొందుతారు లేక నష్టపర్చుకుంటారు. వినకపోతే ఫెయిల్ అయిపోతారు. శివబాబా అయితే మంచి రీతిలో అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు శివబాబా నుండి నేర్చుకొని తర్వాత నేర్పించాలి. సన్ షోస్ ఫాదర్ (కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు), ఇందులో శారీరక తండ్రికి సంబంధించిన విషయము లేదు. ఇది ఆత్మిక తండ్రికి సంబంధించిన విషయము. పిల్లలు అర్థం చేసుకుంటారు, ఎవరెంతగా శ్రీమతంపై నడుస్తారో, అంతగా వారసత్వాన్ని పొందుతారు. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ జన్మ-జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి ఎందుకంటే రావణ రాజ్యంలో పాపాత్ములు, పుణ్యాత్ముల ఎదురుగా తల వంచుతారు. కానీ, ఈ పుణ్యాత్మలే మళ్ళీ పాపాత్ములుగా అవుతారు అనేది తెలియదు. వారు సదా పుణ్యాత్మలేనని భావిస్తారు. తండ్రి అర్థం చేయిస్తారు, పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ, పుణ్యాత్ముల నుండి పాపాత్ములుగా అవుతారు. 84 జన్మలు తీసుకోవడం వలన సతోప్రధానం నుండి తమోప్రధానంలోకి వస్తారు, పాపాత్ములుగా అవుతారు, మళ్ళీ తండ్రిని స్మృతి చేస్తారు. ఎప్పుడైతే పుణ్యాత్మలుగా ఉంటారో, అప్పుడు తండ్రిని స్మృతి చేయాల్సిన అవసరముండదు. ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అయితే అందరికీ అర్థం చేయించరు. పిల్లలు సేవ చేస్తారు. మనుష్యులైతే ఈ సమయంలో అసురులుగా అవుతూ ఉంటారు, దీని కారణంగా పరమాత్మ సర్వవ్యాపి కాదు అనేది బుద్ధిలో కూర్చోనే కూర్చోదు. మొత్తమంతా ఈ విషయంపై ఆధారపడి ఉంది. శ్రీకృష్ణుడైతే దేహధారి, వారిని దేవత అని అంటారు. ఆత్మల తండ్రి అయితే నిరాకారుడైన తండ్రి, వారినే స్మృతి చేయాలి. ప్రజాపిత అని కూడా అంటారు, కానీ వారైతే సాకారుడు. ఈ విషయాలన్నీ మంచి రీతిలో అర్థం చేయించడం జరుగుతుంది. కానీ చాలా మంది పిల్లలు అర్థం చేసుకోకుండా, తప్పుడు మార్గం తీసుకొని అడవుల్లోకి వెళ్ళిపోతారు. బాబా పట్టణంలోకి మరియు స్వర్గంలోకి వెళ్ళే మార్గాన్ని తెలియజేస్తారు, కానీ అర్థం చేసుకోని కారణంగా అడవుల్లోకి వెళ్ళిపోతారు. అడవుల్లోకి వెళ్ళిపోవడం వలన ముళ్ళలాగా అయిపోతారు. ఇక్కడ ఉంటూ కూడా దారిలో పూర్తిగా నడవరు, మధ్యలో ఉండిపోతారు. తర్వాత అక్కడికి కూడా చివర్లో వస్తారు. స్వర్గంలోకి వెళ్ళేందుకు మీరు ఇక్కడకు వచ్చారు. వాస్తవానికి త్రేతాను కూడా స్వర్గము అని అనరు. 25 శాతం తగ్గిపోయింది కదా. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. తండ్రి అంటారు, పాత ప్రపంచాన్ని త్యాగము చేసి కొత్త ప్రపంచాన్ని స్మృతి చేయండి. అంతేకానీ, పాత ప్రపంచాన్ని మరచి త్రేతా యుగాన్ని స్మృతి చేయండి అనైతే చెప్పరు. త్రేతా యుగాన్ని ఏమైనా కొత్త ప్రపంచము అని అంటారా. మార్గాన్ని సరిగ్గా తెలుసుకోలేని కారణంగా కిందా-మీదా అవుతూ ఉంటారు. డ్రామానుసారంగా, కల్పక్రితం ఎవరైతే పరీక్షలో పూర్తిగా పాస్ అయ్యారో, వారే పాస్ అవుతారు. త్రేతాయుగంలోకి వెళ్ళేవారిని పాస్ అవ్వలేదు అనే అంటారు. ఎవరైతే స్వర్గవాసులుగా అవుతారో, వారే పూర్తిగా పాస్ అవుతారు. ఇప్పుడు ఎలాగైతే చేస్తున్నారో, అలా కల్ప-కల్పాంతరాలు, జన్మ-జన్మాంతరాలు సంగమంలో వారే పరీక్షను పాస్ అవుతారు. ఎవరు పుష్పాలుగా అయ్యేది లేదో, వారిని ఎంత గట్టిగా లాగినా కానీ వారు తయారవ్వరు. ఉమ్మెత్తు పుష్పమే కావచ్చు, అయినా అది కూడా పుష్పమే కదా. ముళ్ళు అయితే గుచ్చుకుంటూ ఉంటాయి. మొత్తమంతా చదువుపై ఆధారపడి ఉంది. మంచి-మంచి పిల్లలను కూడా మాయ ముళ్ళలాగా చేస్తుంది. ద్రోహులుగా అయిపోతారు. ఎవరైతే తమ ఇంటిని వదిలి, ఇంకొకవైపుకు వెళ్తారో, వారిని ద్రోహులు అని అనడం జరుగుతుంది. తండ్రి అయితే మాయ నుండి విడిపించేందుకు వచ్చారు. ఇలా అంటారు – బాబా, మాయ చాలా శక్తివంతమైనది, తనవైపుకు ఆకర్షిస్తుంది, మాయ తక్కువుగానేమీ ఆకర్షించదు. ఈ సమయంలో చూడండి, సౌందర్యం కూడా ఎంతగా పెరిగిపోయింది, ఎంత ప్యాషనబుల్ గా అవుతారు. బయోస్కోప్ లో ఏమేమి చూపిస్తారు. ఇంతకుముందు ఈ బయోస్కోప్ (సినిమా) లు ఉండేవి కావు. 100 సంవత్సరాల లోపే వచ్చాయి. ఇందులో డ్రామా రహస్యాన్ని కూడా అర్థం చేయించాలి. ఈ 100 సంవత్సరాల లోపే స్వర్గము వలె తయారయ్యింది. అక్కడ ఈ సైన్సు కూడా చాలా సుఖాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అక్కడ సైన్సు యొక్క ఆడంబరముండదు. చాలా సుఖాన్నిస్తుంది. ఆ సుఖము స్థిరంగా ఉండేందుకు పాత ప్రపంచము వినాశనమవుతుంది.

తండ్రి పిల్లలను ఉన్నతిలోకి తీసుకువెళ్ళేందుకు ఎంత శ్రమిస్తారో చూడండి. కానీ కొంతమందైతే బాబా మమ్మల్ని చదివిస్తున్నారని అంగీకరించనే అంగీకరించరు. మంచి-మంచి వారు కూడా మాయ పంజాలోకి వెళ్ళిపోతారు. మాయ పూర్తిగా వశపరచుకుంటుంది. అయినా, ఒక్కసారి ఎవరైనా జ్ఞానం వింటే, స్వర్గంలోకి తప్పకుండా వస్తారు కానీ ఉన్నత పదవిని పొందలేరు. మేము నారాయణుడిగా అవుతామని అందరూ అంటారు. మరి పురుషార్థం కూడా అంతగా చేయాలి, కానీ అంతా డ్రామా యొక్క ఆట. కొంతమంది ఉన్నతిలోకి వెళ్తారు, కొంతమంది పడిపోతారు. కిందా-మీద అవుతూనే ఉంటారు. ఆధారమంతా స్మృతి యాత్రపై ఉంది. తండ్రి మీకు తరగని ఖజానాలను ఇస్తారు. అక్కడ కర్మభోగం యొక్క విషయమే ఉండదు. ఈ సమయంలో ఇక్కడ ఎవరైతే జమ చేసుకుంటారో, వారే పూర్తి వారసత్వాన్ని పొందుతారు. ఎక్కిన తర్వాత మళ్ళీ పడిపోతాము కూడా అని ఈ ఆలోచనను చేయకూడదు. బాగా కిందపడిపోయారు, అందుకే ఇప్పుడు తప్పకుండా ఉన్నతిలోకి వెళ్ళాల్సిందే. డ్రామానుసారంగా పురుషార్థమైతే జరుగుతూనే ఉంటుంది. శివునికి అందరికన్నా ఎక్కువ పూజ జరుగుతుంది కానీ వారిని రాయి రప్పలలో ఉన్నారని అంటారు. ఇది ఎంత అజ్ఞానము. శివునికి పూజ కూడా చేస్తారు, వారికి బలి కూడా ఇస్తారు కానీ శివుని గురించి – ఆ జ్ఞాన సాగరుడైన తండ్రి ఎలా వచ్చి చదివిస్తారు అనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు చదువుకుని పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందాలి. మాయ కూడా ఎవరినీ విడిచిపెట్టదు. పూర్తిగా పట్టుకుంటుంది. బాబా అంటారు – పిల్లలూ, సత్యాతి-సత్యమైన చార్టు రాయండి. చాలామంది పిల్లలు సత్యం చెప్పరు, అప్పుడు శిక్ష కూడా పడుతుంది. శిక్షలు అనుభవించేటప్పుడు పశ్చాత్తాపపడతారు – క్షమించండి, మళ్ళీ ఈ విధంగా చేయము అని అంటారు. చిన్న పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు, తండ్రి కొడితే పశ్చాత్తాపపడతారు. వీరు అనంతమైన తండ్రి. ఇంత గొప్ప తండ్రి, ఎంత నమత్రతో నడుచుకుంటారు, ఎంత సౌమ్యంగా ఉన్నారు. చిన్న పిల్లల వలె సౌమ్యంగా ఉంటారు. ఏ విషయం జరిగినా సరే – అచ్ఛా, పర్వాలేదు అని అంటారు ఎందుకంటే డ్రామాపై నడుస్తారు. అచ్ఛా, విధి అలా ఉంది. మున్ముందు అలా జరగకుండా చూసుకోండి అని మళ్ళీ అర్థం చేయిస్తారు. శ్రీమతము మరియు ఆసురీ మతము. ఈ బ్రహ్మా కూడా అలౌకిక తండ్రి కదా. అయినా అనంతమైన తండ్రి కూడా ఉన్నారు. హద్దు తండ్రి చెప్పింది కొందరు అంగీకరించకపోయినా కానీ అనంతమైన తండ్రి వీరిని (బ్రహ్మాను) నిమిత్తంగా చేసారు కనుక తప్పకుండా వీరు చెప్పింది వినాలి కదా. అందుకే ఇక్కడ తండ్రి అంటారు, మాయ తక్కువైనదేమీ కాదు, తప్పుడు పనులు చేయించేస్తుంది. ఇది ఈశ్వరీయ మతమని అర్థం చేసుకోవాలి. తండ్రి అంటారు, వీరి ద్వారా ఒకవేళ ఏదైనా అటువంటి మతము లభించినా కానీ, నేను సరిచేస్తాను. బాబా రథము కూడా, అనుభవజ్ఞులైనవారిది తీసుకున్నారు. ఎన్ని నిందలు పడ్డారు. బాబాతో చాలా స్వచ్ఛంగా ఉండాలి. ఎవరు ఎంతగా స్వచ్ఛతతో నడుచుకుంటారో, అంతగా వారికి రక్షణ జరుగుతుంది. అసత్యమైన నడవడిక నడుచుకునే వారి రక్షణ జరగదు, వారికి శిక్ష నిశ్చితమవుతుంది. మాయ ముక్కు పట్టుకుంటుంది. మాయ తినేసిందని, అందుకే మేము చదువును విడిచిపెట్టామని పిల్లలకు తెలుసు. బాబా అంటారు, ఏం జరిగినా కానీ, చదువును ఎప్పుడూ ఆపకండి. ఎవరు ఎలా చేస్తారో, అలా పొందుతారు. ఎప్పుడు పొందుతారు? భవిష్యత్తులో, ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో మార్పు జరగనున్నది. ఇది మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. మీలో కూడా చాలా మంది పిల్లలు మర్చిపోతారు. ఒకవేళ స్మృతిలో ఉంటే, సంతోషం కూడా ఉంటుంది కానీ మాయ పూర్తిగా మరపింపజేస్తుంది. మాయతో జరిగే ఈ యుద్ధము చివరి వరకు నడుస్తూ ఉంటుంది. మా ద్వారా ఇలా జరిగిపోయింది అని మంచి-మంచి పిల్లలకు కూడా తెలుసు కానీ సత్యం చెప్పరు, పరువు పోతుందేమో అనే భయముంటుంది, గుటకలు మింగుతూ ఉంటారు. ఎవరైనా యుగుళులు ఉంటే, ఒకరు చెప్పారు కావున నేను కూడా చెప్పాలి అని భావిస్తారు. అదృష్టంలో ఉన్నత పదవి లేకపోతే, సర్జన్ నుండి దాచిపెడుతూ ఉంటారు. ఎంతగా దాచి పెడతారో, అంతగా కిందకు పడిపోతూ ఉంటారు. ఈ కళ్ళు ఎటువంటివంటే, అవి అశుద్ధ దృష్టిని వదలనే వదలవు. కొందరైతే చాలా మంచి పిల్లలుగా ఉన్నారు, వారెప్పుడూ ఇతరులెవ్వరినీ స్మృతి కూడా చేయరు. ఏ విధంగా అయితే పతివ్రతా స్త్రీకి ఎప్పుడూ ఏ పర పురుషుని వైపుకు దృష్టి వెళ్ళదు. కావున తండ్రి అర్థం చేయిస్తారు – ఒకవేళ మాలలోని పూసగా అవ్వాలంటే, ఇటువంటి అవస్థ కావాలి. విశ్వానికి యజమానులుగా అవ్వటము, ఇదేమైనా చిన్న విషయమా? అనంతమైన తండ్రి చదివిస్తున్నారంటే, ఇంకేమి కావాలి. బాబా మీకు ప్రాక్టికల్ గా – ఫలానా-ఫలానా వారిలో ఈ విశేషత ఉంది అని, ఫలానా వారిలో ఫలానాది ఉంది అని చూపిస్తారు – అందుకే నంబరువారుగా ప్రియస్మృతులు అందిస్తారు. ఇక్కడ కూర్చుని ఉన్నా కూడా, బాబా బుద్ధి సర్వీసబుల్ అయిన (సేవా యోగ్యులైన) పిల్లల వైపు ఉంటుంది. అజ్ఞాన కాలంలో కూడా ఆజ్ఞాకారీ పిల్లల పట్ల ప్రేమ ఉంటుంది. నా పిల్లల్లో ఎవరు బాగా సేవ చేస్తారు అనేది బాబాకు తెలుసు. మీరు బ్రహ్మాకుమారులు మరియు బ్రహ్మాకుమారీలు, శివబాబాకు మనవలు మరియు మనవరాళ్లు, తాతగారి నుండి వారసత్వమైతే తప్పకుండా లభించనున్నది. బ్రహ్మా వద్ద వారసత్వము లేదు. తండ్రి స్వయంగా అంటారు, నేను ఆత్మలైన మీకు అనంతమైన తండ్రిని. మీకు అనంతమైన వారసత్వాన్నిస్తాను, అందుకే ఇప్పుడు నా శ్రీమతంపై నడవండి. నేను వచ్చాను, పిల్లలైన మిమ్మల్ని నా సమానంగా అశరీరిగా తయారుచేసి తిరిగి తీసుకువెళ్ళేందుకు. ఇప్పుడు మీ జ్యోతిని జ్ఞాన-యోగాల ద్వారా వెలిగిస్తున్నారు. ఒకవేళ జ్ఞాన-యోగాలలో సరైన రీతిలో లేకపోతే, ధర్మరాజు శిక్షలను అనుభవించాల్సి ఉంటుంది, కావున మొదట మీ వికర్మలను భస్మం చేసుకోండి. ఈ సమయంలో మనుష్యులు స్వయాన్ని స్వర్గంలో ఉన్నట్లుగా భావిస్తారు కానీ ఇది అల్పకాలికమైన సుఖము. వారికి అనంతమైన తండ్రి వారసత్వాన్ని కూడా ఇవ్వరు. తండ్రి అంటారు, నేను పేదల పెన్నిధిని. ఎవరైతే పూర్తి పేదవారిగా, పతితులుగా, అహల్యలుగా ఉన్నారో, వారిని షావుకార్లుగా చేసేస్తాను. ఒకవేళ ఎవరైనా పతితం నుండి పావనంగా అవ్వకపోతే, విజయమాలలోకి రాలేకపోతారు. ఇక్కడ అనంతమైన తండ్రితో వ్యాపారం చేయాల్సి ఉంటుంది. బాబా, ఇదంతా మట్టిలో కలిసిపోనున్నది కావున మేము మీపై బలిహారమవుతాము. ఇదంతా మీరు తీసుకోండి, మమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేయండి. తండ్రి అంటారు, నేను అయితే దాతను. ఈ రాజ్యాన్ని స్థాపన చేయడంలో లేక విశ్వానికి యజమానులుగా అవ్వడంలో ఎటువంటి ఖర్చూ లేదు. అక్కడ చూడండి, యుద్ధం కోసం ఎంత ఖర్చు అవుతుంది. ఇక్కడ మీకు ఏం ఖర్చు ఉంది? ఎందుకంటే ఇక్కడ ఎటువంటి ఆయుధ శక్తి లేదు. యోగబలంతో విశ్వానికి యజమానులుగా అవుతారు. ఆ మనుష్యులు బాహుబలంతో ఇంతగా యుద్ధం చేస్తారు, అయినా కూడా విశ్వానికి యజమానులుగా అవ్వలేరు. డ్రామాలో వారి పాత్రనే లేదు. సత్యాతి-సత్యమైన రాజయోగం అనంతమైన తండ్రే నేర్పిస్తారు. మీకు తెలుసు, రాజయోగం ద్వారా పరమపిత పరమాత్మ స్వర్గాన్ని స్థాపన చేసారు. ఇప్పుడు మీరు సంగమయుగంలో చదువుకుంటున్నారు మరియు చదువు అనుసారంగానే నంబరువారుగా పదవి లభిస్తుంది. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఇప్పుడు మనం వనవాహములో ఉన్నాము కావున చాలా-చాలా సాధారణంగా ఉండాలి. ఏ రకమైన దేహాభిమానం లేక వస్త్రాలు మొదలైనవాటి పట్ల అభిమానం ఉండకూడదు. ఏ కర్మ చేస్తున్నా సరే తండ్రి స్మృతి యొక్క నషా ఎక్కి ఉండాలి.

2. మేము అనంతమైన త్యాగులము మరియు రాజఋషులము అనే నషాలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి. జ్ఞాన ధనంతో నిండుగా అయి దానం చేయాలి. సత్యాతి-సత్యమైన వ్యాపారులుగా అయి తమ లెక్కాపత్రాన్ని పెట్టుకోవాలి.

వరదానము:-

తండ్రి ద్వారా ఏ వరదానాలైతే లభిస్తాయో, వాటిని సమయానికి కార్యంలో ఉపయోగించండి, అప్పుడు వరదానాలు స్థిరంగా ఉంటాయి. వరదానం యొక్క బీజాన్ని ఫలదాయకంగా చేసుకునేందుకు, దానికి పదే-పదే స్మృతి యొక్క నీటిని ఇవ్వండి, వరదాన స్వరూపంలో స్థితులయ్యే సూర్యకాంతిని ఇవ్వండి. అప్పుడు ఒక్క వరదానం, అనేక వరదానాలను తోడుగా తీసుకొస్తుంది మరియు ఫల స్వరూపంగా వరదానీ మూర్తులుగా అవుతారు. ఎంతగా వరదానాలను సమయానికి కార్యంలో ఉపయోగిస్తారో, అంతగా వరదానము ఇంకా శ్రేష్ఠ స్వరూపాన్ని చూపిస్తూ ఉంటుంది.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top