22 January 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

21 January 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - ఏ రకమైన లోభమును పిల్లలైన మీరు ఉంచుకోకూడదు, ఎవరినీ ఏమీ అడగకూడదు, ఎందుకంటే దాత పిల్లలైన మీరు ఇచ్చేవారు’’

ప్రశ్న: -

మీరు ఈశ్వరీయ విద్యార్థులు, మీ లక్ష్యమేమిటి, ఏది మీ లక్ష్యము కాదు?

జవాబు:-

మీ లక్ష్యము – తండ్రి ద్వారా ఏ జ్ఞానమైతే లభిస్తుందో, దానిని ధారణ చేయడము, పాస్ విత్ హానర్ గా (గౌరవప్రదంగా ఉత్తీర్ణమవ్వడము) అవ్వడము. అంతేకానీ ఇది కావాలి, ఇది కావాలి… ఇటువంటి కోరికలను పెట్టుకోవడం మీ లక్ష్యము కాదు. మీరు ఏ మనుష్యాత్మతోనూ ఇచ్చిపుచ్చుకోవడాలు చేసి లెక్కాచారాన్ని తయారుచేసుకోకండి. తండ్రి స్మృతిలో ఉంటూ కర్మాతీతముగా అయ్యే పురుషార్థము చేయండి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

బాల్యపు రోజులను మర్చిపోకండి..

ఓంశాంతి. ఇది ఆత్మిక తండ్రి మరియు పిల్లల సంబంధము అని పిల్లలకు తెలుసు. ఆత్మిక తండ్రి ఇప్పుడు కూర్చుని ఉన్నారు మరియు పిల్లలు కూడా కూర్చుని ఉన్నారు. సన్యాసులు మొదలైనవారు, తమ ఆశ్రమము నుండి ఎక్కడికైనా వెళ్తే, ఫలానా సన్యాసి ఫలానా స్థానంలో ఉంటారు, గీతా శాస్త్రము మొదలైనవి వినిపిస్తారు అని వారి గురించి చెప్తారు. అది కొత్త విషయమేమీ కాదు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనడంతో మొత్తం జ్ఞానమంతా సమాప్తమైపోతుంది. ఇప్పుడు వీరైతే ఆత్మిక తండ్రి, వీరిని ఆత్మలన్నీ స్మృతి చేస్తాయి. ఆత్మనే, ఓ పరమపిత పరమాత్మ అని అంటుంది. దుఃఖము కలిగినప్పుడు లౌకిక తండ్రిని ఏమీ అనరు. అనంతమైన తండ్రినే స్మృతి చేస్తారు. సన్యాసులైతే బ్రహ్మ తత్వాన్ని స్మృతి చేస్తారు. వారు ఉన్నదే బ్రహ్మా జ్ఞానులు. తండ్రిని స్మృతే చేయరు. శివోహమ్ అని అంటారు, ఆత్మనైన నేనే పరమాత్మ అని అంటారు. ఇకపోతే, బ్రహ్మము అనగా తత్త్వము అయితే నివసించే స్థానము. ఈ విషయాలు పూర్తిగా కొత్తవి. ఈ జ్ఞానము ప్రాయః లోపమైపోతుంది. ఈ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, వాటిలో నా జ్ఞానము లేదు. నా జ్ఞానము లేని కారణంగా, మీరు ఎవరికైనా అర్థం చేయించినప్పుడు, ఇది కొత్త విషయము అని అంటారు. నిరాకార పరమాత్మ జ్ఞానమును ఇస్తారు, ఇది వారి బుద్ధిలోకే రాదు. వారు, కృష్ణుడు జ్ఞానమును వినిపించారు అని భావిస్తారు, అందుకే తికమకపడతారు. తండ్రి అయితే ఒక్కొక్క విషయాన్ని నిరూపించి చెప్తారు. భక్తి మార్గంలో మీరంతా స్మృతి చేస్తారు. భక్తులందరూ భక్తులే. భగవంతుడైతే ఒక్కరే ఉండాలి. సర్వులలోనూ భగవంతుడు ఉన్నారు అని భావించడం వలన అందరినీ పూజించడం మొదలుపెడతారు. మొదట అవ్యభిచారిగా ఒక్క శివుని భక్తి జరుగుతుంది. కానీ, వారు ఏం చేసి వెళ్ళారు, ఎప్పుడు వచ్చారు అనే జ్ఞానం ఉండదు, ఇది తెలియదు. కానీ అది సతోప్రధాన భక్తి. ఎవరి ద్వారానైతే సుఖం లభిస్తుందో, పూజ వారికి జరుగుతుంది. లక్ష్మీ-నారాయణుల రాజ్యంలో కూడా అపారమైన సుఖము ఉండేది. వారు స్వర్గంలోని దేవతలుగా ఉండేవారు. లక్ష్మీ-నారాయణులను సత్యయుగం యొక్క మొట్టమొదటి మహారాజా-మహారాణిగా భావిస్తారు. కానీ సత్యయుగం యొక్క ఆయువు గురించి తెలియదు. తండ్రి ప్రతి విషయాన్ని పిల్లలకే అర్థం చేయిస్తారు. పిల్లలే బ్రాహ్మణులుగా అవుతారు. ఇది కొత్త రచన కదా. పరమపిత పరమాత్మ ప్రజాపిత బ్రహ్మా ద్వారా కొత్త సృష్టిని రచిస్తారు అని మీరు అందరికీ అర్థం చేయించవచ్చు. ఇదైతే అందరూ అర్థం చేసుకుంటారు. లేదంటే ప్రజాపిత అని ఎందుకు అంటారు? ఈ విషయాలు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికీ తెలియవు. వారికి ఈ కొత్త-కొత్త విషయాలు అర్థం కావు. ఎప్పుడైతే వింటూ-వింటూ పక్కా అయిపోతారో, అప్పుడు, మేము ఎంత ఘోరమైన అంధకారంలో ఉండేవారిమి, అని అర్థం చేసుకుంటారు. భగవంతుని గురించి తెలియదు, దేవతల గురించి తెలియదు. ఎవరైతే ఉండి వెళ్ళిపోతారో, వారికే భక్తి చేయడం జరుగుతుంది. అప్పుడు వారిని అడగండి, పరమపిత పరమాత్మ, ఎవరి జయంతినైతే మీరు జరుపుకుంటారో, వారితో మీకు ఏం సంబంధము ఉంది, వారు ఏం చేసి వెళ్ళారు? ఏమీ చెప్పలేకపోతారు. కృష్ణుని గురించి కేవలం, వెన్న దొంగలించారని, అది-ఇది చేసారని, జ్ఞానం ఇచ్చారని చెప్తారు. ఎంత గందరగోళము. దాత అయితే ఒక్క ఈశ్వరుడే. కృష్ణుడి గురించి అయితే దాత అని అనరు. వారు తికమకలో ఉన్నారు. ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. తండ్రి ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు. సార రూపంలో కొన్ని విషయాలు కూడా మనుష్యుల బుద్ధిలో కూర్చోవు. ఒకవేళ ఒక్కొక్కరి 84 జన్మల వృత్తాంతాన్ని కూర్చొని తీస్తే, ఎంత పెద్దదవుతుందో తెలియదు. తండ్రి అంటారు, ఈ అన్ని విషయాలను వదిలి నన్నొక్కరినే స్మృతి చేయండి. కాస్త విస్తారంగా ఎప్పుడైనా అర్థం చేయించినట్లయితే, మనుష్యుల సంశయాలు తొలగిపోతాయి. ఇకపోతే, విషయం చాలా చిన్నదే – నన్ను స్మృతి చేయండి. ఎలాగైతే ఈశ్వరుడిని స్మృతి చేయండి అనే మంత్రాన్ని ఇస్తారు. కానీ ఈశ్వరుడిని స్మృతి చేయడంతో మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు ఈశ్వరుని వద్దకు వెళ్తారు అని చెప్పరు. ఇదైతే తండ్రే అర్థం చేయిస్తారు, గంగా స్నానముతో వికర్మలు వినాశనమవ్వవు అని. ఈ సమయంలో ప్రతి ఒక్కరిపైన వికర్మల భారము చాలా ఎక్కువగా ఉంది. సుకర్మలు తక్కువగా ఉంటాయి, ఇకపోతే, వికర్మలు అయితే జన్మ-జన్మాంతరాలవి చాలా ఉన్నాయి. ఎంతగా జ్ఞాన-యోగాలలో ఉంటారు, అయినా కూడా ఎన్ని వికర్మలు ఉన్నాయంటే, అవి వదలనే వదలవు. ఎప్పుడైతే కర్మాతీతముగా అయిపోతారో, అప్పుడు మీకు కొత్త జన్మ కొత్త ప్రపంచంలో లభిస్తుంది. ఒకవేళ ఏవైనా వికర్మలు మిగిలి ఉన్నట్లయితే, పాత ప్రపంచంలోనే మరో జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. జ్ఞానమైతే పిల్లలకు చాలా మంచిది లభిస్తుంది. తండ్రి అంటారు, ఇంకేమీ అర్థం కాకపోయినా, తండ్రినైతే స్మృతి చేయండి, దీని ద్వారా కూడా సెకెండులో స్వర్గం యొక్క రాజ్యాధికారం లభిస్తుంది. ఖుదా దోస్త్ కథ కూడా ఒకటి ఉంది. ఒక రోజు కోసం రాజ్యాధికారాన్ని ఇస్తారు. బాబానే త్వమేవ మాతాశ్చ పితా, త్వమేవ బంధువు… ఇలా అయ్యారని ఇప్పుడు మీకు తెలుసు. కనుక ఖుదా దోస్త్ (స్నేహితుడు) అయ్యారు కదా. అల్లా అవల్దీన్, ఖుదా దోస్త్, ఈ విషయాలన్నీ ఈ సమయానికి చెందినవి. బాబా మీకు ఒక్క సెకెండులో స్వర్గం యొక్క రాజ్యాధికారాన్ని ఇస్తారు. కుమార్తెలు ధ్యానంలోకి వెళ్ళినప్పుడు, అక్కడ రాకుమార-రాకుమార్తెలుగా అయ్యేవారు, అక్కడి సమాచారమంతటినీ వచ్చి వినిపించేవారు. మీకు తండ్రి గురించి ఇప్పుడు తెలుసు. అందరూ హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు, తప్పకుండా కొత్త ప్రపంచాన్ని, స్వర్గాన్నే రచిస్తారు. భారత్ యే బంగారు యుగముగా ఉండేది. ఆ సమయంలో ఇంకే ధర్మము ఉండేది కాదు. క్రైస్టుకు 3000 సంవత్సరాల క్రితం భారత్ స్వర్గంగా ఉండేది అని క్రిస్టియన్లు కూడా అంటారు. అక్కడ లక్ష్మీ-నారాయణులు రాజ్యం చేసేవారు. అందుకే అడుగుతారు, వీరికి ఈ వారసత్వము ఎక్కడి నుండి లభించింది? భారతవాసులకు వీరితో ఏం సంబంధముంది? స్వర్గానికి యజమానులుగా మొదట వీరు ఉండేవారు. ఇప్పుడిది నరకము, వీరు ఎక్కడికి వెళ్ళారు? జనన-మరణాలైతే నమ్ముతారు కదా. ఆత్మ జనన-మరణాలలోకి వస్తుంది, అందుకే 84 జన్మలను తీసుకుంటుంది. లేదంటే ఎలా తీసుకుంటుంది. ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి. కొంతమంది పునర్జన్మలను నమ్ముతారు, కొంతమంది నమ్మరు. వారిని అడగాలి, పరమపిత పరమాత్మ శివునితో మీకు ఏం సంబంధము? ఈ బ్రహ్మా-విష్ణు-శంకరులు ఎవరు? ఎక్కడి నివాసులు? సూక్ష్మవతన వాసులు అని మీరు అంటారు. ఇంకెవ్వరూ ఇది చెప్పలేరు. మీకైతే ఎంత సహజము. మాతలకైతే ఏ ఉద్యోగము మొదలైనవాటి చింత లేదు. ఇంట్లో ఉంటారు. ఏ వ్యాపార-వ్యావహారాల హంగామా లేదు. తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలి. పురుషులకైతే చింత ఉంది. మీకైతే బాబా చెప్తారు, మీరు మీ పదవిని తీసుకోండి, విశ్వానికి యజమానులుగా అవ్వండి. షావుకారులకైతే ఎంత చింత ఉంటుంది. ప్రపంచంలో లంచగొండితనము కూడా చాలా ఉంది. మీరు లంచము తీసుకోవాల్సిన అవసరమే లేదు. అది వ్యాపారుల పని. మీరు వీటి నుండి విముక్తులు అయ్యారు. అయినా కూడా, మాయ ఎటువంటిదంటే, పిలకతో పట్టుకుంటుంది, అందుకే మరి ఏదో ఒక లోభము ఉంటుంది, దాని వలన జిజ్ఞాసువులను అడుగుతూ ఉంటారు. బాబా అంటారు, పిల్లలూ, ఎవరినీ ఏమీ అడగకండి. మీరు దాత పిల్లలు కదా. మీరు ఇవ్వాలి, అంతేకానీ అడగకూడదు. మీకు ఏది కావాలన్నా, శివబాబా నుండి లభించగలదు. ఇంకెవరి నుండైనా తీసుకున్నట్లయితే, వారి స్మృతి ఉంటుంది. ప్రతి వస్తువును శివబాబా నుండి తీసుకున్నట్లయితే, శివబాబా మీకు ఘడియ-ఘడియ గుర్తుకొస్తారు. శివబాబా అంటారు – మీ ఇచ్చిపుచ్చుకొనే లెక్క నాతో ఉంది. ఈ బ్రహ్మా అయితే మధ్యలో మధ్యవర్తి. ఇచ్చేవాడిని నేను. నాతో మీరు బ్రహ్మా ద్వారా సంబంధము పెట్టుకోండి. ఏదైనా వస్తువును ఇతరుల నుండి తీసుకున్నట్లయితే, వారు స్మృతి కలుగుతుంది మరియు మీరు వ్యభిచారులుగా అయిపోతారు. శివబాబా భండారము నుండి మీరు వస్తువులు తీసుకోండి, ఇంకెవ్వరినీ అడగకండి. లేదంటే ఇచ్చేవారికి నష్టము కలుగుతుంది ఎందుకంటే వారు శివబాబా భండారములోకి ఇవ్వలేదు. శివబాబా భండారములోనే ఇవ్వాలి. మనుష్యులతో ఇచ్చిపుచ్చుకునే సంబంధమైతే చాలా సమయం నుండి పెట్టుకున్నారు, ఇప్పుడు మీ సంబంధము డైరెక్టు శివబాబాతో ఉంది. కానీ పిల్లల్లో లోభము యొక్క భూతము ఉంది అని బాబాకు తెలుసు.

మేము శివబాబాను చూడలేదు అని చాలా మంది పిల్లలు అంటారు. అరే, మీరు స్వయాన్ని చూసుకున్నారా? మాకు శివబాబా సాక్షాత్కారం కావాలి అని అంటున్నారు, ముందు మీకు మీ ఆత్మ సాక్షాత్కారం అయ్యిందా? మన ఆత్మ భృకుటి మధ్యలో ఉంటుందని మీకు తెలుసు. శివబాబా కూడా భృకుటి మధ్యలోనే ఉంటారు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది అని మీకు తెలుసు. ఏ సమయములోనైనా ఆత్మ సాక్షాత్కారం కూడా జరగవచ్చు. ఆత్మ నక్షత్రము వంటిది. సాక్షాత్కారము కూడా దివ్యదృష్టి ద్వారానే జరుగుతుంది. అచ్ఛా, కృష్ణునికి మీరు భక్తి చేయండి, సాక్షాత్కారం అవ్వచ్చు, కానీ లాభమేముంది? పరమాత్మ సాక్షాత్కారము కూడా జరిగింది, కానీ లాభమేముంది? అయినా మీరు చదువుకోవాల్సిందే కదా. భక్తి మార్గంలో సాక్షాత్కారం జరిగితే, వారిని ఎంత మహిమ చేస్తారు. కానీ ఏమీ లభించదు. శివబాబా జ్ఞానసాగరుడు. బ్రహ్మానైతే జ్ఞానసాగరుడు అని అనరు కదా. బ్రహ్మాకు కూడా వారి నుండి జ్ఞానం లభిస్తుంది. ఈ రోజుల్లో శివలింగాన్ని అందరి ముందు పెట్టేస్తారు, ఏమీ అర్థం చేసుకోరు. పూజ చేస్తారు కానీ ఎవరి జీవిత చరిత్ర గురించి కూడా చెప్పలేరు. ఈ జ్ఞాన రత్నాలను అర్థం చేసుకోలేరు. రత్నాలను తీసుకుంటూ-తీసుకుంటూ చాలా మందిని మాయ కోతిలా చేసేస్తుంది. మాకు రత్నాలు వద్దు అని అంటారు. బాబా అర్థం చేయిస్తారు, అయినా వారు శివాలయంలోకి వస్తారు కానీ ప్రజా పదవిని పొందుతారు. పురుషార్థము చేసి ఉన్నత పదవిని పొందాలి. తండ్రి అంటారు, నేను వైకుంఠం యొక్క రాజ్యాధికారాన్ని ఇచ్చేందుకు వచ్చాను, మీరు పురుషార్థము చేసి మీ సమానంగా తయారుచేయండి. పూజారులను కూడా, వీరు ఎవరు అని మీరు ప్రశ్నించవచ్చు. నిప్పు అడగడానికి వచ్చి, యజమానులుగా అయి కూర్చున్నారు అని అంటారు కదా. కొంతమంది పూజారుల బుద్ధిలో కూడా మంచి రీతిలో కూర్చుంటుంది. మనము కూడా పూజారులుగా ఉండేవారము, ఇప్పుడు పూజ్యులుగా అయ్యాము. ఈ లక్ష్మీ-నారాయణులు, పూజ్యులుగా ఏ పురుషార్థము ద్వారా అయ్యారో, మీరు అర్థం చేయించగలరు. బాబా అంటారు, నా భక్తులెక్కడైతే ఉంటారో, అక్కడకు వెళ్ళి వారికి అర్థం చేయించండి. భక్తులు శివుని మందిరంలో, లక్ష్మీ-నారాయణుల మందిరంలో, జగదంబ మందిరంలో ఉంటారు, అక్కడకు వెళ్ళండి. పూజారులకు అర్థం చేయించండి – వారు మళ్ళీ ఇతరులకు అర్థం చేయిస్తారు. పూజారులు కూర్చుని ఎవరికైనా జగదంబ కర్తవ్యము గురించి తెలిపితే అందరూ సంతోషిస్తారు. వారికి చెప్పాలి, మీరు ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకోండి, మీరు కూర్చొని ఎవరికైనా ఈ దేవతల జీవిత చరిత్ర గురించి తెలిపితే మీకు చాలా ధనము లభిస్తుంది అని. ఇది కూడా, ఎవరైతే దేహీ-అభిమానులుగా ఉన్నారో, వారే అర్థం చేయించగలరు. దేహాభిమానులకు రోజంతా ఇది కావాలి, ఇది కావాలి అనే లోభం ఉంటుంది. విద్యార్థులకైతే, నేను పాస్ విత్ హానర్ గా (గౌరవప్రదంగా ఉత్తీర్ణమవ్వడము) అవ్వాలి అని జ్ఞానం యొక్క లోభముండాలి. ఇది చదువు యొక్క లక్ష్యము.

డ్రామా రహస్యాన్ని కూడా అర్థం చేసుకోవాలి. డ్రామా ఏమంత పెద్దదేమీ కాదు. కానీ శాస్త్రాలలో దీని ఆయువును పెద్దదిగా రాసేసారు. కనుక ఇవన్నీ బుద్ధిలోకి రావాలి. సేవ అయితే చాలా ఉంది, ఎవరైనా చేసి చూపించాలి. తండ్రిని కృప చూపించమని ఏమైనా అడుగుతారా. భగవంతుడా, కొడుకును ఇవ్వండి, అప్పుడు కులం యొక్క వృద్ధి జరుగుతుంది. అరే, తండ్రి అయితే తమ కులాన్ని వృద్ధి చేస్తున్నారు. ఈ సమయములో మళ్ళీ దేవతా కులం యొక్క వృద్ధి జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈశ్వరీయ కులం యొక్క వృద్ధి జరుగుతుంది. మీరు కూడా ఈశ్వరీయ సంతానము. కావున తండ్రి అర్థం చేయిస్తారు, ఈ కోరికలన్నింటినీ వదిలి ఒక్క తండ్రిని స్మృతి చేయండి. బంధనాలు మొదలైనవి ఉన్నాయి, ఇవన్నీ కర్మల లెక్కాచారము. బాబాను చూడండి, ఎంత బంధనము ఉంది, ఎంతమంది పిల్లల గురించి ఆలోచనలు ఉంటాయి, ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎంతగా నిందిస్తూ ఉంటారు. డిస్సర్వీస్ చేయడం సహజము, సర్వీస్ చేయడం చాలా కష్టము. ఒకరు పాడైతే, వారు 10-20 మందిని పాడుచేసేస్తారు. ఇకపోతే, 5-8 మంది చాలా కష్టం మీద వెలువడుతారు. చాలా మంది సెంటర్లకు వస్తూ కూడా ఉంటారు, మళ్ళీ నల్లముఖం కూడా చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి కోతి బుద్ధి కలవారు వాయుమండలాన్ని పాడు చేస్తారు. ఇటువంటివారిని మీరెందుకు కూర్చోబెడతారు! పతితులుగా అయితే దాని ప్రభావము చాలా సమయం నడుస్తుంది. రిజిస్టరు ద్వారా తెలిసిపోతుంది. 4-5 సంవత్సరాలు వచ్చి, మళ్ళీ రావడం మానేస్తారు. బాబా అర్థం చేయిస్తారు, ఇలా చేస్తే మీరు రాజ్య పదవిని పొందలేరు. రాయిగా అయిపోయారని ఇంద్రప్రస్థము గురించిన కథ కూడా ఉంది. మీరు కూడా రాతిబుద్ధి కలవారిగా అయిపోతారు. పారసముగా అవ్వలేరు. అయినా కూడా పురుషార్థం చేయరు, ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. రాజధానిలో నంబరువారుగా కావాలి. నౌకర్లు, చండాలులు మొదలైనవారందరూ కావాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. లౌకిక కోరికలన్నింటినీ వదిలి, ఈశ్వరీయ కులమును వృద్ధి చేయడంలో సహాయకులుగా అవ్వాలి, డిస్సర్వీస్ జరిగే పనులేవీ చేయకూడదు.

2. ఇచ్చిపుచ్చుకునే సంబంధం ఒక్క తండ్రితో పెట్టుకోవాలి, ఏ దేహధారితోనూ కాదు.

వరదానము:-

చివరి సమయంలో నలువైపులా వ్యక్తుల యొక్క, ప్రకృతి యొక్క అలజడి మరియు శబ్దము ఉంటుంది. ఆర్తనాదాలు చేసే, కదిలింపజేసే వాయుమండలం ఉంటుంది. ఇటువంటి సమయంలో సెకండులో అవ్యక్త ఫరిశ్తా సో నిరాకారీ అశరీరి ఆత్మను – ఈ అభ్యాసమే విజయులుగా చేస్తుంది. అందుకే బహుకాలం యొక్క అభ్యాసం ఉండాలి, యజమానిగా అయి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నోటి ద్వారా రాగమును వినిపించండి, వినాలనుకుంటే చెవుల ద్వారా వినాలి, ఒకవేళ వద్దనుకుంటే సెకండులో స్టాప్ – ఈ అభ్యాసమే స్మరణ మాలలోకి అనగా విజయమాలలోకి తీసుకొస్తుంది.

స్లోగన్:-

లవలీన స్థితిని అనుభవం చేయండి

ఆదికాలమైన అమృతవేళలో మీ హృదయంలో పరమాత్మ ప్రేమను సంపూర్ణ రూపంలో ధారణ చేయండి. ఒకవేళ మనసులో పరమాత్మ ప్రేమ, పరమాత్మ శక్తులు, పరమాత్మ జ్ఞానం నిండుగా ఉంటే, ఎప్పుడూ ఎటువైపుకూ ఆకర్షణ లేక స్నేహము వెళ్ళజాలదు.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top