25 August 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

24 August 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - సంగమయుగీ బ్రాహ్మణులైన మీ ధర్మము మరియు కర్మ జ్ఞానామృతాన్ని తాగడము మరియు తాగించడము, మీరు నరకవాసులను స్వర్గవాసులుగా చేసే సేవను చేస్తారు’’

ప్రశ్న: -

బ్రాహ్మణులైన మీకు కర్మలకు సంబంధించి ఏ గుహ్య గతి యొక్క జ్ఞానం లభించింది?

జవాబు:-

తండ్రికి చెందినవారిగా అయ్యాక ఒకవేళ ఎప్పుడైనా తమ కర్మేంద్రియాలతో ఏదైనా పాప కర్మ చేసినట్లయితే ఒక పాపానికి నూరు రెట్లు శిక్ష పడుతుంది – ఈ జ్ఞానం బ్రాహ్మణులైన మీకు ఉంది, అందుకే మీరు ఏ పాప కర్మను చేయలేరు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీ లక్ష్యము – సర్వగుణ సంపన్నులుగా అవ్వడము, అందుకే మీరు మీ అవగుణాలను తొలగించుకునే పురుషార్థాన్నే చేయండి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

భోళానాథుని కన్నా అతీతమైనవారు లేరు… (భోలేనాథ్ సే నిరాలా…)

ఓంశాంతి. అనంతమైన తండ్రి పేరు భోళానాథుడు, తప్పకుండా మనుష్యుల నుండి దేవతలుగా చేసేవారు కూడా వారే. మనుష్యులైతే అందరూ ఆసురీ సంప్రదాయము కలవారు. వారు మనుష్యులను దేవతగా తయారుచేయలేరు. మనుష్యుల నుండి దేవతలుగా మార్చడానికి భగవంతుడికి ఎంతో సమయం పట్టదు… అని అనంతమైన తండ్రి కోసమే అంటూ ఉంటారు. దేవతలు అమరలోకంలో ఉంటారు. ఇది మృత్యులోకము. తప్పకుండా తండ్రి వచ్చి అమరులుగా చేయడానికి మృత్యులోకంలో అమరకథను వినిపిస్తారు. ఇప్పుడు మనుష్యుల నుండి దేవతలుగా మార్చడానికి భగవంతుడికి ఎంతో సమయం పట్టదు…. ఇది ఎవరి గురించి అంటారు? తప్పకుండా శూద్రులనే దత్తత తీసుకొని ఉంటారు కదా. కావున శూద్ర వర్ణములోని మనుష్యులను బ్రాహ్మణ వర్ణములోకి తీసుకొస్తారని అంటారు. ఇంతమంది పిల్లలు మేము బ్రహ్మాకుమారీ కుమారులము, బ్రహ్మా యొక్క సంతానము అని అంటారు. ప్రజాపిత ఉన్నప్పుడు వారికి తప్పకుండా ధర్మ సంతానము ఉంటారు కదా. ముఖ వంశావళి ఉన్నా కూడా తప్పకుండా తల్లిదండ్రులు కావాలి కదా. మమ్మా యొక్క ముఖ వంశావళి అని కూడా అంటారు. మీరు బాబాకు కూడా ముఖ వంశావళియే, అలాగే దాదాకు కూడా ముఖవంశావళియే. ఇక్కడ కుఖ వంశావళి యొక్క పేరే లేదు. ఆ కలియుగీ బ్రాహ్మణులు కుఖ వంశావళి మరియు బ్రాహ్మణులైన మీరు ముఖ వంశావళి. ఆ బ్రాహ్మణులైతే విషాన్ని తాగించేందుకు ఒకరితో ఒకరికి కంకణాన్ని కట్టిస్తారు. మరియు బ్రాహ్మణులైన మీరు అమృతాన్ని తాగించేందుకు పరమాత్మతో కంకణాన్ని కట్టిస్తారు. ఎంత తేడా ఉంది. వారు నరకవాసులుగా చేసేవారు మరియు మీరు స్వర్గవాసులుగా చేసేవారు. జ్ఞానామృతము ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. మనం ఈశ్వరుని సంతానంగా అవుతాము కనుక సహాయం కూడా లభిస్తుంది. సొంత పిల్లలు మరియు సవతి పిల్లలు కూడా ఉన్నారు కదా. సొంత పిల్లలకు లభించినంత సహాయము సవతి పిల్లలకు లభించదు. తండ్రి ప్రేమ కూడా సొంత పిల్లలపైనే ఉంటుంది. సొంత పిల్లలు లేకపోతే సోదరుని పిల్లలను ప్రేమించవలసి వస్తుంది లేక పిల్లలను దత్తత తీసుకోవలసి వస్తుంది. ఇప్పుడు మీకు వర్ణాల గురించి తెలుసు. విరాట స్వరూపాన్ని తయారుచేస్తారు కానీ దీని ద్వారా ఏం జరుగుతుంది అని వారి చరిత్ర-భౌగోళికాన్ని ఎవ్వరూ చెప్పలేరు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు, ఈ చక్రము తిరుగుతుంది, ఇన్ని జన్మలు దేవతా ధర్మములో, ఇన్ని జన్మలు క్షత్రియ వర్ణములో ఉంటాయి. ఇక్కడ వ్యర్థ ప్రలాపాల యొక్క విషయమేమీ లేదు. 84 జన్మలు నిరూపించి చెప్తారు. సతోప్రధానముగా తర్వాత సతో, రజో, తమోగా అందరూ తప్పకుండా అవ్వాల్సిందే. దేవతలు ఎవరైతే సతోప్రధానంగా ఉండేవారో, వారే వచ్చి మళ్ళీ తమోప్రధానంగా అయ్యారు. ఇప్పుడు ఈ మనుష్య సృష్టి యొక్క వృక్షము శిథిలావస్థకు వచ్చేసింది అనగా శ్మశానగ్రస్థమైపోయింది. ఇది వినాశన సమయము. అందరి పాత లెక్కాచారాలు సమాప్తము అవ్వాలి మరియు కొత్త జన్మ జరగాలి. ధనము యొక్క ఖాతా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ కర్మల ఖాతా ఉంది. ఇది అర్ధకల్పము యొక్క ఖాతా. మనుష్యులు ఏ పాప కర్మలైతే చేస్తారో, ఆ ఖాతా కొనసాగుతూ వచ్చింది. అలాగని ఒక్కసారే శిక్షలు అనుభవించడము ద్వారా ఖాతా సమాప్తం అయిపోతుందని కాదు. అలా జరగదు. పాపాత్మగా ఎలా అయ్యారు? ప్రతి రోజు కర్మల భారము పెరుగుతూ-పెరుగుతూ పూర్తిగానే తమోప్రధానంగా అవుతారు. కొంతమంది మళ్ళీ అంటారు, సన్యాసులు సన్యసిస్తున్నప్పుడు, వారెందుకు తమోప్రధానంగా అవ్వాలి. కానీ తండ్రి అంటారు, వారిది రజోప్రధానమైన సన్యాసము. ఇప్పుడు మీకు శ్రీమతము లభిస్తుంది. అదైతే మనుష్యుల యొక్క మతము. మేము మోక్షాన్ని పొందుతాము అని మనుష్యులు అంటారు, కానీ ఎలా పొందుతారు? పాత్రధారులందరూ ఇక్కడ తప్పకుండా హాజరై ఉండాలి. తిరిగి వెళ్ళలేరు. గీతలో కూడా ఇటువంటి విషయాలు చాలా రాసేసారు. మొదటిది సర్వవ్యాపి యొక్క విషయము. ఇప్పుడు పిల్లలైన మీలో తండ్రి స్మృతి ఉంది. తండ్రి రచయిత మరియు వారితో పాటు తండ్రి యొక్క రచన ఉంది. కేవలం తండ్రి కాదు, వారి రచనను కూడా స్మృతి చేయవలసి ఉంటుంది. మీరు వ్యాపార-వ్యవహారాలను కూడా చేసుకుంటారు మరియు దానితో పాటు మూలవతనము, సూక్ష్మవతనము, శివబాబా యొక్క జీవితచరిత్ర, బ్రహ్మా, విష్ణు, శంకరులను గురించి కూడా తెలుసుకున్నారు. మళ్ళీ సంగమయుగంలోని జగదంబ, జగత్పితలను కూడా తెలుసుకున్నారు. జగదంబ సరస్వతి మహిమ చేయబడతారు. వారి చిత్రాలు అనేకము ఉన్నాయి. వాస్తవానికి ముఖ్యమైనవారు జగదంబ సరస్వతి ఒక్కరే. ఈ బ్రహ్మా వ్యక్తముగా ఉన్నారు, వారే అవ్యక్తముగా అవుతారు. అవ్యక్తమైన తర్వాత ఆ బ్రహ్మా మళ్ళీ సాకారంలో మహారాజ శ్రీనారాయణగా అవుతారు, మళ్ళీ 84 జన్మలు మొదలవుతాయి. ఇప్పుడు మీరు వ్యాపార-వ్యవహారాలు కూడా చేస్తూ ఉంటారు, మరి కర్మేంద్రియాలతో వికర్మగా అయ్యేటువంటి ఏ పాప కర్మ చేయకూడదు, లేదంటే సర్వగుణ సంపన్నులుగా అవ్వలేరు. నిర్గుణుడినైన నాలో ఏ గుణమూ లేదు అని పాడుతారు కదా. ఈ సమయంలో ఉన్నదే అసత్య ఖండము. సత్య ఖండాన్ని స్థాపన చేసేవారు తండ్రి ఒక్కరే. ఈ సమయంలో మనుష్య మాత్రులందరూ అనాథలుగా అయ్యారు.

ఇప్పుడు పిల్లలైన మీలో ఏ అవగుణము ఉండకూడదు. అన్నింటికన్నా మొదటి అవగుణము దేహాభిమానము. దేహీ-అభిమానిగా అవ్వడంలో చాలా శ్రమ ఉంది. దేహాభిమానము కారణంగానే మిగిలిన అన్ని వికారాలు వస్తాయి. మొదటి నంబరు శత్రువు అహంకారము. తండ్రి డైరెక్ట్ గా అంటారు, ప్రియమైన పిల్లలూ, దేహ అహంకారాన్ని విడిచిపెట్టండి. నాకైతే దేహము లేదు. నేను వచ్చి ఈ ఇంద్రియాల ద్వారా తెలియజేస్తాను. మీరు ఈ ఇంద్రియాల ద్వారా వింటారు మరియు అర్థము చేసుకుంటారు. ఇప్పుడు అనంతమైన తండ్రి మతాన్ని ఇస్తారు – నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. అప్రతిష్టపాలు అయ్యేటువంటి మరియు పద భ్రష్టులుగా అయ్యేటువంటి పాప కర్మ ఏదీ చేయకండి. తండ్రి అంటారు – పిల్లలూ, ఎవ్వరూ మీకు రాజయోగాన్ని నేర్పించి స్వర్గానికి యజమానిగా తయారుచేయలేరు. ఇప్పుడు తండ్రి మీకు సత్యాన్ని అర్థం చేయిస్తారు. సత్యాన్ని వినేందుకు మరియు సత్య ఖండానికి యజమానిగా అయ్యేందుకు మీరు సత్యమైన సాంగత్యంలో కూర్చున్నారు. వారి పేరే ఉన్నది సత్యము, సత్యమైన జ్ఞాన సాగరుడు. నేను జ్ఞాన సాగరుడిని అని తండ్రి అంటారు. జ్ఞాన సాగరుని నుండి జ్ఞాన నదులైన మీరు వెలువడుతారు. ఆ నదులైతే నీటి సాగరము నుండి వెలువడుతాయి. అవి పతిత-పావని అని ఎలా పిలవబడగలవు. పతిత-పావనుడు అయితే పరమాత్మే కదా, వారే జ్ఞాన సాగరుడు. ఆ గంగ మొత్తం ప్రపంచమంతటా ఏమైనా వెళ్తుందా. ఇది అయితే అనంతమైన తండ్రి యొక్క పని . కావున మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతారు. బ్రాహ్మణులు అనగా పిలక వంటివారు. కానీ ఇప్పుడు సతోప్రధానము అని అనరు ఎందుకంటే ఇప్పుడు అందరూ పురుషార్థీలుగా ఉన్నారు, సేవ చేస్తున్నారు, ఈశ్వరీయ సంతానముగా ఉన్నారు, అందుకే బ్రాహ్మణులకు చాలా గౌరవము ఉంది ఎందుకంటే భారత్ ను స్వర్గంగా కూడా మీరే తయారుచేస్తారు. అంతేకానీ, లక్ష్మీ-నారాయణులు భారత్ ను స్వర్గంగా తయారుచేస్తారని కాదు. తండ్రి ఆ విధంగా బ్రాహ్మణుల ద్వారా తయారుచేస్తారు, దేవతల ద్వారా కాదు. పాత ప్రపంచంలోకి వచ్చి తండ్రి కొత్త సృష్టిని రచించాలి. అనంతమైన తండ్రి కొత్త ఇల్లు అయిన స్వర్గాన్ని తయారుచేసారు. కొత్త వస్తువు పాతదిగా అవ్వాల్సిందే. లౌకిక తండ్రి కూడా కొత్త ఇంటిని నిర్మిస్తారు, అది తప్పకుండా పాతదిగా అవుతుంది. అంతేకానీ, తండ్రి పాతదిగా చేస్తారని కాదు. ప్రతి వస్తువు సతోప్రధానము నుండి తమోప్రధానముగా తప్పకుండా అవుతుంది. అదే విధంగా మొత్తం సృష్టి కూడా కొత్తది నుండి పాతదిగా తప్పకుండా అవుతుంది. ఇప్పుడు దేహం యొక్క అన్ని ధర్మాలు మొదలైనవాటిని విడిచిపెట్టి స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రి పిల్లలందరి కోసం చెప్తారు, ఇప్పుడు ఆట పూర్తవుతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. మర్చిపోలేదు కదా. నేను మీకు సహజ రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చాను. మీరు మేము 5 వేల సంవత్సరాల క్రితం కూడా కలుసుకున్నాము. నేను మీకు రాజయోగాన్ని నేర్పించాను. గుర్తుంది కదా, మర్చిపోలేదు కదా? నేను కల్ప-కల్పము వచ్చి మీకు రాజ్యాధికారాన్ని ఇస్తాను, మిమ్మల్ని గవ్వ నుండి వజ్ర తుల్యంగా చేస్తాను. పిల్లలంటారు, బాబా ఈ చక్రము నుండి విడుదల అవ్వలేమా? తండ్రి అంటారు – అలా అవ్వలేరు. ఈ సృష్టి చక్రమైతే అనాది. ఒకవేళ చక్రము నుండి విడుదల అయినట్లయితే ఇక ఈ ప్రపంచమే సమాప్తమైపోతుంది. ఈ చక్రమైతే తప్పకుండా తిరగాలి. నేను మళ్ళీ వచ్చాను. కల్ప-కల్పము, కల్పము యొక్క సంగమయుగంలోనే వస్తూ ఉంటాను. వారు కేవలం ప్రతి యుగము అని రాసేసారు. వారంటారు కూడా, పతిత-పావనా రండి, పావనంగా తయారుచేయండి, సుఖధామంలోకి తీసుకువెళ్ళండి, ఈ పతిత ప్రపంచంలోనైతే దుఃఖమే దుఃఖము ఉంది. అచ్ఛా, నా వద్ద రెండు ధామాలు ఉన్నాయి. మీరు ఎక్కడికి వస్తారు? తండ్రి అంటారు, సుఖధామంలోనైతే చాలా సుఖము ఉంటుంది. మరియు ముక్తిధామంలోకి వెళ్ళినా కూడా పాత్రలోకైతే తప్పకుండా రావాల్సిందే. కానీ ఎప్పుడైతే స్వర్గము పూర్తవుతుందో, అప్పటి నుండి దిగుతారు. స్వర్గములోకి రారా? మీకు స్వర్గం యొక్క కోరిక లేదా? మీరు నరకంలో మాయా రాజ్యంలోకే రావాలని కోరుకుంటున్నారా? ఆ సమయంలో కూడా మొదట సతోగా ఉంటారు, తర్వాత రజో, తమోగా అవుతారు. ఎవరైతే పవిత్రాత్మలు వస్తారో, వారు మొదట దుఃఖాన్ని పొందజాలరు. రావడముతోనే పాపాలు ఏమైనా చేస్తారా. కానీ ఆత్మ సతో, రజో, తమోలను దాటాల్సిందే. ఈ చక్రాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడే మీరు ఫైనల్ అవస్థలోకి వెళ్ళలేరు. స్కూల్లో కూడా 12 మాసాల తర్వాత ఫైనల్ పరీక్షలు ఉంటాయి కదా. అంతిమంలో మీ అవస్థ పరిపక్వము అవుతుంది. చాలా వృద్ధిని పొందుతారు. ఎన్ని సెంటర్లు తెరవబడ్డాయి. సెంటర్లు కోసమైతే చాలామంది అడుగుతారు. కానీ టీచర్లు అంతమంది తయారుగా లేరు. ఫస్ట్ క్లాస్ షిఫ్ట్ – అమృతవేళ. కొంతమంది అమృతవేళ రాలేకపోతే తప్పనిసరి పరిస్థితిలో సాయంత్రం అయినా రావాలి. స్కూల్ లో కూడా ఇప్పుడు రెండు షిప్టులు ఉంటాయి. అచ్ఛా – పిల్లలు అర్థము చేసుకున్నారు.

తండ్రి అన్ని సెంటర్లలోని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలూ, రాత్రి తమ రోజంతటి లెక్కాపత్రాన్ని తీయండి. ఈ రోజు నా రిజిస్టర్ పాడవ్వలేదు కదా? ఏ తప్పు చేయలేదు కదా? అలా అయితే తండ్రి నుండి క్షమాపణ అడగాలి. శివబాబా, మమ్మల్ని క్షమించండి, మీరు ఎంత మధురమైనవారు. భగవంతుడు అంటారు, నేను మిమ్మల్ని స్వర్గం యొక్క మాస్టర్ భగవాన్, భగవతిగా తయారుచేస్తాను. కనుక నా ఆజ్ఞను పాటించండి కదా. నంబరువన్ ఆజ్ఞ – దేహీ-అభిమానిగా అవ్వండి. వికారాలలోకి వెళ్ళకండి. ఇది మహా శత్రువు. వీటిపై విజయం పొందకపోతే పద భ్రష్టులై, కుల కళంకితులుగా అవుతారు. మాయ చాలా శక్తివంతమైనది. ఇది దీపము మరియు తుఫాను యొక్క యుద్ధము. ఇందులోనైతే సాహసం చూపించవలసి ఉంటుంది. మనం తండ్రికి చెందినవారిగా అయ్యాము, అటువంటప్పుడు ఈ మాయ విఘ్నాలు ఎలా వేయగలదు. అయితే, తుఫానులైతే తీసుకొస్తుంది కానీ కర్మేంద్రియాలతో ఎప్పుడూ ఏ వికర్మలు చేయకూడదు. చాలా ఉన్నతమైన పదవి లభిస్తుంది కదా. కొంచెం ఆలోచించండి కూడా. మీరు ఎవరికైనా మేము నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు చదువుతున్నామని చెప్తే అందరూ హేళన చేస్తారు. ఇక్కడైతే ధారణ కావాలి. నేను ఆత్మను, ఆత్మను అని ఇక్కడ మీరు పక్కా చేసుకోవాలి, అప్పుడే సతోప్రధానముగా అయి తండ్రి వద్దకు వెళ్తారు, తర్వాత తండ్రి స్వర్గంలోకి పంపిస్తారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు నంబరువారు పురుషార్థానుసారంగా బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తమ రిజిస్టరు పాడవ్వకూడదు అన్న ధ్యాస పెట్టుకోవాలి. తండ్రి ఆజ్ఞను పాటించి దేహీ-అభిమానిగా అవ్వాలి. కర్మేంద్రియాలతో ఏ తప్పు చేయకూడదు.

2. సర్వగుణ సంపన్నులుగా అవ్వడానికి, కర్మేంద్రియాల ద్వారా వికర్మగా అయ్యేటువంటి ఏ పాప కర్మ చేయకూడదు. పాత లెక్కాచారాలను సమాప్తం చేసుకోవాలి.

వరదానము:-

అమృతవేళ నుండి రాత్రి వరకు బ్రాహ్మణ పిల్లలైన మీకు ఏ శ్రేష్ఠ భాగ్యమైతే లభించిందో, ఆ భాగ్యము యొక్క లిస్టును సదా ఎదురుగా ఉంచుకోండి మరియు ఈ పాటనే పాడుతూ ఉండండి – వాహ్ నా శ్రేష్ఠ భాగ్యము, భాగ్య విధాతయే నా వారిగా అయ్యారు. ఈ నషాలో సదా సంతోషంతో డాన్స్ చేస్తూ ఉండండి. ఏం జరిగినా కానీ, మరణించే అంతటి విషయము వచ్చినా కానీ, సంతోషం పోకూడదు. శరీరం పోయినా ఫర్వాలేదు కానీ సంతోషం పోకూడదు.

స్లోగన్:-

దాదీ ప్రకాశమణిగారి 15వ స్మృతి దివసమున వారి అమూల్యమైన మహా వాక్యాలు

సంపన్నత లేక సంపూర్ణత యొక్క సమీపతకు గుర్తులు

1. ఆత్మ ఎంతగా సంపన్నంగా అవుతూ ఉంటుందో, అంతగా మనసా-వాచా-కర్మణాలో ఎటువంటి సూక్ష్మ వికారాలు కూడా ఉండవు, వారికి సంపూర్ణత యొక్క గమ్యము సమీపంగా కనిపిస్తూ ఉంటుంది.

2. మనసా-వాచా-కర్మణాతో సదా అహింసకులుగా ఉంటారు, ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరు, దుఃఖాన్ని తీసుకోరు. ఎప్పుడైతే దుఃఖము ఇవ్వడము మరియు దుఃఖము తీసుకోవడము సమాప్తమైపోతుందో, అప్పుడు సంపూర్ణత సమీపంగా వస్తుంది.

3. ఎవరైతే సంపూర్ణతకు సమీపంగా ఉంటారో, వారు అనంతమైన వైరాగులుగా ఉంటారు, వారికి దేనిపైన ఆకర్షణ ఉండదు, అందరి నుండి మమకారము తెగిపోతుంది. వారు అందరి మధ్య ఉంటూ కూడా అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు.

4. వారిని తత్వాల సహితంగా ఏ పాత వస్తువు కూడా తమ వైపుకు ఆకర్షితము చేయలేదు. వారు ఎల్లప్పుడూ ఒక్క తండ్రి యొక్క ఆకర్షణలోనే ఉంటారు. బుద్ధిలో ఒక్క తండ్రి స్మృతి అనగా ఏకాగ్ర వృత్తి ఉంటుంది.

5. వారు స్వయంతో కూడా సంతుష్టంగా ఉంటారు మరియు ఇతరులను కూడా సంతుష్టపరుస్తారు. వారికి చదువు యొక్క 4 సబ్జెక్టులపై పూర్తి ధ్యాస ఉంటుంది.

6. వారిది సాక్షీతనము యొక్క స్టేజ్ ఉంటుంది. సదా సహచరుని యొక్క తోడు అనుభవమవుతుంది. దేహాభిమానము యొక్క బుద్ధితో లేక పాత నడవడికతో ఎవ్వరికీ కూడా దుఃఖాన్ని ఇవ్వరు. దృష్టి, వృత్తిలో ఆత్మికత మరియు అలౌకికత ఉంటుంది.

7. పవిత్రతలో ఫుల్ గా ఉంటారు, కేవలం బ్రహ్మచర్యమే కాదు కానీ బ్రహ్మాచారిగా ఉంటారు. వారి కనులు ఎవ్వరివైపుకు వెళ్ళవు ఎందుకంటే మేము ఎవరి సంతానము అన్న నషా వారికి ఉంటుంది.

8. వారు ఎవ్వరి అవగుణాలను మనసులో పెట్టుకోరు. వారు ఎవ్వరి అవగుణాలను నోట్ చేయరు. పాత నడవడిక, పాత సంస్కారాల వైపు బుద్ధి వెళ్ళదు. వారు ఎల్లప్పుడూ స్వ చింతనలో ఉంటారు.

9. ఎలాగైతే సాకార బాబా ఎల్లప్పుడూ స్వయాన్ని విశ్వ సేవాధారిని అని అన్నారు, ఎంతటి మహాన్ గా ఉండేవారో, అంత నిర్మానులుగా అయి ఉండేవారు. నిరాకారి, నిరహంకారి… అలా ఎల్లప్పుడూ స్వయాన్ని సేవాధారిగా భావించాలి, ఇది కూడా సంపూర్ణతకు గుర్తు.

10. వారు ఎల్లప్పుడూ స్వయాన్ని నిమిత్తులుగా భావిస్తారు, మహిమను ఎప్పుడూ స్వీకరించరు. మహిమ తప్పకుండా జరుగుతుంది ఎందుకంటే సేవ చేసారు. కానీ నిమిత్తులము అని భావించిన కారణంగా నోటి ద్వారా బాబా-బాబా అనే వెలువడుతుంది. వారు మహిమకు సంతోషపడరు మరియు నిందకు గాభరాపడరు. రెండింటిలో స్థితి సమానంగా ఉంటుంది.

11. వారు అందరి సంబంధాన్ని ఒక్క బాబాతోనే జోడింపజేస్తారు. వారి నోటి ద్వారా బాబా పట్ల స్నేహంతో కూడిన మాటలు వెలువడుతాయి. ప్రియమైన బాబా మనకు తమ ప్రియాతి ప్రియమైన వస్తువు దివ్య బుద్ధిని కానుకగా ఇచ్చారు, ఆ కానుకను సంభాళించి పెట్టుకుంటారు.

12. జ్ఞానము యొక్క మూడవ నేత్రము సదా తెరిచి ఉంటుంది, జ్ఞాన నేత్రము తెరిచి ఉన్న కారణంగా సదా సమర్థ సంకల్పాలు నడుస్తాయి, ఇది కూడా సంపూర్ణతకు గుర్తు.

13. వారి ప్రతి కర్మ శ్రీమతము అనుసారంగా ఉంటుంది. శ్రీమతములో ఎప్పుడూ మన్మతాన్ని మిక్స్ చేయరు. దివ్య బుద్ధి ఆధారముగా ప్రతి కర్మ జరుగుతూ ఉంటుంది, ఇది కూడా సంపూర్ణతకు గుర్తు.

14. వారు ఆజ్ఞాకారిగా, విశ్వాసపాత్రులుగా ఉంటారు. ఒకే బలము ఒకే నమ్మకము, సర్వ సంబంధాలు ఒక్కరితోనే ఉంటాయి, ఎవ్వరికి లోబడి ఉండరు, ఈ విధంగా మోహం నుండి, లోబడి ఉండడము నుండి ముక్తులుగా ఉంటారు.

15. వారికి ఏ పరిస్థితి అయినా కూడా కొత్తేమీ కాదు అనిపిస్తుంది. 5000 సంవత్సరాల క్రితము విషయం ఇది నిన్నటి విషయమే అన్నట్లు అనుభవమవుతుంది. అచ్ఛా – ఓం శాంతి.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top