25 January 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

January 25, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - ఇది మీ వానప్రస్థ అవస్థ కావున ఒక్క తండ్రినే స్మృతి చేయాలి, నిర్వాణధామములోకి వెళ్ళే ఏర్పాట్లు చేసుకోవాలి’’

ప్రశ్న: -

తండ్రి వద్ద ఏ విషయంలో భేదము లేదు?

జవాబు:-

పేదలు మరియు షావుకార్ల విషయంలో, భేదము లేదు. ప్రతి ఒక్కరికీ పురుషార్థం ద్వారా తమ ఉన్నత పదవిని పొందే అధికారం ఉంది. మున్ముందు అందరికీ తమ పదవి యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. బాబా అంటారు, నేను పేదల పెన్నిధిని, అందుకే ఇప్పుడు పేద పిల్లల ఆశలన్నీ పూర్తి అవుతాయి. ఇది అంతిమ సమయము. కొందరిది మట్టిలో కలిసిపోతుంది… ఎవరైతే తండ్రి వద్ద ఇన్ష్యూర్ చేసుకుంటారో, వారిది సఫలమవుతుంది.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

చివరికి నేటికి ఆ రోజు వచ్చింది..

ఓంశాంతి. దీని అర్థమైతే చాలా సహజము. ప్రతి ఒక్క విషయం క్షణంలో అర్థం చేసుకోవాల్సినది. క్షణంలో తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. అనంతమైన తండ్రి వచ్చేసారని పిల్లలకు తెలుసు. కానీ ఈ నిశ్చయం కూడా ఒక్కొక్కరికి స్థిరంగా కూర్చోదు. ఎలాగైతే లౌకిక సంబంధంలో తల్లికి బిడ్డ జన్మిస్తే, ఈమె జన్మనిచ్చినవారు మరియు పాలన చేసేవారు అని బిడ్డ వెంటనే అర్థం చేసుకుంటాడు. అలాగే ఇక్కడ కూడా వెంటనే అర్థం చేసుకోవాలి కదా. భక్తి తర్వాతనే భగవంతుడు వస్తారు అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు భక్తి ఎంత సమయం నడుస్తుంది, ఎప్పుడు మొదలవుతుంది, ఈ విషయాలు పిల్లలైన మీకు తప్ప ప్రపంచంలో ఇంకెవ్వరికీ తెలియవు. భక్తి ఎప్పటి నుండి మొదలైందో మీరు తెలియజేయగలరు. మనుష్యులైతే అది పరంపరగా నడుస్తూ వస్తుంది అని అంటారు. జ్ఞానం మరియు భక్తి, తప్పకుండా ఈ రెండూ ఉన్నాయి. ఇది అనాదిగా నడుస్తూ వస్తుంది అని అంటారు కానీ అనాది యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. ఈ డ్రామా చక్రం అనాది కాలం నుండి తిరుగుతూ ఉంది. దానికి ఆది, అంత్యము లేదు. మనుష్యులైతే వ్యర్థ ప్రలాపాలు పలుకుతూ ఉంటారు. ఒకసారి ఇన్ని సంవత్సరాలు అయ్యింది అని అంటారు, మరోసారి ఇన్ని సంవత్సరాలు అని చెప్తారు. తండ్రి వచ్చి అన్నీ నిరూపించి తెలియజేస్తారు. శాస్త్రాలు మొదలైనవి చదవడం వలన తండ్రి ప్రాప్తి అయితే ఏమీ కలగదు. తండ్రి ప్రాప్తి అయితే క్షణంలో కలుగుతుంది. క్షణంలో జీవన్ముక్తి. తండ్రి ఎప్పుడు వస్తారు అనేది కూడా ఎవరికీ తెలియదు. కల్పం ఆయువును పెద్దగా చేసేసారు. ఇప్పుడు తండ్రికైతే తెలుసు మరియు పిల్లలకు కూడా అంతా తెలుసు కానీ ఆశ్చర్యం ఏమిటంటే 10-20 సంవత్సరాలకు కూడా కొందరికి పూర్తి నిశ్చయం ఏర్పడదు. నిశ్చయం ఏర్పడిన తర్వాత మరి ఇంకెప్పుడూ, వీరు మా తండ్రి కాదు అని అనలేరు. ఇది చాలా సహజము కూడా. మీకైతే పిల్లలుగా అవ్వడానికి కూడా చాలా సమయం పట్టింది. 10-20 సంవత్సరాలకు కూడా పూర్తి నిశ్చయం ఏర్పడలేదు. ఇప్పుడు మీరు ఎవరికైనా పరిచయమిస్తే, క్షణంలో నిశ్చయం ఏర్పడుతుంది. జనకుని విషయం కూడా చివరి సమయానికి చెందినది ఎందుకంటే రోజు-రోజుకు చాలా సహజమవుతూ ఉంటుంది. ఎలాంటి మంచి-మంచి పాయింట్లు వెలువడతాయంటే ఎవరికైనా వెంటనే నిశ్చయం ఏర్పడుతుంది.

తండ్రి అంటారు, పిల్లలూ, అశరీరి భవ. ఈ దేహపు అనేక ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదలండి. నిజానికైతే ఒకే ధర్మం ఉండేది కదా. ఒకదాని నుండే వృద్ధి జరుగుతుంది కదా. ఇది ఉన్నదే వెరైటీ మనుష్య సృష్టి వృక్షము, ఇది మనుష్యులకు సంబంధించిన విషయము. వెరైటీ ధర్మాల వృక్షాన్ని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ధర్మాల కాన్ఫరెన్స్ జరుగుతుంది. కానీ మొట్టమొదటి పూజ్య ధర్మమేదో వారికి తెలియనే తెలియదు! బుద్ధిలోకి రావాలి. భారత్ ప్రాచీన ధర్మానికి చెందినది కావున తప్పకుండా ప్రాచీన ధర్మాన్ని పరమపిత పరమాత్మనే రచించి ఉంటారు. భారత్ లో శివ జయంతి గురించి కూడా చెప్పుకుంటూ ఉంటారు. మందిరాలు కూడా లెక్కలేనన్ని ఉన్నాయి. అయితే, అన్నింటికన్నా అత్యంత పెద్ద మందిరము తండ్రిది – అది నిర్వాణధామము. అక్కడ ఆత్మలమైన మనం కూడా తండ్రితో పాటు ఉంటాము. మందిరము నివసించే స్థానము కదా. మరి ఈ మహాతత్వము ఎంత పెద్ద మందిరము. బ్రహ్మాతత్వము అన్నింటికన్నా ఉన్నతోన్నతమైన మందిరము అని, మనమంతా అక్కడ నివసించేవారము అని మీ బుద్ధిలోకి రావాలి. అక్కడ సూర్యుడు, చంద్రుడు ఉండరు ఎందుకంటే అక్కడ రాత్రి, పగలు ఉండవు. వాస్తవానికి మన ఆత్మిక మందిరము ఆ నిర్వాణధామము. అదే శివాలయము, అక్కడ మనం శివబాబాతో పాటు ఉంటాము. శివబాబా అంటారు, నేను ఆ శివాలయంలో నివసించేవాడిని. అది అనంతమైన శివాలయము. శివుని పిల్లలైన మీరు కూడా అక్కడ నివసిస్తారు. అది నిరాకారీ శివాలయము. మళ్ళీ సాకారంలోకి వచ్చినప్పుడు, ఇక్కడ నివసించే స్థానం తయారవుతుంది. ఇప్పుడు శివబాబా ఇక్కడ ఉన్నారు, ఈ శరీరంలో కూర్చుని ఉన్నారు. వీరు చైతన్య శివాలయము, వీరితో మీరు సంభాషణ చేయగలరు. ఆ నిర్వాణధామం కూడా శివబాబా యొక్క శివాలయము, అక్కడ ఆత్మలమైన మనం ఉంటాము. ఆ ఇల్లు అందరికీ గుర్తుకొస్తుంది. అక్కడ నుండి మనం సతో, రజో, తమోలలో పాత్రను అభినయించేందుకు వస్తాము, వీటిలోకి ప్రతి ఒక్కరూ రావాల్సిందే. ఈ విషయం ప్రపంచంలో ఎవరి బుద్ధిలోనూ లేదు. ఆత్మలు ఎవరెవరైతే ఉన్నారో, వారందరికీ తమ-తమ అనాది పాత్ర లభించి ఉంది, దానికి ఆది లేదు, అంతమూ లేదు. మనం నిజానికి ఆ శివాలయంలో నివసించేవారము అని పిల్లలైన మీకు తెలుసు. శివబాబా ఏ స్వర్గాన్ని అయితే స్థాపన చేస్తారో, దానిని కూడా శివాలయము అని అంటారు. అది శివబాబా స్థాపన చేసిన స్వర్గము. అక్కడ కూడా పిల్లలే ఉంటారు. వారికి ఈ రాజ్య భాగం ఎలా లభించింది! అది సత్యయుగం యొక్క ఆది, ఇప్పుడిది కలియుగం యొక్క అంతిమము. మరి సత్యయుగంలో దేవీ-దేవతలను స్వర్గానికి యజమానులుగా ఎవరు తయారుచేసారు. ఇక్కడ కూడా ఎన్ని మంచి-మంచి ఖండాలు ఉన్నాయి. అమెరికా అన్నింటికన్నా ఫస్ట్ క్లాస్ ఖండము. చాలా ధనం కలది, శక్తివంతమైనది కూడా. ఈ సమయంలో అన్నింటికన్నా ఉన్నతమైనది. బృహస్పతి దశ కూర్చొని ఉంది. కానీ దానితో పాటు రాహు దశ కూడా కూర్చుని ఉంది. ఈ సమయంలో రాహు దశ అయితే అందరి పైన కూర్చుని ఉంది. వినాశనమైతే అందరిదీ జరిగేదే ఉంది. భారత్ ఒకప్పుడు అన్నింటికన్నా షావుకారుగా ఉండేది, ఇప్పుడు భారత్ పేదదిగా ఉంది. ఇదంతా మాయా యొక్క ఆర్భాటము. మాయది ఫుల్ ఫోర్సు ఉంది, అందుకే మనుష్యులు దీనిని స్వర్గముగా భావిస్తారు. అమెరికాలో ఏముందో చూడండి. మనుష్యులు ఆకర్షితులైపోతారు. బొంబాయి కూడా చూడండి, ఎంత ఫ్యాషనబుల్ గా అయిపోయింది. ఇంతకుముందు ఏమైనా ఇలా ఉండేదా. మాయ యొక్క ఆర్భాటం పూర్తిగా ఉంది. 8-10 అంతస్థుల మహళ్ళను ఎన్ని నిర్మిస్తున్నారు. స్వర్గంలో ఇన్ని అంతస్తులు ఏమైనా ఉంటాయా. అక్కడ రెండు అంతస్తులు కూడా ఉండవు. ఇక్కడే అలా తయారుచేస్తారు ఎందుకంటే భూమి లేదు. భూమి యొక్క ధర చాలా పెరిగిపోయింది. కావున మనుష్యులు ఇదే స్వర్గమని భావిస్తారు. ప్లాన్లు తయారుచేస్తూ ఉంటారు. కానీ నరుడు ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తారు… అని అంటారు. మనుష్యులు ఎంత చింతలో ఉంటారు. మృత్యువు అయితే అందరి కోసము ఉంది. అందరి మెడలో మృత్యువు యొక్క ఉరికంబం ఉంది. ఇప్పుడు మీరు కూడా ఉరికంబంపై ఉన్నారు. మీ బుద్ధి అక్కడ కొత్త ప్రపంచంతో జోడించబడి ఉంది. ఇప్పుడిది అందరూ వానప్రస్థ అవస్థలోకి వెళ్ళే సమయము, అందుకే తండ్రి అంటారు, ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. మీ అందరిదీ వానప్రస్థ అవస్థ, నేను అందరినీ తీసుకువెళ్ళేందుకు వచ్చాను అని నేను స్వయంగా మీకు డైరెక్షన్ ఇస్తాను. దోమల గుంపులా మీరందరూ వెళ్ళాల్సి ఉంటుంది. 84 జన్మల చక్రం పూర్తి అయ్యింది. ఇప్పుడు మీరు జీవిస్తూనే నన్ను స్మృతి చేయండి. మనం జీవిస్తూనే స్వర్గంలోకి వెళ్ళేందుకు తయారుగా కూర్చొని ఉన్నాము. ఇంకెవ్వరూ స్వర్గంలోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకోరు. ఒకవేళ స్వర్గంలోకి వెళ్ళే సంతోషం ఉన్నట్లయితే, ఇక వ్యాధులు వచ్చినప్పుడు మందులు మొదలైనవి కూడా తీసుకోకూడదు. వారు స్వర్గంలోకైతే వెళ్ళరని మీకు తెలుసు. ఇప్పుడు మనం స్వీట్ హోమ్ లోకి వెళ్తున్నాము. అది గాడ్ ఫాదర్ ఇల్లు అనగా ఆత్మిక శివాలయము. సత్యయుగాన్ని దైహిక శివాలయము అని అంటారు. ఆ స్వర్గంలోకి వెళ్ళేందుకు మనం పురుషార్థం చేస్తున్నాము. బ్రహ్మా పగలు మరియు బ్రహ్మా రాత్రి ప్రసిద్ధమైనవి అని బాబా అర్థం చేయించారు. ఎప్పుడైతే రాత్రి పూర్తవుతుందో, అప్పుడు నేను వస్తాను. లక్ష్మీ-నారాయణుల పగలు మరియు రాత్రి అని అనరు. వారే వీరు కానీ బ్రహ్మాకు పగలు మరియు రాత్రి యొక్క జ్ఞానం ఉంది. అక్కడ లక్ష్మీ-నారాయణులకు ఈ జ్ఞానం లేదు. కావున శివుని రాత్రి ఎప్పుడు జరుగుతుంది అనేది బ్రహ్మా మరియు బ్రాహ్మణ-బ్రాహ్మణీలు అర్థం చేసుకుంటారు. ప్రపంచానికైతే ఈ విషయాలు తెలియవు. శివుడు నిరాకారుడు, వారెలా వస్తారు – ఇది కూడా అడగాలి కదా. శివ జయంతి నాడు మీరు చాలా సేవ చేయవచ్చు. రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఇప్పుడిది చాలా చిన్న వృక్షము మరియు ఈ వృక్షానికి తుఫానులు వస్తాయి. మిగిలిన వృక్షాలకు ఇన్ని తుఫానులు రావు. వేరే ధర్మాలలోనైతే ఒకరి వెనక మిగిలిన వారంతా వస్తూ ఉంటారు. ఇది మీ కొత్త జన్మ. మాయా తుఫానులు కూడా ఎదురుగా నిలబడి ఉన్నాయి. ఇతరులు ఎవ్వరికీ తుఫానులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ధర్మ స్థాపనలో మాయా తుఫానులు వస్తాయి. ఇది చాలా ఉన్నతమైన గమ్యము. విశ్వానికి చక్రవర్తిగా అవ్వడము కొత్త విషయమేమీ కాదు. అనేక సార్లు మీరు ఈ తుఫానులను దాటి తమ రాజ్య భాగ్యాన్ని తీసుకున్నారు. ఎవరు ఏ విధంగా పురుషార్థం చేస్తారు అనేది సాక్షాత్కారం అవుతూ ఉంటుంది. ఎంతగా ముందుకు వెళ్తారో, అంతగా ఫలానావారు ఏ పదవిని పొందుతారు అనేది మీకు సాక్షాత్కారం అవుతుంది. ఫలానావారు ఎలా పురుషార్థం చేస్తున్నారు అనేది తెలుస్తుంది కదా. ఇక్కడ పేదవారా లేక షావుకారా అన్న విషయం కాదు. చివరికి నేటికి ఆ రోజు వచ్చింది… అనే పాట కూడా విన్నారు. పేదల పెన్నిధి అయిన బాబా వచ్చారు. బాబా అంటారు – నేను షావుకార్లకేమీ ధనం ఇవ్వాల్సిన అవసరం లేదు, వారు ఉన్నదే షావుకార్లుగా. వారికైతే స్వర్గం ఇక్కడ ఉంది, కోటీశ్వరులుగా ఉన్నారు, ఇంతకుముందు కోటీశ్వరులుగా ఎవరో ఒకరు కష్టం మీద ఉండేవారు. ఇప్పుడైతే కోట్లు అనేవి మనుష్యుల వద్ద గోడలలో దాచిపెట్టి ఉన్నాయి. కానీ అవి ఎవ్వరికీ ఉపయోగపడవు. కడుపు ఎక్కువేమీ తినదు. మోసంతో ధనాన్ని పోగు చేసేవారికి నిద్ర పడుతూ ఉండకపోవచ్చు. ఏమో, గవర్నమెంట్ ఎప్పుడు దాడి చేస్తుందో తెలియదు. తండ్రి అంటారు – గుర్తుంచుకోండి – ఇది అంతిమ సమయము. ఇప్పుడు కొందరిది మట్టిలో కలిసిపోతుంది… నాథుని పేరు మీద ఖర్చు చేసిన వారిది సఫలమవుతుంది. నాథుడైతే ఇప్పుడు స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారు. ఇప్పుడు మీరు తండ్రి వద్ద స్వయాన్ని ఇన్ష్యూర్ చేసుకోండి. మృత్యువు అయితే ఎదురుగా నిలబడి ఉంది. మీ ఆశలన్నీ ఇప్పుడు పూర్తవుతాయి. బాబా పేదవారిని పైకి ఎత్తుతారు. షావుకారి వేయి రూపాయలు, పేదవాని ఒక్క రూపాయితో సమానమైనవి. ఎక్కువగా పేదవారే వస్తారు. కొందరి జీతము 100, కొందరిది 150…. ప్రపంచంలో మనుష్యుల వద్ద అయితే కోట్లు ఉన్నాయి, వారి కొరకు ఇది స్వర్గము. వారు ఎప్పుడూ రారు. అలాగే బాబాకు కూడా వారి అవసరం లేదు. బాబా అంటారు, మీరు మీ ఇళ్ళు మొదలైనవి తయారుచేసుకోండి, సెంటర్లు తెరవండి, నేను ధనాన్ని ఏం చేసుకుంటాను. సన్యాసులు అయితే చాలా ఫ్లాట్లు మొదలైనవి తయారుచేసుకుంటారు, వారి వద్ద చాలా ఆస్తి ఉంటుంది. ఈ రథం కూడా అనుభవజ్ఞులు. ఇప్పుడు నేను పేదవారిని షావుకార్లుగా తయారుచేయడానికి వచ్చాను, కావున ఇప్పుడు ధైర్యం చేయండి. కోటీశ్వరుల ఎవరైతే ఉన్నారో, వారి ధనం ఎందుకూ ఉపయోగపడదు. ఇక్కడ ధనం మొదలైనవాటి విషయమేమీ లేదు. తండ్రి కేవలం మన్మనాభవ అని అంటారు. ఖర్చు విషయమేమీ లేదు. ఈ ఇల్లు నిర్మించారు, ఇది కూడా చాలా సాధారణంగా నిర్మించారు, ఇది కూడా అంతిమ సమయంలో మీరు ఉండడం కోసమే. మీ స్మృతిచిహ్నము ఇక్కడ నిలబడి ఉంది, ఇప్పుడు మళ్ళీ చైతన్యంలో స్థాపన చేస్తూ ఉన్నారు, అప్పుడు ఈ జడమైన స్మృతిచిహ్నాలు సమాప్తమైపోతాయి. ఆబూకి వచ్చి, ఎవరైతే ఈ మందిరాన్ని చూడలేదో, మరియు వీరి కర్తవ్యాన్ని తెలుసుకోలేదో, వారు ఏమీ చూడనట్లే… అని మీరు రాయాలి. ఇప్పుడు చైతన్యంలో మేమే కూర్చుని ఉన్నాము. ఈ జడ చిత్రాల రహస్యాన్ని అర్థం చేయించవచ్చు. వీరు మేమే, మా జడ స్మృతిచిహ్నము తయారై ఉంది అని మీరు అంటారు. ఇది అద్భుతమైన మందిరము, ఇది అద్భుతం కదా! మమ్మా-బాబా మరియు పిల్లలు ఇక్కడ చైతన్యంలో కూర్చుని ఉన్నారు, అక్కడ జడ చిత్రాలు ఉన్నాయి. ముఖ్యమైనవారు ఈ శివ్, బ్రహ్మా, జగదంబ మరియు లక్ష్మీ-నారాయణులు. ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు. అయినా కూడా తండ్రికి చెందినవారిగా అయి మళ్ళీ తండ్రికి విడాకులిచ్చేస్తారు. ఇది కూడా కొత్త విషయమేమీ కాదు. తండ్రికి చెందినవారిగా అయి మళ్ళీ పారిపోతారు. పారిపోయినవారి చిత్రాలను కూడా మనం పెట్టవచ్చు. ఒకవేళ పక్కా నిశ్చయం ఉన్నట్లయితే, మీ రాజ్యపు చిత్రాన్ని తయారుచేసుకోండి, అప్పుడు మేము భవిష్యత్తులో డబుల్ కిరీటధారులుగా, స్వర్గానికి యజమానులుగా అవుతామని స్మృతి ఉంటుంది. ఒకవేళ తండ్రిని వదిలేసినట్లయితే కిరీటం కింద పడిపోతుంది. ఇది అర్థం చేసుకోవాల్సిన చాలా అద్భుతమైన విషయము. తండ్రిని స్మృతి చేయండి. వారి నుండే వారసత్వం లభిస్తుంది. దానినే క్షణంలో జీవన్ముక్తి అని అంటారు. భవిష్యత్తు కోసం బాబా మిమ్మల్ని యోగ్యులుగా తయారుచేస్తున్నారు. మనుష్యులు మరుసటి జన్మ కోసం దాన-పుణ్యాలు చేస్తారు. అది అల్పకాలికమైన ప్రాప్తి. మీకైతే ఈ చదువుతో భవిష్య 21 జన్మల కోసం ప్రారబ్ధం తయారవుతుంది. ఎవరైనా ఈ మాతా-పితల ఆజ్ఞపై పూర్తిగా నడుచుకున్నట్లయితే, పూర్తిగా తీరాన్ని దాటుతారు, మాతా-పితలు కూడా సంతోషిస్తారు. అమలులోకి తీసుకురాకపోతే పదవి కూడా తగ్గిపోతుంది. శివబాబా అంటారు, నేను నిష్కామిని… అభోక్తను… నేను ఈ టోలీ మొదలైనవేవీ తినను. విశ్వ రాజ్యాధికారం కూడా మీ కోసమే. ఈ అన్న-పానాదులు కూడా మీ కోసమే, నేనైతే సేవకుడిని. నేను వచ్చే సమయం కూడా నిశ్చితమై ఉంది. కల్ప-కల్పము నా పిల్లలకు రాజ్య భాగ్యాన్ని ఇచ్చి, నేను నిర్వాణధామంలో కూర్చుండిపోతాను. తండ్రిని ఎవ్వరూ మర్చిపోకూడదు. తండ్రి అయితే మీకు స్వర్గ రాజ్యాధికారాన్ని ఇచ్చేందుకు వచ్చారు, అయినా మీరు వారిని మర్చిపోతారు! ఎవరికైనా తండ్రి పరిచయం ఇచ్చేందుకు కూడా చాలా సహజమైన విధానాన్ని తెలియజేసారు – పరమపిత పరమాత్మతో మీ సంబంధం ఏమిటి? ప్రజాపిత బ్రహ్మాతో మీ సంబంధం ఏమిటి? అని వారిని అడగండి. ఇరువురూ తండ్రులే. వారు నిరాకారుడు, వీరు సాకారుడు. తండ్రిని సర్వవ్యాపి అని అంటే వారసత్వం ఎలా లభిస్తుంది. శ్రీమతం భగవంతునిది లభిస్తుంది. శ్రీమతం ద్వారానే మీరు శ్రేష్ఠాతి-శ్రేష్ఠంగా అవుతారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మాయా తుఫానులను దాటుతూ తండ్రి నుండి పూర్తి-పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. మాతా-పితల ఆజ్ఞలను అమలులోకి తీసుకురావాలి.

2. పాత ప్రపంచాన్ని మరచి కొత్త ప్రపంచాన్ని స్మృతి చేయాలి. మృత్యువు కన్నా ముందు తండ్రి వద్ద స్వయాన్ని ఇన్ష్యూర్ చేసుకోవాలి.

వరదానము:-

యజమానితో పాటు బాలకుడిని కూడా మరియు బాలకునితో పాటు యజమానిని కూడా అనే స్మృతి సదా ఉండాలి. బాలకునిగా అవ్వడంతో సదా నిశ్చింతగా, డబల్ లైట్ గా ఉంటారు మరియు యజమానిగా అనుభవం చేయడంతో యజమానత్వపు ఆత్మిక నషా ఉంటుంది. సలహాను ఇచ్చే సమయంలో యజమాని మరియు ఎప్పుడైతే మెజారిటీ వారు ఫైనల్ చేస్తారో, ఆ సమయంలో బాలకులు. ఇలా బాలకులు మరియు యజమానులుగా అవ్వడం కూడా ఒక నిచ్చెన. ఈ నిచ్చెనను ఒక్కోసారి ఎక్కండి, ఒక్కోసారి దిగండి, ఒక్కోసారి బాలకునిగా అవ్వండి, ఒక్కోసారి యజమానిగా అవ్వండి, అప్పుడు ఏ విధమైన బరువు ఉండదు.

స్లోగన్:-

లవలీన స్థితిని అనుభవం చేయండి

సేవ లేక స్వయం యొక్క ఎక్కేకళలో సఫలతకు ముఖ్య ఆధారము – ఒక్క తండ్రిపై ఎడతెగని ప్రేమ. తండ్రి తప్ప ఇంకేమీ కనిపించకూడదు. సంకల్పంలో కూడా బాబా, మాటలో కూడా బాబా, కర్మలో కూడా తండ్రి తోడు, ఇటువంటి లవలీన స్థితిలో ఉంటూ ఒక్క మాట మాట్లాడినా, ఆ స్నేహంతో కూడిన మాట ఎదుటి ఆత్మను కూడా స్నేహంలో బంధించివేస్తుంది. ఇటువంటి లవలీన ఆత్మ పలికే ఒక్క బాబా అనే పదమే ఇంద్రజాల మంత్రములా పని చేస్తుంది.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top