23 May 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

May 22, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - బాబా శ్రీమతంపై నడవడంతో ఉన్నతంగా అవుతారు, రావణుడి మతంపై నడవడంతో మొత్తం పరువు అంతా మట్టిలో కలిసిపోతుంది’’

ప్రశ్న: -

ఈశ్వరీయ జన్మ సిద్ధ అధికారాన్ని తీసుకునే వారసులైన పిల్లల యొక్క గుర్తులు వినిపించండి?

జవాబు:-

ఇటువంటి వారసులైన పిల్లలు – 1. తండ్రిని పూర్తి-పూర్తిగా ఫాలో చేస్తూ నడుచుకుంటారు. 2. శూద్రుల సాంగత్యం నుండి చాలా-చాలా సంభాళించుకుంటారు. ఎప్పుడూ కూడా శూద్రుల సాంగత్యంలోకి వచ్చి తండ్రి శ్రీమతంలో మన్మతాన్ని మిక్స్ చేయరు. 3. తమ సత్యాతి-సత్యమైన లెక్కాపత్రాన్ని తండ్రికి వినిపిస్తారు. 4. ఒకరినొకరు సావధానపర్చుకుంటూ ఉన్నతిని పొందుతూ ఉంటారు. 5. ఎప్పుడూ కూడా తండ్రి చేతిని విడిచిపెట్టే సంకల్పం కూడా చేయరు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

మాతా ఓ మాతా, నీవు అందరి భాగ్యవిధాతవు… (మాతా ఓ మాతా తూ సబ్ కీ భాగ్యవిధాత…)

ఓంశాంతి. పిల్లలు ఈ పాటను విన్నారు. జగదంబ కామధేనువు యొక్క వర్ణన అయితే ఉండనే ఉంది. ఈ మహిమ జగదంబది. వాస్తవానికి గుప్త రూపంలోనైతే ఈ బ్రహ్మాపుత్ర నది కూడా ఉన్నారు. నీవే తల్లివి, తండ్రివి… అని అంటూ ఉంటారు కూడా. శివబాబా బ్రహ్మాముఖ కమలం ద్వారా పిల్లలకు జన్మనిస్తారు. కావున వీరు మాత అయినట్లు కదా. ఇవి గుహ్యమైన విషయాలు. ఈ విషయాలు శాస్త్రాలలో లేవు. బాబా అర్థం చేయించారు, శాస్త్రాలు భక్తి మార్గపు సామాగ్రి. తండ్రి కూర్చుని అన్ని శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు. గీత గురించి అర్థం చేయిస్తారని కాదు. అలా కాదు, తండ్రి అయితే స్వయమే జ్ఞాన సాగరుడు. అయితే వీరు గీత, భాగవతం మొదలైనవన్నీ చదివినవారు. శివబాబా గురించి, వారు అన్నీ చదివినవారు అని అనరు. అలా కాదు, వారైతే నాలెడ్జ్ ఫుల్ (జ్ఞాన సంపన్నులు). వారంటారు, నేను ఈ మనుష్య సృష్టికి బీజరూపుడిని. సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానం నాలో ఉంది. తండ్రి అంటారు, నేను దీనిని ఈ బ్రహ్మా ద్వారా వర్ణన చేస్తాను. తర్వాత ఈ వర్ణన ప్రాయః లోపమైపోతుంది. ఈ సత్యమైన గీత, దేనినైతే ఇప్పుడు మీరు తయారుచేస్తారో, ఇది కూడా మీ చేతికి రాదు. గీత మొదలైనవైతే భక్తి మార్గపు శాస్త్రాలు. అవే మళ్ళీ వెలువడుతాయి. ఈ శాస్త్రాలు మొదలైనవి చదవడంతో ఎవ్వరికీ సద్గతి లభించదు. మీకు తెలుసు, ఈ పాత్రధారులు ఎవరైతే ఉన్నారో, మొదట అందరూ శరీరం లేకుండా ముక్తిధామంలో ఉండేవారు, తర్వాత ఇక్కడికి వచ్చి శరీరాలు ధారణ చేసి పాత్రను అభినయిస్తున్నారు. ఆత్మలో అవినాశీ పాత్ర నిండి ఉంది. ఈ సృష్టి చక్రం కూడా ఒక్కటే, దీని రచయిత కూడా ఒక్కరే. ఈ సృష్టి చక్రం ఒక్కటే తిరుగుతూ ఉంటుంది. ఇది అవినాశీ తయారై తయారుచేయబడిన డ్రామా. సత్యయుగంలో దేవీ-దేవతల రాజ్యం ఉండేది. ఇప్పుడు మీరు మళ్ళీ అలా తయారవుతున్నారు. పరమపిత పరమాత్మ మొట్టమొదట బ్రహ్మా ముఖం ద్వారా బ్రాహ్మణ సృష్టిని రచిస్తారు. మొట్టమొదటి కొత్త సృష్టి సంగమయుగము. పాతదిగా మరియు కొత్తదిగా అవుతుంది. బ్రాహ్మణులు పిలక వంటివారు. పాదాలు మరియు పిలక, దీనిని సంగమము అని అంటారు. బ్రాహ్మణులైన మీరు తండ్రితో పాటు విశ్వానికి ఆత్మిక సేవ చేస్తారు. తండ్రి కూడా ఆత్మల సేవ చేస్తారు. మీరు కూడా ఆత్మల సేవ చేస్తారు అనగా ఎవరైతే తమోప్రధానంగా అయ్యారో, వారిని సతోప్రధానంగా చేస్తారు. కావున తండ్రి శ్రీమతంపై నడుచుకునేవారే ఉన్నతోన్నతమైన పదవిని పొందుతారు. పిల్లలు శ్రీమతము ద్వారానే శ్రేష్ఠంగా అవ్వాలి. పిల్లలైన మీకు తెలుసు, మనమే దేవీ-దేవతలుగా, సూర్య వంశీయులుగా, చంద్ర వంశీయులుగా ఉండేవారము, మాయ మన పరువు తీసేసింది, పూజ్యుల నుండి పూజారులుగా, పతితులుగా చేసేసింది. శ్రీమతముతో మనుష్యులు శ్రేష్ఠంగా అవుతారు, తర్వాత రావణుడి మతముతో మొత్తం పరువు అంతా మట్టిలో కలిసిపోతుంది. ఇప్పుడు మళ్ళీ శివబాబా మతముపై నడుచుకోవడంతో కొత్త ప్రపంచంలో దేవతలుగా అవుతారు. అడుగడుగునా శ్రీమతంపై నడుచుకోవాలి. గాంధీజీ కూడా కొత్త భారత్ ను, కొత్త రాజ్యాన్ని కోరుకునేవారు. కానీ కొత్త ప్రపంచం అని సత్యయుగాన్ని అంటారు. ఇక్కడైతే రోజు-రోజుకు దుఃఖం పెరుగుతూనే ఉంటుంది. బాబా అంటారు, దుఃఖం పెరిగేదే ఉంది, అందుకే కదా నేను వస్తాను. నేను నా ప్రతిజ్ఞ అనుసారంగా మళ్ళీ వచ్చి సహజ రాజయోగాన్ని నేర్పిస్తాను. శాస్త్రాలైతే తర్వాత తయారవుతాయి. ఈ గీత మొదలైనవి కూడా అప్పటివే తయారవుతాయి. ఇప్పుడు ఈ వినాశ జ్వాలలో అన్నీ సమాప్తమైపోతాయి. మీకు ఈ చక్రం గురించి తెలుసు. పిల్లలైన మీరు స్కూల్లకు వెళ్ళి అర్థం చేయించాలి.

మీది హద్దు యొక్క చరిత్ర-భౌగోళికము. దీనినేమీ ప్రపంచం యొక్క చరిత్ర-భౌగోళికము అని అనరు. పిల్లలకైతే అనంతమైన చరిత్ర-భౌగోళికాన్ని నేర్పించాలి, అప్పుడు ఈ ఉన్నత పదవిని పొందగలరు. హద్దు యొక్క చరిత్ర-భౌగోళికముతో హద్దు పదవి లభిస్తుంది. ఇది అనంతమైనది. ఇందులో మూడు లోకాల జ్ఞానం వచ్చేస్తుంది. ఆదిలో నిరాకారీ ప్రపంచంలో చాలా మంది ఆత్మలు ఉంటారు. అంతిమంలో మళ్ళీ ఆత్మలందరూ కిందకు వచ్చేస్తారు. సూక్ష్మవతనవాసులైన బ్రహ్మా, విష్ణు, శంకరుల పాత్ర కూడా ఇప్పుడే ఉంది. కావున మీరు వారిని ఇలా అడగవచ్చు – సత్యయుగంలో లక్ష్మీ-నారాయణుల రాజ్యం ఉండేదని మీకు తెలుసా. తర్వాత ఏమైంది? త్రేతా అంతిమం వరకు ఒకే లక్ష్మీ-నారాయణుల రాజ్యం ఉండేదా? ఎంత సమయం రాజ్యం చేసారు మరియు ఎంత ఏరియాపై? ఇప్పుడైతే భూమి-ఆకాశాలలో కూడా పార్టిషన్లు అయ్యాయి. అక్కడ ఇటువంటి విషయాలు ఉండవు. అక్కడ భారత్ లో అనంతమైన రాజ్యం నడుస్తుంది. ఇప్పుడైతే ఎన్ని భాగాలుగా అయిపోయింది. ఇవన్నీ కలిపి ఒకటిగా అవ్వడం అనేదైతే సంభవం కాదు. ఇప్పుడు తండ్రి అనంతమైన చరిత్ర-భౌగోళికాన్ని వినిపిస్తారు. 84 జన్మల చక్రంలో ప్రపంచం యొక్క చరిత్ర-భౌగోళికం వస్తుంది మరియు దానితో పాటు పవిత్రత కూడా తప్పకుండా కావాలి. ఇప్పుడు పవిత్రత లేదు, శాంతి లేదు, సమృద్ధత లేదు.

సన్యాసుల వద్దకు వెళ్ళడంతో శాంతి లభిస్తుందని మనుష్యులు భావిస్తారు. తండ్రి అంటారు, శాంతి అయితే మీ మెడలోని హారము. వాస్తవానికి ఆత్మనైన నా స్వధర్మమే శాంతి. ఆత్మ ఎక్కడి నివాసి? నిర్వాణధామ నివాసి అని అంటారు. ఆత్మ యొక్క స్వధర్మమే శాంతి అన్నప్పుడు ఇక గురువుల మొదలైనవారి నుండి ఏం శాంతి లభిస్తుంది? అశాంతిగా చేసేది మాయ. ఎప్పుడైతే శ్రీమతము ఆధారంగా ఈ మాయపై విజయం పొందుతారో, అప్పుడు సత్యయుగంలో పవిత్రత, సుఖం, శాంతి యొక్క వారసత్వాన్ని పొందుతారు. అక్కడ ఎప్పుడూ ఎవ్వరూ – నేను అశాంతిగా ఉన్నాను, నాకు శాంతి కావాలి అని అనరు. భారత్ లోనే పవిత్రత-సుఖం-శాంతి ఉండేవి. ఇప్పుడు మీరు శూద్రుల నుండి మారి బ్రాహ్మణులుగా అయ్యారు.

ఈ సమయంలో భారతవాసులకు – మేము ఏ ధర్మానికి చెందినవారము, మా ధర్మాన్ని ఎవరు మరియు ఎప్పుడు రచించారు అనేది కూడా తెలియదు. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం గురించి ఎవ్వరికీ తెలియదు. ఆర్యులు మరియు అనార్యులు. దేవతలను భగవాన్-భగవతి అని అంటారు ఎందుకంటే భగవంతుడు స్వయంగా స్వర్గాన్ని స్థాపన చేసారు. కానీ ఎంతైనా వారి పేరు దేవీ-దేవతలు. భారత్ ది ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము అంతేకానీ, హిందూ ధర్మం కాదు. తండ్రి ఈ విషయాలన్నింటినీ అర్థం చేయిస్తున్నారు. ఇది కూడా పిల్లలైన మీ బుద్ధిలో నంబరువారుగా కూర్చుంటుంది. చాలామంది పిల్లలు ఎలా ఉన్నారంటే, వారు శివబాబాను వారంలో ఒక్కసారైనా కష్టం మీద స్మృతి చేస్తారు. సాంగత్యం తోడు లేని కారణంగా స్మృతిని మర్చిపోతారు. ఇక్కడైతే బ్రాహ్మణుల సాంగత్యం కావాలి. వారు ఒకరినొకరు సావధానపర్చుకుంటూ ఉండాలి. శూద్రుల సాంగత్యంలో ఉన్నట్లయితే ఎంతో కొంత ప్రభావం తప్పకుండా పడుతుంది. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు ఫాలో చేయాలి. వ్యాపార వ్యవహారాలలో ఉంటూ బాబాకు సత్యంగా రాయాలి – బాబా, మేము వ్యవహారంలో ఉంటూ, ఫ్యాక్టరీ మొదలైన చోట్ల ఉంటూ ఎంతగా స్మృతిలో ఉన్నాము. తమ-తమ స్మృతి చార్టులను పంపించాలి, అప్పుడు బాబాకు కూడా, వీరు మంచి పురుషార్థులు అని అర్థమవుతుంది. ఇక్కడైతే చాలామంది బాప్ దాదాకు ఉత్తరం కూడా రాయరు. బాబా అర్థం చేసుకుంటారు, కొందరు సతోప్రధాన పురుషార్థం చేస్తారు, కొందరు రజో, కొందరు తమో. తమో పురుషార్థులు ఎవరైతే ఉంటారో, వారు సూర్యవంశీయుల వద్దకు వచ్చి పని చేస్తారు. షావుకార ప్రజల వద్దకు వెళ్ళి పనివారిగా అవుతారు. దీనికన్నా తక్కువ పదవి ఎవరికి ఉంటుంది అంటే, ఎవరైతే తండ్రికి చెందినవారిగా అయి ఆశ్చర్యం కలిగేలా వింటారు, వినిపిస్తారు, విడాకులు ఇచ్చేస్తారు…వారి దుర్గతి అందరికన్నా చెడుగా ఉంటుంది. తండ్రి ఇచ్చే పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలంటే లెక్కాపత్రాన్ని పంపించండి, అప్పుడు బాబా రిజల్టు ఇస్తారు. పూర్తి పురుషార్థం చేయకపోతే మాయ పూర్తిగా తినేస్తుంది. అందుకే బాబా అంటారు, సాంగత్యం చాలా అవసరము. సాంగత్యం ఉన్నట్లయితే, మేము ఈశ్వరీయ కులానికి చెందినవారమని భావిస్తారు. తండ్రి అర్థం చేయిస్తారు, పతి పత్ని కలిసే ఉండండి కానీ ఒకవేళ నిప్పు అంటుకున్నట్లయితే సమాప్తమైపోతారు. బాబాకైతే అనేకమంది పిల్లలు ఉన్నారు. వస్తూ ఉంటారు కూడా మరియు మరణిస్తూ ఉంటారు కూడా. ఈశ్వరీయ జన్మ ఆసురీ జన్మ కన్నా ఉన్నతమైనది.

ఈ రోజుల్లో ఆసురీ జన్మదినాలు చాలా జరుపుకుంటూ ఉంటారు. వాటిని క్యాన్సిల్ చేసి ఈశ్వరీయ జన్మదినాలు జరుపుకోవడం మొదలుపెట్టాలి, అప్పుడు అది పక్కా అవుతుంది. బాబా సలహా ఇస్తారు, పాత జన్మదినాన్ని జరుపుకోవడం క్యాన్సిల్ చేసి కొత్తది జరుపుకోండి. ఈ రోజుల్లో వివాహ దినాలను కూడా జరుపుకుంటారు. వాటిని కూడా క్యాన్సిల్ చేయాలి. మార్పు రావాలి. బాబా సికీలధే పిల్లలకు చెప్తారు, ఇది కొత్త విషయమేమీ కాదు. మీరు అనేక సార్లు రాజ్య భాగ్యాన్ని పోగొట్టుకుంటారు మరియు తీసుకుంటారు. కల్ప-కల్పము తండ్రి వద్ద ఒక్క జన్మ త్యాగం చేసి 21 జన్మల సుఖాన్ని పొందాము కావున మనం పవిత్రంగా ఎందుకు అవ్వము. బాబా, మీ శ్రీమతముపై నడుచుకుంటాము. అర్ధకల్పము ఆసురీ మతముపై నడిచారు, కావున ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా గొప్ప వారసత్వము, ఇక అడగకండి. స్కూల్ లో పరీక్షల్లో ఫెయిల్ అయినట్లయితే ముఖం పాలిపోతుంది. ఇక్కడ కూడా చాలా శిక్షలు తినాల్సి ఉంటుంది. బాబా సాక్షాత్కారం చేయిస్తారు. నేనే స్వయంగా చదివించేవాడిని మరియు శ్రీమతంపై నడుచుకోండి అని చెప్పేవాడిని, అయినా వినలేదు. ఎంత పొరపాటు చేసారు, 100 రెట్ల శిక్షను విధిస్తారు ఎందుకంటే తండ్రి సేవలో విఘ్నాలు వేసారు, తండ్రిని నిందింపజేసారు. శ్రీమతంపై నడుచుకునేవారు సదా మధురంగా ఉంటారు. ఎవరిపైన అయినా క్రోధం చేసారంటే ఆసురీ మతమని భావించండి. కొంతమంది, బాబా సభలో మా పరువు తీసేసారు, అందరి ముందు వినిపించారు అని భావిస్తారు. అరే, అనంతమైన తండ్రి అయితే అందరి గౌరవాన్ని పెంచుతారు. బాబాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు. ఒక్కొక్కరికి పక్కకు పిలిచి అర్థం చేయిస్తారా ఏమిటి? తండ్రి అయితే అందరి ముందు వినిపిస్తారు. తండ్రి శ్రీమతముతో శ్రేష్ఠాతి శ్రేష్ఠంగా అవుతారు. తమ మతముపై నడుచుకున్నట్లయితే పడిపోతారు. పడిపోతూ-పడిపోతూ చనిపోతారు. ఇక్కడ చింతల చితి ఉంది. ఎక్కడైతే చింత యొక్క పేరే ఉండదో, తండ్రి అక్కడకు తీసుకువెళ్తారు. కనుక శ్రీమతంపై నడుచుకోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత ఎలా అవ్వాలనుకుంటే అలా అవ్వండి. శ్రీలక్ష్మిని వరించే ధైర్యం కావాలి. తమ ముఖాన్ని అద్దంలో చూసుకోవాలి, నేను ఎంత వరకు యోగ్యంగా అయ్యాను. ఎప్పటివరకైతే జీవించి ఉంటారో, అప్పటి వరకు జ్ఞానం తీసుకుంటూ ఉండాలి. మీరు జగదంబ పిల్లలు. మమ్మా మహిమ ఏదైతే ఉందో, అదే పిల్లలైన మీది కూడా. జగదంబ ముఖ్యమైనవారు అవుతారు. 16,108 మాల కూడా ఉంటుంది. రుద్ర యజ్ఞాన్ని రచించినప్పుడు లక్ష సాలిగ్రామాలను మరియు ఒక్క శివలింగాన్ని తయారుచేస్తారు. కావున తప్పకుండా వారంతా సహాయకులుగా ఉంటారు కదా.

మీరంతా ఆత్మిక యాత్ర చేసేవారు, బ్రహ్మా ముఖవంశావళి, సంగమయుగీ బ్రాహ్మణులు. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా కొత్త రచనను రచిస్తారు. దత్తత పిల్లలుగా చేసుకుంటారు. మీరు శూద్ర ధర్మం నుండి మారి బ్రహ్మా ముఖవంశావళిగా అవుతారు. మాయ పెద్ద శత్రువు. యోగము జోడించనివ్వదు. బాబా అంటారు, మమ్మల్ని యోగములో కూర్చోబెట్టండి అని ఎప్పుడూ అనకండి. ఒకేచోట కూర్చుని యోగము చేసే అలవాటైతే, ఇక నడుస్తూ-తిరుగుతూ యోగము కుదరదు. మేము దీదీ వద్దకు వెళ్ళి యోగములో కూర్చుంటామని అంటారు. తండ్రి అయితే అంటారు, నడుస్తూ-తిరుగుతూ తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి, అంతే. ఆ గీతను వినిపించేవారు ఇలా చెప్పలేరు. ఈ తండ్రి మాత్రమే అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. మీరు స్వర్గాన్ని కూడా సాక్షాత్కరించుకున్నారు. బాబా ఇప్పుడు ఎక్కువగా చేయించరు, లేదంటే కొత్తవారు గారడీ అని అనుకుంటారు.

పాటలో మమ్మా యొక్క మహిమ ఉంది. వీరు (బ్రహ్మా) కూడా మమ్మాయే. కానీ మాతలను సంభాళించేందుకు జగదంబను నియమించారు. డ్రామాలో నిశ్చితమై ఉంది. మమ్మా అందరికన్నా చురుకైనవారు కూడా. వారి మురళి చాలా రసవత్తరంగా ఉంటుంది. పిల్లలైన మీకు తెలుసు, శ్రీకృష్ణుడు ఇప్పుడు రాజకుమారుని నుండి బికారిగా అయిపోయారు. (శ్రీకృష్ణుని చిత్రాన్ని చూస్తూ) నీవు ఎలాంటి కర్మలు చేసినందుకు స్వర్గానికి రాకుమారునిగా అయ్యావో చెప్పు? తప్పకుండా మునపటి జన్మలో రాజయోగాన్ని నేర్చుకుని ఉంటావు. తప్పకుండా తండ్రే స్వర్గ రచయిత, వారే నేర్పించి ఉంటారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి సేవలో విఘ్నరూపులుగా అవ్వకూడదు. శ్రీమతంపై నడుస్తూ చాలా-చాలా మధురంగా అవ్వాలి, ఎవరిపైనా క్రోధం చేయకూడదు.

2. మాయ నుండి రక్షించుకునేందుకు సాంగత్య విషయంలో చాలా సంభాళించుకోవాలి, శూద్రుల సాంగత్యము చేయకూడదు. బాబాకు తమ సత్యాతి-సత్యమైన లెక్కాపత్రాన్ని ఇవ్వాలి. ఈశ్వరీయ జన్మదినాన్ని జరుపుకోవాలి, ఆసురీ జన్మదినాన్ని కాదు.

వరదానము:-

సమయం యొక్క పరిస్థితుల అనుసారంగా, స్వఉన్నతి కోసము మరియు తీవ్రగతితో సేవ చేసేందుకు మరియు బాప్ దాదా స్నేహానికి రిటర్ను ఇచ్చేందుకు వర్తమాన సమయంలో తపస్య అత్యంత అవసరము. తండ్రి పట్ల పిల్లలకు ప్రేమ ఉంది కానీ బాప్ దాదా తమ ప్రేమకు రిటర్ను స్వరూపంలో పిల్లలను తమ సమానంగా చూడాలనుకుంటారు. సమానంగా అయ్యేందుకు తపస్వీ మూర్తులుగా అవ్వండి. దీని కోసం నలువైపులా ఉన్న తీరాలను వదిలి అనంతమైన వైరాగులుగా అవ్వండి. తీరాలను ఆధారంగా చేసుకోకండి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top