23 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris

23 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

22 August 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - మేము చాలా-చాలా మధురంగా అవుతాము, అందరినీ సుఖమయమైన, ప్రేమపూర్వకమైన దృష్టితో చూస్తాము, ఎవరి నామ-రూపాలలోనూ చిక్కుకోము అని మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోండి”

ప్రశ్న: -

యోగం ద్వారా కలిగేటువంటి సిద్ధి ఏమిటి? పక్కా యోగుల గుర్తు ఏమిటి?

జవాబు:-

కర్మేంద్రియాలన్నీ పూర్తిగా శాంతిగా, శీతలంగా అవుతాయి – ఇదే యోగం ద్వారా కలిగేటువంటి సిద్ధి. పక్కా యోగీ పిల్లలు ఎవరంటే – వారి కర్మేంద్రియాలు కొద్దిగా కూడా చంచలమవ్వవు, ఏ దేహధారి పట్ల కొంచెం కూడా దృష్టి వెళ్ళదు. మధురమైన పిల్లలూ – ఇప్పుడు మీరు యువత కారు, ఇది మీ వానప్రస్థ అవస్థ.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

మేల్కోండి ప్రేయసులారా మేల్కోండి… (జాగ్ సజనియా జాగ్…)

ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. దీని అర్థం గురించి మనసులో విచార సాగర మథనం చేయాలి మరియు సంతోషపడాలి, ఎందుకంటే ఇవి కొత్త ప్రపంచం కోసం కొత్త విషయాలు. ఈ కొత్త విషయాలను ఇప్పుడు వినాలి. కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేవారు మనుష్యులు ఎవరూ కాలేరని ఇప్పుడు పిల్లలకు తెలుసు. మీరు ఈ విషయాలను విన్నప్పుడు, ఇవి 5 వేల సంవత్సరాల క్రితం నాటి పాత విషయాలు, వాటినే మళ్ళీ కొత్తగా వినిపించడం జరుగుతుందని అర్థం చేసుకుంటారు. అంటే పాతవి కొత్తగా, కొత్తవి పాతగా అయిపోతాయి. ఇప్పుడు మీకు తెలుసు – 5 వేల సంవత్సరాల క్రితం నాటి ఆ విషయాలనే బాబా కొత్తగా వినిపిస్తారు. విషయాలు అవే. వాటిని ఎందుకు వినిపిస్తారు? కొత్త ప్రపంచ వారసత్వాన్ని పొందేందుకు. ఇందులో జ్ఞాన డ్యాన్సును చేయాల్సి ఉంటుంది. భక్తిలో కూడా చాలా నాట్యం చేస్తారు. నలువైపులా తిరుగుతూ నాట్యం చేస్తారు. జ్ఞాన డ్యాన్స్ అయితే చాలా సహజమైనది. ఆ డ్యాన్స్ లోనైతే కర్మేంద్రియాలను చాలా ఉపయోగిస్తారు, శ్రమ చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే, కేవలం లోలోపల మాత్రమే జ్ఞాన డ్యాన్స్ నడుస్తుంది. సృష్టి చక్రం ఎలా తిరుగుతుందనే జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. ఇందులో ఎలాంటి శ్రమ లేదు. అవును, స్మృతిలో శ్రమ అనిపిస్తుంది. చాలా మంది పిల్లలు ఫెయిల్ అయిపోతారు, ఎక్కడో ఒక చోట పడిపోతారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే – నామ-రూపాలలో చిక్కుకోకూడదు. స్త్రీ-పురుషులు కామానికి వశులై, నామ-రూపాలలో చిక్కుకుంటారు కదా. క్రోధం నామ రూపాలలో చిక్కుకునేలా చేయదు. మొట్టమొదటి వికారం ఇదే, దీని నుండి చాలా సంభాళించుకోవాలి, ఎవరి నామ-రూపాలలోనూ చిక్కుకోకూడదు. స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మనైన నేను అశరీరిగా వచ్చాను, ఇప్పుడు అశరీరిగా అయ్యి వెళ్ళాలి. ఈ శరీర భానాన్ని తెంచివేయాలి. నామ-రూపాలలో చిక్కుకోవడమనేది చాలా చెడ్డ రోగమని తండ్రి పిల్లలకు అటెన్షన్ ఇప్పిస్తున్నారు. కొంతమంది ఈ విషయాన్ని అర్థం చేసుకోరు. నీవు నామ-రూపాలలో చిక్కుకున్నావని బాబా అనవసరంగా నన్ను అంటున్నారని అంటారు. కానీ ఇది గుప్తమైన రోగము, అందుకే ప్రియుడు, ప్రేయసులను మరియు తండ్రి, పిల్లలను మేలుకొలుపుతారు – పిల్లలూ మేలుకోండి, ఇప్పుడు కలియుగం తర్వాత మళ్ళీ సత్యయుగం రానున్నది. తండ్రి జ్యోతిని వెలిగించేందుకు వస్తారు. మనుష్యులు మరణించినప్పుడు వారి కోసం జ్యోతిని వెలిగిస్తారు. తర్వాత, ఆ దీపం ఆరిపోకూడదని, ఆత్మకు అంధకారం ఏర్పడకూడదని దానిని సంభాళిస్తారు. నిజానికి ఇవన్నీ భక్తి మార్గపు విషయాలు. ఆత్మ సెకండులో వెళ్ళిపోతుంది. చాలా మంది జ్యోతిని కూడా భగవంతునిగా భావిస్తారు. బ్రహ్మాండాన్ని ఒక పెద్ద జ్యోతిగా భావిస్తారు. బ్రహ్మ సమాజం వారికి మందిరాలుంటాయి, అక్కడ రాత్రింబవళ్ళు జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. ఎంత ఖర్చు అవుతుంది. తైలం వ్యర్థంగా పోతుంది. ఇక్కడ అవేమీ వేయాల్సిన అవసరం లేదు. స్మృతి తైలం వలె పని చేస్తుంది. ఇది స్మృతి రూపీ తైలము. కనుక మధురాతి-మధురమైన పిల్లలు ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. ఇది కొత్త విషయమైన కారణంగానే గొడవలు జరుగుతాయి. నేను మధురమైన పిల్లల వద్దకు వస్తానని తండ్రి అంటారు. భారత్ లోనే వస్తాను. అందరికీ తమ జన్మభూమి ప్రియమనిపిస్తుంది కదా. తండ్రికైతే అందరూ ప్రియమనిపిస్తారు. ఎంతైనా నేను నా భారత దేశంలోనే వస్తాను. గీతలో ఒకవేళ కృష్ణుని పేరు లేకపోయి ఉంటే మనుష్యమాత్రులందరూ శివబాబాను నమ్మేవారు. శివుని మందిరాలకు ఎంతమంది వెళ్తారు. సోమనాథ మందిరము అన్నింటికంటే పెద్దదిగా ఉండేది. ఇప్పుడు లెక్కలేనన్ని మందిరాలు నిర్మించబడ్డాయి. అనంతమైన తండ్రిని నమ్మినంతగా కృష్ణుడిని అంతగా నమ్మరు. కనుక ఈ సమయంలో మీకు వీరి వంటి ప్రియమైన వస్తువు ఇంకొకటి ఉండదు. ఇందులో సాకారుని మహిమ ఏమీ లేదు. ఇది నిరాకారుడి మహిమ, వారు అభోక్త. అనంతమైన తండ్రి స్వర్గ రచయిత అయినప్పుడు వారి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునే పురుషార్థం చేయాలి కదా.

ఈ రోజు, రేపు అని అంటూ-అంటూ మృత్యువు కబళిస్తుంది. ఇప్పుడు కొంచెం సమయమే మిగిలి ఉంది. తండ్రి నుండి వారసత్వాన్ని అయితే తీసుకోండి. ప్రశ్నావళి నింపే సమయంలో అర్థం చేయించాలి కూడా – వారు అనంతమైన తండ్రి అని మీకు నిశ్చయం ఏర్పడినప్పుడు, ఆ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే పురుషార్థం చేయండి, లేదంటే, బయటకు వెళ్ళగానే వెంటనే మర్చిపోతారు. తండ్రి కళ్యాణకారి కదా! తండ్రి అంటారు – ఈ యోగం ద్వారానే 21 జన్మల కోసం మీ దుఃఖాలన్నీ దూరమవ్వనున్నాయి. కుమార్తెలు ఇళ్ళల్లో కూడా ఏమని అర్థం చేయిస్తూ ఉండాలంటే – ఇప్పుడు దుఃఖాలన్నింటినీ దూరం చేసే అనంతమైన తండ్రిని స్మృతి చేయడం ద్వారానే తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు అని. తప్పకుండా పవిత్రంగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యమైన విషయము పవిత్రతకు సంబంధించినది. ఎంత ఎక్కువగా స్మృతిలో ఉంటారో, అంతగా ఇంద్రియాలు కూడా శాంతిగా అయిపోతాయి. యోగం యొక్క సిద్ధి పూర్తిగా లభించనంత వరకు ఇంద్రియాలు కూడా శాంతిగా అవ్వవు. కామ వికారం నన్నేమీ మోసం చేయడం లేదు కదా అని ప్రతి ఒక్కరు తమను తాము చెక్ చేసుకోవాలి. ఒకవేళ నేను పక్కా యోగి అయినట్లయితే, ఎటువంటి చంచలత ఉండకూడదు. ఇది వానప్రస్థ అవస్థ వంటిది – తండ్రినే స్మృతి చేస్తూ ఉండాలి. తండ్రి పిల్లలందరికీ అర్థం చేయిస్తారు. మీరు మంచి యోగిగా అయినప్పుడు, మీ దృష్టి ఎటువైపు వెళ్ళనప్పుడు, మీ ఇంద్రియాలు శాంతిగా అయిపోతాయి. ముఖ్యమైనవి ఈ కనులే, ఇవే అందరినీ మోసగిస్తూ ఉంటాయి. యోగంలో మంచి అవస్థ తయారైనప్పుడు, మేము యవ్వనంలోనే వానప్రస్థ అవస్థలోకి వచ్చేసాము అన్నట్లుగా అనుభవమవుతుంది. తండ్రి అంటారు – కామము మహాశత్రువు. కనుక స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి. ఎంతగా స్మృతిలో ఉంటారో, అంతగా కర్మేంద్రియాలు శాంతిగా అయిపోతాయి మరియు చాలా మధుర స్వభావం కలవారిగా అయిపోతారు. ఇంతకుముందు నేను ఎంత చేదుగా ఉండేవాడిని, ఇప్పుడు ఎంత మధురంగా అయ్యాను అనేది ఫీల్ అవుతారు. బాబా ప్రేమ సాగరుడు కదా, కనుక పిల్లలు కూడా అలా తయారవ్వాలి. కనుక అందరి పట్ల ప్రేమపూర్వకమైన దృష్టి ఉండాలని తండ్రి అంటారు. ఒకవేళ ఎవరికైనా దుఃఖం ఇచ్చినట్లయితే దుఃఖితులై మరణిస్తారు, కనుక చాలా మధురంగా తయారవ్వాలి.

తండ్రి అంటారు – నేను రూప్ బసంత్ ను కదా. తండ్రి నుండి ఎన్ని అమూల్యమైన జ్ఞాన రత్నాలు లభిస్తాయి. వీటితో మీరు జోలిని నింపుకుంటారు. మనుష్యులు శంకరుని ఎదురుగా వెళ్ళి జోలిని నింపండి అని అడుగుతారు. శంకరుడు జోలిని నింపేవారు కాదని వారికి తెలియదు. జ్ఞానసాగరుడైన బాబా జ్ఞాన రత్నాలతో పిల్లలైన మన జోలిని నింపుతారని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మీరు కూడా రూప్ బసంత్ లు. ప్రతి ఒక్కరి ఆత్మ రూప్ బసంత్. స్వయాన్ని చూసుకుంటూ ఉండండి – నేను ఎంతగా జ్ఞాన రత్నాలను ధారణ చేసి జ్ఞాన డాన్స్ చేస్తున్నాను అనగా ఎంతగా రత్నాలను దానం చేస్తున్నాను. అన్నింటికన్నా మంచి రత్నము – మన్మనాభవ. తండ్రిని స్మృతి చేయడంతో తండ్రి వారసత్వాన్ని పొందుతారు. ఎలాగైతే బాబాలో జ్ఞానం నిండి ఉందో, అలా తండ్రి కూర్చుని పిల్లలను తమ సమానంగా తయారుచేస్తారు. గురువులు కూడా తమ సమానంగా తయారుచేస్తారు. వీరు అనంతమైన తండ్రి, వీరి రూపం బిందువు, మీ రూపం కూడా బిందువే. మిమ్మల్ని తమ సమానంగా జ్ఞాన సాగరునిగా తయారుచేస్తారు. ఎంతగా ధారణ చేస్తారో, చేయిస్తారో….. అంతగా ఉన్నత పదవి లభిస్తుందని భావించవచ్చు. అనేకుల కళ్యాణకారిగా అయినట్లయితే అనేకుల ఆశీర్వాదాలు లభిస్తాయి. తండ్రి కూడా రోజూ సేవ చేస్తారు కదా! ఈ గుల్జార్ బచ్చీ, ఎంత మధురంగా అర్థం చేయిస్తారు. అందరికీ బాగా అనిపిస్తుంది. మాకు ఇటువంటి బ్రాహ్మణి లభించాలని మనసుకు అనిపిస్తుంది. ఇప్పుడు ఒకే బ్రాహ్మణి అన్ని చోట్లకు వెళ్ళలేరు. అయినా తండ్రి అంటారు – ఎవరైతే తాము బాగా అర్థం చేయిస్తారని అనుకుంటారో, వారు ఆల్రౌండ్ సేవ చేయాలి. నేను సెంటర్లు తిరిగి రావాలి అని వారికి అభిరుచి ఉండాలి. నేను అనేకుల కళ్యాణం చేయగలను, నా నుండి మంచి సుగంధం వెలువడుతుంది అని ఎవరైతే భావిస్తారో, వారికి అభిరుచి ఉండాలి. నేను 10-15 రోజులు వెళ్ళి సెంటర్లు తిరిగి వస్తాను అని భావించాలి. ఒకరిని చూసి ఇతరులు కూడా నేర్చుకుంటారు. ఎవరైతే చేస్తారో, వారు పొందుతారు. ఈ సేవ చాలా కళ్యాణకారి. మీరు మనుష్యులకు ప్రాణదానాన్ని ఇస్తారు. ఇది ఎంతో ఉత్తమోత్తమమైన కార్యము. వ్యాపారస్థులు కూడా యుక్తిగా సమయాన్ని తీసి సేవకు వెళ్ళవచ్చు. సర్వీసబుల్ గా ఉన్నవారిని తండ్రి ప్రేమిస్తారు కూడా, వారి పాలన కూడా చేస్తారు. ఎవరికైతే సేవ పట్ల అభిరుచి ఉంటుందో, వారు సేవ లేకుండా ఉండలేరు. తండ్రి సహాయం కూడా చేస్తారు కదా! పిల్లలు చాలా దయాహృదయులుగా అవ్వాలి. పాపం వారిది చాలా దుఃఖమయ జీవితము. మీరు ప్రాణదానాన్ని ఇస్తారు. ఎవరికైనా అవినాశీ జ్ఞాన రత్నాలను దానమివ్వడం వంటి సర్వోత్తమమైన జ్ఞాన దానం ఇంకొకటి ఉండదు. చాలా దయాహృదయులుగా అవ్వాలి. బ్రాహ్మణి బలహీనంగా ఉన్న కారణంగా సేవ ఢీలా అయిపోతుంది. అందుకే మంచి టీచరు కావాలని అడుగుతారు. మీకు ఆలోచన వచ్చిన వెంటనే వెళ్ళిపోవాలి – బాబా, ఏ సెంటరు చల్లబడిపోయింది, మేము వెళ్ళి చూసి వస్తాము అని అనాలి. ప్రదర్శినీ చిత్రాలు కూడా ఉన్నాయి. చిత్రాలను చూపిస్తే ఇంకా బాగా అర్థం చేసుకుంటారు. మేము సేవను ఎలా పెంచాలి అని ఆలోచిస్తూ ఉండాలి. తండ్రి కూడా అందరి జీవితాన్ని వజ్ర సమానంగా తయారుచేస్తారు. పిల్లలైన మీరు కూడా సేవ చేయాలి. వందేమాతరం అని అంటూ ఉంటారు కానీ దాని అర్థాన్ని తెలుసుకోరు. పతిత మనుష్యులకు లేక భూమి మొదలైనవాటికి ఎప్పుడూ నమస్కరించరు. ఇవి పంచ తత్వాలు, వీటికేమి నమస్కరిస్తారు. ఇది పంచ తత్వాలతో తయారుచేయబడిన శరీరం కనుక శరీరాలను పూజించడం అనగా బొమ్మల పూజ చేస్తున్నట్లు. శివబాబాకైతే శరీరం లేదు. వీరి పూజ అన్నింటికంటే ఉత్తమమైనది. మిగిలినవన్నీ మధ్యమమైనవి. ఈ రోజుల్లో మనుష్యులను కూడా పూజిస్తూ ఉంటారు, వారు పతితులు. దేవతలే మహాన్ ఆత్మలు. వారు సన్యాసుల కన్నా పవిత్రమైనవారు.

మీరు దేవతలుగా అవుతున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తండ్రి మనకు ఈ అవినాశీ జ్ఞాన రత్నాలను దానం చేయడం నేర్పిస్తారు. దీనంతటి ఉన్నతమైన దానం ఇంకొకటి ఉండదు. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. శివుడు మరియు లక్ష్మీనారాయణుల చిత్రాలైతే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వీటిని తమ ఇళ్ళల్లో పెట్టుకున్నట్లయితే, శివబాబా మమ్మల్ని ఈ లక్ష్మీనారాయణుల వలె తయారుచేస్తున్నారని గుర్తుంటుంది. ఈ సమయంలో మీరు అలా తయారవుతున్నారు. స్వర్గ రచయిత ఒక్క శివబాబాయే. వారు సత్యయుగంలో వారసత్వాన్ని ఇవ్వరు కదా. నన్ను స్మృతి చేసినట్లయితే మీరిలా తయారవుతారు అని శివబాబా ఈ అంతిమ జన్మలో అంటారు. మిగిలిన విషయాలన్నింటినీ వదిలి కేవలం సేవయే సేవ చేయండి. మీరు తండ్రిని స్మృతి చేస్తున్నారు – ఇది కూడా పెద్ద సేవ చేయడమే. తత్వాలు మొదలైనవన్నీ పావనంగా అయిపోతాయి. యోగానికి చాలా భారీ మహిమ ఉంది. ప్రపంచంలో యోగాశ్రమాలైతే చాలా ఉన్నాయి కానీ అవన్నీ భౌతిక హఠయోగాలు, మీది రాజయోగము. దీనితో మీ నావ తీరాన్ని చేరుతుంది. ఆ అనేక రకాల హఠయోగాలు మొదలైన వాటితో మెట్లు దిగుతూ వచ్చారు. ముఖ్యమైన విషయము – స్మృతికి సంబంధించినది. నా మనసు ఎక్కడా వికారాల వైపుకు వెళ్ళడం లేదు కదా అని చూసుకోవాలి. వికారులనే పతితులని అంటారు అనగా వారు గవ్వ సమానమైనవారు. వికారాలలోకి పడిపోవటంతో తమను తామే నష్టపర్చుకుంటారు. తండ్రి చూసినా, చూడకపోయినా, ఎవరైతే చేస్తారో వారు పొందుతారు. నేను తండ్రి సేవను చేస్తున్నానా, నాలో ఎటువంటి అవగుణాలు లేవు కదా అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉంటే వాటిని తొలగించుకోవాలి. స్వయం నుండి అవగుణాలను తొలగించుకునేందుకు తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తూ ఉంటారు. నిర్గుణము అన్న పదం యొక్క భావాన్ని కూడా ఎవరూ అర్థం చేసుకోరు. వారిలో ఏ గుణాలు లేనప్పుడు, నిర్గుణ బాలుల మండలి ఏమి చేయగలదు? అర్థం లేకుండా ఏది తోస్తే అది అంటూ ఉంటారు. అనేక మతాలున్నాయి కదా! మీకు ఒకే మతం లభిస్తుంది. దీని ద్వారా మీకు అపారమైన సంతోషం కలగాలి. తండ్రి కేవలం – నన్ను స్మృతి చేయండి మరియు కమల పుష్ప సమానంగా అవ్వండి, మనసా-వాచా-కర్మణా పవిత్రంగా అవ్వండి అని మాత్రమే చెప్తారు. బ్రాహ్మణులైన మేము శ్రీమతాన్ని అనుసరించి మా తనువు-మనసు-ధనముల ద్వారానే స్వయం మరియు మొత్తం విశ్వం యొక్క సేవ చేస్తున్నామని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి రావడం కూడా భారత్ లోనే వస్తారు కదా. పాండవులైన మీరు భారత్ ను స్వర్గంగా చేసే సేవను చేస్తున్నారు. మీరు మీ పని చేస్తున్నారు. చివరికి పాండవులదే విజయము. ఇందులో యుద్ధం యొక్క విషయమేమీ లేదు. మీరు డబుల్ అహింసకులు. వికారాలలోకి వెళ్ళరు, అలాగే తుపాకులతో పేల్చరు. హింస ద్వారా ఎవరూ విశ్వంపై రాజ్యాధికారాన్ని పొందలేరు. వారిరువురూ (క్రిస్టియన్లు) ఒకవేళ పరస్పరంలో కలిసిపోతే, విశ్వంపై రాజ్యం చేయగలరని బాబా అర్థం చేయించారు. కానీ డ్రామాలో అలా లేదు. క్రిస్టియన్లే కృష్ణపురిని మింగేసారు. నిజానికి భారత్ కృష్ణుని పురిగానే ఉండేది కదా! యుద్ధం చేసి రాజ్యాధికారాన్ని తీసుకున్నారు, చాలా ధనాన్ని తీసుకువెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ ధనం తిరిగి వస్తూ ఉంటుంది మరియు మీరు మళ్ళీ విశ్వానికి యజమానులుగా అవుతారు. బాబా ఎన్ని యుక్తులను తెలియజేస్తారు. వారే మీ రాజ్యాన్ని లాక్కున్నారు, వారే మళ్ళీ పరస్పరంలో కొట్లాడుకుంటారు మరియు విశ్వానికి యజమానులుగా మీరు అవుతారు. ఇది ఎంత పెద్ద రాజ్యాధికారము. స్మృతి చేస్తూ ఉండండి మరియు మీ వారసత్వాన్ని తీసుకోండి – శ్రమంతా కేవలం ఇందులోనే ఉంది. ఇందులో విసుగు చెందకూడదు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఇతర విషయాలన్నింటినీ వదిలి జ్ఞాన దానం చేయాలి. రూప్ బసంతులుగా అవ్వాలి. తమ అవగుణాలను తొలగించుకునే పురుషార్థం చేయాలి. ఇతరులను చూడకూడదు.

2. తమ స్వభావాన్ని చాలా మధురంగా తయారుచేసుకోవాలి. అందరి పట్ల ప్రేమపూర్వకమైన దృష్టిని పెట్టుకోవాలి. ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. కర్మేంద్రియజీతులుగా అవ్వాలి.

వరదానము:-

తమ స్మృతిని సమర్థవంతంగా చేసుకోవాలన్నా లేక స్వతహాగా స్మృతి స్వరూపులుగా అవ్వాలన్నా, అమృతవేళ సమయం యొక్క విలువను తెలుసుకోండి. శ్రీమతమనుసారంగా సమయాన్ని గుర్తించి సమయానుసారంగా నడుచుకున్నట్లయితే సహజంగా సర్వ ప్రాప్తులను పొందగలరు మరియు శ్రమ నుండి ముక్తులుగా అవుతారు. అమృతవేళ మహత్వాన్ని అర్థం చేసుకొని నడుచుకోవడంతో ప్రతి కర్మ మహత్వపూర్ణంగా ఉంటుంది. ఆ సమయంలో విశేషంగా సైలెన్స్ ఉంటుంది, అందుకే స్మృతిని సహజంగా సమర్థవంతంగా చేసుకోగలరు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top