22 June 2021 TELUGU Murli Today | Brahma Kumaris
22 june 2021 Read and Listen today’s Gyan Murli in Telugu
21 June 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - ఈ ప్రపంచంలో నిష్కామ సేవను కేవలం ఒక్క తండ్రి మాత్రమే చేస్తారు, ఇకపోతే మీరు చేసే కర్మలన్నింటికీ తప్పకుండా ఫలం లభిస్తుంది”
ప్రశ్న: -
డ్రామానుసారంగా, పిల్లలైన మీకు సంతోషం కలిగించే ఏ విషయం, 100 శాతం నిశ్చితము?
జవాబు:-
డ్రామానుసారంగా కొత్త రాజధాని స్థాపనవ్వడమనేది నిశ్చితము. శ్రీమతాన్ని అనుసరించి మేము మా కోసం మా రాజధానిని స్థాపన చేసుకుంటున్నామనే సంతోషం పిల్లలైన మీకు ఉంది. ఈ పాత ప్రపంచ వినాశనం జరగాల్సిందే. పిల్లలైన మీరు ఎంతగా పురుషార్థం చేస్తారో, అంత ఉన్నత పదవి ప్రాప్తిస్తుంది.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
మిమ్మల్ని పొంది మేము ప్రపంచాన్ని పొందాము….. (తుమ్ హే పాకే హమ్ నే…..)
ఓంశాంతి. పిల్లలు ఏమంటారో, బాబా కూడా అదే అంటారు. పిల్లలంటారు – బాబా, మిమ్మల్ని పొంది మేము స్వర్గానికి యజమానులుగా అవుతాము. తండ్రి కూడా అంటారు – పిల్లలూ, మన్మనాభవ. విషయం ఒక్కటే అయినట్లు. ఈ సత్సంగానికి వెళ్ళడం వలన బ్రహ్మాకుమార-కుమారీలకు ఏమి లభిస్తుందని మనుష్యులందరూ అడుగుతారు. అప్పుడు, మేము బాప్ దాదా ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతామని బ్రహ్మాకుమార-కుమారీలంటారు. ఇతరులెవరూ విశ్వానికి యజమానులుగా అవ్వలేరు. ఈ లక్ష్మీ నారాయణులే విశ్వానికి యజమానులు. శివబాబా విశ్వానికి యజమానిగా అవ్వలేరు. పిల్లలైన మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. మీ తండ్రి విశ్వానికి యజమానిగా అవ్వరు. ఇటువంటి నిష్కామ సేవను చేసేవారు ఇంకెవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరికి తాము చేసిన సేవకు తప్పకుండా ఫలం లభిస్తుంది. భక్తి మార్గంలో లేదా ఇంకే రకంగానైనా ఎవరైనా ఏమైనా చేస్తే….. సోషల్ వర్కర్లకు కూడా సేవా ఫలం తప్పకుండా లభిస్తుంది. గవర్నమెంట్ నుండి జీతం లభిస్తుంది. తండ్రి అంటారు – నేను ఒక్కడిని మాత్రమే నిష్కామ సేవ చేస్తాను, పిల్లలను విశ్వానికి యజమానులుగా చేస్తాను కానీ నేను అలా అవ్వను. పిల్లలను సుఖవంతులుగా చేసి, సుఖధామానికి యజమానులుగా చేసి, 21 జన్మల సుఖాన్నిచ్చి, నేను నా నిర్వాణధామంలో వానప్రస్థ అవస్థలో కూర్చుండిపోతాను. వానప్రస్థం అని మూలవతనాన్నే అంటారు. మనుష్యులు వానప్రస్థం తీసుకుంటారు. పిల్లలకు అంతా ఇచ్చేసి, సత్సంగాలు మొదలైనవాటికి వెళ్తారు. ముక్తికి మార్గాన్ని తెలియజేస్తారని గురువులను ఆశ్రయిస్తారు. ముక్తి-జీవన్ముక్తుల మార్గాన్ని మనుష్యమాత్రులెవరూ ఎప్పుడూ ఎవరికీ తెలియజేయలేరని పిల్లలైన మీరిప్పుడు తెలుసుకున్నారు. వారు ఎవరికీ సద్గతిని ఇవ్వలేరు. తమకు తాము కూడా సద్గతిని ఇచ్చుకోలేరు. స్వయానికి ఇచ్చుకోగలిగితే ఇతరులకు కూడా ఇవ్వగలుగుతారు. తండ్రి పరంధామం నుండి వస్తారు. వారు అక్కడి నివాసి, పిల్లలైన మీరు కూడా అక్కడి నివాసులే. మీరు ఈ కర్మ క్షేత్రంలో పాత్రను అభినయించాలి. పిల్లలైన మీ కోసం బాబాకు కూడా ఒకసారి ఇక్కడకు రావాల్సి ఉంటుంది. స్వర్గ స్థాపన జరుగుతున్నప్పుడు తప్పకుండా నరకం యొక్క వినాశనం జరగాల్సిందే.
శివబాబా బ్రహ్మా ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారని పిల్లలైన మీరిప్పుడు తెలుసుకున్నారు. మనం మళ్ళీ మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. మేము ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వచ్చి వారసత్వాన్ని పొందేందుకు మళ్ళీ బ్రహ్మా ద్వారా శివబాబాకు పిల్లలుగా అవుతామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. వారినే పతితపావనుడు అని అంటారు. వారు నాలెడ్జ్ ఫుల్, జ్ఞాన సాగరుడు కూడా. యోగాన్ని అనగా స్మృతి చేయడం నేర్పిస్తారు కానీ నిరాకారుడు ఎలా అర్థం చేయించగలరు, అందుకే బ్రహ్మా ద్వారా మనుష్యులను దేవతలుగా తయారుచేస్తాను అనగా దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయిస్తాను అని అంటారు. ఇప్పుడు ఆ ధర్మం లేదు, మళ్ళీ తయారుచేయవలసి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేసి మిగిలిన వారందరినీ ముక్తిధామానికి తీసుకువెళ్తాను. భారత్ ప్రాచీన ఖండము, అందుకే వాస్తవానికి భారత్ యొక్క జనాభా అందరికన్నా ఎక్కువగా ఉండాలి. ఇటువంటి విషయాలు ఇంకెవరి బుద్ధిలోకి రావు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అన్నింటికన్నా పెద్దగా ఉండాలి. 5 వేల సంవత్సరాల నుండి వారి వృద్ధి జరుగుతూ ఉంటుంది. మిగిలిన వారైతే 2500 సంవత్సరాల తర్వాత వస్తారు. ఇస్లామ్ వారి జనాభా తక్కువగా ఉండాలి, మళ్ళీ కొంత సమయం తర్వాత బౌద్ధ ధర్మం వారు వస్తారు, ఇరువురిలో కొద్దిగా తేడా ఉండాలి. ఇస్లాములు, బౌద్ధులు మొదలైనవారు ముందు సతోప్రధానంగా ఉంటారు, తర్వాత నెమ్మది-నెమ్మదిగా తమోప్రధానంగా అవుతారు. ఇది కూడా ఒక లెక్క. ఎవరైతే అనన్యులైన, తెలివైన పిల్లలున్నారో, వారు వీటి గురించి ఆలోచించాల్సి ఉంటుంది. చైనీయుల జనాభా అందరికన్నా ఎక్కువగా ఉందని ఈ రోజుల్లో రాస్తూ ఉంటారు. కానీ వారికి సృష్టి చక్రం యొక్క జ్ఞానమైతే లేదు. ఈ రహస్యాలన్నీ పిల్లలైన మీ బుద్ధిలో ఉన్నాయి. ఎవరైతే చదువుకున్నవారుంటారో, వారికి ఈ విషయాలను వివరంగా అర్థం చేయించవలసి ఉంటుంది. దేవీ దేవతా ధర్మం వారు వచ్చి 5 వేల సంవత్సరాలయ్యింది కావున ఈ సమయంలో వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండాలి. కానీ దేవీ దేవతా ధర్మం వారు తర్వాత వేర్వేరు ధర్మాల్లోకి కన్వర్ట్ అయిపోయారు. మొట్టమొదటగా చాలా మంది ముసల్మానులుగా అయ్యారు, తర్వాత చాలా మంది బౌద్ధులుగా కూడా అయ్యారు. ఇక్కడ కూడా బౌద్ధులు చాలా మంది ఉన్నారు. క్రిస్టియన్లు అయితే లెక్కలేనంతమంది ఉన్నారు. కానీ దేవతా ధర్మం యొక్క పేరు కూడా లేదు. ఒకవేళ మేము బ్రాహ్మణ ధర్మంవారిమని చెప్పినా కూడా, హిందువుల లైన్ లోనే కలిపేస్తారు. బ్రాహ్మణులైన మన ద్వారా, శ్రీమతమనుసారంగా ఆది సనాతనా దేవీ దేవతా ధర్మ స్థాపన జరుగుతుందని ఇప్పుడు మీకు తెలుసు. ఈ వివేకం కూడా ఉండాలి. ధర్మాలు గాయనం చేయబడతాయి కదా. ఇక్కడి మనుష్యులు స్వయాన్ని హిందువుల లైన్ లో వేసుకుంటారు. హిందూ ధర్మమనేది ఆర్య ధర్మము, ఇది అన్నింటికన్నా ప్రాచీనమైనదని అంటారు. భారతవాసులు మొదట్లో ఆర్యులుగా ఉండేవారు, చాలా ధనవంతులుగా ఉండేవారు, ఇప్పుడు అనార్యులుగా అయిపోయారు. కొంచెం కూడా తెలివి లేదు, ఎవరికి ఏది తోస్తే ఆ ధర్మం పేరు పెట్టేస్తారు. వృక్షం చివరి భాగంలో చిన్న-చిన్న ఆకులు, కొమ్మలు-రెమ్మలు వెలువడతాయి. కొత్త వాటికి కొంత గౌరవముంటుంది.
మనం బాబా నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. కనుక ఇటువంటి వారసత్వాన్నిచ్చే తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి. మీరు ఎంత ఎక్కువగా స్మృతి చేస్తారో, అంతగా ఒకటేమో వారసత్వం లభిస్తుంది మరియు మీరు పావనంగా అవుతారు. లౌకిక తండ్రి నుండైతే ధనం యొక్క వారసత్వం లభిస్తుంది. దానితో పాటు పతితంగా అయ్యే వారసత్వం కూడా లభిస్తుంది. అతను లౌకిక తండ్రి, వారు పారలౌకిక తండ్రి మరియు మధ్యలో వీరు అలౌకిక తండ్రి. మధ్యలో ఉన్న వీరిని ఇరువైపులతో జోడించడం జరుగుతుంది. శివబాబాకైతే ఎటువంటి కష్టము ఉండదు కానీ వీరికి ఎన్ని నిందలు పడవలసి వస్తుంది. వాస్తవానికి కృష్ణుడిని నిందించరు. మధ్యలో చిక్కుకున్నది వీరు. దారిలో వెళ్తూ బ్రాహ్మణుడు చిక్కుకున్నాడని అంటారు కదా. నిందలు పడేందుకు వీరు చిక్కుకున్నారు. అలౌకిక తండ్రికే సహనం చేయవలసి ఉంటుంది. శివబాబా వీరిలో ప్రవేశించి పతితులను పావనంగా చేస్తారని అసలు ఎవరికీ తెలియదు. పవిత్రంగా అయ్యే విషయంలోనే దెబ్బలు తింటారు. తండ్రి అంటారు – నేను అందరినీ తిరిగి తీసుకువెళ్ళడానికి వచ్చాను. మృత్యువు ఎదురుగా నిలబడి ఉందని మీకు తెలుసు. వినాశనమైతే తప్పకుండా జరగాలి. వినాశనం జరగకుండా సుఖ-శాంతులు ఎలా స్థాపనవుతాయి. యుద్ధం ప్రారంభమైనప్పుడు, ఆ యుద్ధం ఆగిపోవాలని మనుష్యులు యజ్ఞాలు మొదలైనవి రచిస్తారు. వినాశనమైతే తప్పకుండా జరుగుతుందని బ్రాహ్మణ కుల భూషణులైన మీకు తెలుసు. లేదంటే స్వర్గ ద్వారాలు ఎలా తెరుచుకుంటాయి. స్వర్గంలోకైతే అందరూ రారు. ఎవరైతే పురుషార్థం చేస్తారో, వారే వస్తారు, మిగిలినవారు ముక్తిధామానికి వెళ్తారు. ఎవరికీ ఈ విషయాలు తెలియని కారణంగా ఎంత భయపడతారు. శాంతి కోసం ఎన్ని ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు, కాన్ఫరెన్సులు చేస్తూ ఉంటారు. సుఖధామం, శాంతిధామం యొక్క స్థాపన ఎలా జరుగుతుంది అనేది కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. వినాశనం జరగకుండా స్థాపన జరగదు. ఇప్పుడు మీరు త్రికాలదర్శులుగా అయ్యారు. జ్ఞానము యొక్క మూడవ నేత్రం లభించింది. ఎవరూ కొట్లాడుకోకుండా ఉండేలా శాంతి ఎలా ఏర్పడుతుందని వారు అడుగుతూ ఉంటారు. ఐక్యత ఉండాలని అందరూ అంటూ ఉంటారు. మనమంతా ఒక్క తండ్రి పిల్లలము, పరస్పరంలో సోదరులము అనేటువంటి ఒక్క తండ్రి మతాన్నే తీసుకున్నట్లయితే ఐక్యత ఏర్పడుతుంది. ఒక్క తండ్రి పిల్లలము అన్నప్పుడు పరస్పరంలో కొట్లాడుకోకూడదు. సత్యయుగంలో అలానే ఉండేది. అక్కడ పరస్పరంలో ఎవరూ కొట్లాడుకోరు. కానీ అది సత్యయుగం యొక్క విషయము, ఇక్కడున్నది కలియుగము. సత్యయుగంలో తప్పకుండా దేవతలుండేవారు, మిగిలిన ఆత్మలందరూ ఎక్కడ ఉండేవారో తెలియదు. కేవలం సత్యయుగంలో మాత్రమే ఏక రాజ్యముండేదని ఇప్పుడు మీకు తెలుసు. అక్కడ సుఖశాంతులు మొదలైనవన్నీ ఉండేవి. ఈ విషయాలన్నీ నంబరువారు పురుషార్థానుసారంగా మీ బుద్ధిలో ఉన్నాయి. తప్పకుండా మేము సత్యయుగంలో రాజ్యం చేసేవారమని, చాలా సుఖముండేదని, అద్వైత ధర్మం ఉండేదని అర్థం చేసుకున్నారు. ఈ జ్ఞానం ఎవరికీ లేదు. మీరు ఈ సమయంలో నాలెడ్జ్ ఫుల్ గా అవుతారు. తండ్రి మిమ్మల్ని తమ సమానంగా తయారుచేస్తారు. తండ్రి మహిమ ఏదైతే ఉందో, మీరు కూడా అలాగే తయారవ్వాలి. కేవలం దివ్య దృష్టి తాళంచెవి తండ్రి వద్ద ఉంటుంది. భక్తి మార్గంలో నేను పని చేయవలసి ఉంటుంది, ఎవరు ఎవరిని పూజిస్తారో నేను వారి మనోకామనలను పూర్తి చేస్తాను అని తండ్రి తెలియజేసారు. ఇక్కడ కూడా దివ్య దృష్టి పాత్ర నడుస్తుంది. అర్జునుడికి వినాశన సాక్షాత్కారం కలిగిందని అంటారు కదా. వినాశనం కూడా తప్పకుండా జరగనున్నది. విష్ణుపురి కూడా తప్పకుండా స్థాపనవ్వనున్నది. తండ్రి కల్పక్రితం ఎలాగైతే అర్థం చేయించారో, అలాగే కూర్చుని అర్థం చేయిస్తారు. బాబా మనల్ని మనుష్యుల నుండి దేవతలుగా చేస్తారు. దేవతలుగా అయినప్పుడు, ఆసురీ సృష్టి వినాశనం తప్పకుండా జరుగుతుంది. నలువైపులా హాహాకారాలు జరగనున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించనున్నాయని, కుండపోత వర్షాలు కురవనున్నాయని బుద్ధి అర్థం చేసుకోగలదు. ఇదంతా వినాశనమైనప్పుడే సత్యయుగ స్థాపన జరుగుతుంది. భూమికి 5 తత్వాల ఎరువు కూడా లభిస్తుంది. ఈ భూమికి ఎంత ఎరువు లభిస్తుందో చూడండి. ఈ రుద్ర జ్ఞాన యజ్ఞంలో ఇదంతా స్వాహా అయిపోతుందని తండ్రి అంటారు. భక్తి మార్గంలో రుద్ర యజ్ఞాలను ఎలా రచిస్తారో చూడండి. శివబాబా లింగాన్ని మరియు అనేక చిన్న-చిన్న సాలిగ్రామాలను తయారుచేసి, పూజించి, వాటిని అంతం చేసేస్తారు. అలా రోజూ తయారుచేస్తారు, పూజించిన తర్వాత అంతం చేసేస్తారు. శివబాబాతో పాటు ఎవరైతే సేవ చేసారో వారికి కూడా ఇటువంటి పరిస్థితిని కలుగజేస్తారు. చూడండి, ప్రతి సంవత్సరం రావణుని దిష్టి బొమ్మను తయారుచేసి దానిని కాలుస్తారు. శత్రువు దిష్టిబొమ్మనైతే ఒకటి రెండు సార్లు తయారుచేసి కాలుస్తారు, అంతేకానీ ప్రతి సంవత్సరం కాల్చే నియమం పెట్టుకుంటారని కాదు. ఒక్కసారే కోపాన్ని తీర్చేసుకుంటారు. రావణుడినైతే ప్రతి సంవత్సరం కాలుస్తారు. దీని అర్థం ఎవరికీ తెలియదు. ఇంకా, రావణుడు సీతను అపహరించాడని అంటారు, దాని అర్థాన్ని ఏమీ తెలుసుకోరు. విదేశీయులు ఏమి అర్థం చేసుకుంటారు, ఏమీ అర్థం చేసుకోరు. రోజు-రోజుకు రావణుడిని పెద్దగా తయారుచేస్తూ ఉంటారు, ఎందుకంటే రావణుడు చాలా దుఃఖాన్ని ఇచ్చేటువంటివాడు. ఇప్పుడు మీరు అతనిపై విజయం పొందుతారు. సత్యయుగంలో రావణుడు ఉండనే ఉండడు. ఈ కర్మభోగం, అనారోగ్యం మొదలైనవన్నీ రావణుని కారణంగానే కలుగుతాయి. రావణుడు ప్రవేశించిన కారణంగా మనుష్యులు చేసే కర్మలన్నీ వికర్మలుగా అవుతాయి. ఈ సుఖ-దుఃఖాల ఆట తయారుచేయబడింది. ఈ చరిత్ర-భూగోళాల గురించి ఎవరికీ తెలియదు. లక్ష్మీనారాయణులకు ఈ రాజ్యం ఎలా లభించింది అనేది ఎవరికీ తెలియదు. ఈ లక్ష్మీనారాయణులు సత్యయుగంలో రాజ్యం చేసేవారని చిన్న-చిన్న పిల్లలైన మీరు అర్థం చేయిస్తారు. వీరు సంగమంలో ఈ రాజయోగాన్ని నేర్చుకొని ఈ పదవిని పొందారు. బిర్లా వద్దకు చిన్న-చిన్న కుమార్తెలు వెళ్ళి, వీరు (లక్ష్మీనారాయణులు) ఈ రాజ్యాన్ని ఎలా పొందారు అనేది అర్థం చేయించాలి. ఇప్పుడిది కలియుగము, దీనిని సత్యయుగమని అనరు. ఇప్పుడు రాజ్యమైతే లేదు. రాజుల కిరీటాలనే తొలగించేసారు. ధర్మ శాస్త్రాలు కేవలం నాలుగు ఉన్నాయి. గీత ధర్మ శాస్త్రము, దీని నుండి మూడు ధర్మాలు ఈ సమయంలో స్థాపనవుతాయి, సత్యయుగంలో కాదు. లక్ష్మీనారాయణులు లేక రాముడు ధర్మ స్థాపన చేసారని కాదు. ఈ ధర్మాలను ఇప్పుడు స్థాపన చేస్తున్నారు, ఆ తర్వాత ఇస్లాముల ధర్మం, బౌద్ధ ధర్మం మరియు క్రిస్టియన్ ధర్మం వస్తాయి. క్రిస్టియన్లకు ఒకే ఒక ధర్మ శాస్త్రం ఉంది, బైబిల్, అంతే. తర్వాత వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఆది సనాతనమైనది దేవతా ధర్మమే, ఇప్పుడు మళ్ళీ దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. మీరు డ్రామా రహస్యాన్ని మంచి రీతిగా అర్థం చేసుకున్నారు. మీకు సంతోషం కూడా ఉంటుంది. మేము మళ్ళీ మా రాజ్య భాగ్యాన్ని స్థాపన చేసుకుంటున్నామని పిల్లలైన మీకు 100 శాతం నిశ్చయముంది, ఇందులో యుద్ధం మొదలైన విషయాలేవీ లేవు. రాజధాని స్థాపనవుతుంది, ఇది నిశ్చితము. మృత్యువు ఎంత నిశ్చితమో, ఇది కూడా అంత నిశ్చితము. మనం మళ్ళీ రాజ్య భాగ్యాన్ని తీసుకుంటామని మీకు తెలుసు. కల్ప-కల్పము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. ఎంత పురుషార్థం చేస్తారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి మహిమ ఏదైతే ఉందో, ఆ మహిమను స్వయంలో అలవరచుకోవాలి. తండ్రి సమానంగా మహిమా యోగ్యులుగా అవ్వాలి. పారలౌకిక తండ్రి నుండి పవిత్రత యొక్క వారసత్వాన్ని తీసుకోవాలి. పవిత్రంగా అవ్వడంతోనే స్వర్గ వారసత్వం లభిస్తుంది.
2. శ్రీమతాన్ని అనుసరిస్తూ తమ తనువు, మనసు, ధనముల ద్వారా ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయాలి.
వరదానము:-
ఎప్పుడైతే మాస్టర్ త్రికాలదర్శులుగా అయి సంకల్పాలను కర్మలలోకి తీసుకువస్తారో, అప్పుడు ఏ కర్మ వ్యర్థమవ్వదు. ఈ వ్యర్థాన్ని పరివర్తన చేసి సమర్థ సంకల్పాలను మరియు సమర్థ కార్యాలను చేయడాన్నే సంపూర్ణ స్థితి అని అంటారు. కేవలం తమ వ్యర్థ సంకల్పాలను లేదా వికర్మలను భస్మం చేసుకోవడమే కాదు, శక్తి రూపంగా అయి మొత్తం విశ్వం యొక్క వికర్మల భారాన్ని తేలికగా చేసేందుకు మరియు అనేకాత్మల వ్యర్థ సంకల్పాలను నశింపజేసేందుకు మెషినరీని వేగవంతం చేయండి, అప్పుడు విశ్వ కళ్యాణకారి అని అంటారు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!