25 November 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
24 November 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - తమ భాగ్యాన్ని ఉన్నతంగా తయారుచేసుకోవాలంటే ఆత్మిక సేవ పట్ల అభిరుచి పెట్టుకోండి, అందరికీ జ్ఞాన ధనాన్ని దానం చేస్తూ ఉండండి”
ప్రశ్న: -
నేటి వరకు మనుష్యులెవ్వరూ ఇవ్వలేని ఏ శ్రీమతాన్ని ఆత్మిక తండ్రి ఇస్తారు?
జవాబు:-
ఓ ఆత్మిక పిల్లలూ, మీరు ఆత్మిక సేవలో దధీచి ఋషి వలె ఎముకలను అర్పించండి. తండ్రి ద్వారా అవినాశీ జ్ఞాన రత్నాలు ఏవైతే లభించాయో, వాటిని దానం చేయండి. ఇదే సత్యమైన సేవ. ఇటువంటి సేవను చేసే మతమును మనుష్యులెవ్వరూ ఇవ్వలేరు. ఆత్మిక సేవ చేసేవారు సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటారు. వారి భాగ్యం ఉన్నతంగా తయారవుతూ ఉంటుంది.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
ప్రపంచం మారినా….
ఓంశాంతి. పిల్లలు పాటలోని రెండు లైన్లను విన్నారు. వారైతే పాటను తయారుచేసారు. ఎలాగైతే ఎవరికైనా నిశ్చితార్థం జరిగితే, ఈ విషయం పక్కాగా ఉంటుంది – స్త్రీ-పురుషులు ఒకరినొకరు ఎప్పుడూ విడిచిపెట్టరు అని. పరస్పరంలో పడకపోతే విడిచిపెట్టేసేవారు ఎవరో అరుదుగా ఉంటారు. ఇక్కడ పిల్లలైన మీరు ఎవరితో ప్రతిజ్ఞ చేస్తారు? ఈశ్వరునితో. వారితో పిల్లలైన మీకు లేదా ప్రేయసులైన మీకు నిశ్చితార్థం జరిగింది. కానీ ఎవరైతే ఇలా విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారో, వారిని కూడా విడిచిపెట్టేస్తారు. ఇక్కడ పిల్లలైన మీరు కూర్చున్నారు. ఇప్పుడు అనంతమైన బాప్ దాదా వచ్చి ఉన్నారని మీకు తెలుసు. ఇక్కడ మీకున్న ఈ అవస్థ బయట సెంటర్లలో ఉండదు. ఇక్కడ బాప్ దాదా వచ్చి ఉన్నారని మీరు అర్థం చేసుకుంటారు. బయట సెంటర్లలో, బాబా ద్వారా వినిపించబడిన మురళీ వచ్చిందని భావిస్తారు. ఇక్కడకు మరియు అక్కడకు చాలా తేడా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అనంతమైన బాప్ దాదా సమ్ముఖంలో మీరు కూర్చున్నారు. అక్కడ మీరు సమ్ముఖంలో ఉండరు. సమ్ముఖంలోకి వెళ్ళి మురళీ వినాలని కోరుకుంటారు. బాబా వచ్చి ఉన్నారని ఇక్కడ పిల్లల బుద్ధిలో ఉంది. ఉదాహరణకు ఇతర సత్సంగాలుంటాయి, అక్కడ ఫలానా స్వామి వస్తారని అనుకుంటారు. కానీ ఈ ఆలోచన కూడా అందరికీ ఏకరసంగా ఉండదు. కొంతమందికి సంబంధీకులు గుర్తుకొస్తారు. బుద్ధి ఆ ఒక్క గురువు పైన కూడా నిలవదు. స్వామి స్మృతిలో కూర్చునేవారు ఎవరో అరుదుగా ఉండవచ్చు. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. అలాగని, అందరూ శివబాబా స్మృతిలో ఉంటారని కాదు. బుద్ధి పరుగెడుతూ ఉంటుంది. మిత్ర-సంబంధీకులు గుర్తుకొస్తారు. మొత్తం సమయమంతా ఒక్క శివబాబా సమ్ముఖంలోనే ఉంటే అహో సౌభాగ్యము. స్థిరమైన స్మృతిలో ఎవరో అరుదుగా మాత్రమే ఉంటారు. ఇక్కడ శివబాబా సమ్ముఖంలో ఉండడంలో చాలా సంతోషముండాలి. అతీంద్రియ సుఖం గురించి గోపీ వల్లభుని గోప గోపికలను అడగండి అని ఇక్కడే అంటూ ఉంటారు. ఇక్కడ మీరు బాబా స్మృతిలో కూర్చున్నారు. ఇప్పుడు మనం ఈశ్వరునికి చెందినవారిగా అయ్యాము, తర్వాత దైవీ ఒడిలో ఉంటామని తెలుసు. ఈ చిత్రంలో ఇది కరెక్షన్ చేయాలి, ఇది వ్రాయాలి అని కొంతమంది బుద్ధిలో సేవా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. కానీ మంచి పిల్లలైతే, ఇప్పుడిక తండ్రి నుండే వినాలి అని అనుకుంటారు. ఇంకే సంకల్పాన్ని రానివ్వరు. తండ్రి జ్ఞాన రత్నాలతో జోలిని నింపడానికి వచ్చారు. కనుక తండ్రితోనే బుద్ధియోగం జోడించాలి. నంబరువారుగా ధారణ చేసేవారైతే ఎలాగూ ఉంటారు. కొందరు మంచి రీతిగా ధారణ చేస్తారు, కొందరు తక్కువగా ధారణ చేస్తారు. బుద్ధియోగం వేరే వైపు పరుగులు తీస్తూ ఉంటే ధారణ జరగదు. కచ్చాగా అయిపోతారు. ఒకటి రెండు సార్లు మురళీ విన్నారు కానీ ధారణ జరగలేదు అంటే ఈ అలవాటు పక్కా అయిపోతుంది. ఇక తర్వాత ఎంత విన్నా కూడా, ధారణ జరగదు. ఎవ్వరికీ వినిపించలేరు. ఎవరికైతే ధారణ జరుగుతుందో, వారికి సేవ పట్ల అభిరుచి ఉంటుంది, ఉత్సాహంతో ఉంటారు, వెళ్ళి ధనాన్ని (జ్ఞాన ధనం) దానం చేస్తాను ఎందుకంటే ఈ ధనం ఒక్క తండ్రి వద్ద తప్ప ఇంకెవ్వరి వద్దా లేదు. అందరికీ ధారణ జరగదని కూడా తండ్రికి తెలుసు. అందరూ ఏకరసంగా ఉన్నత పదవిని పొందలేరు, అందుకే బుద్ధి వేరే వైపులకు భ్రమిస్తూ ఉంటుంది. భవిష్య భాగ్యం అంత ఉన్నతంగా తయారవ్వజాలదు. కొందరు స్థూల సేవలలో తమ ఎముకలను అర్పిస్తారు, అందరినీ రాజీ చేస్తారు. ఉదాహరణకు భోజనం తయారుచేస్తారు, తినిపిస్తారు, ఇది కూడా సబ్జెక్ట్ యే కదా. ఎవరికైతే సేవ పట్ల అభిరుచి ఉంటుందో, వారు నోటితో చెప్పకుండా ఉండరు. బాబా చూస్తారు కూడా – ఎక్కడా దేహాభిమానమైతే లేదు కదా, పెద్దవారికి గౌరవమిస్తున్నారా లేదా. పెద్ద మహారథులకు గౌరవం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా చిన్నవారు కూడా తెలివైనవారిగా అయితే, అప్పుడు పెద్దవారు వీరిని గౌరవించాల్సి ఉంటుంది ఎందుకంటే వారి బుద్ధి గ్యాలప్ చేస్తుంది. సేవ పట్ల అభిరుచి చూసి తండ్రి సంతోషపడతారు కదా. వీరు మంచి సేవ చేస్తారు అని అనుకుంటారు. రోజంతా ప్రదర్శనీలో అర్థం చేయించేందుకు కూడా ప్రాక్టీస్ చేయాలి. ప్రజలు కూడా ఎంతోమంది తయారవ్వాలి కదా. లక్షల మంది ప్రజలు కావాలి. ఇంకే ఉపాయము లేదు. సూర్యవంశీ, చంద్రవంశీ రాజా, రాణి, ప్రజలు అందరూ ఇక్కడే తయారవ్వాలి. ఎంత సేవ చేయాలి. ఇప్పుడు మేము బ్రాహ్మణులుగా అయ్యామని పిల్లల బుద్ధిలో ఉంది. ఇంట్లో, గృహస్థంలో ఉండడంతో ప్రతి ఒక్కరి అవస్థ ఎవరిది వారిది ఉంటుంది కదా. ఇళ్ళు-వాకిళ్ళను అయితే వదలకూడదు. బాబా అంటారు – ఇంట్లోనే ఉండండి, కానీ ఈ పాత ప్రపంచం సమాప్తమయ్యే ఉంది అన్న నిశ్చయం బుద్ధిలో ఉంచుకోవాలి. మనకు ఇప్పుడు తండ్రితోనే పని ఉంది. కల్ప క్రితం ఎవరైతే ఈ జ్ఞానాన్ని తీసుకున్నారో, వారే తీసుకుంటారని కూడా తెలుసు. ప్రతి సెకండు యథావిధిగా రిపీట్ అవుతుంది. ఆత్మలో జ్ఞానముంది కదా. తండ్రి వద్ద కూడా జ్ఞానముంది. పిల్లలైన మీరు కూడా తండ్రి వలె తయారవ్వాలి, పాయింట్లను ధారణ చేయాలి. అన్ని పాయింట్లను ఒకేసారి అర్థం చేయించడం జరగదు. లక్ష్యం పక్కాగా పెట్టుకోవడం జరుగుతుంది. వినాశనం కూడా ఎదురుగా నిలబడి ఉంది. ఇది అదే వినాశనము. సత్య-త్రేతా యుగాలలో యుద్ధం మొదలైనవేవీ ఉండదు. తర్వాత ఎప్పుడైతే చాలా ధర్మాలు ఉంటాయో, సైన్యాలు పెద్దవిగా ఉంటాయో, అప్పుడు యుద్ధం మొదలవుతుంది. మొట్టమొదట ఆత్మలు సతోప్రధానంగా దిగుతాయి, తర్వాత సతో, రజో, తమోలలోకి వస్తాయి. ఈ విషయాలన్నీ బుద్ధిలో ఉంచుకోవాలి. ఇక్కడ కూర్చున్నారు కావున రాజధాని ఎలా స్థాపనవుతుంది అనేది బుద్ధిలో ఉంచుకోవాలి. శివబాబా వచ్చి మనకు ఖజానాను ఇస్తారు, దానిని బుద్ధిలో ధారణ చేయాలి. మంచి-మంచి పిల్లలు నోట్స్ రాసుకుంటారు. నోట్స్ వ్రాసుకోవడం మంచిది, అప్పుడు బుద్ధిలోకి టాపిక్స్ వస్తాయి. ఈ రోజు ఈ టాపిక్ పై అర్థం చేయిస్తాను అని అనుకుంటారు. తండ్రి అంటారు – నేను మీకు ఎంత ఖజానా ఇచ్చాను. సత్య-త్రేతా యుగాలలో మీ వద్ద అపారమైన ధనముండేది, తర్వాత వామ మార్గంలోకి వెళ్ళడంతో తగ్గుతూ వచ్చింది. సంతోషం కూడా తగ్గిపోతూ వచ్చింది. ఏవో ఒక వికర్మలు జరగడం మొదలయ్యాయి. దిగుతూ-దిగుతూ కళలు తగ్గిపోతూ ఉంటాయి. సతోప్రధానం, సతో, రజో, తమో స్థితులుంటాయి కదా. సతో నుండి రజోలోకి వచ్చినప్పుడు వెంటనే వస్తారని కాదు. తమోప్రధానతలోకి కూడా నెమ్మది-నెమ్మదిగా దిగుతారు, అందులో కూడా సతో, రజో, తమో స్థితులు ఉంటాయి. వెంటనే తమోప్రధానంగా అవ్వరు. నెమ్మది-నెమ్మదిగా మెట్లు దిగుతూ వెళ్తారు. కళలు తగ్గుతాయి. ఇప్పుడు జంప్ చేయాలి. తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వాలి. దీని కోసం ఇంకా కొంత సమయమే ఉంది. ఎక్కితే వైకుంఠ రసాన్ని చవిచూస్తారు అని అంటూ ఉంటారు కూడా. కామము యొక్క చెంప దెబ్బ తగిలితే పూర్తిగా ముక్కలు ముక్కలుగా అయిపోతారు, ఎముకలు విరిగిపోతాయి. మనుష్యులు తమ శరీరాన్ని హత్య చేసుకున్నట్లే అవుతుంది. దీనిని ఆత్మహత్య కాదు, జీవహత్య అని అంటారు. అలాగే ఇది కూడా ఆత్మను హత్య చేసుకున్నట్లే అవుతుంది. చేసిన సంపాదనంతా సమాప్తమైపోతుంది. ఇక్కడైతే తండ్రి నుండి వారసత్వాన్ని పొందాలి, తండ్రిని స్మృతి చేయాలి ఎందుకంటే తండ్రి నుండి రాజ్యాధికారం లభిస్తుంది. తమను తాము ప్రశ్నించుకోవాలి – నేను తండ్రిని స్మృతి చేసి భవిష్యత్తు కోసం ఎంత సంపాదించుకున్నాను? ఎంతమంది అంధులకు చేతికర్రగా అయ్యాను? ఈ పాత ప్రపంచం మారుతుందని ప్రతి ఇంటికీ సందేశాన్ని ఇవ్వాలి. తండ్రి కొత్త ప్రపంచం కోసం రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మెట్ల చిత్రంలో చూపించారు, దీనిని తయారుచేయడంలో శ్రమ ఉంది. ఎవరైనా సహజంగా అర్థం చేసుకునే విధంగా తయారుచేయాలి అని రోజంతా ఆలోచన నడుస్తూ ఉంటుంది. స్వర్గంలోకి మొత్తం ప్రపంచమంతా రాదు. దేవీ-దేవతా ధర్మం వారు మాత్రమే వస్తారు. మీ సేవ అయితే చాలా జరిగేది ఉంది. మన క్లాసు ఎంత వరకు నడుస్తుందో మీకు తెలుసు. వారు కల్పం ఆయువును లక్షల సంవత్సరాలని భావిస్తారు. కావున శాస్త్రాలు మొదలైనవాటిని వినిపిస్తూనే ఉంటారు. అంతిమ సమయం వచ్చినప్పుడు సర్వుల సద్గతిదాత వస్తారు, అప్పుడిక మా శిష్యులు ఎవరైతే ఉన్నారో వారికి గతి ప్రాప్తిస్తుంది, తర్వాత మేము కూడా వెళ్ళి జ్యోతిలో లీనమైపోతామని భావిస్తారు. కానీ అలా జరగదు. మేము అమరుడైన తండ్రి ద్వారా సత్యాతి-సత్యమైన అమరకథను వింటున్నామని మీకు తెలుసు. కావున అమరుడైన బాబా ఏదైతే చెప్తున్నారో, దానిని అంగీకరించాలి కూడా. వారు కేవలం ఇదే చెప్తారు – నన్ను స్మృతి చేయండి మరియు పవిత్రంగా అవ్వండి, లేదంటే చాలా శిక్షలు అనుభవించవలసి ఉంటుంది, పదవి కూడా తగ్గిపోతుంది. సేవలో శ్రమించాలి. దధీచి ఋషి ఉదాహరణ ఉంది కదా, సేవలో ఎముకలను కూడా ఇచ్చేసారు. తమ శరీరం గురించి కూడా ఆలోచించకుండా సేవలో ఉండాలి. దీనినే ఎముకలను సైతం అర్పించేంత సేవ (మనస్ఫూర్తిగా చేసే సేవ) అని అంటారు మరియు రెండవది మనస్ఫూర్తిగా చేసే ఆత్మిక సేవ. ఆత్మిక సేవ చేసేవారు ఆత్మిక జ్ఞానాన్నే వినిపిస్తూ ఉంటారు. జ్ఞాన ధనాన్ని దానం చేస్తూ సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. ప్రపంచంలోని మనుష్యులు చేసే సేవ భౌతిక సేవ. కూర్చుని శాస్త్రాలను వినిపిస్తారు, అది ఆత్మిక సేవ ఏమీ కాదు. ఆత్మిక సేవను కేవలం తండ్రి మాత్రమే నేర్పిస్తారు. ఆత్మిక తండ్రియే వచ్చి ఆత్మిక పిల్లల (ఆత్మలు) ను చదివిస్తారు. మీరిప్పుడు సత్యయుగ కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అక్కడ మీ ద్వారా వికర్మలేవీ జరగవు. అది రామరాజ్యము. అక్కడ కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఆ కొద్దిమంది మాత్రమే వచ్చి చదువుకుంటారు. ఇప్పుడు రావణ రాజ్యంలో అందరూ దుఃఖితులుగా ఉన్నారు కదా. ఈ జ్ఞానమంతా నంబరువారు పురుషార్థానుసారంగా మీ బుద్ధిలో ఉంది. ఈ మెట్ల చిత్రంలోనే మొత్తం జ్ఞానమంతా వచ్చేస్తుంది. ఈ చిత్రాలను తయారుచేయడానికి మెషినరీ కావాలి. ఆ గవర్నమెంట్ యొక్క వార్తాపత్రికలు రోజుకు ఎన్ని ముద్రించబడతాయి. ఎన్ని కార్య వ్యవహారాలు నడుస్తాయి. ఇక్కడ అన్నీ చేతితో తయారుచేయవలసి ఉంటుంది.
తండ్రి అంటారు – ఈ అంతిమ జన్మ పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఈ జ్ఞానం ఎవరి వద్దా లేదు. ఈ మెట్ల చిత్రంలో ఇతర ధర్మాల సమాచారం ఎక్కడుంది? అని అంటారు. ఆ సమాచారం కూడా ఈ సృష్టి చక్రం చిత్రంలో చూపించారు. వారు కొత్త ప్రపంచంలోకి రానే రారు. వారికి శాంతి లభిస్తుంది. భారతవాసులు మాత్రమే స్వర్గంలో ఉండేవారు కదా. తండ్రి రాజయోగాన్ని నేర్పించడానికి భారత్ లోనే వస్తారు, అందుకే భారత్ యొక్క ప్రాచీన రాజయోగాన్ని అందరూ ఇష్టపడతారు. తప్పకుండా కొత్త ప్రపంచంలో కేవలం భారత్ మాత్రమే ఉండేదని ఈ చిత్రంతో వారు స్వయంగా అర్థం చేసుకుంటారు. తమ ధర్మం గురించి కూడా అర్థం చేసుకుంటారు. ఉదాహరణకు క్రైస్టు ధర్మ స్థాపన చేయడానకి వచ్చారు. ఈ సమయంలో వారు కూడా నిరుపేదగా ఉన్నారు. అందరూ తమోప్రధానంగా ఉన్నారు. ఇది రచయిత మరియు రచనల యొక్క ఎంత గొప్ప జ్ఞానము. మీరు ఇలా చెప్పవచ్చు – మాకు ఎవ్వరి ధనము అవసరం లేదు. ధనాన్ని మేమేం చేసుకుంటాము! మీరు ఈ విషయాలను వినండి మరియు ఇతరులకు వినిపించేందుకు ఈ చిత్రాలు మొదలైనవి ముద్రించండి. ఈ చిత్రాలను ఉపయోగించాలి. ఈ జ్ఞానం వినిపించే విధంగా హాలును తయారుచేయండి. ఇకపోతే, మేము ధనాన్ని తీసుకొని ఏం చేస్తాము. మీ ఇంటి వారి కళ్యాణమే జరగనున్నది. మీరు కేవలం ఏర్పాట్లు చేయండి, చాలామంది వచ్చి వింటారు. రచయిత మరియు రచనల జ్ఞానమైతే చాలా మంచిది. ఇది మనుష్యులే అర్థం చేసుకోవాలి. విదేశీయులు ఈ జ్ఞానాన్ని విని చాలా ఇష్టపడతారు, చాలా సంతోషిస్తారు. మేము కూడా తండ్రితో యోగం జోడించినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని అర్థం చేసుకుంటారు. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఈ జ్ఞానాన్ని గాడ్ ఫాదర్ తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరని అర్థం చేసుకుంటారు. ఖుదా (భగవంతుడు) బహిష్త్ ను (స్వర్గాన్ని) స్థాపన చేసారని అంటారు. కానీ వారు ఎలా వస్తారో ఎవ్వరికీ తెలియదు. మీరు చెప్పేవి విని చాలా సంతోషిస్తారు. తర్వాత పురుషార్థం చేసి యోగం నేర్చుకుంటారు. తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయ్యేందుకు కూడా పురుషార్థం చేస్తారు. సేవ కోసమైతే చాలా ఆలోచించాలి. భారత్ లో నైపుణ్యాన్ని చూపించినప్పుడే విదేశాలకు పంపిస్తారు. కొత్త ప్రపంచం తయారవ్వడానికి సమయమేమీ పట్టదని మనుష్యులు తెలుసుకుంటారు. ఎక్కడైనా భూకంపాలు మొదలైనవి సంభవిస్తే 2-3 సంవత్సరాలలో పూర్తిగా కొత్త ఇళ్ళు తయారవుతాయి. కార్మికులు ఎంత ఎక్కువగా ఉంటే అంత త్వరగా ఇల్లు తయారైపోతుంది. ఒక్క నెలలో కూడా ఇల్లు తయారుచేయగలరు. కార్మికులు, సామాన్లు మొదలైనవన్నీ తయారుగా ఉంటే ఇక నిర్మించడానికి సమయమేమీ పట్టదు. విదేశాలలో భవనాలు ఎలా తయారవుతాయి, మినిట్ మోటర్ వలె. మరి స్వర్గంలో ఎంత త్వరగా తయారవుతూ ఉండవచ్చు. బంగారం, వెండి మీకు చాలా లభిస్తాయి. గనుల నుండి బంగారం, వెండి, వజ్రాలు మొదలైనవి తీసుకొస్తారు. ఆ కళలన్నింటినీ నేర్చుకుంటున్నారు. సైన్స్ కు ఎంత గర్వముంది. ఈ సైన్స్ యే తర్వాత అక్కడ కూడా పనికొస్తుంది. ఇక్కడ నేర్చుకున్నవారు అక్కడ మరొక జన్మ తీసుకొని అవన్నీ ఉపయోగిస్తారు. ఆ సమయంలో మొత్తం ప్రపంచమంతా కొత్తదిగా అవుతుంది, రావణ రాజ్యమే సమాప్తమైపోతుంది. 5 తత్వాలు కూడా నియమానుసారంగా సేవలో ఉంటాయి. స్వర్గం తయారవుతుంది. అక్కడ ఉపద్రవాలేవీ సంభవించవు. రావణ రాజ్యమే ఉండదు, అందరూ సతోప్రధానంగా ఉంటారు. అన్నింటికంటే మంచి విషయం – తండ్రి పట్ల చాలా ప్రేమ ఉండాలి. తండ్రి ఏ చింతనైతే ఇస్తారో దానిని ధారణ చేయాలి మరియు ఇతరులకు దానం చేయాలి. ఎంతగా దానం చేస్తారో, అంతగా జమ అవుతూ ఉంటుంది. సేవయే చేయకపోతే ధారణ ఎలా జరుగుతుంది. సేవలో బుద్ధి నడవాలి. సేవ అయితే ఎంతో జరగగలదు. ఎవరో ఒకరు చేస్తూ ఉండాలి. రోజు-రోజుకు ఉన్నతి పొందాలి. తమ ఉన్నతిని కూడా చేసుకోవాలి. అచ్ఛా.
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. పరస్పరంలో ఒకరినొకరు గౌరవించుకోవాలి. సేవ పట్ల చాలా-చాలా అభిరుచి ఉంచాలి. జ్ఞాన రత్నాలతో తమ జోలిని నింపుకుని తర్వాత వాటిని దానం చేయాలి.
2. ఒక్క తండ్రి ద్వారా మాత్రమే వినాలి అనే సంకల్పం పెట్టుకోవాలి. ఇతర ఆలోచనలలో బుద్ధిని భ్రమింపజేయకూడదు.
వరదానము:-
ఎలాగైతే స్థూలమైన చేతులు, కాళ్ళను చాలా సహజమైన రీతిలో ఎక్కడ కావాలనుకుంటే అక్కడ నడిపిస్తారో లేదా కర్మలలో ఉపయోగిస్తారో, అలాగే సంకల్పాలను మరియు బుద్ధిని ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ పెట్టగలగాలి – దీనినే ఈశ్వరీయ అథారిటీ అని అంటారు. ఎలాగైతే వాణిలోకి రావడం సహజమో, అలా వాణి నుండి అతీతంగా వెళ్ళడం కూడా అంతే సహజమవ్వాలి. ఈ అభ్యాసంతోనే సాక్షాత్కార మూర్తులుగా అవుతారు. కనుక ఈ అభ్యాసాన్ని ఇప్పుడు సహజంగా మరియు నిరంతరంగా చేసుకోండి, అప్పుడు మాస్టర్ సర్వశక్తివంతులని అంటారు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!