22 June 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

June 21, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - తండ్రి స్వర్గానికి పునాది వేస్తున్నారు, పిల్లలైన మీరు సహాయకులుగా అయి తమ వాటాను జమ చేసుకోండి. ఈశ్వరీయ మతముపై నడుస్తూ శ్రేష్ఠ ప్రారబ్ధాన్ని తయారుచేసుకోండి’’

ప్రశ్న: -

బాప్ దాదా సదా ఎటువంటి పిల్లలను వెతుకుతూ ఉంటారు?

జవాబు:-

ఎవరైతే చాలా-చాలా మధురమైన శీతల స్వభావము కల సర్వీసబుల్ పిల్లలుగా ఉంటారో, అటువంటి పిల్లలను తండ్రి వెతుకుతూ ఉంటారు. సర్వీసబుల్ పిల్లలే తండ్రి పేరును ప్రసిద్ధము చేస్తారు. తండ్రికి ఎంతగా సహాయకులుగా, ఆజ్ఞాకారులుగా, విశ్వాసపాత్రులుగా అవుతారో, అంతగా వారు వారసత్వానికి హక్కుదారులుగా అవుతారు.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. ఓం అర్థాన్ని ఎవరు తెలిపారు? తండ్రి తెలిపారు. బాబా అని అంటున్నారంటే వారికి పేరు తప్పకుండా ఉండాలి కదా. సాకారంలో ఉన్నవారైనా, నిరాకారుడైనా పేరు తప్పకుండా ఉండాలి. మిగిలిన ఆత్మలు ఎవరైతే ఉన్నారో, వారికి పేరు ఉండదు. ఆత్మ ఎప్పుడైతే జీవాత్మగా అవుతుందో, అప్పుడు శరీరానికి పేరు పెట్టడం జరుగుతుంది. బ్రహ్మా దేవతాయ నమః అని అంటారు. విష్ణువును కూడా దేవత అని అంటారు ఎందుకంటే ఆకారీగా ఉన్నారు కావున ఆకారీ శరీరానికి పేరు పెట్టడం జరుగుతుంది. పేరు ఎల్లప్పుడూ శరీరానికే పెట్టడం జరుగుతుంది. కేవలం ఒక్క నిరాకార పరమపిత పరమాత్మ ఉన్నారు, వారి పేరు శివ. ఈ ఆత్మ ఒక్కరికే పేరు ఉంది, మిగిలిన అందరికీ దేహాలకు పేరు పెట్టడం జరుగుతుంది. శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే మళ్ళీ పేరు మారుతుంది. పరమాత్మకు ఒక్క పేరే ఉంటుంది. ఎప్పుడూ మారదు. వారు ఎప్పుడూ జనన-మరణాలలోకి రారు అని దీని ద్వారా ఋజువు అవుతుంది. ఒకవేళ స్వయమే జనన-మరణాలలోకి వచ్చినట్లయితే ఇతరులను జనన-మరణాల నుండి విడిపించలేరు. అమరలోకంలో ఎప్పుడూ జననము-మరణము అని అనరు. అక్కడైతే చాలా సహజ రీతిలో ఒక శరీరాన్ని విడిచి మరొకదానిని తీసుకుంటారు. మరణించడము ఇక్కడ ఉంది. సత్యయుగంలో ఫలానావారు మరణించారు అని ఇలా అనరు. మరణించడము అన్న పదము దుఃఖానికి సంబంధించినది. అక్కడైతే పాత శరీరాన్ని విడిచిపెట్టి కిశోర అవస్థలో ఉన్న ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు. సంతోషాలు జరుపుకుంటారు. పాత ప్రపంచంలో ఎంతమంది మనుష్యులు ఉన్నారు, వీరంతా సమాప్తమవ్వనున్నారు. యాదవులు మరియు కౌరవులు ఉండేవారు, యుద్ధంలో వారు సమాప్తమైపోయారు అని చూపిస్తారు, అయితే, పాండవులకు దుఃఖము కలిగి ఉంటుందా? లేదు. పాండవులదైతే రాజ్య స్థాపన జరిగింది. ఈ సమయంలో మీరు బ్రహ్మా వంశావళి బ్రాహ్మణులు, బ్రహ్మాకుమారులు మరియు కుమారీలు. బ్రహ్మాకు ఇంతమంది పిల్లలున్నారు కనుక తప్పకుండా ప్రజాపిత అయినట్లు. బ్రహ్మా, విష్ణు, శంకరులకు తండ్రి శివుడు. వారినే భగవంతుడు అని అంటారు. ఈ సమయంలో మనం ఈశ్వరీయ కులానికి చెందినవారమని మీకు తెలుసు. మనం బాబాతో పాటు బాబా ఇల్లు అయిన నిర్వాణధామానికి వెళ్తాము. బాబా వచ్చి ఉన్నారు. వారిని ప్రియుడు అని కూడా అంటారు. కానీ ఖచ్ఛితమైన సంబంధంలో వారు తండ్రి ఎందుకంటే వారసత్వం ప్రేయసులకు లభించదు. వారసత్వం పిల్లలు తీసుకుంటారు. కనుక తండ్రి అని అనడము సరైనది. తండ్రిని మర్చిపోవడంతోనే మనుష్యులు నాస్తికులుగా అయ్యారు. కృష్ణుని చరిత్ర అని అంటూ ఉంటారు. కానీ కృష్ణుని చరిత్ర అనేది ఏమీ లేదు. భాగవతంలో కృష్ణుని చరిత్ర ఉంది కానీ చరిత్ర శివబాబాది ఉండాలి. వారు కూడా తండ్రి, టీచరు, సద్గురువు. ఇందులో చరిత్ర యొక్క విషయం ఏముంది? కృష్ణుని చరిత్ర కూడా ఏమీ ఉండదు. ఏ విధంగానైతే చిన్న పిల్లలు ఉంటారో, అలా వారు కూడా చిన్న పిల్లవాడు. పిల్లలు ఎల్లప్పుడూ చంచలంగా ఉంటారు కావున అందరికీ ప్రియంగా అనిపిస్తారు. కృష్ణుడి కోసం కుండలు పగలకొట్టినట్లుగా ఏదైతే చూపిస్తారో, అటువంటిదేమీ లేదు. శివబాబాకు చరిత్ర ఏముంది? అదైతే మీరు చూస్తారు, చదివించి పతితము నుండి పావనముగా చేస్తారు. భక్తి మార్గంలో నేను మీ భావనను పూర్తి చేస్తాను అని అంటారు. ఇకపోతే, ఇక్కడైతే నేను చదివిస్తాను. ఈ సమయంలో ఎవరైతే నా పిల్లలుగా ఉన్నారో, వారే నన్ను స్మృతి చేస్తారు. మిగిలినవారందరి స్మృతిని మర్చిపోయి ఒక్క తండ్రి స్మృతిలో ఉండే ప్రయత్నం చేస్తారు. నేను సర్వవ్యాపిని కాదు. నన్ను ఎవరైతే స్మృతి చేస్తారో, నేను కూడా వారిని స్మృతి చేస్తాను. అది కూడా పిల్లలనే స్మృతి చేస్తాను. ముఖ్యమైన విషయము ఒక్కటే – ఎప్పుడైతే ఎవరైనా పెద్ద వ్యక్తికి అర్థం చేయించి చూపిస్తారో, అప్పుడు ధైర్యవంతులు అని అంటారు. గీత పైనే అంతా ఆధారపడి ఉంది. గీత నిరాకార పరమపిత పరమాత్మునిది అని అంటారు, అంతేకానీ, మనుష్యులది కాదు. భగవంతుడిని రుద్రుడు అని కూడా అంటారు. కృష్ణుడిని రుద్రుడు అని అనరు. రుద్ర జ్ఞాన యజ్ఞముతోనే వినాశ జ్వాల వెలువడింది.

చాలా మంది పరమాత్మను యజమాని అని అంటూ స్మృతి చేస్తారు. ఆ యజమానికి పేరు లేదు అని అంటారు. అచ్ఛా, అయితే ఆ యజమాని ఎక్కడ ఉన్నారు. వారేమైనా విశ్వానికి, మొత్తం సృష్టికి యజమానినా? పరమపిత పరమాత్మ అయితే సృష్టికి యజమానిగా అవ్వరు. సృష్టికి యజమానులుగా అయితే దేవీ-దేవతలు అవుతారు. పరమపిత పరమాత్మ అయితే బ్రహ్మాండానికి యజమాని. బ్రహ్మతత్వము తండ్రి యొక్క ఇల్లు. పిల్లలైన మనకు కూడా ఇల్లు. బ్రహ్మాండము తండ్రి ఇల్లు. అక్కడ ఆత్మలను అండాకారములో చూపిస్తారు. ఈ విధంగా ఎవ్వరూ ఉండరు. ఆత్మలైన మనము జ్యోతిర్బిందువులము, అక్కడ నివసిస్తాము. తర్వాత పాత్రను అభినయించడానికి బ్రహ్మాండము నుండి మనము కిందకు దిగుతాము. మనము ఒకరి వెనుక ఒకరు వస్తూ ఉంటాము. వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. బాబా బీజ రూపుడు, పునాది దేవీ-దేవతలది అనండి లేదా బ్రాహ్మణులది అనండి, బ్రాహ్మణులు బీజాన్ని వేస్తారు. బ్రాహ్మణులే తర్వాత దేవతలుగా అయి, రాజ్యం చేస్తారు. ఇప్పుడు మన ద్వారా శివబాబా పునాది వేస్తున్నారు. దేవీ-దేవతా ధర్మము అనగా స్వర్గం యొక్క పునాది వేయబడుతూ ఉంది. ఎవరు ఎంతగా సహాయకులుగా అవుతారో, అంతగా వారు తమ వాటాను తీసుకుంటారు లేదంటే సూర్యవంశీయులుగా ఎలా అవుతారు! ఇప్పుడు మీరు ఆ ఉన్నతమైన ప్రారబ్ధాన్ని తయారుచేసుకుంటున్నారు. ప్రతి ఒక్క మనిషి పురుషార్థంతో ప్రారబ్ధాన్ని తయారుచేసుకుంటూ ఉంటారు. ప్రారబ్ధాన్ని తయారుచేసుకోవడానికి మంచి పనులు చేయడం జరుగుతుంది. దాన-పుణ్యాలు చేయడము, ధర్మశాలలు మొదలైనవి నిర్మించడము, అన్నీ ఈశ్వరార్థమే చేస్తారు ఎందుకంటే వాటికి ఫలాన్ని ఇచ్చేది వారే. మీరిప్పుడు శ్రీమతముపై పురుషార్థము చేస్తున్నారు. మిగిలిన ప్రపంచమంతా మనుష్య మతముపై పురుషార్థము చేస్తుంది. అది కూడా ఆసురీ మతము. ఈశ్వరీయ మతము తర్వాత దైవీ మతము, ఆ తర్వాత ఆసురీ మతము ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీకు ఈశ్వరీయ మతం లభిస్తుంది. బాబా-మమ్మా కూడా వారి మతము ద్వారా శ్రేష్ఠంగా అవుతారు. మనుష్యులెవ్వరూ దేవతల వలె శ్రేష్ఠంగా అవ్వనే అవ్వలేరు. దేవతలను శ్రేష్ఠంగా తయారుచేసేవారు ఎవరు? ఇక్కడైతే ఎవ్వరూ శ్రేష్ఠంగా లేరు. శ్రీ శ్రీ అయితే ఒక్కరే. వారే అందరికన్నా ఉన్నతోన్నతమైన తండ్రి, టీచరు, సద్గురువు. వారే మళ్ళీ శ్రీ లక్ష్మీ-నారాయణులను తయారుచేస్తారు. సీతా-రాములను కూడా శ్రీ సీతా, శ్రీ రామా అని అంటారు. కానీ ఆ పేర్ల వెనుక క్షత్రియులు, చంద్రవంశీయులు అని చేరుస్తారు. ఆ లక్ష్మీ-నారాయణులైతే 16 కళల సంపూర్ణులు, సూర్యవంశీ దేవతా కులానికి చెందినవారు మరియు సీతా-రాములు 14 కళల చంద్రవంశీయులు. 2 కళలు తగ్గిపోయాయి కదా. అలా తప్పకుండా జరగాల్సిందే. సృష్టి యొక్క దిగే కళ జరుగుతుందని మనుష్యులకు తెలియదు. 16 కళల నుండి 14 కళలుగా అయినప్పుడు దిగజారినట్లు కదా. ఈ సమయంలో పూర్తిగా దిగజారిపోయారు. ఇది రావణ సంప్రదాయము. రావణ రాజ్యము కదా. రావణుని మతాన్ని ఆసురీ మతము అని అంటారు. అందరూ పతితులుగా ఉన్నారు. ఈ పతిత ప్రపంచంలో పావనమైనవారు ఎవ్వరూ ఉండలేరు. భారతవాసులు ఎవరైతే పావనంగా ఉండేవారో, వారే మళ్ళీ పతితంగా అయ్యారు. మళ్ళీ వారిని నేను వచ్చి పావనంగా తయారుచేస్తాను. పతిత-పావనుడు అని కృష్ణుడికి మహిమ లేదు. చరిత్ర యొక్క విషయము కూడా లేదు. పతిత-పావనుడు అని ఒక్క పరమాత్మనే అంటారు. చివర్లో అందరూ అహో ప్రభూ, మీ గతి-మతి అతీతమైనది, మీ రచన గురించి ఎవ్వరికీ తెలియదు అని అంటారు. అది కూడా ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఈ జ్ఞానం పూర్తిగా కొత్తది. ఏదైనా కొత్తగా వెలువడినప్పుడు ప్రారంభంలో కొద్దిగా ఉంటుంది, తర్వాత వృద్ధి చెందుతూ ఉంటుంది. మీరు కూడా మొదట ఒక మూలలో ఉండేవారు. ఇప్పుడు దేశ-దేశాంతరాలలో వృద్ధి చెందుతూ ఉన్నారు. రాజధాని స్థాపన తప్పకుండా అవ్వాల్సిందే. ముఖ్యమైన విషయము – గీతా భగవంతుడు శ్రీ కృష్ణుడు కాదు అని నిరూపించాలి. వారసత్వం తండ్రి ఇస్తారు, కృష్ణుడు కాదు. లక్ష్మీ-నారాయణులు కూడా తమ పిల్లలకు వారసత్వాన్ని ఇస్తారు. అది కూడా ఇక్కడి పురుషార్థానికి ప్రారబ్ధము లభిస్తుంది. సత్య, త్రేతా యుగాలలో అనంతమైన వారసత్వం ఉంటుంది. గోల్డెన్, సిల్వర్ జూబ్లీని జరుపుకుంటారు. ఇక్కడైతే ఒక్క రోజు జరుపుకుంటారు. మనమైతే 1250 సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీని జరుపుకుంటాము. సంతోషంగా ఉత్సవాలు జరుపుకుంటాము కదా. సంపన్నముగా అవుతాము. కావున లోపల చాలా సంతోషం ఉండాలి. కేవలం బయట దీపాలు మొదలైనవి వెలిగించడము కాదు. స్వర్గంలో మనం పూర్తిగా ధనవంతులుగా, చాలా సుఖమయంగా ఉంటాము. దేవతా ధర్మము వంటి సుఖమయమైనది ఇంకేదీ ఉండదు. సిల్వర్ జూబ్లీ మొదలైనవాటిని కూడా పూర్తిగా అర్థము చేసుకోరు. ఇప్పుడు మీరు అర్ధకల్పము యొక్క జూబ్లీని జరుపుకోవడము కోసం తండ్రి నుండి వారసత్వం పొందుతున్నారు. కావున అర్థము చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయము ఇదే, గీతా భగవంతుడు శివుడు. వారే రాజయోగాన్ని నేర్పించారు. అది మళ్ళీ ఇప్పుడు నేర్పిస్తున్నారు. ఎప్పుడైతే రాజ్యం ఉండదో, అప్పుడే నేర్పిస్తారు. ప్రజలపై ప్రజా రాజ్యం ఉంది. ఒకరి టోపి ఒకరు దించడంలో ఆలస్యం చేయరు. పిల్లలైన మీరు వారి మతముపై నడుచుకోవడం ద్వారా సుఖధామానికి యజమానిగా అవుతారు. చాలామంది ఎలా ఉన్నారంటే, జ్ఞానాన్ని పూర్తిగా ధారణ చేయరు, కానీ సెంటరుకు వస్తూ ఉంటారు. ఒక బిడ్డకైనా జన్మనివ్వాలి అని మనసులో కోరిక ఉంటుంది. వివాహం చేసుకొని ఒక బిడ్డ యొక్క సుఖాన్ని తీసుకోవాలి అని మాయ ప్రలోభము ఉంటుంది. అరే, బిడ్డ సుఖమే ఇస్తాడు అని గ్యారెంటీ ఏమైనా ఉందా. రెండు నాలుగు సంవత్సరాలలో బిడ్డ మరణించినట్లయితే ఇంకా దుఃఖితులుగా అవుతారు. ఈ రోజు ఆడంబరంగా ఉత్సవము జరుపుకుంటారు, రేపు చితి పైకి ఎక్కితే ఏడుస్తూ పెడబొబ్బలు పెట్టాల్సి వస్తుంది. ఇది ఉన్నదే దుఃఖధామము. చూడండి, ఆహారం కూడా ఎలాంటిది తింటారు. కనుక తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలూ, అటువంటి ఆశలు పెట్టుకోకండి. మాయ చాలా తుఫానులు తీసుకొస్తుంది. ఒక్క క్షణంలో వికారాల్లోకి పడేస్తుంది. తర్వాత రావడానికి కూడా సిగ్గుగా అనిపిస్తుంది. కులాన్ని కళంకితము చేసారంటే వారసత్వం ఏం తీసుకుంటారు అని అందరూ అంటారు. బాబా-మమ్మా అని అంటున్నారంటే బ్రహ్మాకుమార-కుమారీలు పరస్పరంలో సోదరీ-సోదరులుగా అవుతారు. మళ్ళీ ఒకవేళ వికారాల్లోకి పడిపోయినట్లయితే అటువంటి కుల కళంకితులు ఇంకా 100 రెట్లు కఠినమైన శిక్షలను అనుభవిస్తారు మరియు పదవి కూడా భ్రష్టమైపోతుంది. కొంతమంది వికారాల్లోకి వెళ్ళి తర్వాత చెప్పకపోతే, చాలా శిక్షలకు పాత్రులవుతారు. ధర్మరాజు అయిన బాబా ఎవ్వరినీ విడిచిపెట్టరు. ఆ మనుష్యులైతే జైలులో శిక్షలు అనుభవిస్తారు కానీ ఇక్కడివారి కోసమైతే చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. ఇటువంటివారు కూడా సెంటర్లకు చాలామంది వస్తారు. ఇటువంటి పని చేయకండి అని తండ్రి అర్థం చేయిస్తారు. మేము ఈశ్వరీయ సంతానము అని అంటారు, మళ్ళీ వికారాల్లోకి వెళ్ళడము, ఇదైతే మీకు మీరే సర్వనాశనం చేసుకోవడము అవుతుంది. ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే తండ్రికి చెప్పండి. వికారాలు లేకుండా ఉండలేకపోతే ఇక్కడకు రాకుండా ఉండడము మంచిది. లేదంటే వాయుమండలము పాడవుతుంది. మీ మధ్యన ఎవరైనా కొంగ వంటివారు లేదా అశుద్ధమైనది తినేవారు కూర్చుంటే ఎంత అయిష్టంగా అనిపిస్తుంది. తండ్రి అంటారు, అటువంటివారిని తీసుకొచ్చేవారిపై దోషము ఏర్పడుతుంది. ప్రపంచంలో అటువంటి సత్సంగాలైతే చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి భక్తి చేయండి. భక్తి కోసం మేము వద్దని అనము. భగవంతుడు పవిత్రంగా తయారుచేయడము కోసము, పవిత్ర వైకుంఠం యొక్క వారసత్వాన్ని ఇవ్వడం కోసము వస్తారు. తండ్రి అంటారు, కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. అంతే, ఆహార-పానీయాల పథ్యం యొక్క యుక్తులను కూడా చెప్తారు. పథ్యం కోసం చాలా రకాల యుక్తులు కూడా పెట్టుకోగలరు, ఇలా చెప్పవచ్చు, ఆరోగ్యం బాగోలేదు, డాక్టరు వద్దన్నారు. అచ్ఛా, మీరు అడుగుతున్నారు కనుక మేము ఫలాలు తీసుకుంటాము. స్వయాన్ని రక్షించుకోవడము కోసం ఇలా చెప్పడము అసత్యము కాదు. బాబా వద్దని అనరు. ఎవరైతే పూర్తిగా మధురంగా ఉంటారో, ఎటువంటి పాత స్వభావము ఉండదో, సర్వీసబుల్ గా, విశ్వాసపాత్రులుగా, ఆజ్ఞాకారులుగా ఉంటారో, అటువంటి పిల్లలను బాబా వెతుకుతారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ మాయావీ ప్రపంచంలో ప్రతి విషయంలో దుఃఖం ఉంది. అందుకే ఈ పాత ప్రపంచంతో ఎటువంటి ఆశ పెట్టుకోకూడదు. మాయ యొక్క తుఫానులు వచ్చినా కానీ ఎప్పుడూ కుల కళంకితులుగా అవ్వకూడదు.

2. ఆహార-పానీయాలలో చాలా పథ్యం ఉండాలి. పార్టీలు మొదలైనవాటికి వెళ్ళినప్పుడు చాలా యుక్తిగా నడుచుకోవాలి.

వరదానము:-

మొత్తం విషయమంతా చెడుగా ఉండవచ్చు, కానీ అందులో కూడా ఒకటి రెండు మంచి విషయాలు తప్పకుండా ఉంటాయి. పాఠం చదివించే మంచి అయితే ప్రతి విషయంలో ఇమిడి ఉంటుంది ఎందుకంటే ప్రతి విషయము అనుభవజ్ఞులుగా తయారుచేయడానికి నిమిత్తంగా అవుతుంది. ఓర్పు యొక్క పాఠాన్ని చదివిస్తుంది. ఇతరులు ఆవేశపడుతున్నారు కానీ మీరు ఆ సమయంలో ఓర్పు లేక సహనశీలతా పాఠాన్ని చదువుతున్నారు. అందుకే ఏది జరుగుతుందో అది మంచిది, ఏది జరిగేది ఉందో అది ఇంకా మంచిది అని అంటారు. మంచిని తీసుకోవడానికి కేవలం బుద్ధి కావాలి. చెడును చూడకుండా మంచిని స్వీకరించినట్లయితే నంబరువన్ గా అవుతారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top