25 September 2021 TELUGU Murli Today | Brahma Kumaris

25 September 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

24 September 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - మీది ఇప్పుడు ఈశ్వరీయ కొత్త రక్తము, మీరు చాలా నషాతో భాషణ చేయాలి, శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారనే నషా ఉండాలి”

ప్రశ్న: -

మీకు మీ లక్ష్యం-ఉద్దేశ్యం పట్ల స్థిరమైన నషా ఉండాలంటే, దాని కోసం ఏ యుక్తిని అలవరచుకోవాలి?

జవాబు:-

మీ రాజ్యపు పాస్పోర్టు తీసి పెట్టుకోండి. కింద మీ సాధారణ చిత్రము, పైన రాజ దుస్తులలో అలంకరించబడిన చిత్రము మరియు దాని పైన శివబాబా చిత్రము ఉండాలి. అప్పుడు లక్ష్యం-ఉద్దేశ్యం యొక్క స్మృతి సహజంగా ఉంటుంది. ఈ పాస్పోర్టు మీ జేబులో ఉండాలి. ఎప్పుడైనా మాయా తుఫాన్లు వస్తే, ఇప్పుడు మా ఈ పాస్పోర్టు క్యాన్సిల్ అయిపోతుంది, మేము స్వర్గంలోకి వెళ్ళలేము అని ఆలోచన వస్తుంది.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

రాత్రి ప్రయాణీకుడా, అలసిపోకు….. (రాత్ కే రాహీ థక్ మత్ జానా…..)

ఓంశాంతి. పిల్లలు ఈ పాట అర్థాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు భక్తి మార్గపు ఘోర అంధకారమయ రాత్రి పూర్తి అయ్యింది. కాలుడు ఇప్పుడు మా వద్దకు రాలేడని పిల్లలకు తెలుసు. మనం ఇక్కడ కూర్చొని ఉన్నాము, మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడమే మన లక్ష్యము-ఉద్దేశ్యము. మీరు స్వయాన్ని గేదెగా భావిస్తే, అదే రూపాన్ని పొందుతారని సన్యాసులు అంటారు. ఇది భక్తి మార్గం యొక్క ఉదాహరణ. అలాగే, రాముడు వానర సైన్యంతో రావణునిపై విజయం పొందారు అనేది కూడా ఒక ఉదాహరణ కదా. మీరు ఇక్కడ కూర్చున్నారు, మనమే దేవీ-దేవతలుగా, డబల్ కిరీటధారులుగా అవుతామని మీకు తెలుసు. స్కూల్లో చదువుకునేటప్పుడు, నేను ఇది చదువుకొని డాక్టరుగా అవుతాను, ఇంజనీరుగా అవుతాను అని అంటారు. మనం ఈ చదువుతో దేవీ-దేవతలుగా తయారవుతున్నామని మీకు తెలుసు. ఈ శరీరాన్ని వదిలేస్తాము, తర్వాత మన శిరస్సుపై కిరీటం ఉంటుంది. ఇది చాలా అశుద్ధమైన ఛీ-ఛీ ప్రపంచము. కొత్త ప్రపంచం ఫస్ట్ క్లాస్ ప్రపంచము. పాత ప్రపంచం పూర్తిగా థర్డ్ క్లాస్ వంటిది. ఈ ప్రపంచమైతే సమాప్తం కానున్నది. మనల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేసేవారు తప్పకుండా విశ్వ రచయితే అవుతారు, ఇతరులెవ్వరూ చదివించలేరు. శివబాబాయే మనల్ని చదివించి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఆత్మాభిమానులుగా అవ్వండి అని తండ్రి అర్థం చేయించారు. ఆత్మాభిమానులుగా అవ్వడంలోనే శ్రమ ఉంది. పూర్తిగా ఆత్మాభిమానులుగా అయినట్లయితే ఇంకేం కావాలి! మీరు ఎలాగూ బ్రాహ్మణులే, మనం దేవతలుగా తయారవుతున్నామని మీకు తెలుసు. నేను ఇలా తయారవుతున్నాను అనే నషా ఉంటుంది. ముందు మనం కలియుగ నరకంలో పతితులుగా ఉండేవారము. అసురులకు మరియు దేవతలకు ఎంత తేడా ఉంది. దేవతలు ఎంత పవిత్రంగా ఉంటారు. ఇక్కడ మనుష్యులు ఎంత పతితంగా ఉన్నారు. ముఖం మనుష్యుల వలె ఉన్నా కానీ గుణం ఎలా ఉందో చూడండి. స్వయంగా దేవతల పూజారులు కూడా వారి ఎదురుగా, మీరు సర్వగుణ సంపన్నులు….. మాలో ఏ గుణాలు లేవు అని అంటూ మహిమను పాడుతారు. ఇప్పుడు మీరు పరివర్తన చెంది దేవతలుగా తయారవుతారు. తాము కృష్ణపురిలోకి వెళ్ళాలనే కృష్ణుడిని పూజిస్తారు. కానీ ఎప్పుడు వెళ్తాము అనేది వారికి తెలియదు. భగవంతుడు వచ్చి ఫలమిస్తారని భక్తి చేస్తూ ఉంటారు. భక్తి ఫలం సద్గతి. ఇది చదువు. ముందుగా, మమ్మల్ని చదివించేవారు ఎవరు అనే నిశ్చయం కావాలి. వీరు శ్రీ శ్రీ….. తండ్రి మనకు శ్రీమతం ఇస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఎవరికైతే ఈ విషయం తెలియదో, వారు శ్రేష్ఠంగా ఎలా అవ్వగలరు. ఈ రోజుల్లోనైతే ఒకరినొకరు భ్రష్టంగా తయారుచేసుకునే మతాన్ని ఇచ్చుకుంటున్నారు. భ్రష్ట మతము అనగా ఆసురీ మతము. ఇంతమంది బ్రాహ్మణులందరూ శ్రీ శ్రీ శివబాబా మతాన్ని అనుసరిస్తున్నారు. పరమాత్ముని మతముతోనే శ్రేష్ఠంగా తయారవుతారు. ఎవరి భాగ్యంలో ఉంటే, వారి బుద్ధిలోనే కూర్చుంటుంది, లేదంటే ఏమీ అర్థం చేసుకోరు. అర్థం చేసుకున్నప్పుడు వారంతట వారే సహాయం చేయడం మొదలుపెడతారు. చాలామందికి, వీరు (బ్రహ్మా) ఎవరు అనేది తెలియను కూడా తెలియదు, అందుకే బాబా ఎవరినీ కలవరు. వాళ్లు ఇంకా ఆసురీ మతాన్ని తెలుపుతూ ఉంటారు. ఇప్పుడు అందరూ మానవ మతాన్నే అనుసరిస్తున్నారు. శ్రీమతం తెలియని కారణంగా బ్రహ్మా బాబాకు కూడా తమ మతాన్ని ఇవ్వడం మొదలుపెడతారు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మిమ్మల్ని శ్రేష్ఠంగా తయారుచేయడానికే వచ్చారు. ఇప్పుడు పిల్లలంటారు – బాబా, 5 వేల సంవత్సరాల క్రితం వలె మేము మిమ్మల్ని కలిసాము. ఎవరికైతే ఈ విషయం తెలియదో, వారు ఈ రకమైన జవాబు ఇవ్వలేరు. పిల్లలకు చదువు పట్ల చాలా నషా ఉండాలి. ఇది చాలా ఉన్నతమైన చదువు. కానీ మాయ కూడా చాలా విరుద్ధంగా ఉంది. ఏ చదువు ద్వారానైతే శిరస్సుపై డబల్ కిరీటం లభిస్తుందో, ఆ చదువును మనం చదువుతున్నామని మీకు తెలుసు. భవిష్య జన్మ-జన్మలకు డబల్ కిరీటధారులుగా అవుతారు. కావున దాని కోసం అటువంటి పురుషార్థం చేయాలి. దీనిని రాజయోగం అని అంటారు. ఇది ఎంత అద్భుతము. లక్ష్మీనారాయణుల మందిరాలకు వెళ్ళండి అని బాబా ఎప్పుడూ అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు పూజారులకు కూడా అర్థం చేయించవచ్చు. వారిని అడగండి – లక్ష్మీనారాయణులకు ఈ పదవి ఎలా లభించింది, వీరు విశ్వానికి యజమానులుగా ఎలా అయ్యారు? ఈ విధంగా కూర్చుని ఎవరికైనా వినిపిస్తే, పూజారుల కళ్యాణం కూడా జరుగుతుంది. ఈ లక్ష్మీనారాయణులకు రాజ్యం ఎలా లభించింది అనేది మేము మీకు అర్థం చేయిస్తాము అని మీరు చెప్పవచ్చు. నేను మీకు రాజయోగాన్ని నేర్పించి రాజులకే రాజులుగా తయారుచేస్తాను అని గీతలో కూడా భగవానువాచ ఉంది కదా. కావున పిల్లలకు, మేము ఇలా తయారవుతున్నాము అని ఎంత నషా ఉండాలి. మీ ప్రస్తుత చిత్రాన్ని మరియు రాజ్యపు చిత్రాన్ని తీయించుకొని పెట్టుకోండి. కింద మీ చిత్రము ఉండాలి, పైన రాజ్యపు చిత్రము ఉండాలి, దీనికి ఖర్చు ఏమీ అవ్వదు. రాజ దుస్తులను వెంటనే తయారుచేయవచ్చు. ఆ చిత్రాన్ని మీ వద్ద పెట్టుకుంటే, మేమే దేవతలుగా తయారవుతున్నాము అని పదే-పదే గుర్తుకొస్తూ ఉంటుంది. ఆ పైన శివబాబా చిత్రముండాలి. ఈ చిత్రాలన్నీ తీయించుకోవాలి. మనం మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతాము. మనం ఈ శరీరాలను వదిలి వెళ్ళి దేవతలుగా తయారవుతాము ఎందుకంటే ఇప్పుడు ఈ రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. కనుక ఈ ఫోటో సహాయపడుతుంది. పైన శివబాబా, దాని కింద రాజ దుస్తులలో ఉన్న చిత్రము, దాని కింద మీ సాధారణ చిత్రము ఉండాలి. మనం శివబాబా నుండి రాజయోగాన్ని నేర్చుకొని, డబుల్ కిరీటధారులైన దేవతలుగా తయారవుతున్నాము. ఈ చిత్రం మీ దగ్గర ఉంటే, ఎవరైనా అడిగినప్పుడు, మాకు నేర్పించేవారు ఈ శివబాబా అని వారికి తెలియజేయవచ్చు. చిత్రాన్ని చూస్తే పిల్లలకు నషా ఎక్కుతుంది. దుకాణాలలో కూడా ఈ చిత్రాన్ని పెట్టుకోండి. భక్తి మార్గంలో బాబా, నారాయణుడి చిత్రాన్ని పెట్టుకునేవారు, అది జేబులో కూడా ఉండేది. మీరు కూడా మీ ఫోటో పెట్టుకుంటే, మేమే దేవీ-దేవతలుగా తయారవుతున్నామని గుర్తుంటుంది. తండ్రిని స్మృతి చేసే ఉపాయాలను వెతుకుతూ ఉండాలి. తండ్రి స్మృతిని మర్చిపోతేనే పడిపోతారు. వికారాల్లో పడిపోతే, ఇప్పుడిక మేము ఈ దేవతలుగా తయారవ్వలేము అని సిగ్గు అనిపిస్తుంది. ఇప్పుడు మేము దేవతలుగా ఎలా అవుతాము – అని హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. బాబా అంటారు – వికారాల్లో పడిపోయిన వారి ఫోటోలను పక్కకు తీసేయండి. మీరు స్వర్గంలోకి వెళ్ళేందుకు యోగ్యులు కారు, మీ పాస్పోర్టు క్యాన్సిల్ అయిపోయిందని వారికి చెప్పండి. స్వయం వారు కూడా – మేము పడిపోయాము, ఇప్పుడు స్వర్గంలోకి ఎలా వెళ్తాము అని ఫీల్ అవుతారు. బాబా నారదుని ఉదాహరణను ఇస్తారు. మీ ముఖాన్ని చూసుకోండి, లక్ష్మిని వరించేందుకు యోగ్యులుగా ఉన్నారా? అని వారికి చెప్పారు. అప్పుడు నారదునికి తన ముఖం కోతి వలె కనిపించింది. అలాగే మనుష్యులకు కూడా – మాలో ఈ వికారాలున్నాయి, మరి శ్రీ లక్ష్మీ-నారాయణులను ఎలా వరించగలము అని సిగ్గు అనిపిస్తుంది. బాబా అయితే చాలా యుక్తులను తెలియజేస్తారు. కానీ ఎవరైనా విశ్వాసం పెట్టుకోవాలి కదా. వికారాల నషా కలిగితే, ఈ లెక్కన మేము రాజులకే రాజులుగా, డబల్ కిరీటధారులుగా ఎలా అవుతాము అని అనుకుంటారు. పురుషార్థమైతే చేయాలి కదా. బాబా అర్థం చేయిస్తారు – ఇటువంటి సుందరమైన యుక్తులను రచించండి మరియు అందరికీ అర్థం చేయిస్తూ ఉండండి. ఈ రాజయోగం ద్వారా స్థాపన జరుగుతుంది. ఇప్పుడు వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. రోజురోజుకు తుఫాన్ల జోరు పెరుగుతూ ఉంటుంది. బాంబులు మొదలైనవి కూడా తయారవుతున్నాయి.

పిల్లలైన మీరు ఉన్నత పదవిని పొందడానికే ఈ చదువు చదువుకుంటున్నారు. మీరు ఒక్కసారి మాత్రమే పతితం నుండి పావనంగా అవుతారు. మేము నరకవాసులుగా ఉన్నామని మనుష్యులు అర్థం చేసుకోరు ఎందుకంటే రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు. ఇప్పుడు మీరు రాతిబుద్ధి కలవారి నుండి పారసబుద్ధి కలవారిగా తయారవుతున్నారు. భాగ్యంలో ఉంటే వెంటనే అర్థం చేసుకుంటారు. లేదంటే ఎంతగా తల బాదుకున్నా సరే, బుద్ధిలో కూర్చోదు. తండ్రి గురించే తెలియదు అంటే వారు నాస్తికులు అనగా అనాథలు. శివబాబా పిల్లలు అన్నప్పుడు ఆ నాథుడికి చెందినవారిగా అవ్వాలి కదా. ఇక్కడ ఎవరికైతే జ్ఞానముంటుందో, వారు తమ పిల్లలను వికారాల నుండి రక్షిస్తూ ఉంటారు. అజ్ఞానులు తమ వలె తమ పిల్లలను కూడా వికారాల్లో చిక్కుకునేలా చేస్తారు. ఇక్కడ వికారాల నుండి రక్షించడం జరుగుతుందని మీకు తెలుసు. ముందు కన్యలను రక్షించాలి. తల్లిదండ్రులు వికారాల్లోకి తోసేస్తున్నట్లుగా చేస్తారు. ఇది భ్రష్టాచారీ ప్రపంచమని మీకు తెలుసు. శ్రేష్ఠాచారీ ప్రపంచాన్ని అయితే అందరూ కోరుకుంటారు కానీ దానిని ఎవరు తయారుచేస్తారు? భగవానువాచ – నేను ఈ సాధు-సత్పురుషులను కూడా ఉద్ధరిస్తాను. భగవంతుడే అందరినీ ఉద్ధరించాలని గీతలో కూడా రాయబడి ఉంది. భగవంతుడైన తండ్రి మాత్రమే వచ్చి అందరినీ ఉద్ధరిస్తారు. నిజంగా గీతా భగవంతుడు శివుడు అని ఒకవేళ ఈ సమయంలో తెలిస్తే, ఏం జరుగుతుందో ఊహించలేము. కానీ దానికి ఇంకాస్త సమయముంది. లేదంటే అందరి సింహాసనాలు కదలడం మొదలవుతాయి. సింహాసనాలు కదులుతాయి కదా. యుద్ధం మొదలైనప్పుడు, వీరి సింహాసనం కదలడం మొదలయ్యింది, ఇప్పుడిక పడిపోతారని తెలుస్తుంది. అవి ఇప్పుడే కదిలితే, అలజడి రేకెత్తుతుంది. మున్ముందు అలా జరగనున్నది. కావున భాషణలో కూడా మీరు అర్థం చేయించవచ్చు. ఎవరికైతే సంస్కృతం బాగా వచ్చో, వారు శ్లోకాలను వినిపించవచ్చు. తప్పకుండా బ్రహ్మా తనువు ద్వారా స్థాపన చేస్తున్నాను అని పతితపావనుడు, సర్వుల సద్గతిదాత స్వయంగా చెప్తున్నారు. సర్వులకు సద్గతినిస్తున్నారు అనగా ఉద్ధరిస్తున్నారు. భాషణ చేయడంలో చాలా నషా ఉండాలి. కన్యలది కొత్త రక్తము. జ్ఞానమనే రాళ్ళను వేయగలరు. విద్యార్థులకు కొత్త రక్తం ఉంటుంది కదా. కావున చాలా హంగామాలు చేస్తారు, రాళ్ళు విసురుతారు. వారు ఇందులో చురుకుగా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మీది కూడా కొత్త రక్తము. వారు ఎంత నష్టం కలిగిస్తున్నారు అనేది మీకు తెలుసు. ఇక్కడ మీది ఈశ్వరీయ కొత్త రక్తము. మీరు పాత నుండి కొత్తగా అవుతున్నారు. మీ ఆత్మ ఏదైతే పాతగా, ఇనుప యుగముదిగా అయిపోయిందో, అది ఇప్పుడు కొత్తగా, బంగారు యుగముదిగా అవుతుంది. కనుక పిల్లలకు చాలా అభిరుచి ఉండాలి. నషా స్థిరంగా ఉంచుకోవాలి. తమ తోటివారిని మేల్కొల్పాలి. గురు మాత అని అంటూ ఉంటారు కూడా. మాత గురువుగా ఎప్పుడు అవుతారు అనేది మీకు తెలుసు. గురువుల పరంపర ఇప్పుడు నడుస్తుంది. తండ్రి వచ్చి మాతలపై జ్ఞానామృత కలశాన్ని పెడతారు. మొదలవ్వడం కూడా ఇలాగే మొదలవుతుంది. సెంటర్ల కోసం కూడా, బ్రాహ్మణి కావాలి అని అంటారు. బాబా అయితే, మీ అంతట మీరు నడిపించండి అని అంటారు. అంత ధైర్యం లేదు, బాబా, ఒక మాత కావాలి అని అంటారు. ఇది కూడా మంచిదే, వారికి గౌరవమిస్తున్నారు. ఈ రోజుల్లో ప్రపంచంలో ఒకరికొకరు కుంటి గౌరవాన్ని ఇచ్చుకుంటున్నారు. ఎవరికీ స్థిరమైన గౌరవం లభించదు. ఈ సమయంలో పిల్లలైన మీకు స్థిరమైన రాజ్య భాగ్యం లభిస్తుంది. తండ్రి మీకు ఎన్ని రకాలుగా అర్థం చేయిస్తారు. స్వయాన్ని సదా హర్షిత ముఖులుగా ఉంచుకునేందుకు తండ్రి చాలా మంచి-మంచి యుక్తులను తెలియజేస్తారు. ఓహో, మేము ఈ లక్ష్మీనారాయణులుగా తయారవుతున్నాము అనే శుభ భావన పెట్టుకోవాలి. ఒకవేళ ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే, ఇక పురుషార్థం ఏం చేస్తారు. బాబా అయితే పురుషార్థం తెలుపుతారు, పురుషార్థం ఎప్పుడూ వ్యర్థమవ్వదు. అది సదా సఫలమవుతుంది. రాజధాని స్థాపనవుతుంది. వినాశనం కూడా మహాభారీ మహాభారత యుద్ధం ద్వారా జరగనున్నది. మున్ముందు మీరు కూడా జోరును పెంచుతారు, అప్పుడు వారంతా వస్తారు. ఇప్పుడు అర్థం చేసుకోరు, లేదంటే వారి రాజ్యం సమాప్తమైపోతుంది. మీ వద్ద చాలా మంచి చిత్రాలు ఉన్నాయి. ఇది సద్గతి అనగా సుఖధామము, అది ముక్తిధామము. ఆత్మలమైన మనమంతా నిర్వాణధామంలో ఉంటామని బుద్ధి కూడా చెప్తుంది. అక్కడ నుండి తర్వాత టాకీ ధామంలోకి వస్తాము. ఆత్మలమైన మనము అక్కడ ఉండేవారము. ఈ ఆటయే భారత్ పై తయారుచేయబడింది. శివ జయంతిని కూడా ఇక్కడే జరుపుకుంటారు. తండ్రి అంటారు – నేను వచ్చాను, కల్పం తర్వాత మళ్ళీ వస్తాను. భారత్ యే స్వర్గంగా ఉండేది. క్రీస్తుకు ఇన్ని సంవత్సరాల క్రితం స్వర్గముండేదని అంటారు కూడా. ఇప్పుడు లేదు, మళ్ళీ వస్తుంది. కావున తప్పకుండా నరకవాసుల వినాశనం, స్వర్గవాసుల స్థాపన జరగాలి. మీరు స్వర్గవాసులుగా తయారవుతున్నారు, నరకం వినాశనమైపోతుంది. ఈ వివేకం కూడా ఉండాలి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ప్రతి ఒక్కరి పట్ల శుభ భావన పెట్టుకోవాలి. అందరికీ సత్యమైన గౌరవాన్నివ్వాలి. సత్యయుగ రాజధానిలో ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేయాలి.

2. ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి. మానవ మతాన్ని వదిలి ఒక్క శ్రీమతాన్నే అనుసరించాలి. చదువు యొక్క నషాలో ఉండాలి.

వరదానము:-

సేవాధారి ఆత్మల మస్తకంపై విజయ తిలకం దిద్దబడి ఉంటుంది, కానీ ఏ స్థానం యొక్క సేవ చేయాలో, ఆ స్థానంలో ముందు నుండే సెర్చ్ లైట్ యొక్క ప్రకాశాన్ని ప్రసరింపజేయాలి. స్మృతి యొక్క సెర్చ్ లైట్ ద్వారా ఎటువంటి వాయుమండలం తయారవుతుందంటే, దాని ద్వారా అనేక ఆత్మలు సహజంగా సమీపంగా వచ్చేస్తారు. అప్పుడిక తక్కువ సమయంలో సఫలత వేయి రెట్లు లభిస్తుంది. దీని కోసం – మేము విజయీ రత్నాలము కావున ప్రతి కర్మలో విజయం ఇమిడి ఉంది అనే దృఢ సంకల్పం చేయండి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top