24 June 2021 TELUGU Murli Today | Brahma Kumaris

24 june 2021 Read and Listen today’s Gyan Murli in Telugu 

23 June 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మాతేశ్వరి గారి పుణ్య స్మృతి దివసమున క్లాసులో వినిపించేందుకు జగదంబ సరస్వతి గారి మధుర మహావాక్యాలు”

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ప్రపంచంతో అన్ని సంబంధాలను వదిలేయండి…..

ఒకవేళ మనం ప్రపంచంతో ఉన్న సంబంధాలను వదిలేస్తే, ఇక ప్రపంచం దేని కోసం ఉన్నట్లు? ఒకవేళ సంబంధాలను తెంచుకునే విషయమైతే, మరి ఈ సంబంధాలను తయారుచేసుకుంది ఎందుకు? పతి-పత్ని, తండ్రి-కొడుకు, రాజా-ప్రజ మొదలైన అనేకానేక సంబంధాలేవైతే ఉన్నాయో, ఇవన్నీ భగవంతుడు రచించారని అంటారు కదా. మరి వీటిని భగవంతుడు రచించినప్పుడు వదిలేయమని ఎందుకు అంటారు! లేదా ఈ పాటే రాంగ్ అని అర్థము.

భగవంతుడు ఎటువంటి ప్రపంచాన్ని రచించారు? జగత్తు అనండి, ప్రపంచం అనండి, భగవంతుడు వదిలేయాల్సి వచ్చేటువంటి ప్రపంచాన్ని రచించరు. వారు ఇప్పుడున్న సంబంధాలను రచించలేదు. ఇప్పుడు ఈ ప్రపంచంలో మీ సంబంధాలు ఎలా అయిపోయాయి చూడండి! కర్మల కారణంగా తమోప్రధానతలోకి వస్తూ-వస్తూ ఎలా అయిపోయాయి! కర్మ బంధనాల కారణంగా ఒకరినొకరు బాధించుకుంటూ ఉంటారు. అన్ని సంబంధాలు, ఈ కర్మ లెక్కల వలన తమోప్రధానతలోకి వచ్చి, ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ మరియు తీసుకుంటూ ఉంటారు. భగవంతుడు స్వయంగా అంటారు – నేనైతే మీ ఈ దుఃఖపు సంబంధాలను తయారుచేయలేదు. నేను మీ సంబంధాన్ని ఏదైతే జోడించానో, అది బంధనము కాదు. నేను మీ శ్రేష్ఠ సంబంధాన్ని జోడింపజేసాను, ఆ సంబంధములో మీరు సదా సుఖమయంగా ఉండేవారు. మీ సంబంధాలన్నీ చాలా స్వచ్ఛంగా ఉండేవి. అందుకే, రాముని రాజ్యంలో ప్రజలు కూడా షావుకారులే, ఆ నగరంలో అందరూ దాతలు కావున ధర్మానికి సదా ఉపకారం జరుగుతుంది….. అని గుర్తు చేసుకుంటారు కదా. దానిని గృహస్థ ధర్మమని అనేవారు. ధర్మ పతి, ధర్మ పత్ని – ఇలా ధర్మం పేరు మీద ఉన్నాయి కదా. కానీ ఇప్పుడైతే అలాంటి ధర్మయుక్త సంబంధాలు లేవు. ఇప్పుడు ప్రాక్టికల్ గా అటువంటి జీవితం లేదు. అందుకే తండ్రి అంటారు – మీరు మీ ఈ ప్రపంచాన్ని ఏదైతే తయారుచేసుకున్నారో, ఈ ప్రపంచంలోని సంబంధాలు పాడైపోయాయి. నేను తయారుచేసిన ప్రపంచంలో మీ సంబంధాలు ఎంత బాగుండేవి, ఎంత ప్రియంగా ఉండేవి, ఎంతగా ఇతరులకు సుఖాన్నిచ్చేవి. సంబంధాలైతే తప్పకుండా ఉండేవి, భగవంతుడు సంబంధాలను రచించలేదని కాదు. సంబంధాలు ఉండేవి కానీ ఆ సంబంధాలు కర్మ బంధన రహితంగా ఉండేవి. అందుకే వారిని జీవన్ముక్తులని అనేవారు. జీవితంలో ఈ కర్మ బంధనాల (దుఃఖం) నుండి ముక్తులుగా ఉండేవారు, అందుకే వారిని జీవన్ముక్తులని అనేవారు. ఇప్పుడు మీ సంబంధాలు జీవనబంధనానికి సంబంధించినవిగా అయ్యాయి, అందుకే ఇప్పుడు వీటి నుండి ఎలా విడుదలవ్వాలని అంటారు. తండ్రి అంటారు – వారితో సంబంధాలను తెంచి ఒక్క నాతో జోడించండి. ఈ ఒక్క ఆఖరి జీవితాన్ని నాకు అర్పించండి. నాకు అర్పించడం అనగా – ఎలాగైతే స్త్రీ పతికి అర్పణవుతుంది, పతి స్త్రీకి అర్పణవుతాడు, తండ్రి కొడుకుకు అర్పణవుతాడు, కొడుకు తండ్రికి అర్పణవుతాడు…… ఈ అభ్యాసమైతే చాలా ఉంది కదా. నేను మీకు కొత్త విషయమేమీ చెప్పడం లేదు. ఎలా చేయాలి, ఏమి చేయాలి, మీరు ఈ ప్రశ్నలను కూడా అడగలేరు. మీరు మీ జీవితాలను ఒకరి కోసం ఒకరు ఇచ్చుకుంటూ వచ్చారు. మీరు మీ పిల్లల కోసం మీ జీవితాన్ని ఇవ్వలేదా? మీ తనువు, మనసు, ధనం ఏవైతే ఉన్నాయో, మీరు వారి కోసమే కేటాయించారు కదా. ఇదంతా మీదే అని అంటూ ఉంటారు కదా! మొత్తం జీవితమంతా వారి కోసమే వెచ్చిస్తారు. కనుక ఇదంతా నాకు అర్పించండి అని నేను మీకు కొత్త విషయమేమీ చెప్పడం లేదు. ఎలాగైతే ఇప్పటివరకు ఒకరికోసం ఒకరు చేసుకుంటూ వచ్చారో, అలాగే, ఇప్పుడు మీరు నా వారిగా అవ్వండి అని చెప్తున్నాను. నా వారిగా అయి, అంతా ట్రస్టీగా ఉంటూ సంభాళించండి. మీరు భక్తి మార్గంలో కూడా – భగవంతుడా, ఇదంతా మీదే, నేను మీ వాడిని….. అని అంటూ వచ్చారు కానీ నీదిగా చేయలేదు, కేవలం నీది అని మాట వరుసకు అన్నారు. నీది కూడా నాదే, నాది కూడా నాదే….. అందరూ ఇలాగే చేసేవారు కానీ ఇప్పుడు అలాంటి మోసమైతే నడవదు కదా! నీది కూడా నాదే, నాది కూడా నాదే, అలా కాదు. ఇప్పుడు ఈ నీది, నాది అంతా సమాప్తం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు, నేను మీ వాడిని కావున ఇందులో అన్నీ వచ్చేస్తాయి. కేవలం నేను మీ వాడిని, అంతే. ఇకపోతే, వారిది కూడా నాదే, నాది కూడా నాదే….. అని కాదు. ఇలా మోసం చేయడం వలన లాభమేముంటుంది! ఎందుకంటే మనల్ని మనమే మోసం చేసుకుంటాము, ఆ పరమాత్మనైతే ఎవరూ మోసం చేయలేరు. ఇంతకుముందు ఎలా-ఎలా మోసం చేసేవారిమి కానీ అలా మోసగిస్తూ-మోసగిస్తూ స్వయమే దుఃఖితులుగా, అశాంతిగా అయ్యారు ఎందుకంటే అక్కడ మోసపోతూ వచ్చింది మీరే, అందుకే అవన్నీ వదిలేయండి అని ఇప్పుడు తండ్రి అంటారు. దేహ సహితంగా అన్ని సంబంధాల నుండి బుద్ధిని తొలగించి ఇప్పుడు నాతో జోడించండి. అప్పుడిక నాది అనేది ఉండదు.

ఇప్పటివరకు నాది-నాది అని అంటూ దుఃఖితులు అవుతూ వచ్చారు. మళ్ళీ బుద్ధి అక్కడికి వెళ్ళిపోతే, ఏమి చేయను, ఎలా చేయను….. అని అంటారు. ఒకవేళ మీరు ఎవరికైనా వేలాడుతూ ఉంటే ఫలితం ఏమవుతుంది! ఈ మోహం ఉంది కదా, మీరు దీని కారణంగా దుఃఖితులుగా అయ్యారు, అందుకే తండ్రి అంటారు – మీరు ఈ ప్రపంచపు సంబంధాలను తెంచి ఇప్పుడు నా వారిగా అవ్వండి. మీరు మీ దేహ బంధనాలను, జీవన బంధనాలను ఏవైతే తయారుచేసుకున్నారో, వాటి నుండి బయటపడి ఇప్పుడు నా వారిగా అవ్వండి. తర్వాత నేనేమీ మీతో పాటు జన్మ-జన్మలకు రాను. ఇప్పుడే నాకు మీతో పని ఉంది, అంతే. తర్వాత ఆత్మలైన మీరు పరస్పరంలో సదాకాలికమైన సుఖంలో ఉంటారు. కనుక మీ దుఃఖపు బంధనాలను తెంచి, సుఖపు సంబంధాలను తయారుచేస్తాను, అప్పుడిక మీరే పరస్పరంలో సుఖాన్ని అనుభవిస్తారు. ఇప్పుడు చూడండి, మీరెంత పాడైపోయారు, అందుకే దుఃఖితులుగా అవుతారు. ఇప్పుడు పాడైపోయిన మీవన్నీ నేను సరిదిద్దుతాను, అప్పుడు మీరే సుఖంగా ఉంటారు. నేను జన్మ-జన్మలకు మీతోపాటు రాను. నేను కేవలం పాడైపోయిన మీదంతా సరిదిద్దేందుకు – ఇప్పుడు నా వారిగా అవ్వండి అని అంటాను. అది కూడా ఎందుకు అంటాను? ఎందుకంటే నా ఆజ్ఞపై నడవడంతో మీకు అంతా సహజమైపోతుంది. నేను మీకు ఈ సహజమైన యుక్తిని ఇస్తాను. మీరు ప్రాక్టికల్ గా నా వారిగా అయి నడుచుకోండి, అప్పుడు ఈ యుక్తి పని చేస్తుంది. ఎలాగైతే ఎవరైనా దత్తత తీసుకోబడిన బిడ్డ ఉంటే, ఆ బిడ్డకు ఆ పేరే ప్రాక్టికల్ గా నడుస్తుంది కదా, అలా మీరు కూడా ప్రాక్టికల్ గా నా వారిగా అయి నడుచుకున్నట్లయితే, మీ భాగ్యమే తయారవుతుంది. తండ్రి అయితే చాలా డైరెక్టు విషయాలను, సహజమైన విషయాలను మరియు చాలా సింపుల్ విషయాలను తెలియజేస్తారు కానీ చూడండి, వీటిని ధారణ చేసేవారు కోట్లలో కొందరే వెలువడుతారు.

తండ్రి అంటారు – ఈ చిన్న సంగమయుగంలో మీ దేశమైన ఈ సాకార ప్రపంచంలోకి మీ కోసమే వచ్చాను, కనుక తక్కువలో తక్కువ ఎంత సమయముంటే అంత సమయం నా గురించి కొంచెం ఆలోచించండి. బాబాకు చెందినవారిగా అయ్యారు కనుక తక్కువలో తక్కువ ఈ సమయమైనా శుద్ధంగా ఉండండి. ఇక తర్వాత మీకు ఎటువంటి ప్రారబ్ధం తయారవుతోందంటే, ఆ ప్రపంచంలో మీకు శ్రమించాల్సిన అవసరము ఉండదు. ఇప్పుడు కొద్దిగా శ్రమించాల్సి ఉంటుంది, ఇప్పుడు మీరు ఏదేమైనా సరే, మరణించాల్సి వచ్చినా సరే, పవిత్రంగా ఉండే ప్రతిజ్ఞ చేయండి. దృఢత్వాన్ని ఉంచుకోండి, మీ ధారణలలో ఉండేందుకు పూర్తి ప్రయత్నం చేయండి. మీరు కేవలం ఈ కొద్ది సమయం కోసమే ఈ శ్రమను చేయండి అని తండ్రి మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తారు. నేను మీతో ఇంకే శ్రమ చేయించను. మీకు లభించేదానితో పోలిస్తే, ఇది అసలు శ్రమే కాదు.

ఇది చేస్తాను, అది చేస్తాను, ప్రపంచం ఏమంటుంది, వారేమంటారు….. అని అంటూ ఇప్పుడు నేతి కుండలను తయారుచేయకండి (ఊహాజనిత కథలు). అరే, ప్రపంచం ఏమంటుంది….. అనేది అసలు వదిలేయండి. ఇప్పుడు ఈ ప్రపంచమే పోతుంది. కానీ పాపం వారికి ఈ విషయం తెలియదు, అందుకే దాని గురించి ఆలోచించకండి అని తండ్రి అంటారు. ఇప్పుడైతే మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. మీరు భవిష్యత్తు కోసమని చెప్పి ఎంతో దూరంగా ఆలోచిస్తున్నదంతా వ్యర్థము. వ్యర్థమవ్వకుండా రక్షించండి అని ఇప్పుడు తండ్రి అంటారు. ఈ శరీర నిర్వహణ కోసం ఎంత అవసరమో అంత చేసుకోండి. మీ రచనతో మీకు ఉన్న లెక్కాచారాల అనుసారంగా చేసుకోండి. నేనెక్కడ సంభాళిస్తాను, వారిని మీరే సంభాళించాలి. ఏదైతే అవసరమో, అది చేయడానికి నేను మిమ్మల్ని ఫ్రీ చేస్తాను కానీ ఇప్పుడు ఎక్స్ ట్రా గా ఏదైతే రచిస్తున్నారో దానికి వద్దని చెప్తాను ఎందుకంటే ఇప్పుడంతా దిగజారవలసిందే. అటువంటప్పుడు మీ సమయాన్ని ఎందుకు అనవసరంగా పోగొట్టుకుంటున్నారు. ఈ అనవసరమైన జంజాటాల కారణంగానే మీరు దుఃఖితులుగా అయ్యారు. ఈ జంజాటాల నుండి మీరు ఎలా విడుదల అవ్వాలి అనేదే మీకు చెప్తున్నాను. అయినా సరే, కూర్చుని అనేక సాకులు చెప్పడమంటే – ఇది ఎక్కడి పద్ధతి? అప్పుడిక తండ్రి కూడా అంటారు – చూడండి, ఒకవేళ ఇప్పుడు నేరుగా నాకు మీ వేలును ఇవ్వకపోతే, చేతిని ఇవ్వకపోతే, ఇక నేను ఇలా ముక్కు పట్టుకుని తీసుకువెళ్తాను. వారు ముక్కు పట్టుకుంటే ఇక ఊపిరాడదు, దుఃఖం కలుగుతుంది, శిక్షలు తినాల్సి ఉంటుంది కదా! అందుకే ఇప్పుడు నా చేతిలో చేయి వేసి, నేరుగా నడిచే సమయం వచ్చేసింది అని అంటారు. ఒకవేళ సరిగ్గా నడవకపోతే, మీ ముక్కు నా చేతికి వస్తుంది, అప్పుడు చూసుకోండి. అప్పుడిక ఆ సమయంలో ఏమీ సాధ్యం కాదు, ఏమీ చేయలేరు, అందుకే తండ్రి అంటారు – పిల్లలూ, ఇప్పుడు మీరు నా వారిగా అయి, నా వద్దకు వచ్చి, నా మాటలు విని, అయినా ఏమీ చేయలేదంటే, అటువంటి వారికి చాలా కఠినమైన శిక్షలుంటాయి. పాపం ఎవరికైతే తెలియదో వారి విషయం వేరు కానీ ఎవరికైతే తెలుసో, ఎవరైతే కూర్చుని, విని, మళ్ళీ ఈ విషయాలలోనే పొరపాట్లు చేస్తారో, వారికి మంచిది కాదు. ఎలాగైతే 10 రెట్లు లాభం లభిస్తుందో, అలాగే 10 రెట్లు నష్టం జరుగుతుంది. అందుకే అంటారు – మీకు కలిగిన నష్టం గురించి….. బాగా అర్థం చేసుకోండి అని. మీ బుద్ధిని బాగా తెరవండి. ఇప్పుడు తండ్రితో బుద్ధియోగాన్ని జోడించినట్లయితే శక్తి లభిస్తుంది. కనుక ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకోండి, మర్చిపోకండి.

ఇప్పుడు నడుస్తున్న ఈ సమయాన్ని గుర్తించండి, కొద్దిగా కళ్ళు తెరవండి, బుద్ధిని తెరవండి మరియు సమయం యొక్క పూర్తి లాభం తీసుకోండి. మీ మొత్తం భాగ్యాన్ని మేలుకొలపండి. ఎలాంటి సాంగత్యమో అలాంటి రంగు అంటుకుంటుందని అంటారు. అందుకే, ఇప్పుడు ఎవరిలోనైతే ఈ ధారణ పూర్తిగా ఉండదో, వారికి మాయ యొక్క సాంగత్యపు రంగు అంటుకుంటుంది. అందుకే చెడు వినకండి, చెడు చూడకండి, చెడు మాట్లాడకండి….. అని అంటారు. చాలా ఈవిల్ సోల్స్ ఎలా ఉన్నాయంటే, అవి ఇక్కడ కూడా చాలామందిని విడిచిపెట్టవు, అప్పుడిక ఇతరుల సాంగత్య దోషంలోకి వచ్చేస్తారు. అందుకే, ఇటువంటి సాంగత్య దోషం నుండి రక్షించబడి ఉండండి అని అంటారు. సాంగత్య దోషం బయట ఉంది, ఇక్కడ లేదు అని అనుకోకండి. ఇక్కడ కూడా అవి తిరుగుతూ ఉంటాయి, ఎందుకంటే వాటి రాజ్యం కదా, అందుకే కవచాన్ని బాగా ధరించి ఉండండి అని తండ్రి అంటారు. కవచం ఉన్నట్లయితే వాటి బుల్లెట్ తగలదు. యోగమనే కవచం, జ్ఞానమనే ఖడ్గం ఉన్నాయి. అన్ని అస్త్ర శస్త్రాలను మీ వద్ద చాలా జాగ్రత్తగా పెట్టుకోండి.

ఎవరైతే చేస్తారో వారు పొందుతారని అంటారు కూడా. ఇవి భవిష్య ప్రారబ్ధాన్ని తయారుచేసుకునే విషయాలు. ఇక్కడైతే ప్రారబ్ధాన్ని అనుభవించకూడదు కదా, ఇక్కడ ఎవరూ గురువులుగా అయి కూర్చోకూడదు. ఇందులో ఎవరూ అపార్థం చేసుకోకూడదు, అందుకే ఈ విషయాలన్నీ అర్థం చేయించడం జరుగుతుంది. కనుక ఈ విషయాలన్నింటి పట్ల అటెన్షన్ పెడుతూ స్వయాన్ని సురక్షితంగా ఉంచుకోవాలి. ఇక్కడ ఖర్చు మొదలైనవాటి గురించి ఏమీ చర్చించకూడదు. ఇప్పుడు ఈ ఖర్చులన్నింటినీ ఇతరుల కళ్యాణార్థమే ఉపయోగించాలి. ఒక్కొక్క పైసాను అందరూ ఈ కార్యంలోనే ఉపయోగించాలి. అచ్ఛా.

రెండవ మురళి –

‘‘ఎక్కే కళలో వెళ్ళాలంటే మీ జీవితం యొక్క పూర్తి బాధ్యతను వారి చేతికి సమర్పించండి’’

చాలామంది మనుష్యులు ఇటువంటి ప్రశ్నలు అడుగుతారు – ఇంత జ్ఞానం వింటున్నా కూడా మా అవస్థ ముందుకు ఎందుకు వెళ్ళడం లేదు? ముందుకు వెళ్ళడంలో ఆటంకాలు ఎందుకు? ఇప్పుడు వారి కోసం ఈ వివరణ ఇవ్వడం జరుగుతుంది – ఎవరైతే ఈ మార్గంలో నడవాలని అడుగు పెట్టారో, ఎప్పటివరకైతే తమ జీవితాన్ని మనసు-వాణి-కర్మల సహితంగా సరెండర్ చేసి బాబాకు చెందినవారిగా అవ్వరో, అప్పటివరకు అతీంద్రియ సుఖం అనుభవమవ్వదు. ఇది ఒక ఈశ్వరీయ లా, వారి ఆధారాన్ని తీసుకున్నప్పుడు, వారి ఎదురుగా జీవితాన్ని హృదయపూర్వకంగా అర్పణ చేయాలి అనగా పూర్తి వారసులుగా అయి వారసత్వాన్ని తీసుకోవాలి. కనుక ఈ నషాలో ఉండడంతో ఆ అవస్థలో ఉత్సాహం నిండుతుంది మరియు జ్ఞాన ధారణ జరగడంతో ఇతరులను తమ సమానంగా తయారుచేసే శక్తి వస్తుంది. అంతేకానీ మానసికంగా మేము అర్పణ అయిపోయామని భావించకండి, ఇది స్వయాన్ని మోసగించుకోవడం వంటిది. బాబా ప్రాక్టికల్ గా వచ్చినప్పుడు వారి బిడ్డగా కూడా ప్రాక్టికల్ గా అవ్వండి, అప్పుడు బాబా వారి జన్మపత్రిని తెలుసుకొని ఎలాంటి డైరెక్షన్లు అయినా ఇచ్చి నడిపిస్తారు. ఇందులో ముందు ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ ఇందులోనే మా ఎక్కే కళ ఉందని చివరికి అర్థం చేసుకుంటారు. కనుక మీ జీవితం యొక్క పూర్తి బాధ్యతను వారి చేతికి సమర్పించండి. అంతేకానీ గురువు తర్వాత గురువుగా అయి వారి గద్దెపై కూర్చోవడం కాదు. ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ బుద్ధిలో ఉంచుకున్నప్పుడే అవస్థ ఉన్నతిలోకి వెళ్ళగలదు. ఒకవేళ ఉన్నతిలోకి వెళ్ళడం లేదంటే తప్పకుండా మీ మనసులో లేక ధారణలో ఏదో తేడా ఉంది. అర్థమయిందా. అచ్ఛా. మధురాతి మధురమైన పిల్లలకు ప్రియస్మృతులు, గుడ్ మార్నింగ్.

వరదానము:-

ఎలాగైతే నక్షత్రాల సంగఠనలో విశేషమైన నక్షత్రాల ప్రకాశం దూరం నుండే అతీతంగా, ప్రియంగా అనిపిస్తుందో, అలా నక్షత్రాలైన మీరు, సాధారణ ఆత్మల మధ్యన ఒక విశేష ఆత్మగా కనిపించాలి. సాధారణ రూపంలో ఉంటూ అసాధారణమైన మరియు అలౌకిక స్థితి ఉన్నట్లయితే సంగఠన మధ్యలో అల్లాకు చెందినవారిగా కనిపిస్తారు. దీని కోసం అంతర్ముఖులుగా అయి తర్వాత బాహ్యముఖతలోకి వచ్చే అభ్యాసముండాలి. సదా తమ శ్రేష్ఠ స్వరూపంలో మరియు నషాలో స్థితులై నాలెడ్జ్ ఫుల్ గా ఉండడంతో పాటు పవర్ ఫుల్ గా అయి నాలెడ్జ్ ను ఇవ్వండి. అప్పుడు అనేకాత్మలను అనుభవజ్ఞులుగా చేయగలరు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top