24 August 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

23 August 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - ఎప్పటివరకైతే జీవించి ఉంటారో, అప్పటివరకు పవిత్రతా వ్రతాన్ని పక్కాగా ఉంచుకోవాలి ఎందుకంటే ఇది అంతిమ జన్మ, పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచములోకి వెళ్ళాలి’’

ప్రశ్న: -

బాబా ప్రేమ లేక అధికారము ఏ పిల్లల పై ఉంటుంది?

జవాబు:-

ఎవరైతే మంచి రీతిలో చదువుకుంటారో మరియు చదివిస్తారో, ఋజువునిస్తారో వారి పై తండ్రికి అందరికన్నా ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఎవరైతే మంచి రీతిలో చదువుకునేవారిగా ఉంటారో, వారే మాలలో కూర్చబడతారు.

ప్రశ్న: -

భవిష్య దేవ పదవిని ప్రాప్తి చేసుకునేందుకు స్వయాన్ని దేనిలో చెక్ చేసుకోవాలి?

జవాబు:-

దైవీ గుణాలను ధారణ చేయడంలో ఏయే విఘ్నాలు వస్తున్నాయి అని చెక్ చేసుకోండి, ఆ విఘ్నాలను యుక్తితో తొలగించుకోవాలి. నేను ఎంతవరకు పావనంగా అయ్యాను! ఏ ముల్లు ఆటంకమైతే కలుగజేయడం లేదు కదా అని స్వయాన్ని చూసుకోవాలి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఆకాశ సింహాసనాన్ని వదలి రండి… (చోడ్ భీ దే ఆకాశ సింహాసన్…)

ఓంశాంతి. భక్తులు భగవంతుడిని అనగా తండ్రిని పిలుస్తారు, ఎందుకు పిలుస్తారు? ఎందుకంటే దుఃఖితులుగా ఉన్నారు. దుఃఖము తర్వాత సుఖము రానున్నది అని కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఒకప్పుడు సుఖముండేది, ఇప్పుడు లేదు, మీరు వచ్చి సహజ రాజయోగాన్ని నేర్పించండి అని మళ్ళీ పిలుస్తారు. నేర్పించే తండ్రి తప్పకుండా కావాలి. తండ్రి అర్థం చేయిస్తారు, ఎలాగైతే ఆత్మలైన మీరు గర్భములోకి వచ్చి శరీరాన్ని తీసుకుంటారో, అలా నేను తీసుకోను. నేనైతే పతితులను పావనంగా చేయాలి, అందుకే నాకు పెద్ద శరీరము కావాలి. నేను పావనంగా తయారు చేసేందుకే వస్తాను. మాయా రావణుడు మిమ్మల్ని పతితులుగా తయారుచేసాడు, అందుకే ఇప్పుడు ఈ 5 వికారాలను దానముగా ఇచ్చినట్లయితే గ్రహణము తొలగిపోతుంది. ముఖ్యమైనది మొదటిది – దేహాభిమానము. స్వయాన్ని ఇప్పుడు దేహీ అభిమానిగా భావించండి. నేను ఈ దేహంలో ఉండే ఆత్మలతో మాట్లాడుతాను, వారికి జ్ఞానాన్ని ఇస్తాను. 5 వేల సంవత్సరాల క్రితము కూడా ఈ జ్ఞానాన్ని వినిపించాను. రాజయోగము నేర్పించాను. కల్ప-కల్పము నేర్పిస్తాను. నేను రావడంతోనే పతితులను పావనంగా చేసే వ్యాపారం చేపడతాను. వచ్చి పిల్లలను పావనంగా చేయడము తండ్రి యొక్క పాత్ర. మీకు తెలుసు, మనమే దేవతలుగా పావనంగా ఉండేవారము, మళ్ళీ పావనంగా అవ్వాలి, దైవీ గుణాలను ధారణ చేయాలి. భవిష్యత్తులో మీరు సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా రాకుమారీ, రాకుమారులుగా అయ్యేవారు. భవిష్యత్తులో రాకుమారీ-రాకుమారులుగా అయ్యేందుకే ఈ నాలెడ్జ్ ఉంది. కనుక ఎప్పుడైతే దైవీ గుణాలు ధారణ చేస్తారో అప్పుడే రాకుమారీ-రాకుమారులుగా అవుతారు. స్వయాన్ని చూసుకోవాలి, నేను ధారణ చేస్తున్నానా? ఏయే విఘ్నాలు వస్తున్నాయి? యుక్తితో ఆ విఘ్నాలను తొలగించుకోవాలి. తండ్రి స్మృతితోనే కర్మాతీత అవస్థను పొందనున్నారు. ఏవైతే ముళ్ళు వస్తాయో, వాటిని తొలగించుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలి. దేహాభిమానాన్ని విడిచి దేహీ అభిమానిగా అయి తండ్రిని స్మృతి చేయాలి. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా మార్గము స్పష్టమవుతూ ఉంటుంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా అవ్వాలి. వికారాల్లోకి ఎప్పుడూ వెళ్ళకూడదు. వికారాలకు సంబంధించినదే ముఖ్యమైన విషయము. వికారాల్లోకి వెళ్ళడము ఆపివేయాలి. ఎన్ని విఘ్నాలు వచ్చినా కానీ పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. విఘ్నాలు ఎక్కువగా స్త్రీలకే వస్తాయి. నేను పవిత్రంగా ఉండాలి అని ఆమె కోరుకుంటుంది. కృష్ణపురిలోకి వెళ్ళాలనుకుంటుంది. శ్రీకృష్ణ జయంతి రోజు చాలా ప్రేమతో శ్రీకృష్ణుడిని ఊయలలో ఊపుతారు. పూజలు చేస్తారు, వ్రతాలు మొదలైనవి చేపడతారు. అదైతే కేవలం 7 రోజుల వ్రతము, నోము. తండ్రి అంటారు, ఇప్పుడు మీరు, వికారాల్లోకి ఎప్పుడూ వెళ్ళము అన్న ఈ వ్రతాన్ని పెట్టుకోండి. ఎప్పటివరకైతే జీవించి ఉంటారో అప్పటివరకు పవిత్రతా వ్రతాన్ని చేపట్టాలి.

ఈ పాత ప్రపంచంలో ఇప్పుడు ఇది మన అంతిమ జన్మ అని మీకు తెలుసు. కేవలం మనది మాత్రమే కాదు ప్రపంచమంతటిదీ అంతిమ జన్మ. ఇప్పుడు మనము పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచంలోకి వెళ్తామని మీరు అర్థం చేసుకుంటారు. మన మరుసటి జన్మ పవిత్ర ప్రపంచంలో ఉంటుంది. ఆ హఠయోగీ సన్యాసులు ఇది మా అంతిమ జన్మ అని ఈ ఆలోచనతో ఏమీ పవిత్రంగా అవ్వరు. ఇక్కడైతే శ్రమ ఉంది. కలిసి ఉంటూ కూడా ఎప్పుడూ వికారాలలోకి వెళ్ళకూడదు. ఇరువురూ వ్రతము చేపట్టాలి. అబలలపై ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి. వారే పిలుస్తారు. పురుషులెప్పుడూ ప్రభూ, గౌరవాన్ని నిలబెట్టండి అని పిలవరు. వివస్త్రగా అవ్వకుండా రక్షించండి, ఇది మాతల పిలుపు. మాతలు తండ్రిని, ఓ బాబా, నన్ను వివస్త్రగా అవ్వకుండా రక్షించండి అని పిలుస్తారు. ఇవి అవే గీత, భాగవతంలోని విషయాలు, కేవలం పొరపాటున కృష్ణుని పేరు వేసారు. శ్రీకృష్ణుడైతే పతితపావనుడు కాదు. పతితపావనుడైతే ఒక్క తండ్రి మాత్రమే. పవిత్రంగా అయ్యేందుకు దెబ్బలు కూడా తినవలసి ఉంటుంది అని మీరు అర్థం చేసుకున్నారు. కల్పక్రితము కూడా ఇలాగే జరిగింది, ఇప్పుడు మళ్ళీ జరుగుతోంది. ద్రౌపది ఒక్కరు మాత్రమే కాదు, మీరు ఎంతమంది ద్రౌపదులు. అనేకమంది పతితులను పావనంగా తయారుచేయాలి. పవిత్రముగా అయ్యి, పవిత్రంగా చేసేందుకు మాతలైన మీరు నిమిత్తంగా అయ్యారు. మీరైతే చదువుపై ఇంకా ఎక్కువగా అటెన్షన్ పెట్టాలి. తమ తోటివారిని కూడా మేలుకొల్పాలి. సన్యాసులది నివృత్తి మార్గము. ఇది ప్రవృత్తి మార్గము. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి, చదువుకోవాలి మరియు చదివించాలి, దీని వలన ఉన్నతమైన పదవి లభిస్తుంది. చదువు చాలా సహజమైనది. ఇది అర్థం చేయించాలి – భారత్ ఏదైతే వజ్రతుల్యంగా ఉండేదో, లక్ష్మీ-నారాయణుల రాజ్యంగా ఉండేదో, ఇప్పుడు ఇంతగా ఎందుకు పడిపోయింది. మేము మీకు అనంతమైన చరిత్ర-భౌగోళిక విషయాలను తెలియజేస్తాము. మళ్ళీ స్వర్గం ఎలా ఏర్పడుతుంది, మనుష్యులకైతే ఇది ఆలోచనలో కూడా లేదు. లక్ష్మీ-నారాయణులు ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో, వారే పూజారులుగా అయ్యారని ఎవ్వరికీ తెలియదు. మీరే పూజ్యులు… ఇది పరమాత్మ కోసం కాదు. ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో వారే పూజారులుగా, తమోప్రధానంగా అయ్యారని ఎవ్వరికీ తెలియదు. పూజ్యులుగా ఉండేవారు, తప్పకుండా పునర్జన్మలు తీసుకుని ఉంటారు.

తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు, సత్యయుగంలోకి ఎవరైతే వస్తారో, వారు పునర్జన్మ తోసుకోవాల్సిందే. మనము సూర్య వంశీయులుగా, మళ్ళీ చంద్ర వంశీయులుగా అయ్యాము, ఇప్పుడు బ్రాహ్మణ వంశీయులుగా అవుతాము, ఆ తర్వాత దేవతా వంశీయులుగా అవుతాము. ఎలాగైతే వీరిని తండ్రి దత్తత తీసుకుని బ్రహ్మాగా తయారుచేసారు. మీరు ఎలా తయారయ్యారు అని ఎవరైనా అడిగితే చెప్పండి, బ్రహ్మా నోటి ద్వారా పరమపిత పరమాత్మ మమ్మల్ని తమవారిగా చేసుకున్నారు. తండ్రే పతితులను పావనంగా తయారుచేస్తారు. ఇప్పుడు మనం పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేస్తాము. తండ్రి స్మృతి చేయడం ద్వారానే మనం పావనంగా అవుతాము. తండ్రి కృప చూపిస్తారా? కృపనైతే చూపించారు కదా. పరంధామము నుండి పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి వచ్చారు. తండ్రి అంటారు, ఇప్పుడు నేను వచ్చాను, ఏదైతే నేర్పిస్తానో అది నేర్చుకోండి, నన్ను స్మృతి చేసినట్లయితే మీకు శక్తి లభిస్తుంది, వికర్మలు వినాశనమవుతాయి, ఇందులో ఆశీర్వాదాల విషయమే లేదు. మీరు కృప చూపించినట్లయితే మేము 100 మార్కులతో పాసైపోతాము అని టీచర్ తో చెప్తారా ఏమిటి! వీరు కూడా అనంతమైన టీచరు – చదివిస్తారు. కొందరికి నాలెడ్జ్ ధారణ అవ్వకపోతే ఏం చేస్తారు! టీచరు అందరిపై కృప చూపించినట్లయితే అందరూ పాసైపోతారు, అప్పుడిక రాజధాని ఎలా తయారవుతుంది. పిల్లలైన మీరైతే పురుషార్థము చేయాలి. తల్లిదండ్రులను ఫాలో చేయండి. తండ్రిని స్మృతి చేయండి, ఇంకే ఉపాయం లేదు. లేదంటే తండ్రిని ఎందుకు పిలుస్తారు. సాధు-సన్యాసులు మొదలైన వారందరూ అంటారు, వచ్చి మమ్మల్ని దుఃఖాల నుండి విడిపించండి. భారీ సంకటాలు రానున్నవి, ఎప్పుడైతే వినాశనం మొదలవుతుందో అప్పుడు మళ్ళీ భగవంతుడు తప్పకుండా ఎక్కడో గుప్త వేషంలో ఉన్నారని అర్థం చేసుకుంటారు. శ్రీకృష్ణుడు ఒకవేళ ఉండి ఉంటే ప్రపంచమంతటా దండోరా మ్రోగుతుంది. శ్రీకృష్ణుడైతే అలా రాలేరు. తండ్రియే రావలసి ఉంటుంది. అంతిమము వరకు తండ్రి జ్ఞానాన్ని వినిపించాలి. రావడము కూడా గుప్త రూపంలో వస్తారు. శ్రీకృష్ణుడైతే అలా రాలేరు. నిరాకార తండ్రి అందరికీ ఒక్కరే. వారు పతితులను పావనంగా చేసి వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు. అందరికీ తెలియజేయడము మీ కర్తవ్యం కూడా. పరమపిత పరమాత్మతో మీకు ఏం సంబంధము ఉంది అని అడగాలి. తండ్రికి ఎంతమంది పిల్లలున్నారు! పరమపిత పరమాత్మ యొక్క డైరెక్షన్ ఏమిటంటే – ఒకటేమో, నన్ను స్మృతి చేయండి మరియు మంచి రీతిలో చదువుకోండి. బాబాను మంచి రీతిలో స్మృతి చేసి ఉన్నతమైన వారసత్వాన్ని పొందాలి. అనంతమైన చరిత్ర-భౌగోళికాలను మీకు అర్థం చేయిస్తూ ఉంటారు. చిత్రాలపై కూడా మీరు అర్థము చేయించవచ్చు. భారత్ సత్యయుగంలో కిరీటధారిగా ఉండేది. సూర్యవంశీ దేవీ-దేవతలు రాజ్యం చేసేవారు, ఆ తర్వాత చంద్రవంశీ రాజ్యం వచ్చింది, కళలు తగ్గుతూ వచ్చాయి. ఇది కూడా చూడవలసి ఉంటుంది కదా. మంచి రీతిలో చదువుకున్నట్లయితే నేర్చుకుంటారు కూడా. చదవకపోతే ఫెయిల్ అవుతారు. ఎవరు అప్రమత్తము చేస్తారు. ఈ రోజుల్లో మాయ చాలానే నిర్లక్ష్యులుగా చేస్తుంది. ఇక్కడ అసత్యము దాగి ఉండజాలదు. ఏవైనా వికర్మలు చేసినట్లయితే అవి జమా అవుతూ ఉంటాయి. పాపము లేక పుణ్యము జమా అయితే తప్పకుండా అవుతుంది. దాని అనుసారంగానే మరుసటి జన్మ లభిస్తుంది. ఏదైనా పాపము చేసినట్లయితే జన్మ కూడా అటువంటిదే లభిస్తుంది, అందుకే తండ్రి అంటారు, ఏదైనా పాపము చేస్తే వెంటనే చెప్పండి. ఈశ్వరుడికైతే అంతా తెలుసు అని కాదు. తండ్రికి చెప్పాల్సి ఉంటుంది. ఈ జన్మలో ఏవైతే పాప కర్మలు చేస్తారో, అవి ఆత్మకు తెలుసు. నేను ఏయే పనులు చేసాను అన్నది అన్నీ గుర్తుంటాయి. నేను ఏమేమి చేసాను అని బాప్ దాదాకు చెప్పండి. వికారాలకు సంబంధించినదే ముఖ్యమైన విషయము. దొంగతనము చేయడం, మోసము చేయడం, ఇవైతే చిన్న-చిన్న విషయాలు. ముఖ్యమైనది వికారాలకు సంబంధించిన విషయం, కామము మహాశత్రువు. వికారాల్లోకి వెళ్ళేవారినే పతితులు అని అంటారు. ఈ వికారాలపై మొదట విజయం పొందాలి. రావణుడే మీ శత్రువు, వారే పతితులుగా చేస్తాడు. ఇప్పుడు పావనంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయండి. తండ్రికి చెందినవారిగా అయి మళ్ళీ వికారాల్లో పడితే దెబ్బ బాగానే తగులుతుంది. మొదట అయితే దేహాభిమానాన్ని విడిచిపెట్టాలి, తర్వాత కామము మహాశత్రువు. మొత్తం యుద్ధమంతా దీని పైనే జరుగుతుంది. కనుక ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకుని తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి. బాబా అడుగుతారు, మీరు ఎంతమందికి సత్యమైన గీత లేక సత్యమైన సత్యనారాయణ కథను, అమరకథను వినిపించారు! పాపాత్ములైతే లెక్కలేనంతమంది ఉన్నారు. కనుక ఈ లెక్క-పత్రాన్ని కూడా చెప్పండి, అప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారని అర్థమవుతుంది. ఎంతమందిని తమ సమానంగా తయారుచేసారు! ఇవి సహజ రాజయోగానికి సంబంధించిన విషయాలు. తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ప్రపంచంలో ఇదైతే ఎవ్వరికీ తెలియదు. తండ్రి వద్దకు చాలామంది సర్టిఫికెట్లు కూడా వస్తాయి. ఫలానావారు ఈ విధంగా అర్థం చేయించారు, స్వర్గానికి యజమానిగా తయారుచేయడానికి ఆ గురువే నిమిత్తముగా అయ్యారు అని రాస్తారు. బి.కె.లు ఋజువు చూపిస్తారు. కానీ ఎవరైతే తయారవుతారో, వారు ఎవరికైనా అర్థం చేయిస్తున్నారా? ఎవరినైనా తీసుకుని వస్తున్నారా? తీసుకుని రావాలి కదా! ఎవరికైతే నిశ్చయం ఏర్పడుతుందో, వారు వెంటనే అంటారు, మొదట తండ్రి ఒడినైతే తీసుకోవాలి. క్రిస్టియన్లలో కొడుకు జన్మిస్తే క్రిస్టియనైజ్ చేయిస్తారు. మనము కూడా ఈశ్వరుని దత్త పుత్రునిగా అవ్వాలి. సద్గురువు ఒడినైతే తీసుకోవాలి. ఒడి తీసుకున్నాము, తండ్రిని కలుసుకున్నాము, ఇక అది మన వారసత్వమైపోయినట్లు. ఈ విధంగా ఆనందంలో ఉండేవారు ఎవరో కష్టము మీద వెలువడుతారు. అర్థం చేయించాలి కదా. మున్ముందు మంచి రీతిలో అర్థం చేసుకుంటారు. మీలో ఈ శక్తి నిండుతుంది. ఆ తర్వాత తండ్రిని కలవకుండా ఉండలేరు. ఒక్కసారిగా పరుగెత్తుకుని వస్తారు. వీరు తల్లి-తండ్రి కూడా, టీచరు కూడా, మళ్ళీ గురువు కూడా. తల్లిదండ్రుల ఒడినైతే తీసుకోండి. గురువుల వద్దకు వెళ్తారు కానీ వారైతే స్వర్గంలో రాజ్యాధికారాన్ని ఏమీ ఇవ్వరు. రాజ్యాధికారము తండ్రి నుండి మాత్రమే లభిస్తుంది. తండ్రే టీచరు, గురువు కూడా, మరి ముగ్గురి నుండి వారసత్వం ఎందుకు తీసుకోకూడదు. ఇది ఆశ్చర్యం కదా! వారు తండ్రి, టీచరు, గురువు అని శ్రీకృష్ణుడి కోసం ఏమైనా అంటారా. వారు చిన్న రాకుమారుడు. ఇక్కడ పిల్లలైన మీ బుద్ధిలో ఉంది, వారు తండ్రి కూడా, శిక్షకుడు కూడా మరియు గురువు కూడా. వీరికి తండ్రి, శిక్షకుడు, గురువు ఎవ్వరూ లేరు. శ్రీకృష్ణునికైతే తల్లిదండ్రులు ఉండేవారు కదా. పతిత-పావనుడు తండ్రి ఒక్కరే, ఎవరికైతే తల్లిదండ్రులు ఉంటారో, వారు పతిత పావనులు కాలేరు. వారిని భగవంతుడు అని అనలేరు. భగవంతునికి తల్లిదండ్రులెవ్వరూ లేరు. గాడ్ ఫాదర్ కు ఫాదర్ ఎవ్వరూ ఉండజాలరు. గాడ్ ఫాదర్ నే పతితపావనుడు, లిబరేటర్ అని అంటారు. వారిని లిబరేట్ చేసేవారు ఎవ్వరూ లేరు. ఇది తండ్రి పని మాత్రమే. మనుష్యులను భగవంతుడు అని అనలేరు. బ్రహ్మా, విష్ణు, శంకరులను కూడా రచించేవారు రచయిత అయిన ఆ తండ్రి. భగవంతుడు ఉన్నతోన్నతమైనవారు అని అంటూ ఉంటారు. వారు మనందరికీ తండ్రి. శ్రీకృష్ణుడిని అందరికీ తండ్రి అని ఏమైనా అంటారా. మనమందరము ఒక్క నిరాకార తండ్రి పిల్లలము. వారే కొత్త ప్రపంచం యొక్క రచయిత. కొత్త ప్రపంచాన్ని సుఖధామమని అంటారు. మళ్ళీ కొత్తదాని నుండి పాత ప్రపంచంగా అవుతుంది. ఇది రావణ రాజ్యము కదా. రావణుడిని కాలుస్తారు కూడా, కానీ ఏమీ అర్థం చేసుకోరు. పండుగలు ఏవైతే జరుపుకుంటారో, వాటి అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. తండ్రి అర్థం చేయిస్తారు, ఇది మీ అనేక జన్మల అంతిమములో అంతిమ జన్మ. రావణుడిది కూడా ఇప్పుడు అంతిమము, మళ్ళీ సత్యయుగంలో ఏమైనా తయారుచేస్తారా. ఈ రావణుడు ఎటువంటివాడు, అతడిని కాలుస్తూనే ఉంటారు. ఇతడి జన్మ ఎప్పుడు జరిగింది అన్నది ఎవ్వరికీ తెలియదు. శివ జయంతిని జరుపుకుంటారు, మరి రావణ జయంతిని కూడా జరుపుకోవాలి కదా! ఏమీ అర్థము చేసుకోరు. మీకు అర్థం చేయించడము జరుగుతుంది – ఇవి వివరంగా తెలిపే విషయాలు. ఇది కూడా బుద్ధిలో ధారణ చేయవలసి ఉంటుంది. క్లాసుకే రాకపోతే ఏం చదువుకుంటారు. చదువుకోలేదు, చదివించలేదు అంటే ఏ పదవి పొందుతారు. ఎవరైతే చదువుకుని చదివిస్తారో వారే పిల్లలు. ఋజువునివ్వాలి. అందరూ పిల్లలే. మేము చాలా సేవ చేస్తే, చాలామందిని తమ సమానంగా తయారుచేస్తే బాబాకు బాగా ప్రేమ ఉంటుంది అని భావించాలి. తండ్రి అయితే ప్రేమ అందిస్తూ ఉంటారు. పిల్లలూ, బాగా చదువుకోండి. చిలుకలలో కూడా మాట్లాడే చిలుక ఒకటి ఉంటుంది, దాని మెడ చుట్టూ ఒక మాల వలె ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే, ఎవరైతే మంచి రీతిలో చదువుకుంటారో, వారే మాలలో కూర్చబడతారు. అసలు చదవకపోతే వారు అడవి మనుష్యుల వంటివారు. వారు విజయమాలలోకి రాలేరు. పిల్లలైన మీరైతే మంచి రీతిలో చదవాలి మరియు చదివించాలి. ఇది సత్యమైన కథ, దీనిని సత్యమైన తండ్రే వినిపిస్తారు. సత్య ఖండాన్ని స్థాపన చేస్తారు. లక్ష్మీ-నారాయణుల రాజ్యంలో అసత్యము ఎప్పుడూ చెప్పరు.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలి. ఎప్పటివరకైతే జీవించి ఉంటారో అప్పటివరకు పవిత్రతా వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి.

2. కృప అడిగేందుకు బదులుగా తల్లిదండ్రులను ఫాలో చేయాలి. చదువు అటెన్షన్ తో చదవాలి మరియు చదివించాలి.

వరదానము:-

కర్మలో యోగము మరియు యోగములో కర్మ – ఇటువంటి కర్మయోగి అనగా శ్రేష్ఠ స్మృతి, శ్రేష్ఠ స్థితి ఉన్నవారు మరియు శ్రేష్ఠ వాయుమండలాన్ని తయారుచేసేవారు సర్వుల ఆశీర్వాదాలకు అధికారిగా అవుతారు. కర్మ మరియు యోగము యొక్క బ్యాలెన్స్ ద్వారా ప్రతి కర్మలో తండ్రి ద్వారా బ్లెస్సింగ్స్ అయితే లభించనే లభిస్తాయి కానీ ఎవరైతే సంబంధ సంపర్కములోకి వస్తారో, వారి నుండి కూడా ఆశీర్వాదాలు లభిస్తాయి, అందరూ వారిని మంచివారిగా అంగీకరిస్తారు, ఇలా మంచివారిగా అంగీకరించడమే ఆశీర్వాదాలు. కనుక ఎక్కడైతే ఆశీర్వాదాలు ఉంటాయో, అక్కడ సహయోగము ఉంటుంది మరియు ఈ ఆశీర్వాదాలు మరియు సహయోగమే సఫలతామూర్తులుగా చేస్తుంది.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top