22 November 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
21 November 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు, మీకు ఈ పాత కలియుగ ప్రపంచానికి సంబంధించిన ఏ ఆలోచన రాకూడదు”
ప్రశ్న: -
తండ్రి పిల్లలకు శ్రేష్ఠ కర్మలు చేయడానికి మరియు కర్మలను సరిదిద్దుకోవడానికి ఏ విధిని తెలియజేసారు?
జవాబు:-
తమ కర్మలను సరిదిద్దుకోవడానికి సత్యమైన తండ్రితో సదా సత్యంగా ఉండండి. ఒకవేళ ఎప్పుడైనా పొరపాటుగా అయినా ఏదైనా తప్పుడు కర్మ జరిగితే, అది బాబాకు వెంటనే రాయండి. సత్యంగా బాబాకు వినిపించినట్లయితే దాని ప్రభావం తగ్గుతుంది. లేదంటే వృద్ధి అవుతూ ఉంటుంది. బాబా వద్దకు సమాచారం వస్తే బాబా దానిని సరిదిద్దేందుకు శ్రీమతాన్ని ఇస్తారు.
♫ వినండి ఆడియో (audio)➤
ఓంశాంతి. శివబాబా బ్రహ్మా ద్వారా పిల్లలను అడుగుతున్నారు – పిల్లలూ, మీరు ఇక్కడ ఉదయం నుండి కూర్చుని ఏం చేస్తున్నారు? మీరు ఎలాగూ విద్యార్థులే. కావున తప్పకుండా ఇక్కడ కూర్చుని, శివబాబా మమ్మల్ని చదివించడానికి వచ్చారు అని ఆలోచిస్తూ ఉండవచ్చు. ఈ చదువుతో మీరు సూర్యవంశీయులుగా అవుతారు ఎందుకంటే మీరు రాజయోగం నేర్చుకుంటున్నారు. విష్ణుపురికి యజమానులుగా అయ్యేందుకు ఈ ఆలోచనలో కూర్చున్నారా లేక ఎవరికైనా బాధ్యతలు, పిల్లలు, వ్యాపార-వ్యవహారాలు మొదలైనవి గుర్తుకొస్తున్నాయా? ఇది గీతా పాఠశాల అని, మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారని మరియు మేము లక్ష్మీనారాయణులుగా లేక వారి కుటుంబ సభ్యులుగా అవుతాము అని బుద్ధిలో ఉండాలి. ఇది రాజయోగము. మేము బాబా నుండి డైరెక్టుగా విని సూర్యవంశీ కుటుంబ సభ్యులుగా అవుతామని పిల్లల బుద్ధిలో ఉండాలి. లక్ష్మీనారాయణుల చిత్రం ఎదురుగా ఉంది, అక్కడ మన రాజ్యం ఉంటుంది. ప్రపంచంలోని వారికి స్వర్గమని దేనినంటారో తెలియదు. పిల్లలైన మీరంటారు – మేము ఇప్పుడు బాబా నుండి స్వర్గం యొక్క స్వరాజ్య విద్యను నేర్చుకుంటున్నాము, మేమే స్వర్గానికి యజమానులుగా అయ్యేవారము. దీనిని లోలోపల స్మరించాలి. ఎలాగైతే స్కూల్లో విద్యార్థుల బుద్ధిలో, మేము బ్యారిస్టరు, ఇంజనీరు మొదలైనవారిగా అవ్వడానికి చదువుకుంటున్నాము అని ఉంటుంది. మీకు ఇదైనా గుర్తుంటుందా లేక మర్చిపోతారా? మీరు ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుని విద్యార్థులు. తండ్రి మిమ్మల్ని ఉన్నతాతి ఉన్నతమైన దేవతలుగా తయారుచేయడానికి చదివిస్తున్నారు. మీరు వారి పిల్లలు. ఆత్మలు ఈ శరీరం ద్వారా తమ భవిష్య పదవిని గుర్తు చేస్తున్నారా లేదా శారీరక సంబంధీకులను, దైహిక ఆస్తిని, వ్యాపార-వ్యవహారాలను గుర్తు చేస్తున్నారా? ఇక్కడకు వచ్చినప్పుడు – మమ్మల్ని అనంతమైన యజమానులుగా చేసేందుకు అనంతమైన తండ్రి చదివించడానికి వస్తారు అని అర్థం చేసుకోవాలి. ఇక రాజా-రాణులుగా అయినా అవ్వండి లేక ప్రజలుగా అయినా అవ్వండి! యజమానులుగా అయితే అవుతారు కదా. కొత్త ప్రపంచంలో సూర్యవంశమే ఉంటుంది. మేము అక్కడ రాజ్యం చేస్తాము అని అయితే అర్థం చేసుకున్నారు కదా.
పిల్లలు బయట ఉన్నప్పుడు, ఇళ్ళు-వాకిళ్ళలో, వ్యవసాయంలో ఉన్నప్పుడు బాబా స్మృతి అంతగా ఉండదని బాబాకు తెలుసు. కనుక ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని ఆలోచనలను వదిలి రండి. ఇప్పుడు మీరు ఆ కలియుగ ప్రపంచంలో లేనే లేరు. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. కలియుగాన్ని వదిలేసారు, బయట కలియుగం ఉంది. విశేషంగా ఉన్న ఈ మధుబన్ సంగమము, అందుకే మధుబన్ కు మహిమ ఉంది. ఇక్కడ ఈ మురళీనే స్మరించాలి. ఏదైతే వింటారో, దానిని రిపీట్ చేయండి మరియు విచార సాగర మథనం చేయండి. ఎంత సమయం లభిస్తే అంత, చిత్రాల ముందుకు వచ్చి కూర్చోండి. వాటిని చూస్తూ మరియు చదువుతూ ఉండండి. బ్రాహ్మణీలు ఎవరైతే తీసుకువస్తారో, వారిపై చాలా బాధ్యత ఉంటుంది. చాలా చింత పెట్టుకోవాలి. ఎలాగైతే టీచర్లకు చింత ఉంటుంది – మా స్కూలు నుండి ఒకవేళ తక్కువ మంది పాస్ అయితే పరువు పోతుంది అని. స్కూల్లో చాలా మంది పాస్ అయితే, ఆ టీచరును మంచి టీచరుగా భావించడం జరుగుతుంది. బ్రాహ్మణీలు విద్యార్థుల పట్ల అటెన్షన్ పెట్టాలి. ఇక్కడ మీరు సంగమంలోకి వచ్చారు. ఇక్కడ డైరెక్టుగా బాబా వినిపిస్తారు. ఇక్కడి ప్రభావం చాలా బాగుంటుంది. ఒకవేళ ఇక్కడ ఇళ్ళు-వాకిళ్ళు, వ్యాపారాలు గుర్తుకొస్తే, వీరు సాధారణ ప్రజలుగా అవుతారని బాబా భావిస్తారు. వచ్చారు రాజులుగా అవ్వటానికి కానీ….. లేదంటే పిల్లలకు లోలోపల చాలా సంతోషముండాలి. చిత్రాలు కూడా మీకు చాలా సహాయం చేస్తాయి. మనుష్యులు స్మృతి చేయడం కోసం అష్ట దేవతలు మరియు గురువుల చిత్రాలను ఇంట్లో పెట్టుకుంటారు. కానీ వారిని గుర్తు చేయడం వలన ఏమీ లభించదు. భక్తి మార్గంలో ఏం చేసినా, కిందకు దిగుతూనే వచ్చారు. పిల్లలైన మీరు ఉన్నతిలోకి వెళ్ళే పురుషార్థం చేయాలి. ఇంట్లో శివబాబా చిత్రాన్ని పెట్టుకున్నట్లయితే, పదే-పదే స్మృతి కలుగుతుంది. ఇంతకుముందు మీరు హనుమంతుడిని, కృష్ణుడిని, రాముడిని గుర్తు చేసేవారు. ఇప్పుడు శివబాబా, నన్ను స్మృతి చేయండి అని సమ్ముఖంగా చెప్తున్నారు. త్రిమూర్తి చిత్రం చాలా బాగుంటుంది, ఈ చిత్రాన్ని సదా జేబులో పెట్టుకోండి. పదే-పదే చూస్తూ ఉన్నట్లయితే స్మృతి ఉంటుంది. బాబా భక్తునిగా ఉన్నప్పుడు లక్ష్మీ-నారాయణుల ఫోటోను జేబులో పెట్టుకునేవారు. గద్దె కింద కూడా వారితో పాటు పెట్టుకునేవారు, దాని వలన ఏమీ లభించలేదు. ఇప్పుడు బాబా నుండి చాలా ప్రాప్తి లభిస్తుంది, వారినే స్మృతి చేయాలి. ఇందులో మాయ ఎదుర్కుంటుంది. జ్ఞానాన్ని అయితే చాలా వింటారు, వినిపిస్తారు, ఇందులో చురుకుగా వెళ్తారు. 84 జన్మల చక్రాన్ని మర్చిపోతామని అనరు. అలాగని, ఇక్కడ ఉండేవారు ఎక్కువగా స్మృతి చేస్తారని కూడా కాదు. ఇక్కడ ఉంటూ కూడా దుమ్ము-ధూళితో సమానమైనవాటిని గుర్తు చేస్తూ ఉండేవారు చాలామంది ఉంటారు. మనం ఏ తండ్రి ద్వారానైతే సుందరంగా అయ్యేందుకు వచ్చామో, వారి గురించే తెలియదు. మాయ నీడ చాలా పడుతుంది. స్మృతియే ముఖ్యమైన విషయము. చాలా మంచి-మంచి పిల్లలు కూడా స్మృతిలో ఉండరని బాబాకు తెలుసు. యోగంలో ఉండటంతోనే దేహాభిమానం తగ్గుతుంది, చాలా మధురంగా ఉంటారు. దేహాభిమానం ఉన్నట్లయితే మధురంగా అవ్వరు, విసుక్కుంటూ ఉంటారు. బాబా అందరి కోసం చెప్పడం లేదు. కొందరు సుపుత్రులు కూడా ఉన్నారు. ఎవరైతే యోగంలో ఉంటారో, వారిని సుపుత్రులుగా భావించడం జరుగుతుంది. వారి ద్వారా ఎలాంటి తప్పుడు పని జరగదు. మిత్ర-సంబంధీకులు మొదలైన వారందరినీ మర్చిపోతారు. మనం వివస్త్ర (అశరీరి)గా వచ్చాము, ఇప్పుడు అశరీరిగా అయి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం యొక్క మూడవ నేత్రం లభించింది, దాని ద్వారా మీరు మీ ఇంటిని తెలుసుకుంటారు, రాజధానిని కూడా తెలుసుకుంటారు. వారు చూపించినట్లుగా శివబాబా నల్లని లింగమేమీ కాదని పిల్లలైన మీకు తెలుసు. వారు బిందువులా ఉంటారు. ఇది కూడా మనకు తెలుసు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్తాము. అక్కడ మనం అశరీరులుగా ఉంటాము. ఇప్పుడు మనం అశరీరులుగా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పతితపావనుడైన తండ్రిని స్మృతి చేయాలి. మీకు ఇలా అర్థం చేయించడం జరుగుతుంది – ఆత్మ అవినాశీ, అందులో 84 జన్మల పాత్ర నిశ్చయించబడి ఉంది, అది ఎప్పుడూ అంతం కాదు. కొంత సమయం ముక్తిధామానికి వెళ్ళి మళ్ళీ పాత్రలోకి వస్తారు. మీరు ఆల్ రౌండ్ పాత్రను అభినయిస్తారు, ఇది సదా గుర్తుండాలి. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. బాబాను స్మృతి చేయడంతో మనం తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవుతాము. ఇక్కడ వ్యాపార-వ్యవహారాలను గుర్తు చేసుకోకూడదు. ఇక్కడ మీరు పూర్తిగా సంగమయుగంలో ఉన్నారు. ఇప్పుడు మీరు నావలో కూర్చున్నారు. కొందరు మధ్యలో దిగిపోతారు, అప్పుడు చిక్కుకొని మరణిస్తారు. దీని గురించి కూడా శాస్త్రాలలో ఒక కథ ఉంది. ఇప్పుడు మీకు తెలుసు – మనం అవతలి తీరానికి వెళ్తున్నాము, నావికుడు శివబాబా. కృష్ణుడిని నావికుడు లేక తోట యజమాని అని అనరు. శివ భగవానువాచ. పతితపావనుడు శివబాబా. కృష్ణుని వైపుకు బుద్ధి వెళ్ళజాలదు. మనుష్యుల బుద్ధి అయితే భ్రమిస్తూ ఉంటుంది, బాబా వచ్చి భ్రమించడం నుండి విడిపిస్తారు. కేవలం ఈ విషయమే చెప్తారు – స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేయండి, అప్పుడే మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఈ విషయాలను మర్చిపోకూడదు. ఇక్కడ నుండి మీరు చాలా రిఫ్రెష్ అయ్యి వెళ్తారు. మీ అనుభవాన్ని కూడా వినిపిస్తారు – బాబా, మేము మళ్ళీ ఎలా ఉన్నామో అలాగే అయిపోతాము, మిత్ర-సంబంధీకులు మొదలైనవారి ముఖాలను చూస్తాము, ఆకర్షణకు లోనవుతాము. పిల్లలైన మీరు ప్రేయసులు, కార్య-వ్యవహారాలు చేసుకుంటూ ప్రియుడిని స్మృతి చేయండి, అప్పుడు ఉన్నత పదవిని పొందుతారు. ఒకవేళ ఇప్పుడు పురుషార్థం చేయకపోతే, సింగిల్ కిరీటం కూడా లభించదు. పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు సమయం వృథా చేయకూడదు. ఇక్కడ ఇంకేమీ ఉండదు. కేవలం దిల్వాడా మందిరం మీ స్మృతి చిహ్నము, అది మీరు చూడవచ్చు. పైన వైకుంఠము ఉంది. మీ కల్పవృక్షము కూడా స్పష్టంగా ఉంది. కింద రాజయోగంలో కూర్చున్నారు, పైన రాజ్యం ఉంది. దిల్ వాలా మందిరం లాగే తయారై ఉంది. శివబాబా మనకు మళ్ళీ జ్ఞానాన్నిచ్చి స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తున్నారని మీకు తెలుసు. ఈ కలియుగ వినాశనం జరగనున్నది. ఈ ఆది దేవ్, ఆది నాథ్ ఎవరు? మీకు అందరి కర్తవ్యాల గురించి తెలుసు కదా. ఈ సమయంలోని చర్చ మళ్ళీ భక్తి మార్గంలో నడుస్తుంది. పండుగలు, వ్రతాలు అన్నీ ఈ సమయానికి చెందినవే. సత్యమైన వ్రతం మన్మనాభవ. అంతేకానీ, నీళ్లు తాగకుండా ఉండడం, భోజనం తినకుండా ఉండడం – ఇవేవీ వ్రతాలు కావు. ప్రపంచంలో ఈ సమయంలో మాయ యొక్క ఆర్భాటం చాలా ఉంది. ఇంతకుముందు ఈ విద్యుత్తు, గ్యాస్ మొదలైనవి ఉండేవి కావు, తర్వాత వెలువడ్డాయి. 100 సంవత్సరాలయింది, వీటిలో మనుష్యులు చిక్కుకుపోయారు. మాకైతే స్వర్గం ఇక్కడే ఉంది అని అంటారు. మాయ జోరు ఎంతగా ఉందంటే, తండ్రిని అసలు స్మృతే చేయరు. మేము స్వర్గంలో ఎలా కూర్చొని ఉన్నామో మీరు వచ్చి చూడండి అని అంటారు. ఇప్పుడు స్వర్గం ముందు అయితే అసలు ఇవేమీ కానే కాదు. స్వర్గమెక్కడ, నరకమెక్కడ. స్వర్గంలోని ఒక్క వస్తువు కూడా ఇక్కడ ఉండజాలదు. అక్కడ ప్రతి వస్తువు సతోప్రధానంగా ఉంటుంది. ఆవులు కూడా ఫస్ట్ క్లాసుగా ఉంటాయి. మీరు కూడా ఫస్ట్ క్లాస్ గా అవుతారు కనుక మీ ఫర్నీచర్, ఆహార-పానీయాలు మొదలైనవన్నీ ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి. సూక్ష్మవతనంలో ఫలాలు మొదలైనవి చూసి వస్తారు కదా. పేరు కూడా శూబీరసం అని పెడతారు. ప్రపంచం వారికి స్వర్గం ఎక్కడ ఉంది అన్న విషయం కూడా తెలియదు. అక్కడ అంతా సతోప్రధానంగా ఉంటుంది. ఈ మట్టి మొదలైనవి అక్కడ ఉండవు. దుఃఖం యొక్క విషమేమీ ఉండదు. కానీ పిల్లలకు ఈ నషా ఇప్పుడు ఇంకా ఎక్కలేదు – బాబా మమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేయడానికి ఈ చదువును చదివిస్తున్నారు అని. చిత్రాలు ఎంత స్పష్టంగా ఉన్నాయి. చిత్రాలు తయారవ్వడానికి సమయమైతే పడుతుంది. బాబా అన్నీ సేవ కోసం తయారుచేయిస్తూనే ఉంటారు. కానీ కొంతమందైతే తమ వ్యాపార-వ్యవహారాలలో ఎంతగా చిక్కుకొని ఉన్నారంటే బాబాను స్మృతి కూడా చేయరు. ప్రదర్శనీ చిత్రాల మ్యాగజీన్ కూడా ఉంది, అది కూడా చదవాలి. గీతను చదివే నియమమున్నవారు ఎక్కడికి వెళ్ళినా సరే, గీతను తప్పకుండా చదువుతారు. ఇప్పుడు మీకు సత్యమైన గీత చిత్రాల సహితంగా లభించింది. ఇప్పుడు మంచి రీతిలో శ్రమించాలి. లేదంటే ఉన్నత పదవిని పొందలేరు. తర్వాత సాక్షాత్కారాలు జరిగినప్పుడు అయ్యో-అయ్యో అని అనవలసి ఉంటుంది. పరీక్ష పూర్తయ్యాక తర్వాత క్లాసులో నంబరువారుగా కూర్చుంటారు. ఇక్కడ కూడా సాక్షాత్కారాలు జరిగినప్పుడు, నంబరువారుగా రుద్రమాలలోకి, ఆ తర్వాత విజయమాలలోకి వెళ్తారు. స్కూలులో కొంతమంది పిల్లలు ఫెయిల్ అయినప్పుడు ఎంత దుఃఖితులుగా అవుతారు. మీది కల్ప-కల్పపు ఆట.
చాలామంది పిల్లలు పూర్తి మ్యాగజీన్ ను చదవరు. పిల్లలు మ్యాగజీన్ ను చదివి సేవ చేయాలి. బాబా, ఫలానా వారిని బదిలీ చేయండి, మంచి బ్రాహ్మణీని పంపించండి అని రాస్తారు. కొంతమంది బ్రాహ్మణీల పట్ల ఎంత ప్రేమ ఏర్పడుతుందంటే బ్రాహ్మణీ బదిలీ అయితే కింద పడిపోతారు. సెంటరుకు రావడమే మానేస్తారు. ఏదైనా తప్పుడు కర్మ జరిగినట్లయితే సత్యతలో వెంటనే బాబాకు రాయాలి, అప్పుడు పాపం యొక్క ప్రభావం తగ్గుతుంది. లేదంటే వృద్ధి అవుతూ ఉంటుంది. బాబా సరిదిద్దేందుకు చెప్తారు, కానీ కొందరికి బాగుపడేది లేదు అంటే పాప కర్మలు చేయడం వదలనే వదలరు. భాగ్యంలో లేకపోతే బాబాకు సత్యమైన సమాచారాన్ని ఇవ్వరు. బాబా వద్దకు రిపోర్టు వస్తే, సరిదిద్దేందుకు ప్రయత్నిస్తారు. అచ్ఛా.
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. అశరీరులుగా అయ్యేందుకు పూర్తి అభ్యాసం చేయాలి. ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదు. చాలా మధురంగా అవ్వాలి. ఏ విషయంలోనూ విసుక్కోకూడదు.
2. మురళీని స్మరణ చేయాలి. ఏదైతే వింటారో దానిపై విచార సాగర మథనం చేయాలి. మన్మనాభవ యొక్క వ్రతాన్ని పెట్టుకోవాలి.
వరదానము:-
ఏ పిల్లల మస్తకంపై, ఆజ్ఞాకారీ అనే స్మృతి యొక్క తిలకం దిద్దబడి ఉందో, ఒక్క సంకల్పం కూడా ఆజ్ఞ లేకుండా చేయరో, వారికి ఫస్ట్ ప్రైజ్ ప్రాప్తిస్తుంది. ఎలాగైతే సీతకు గీత లోపల కూర్చోవాలి అనే ఆజ్ఞ లభించిందో, అలా ప్రతి అడుగు వేస్తూ, ప్రతి సంకల్పం చేస్తూ తండ్రి ఆజ్ఞ అనే గీత లోపల ఉన్నట్లయితే సదా సురక్షితంగా ఉంటారు. ఏ రకమైన రావణుడి సంస్కారాలు దాడి చేయవు మరియు సమయం కూడా వ్యర్థంగా పోదు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!