24 March 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

March 23, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - ఏకాంతంలో కూర్చుని చదువుకున్నట్లయితే, ధారణ చాలా బాగా జరుగుతుంది, ఉదయముదయమే లేచి విచార సాగర మథనం చేసే అలవాటు చేసుకోండి’’

ప్రశ్న: -

ఫుల్ పాస్ అవ్వాలంటే ఎటువంటి ఆలోచనలు రావాలి, ఎటువంటివి రాకూడదు?

జవాబు:-

ఫుల్ పాస్ అవ్వడానికి, మేము రాత్రింబవళ్ళు చాలా కష్టపడి చదువుకోవాలని సదా ఇదే ఆలోచన ఉండాలి. తమ అవస్థను ఎంత ఉన్నతంగా తయారుచేసుకోవాలంటే, బాప్ దాదా హృదయసింహాసనంపై కూర్చోగలగాలి. నిద్రను జయించేవారిగా అవ్వాలి. సంతోషంలో ఉండాలి. ఇకపోతే, డ్రామాలో లేక అదృష్టంలో ఏది ఉంటే అది లభిస్తుందిలే అన్న ఆలోచన ఎప్పుడూ రాకూడదు. ఈ ఆలోచన నిర్లక్ష్యులుగా చేస్తుంది.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

మిమ్మల్ని పొంది మేము ప్రపంచాన్ని పొందాము… (తుమ్హే పాకే హమ్ నే జహాన్ పా లియా హై…)

ఓంశాంతి. పిల్లలు పాట అర్థాన్ని అర్థం చేసుకున్నారు. అనంతమైన తండ్రి నుండి ఇప్పుడు మనకు అనంతమైన వారసత్వం లభిస్తుంది. పిల్లలు తండ్రి నుండి మళ్ళీ విశ్వ స్వరాజ్యం యొక్క వారసత్వాన్ని పొందుతున్నారు, ఆ విశ్వ రాజ్యాన్ని మీ నుండి ఎవ్వరూ లాక్కోలేరు. మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు. అక్కడ ఏ హద్దులు ఉండవు. ఒక్క తండ్రి నుండి మీరు ఒకే రాజధానిని తీసుకుంటారు. ఒకే మహారాజు-మహారాణి రాజ్యం చేస్తారు. ఒకే తండ్రి మరియు ఒకే రాజధాని, అందులో ఎలాంటి విభజనలు ఉండవు. మీకు తెలుసు, భారత్ లో ఒకే మహారాజు-మహారాణి అయిన లక్ష్మీ-నారాయణుల రాజధాని ఉండేది, వారు మొత్తం విశ్వంపై రాజ్యం చేసేవారు. దానిని అద్వైత రాజధాని అని అంటారు, దానిని పిల్లలైన మీ ద్వారా ఆ ఒక్కరే స్థాపన చేసారు. ఇక తర్వాత పిల్లలైన మీరే విశ్వ రాజ్యాన్ని అనుభవిస్తారు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత మనం ఈ రాజ్యాన్ని తీసుకుంటామని మీకు తెలుసు. మళ్ళీ అర్ధకల్పం పూర్తి అవ్వడంతో మనం ఈ రాజ్యాన్ని పోగొట్టుకుంటాము. మళ్ళీ బాబా వచ్చి రాజ్యాన్ని ప్రాప్తి చేయిస్తారు. ఇది గెలుపు-ఓటముల ఆట. మాయతో ఓడిపోతే ఓడిపోయినట్లే. మళ్ళీ శ్రీమతంతో మీరు రావణుడిపై విజయం పొందుతారు. మీలో కూడా కొందరు పూర్తి అనన్యులైన నిశ్చయబుద్ధి కలవారున్నారు, వారికి, మేము విశ్వానికి యజమానులుగా అవుతామని సదా సంతోషం ఉంటుంది. క్రిస్టియన్లు ఎంత శక్తివంతులైనా కానీ విశ్వానికి యజమానులుగా అవ్వడమనేది జరగజాలదు. వారి రాజ్యాలు వేర్వేరు భాగాలలో ఉన్నాయి. మొట్టమొదట ఒక్క భారత్ యే మొత్తం విశ్వానికి యజమానిగా ఉండేది. దేవీ-దేవతలది తప్ప వేరే ధర్మమేదీ ఉండేది కాదు. ఈ విధంగా విశ్వానికి యజమానులుగా విశ్వ రచయితనే తయారుచేస్తారు. చూడండి, బాబా కూర్చుని ఎలా అర్థం చేయిస్తారు. మీరు కూడా అర్థం చేయించగలరు. భారతవాసులు తప్పకుండా విశ్వానికి యజమానులుగా ఉండేవారు. విశ్వ రచయిత ద్వారానే వారసత్వం లభించి ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే రాజ్యాన్ని పోగొట్టుకుంటారో, దుఃఖితులుగా అవుతారో, అప్పుడు తండ్రిని స్మృతి చేస్తారు. భక్తి మార్గం ఉన్నదే భగవంతుడిని స్మృతి చేసే మార్గము. ఎన్ని రకాలుగా భక్తి, దాన-పుణ్యాలు, జప తపాదులు మొదలైనవి చేస్తారు. ఈ చదువు ద్వారా మీకు ఏ రాజ్యమైతే లభిస్తుందో, అది పూర్తి అవ్వడంతో మీరు మళ్ళీ భక్తులుగా అవుతారు. లక్ష్మీ-నారాయణులను భగవాన్-భగవతి అని అంటారు ఎందుకంటే భగవంతుడి నుండి రాజ్యాన్ని తీసుకున్నారు కదా! కానీ తండ్రి అంటారు, వారిని కూడా మీరు భగవాన్-భగవతి అని అనలేరు. వీరికి ఈ రాజధానిని తప్పకుండా స్వర్గ రచయితయే ఇచ్చి ఉంటారు కానీ ఎలా ఇచ్చారు – ఇది ఎవరికీ తెలియదు. మీరందరూ తండ్రికి అనగా భగవంతునికి పిల్లలు. ఇప్పుడు తండ్రి అందరికీ అయితే రాజ్యాన్ని ఇవ్వరు. డ్రామా ఈ విధంగా తయారై ఉంది. భారతవాసులే విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇప్పుడున్నది ప్రజలపై ప్రజా రాజ్యము. తమను తామే పతితులుగా, భ్రష్టాచారులుగా భావిస్తారు. ఈ పతిత ప్రపంచం నుండి అతీతంగా వెళ్ళేందుకు నావికుడిని గుర్తు చేస్తారు, ఏమనంటే, మీరు వచ్చి ఈ వేశ్యాలయం నుండి శివాలయంలోకి తీసుకువెళ్ళండి అని. ఒకటి నిరాకార శివాలయము, నిర్వాణధామము. రెండవది శివబాబా ఏ రాజధానినైతే స్థాపన చేస్తారో, దానిని కూడా శివాలయమని అంటారు. మొత్తం సృష్టియే శివాలయంగా అవుతుంది. కావున సత్యయుగంలో ఉన్నది సాకారీ శివాలయము, నిర్వాణధామంలో ఉన్నది నిరాకారీ శివాలయము. ఇది నోట్ చేసుకోండి. అర్థం చేయించేందుకు పిల్లలకు పాయింట్లు చాలా లభిస్తాయి, మళ్ళీ మంచి రీతిలో మథనం కూడా చేయాలి. ఎలాగైతే కాలేజ్ పిల్లలు బాల్యంలో ఉదయముదయమే లేచి అధ్యయనం చేస్తారు. ఉదయాన్నే ఎందుకు కూర్చుంటారు? ఎందుకంటే ఆత్మ విశ్రాంతి పొంది రిఫ్రెష్ అయిపోతుంది. ఏకాంతంలో కూర్చొని చదువుకోవడంతో ధారణ బాగా జరుగుతుంది. ఉదయాన్నే లేచే అభిరుచి ఉండాలి. కొందరంటారు, మా డ్యూటీ ఎటువంటిదంటే, ఉదయాన్నే వెళ్ళాల్సి ఉంటుంది అని. అచ్ఛా, సాయంత్రం కూర్చోండి. సాయంత్రం వేళ దేవతలు విహరిస్తారని కూడా అంటారు. క్వీన్ విక్టోరియా మంత్రి, రాత్రి వేళ బయట దీపం కింద కూర్చుని చదువుకునేవారు. వారు చాలా పేదవారు. చదువుకుని మంత్రిగా అయ్యారు. అంతా చదువుపైనే ఆధారపడి ఉంది. మిమ్మల్ని చదివించేవారైతే పరమపిత పరమాత్మ. మిమ్మల్ని ఈ బ్రహ్మా చదివించరు, శ్రీకృష్ణుడూ చదివించరు. నిరాకార జ్ఞానసాగరుడు చదివిస్తారు. వారికే రచన ఆది మధ్యాంతాల జ్ఞానం ఉంది. సత్య-త్రేతా యుగాలు ఆది, మళ్ళీ త్రేతా అంతిమంలో ద్వాపరం యొక్క ఆది ఉంటుంది, దానిని మధ్యమము అని అంటారు. ఈ విషయాలన్నీ బాబా అర్థం చేయిస్తారు. బ్రహ్మానే విష్ణువుగా అయి 84 జన్మలను అనుభవిస్తారు, మళ్ళీ బ్రహ్మాగా అవుతారు. బ్రహ్మా 84 జన్మలు తీసుకున్నారన్నా లేక లక్ష్మీ-నారాయణులు 84 జన్మలు తీసుకున్నారన్నా విషయం ఒక్కటే. ఈ సమయంలో మీరు బ్రాహ్మణ వంశావళి, తర్వాత మీరు విష్ణు వంశావళిగా అవుతారు. తర్వాత కిందకు పడిపోతూ-పడిపోతూ మీరు శూద్ర వంశావళిగా అవుతారు. ఈ విషయాలన్నింటినీ తండ్రే కూర్చుని అర్థం చేయిస్తారు. మనం అనంతమైన తండ్రి శ్రీమతంపై నడుచుకుంటూ విశ్వ మహారాజా-మహారాణిగా అయ్యేందుకు వచ్చామని మీకు తెలుసు. ప్రజలు కూడా విశ్వానికి యజమానులే. ఈ చదువులో చాలా చురుకుదనం కావాలి. ఎంతగా చదువుకుంటారో, చదివిస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. ఇది అనంతమైన చదువు, అందరూ చదువుకోవాలి. అందరూ ఒక్కరి నుండే చదువుకుంటారు. అయితే నంబరువారుగా కొందరు బాగా ధారణ చేస్తారు, కొందరికి కొద్దిగా కూడా ధారణ జరగదు. నంబరువారుగా అందరూ కావాలి. రాజుల వద్ద దాస-దాసీలు కూడా కావాలి. దాస-దాసీలైతే మహళ్ళలో ఉంటారు. ప్రజలైతే బయట ఉంటారు. అక్కడ మహళ్ళు చాలా పెద్ద-పెద్దవిగా ఉంటాయి. భూమి చాలా ఉంటుంది, మనుష్యులు కొద్దిమందే ఉంటారు. ధాన్యం కూడా చాలా ఉంటాయి. అన్ని కోరికలు పూర్తి అవుతాయి. ధనం కోసం ఎప్పుడూ దుఃఖితులుగా అవ్వరు. ప్యారడైజ్ అన్న పేరు ఎంత ఉన్నతమైనది. ఒక్కరి మతముపై నడవడంతో మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. అక్కడ సత్యయుగీ సూర్యవంశీ లక్ష్మీ-నారాయణుల రాజ్యము అని అంటారు, ఆ తర్వాత వారి పిల్లలు సింహాసనంపై కూర్చుంటారు. వారి మాల తయారవుతుంది. 8 మంది పాస్ విత్ ఆనర్స్ (గౌరవప్రదంగా ఉత్తీర్ణులు) అవుతారు. 9 రత్నాల ఉంగరాన్ని కూడా ధరిస్తారు. మధ్యలో బాబా, మిగిలినవారు 8 రత్నాలు, 9 రత్నాల ఉంగరాన్ని చాలామంది ధరిస్తారు. దీనిని దేవతల గుర్తుగా భావిస్తారు. ఆ 9 రత్నాలు ఎవరు అన్నదైతే అర్థం చేసుకోరు. మాల కూడా 9 రత్నాలది తయారవుతుంది. క్రిస్టియన్లు మణికట్టుపై మాలను ధరిస్తారు. 8 రత్నాలు మరియు పైన పుష్పం ఉంటుంది, ఇది ముక్తిని పొందేవారి మాల. ఇకపోతే, జీవన్ముక్తి లేక ప్రవృత్తి మార్గంవారి మాలలో పుష్పంతో పాటు జంట పూసలు కూడా తప్పకుండా ఉంటాయి. అర్థాన్ని కూడా అర్థం చేయించాలి కదా, బహుశా వారు పోప్ లది కూడా నంబరువారు మాలను తయారుచేస్తూ ఉండవచ్చు. ఈ మాల గురించైతే వారికి తెలియనే తెలియదు. శివబాబా మరియు శ్రమించే పిల్లలైన మీరు – వాస్తవానికి అందరూ తిప్పే మాల అయితే ఇదే. ఇప్పుడు ఒకవేళ మీరు కూర్చొని ఎవరికైనా, మాల ఎవరిది తయారై ఉంది అన్నది అర్థం చేయించినట్లయితే, వారు వెంటనే అర్థం చేసుకుంటారు. మీ ప్రొజెక్టర్ విదేశాల వరకు కూడా వెళ్తుంది మరియు అర్థం చేయించే జంట కూడా కావాలి. అప్పుడు, ఇది ప్రవృత్తి మార్గమని అర్థం చేసుకుంటారు. తండ్రి పరిచయాన్ని అందరికీ ఇవ్వాలి మరియు సృష్టి చక్రాన్ని కూడా తెలుసుకోవాలి, ఎవరికైతే చక్రం గురించి తెలియదో, వారినేమంటారు!

సత్యయుగంలో మీరు సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా ఉండేవారు… ఇప్పుడు మళ్ళీ అలా తయారవుతారు. మీరు ఈ చదువును చదువుకుని ఇంత ఉన్నతంగా అయ్యారు. రాధే-కృష్ణులు వేర్వేరు రాజధానులకు సంబంధించినవారు. స్వయంవరం తర్వాత లక్ష్మీ-నారాయణులు అన్న పేరు వచ్చింది. లక్ష్మీ-నారాయణులది బాల్యపు చిత్రమేదీ చూపించరు. సత్యయుగంలోనైతే ఎవరి పత్ని అకాల మృత్యువు చెందరు. అందరూ పూర్తి సమయం తర్వాతనే శరీరం విడిచిపెడతారు. ఏడ్వాల్సిన అవసరం ఉండదు. దాని పేరే ప్యారడైజ్. ఈ సమయంలో ఈ అమెరికా, రష్యా మొదలైనవి ఏవైతే ఉన్నాయో, వాటన్నింటిలో మాయ ఆడంబరం ఉంది. ఈ విమానాలు, కార్లు మొదలైనవన్నీ బాబా ఉన్నప్పుడే వెలువడ్డాయి. 100 సంవత్సరాలలో ఇవన్నీ వచ్చాయి. ఇది ఎండమావుల వంటి రాజ్యము, దీనిని మాయ ఆడంబరం అని అంటారు. సైన్స్ యొక్క ఈ చివరి సమయంలోని ఆడంబరము, అల్పకాలం కోసం ఉంటుంది. ఇవన్నీ సమాప్తమైపోతాయి. మళ్ళీ స్వర్గంలో పనికొస్తాయి. మాయ ఆడంబరంతో సంతోషాన్ని కూడా జరుపుకుంటారు మరియు వినాశనం కూడా జరుగుతుంది. ఇప్పుడు మీరు శ్రీమతం ద్వారా రాజ్యాన్ని తీసుకుంటున్నారు. ఆ రాజ్యాన్ని మన నుండి ఎవరూ లాక్కోలేరు. అక్కడ ఎటువంటి ఉపద్రవమూ సంభవించదు ఎందుకంటే అక్కడ మాయే ఉండదు. తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలూ, బాగా చదువుకోండి. కానీ బాబాకు ఇది కూడా తెలుసు, అందరూ కల్పక్రితం వలె చదువుకుంటారు అని. ఏ దృశ్యమైతే కల్పక్రితం జరిగిందో, అదే ఇప్పుడు నడుస్తుంది. నరకాన్ని స్వర్గంగా తయారుచేసే కళ్యాణకారీ పాత్ర కల్పక్రితం వలె నడుస్తూ ఉంది. ఇకపోతే, ఎవరైతే ఈ ధర్మానికి చెందినవారు కారో, వారికి ఈ జ్ఞానం బుద్ధిలో అసలు కూర్చోదు. తండ్రి టీచరు కనుక పిల్లలు కూడా టీచరుగా అవ్వాల్సి ఉంటుంది. ఇది చదివించడానికి విదేశాల వరకు పిల్లలు వెళ్ళారు. వారితో పాటు అనువాదం చేసేవారు కూడా తెలివైనవారై ఉండాలి. శ్రమైతే చేయాలి.

ఈశ్వరీయ పిల్లలైన మీ నడవడిక చాలా ఉన్నతంగా ఉండాలి. సత్యయుగంలో నడవడిక ఉన్నతంగా మరియు రాయల్ గా ఉంటుంది. ఇక్కడైతే మిమ్మల్ని మేక నుండి ఆడ సింహంగా, కోతి నుండి దేవతగా తయారుచేయడం జరుగుతుంది. కనుక ప్రతి విషయంలోనూ నిరహంకారీతనం కావాలి. తమ అహంకారాన్ని తెంచాలి. ‘‘నేను ఎలాంటి కర్మలను చేస్తానో, నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు’’ అన్నది గుర్తుంచుకోవాలి. తమ స్వహస్తాలతో పాత్రలను శుభ్రం చేసినట్లయితే, వీరు ఎంత నిరహంకారి అని అందరూ అంటారు. అంతా తమ చేతులతో తామే చేసుకున్నట్లయితే, ఇంకా ఎక్కువగా గౌరవం లభిస్తుంది. ఎక్కడైనా అహంకారం వస్తే హృదయం నుండి దిగిపోతారు. ఎప్పటివరకైతే ఉన్నతమైన అవస్థ తయారవ్వదో, అప్పటివరకు హృదయాన్ని అధిరోహించరు, మరి అటువంటప్పుడు సింహాసనంపై ఎలా కూర్చుంటారు! నంబరువారు పదవులైతే ఉంటాయి కదా! ఎవరి వద్దనైతే చాలా ధనం ఉందో, వారు ఫస్ట్ క్లాస్ మహళ్ళను తయారుచేసుకుంటారు. పేదవారు గుడిసెలు వేసుకుంటారు. అందుకే బాగా చదువుకొని ఫుల్ పాస్ అవ్వాలి, మంచి పదవిని పొందాలి. అంతేకానీ, డ్రామాలో ఏది ఉంటే అది లేక అదృష్టంలో ఏది ఉంటే అది అని కాదు. ఈ ఆలోచన రావడంతోనే ఫెయిల్ అయిపోతారు. అదృష్టాన్ని పెంచుకోవాలి. రాత్రింబవళ్ళు చాలా శ్రమించి చదువుకోవాలి. నిద్రను జయించేవారిగా అవ్వాలి. రాత్రి వేళ విచార సాగర మథనం చేయడంతో మీకు చాలా ఆనందం కలుగుతుంది. బాబా, మేము ఈ విధంగా విచార సాగర మథనం చేస్తున్నాము అని బాబాకు ఎవ్వరూ చెప్పరు. కావున ఎవ్వరూ లేవడం లేదని బాబా అర్థం చేసుకుంటారు. బహుశా విచార సాగర మథనం చేసే పాత్ర వీరికే ఉంది. నంబరువన్ బిడ్డ అయితే వీరే కదా! బాబా అనుభవం చెప్తారు, లేచి స్మృతిలో కూర్చోండి. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది – ఇలాంటి ఇలాంటివి ఆలోచించడం జరుగుతుంది. ఉన్నతోన్నతమైనవారు బాబా, తర్వాత సూక్ష్మవతనవాసులైన బ్రహ్మా, విష్ణు, శంకరులు. మరి బ్రహ్మా ఎవరు! విష్ణువు ఎవరు! ఈ విధంగా విచార సాగర మథనం చేయాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఏ కర్మనైతే నేను చేస్తానో, నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు, అందుకే ప్రతి కర్మపై అటెన్షన్ పెట్టాలి. చాలా-చాలా నిర్మానచిత్తులుగా, నిరహంకారులుగా అవ్వాలి. అహంకారాన్ని తెంచాలి.

2. తమ అదృష్టాన్ని ఉన్నతంగా తయారుచేసుకునేందుకు మంచి రీతిలో చదువును చదువుకోవాలి. ఉదయముదయమే లేచి తండ్రిని స్మృతి చేసే అభిరుచినుంచుకోవాలి.

వరదానము:-

ఏ పిల్లలైతే త్రికాలదర్శిగా ఉన్నారో, వారెప్పుడూ ఏ విషయంలోనూ తికమకపడజాలరు ఎందుకంటే వారి ఎదురుగా మూడు కాలాలు స్పష్టంగా ఉంటాయి. గమ్యం మరియు మార్గం స్పష్టంగా ఉన్నట్లయితే ఎవరూ తికమకపడరు. త్రికాలదర్శీ ఆత్మలు ఎప్పుడూ ఏ విషయంలోనూ ఆనందాన్ని తప్ప ఇంకే అనుభవము చేయరు. పరిస్థితులు తికమకపెట్టేవిగా ఉన్నా కానీ బ్రాహ్మణాత్మ వాటిని కూడా ఆనందంలోకి మార్చేస్తారు ఎందుకంటే లెక్కలేనన్ని సార్లు ఆ పాత్రను అభినయించారు. ఈ స్మృతి కర్మయోగిగా చేస్తుంది. వారు ప్రతి పనిని ఆనందంతో చేస్తారు

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top