25 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris

25 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

24 August 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - శాంతిగా ఉండే స్వభావం చాలా మంచిది, శాంత స్వభావం కలవారు చాలా మధురంగా అనిపిస్తారు, వ్యర్థమైన మాటలు మాట్లాడడం కంటే మాట్లాడకపోవడం మంచిది”

ప్రశ్న: -

ఏ పిల్లలను అందరూ ప్రేమిస్తారు? స్వయాన్ని సురక్షితంగా ఉంచుకునేందుకు సాధనమేమిటి?

జవాబు:-

ఎవరైతే అందరికీ చాలా అభిరుచితో, ప్రేమగా సేవ చేస్తారో, వారిని అందరూ ప్రేమిస్తారు. మీకు ఎప్పుడూ సేవ యొక్క అహంకారం రాకూడదు. తండ్రి ద్వారా జ్ఞానం యొక్క కస్తూరి ఏదైతే లభించిందో, దానిని ఇతరులకు ఇవ్వాలి, అందరికీ శివబాబా స్మృతినిప్పించాలి. ఈ స్మృతి యాత్రతోనే మీరు చాలా-చాలా సురక్షితంగా ఉంటారు. ఎంతగా స్మృతిలో ఉంటారో, అంతగా సంతోషం కూడా ఉంటుంది మరియు మ్యానర్స్ కూడా బాగవుతూ ఉంటాయి.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు, ఇలా అర్థం చేయిస్తూ-చేయిస్తూ ఎంతటి తెలివైనవారిగా తయారుచేస్తారు! చదువు కూడా సహజమైనది కదా! అది స్థూల చదువు మరియు ఇది సూక్ష్మ చదువు. ఈ చదువును తండ్రి తప్ప ఇంకెవ్వరూ చదివించలేరని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి, పవిత్రంగా తయారుచేసేందుకు మరియు చదివించేందుకు వచ్చారు. లక్ష్యం-ఉద్దేశ్యం ఎదురుగా ఉంది కనుక ఇటువంటి తండ్రిని స్మృతి చేస్తూ సంతోషంలో రోమాలు నిక్కబొడుచుకోవాలి. రోజు రోజుకు మనం శాంతిలోకే వెళ్ళాలని కూడా పిల్లలకు తెలుసు. శాంతి అంటే అందరికీ చాలా ఇష్టమనిపిస్తుంది. పెద్ద వ్యక్తులు ఎక్కువగా మాట్లాడరు మరియు గట్టిగా మాట్లాడరు. మీరు చాలా-చాలా పెద్ద వ్యక్తులుగా అవుతారు, వాస్తవానికి మిమ్మల్ని వ్యక్తులని అనకూడదు, మీరు దేవతలుగా అవుతారు. దేవతలు చాలా తక్కువగా మాట్లాడుతారు. మీరు కూడా దేవతలుగా అవ్వాలి కనుక టాకీ నుండి మారి సైలెన్స్ లో ఉండే అభ్యాసం చెయ్యండి. శాంతిగా ఉండేవారి గురించి, వీరికి స్వయం పట్ల అటెన్షన్ ఉంది అని భావిస్తారు. మీరు శాంతిధామానికి వెళ్ళేది ఉంది కనుక మాట్లాడడం కూడా చాలా నెమ్మదిగా మాట్లాడాలి. నెమ్మదిగా మాట్లాడుతూ-మాట్లాడుతూ శాంతిధామానికి వెళ్ళిపోవాలి. మీరు ఎంతగా శాంతిగా ఉంటారో, అంతగా శాంతిని వ్యాపింపజేస్తారు. మీరు చాలా శాంతిగా ఉండాలి. గట్టిగా మట్లాడడము మంచిగా అనిపించదు. క్రోధం కూడా మంచిది కాదు. పిల్లల్లో ఏ వికారము ఉండకూడదు. మేము ఎవరితోనూ కొట్లాడడం-గొడవపడడం లాంటిది చేయడం లేదు కదా అని చూసుకోవాలి. చెడు వినకండి, చెడు మాట్లాడకండి….. అని తండ్రి అర్థం చేయించారు. ఏ విషయాలైతే మీకు ఇష్టమనిపించవో, ఆ చెడు విషయాల నుండి మీరు పక్కకు వచ్చేయాలి, అప్పుడు ఇరువురి నోర్లు మూతపడి ఉంటాయి. ప్రతి విషయంలోనూ దైవీ గుణాలను ధారణ చేయాలి. ఎవరైనా గట్టిగా మాట్లాడితే – శాంతిగా ఉండండి, శబ్దం చేయకండి అని చెప్పండి. మనం శాంతి స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. సత్యయుగంలో శాంతి ఉంటుంది కదా! మూలవతనంలో ఎలాగూ శాంతియే ఉంటుంది. శరీరమే లేనప్పుడు ఇక ఎలా మాట్లాడుతారు! తండ్రి పిల్లలకు చాలా మంచి శ్రీమతాన్ని ఇస్తారు. వారు అర్థం చేయిస్తారు – మధురమైన పిల్లలూ, ఇప్పుడు మీరు మీ ఇంటికి వెళ్ళాలి, టాకీ నుండి మూవీలోకి రావాలి, తర్వాత సైలెన్స్ లోకి వెళ్ళిపోతారు. ఎవరు కలిసినా వారికి ఇదే సందేశాన్ని ఇవ్వాలి. మీరు ఎంతగా సైలెన్స్ లో ఉంటారో, అంతగా వీరు ఏదో పట్టుదలలో, రాగములో ఉన్నారని అర్థం చేసుకుంటారు. శాంతిగా ఉండే స్వభావం చాలా మంచిది. అలా ఉండేవారు చాలా మధురంగా అనిపిస్తారు. వ్యర్థమైన మాటలు మాట్లాడడం కంటే మాట్లాడకుండా ఉండడము మంచిది.

మీరు సత్యాతి-సత్యమైన సందేశకులు. మీకు అందరి పట్ల దయ (కృప) ఉండాలి. దయ చూపించే పిల్లలు చాలా శాంతిగా, తండ్రి స్మృతిలో ఉంటారు. అనంతమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే అనంతమైన సుఖ-శాంతులు లభిస్తాయని కేవలం ఈ సందేశాన్ని ఇవ్వాలి. లౌకిక తండ్రి వద్ద చాలా ధనం ఉంటే చాలా వారసత్వం లభిస్తుంది కదా! అనంతమైన తండ్రి వద్ద విశ్వ రాజ్యాధికారం ఉంది కావున ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మీకు విశ్వ రాజ్యాధికారం లభిస్తుంది.

పిల్లలైన మీరు చాలా అభిరుచితో అందరికీ సేవ చేయాలి. ప్రతి ఒక్కరు సేవకు యోగ్యులుగా అవ్వాలి. ఎవరైతే ఇతరులకు ప్రేమగా సేవ చేస్తారో, వారిని అందరూ ప్రేమిస్తారు. ఎప్పుడూ సేవ యొక్క అహంకారం రాకూడదు. మీకు తండ్రి ద్వారా జ్ఞానం యొక్క కస్తూరి లభించింది, దానిని ఇతరులకు ఇవ్వాలి. శివబాబా గుర్తు ఉన్నారా అని ఒకరికొకరు స్మృతిని ఇప్పించుకుంటూ ఉండండి. దీనితో సంతోషం కూడా కలుగుతుంది. స్మృతిని ఇప్పించేవారికి థాంక్స్ చెప్పాలి. స్మృతియాత్ర ద్వారా పిల్లలైన మీరు చాలా-చాలా సురక్షితంగా ఉంటారు. ఎంతగా స్మృతిలో ఉంటారో, అంతగా సంతోషం కూడా ఉంటుంది మరియు మ్యానర్స్ కూడా బాగవుతూ ఉంటాయి. మీరు మీ క్యారెక్టర్ లను తప్పకుండా బాగు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోండి – నా స్వభావం చాలా-చాలా మధురంగా ఉందా? ఎప్పుడు ఎవరినీ కోపగించుకునేలా చేయడం లేదు కదా. ఎవరైనా కోపగించుకునేటువంటి వాతావరణం ఎప్పుడూ ఉండకూడదు. ఇలాంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే పిల్లలైన మీరు చాలా ఉన్నతమైన సేవలో ఉన్నారు. మీరు ఈ మొత్తం వేదికకు ప్రకాశాన్ని ఇవ్వాలి. మీరు ధరిత్రి యొక్క చైతన్యమైన నక్షత్రాలు. నక్షత్ర దేవత….. అని అంటూ ఉంటారు. ఇప్పుడు ఆ నక్షత్రాలేమీ దేవతలు కావు. మీరు వాటికంటే మహా బలశాలులు ఎందుకంటే మీరు మొత్తం విశ్వానికి ప్రకాశాన్నిస్తారు. మీరే దేవతలుగా అయ్యేవారు. ఎలాగైతే పైన ఉన్న నక్షత్రాలు మెరుస్తూ ఉంటాయో, ఒక్కో నక్షత్రం చాలా ప్రకాశిస్తూ ఉంటుంది, ఒక్కోటి తక్కువగా ప్రకాశిస్తూ ఉంటుంది, ఒక్కోటి చంద్రునికి దగ్గరగా ఉంటుంది. పిల్లలైన మీరు కూడా యోగబలంతో సంపూర్ణంగా పవిత్రంగా అవుతారు కనుక ప్రకాశిస్తారు.

ఇప్పుడు పిల్లలైన మీకు అవినాశీ జ్ఞాన రత్నాల లాటరీ లభిస్తుంది కనుక ఎంత సంతోషం ఉండాలి! లోలోపల సంతోషంతో గంతులు వేస్తూ ఉండండి. మీ ఈ జన్మ వజ్రతుల్యమైనదిగా మహిమ చేయబడుతుంది. బ్రాహ్మణులైన మీరే జ్ఞానవంతులుగా అవుతారు కనుక మీకు జ్ఞానం గురించిన సంతోషమే ఉంటుంది. మీరు ఈ దేవతల కంటే శ్రేష్ఠమైనవారు కనుక మీ ముఖం సదా సంతోషంతో వికసించి ఉండాలి. తండ్రి పిల్లలను ఆశీర్వదిస్తారు – మధురమైన పిల్లలూ, సదా శాంత భవ! చిరంజీవి భవ! అనగా చాలా జన్మలు జీవించండి. ఆశీర్వాదమైతే తండ్రి నుండి లభిస్తుంది కానీ ప్రతి ఒక్కరు – మేము చిరంజీవులుగా ఎలా అవ్వాలి అని తమ పురుషార్థం చేసుకోవాలి. తండ్రిని స్మృతి చేయడంతో మీరు చిరంజీవులుగా అవుతున్నారు. ఈ ఆశీర్వాదాన్ని తండ్రి ఇస్తారు. బ్రాహ్మణులు కూడా ఆయుష్మాన్ భవ అని అంటారు. తండ్రి కూడా, ‘పిల్లలూ, సదా జీవిస్తూ ఉండండి’ అని అంటారు. అర్ధకల్పం వరకు మిమ్మల్ని మృత్యువు కబళించదు. సత్యయుగంలో మరణించడమనే మాటే ఉండదు. ఇక్కడైతే మనుష్యులు మరణం అంటే భయపడతారు కదా. మీరు మరణించేందుకు పురుషార్థం చేస్తున్నారు. తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ మనం ఈ శరీరాన్ని వదిలి మన శివబాబా వద్దకు వెళ్తామని, తర్వాత స్వర్గవాసులుగా అవుతామని మీకు తెలుసు.

ఇప్పుడు మీరు అత్యంత ప్రియమైన తండ్రికి పిల్లలుగా అయ్యారు కనుక మీరు కూడా తండ్రి వలె చాలా-చాలా మధురంగా, చాలా ప్రియంగా అవ్వాలి. బాబా ఉత్తరాలలో కూడా ‘మధురాతి మధురమైన గారాబాల, చాలా కాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలూ…..’ అని వ్రాస్తారు. బాబా చాలా మధురమైనవారు కదా. బాబా ఎంత మధురమైనవారు, ఎంత ప్రియమైనవారు అనేది ప్రాక్టికల్ గా అనుభవం చేస్తారు. వారు మనల్ని కూడా అలా తయారుచేస్తారు. మనం ఎంత మధురంగా, ఎంత ప్రియంగా ఉండేవారిమి అనేది మీకు తెలుసు. మనమే పూజ్యుల నుండి మళ్ళీ పూజారులుగా అయ్యాము, అప్పుడిక మనల్ని మనమే పూజించుకుంటూ ఉన్నాము. ఇవి కూడా అర్థం చేసుకోవాల్సిన చాలా అద్భుతమైన విషయాలు.

మన అర్ధకల్పపు దుఃఖాలన్నింటినీ దూరం చేసే బాబా ఇప్పుడు వచ్చి ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. హర-హర మహాదేవ అని అంటారు. ఇప్పుడు వారు మహాదేవ అయితే కాదు. దుఃఖమైతే తండ్రియే హరిస్తారు. దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేవారు తండ్రియే. అర్ధకల్పం మీరు చాలా దుఃఖాన్ని చూసారు. 5 వికారాల రోగం చాలా పెరిగిపోయింది. ఈ రోగం చాలా దుఃఖితులుగా చేసింది. అందుకే తండ్రి అంటారు – మధురమైన పిల్లలూ, ఈ కర్మల ఖాతా ఏదైతే ఉందో దానిని ఇప్పుడు సరి చేసుకోండి. వ్యాపారస్థులు కూడా 12 నెలల ఖాతాను పెట్టుకుంటారు కదా.

తండ్రి అర్థం చేయిస్తారు – పిల్లలూ, ఇప్పుడు మొత్తం సృష్టిలో ఎంత చెత్త ఉందో చూడండి. ఇది ఉన్నదే నరకము కనుక నరకాన్ని స్వర్గంగా చేసేందుకు తండ్రికి రావాల్సి ఉంటుంది. బాబా చాలా ప్రేమతో వస్తారు. నేను పిల్లల సేవ కోసం రావాలి అని వారికి తెలుసు. నేను కల్ప-కల్పము పిల్లలైన మీ సేవలో ఉపస్థితియై ఉంటాను. వారు స్వయంగా వచ్చినప్పుడు, తండ్రి మా సేవలో ఉపస్థితులై ఉన్నారని పిల్లలు అర్థం చేసుకుంటారు. వారు ఇక్కడ కూర్చుని ఉండగా అందరి సేవ జరుగుతుంది. మొత్తం సృష్టి అంతటికీ కళ్యాణకారీ దాత వారు ఒక్కరే కదా! ప్రపంచంలోని ఆత్మలందరికీ వారే వారసత్వాన్ని ఇవ్వడానికి వస్తారని తండ్రికి తెలుసు. అనంతమైన తండ్రి దృష్టి ప్రపంచంలోని ఆత్మల వైపుకు వెళ్తుంది. ఇక్కడ కూర్చొని ఉన్నా కానీ వారి దృష్టి మొత్తం విశ్వంపై మరియు విశ్వంలోని మనుష్యమాత్రులందరిపై ఉంది, ఎందుకంటే మొత్తం విశ్వమంతటినీ పూర్తిగా తృప్తి పరచాలి. డ్రామా ప్లాను అనుసారంగా కల్పక్రితం వలె మొత్తం విశ్వంలోని ఆత్మలు తృప్తి చెందబోతున్నారు. తండ్రి పిల్లలందరినీ గుర్తు చేస్తారు, అందరిపై దృష్టి పడుతుంది కదా! తండ్రి సంగమయుగంలోనే పిల్లల సేవలో ఉపస్థితియై ఉంటారు, వారిలా ఎవ్వరూ సేవ చేయలేరు. వారిది అనంతమైన సేవ. పిల్లలైన మీరు కూడా వారిలా సేవ చేసినప్పుడు తండ్రిని ప్రత్యక్షం చేయగలరు. సేవ చేసేవారికి ఫలం కూడా చాలా భారీగా లభిస్తుంది. మేము శ్రీమతమనుసారంగా మొత్తం విశ్వంలోని మనుష్యులకు సుఖాన్ని ఇస్తామని పిల్లలకు నషా కూడా ఎక్కుతుంది.

తండ్రి అంటారు – మధురమైన పిల్లలూ, ఇప్పుడు జ్ఞాన రత్నాలతో మీ జోలిని బాగా నింపుకోండి, ఎంత నింపుకోవాలనుకుంటే అంత నింపుకోండి. మీ సమయాన్ని వృథా చేసుకోకండి. తండ్రి స్మృతిలో సమయాన్ని సంపన్నం చేసుకోండి. ఎవరైతే మంచి రీతిగా ధారణ చేస్తారో, వారు తప్పకుండా ఇతరులకు కూడా మంచి సేవను చేస్తారు. సమయం వృథా చేసుకోరు. పిల్లలు పురుషార్థం చేసి అంతర్ముఖులుగా అవ్వాలి. అంతరాత్మ ఉంటుంది కదా! ఆత్మలైన మాకు తండ్రి అర్థం చేయిస్తున్నారనే నిశ్చయం ఏర్పరచుకోవాలి. ఆత్మాభిమానులుగా అయి ఉండడమే సత్యాతి-సత్యమైన అంతర్ముఖులుగా అవ్వడము. అంతర్ముఖి అనగా లోపల ఉన్న ఆత్మ, అంతా తండ్రి నుండే వినాలి. తండ్రి ప్రేమతో పదే-పదే అర్థం చేయిస్తారు. మాత-పితల నుండి మరియు మంచి సేవ చేసే మంచి అనన్యులైన పెద్ద అన్నయ్యలు, అక్కయ్యలు ఎవరైతే ఉన్నారో, వారి నుండి నేర్చుకుంటూ వెళ్ళండి. మేము సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోకూడదు అని లోపల నిశ్చయం ఏర్పరచుకోండి. శరీర నిర్వహణ కూడా చేసుకోవాలి, తమ రచనను కూడా చూసుకోవాలి. కేవలం మమకారం పెట్టుకోకూడదు. మమకారం పెట్టుకోవడం వలన నష్టం కలుగుతుంది. మమకారమనేది ఒక్క తండ్రి పట్ల మాత్రమే పెట్టుకోండి. ఇక్కడ మీరు తండ్రి సమ్ముఖంగా ఉన్నారు. ఆత్మలు మరియు పరమాత్మ ఒకరికొకరు సమ్ముఖంగా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ స్వయంగా తండ్రి ఆత్మలను చదివిస్తారు. అక్కడ ఆత్మలు ఆత్మలను చదివిస్తారు.

పిల్లలైన మీకు లోలోపల ఈ విషయాలన్నింటి మథనం జరుగుతూ ఉండాలి. విద్యార్థుల బుద్ధిలో మొత్తం రోజంతా చదువే ఉంటుంది కదా! మీ బుద్ధిలో కూడా మొత్తం చదువంతా ఉంది. ఇది ఆత్మిక చదువు. మంచి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, వారు ఎప్పుడూ ఏకాంతంలోకి వెళ్ళి చదువుకుంటారు. విద్యార్థులు పరస్పరంలో కలుసుకున్నప్పుడు చదువు గురించే చర్చించుకుంటూ ఉంటారు. ఈ అనంతమైన చదువులోనైతే ఇంకా సంతోషంగా నిమగ్నమైపోవాలి.

ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రికి సహాయకులుగా అవుతారు. స్మృతిలో ఉండడమే సహాయం చేయడము ఎందుకంటే స్మృతి యాత్ర అంటే శాంతి యాత్ర. అందుకే, ప్రతి ఒక్కరు తమ ఇంటిని స్వర్గంగా చేసుకోండి అని అంటారు. ప్రతి ఒక్కరి బుద్ధిలో అల్ఫ్ (భగవంతుడు) మరియు బే (వారసత్వం) ఉన్నాయి. అల్ఫ్ ను స్మృతి చేసినట్లయితే రాజ్యాధికారం లభిస్తుంది, ఇంకేమీ చేయనవసరం లేదు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే ఇక రాజ్యం మీదే. తండ్రిని స్మృతి చేసినట్లయితే స్వర్గ రాజ్యం లభిస్తుంది అనే సందేశాన్ని పిల్లలైన మీరు అందరికీ ఇస్తూ ఉండండి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల హృదయపూర్వకమైన ప్రేమతో ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి స్మృతిలో తమ సమయాన్ని సంపన్నం చేసుకోవాలి. ఈ అమూల్యమైన సమయాన్ని ఎక్కడా పాడు చేసుకోకూడదు. పురుషార్థం చేసి అంతర్ముఖులుగా అనగా ఆత్మాభిమానులుగా అయి ఉండాలి.

2. ఇప్పుడు మనం దేవతల కన్నా శ్రేష్ఠమైన బ్రాహ్మణులము. ఇప్పుడు తండ్రి ద్వారా అవినాశీ జ్ఞాన రత్నాల లాటరీ లభించింది. జ్ఞానవంతులుగా అయ్యారు కనుక ముఖం సదా సంతోషంతో వికసించి ఉండాలి. లోలోపల సంతోషంతో గంతులు వేస్తూ ఉండండి.

వరదానము:-

ఎలాగైతే నిరాకార ఆత్మ మరియు సాకార శరీరం, రెండింటి సంబంధంతో ప్రతి కార్యాన్ని చేయగలుగుతారో, అలా నిరాకార మరియు సాకార తండ్రులు, ఇరువురిని తోడుగా మరియు ఎదురుగా ఉంచుకుంటూ ప్రతి కర్మను మరియు సంకల్పాన్ని చేసినట్లయితే సఫలతామూర్తులుగా అయిపోతారు. ఎందుకంటే బాప్ దాదా సమ్ముఖంగా ఉన్నప్పుడు తప్పకుండా వారితో వెరిఫై చేయించుకొని నిశ్చయంతో మరియు నిర్భయతతో చేస్తారు. దీనితో సమయం మరియు సంకల్పాలు పొదుపు అవుతాయి, ఏదీ వ్యర్థమవ్వదు, ప్రతి కర్మ స్వతహాగా సఫలమవుతుంది.

స్లోగన్:-

దాదీ ప్రకాశమణి గారి 14వ పుణ్య స్మృతి దివసం సందర్భంగా క్లాసులో వినిపించేందుకు దాదీ గారి ద్వారా లభించిన అమూల్యమైన కానుక

1. ఈశ్వరీయ నియమాలు మరియు మర్యాదలు మన జీవితానికి సత్యమైన అలంకారాలు, వీటిని తమ జీవితంలో ధారణ చేసి సదా ఉన్నతి చేసుకుంటూ ఉండాలి.

2. మేము భగవంతుని కంటి వెలుగులము అన్న ఈ నషాను సదా పెట్టుకోండి. భగవంతుని నయనాలలో దాగి ఉన్నట్లయితే మాయ తుఫానులు, గాలివానలు స్థితిని కదిలించలేవు. సదా బాబా ఛత్రఛాయ కింద ఉన్నట్లయితే రక్షకుడైన బాబా సదా రక్షిస్తూ ఉంటారు.

3. మనందరి ప్రియుడు మరియు మార్గదర్శకుడు ఒక్క బాబానే, వారితోనే మనసును ఇచ్చిపుచ్చుకోవాలి. ఎప్పుడూ ఏ దేహధారిని మిత్రుని చేసుకొని, వారితో వ్యర్థ చింతన మరియు పరచింతన చేయకూడదు.

4. ముఖంపై ఎప్పుడూ ఉదాసీనత, అయిష్టము లేక ద్వేషం యొక్క చిహ్నాలు రాకూడదు. సదా సంతోషంగా ఉండండి మరియు సంతోషాన్ని పంచుతూ వెళ్ళండి. ప్రతి ఒక్కరినీ భాగ్యవంతులుగా తయారుచేసేంతగా తమ సెంటరు వాతావరణాన్ని సుసంపన్నముగా తయారుచేయండి.

5. ఎంతగా అంతర్ముఖులుగా అయి నోటి మౌనమును మరియు మనసు మౌనమును ధారణ చేస్తారో, అంతగా స్థానం యొక్క వాయుమండలం లైట్-మైట్ సంపన్నంగా అవుతుంది మరియు వచ్చేవారిపై దాని ప్రభావం పడుతుంది, ఇదే సూక్ష్మ సకాష్ ఇచ్చే సేవ.

6. ఏదైనా కారణానికి వశమై ‘నాది నీది’ లోకి వచ్చి పరస్పరంలో అభిప్రాయ బేధాలలోకి రాకూడదు. పరస్పరంలోని ఈ అభిప్రాయ బేధాలే సేవలలో అన్నింటికంటే పెద్ద విఘ్నాలు. ఈ విఘ్నాల నుండి ఇప్పుడు ముక్తులుగా అవ్వండి మరియు ముక్తులుగా చెయ్యండి.

7. ఇతరుల ఆలోచనలకు గౌరవాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరి మాటను ముందు వినండి, తర్వాత నిర్ణయించండి, అప్పుడు రెండు మతాలు (అభిప్రాయాలు) ఉండవు. చిన్నా, పెద్ద ప్రతి ఒక్కరికీ తప్పకుండా గౌరవాన్ని ఇవ్వండి.

8. ఇప్పుడు బాబా పిల్లలందరూ సంతుష్టత యొక్క ఎటువంటి గనులుగా అవ్వాలంటే, మిమ్మల్ని చూస్తూ ప్రతి ఒక్కరు సంతుష్టులైపోవాలి. సదా సంతుష్టంగా ఉండండి మరియు ఇతరులను కూడా సంతుష్టపరచండి.

9. నాలుగు మంత్రాలు సదా గుర్తుంచుకోవాలి – ఒకటి – ఎప్పుడూ నిర్లక్ష్యులుగా అవ్వకూడదు, సదా అలర్ట్ గా ఉండాలి. రెండు – ఎవరినీ ద్వేషించకూడదు. అందరి పట్ల శుభ భావనను పెట్టుకోవాలి. మూడు – ఎవరి పట్ల ఈర్ష్య పెట్టుకోకూడదు, ఉన్నతి యొక్క రేస్ ను చేయాలి. నాలుగు – ఎప్పుడూ ఏ వ్యక్తికి, వస్తువుకు లేక వైభవానికి ప్రభావితులవ్వకూడదు, సదా ఒక్క బాబా ప్రభావంలోనే ఉండాలి.

10. మనమందరము రాయల్ తండ్రికి రాయల్ పిల్లలము, సదా స్వయంలో రాయల్టీ మరియు పవిత్రత యొక్క సంస్కారాలను నింపుకోవాలి, బానిసత్వపు సంస్కారాల నుండి ముక్తులుగా ఉండాలి. సత్యతను ఎప్పుడూ వదలకూడదు.

11. ప్రతి ఒక్కరు, ప్రతి రోజు ప్రతి గంటకు అయిదు నిమిషాలైనా సైలెన్స్ యొక్క అనుభూతిని తప్పకుండా చేయండి, అప్పుడు అనేక విషయాలపై విజయం పొందే శక్తి వస్తుంది. ఎప్పుడైతే జ్ఞాన సహితంగా యోగంలో ఉంటారో, అప్పుడు మాయపై విజయం లభిస్తుంది.

12. సేవతో పాటు స్వ-స్థితి ఏకరసంగా ఉండాలి. దీని కొరకు యోగ భట్టీ చాలా అవసరము. ఇందులో అందరూ సంగఠనలో కూర్చొని అభ్యాసం చేయాలి. అప్పుడు సంగఠన యొక్క బలం కూడా లభిస్తుంది.

13. మీ ముఖంపై ఎప్పుడూ ఉదాసీనత, అయిష్టము, ద్వేషం యొక్క చిహ్నాలు కనిపించకూడదు. ఒకవేళ పరస్పరంలో ఏవైనా కొన్ని విషయాలు జరిగితే, వాటిని తమ తపస్సుతో సమాప్తం చేయండి. ఇతరుల ముందు వర్ణించకండి. వర్ణించడం వలన వాయుమండలం పాడవుతుంది.

14. ఎవరు ఎంతగా మనసును పాడు చేసేందుకు ప్రయత్నించినా కానీ, వారి ప్రభావంలోకి ఎప్పుడూ రాకూడదు. సాంగత్య దోషం కూడా చాలా చెడ్డది, అది బుద్ధిని మార్చేస్తుంది. అందరినీ ప్రేమించండి, అందరూ ఫ్రెండ్స్ కానీ పర్సనల్ ఫ్రెండ్ గా ఎవ్వరినీ చేసుకోకండి. దీనిని అండర్ లైన్ చేసుకోండి.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top