26 April 2021 TELUGU Murli Today – Brahma Kumaris
25 April 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Malayalam. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - దేవతలుగా అవ్వాలంటే, అమృతాన్ని తాగండి మరియు తాగించండి, అమృతాన్ని తాగేవారే శ్రేష్ఠాచారులుగా అవుతారు”
ప్రశ్న: -
ఈ సమయంలో సత్యయుగ ప్రజలు ఏ ఆధారముగా తయారవుతున్నారు?
జవాబు:-
ఎవరైతే ఈ జ్ఞానముతో ప్రభావితులై, చాలా బాగుంది, చాలా బాగుంది అని అంటారు కానీ చదువును చదువుకోరో, శ్రమ చేయలేరో, వారు ప్రజలుగా అయిపోతారు. ప్రభావితులవ్వడమంటే ప్రజలుగా అవ్వడము. సూర్యవంశీ రాజా-రాణులుగా అయ్యేందుకు శ్రమించాలి. చదువుపై పూర్తి అటెన్షన్ ఉండాలి. స్మృతి చేస్తూ మరియు చేయిస్తూ ఉన్నట్లయితే ఉన్నత పదవి లభించగలదు.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
నీవు నిద్రించి రాత్రిని పోగొట్టుకున్నావు….. (తూనే రాత్ గవాయి సోకే…..)
ఓంశాంతి. మా జీవితం వజ్ర సమానంగా ఉండేదని, ఇప్పుడు గవ్వ సమానంగా అయ్యిందని పిల్లలు పాటలో విన్నారు. ఇదైతే సాధారణమైన విషయము. చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. బాబా, చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకోగలిగేలా, చాలా సులువైన పద్ధతిలో అర్థం చేయిస్తారు. సత్యనారాయణ కథను వినిపించినప్పుడు చిన్న-చిన్న పిల్లలు కూడా కూర్చుండిపోతారు. కానీ ఆ సత్సంగాలు మొదలైనవాటిలో వినిపించేవన్నీ కథలు. ఆ కథలు జ్ఞానమేమీ కాదు, అవి తయారుచేయబడిన కథలు. గీతా కథ, రామాయణ కథ, అలానే రకరకాల శాస్త్రాలున్నాయి, వాటిలోని కథలను కూర్చొని వినిపిస్తారు. అవన్నీ కథలు. కథల వలన లాభమేమైనా ఉంటుందా! ఇది సత్యనారాయణుని కథ అనగా నరుని నుండి నారాయణునిగా అయ్యే సత్యమైన కథ. ఇది వినడంతో మీరు నరుని నుండి నారాయణునిగా అవుతారు. ఇది అమరకథ కూడా. రండి, మీకు అమరకథను వినిపిస్తాము, దానితో మీరు అమరలోకానికి వెళ్ళిపోతారు అని మీరు ఆహ్వానాన్ని ఇస్తారు. ఇలా చెప్పినా ఎవరూ అర్థం చేసుకోరు. శాస్త్రాల కథలను వింటూ వస్తారు కానీ ఏమీ లభించదు. లక్ష్మీనారాయణుల మందిరాలకు వెళ్తారు, పదండి, దర్శనం చేసుకొని వద్దాము, మహాత్ముల దర్శనం చేసుకొని వద్దాము అని అంటారు. ఇది ఒక ఆచారము-పద్ధతి వలె కొనసాగుతూ వస్తుంది. ఋషులు, మునులు మొదలైనవారు ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో, వారికి తల వంచి నమస్కరిస్తూ వచ్చారు. రచయిత మరియు రచనల కథ గురించి తెలుసా అని అడిగితే, తెలియదు అని అంటారు. ఈ రచయిత మరియు రచనల కథ అయితే చాలా సహజమైనదని, పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఇది అల్ఫ్ (భగవంతుడు) మరియు బే (వారసత్వము) యొక్క కథ. ప్రదర్శినీలకు ఎవరైతే వస్తారో, వారు కథను బాగానే వింటారు కానీ పవిత్రంగా అవ్వరు. ఈ వికారాల్లోకి వెళ్ళే ఆచారము-పద్ధతి కూడా అనాది అయినదని భావిస్తారు. మందిరాలలో దేవతల ఎదురుగా వెళ్ళి, మీరు సంపూర్ణ నిర్వికారులు….. అని పాడుతారు, మళ్ళీ బయటకు వచ్చి వికారాల్లోకి వెళ్ళడం అనాదిగా వస్తోంది అని అంటారు. ఇవి (వికారాలు) లేకుండా ప్రపంచం ఎలా నడుస్తుంది, లక్ష్మీనారాయణులు మొదలైనవారికి కూడా పిల్లలుండేవారు కదా అని అంటారు, ఇటువంటివారికి ఏమని చెప్పాలి! దేవతలను మనుష్యులతో సమానులని అనలేము కదా. దేవతలు కూడా మనుష్యులే, లక్ష్మీనారాయణుల రాజ్యంలో ఎంత సుఖంగా ఉండేవారు. పిల్లలైన మీకు తండ్రి చాలా సహజమైన విషయాలను తెలియజేస్తారు, తప్పకుండా ఇక్కడ భారత్ లోనే స్వర్గముండేది. లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. వారి చిత్రాలు కూడా ఉన్నాయి, సత్యయుగములో వారి రాజ్యముండేదని అందరూ నమ్ముతారు. అక్కడ ఎవ్వరూ దుఃఖితులుగా ఉండేవారు కాదు, వారు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు, వారి మందిరాలు కూడా చాలా పెద్ద-పెద్దగా నిర్మించబడ్డాయి. వారు 5000 సంవత్సరాల క్రితం ఉండేవారు, ఇప్పుడు వారు లేరు. ఇప్పుడిది కలియుగ అంతిమము. మనుష్యులు పరస్పరంలో కొట్లాడుకుంటూ-గొడవపడుతూ ఉంటారు. భగవంతుడైతే పైన నిర్వాణధామములోనే ఉంటారు. నిజానికి ఆత్మలమైన మనం కూడా అక్కడే ఉండేవారము, పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వస్తాము. మొదట మనం లక్ష్మీనారాయణుల రాజ్యంలో ఉండేవారము. అక్కడ చాలా సుఖము, ఆనందము ఉండేవి, తర్వాత మనం 84 జన్మలను తీసుకోవాల్సి వచ్చింది. 84 జన్మల చక్రమని కూడా గాయనం చేయడం జరుగుతుంది. మనం సూర్యవంశంలో 1250 సంవత్సరాలు రాజ్యం చేసాము. అక్కడ అపారమైన సుఖముండేది, సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు, వజ్ర వైఢూర్యాల మహళ్ళు ఉండేవి. మనం రాజ్యము చేసాము, తర్వాత 84 జన్మలలోకి రావాల్సి వచ్చింది. ఈ ప్రపంచ చరిత్ర-భూగోళాల చక్రం తిరుగుతూ ఉంటుంది. అర్ధకల్పం సుఖముండేది. రామరాజ్యంలో ఉండేవారము, తర్వాత మనుష్యుల వృద్ధి జరుగుతూ వచ్చింది. సత్యయుగంలో 9 లక్షల మంది ఉండేవారు. సత్యయుగ అంతిమానికి వృద్ధి చెందుతూ, 9 లక్షల నుండి 2 కోట్ల మంది అయ్యారు, తర్వాత త్రేతాలో 12 జన్మలు చాలా సుఖ-శాంతులతో ఉండేవారు. ఒకే ధర్మముండేది. తర్వాత ఏమయ్యింది. రావణ రాజ్యం ప్రారంభమయ్యింది. రామ రాజ్యము మరియు రావణ రాజ్యము గురించి ఎంత సహజమైన పద్ధతిలో అర్థం చేయిస్తానో చూడండి. చిన్న-చిన్న పిల్లలకు కూడా ఇలా చెప్పాలి. తర్వాత ఏమి జరిగింది? బంగారము, వజ్ర వైఢూర్యాలతో కూడిన పెద్ద-పెద్ద మహళ్ళు భూకంపం వచ్చినప్పుడు లోపలకు వెళ్ళిపోయాయి. భారతవాసులు వికారులుగా అవ్వడంతో భూకంపాలు వచ్చాయి, తర్వాత రావణ రాజ్యం ప్రారంభమయ్యింది, పవిత్రుల నుండి అపవిత్రులైపోయారు. బంగారు లంక లోపలికి వెళ్ళిపోయిందని కూడా అంటారు. ఎంతో కొంత మిగిలి ఉంటుంది కదా, దానితో మందిరాలు మొదలైనవి నిర్మించి ఉండవచ్చు. భక్తి మార్గం ప్రారంభమయ్యింది – మనుష్యులు వికారులుగా అవ్వడం మొదలుపెట్టారు. ఇక రావణ రాజ్యం కొనసాగడంతో ఆయువు కూడా తగ్గిపోయింది. మనం నిర్వికారీ యోగుల నుండి వికారీ భోగులుగా అయిపోయాము, యథా రాజా-రాణి తథా ప్రజా, అందరూ వికారులుగా అయిపోయారు. ఈ కథ ఎంత సహజమైనది. చిన్న-చిన్న కన్యలు ఈ కథను వినిపించినట్లయితే, పెద్ద పెద్ద వ్యక్తులు తల దించుకుంటారు. ఇప్పుడు తండ్రి కూర్చొని వినిపిస్తారు, వారే జ్ఞాన సాగరుడు, పతితపావనుడు. అచ్ఛా, ద్వాపరంలో భోగులుగా, పతితులుగా అయిపోయారు, తర్వాత ఇతర ధర్మాలు కూడా ప్రారంభమవుతూ వచ్చాయి. అమృతం యొక్క నషా ఏదైతే ఉండేదో, అది సమాప్తమైపోయింది. కొట్లాటలు-గొడవలు మొదలయ్యాయి. ద్వాపరం నుండి మొదలుకొని మనం దిగజారుతూ వచ్చాము, కలియుగంలో ఇంకా వికారులుగా అయిపోయాము. హనుమాన్, గణేష్….. మొదలైనవారి రాతి మూర్తులను తయారుచేస్తూ వచ్చాము. రాతి బుద్ధి కలవారిగా అవ్వడం మొదలయ్యింది కనుక రాతిని పూజించడం మొదలుపెట్టారు. భగవంతుడు రాయి-రప్పల్లో ఉన్నారని భావించేవారు. ఇలా చేస్తూ-చేస్తూ భారత్ పరిస్థితి ఇలా అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ తండ్రి అంటారు – విషాన్ని వదిలి అమృతాన్ని తాగి, పవిత్రంగా అవ్వండి, మళ్ళీ రాజ్యాన్ని తీసుకోండి. విషాన్ని వదిలినట్లయితే మీరు మనుష్యుల నుండి దేవతలుగా అయిపోతారు. కానీ విషాన్ని వదలరు. విషం కోసం ఎంతగా కొడతారు, విసిగిస్తారు. అందుకే ద్రౌపది పిలిచింది కదా. అమృతం తాగకుండా మనము దేవతలుగా ఎలా అవుతాము అన్నది మీరు అర్థం చేసుకున్నారు. సత్యయుగంలోనైతే రావణుడు అసలు ఉండడు. శేష్ఠాచారులుగా అవ్వనంతవరకు స్వర్గంలోకి రాలేరని తండ్రి అంటారు. ఇంతకుముందు శ్రేష్ఠాచారులుగా ఉన్నవారే ఇప్పుడు భ్రష్టాచారులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ అమృతాన్ని తాగి శ్రేష్ఠాచారులుగా అవ్వాలి. నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి అంటారు. మీరు గీతను మర్చిపోయారా. గీతను రచించింది నేను, పేరు కృష్ణుడిది వేసారు. ఈ లక్ష్మీ నారాయణులకు ఈ రాజ్యాన్ని ఎవరు ఇచ్చారు. తప్పకుండా భగవంతుడు ఇచ్చి ఉంటారు. ముందు జన్మలో భగవంతుడు రాజయోగాన్ని నేర్పించారు, కానీ కృష్ణుని పేరు వేసారు. ఈ విషయాన్ని అర్థం చేయించే ప్రాక్టీస్ చేయాలి. ఇది చాలా సహజమైన కథ. బాబాకు ఎంత సమయం పట్టింది. ఇంత సహజమైన విషయాన్ని కూడా అరగంటలో అర్థం చేసుకోలేరు, అందుకే బాబా అంటారు – ఎవరికైనా కేవలం ఒక చిన్న కథను కూర్చొని అర్థం చేయించండి. చేతిలోకి చిత్రాన్ని తీసుకోండి. సత్యయుగంలో లక్ష్మీనారాయణుల రాజ్యము ఉంటుంది, తర్వాత త్రేతాలో సీతా-రాముల రాజ్యము ఉంటుంది….. తర్వాత ద్వాపరంలో రావణ రాజ్యం మొదలవుతుంది. ఇది ఎంత సహజమైన కథ. తప్పకుండా మనం దేవతలుగా ఉండేవారము, తర్వాత క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యాము. ఇప్పుడు స్వయాన్ని దేవతలుగా భావించని కారణంగా హిందువులమని చెప్పుకుంటారు. ధర్మ శ్రేష్ఠులుగా, కర్మ శ్రేష్ఠులుగా ఉన్నవారు ధర్మ భ్రష్టులుగా, కర్మ భ్రష్టులుగా అయిపోయారు. ఈ విధంగా చిన్న-చిన్న కుమారీలు కూర్చొని భాషణ చేసినట్లయితే, మొత్తం సభ అంతా ‘హియర్, హియర్’ (మళ్ళీ చెప్పండి) అని అంటుంది.
బాబా అన్ని సెంటర్ల వారికి వినిపిస్తున్నారు. ఇప్పుడు ఈ పెద్దవారు నేర్చుకోకపోతే, చిన్న-చిన్న కుమారీలకు నేర్పించండి. కుమారీల పేర్లు కూడా ఉన్నాయి. ఢిల్లీ, బొంబాయిలో చాలా మంచి-మంచి కుమారీలున్నారు, చదువుకున్నవారు ఉన్నారు. వారు లేచి నిలబడాలి. వారు ఎంతో చేయగలరు. ఒకవేళ కుమారీలు లేచి నిలబడినట్లయితే, పేరు ప్రసిద్ధమవుతుంది. షావుకారుల ఇళ్ళల్లో ఉండేవారు, కష్టం మీద ధైర్యం చేస్తారు. వారికి వారి సంపద యొక్క నషా ఉంటుంది, కట్నం మొదలైనవి లభిస్తే ఇక అంతే. కుమారీలు వివాహం చేసుకొని నల్ల ముఖం చేసుకుంటారు, అప్పుడు అందరి ముందు తల వంచవలసి ఉంటుంది. కనుక తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. కానీ పారసబుద్ధి కలవారిగా అవ్వాలి అన్న ఆలోచనే రాదు. ఈ రోజుల్లో చదువుకోనివారు కూడా ఎమ్.పి లుగా, ఎమ్.ఎల్.ఎ లుగా అయ్యారు చూడండి. చదువు ద్వారా ఎలా అవుతారో చూడండి. ఈ చదువైతే చాలా సహజమైనది. దీనిని ఇతరులకు కూడా వెళ్ళి నేర్పించాలి. కానీ శ్రీమతమనుసారంగా నడుచుకోకపోతే చదువుకోరు కూడా. చాలా మంచి-మంచి కుమారీలున్నారు కానీ వారు వారి నషాలో ఉన్నారు. కొంచెం పని చేసి, మేము ఎంతో పని చేసామని అనుకుంటారు. ఇప్పుడింకా చాలా పని చేయాలి. ఈ రోజుల్లో కుమారీలు ఫ్యాషన్లలోనే ఉంటున్నారు. అక్కడైతే సహజ సౌందర్యముంటుంది. ఇక్కడైతే ఎంత కృత్రిమమైన అలంకరణ చేసుకుంటారు. కేవలం జుట్టును అలంకరించుకునేందుకే ఎంత డబ్బును ఖర్చు పెడతారు. ఇదంతా మాయ ఆర్భాటము. మాయా రావణ రాజ్యం పతనమవుతుంది, మళ్ళీ రామ రాజ్యం ఉదయించడము జరుగుతుంది. ఇప్పుడు రామ రాజ్యం స్థాపనవుతుంది. కానీ మీరు శ్రమ అయితే చేయండి కదా, లేదంటే మీరు ఏమవుతారు. ఒకవేళ చదువుకోకపోతే, అక్కడకు వెళ్ళి పైసాకు విలువ చేసే ప్రజలుగా అవుతారు. నేటి గొప్ప-గొప్ప వ్యక్తులు అక్కడ ప్రజల్లోకి వస్తారు. షావుకార్లు కేవలం బాగుంది-బాగుంది అని చెప్పి, తమ వ్యాపారాలలో నిమగ్నమైపోతారు. చాలా బాగా ప్రభావితులవుతారు, తర్వాత ఏమిటి! ఆఖరుకి ఏమి జరుగుతుంది. అక్కడకు వెళ్ళి ప్రజలుగా అవుతారు. ప్రభావితులవ్వడము అనగా ప్రజలుగా అవ్వడము. ఎవరైతే శ్రమిస్తారో, వారు రామ రాజ్యంలోకి వస్తారు. వివరణ అయితే చాలా సహజమైనది. ఎవరైనా ఈ కథ యొక్క నషాలో ఉన్నట్లయితే, వారి నావ తీరానికి చేరుతుంది. మనం శాంతిధామంలోకి వెళ్తాము, తర్వాత సుఖధామంలోకి వస్తాము. స్మృతి చేస్తూ, చేయిస్తూ ఉండాలి, అంతే, అప్పుడే ఉన్నత పదవిని పొందుతారు. చదువు పట్ల అటెన్షన్ పెట్టాలి. చిత్రాలు చేతిలో ఉండాలి. బాబా లక్ష్మీనారాయణులను పూజించేటప్పుడు, వారి చిత్రము జేబులో ఉండేది. చిన్న చిత్రాలు కూడా ఉంటాయి, లాకెట్ లో కూడా ఉంటాయి. వాటి గురించి అర్థం చేయించాలి. వీరు బాబా, వీరి నుండి వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు పావనంగా అవ్వండి, తండ్రిని స్మృతి చేయండి. ఈ బ్యాడ్జిలలో ఎంత నాలెడ్జ్ ఉంది. ఇందులో జ్ఞానమంతా ఉంది. దీనిపై అర్థం చేయించడము చాలా సహజము. సెకెండులో తండ్రి నుండి జీవన్ముక్తి వారసత్వము లభిస్తుంది. ఎవరైనా అర్థం చేయిస్తే, వారు జీవన్ముక్తి పదవికి అధికారులుగా అయిపోతారు. ఇకపోతే, చదువు అనుసారంగా ఉన్నత పదవిని పొందుతారు. స్వర్గములోకైతే వస్తారు కదా, చివర్లో వచ్చినా మంచిదే కదా. వృద్ధి అయితే జరగనున్నది. దేవీ-దేవతా ధర్మం ఉన్నతమైనది, వారు కూడా తయారవుతారు కదా. ప్రజలైతే లక్షల సంఖ్యలో తయారవుతారు. సూర్యవంశీయులుగా అవ్వడంలో శ్రమ ఉంది. సేవ చేసేవారే మంచి పదవిని పొందుతారు. వారి పేర్లు కూడా ప్రసిద్ధి చెందాయి – కుమారకా ఉన్నారు, జనక్ ఉన్నారు, వారు సెంటర్లను బాగా సంభాళిస్తున్నారు. ఏ గొడవ లేదు.
తండ్రి అంటారు – చెడు చూడవద్దు, చెడు మాట్లాడవద్దు. అయినా అటువంటి మాటలను మాట్లాడుతూ ఉంటారు. అలాంటివారు అక్కడకు వెళ్ళి ఏమవుతారు. ఇంత సహజమైన సేవను కూడా చేయరు. దీనిని చిన్న-చిన్న కుమారీలు కూడా అర్థం చేయించగలరు, వినిపించగలరు. వానర సైన్యం కూడా ప్రసిద్ధమైనది. రావణుని జైలులో చిక్కుకుని ఉన్న సీతలను విడిపించాలి. ఏవేవో కథలను తయారుచేసారు. ఈ విధంగా ఎవరైనా భాషణ చేయాలి. కేవలం ఫలానా వారు చాలా ప్రభావితులయ్యారని అంటారు. మీరు ఏమవ్వాలనుకుంటున్నారు అని వారిని అడగండి. వీరి జ్ఞానం చాలా బాగుందని కేవలం ఇతరులకు చెప్తారు. వారు స్వయం ఏమీ అర్థం చేసుకోరు, దీని వలన లాభమేముంది. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. పారసబుద్ధి కలవారిగా అయ్యేందుకు చదువు పట్ల పూర్తి ధ్యానముంచాలి. శ్రీమతమనుసారంగా చదువుకోవాలి మరియు చదివించాలి. హద్దు సంపదల నషాను, ఫ్యాషన్ మొదలైనవాటిని వదిలి, ఈ అనంతమైన సేవలో నిమగ్నమవ్వాలి.
2. చెడు వినవద్దు, చెడు చూడవద్దు….. ఎలాంటి వ్యర్థమైన విషయాలు మాట్లాడకూడదు. ఎవరి పైనా ప్రభావితులవ్వకూడదు. అందరికీ సత్య నారాయణుని చిన్న కథను వినిపించాలి.
వరదానము:-
ఏ పిల్లలైతే నాలెడ్జ్ యొక్క లైట్ మరియు మైట్ ద్వారా ఆది మధ్యాంతాలను తెలుసుకొని పురుషార్థం చేస్తారో, వారికి సఫలత తప్పకుండా ప్రాప్తిస్తుంది. సఫలత ప్రాప్తించడం కూడా లక్ కు గుర్తు. నాలెడ్జ్ ఫుల్ గా అవ్వడమే లక్ ను మేల్కొల్పుకునే సాధనము. నాలెడ్జ్ అంటే కేవలం రచయిత మరియు రచనలకు సంబంధించినది మాత్రమే కాదు, నాలెడ్జ్ ఫుల్ అనగా ప్రతి సంకల్పము, ప్రతి పదము మరియు ప్రతి కర్మలో జ్ఞాన స్వరూపులుగా ఉండాలి, అప్పుడు సఫలతా మూర్తులుగా అవుతారు. ఒకవేళ పురుషార్థం బాగున్నా కానీ సఫలత కనిపించడం లేదంటే, అది అసఫలత కాదు, పరిపక్వతకు సాధనము అని భావించాలి.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!