25 April 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

April 24, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - పాత దేహము మరియు దేహ సంబంధీకులు ఎవరైతే ఒకరికొకరు దుఃఖమిచ్చుకుంటారో, వారందరినీ మరచి ఒక్క తండ్రిని స్మృతి చేయండి, శ్రీమతంపై నడవండి’’

ప్రశ్న: -

తండ్రితో పాటు తిరిగి వెళ్ళేందుకు, తండ్రి యొక్క ఏ శ్రీమతాన్ని పాటించాల్సి ఉంటుంది?

జవాబు:-

తండ్రి శ్రీమతం ఏమిటంటే, పిల్లలూ, పవిత్రంగా అవ్వండి, జ్ఞానాన్ని పూర్తిగా ధారణ చేసి తమ కర్మాతీత అవస్థను తయారుచేసుకోండి, అప్పుడు తండ్రితో పాటు తిరిగి వెళ్ళగలరు. కర్మాతీతులుగా అవ్వకపోతే మధ్యలో ఆగి శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. వినాశన సమయంలో అనేకాత్మలు శరీరాలను వదిలి భ్రమిస్తాయి, కలిసి వెళ్ళేందుకు బదులుగా ఇక్కడే ముందు శిక్షలను అనుభవించి, లెక్కలను సమాప్తం చేసుకుంటాయి, అందుకే తండ్రి శ్రీమతం ఏమిటంటే, పిల్లలూ, తలపై ఏదైతే పాపాల భారముందో, పాత లెక్కాచారాలు ఉన్నాయో, వాటన్నింటినీ యోగబలంతో భస్మం చేయండి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఓ దూరపు బాటసారి… (ఓ దూర్ కే ముసాఫిర్…)

ఓంశాంతి. ఇప్పుడు బ్రాహ్మణులైన మీ బుద్ధి నుండి సర్వవ్యాపి యొక్క జ్ఞానమైతే తొలగిపోయింది. పరమపిత పరమాత్మ, ప్రజాపిత బ్రహ్మా ద్వారా కొత్త రచనను రచిస్తారు అనైతే మంచి రీతిలో అర్థం చేయించడం జరుగుతుంది. వారు రచయిత, వారిని పరమాత్మ అని అంటారు. పిల్లలకు ఇది కూడా తెలుసు, వారు వస్తారు, వచ్చి పిల్లలను తమవారిగా చేసుకుంటారు, మాయ నుండి విముక్తులుగా చేస్తారు. పాత దేహము, దేహ సహితంగా మిత్ర-సంబంధీకులు మొదలైనవారు ఎవరైతే ఉన్నారో, వారు ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చేటువంటివారు, వారిని మర్చిపోవాలి. ఎవరైనా వృద్ధాప్యంలో ఉంటే, వారికి రామ నామాన్ని జపించండి అని మిత్ర-సంబంధీకులు మొదలైనవారు చెప్తారు. ఇప్పుడు వారు కూడా అసత్యమే చెప్తారు. వారికి స్వయము తెలియదు, అంతేకాక వారి బుద్ధిలో పరమాత్మ స్మృతి కూడా నిలవదు. పరమాత్మ సర్వవ్యాపి అని భావిస్తారు. ఒకవైపు దూరపు బాటసారి… అని పాడుతారు. ఆత్మలు దూరం నుండి వచ్చి, శరీరాన్ని ధారణ చేసి, తమ-తమ పాత్రలను అభినయిస్తాయి. ఈ విషయాలన్నీ మనుష్యుల గురించే అర్థం చేయించడం జరుగుతుంది. మనుష్యులు శివుని మందిరాలను నిర్మిస్తారు, పూజ చేస్తారు, అయినా కూడా ఇక్కడా-అక్కడా వెతుకుతూ ఉంటారు. మాలో, మీలో అందరిలోనూ వ్యాపించి ఉన్నారని అంటారు. అటువంటివారిని అనాథలని అంటారు – వారు యజమాని గురించి తెలియనివారు. ఓ భగవంతుడా అని గుర్తు చేసుకుంటారు కానీ వారి గురించి తెలియదు. చేతులు జోడిస్తారు. వారు నిరాకారుడని భావిస్తారు. మన ఆత్మ కూడా నిరాకారియే. ఇది ఆత్మ యొక్క శరీరము. కానీ ఆత్మ గురించి ఎవరికీ తెలియదు. భృకుటి మధ్యలో అద్భుతమైన నక్షత్రం మెరుస్తుంది అని కూడా అంటారు. ఒకవేళ నక్షత్రమైతే, మరి ఇంత పెద్ద లింగాన్ని ఎందుకు తయారుచేస్తారు! ఆత్మలోనే 84 జన్మల పాత్ర ఉంది. ఇది కూడా తెలియదు. ఇక్కడా-అక్కడా వెతుకుతూ, ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. అందరినీ భగవంతుడు అని అంటారు. బద్రీనాథుడు కూడా భగవంతుడైతే, కృష్ణుడు కూడా భగవంతుడైతే, రాయి-రప్పల్లో కూడా భగవంతుడు ఉన్నట్లయితే, మరి వెతకడానికి ఇంత దూరదూరాలకు ఎందుకు వెళ్తారు. ఎవరైతే మన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు కారో, వారు బ్రాహ్మణులుగానూ అవ్వరు, అంతేకాక వారికి ధారణ కూడా జరగదు. వారు నామమాత్రంగా బాగుంది-బాగుంది అని అంటూ ఉంటారు. తండ్రి అంటారు, పిల్లలూ, నేను మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తాను. ఎప్పుడైతే మీరు శ్రీమతంపై నడుస్తూ, మొదట పవిత్రంగా అవుతారో, జ్ఞానాన్ని ధారణ చేస్తారో, తమ కర్మాతీత అవస్థను తయారుచేసుకుంటారో, అప్పుడే నాతో పాటుగా ఇంటికి చేరుకుంటారు. లేదంటే మధ్యలో ఆగి, చాలా కఠినమైన శిక్షలను అనుభవించాల్సి ఉంటుంది. మరణించిన తర్వాత చాలా ఆత్మలు భ్రమిస్తూ ఉంటాయి కూడా. ఎప్పటివరకైతే శరీరాలు లభించవో, అప్పటివరకు భ్రమిస్తూ శిక్షలు అనుభవిస్తాయి. ఇక్కడ వినాశన సమయంలో చాలా అశుద్ధంగా అవుతుంది. తలపై పాపాల భారం చాలా ఉంది, అందరూ లెక్కాచారాలనైతే సమాప్తం చేసుకోవాల్సిందే. కొంతమంది పిల్లలైతే ఇప్పటివరకు కూడా యోగం గురించి అర్థం చేసుకోలేదు. ఒక్క నిమిషం కూడా తండ్రిని స్మృతి చేయరు. పిల్లలైన మీకు ఘడియ-ఘడియ చెప్పడం జరుగుతుంది – బాబాను స్మృతి చేయండి ఎందుకంటే తలపై భారము చాలా ఉంది. పరమాత్మ సర్వవ్యాపి అని మనుష్యులంటారు, అయినా కూడా తీర్థయాత్రలకు ఎంతగా భ్రమిస్తారు. ఈ కర్మకాండలు మొదలైనవి చేయడంతో, మాకు పరమాత్మను కలుసుకునే మార్గం లభిస్తుందని భావిస్తారు. తండ్రి అంటారు, పతిత భ్రష్టాచారులైతే నా వద్దకు చేరుకోలేరు కూడా. ఫలానావారు నిర్వాణం చెందారని అంటారు, కానీ ఇవన్నీ ప్రగల్భాలు. వాస్తవానికి ఎవ్వరూ కూడా వెళ్ళరు. భక్తిమార్గంలో ఎన్ని ఎదురుదెబ్బలు తింటారు అనేది ఇప్పుడు మీకు తెలుసు. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ చదువుతూ-చదువుతూ మనుష్యులు పడిపోవాల్సిందే. తండ్రి పైకి ఎక్కిస్తారు, రావణుడు పడేస్తాడు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు, మీరు నా మతంపై నడుస్తూ, పవిత్రంగా అయి, మంచి రీతిలో చదువుకున్నట్లయితే స్వర్గంలోకి వెళ్తారు, లేదంటే ఇంతటి ఉన్నత పదవిని పొందలేరు. ప్రదర్శనీ సేవ ఎంతగా జరుగుతుంది. ఇప్పుడు ఈ సేవ వృద్ధి చెందుతూ ఉంది. గ్రామ-గ్రామానికీ వెళ్తారు. ఇది కొత్త ఆవిష్కరణ. కొత్త-కొత్త పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. ఎప్పటివరకైతే జీవించాలో, అప్పటివరకు నేర్చుకోవాల్సిందే. మీ లక్ష్యము-ఉద్దేశ్యము భవిష్యత్తు కోసము. ఈ శరీరాన్ని వదిలితే, మీరు వెళ్ళి రాకుమార-రాకుమారీలుగా అవుతారు. స్వర్గమంటే స్వర్గమే. అక్కడ నరకం యొక్క నామ-రూపాలు కూడా ఉండవు. భూమి కూడా అతలాకుతలమై కొత్తదిగా అవుతుంది. ఈ ఇళ్ళు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. బంగారు ద్వారక కిందకు వెళ్ళిపోయిందని అంటారు. కిందకేమీ వెళ్ళదు. ఇది ఒక చక్రం వలె తిరుగుతుంది. ఈ తీర్థయాత్రలు మొదలైనవన్నీ భక్తిమార్గానికి చెందినవి. భక్తి రాత్రి వంటిది. ఎప్పుడైతే భక్తి యొక్క రాత్రి పూర్తవుతుందో, అప్పుడు పగలుగా చేసేందుకు బ్రహ్మా వస్తారు. ద్వాపర-కలియుగాలు బ్రహ్మా యొక్క రాత్రి, మళ్ళీ పగలు రావాలి. పిల్లలైన మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. అందరూ అయితే ఒకే విధంగా చదవలేరు. రకరకాల పదవులు ఉన్నాయి. ప్రదర్శనీలో చూడండి, ఎంతమంది వస్తారు. 5-7 వేల మంది ప్రతి రోజు వస్తారు. మరి ఎవరు వెలువడతారు! కోట్లలో కొందరు, కొందరిలో కూడా కొందరు. బాబా, ప్రతి రోజూ వచ్చేవారు 3-4 వెలువడ్డారు అని రాస్తారు. కొందరు 7 రోజుల కోర్సు కూడా తీసుకుంటారు, ఇక తర్వాత రారు. ఎవరైతే దేవీ-దేవతా ధర్మానికి చెందినవారో, వారే ఇక్కడ నిలుస్తారు. సాధారణమైన పేదవారే వెలువడుతారు. షావుకార్లైతే కష్టం మీద నిలుస్తారు. చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. ఉత్తరాలు కూడా రాస్తారు. రక్తంతో కూడా రాసి ఇస్తారు. ఇక తర్వాత నడుస్తూ-నడుస్తూ మాయ తినేస్తుంది, యుద్ధం జరిగినప్పుడు రావణుడు గెలుస్తాడు. ఇకపోతే, ఎవరైతే ఎంతో కొంత వింటారో, వారు ప్రజల్లోకి వెళ్ళిపోతారు. శ్రీమతంపై నడవాలి అని బాబా అయితే అర్థం చేయిస్తూ ఉంటారు. మమ్మా-బాబా మరియు అనన్యులైన పిల్లలు పురుషార్థం చేస్తున్నారు. మహారథుల పేర్లు అయితే తీసుకుంటారు కదా. పాండవ సైన్యంలో ఎవరెవరు ఉన్నారో, వారి పేర్లు కూడా ప్రసిద్ధమైనవి. అలాగే కౌరవ సైన్యంలోనూ ముఖ్యమైన వారి పేర్లు కూడా ప్రసిద్ధమైనవి. యూరోప్ వాసీ యాదవుల పేర్లు కూడా ఉన్నాయి. వార్తాపత్రికలలో కూడా ఎవరైతే ప్రసిద్ధమైనవారో, వారి పేర్లను వేస్తారు. వారందరికీ పరమపిత పరమాత్మ పట్ల విపరీత బుద్ధి ఉంది. పరమాత్మను తెలుసుకుంటేనే కదా ప్రీతిని పెట్టుకోగలరు. ఇక్కడ కూడా పిల్లలు ప్రీతిని పెట్టుకోలేరు. ఘడియ-ఘడియ మర్చిపోతారు, ఇక పదవి భ్రష్టమైపోతుంది. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, అంతగా వికర్మలు వినాశనమవుతాయి మరియు పదవి ఉన్నతమైనది లభిస్తుంది, ఇతరులను కూడా తమ సమానంగా తయారుచేయాలి, దయార్ద్రహృదయులుగా అవ్వాలి మరియు అంధులకు చేతికర్రగా కూడా అవ్వాలి. కొందరు అంధులుగా, కొందరు ఒంటికన్ను వారిగా, కొందరు మసక చూపు కలవారిగా ఉంటారు. ఇక్కడ కూడా పిల్లలు నంబరువారుగా ఉన్నారు. అటువంటివారు మళ్ళీ సాధారణ ప్రజలలోకి వెళ్ళి నౌకర్లుగా అవుతారు. మున్ముందు మీరు అన్నీ సాక్షాత్కారం పొందుతారు. ఈశ్వరుడిని సర్వవ్యాపి అని అనడం – ఇదేమీ తెలివి కాదు. ఈశ్వరుడైతే జ్ఞానసాగరుడు. వారే వచ్చి మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు, రాజయోగాన్ని కూడా నేర్పిస్తున్నారు. శ్రీ కృష్ణుని ఆత్మ, ఎవరైతే ఇప్పుడు 84 జన్మలను పూర్తి చేసుకున్నారో, వారిప్పుడు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ఇవి ఎంత గుప్తమైన విషయాలు. ఈ సమయంలో అందరూ తండ్రిని మర్చిపోయిన కారణంగా మహాన్ దుఃఖితులుగా అయ్యారు. పిల్లలైన మీరు ఎంతెంతగా పురుషార్థం చేస్తారో, అంతగా మీ నుండి లోపాలు తొలగిపోతూ ఉంటాయి. ఇది చాలా ఉన్నతమైన గమ్యము. కోట్లాది మంది నుండి 8 మంది ముఖ్యమైనవారు వెలువడతారు, ఆ తర్వాత 108 మాల తయారవుతుంది, ఆ తర్వాత 16 వేల మాల. పురుషార్థం చేసేందుకు ఈ ఆశను చూపించడం జరుగుతుంది. వాస్తవానికి 16 వేల మాల ఏదీ లేదు. మాల 108 మందిది. పైన పుష్పము, ఆ తర్వాత జంట పూసలు, ఆ తర్వాత నంబరువారుగా విష్ణుమాల తయారవుతుంది. పురుషార్థం చేయించడం కోసం ఎంతగా అర్థం చేయించడం జరుగుతుంది. ఎవరైతే ఈ ధర్మానికి చెందినవారు కారో, వారేమీ అర్థం చేసుకోరు. వారు స్వర్గ సుఖాలను పొందేందుకు యోగ్యులే కాదు. పూజారులైతే చాలామంది ఉన్నారు, వారు వచ్చినా ప్రజలలోకి వస్తారు. ప్రజా పదవి అనేది అసలేమీ కానే కాదు. మమ్మా-బాబా అని అంటున్నారంటే, మరి ఫాలో చేసి మమ్మా-బాబా యొక్క సింహాసనాధికారులుగా అవ్వండి. హార్ట్ ఫెయిల్ ఎందుకు అవుతారు! స్కూల్లో ఎవరైనా విద్యార్థి, నేను పాస్ అవ్వను అని అంటే ఇతడు మందబుద్ధి కలవాడు అని అందరూ అంటారు. తెలివైన పిల్లలు చాలా బాగా చదువుతారు మరియు ఉన్నతమైన నంబరులోకి వస్తారు. పిల్లలైన మీరు ప్రదర్శనీలో చాలా మంచి సేవ చేయవచ్చు. బాబాను కూడా అడగవచ్చు – బాబా, నేను సేవ చేసేందుకు యోగ్యుడినా. అప్పుడు బాబా చెప్తారు – పిల్లలూ, ఇప్పుడు మీరు ఇంకా చాలా నేర్చుకోవాలి మరియు యోగ్యులుగా అవ్వాలి. విద్వాంసులు మొదలైనవారి ఎదురుగా అర్థం చేయించేవారు కూడా తెలివైనవారై ఉండాలి. మొట్టమొదటగా, భగవంతుడు వచ్చి ఉన్నారు అన్న నిశ్చయం ఏర్పరచడం జరుగుతుంది. దూరదేశంలో నివసించేవారా రండి, మమ్మల్ని మీతో పాటు తీసుకువెళ్ళండి ఎందుకంటే మేము చాలా దుఃఖితులుగా ఉన్నామని అంటూ పిలుస్తారు. సత్యయుగంలోనైతే ఇంతమంది మనుష్యులు ఉండనే ఉండరు. ఆత్మలందరూ ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు, దాని కోసమే ప్రపంచము ఇంతగా భక్తి చేస్తుంది. తండ్రి అంటారు, నేను అందరినీ తీసుకువెళ్తాను. సెకండులో ముక్తి-జీవనముక్తి. నిశ్చయం ఏర్పడినట్లయితే జీవన్ముక్తులుగా అవుతారు, మళ్ళీ జీవనముక్తిలో కూడా పదవులున్నాయి. జీవన్ముక్తిలో రాజా-రాణి పదవిని పొందేందుకు పురుషార్థం చేయాలి. మమ్మా-బాబా, మహారాజా-మహారాణులుగా అవుతున్నారన్నప్పుడు మనమెందుకు పదవిని పొందుకూడదు? పురుషార్థం చేసేవారు గుప్తంగా దాగి ఉండలేరు. మొత్తం రాజధాని స్థాపనవుతూ ఉంది. దైవీ ధర్మం వారు ఎవరెవరైతే ఉన్నారో, వారు తప్పకుండా వస్తారు. మమ్మా-బాబా, రాజా-రాణిగా అవుతారన్నప్పుడు మనం కూడా ఎందుకు పురుషార్థం చేయకూడదు?

బాబాకు పిల్లలు ఉత్తరాలు రాస్తారు – బాబా, అప్పుడప్పుడు సెంటరుకు వస్తూ ఉంటాను, ఇప్పుడు కూతురుకు వివాహం చేయించాలి, ఎవరైనా జ్ఞానీ యువకుడిని ఇవ్వండి, అప్పుడు ఆమెకు వివాహం చేయిస్తాను, కూతురేమో నేను వివాహం చేసుకోను అని అంటుంది. చాలామంది కుమార్తెలు దెబ్బలు తింటారు. అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. తల్లి, తండ్రి మరియు పిల్లలు, ముగ్గురూ బాబా వద్దకు రండి, అప్పుడు బాబా అర్థం చేయిస్తారు. ఆదరణీయ పితాశ్రీ అని రాస్తున్నారంటే, మరి రండి, టికెట్ తీసుకునేందుకు ధనం లేకపోతే అది కూడా లభించగలదు. సమ్ముఖంగా వచ్చినట్లయితే శ్రీమతం లభిస్తుంది. కుమారినైతే హతమార్చకూడదు కదా? లేదంటే పాపాత్ములుగా అయిపోతారు. తండ్రి శ్రీమతంపై నడుస్తూ పవిత్రంగా అవ్వాల్సి ఉంటుంది. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జీవన్ముక్తి పదవిని పొందేందుకు పురుషార్థం చేయాలి. ఎలాగైతే తల్లి-తండ్రి మహారాజా-మహారాణిగా అవుతారో, అలా ఫాలో చేసి సింహాసనాధికారులుగా అవ్వాలి. తెలివైనవారిగా అయి చదువును మంచి రీతిలో చదువుకోవాలి.

2. తండ్రి పట్ల సత్యమైన ప్రీతిని పెట్టుకోవాలి. దయాహృదయులుగా అయి అంధులకు మార్గాన్ని చూపించాలి. తండ్రి నుండి సమ్ముఖంగా శ్రీమతాన్ని తీసుకుని, పాపాత్ములుగా అవ్వడం నుండి స్వయాన్ని రక్షించుకోవాలి మరియు ఇతరులను కూడా రక్షించాలి.

వరదానము:-

సంగమయుగంలో బాప్ దాదా యొక్క విశేషమైన కానుక సంతుష్టత. సంతోషీ ఆత్మ ఎదురుగా ఎలాంటి కదిలించేటువంటి పరిస్థితి వచ్చినా, అది తోలుబొమ్మలాట వలె అనుభవమవుతుంది. ఈ రోజుల్లో కార్టూన్ షోల ఫ్యాషనుంది. కావున ఎప్పుడు ఏ పరిస్థితి వచ్చినా సరే, దానిని అనంతమైన స్క్రీన్ పై కార్టూన్ షో లేక తోలుబొమ్మలాట నడుస్తుంది అన్నట్లు భావించండి. ఇది మాయ మరియు ప్రకృతికి చెందిన ఒక షో. దీనిని సాక్షీ స్థితిలో స్థితులై, తమ గౌరవంలో ఉంటూ, సంతుష్టతా స్వరూపంలో చూస్తూ ఉండండి – అప్పుడు సంతోషీ ఆత్మ అని అంటారు.

స్లోగన్:-

మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు

‘‘పరమాత్మకు సత్యమైన బిడ్డగా అవుతూ ఎటువంటి సంశయంలోకి రాకూడదు’’

పిల్లల పట్ల భగవానువాచ ఏమిటంటే – పిల్లలూ, స్వయంగా పరమాత్మ ఈ సృష్టిపై అవతరించినప్పుడు, ఆ పరమాత్మకు మనము పక్కా చేతిని అందించాలి, కానీ పక్కా మరియు సత్యమైన బిడ్డే బాబాకు చేతిని అందించగలడు. ఈ తండ్రి చేతిని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు, ఒకవేళ విడిచిపెడితే, ఇక అనాథలుగా అయి ఎక్కడికి వెళ్తారు! పరమాత్మ చేతిని పట్టుకున్న తర్వాత – నేను వదలాలి అనే సూక్ష్మ సంకల్పం కూడా రాకూడదు లేక మేము దాటుతామో లేదో తెలియదు అనేటువంటి సంశయం ఉండకూడదు. కొంతమంది పిల్లలు ఇలా కూడా ఉంటారు – తండ్రిని గుర్తించని కారణంగా తండ్రిని కూడా ఎదిరిస్తారు మరియు మేము ఎవ్వరినీ లెక్క చేయము అని అంటారు. ఒకవేళ ఇటువంటి ఆలోచన వచ్చినట్లయితే, ఇలాంటి అయోగ్యులైన పిల్లలను తండ్రి ఎలా సంభాళిస్తారు, ఇక వారు తప్పకుండా కింద పడిపోతారు ఎందుకంటే మాయ అయితే పడేసేందుకు చాలా ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే – ఈ యోధుడు రుస్తుమ్ గా, పహిల్వాన్ గా ఎంతవరకు ఉన్నాడు అనేటువంటి పరీక్షను తప్పకుండా తీసుకుంటుంది! ఇప్పుడు ఇది కూడా అవసరము. ఎంతెంతగా మనం ప్రభువుతో పాటు రుస్తుమ్ గా అవుతూ ఉంటామో, అంతగా మాయ కూడా రుస్తుమ్ గా అయి మనల్ని పడేసేందుకు ప్రయత్నం చేస్తుంది. పూర్తి జోడీలా తయారవుతుంది. ప్రభువు ఎంతటి శక్తివంతుడో, మాయ కూడా అంతటి శక్తిని చూపిస్తుంది. కానీ మనకైతే పక్కా నిశ్చయం ఉంది – చివరికైతే పరమాత్మ మహాన్ శక్తిశాలి, చివరికి వారిదే గెలుపు. శ్వాస-శ్వాసలోనూ ఈ విశ్వాసంలో స్థితులవ్వాలి, మాయకు తమ శక్తిని చూపించాలి. మాయ ప్రభువు ఎదురుగా తన బలహీనతను చూపించదు. ఒకవేళ ఒక్కసారి మనం బలహీనమైనా కానీ ఇక సమాప్తమైనట్లే. అందుకే, మాయ తన ఫోర్సును చూపించినా కానీ మీరు మాయాపతి యొక్క చేతిని విడిచిపెట్టకూడదు. ఆ చేతిని పూర్తిగా పట్టుకున్నట్లయితే, అటువంటివారికి ఇక విజయం ఉన్నట్లు. పరమాత్మ మన యజమాని అన్నప్పుడు, వారి చేతిని విడిచిపెట్టాలనే సంకల్పం రాకూడదు. ఒకవేళ చేతిని విడిచిపెట్టినట్లయితే పెద్ద మూర్ఖులు అయినట్లు, అందుకే పరమాత్మ అంటారు – పిల్లలూ, నేను స్వయం సమర్థుడిని కావున నాతో పాటు ఉంటూ మీరు కూడా సమర్థులుగా తప్పకుండా అవుతారు. అర్థమయిందా పిల్లలూ. అచ్ఛా – ఓంశాంతి.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top