22 December 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

December 21, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - తండ్రి వచ్చారు మీకు భక్తి యొక్క ఫలాన్ని ఇవ్వడానికి, భక్తి యొక్క ఫలం జ్ఞానము, జ్ఞానముతోనే సద్గతి జరుగుతుంది’’

ప్రశ్న: -

ఈ బ్రాహ్మణ కులములో పెద్దవారు అని ఎవరిని అంటారు? వారి గుర్తులు వినిపించండి?

జవాబు:-

బాహ్మణ కులములో అందరికన్నా పెద్దవారు ఎవరంటే, ఎవరైతే మంచి సేవ చేస్తారో వారు. ఎవరికైతే ఎల్లప్పుడూ తమ ఉన్నతి యొక్క చింత (ఆలోచన) ఉంటుందో. ఎవరైతే చదువుకొని చాలా వేగంగా వెళ్తారో. ఇటువంటి మహావీర పిల్లలు తమ తనువు, మనసు, ధనము, అన్నింటినీ ఈశ్వరీయ సేవలోనే సఫలం చేస్తారు. తమ నడవడికపై చాలా అటెన్షన్ పెడతారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నీవు నిద్రించి రాత్రిని పోగొట్టుకున్నావు…

ఓంశాంతి. ఈ పాట అన్ కరెక్ట్ (సరైనది కాదు). ప్రపంచములో మీరు ఏదైతే వింటారో, అదంతా అన్ కరెక్ట్ అనగా అసత్యము. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు – ఓ భారతవాసీ పిల్లలూ! పిల్లలు ఎవరైతే సమ్ముఖంగా ఉన్నారో, వారితోనే అంటారు. మీకు ఇప్పుడు తెలిసింది, అది భక్తి మార్గము. వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు మొదలైనవి ఎన్నో భక్తి మార్గంలో జన్మజన్మాంతరాలుగా చదువుతూ వచ్చారు. గంగా స్నానాలు చేస్తూ వచ్చారు. అడగండి, ఈ కుంభ మేళా ఎప్పటి నుండి జరుగుతూ వస్తుంది. అంటారు, ఇదైతే అనాది అని. ఎప్పటి నుండి చేస్తూ వస్తున్నారు? ఇది చెప్పలేకపోతారు. వారికి ఇది తెలియనే తెలియదు, భక్తి మార్గము ఎప్పుడు నుండి మొదలవుతుంది అన్నది వారికి తెలియనే తెలియదు. కల్పం ఆయువునే తప్పుగా రాసేసారు. అంటారు శాస్త్రాలలో రాయబడి ఉంది – బ్రహ్మా పగలు, బ్రహ్మ రాత్రి అని. ఇది ఒక్క గీతలోనే ఉంది. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు – బ్రాహ్మణులైన మీ పగలు మరియు రాత్రి అనంతమైనవి. అర్ధకల్పము పగలు, అర్ధకల్పము రాత్రి. తప్పకుండా సమానంగా ఉండాలి కదా. అర్ధకల్పము నుండి భక్తి మార్గము మొదలవుతుంది. ఇది ఎవ్వరికీ తెలియదు. సోమనాథ మందిరము ఎప్పుడు తయారయింది? మొట్టమొదట సోమనాథ మందిరమే తయారయింది – అవ్యభిచారీ భక్తి కోసం. మీకు తెలుసు అర్ధకల్పము పూర్తి అవుతుంది, అప్పుడు బ్రహ్మా యొక్క రాత్రి మొదలవుతుంది. లక్షల సంవత్సరాల విషయమైతే అవ్వజాలదు. మహమ్మద్ గజనీ ఆ మందిరం నుండి ఖజానాను దోచుకు వెళ్ళి 13-14 వందల సంవత్సరాలు అయి ఉంటుందని అంటారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, ఈ పాత ప్రపంచంతో మాకు ఎటువంటి సంబంధము లేదు, వేరే-వేరే ధర్మాల వారు ఎవరైతే వస్తారో, వారందరివి మధ్య-మధ్యలో వచ్చే నాటకంలోని అంతర్భాగముల వంటివి. ఇప్పుడైతే వారిది కూడా అంతిమము. తమోప్రధానంగా ఉన్నారు. ఎన్ని వెరైటీలున్నాయి. సూర్యవంశీయులు, తర్వాత చంద్రవంశీయులుగా అయ్యారు, రెండు కళలు తగ్గిపోయాయి. తర్వాత, ఇతర వెరైటీ వారు వస్తూ వచ్చారు. ఈ సమయములో ఉన్నదే భక్తి మార్గము. జ్ఞానముతో పగలు, సుఖం వస్తుంది. భక్తితో రాత్రి, దుఃఖం వస్తుంది. ఎప్పుడైతే భక్తి పూర్తి అవుతుందో, అప్పుడు జ్ఞానము లభిస్తుంది. జ్ఞానమిచ్చేవారు ఒక్కరే జ్ఞానసాగరుడైన తండ్రి. వారు ఎప్పుడు వస్తారో, శివజయంతిని ఎప్పుడు జరుపుకుంటారో, ఇది కూడా ఎవ్వరికీ తెలియదు.

ఇప్పుడు మీకు బాబా కూర్చొని అర్థం చేయిస్తారు, భక్తి ఎంత సమయం నడుస్తుంది, తర్వాత జ్ఞానం ఎప్పుడు లభిస్తుంది. అర్ధకల్పము నుండి ఈ భక్తి మార్గము నడుస్తూనే వస్తుంది. సత్య, త్రేతా యుగాలలో ఈ భక్తి మార్గం యొక్క చిత్రాలు మొదలైనవి ఏవీ ఉండవు. భక్తి యొక్క అంశము కూడా ఉండదు. ఇప్పుడిది కలియుగం యొక్క అంతిమము. ఇప్పుడు భగవంతుడు రావాల్సి వస్తుంది. మధ్యలో ఎవరికీ భగవంతుడు లభించనే లభించరు. ఏ రూపంలో భగవంతుడు లభిస్తారో తెలియదు అని అంటారు. గీతా భగవంతుడు ఒకవేళ కృష్ణుడైతే, వారు మళ్ళీ ఎప్పుడు వస్తారు రాజయోగాన్ని నేర్పించడానికి? మనుష్యులకు ఏమీ తెలియదు. భక్తి మార్గము పూర్తిగా వేరు, జ్ఞానము పూర్తిగా వేరు. గీతలో ఉంది భగవానువాచ. ఓ పతితపావనా రండి అని పాడుతారు కూడా. ఒకవైపు పిలుస్తూ ఉంటారు, ఇంకొకవైపు మళ్ళీ గంగా స్నానము చేయడానికి వెళ్తారు. పతితపావనుడైన పరమాత్మ ఎవరు అనే నిశ్చయం అస్సలు లేదు. పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞానము లభించింది. మీకు తెలుసు, ఇప్పుడు మేము యోగబలంతో సద్గతిని పొందుతామని మీకు తెలుసు. బాబా అంటారు – నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. నేను గ్యారంటీ ఇస్తాను – పతితపావనుడైన తండ్రి అంటారు, నేను 5 వేల సంవత్సరాల క్రితం కూడా ఈ విధంగా చెప్పాను, హే పిల్లలూ, దేహ సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాల నుండి బుద్ధి యోగాన్ని తెంచి నన్ను స్మృతి చేయండి. ఇవి గీత యొక్క మహావాక్యాలు. కానీ నేను గీతను ఎప్పుడు వినిపించాను, ఇది ఎవ్వరికీ తెలియదు. నేను చెప్తాను – 5 వేల సంవత్సరాల క్రితం నేను మీకు గీతను వినిపించాను. ఈ సమయంలో మొత్తం మనుష్య సృష్టి రూపీ వృక్షము శిథిలావస్థకు చేరుకుంది. మీకు కూడా ఇప్పుడు తండ్రి వచ్చి డ్రామా ఆదిమధ్యాంతాలను, మొత్తం చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేయించారు. తండ్రి అయితే తప్పకుండా అంతిమంలోనే వస్తారు కదా. కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం ఎలా అవుతుంది అనేది మీకు తెలుసు. ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది, మేము కొత్త ప్రపంచమైన స్వర్గానికి యజమానులుగా అవుతాము అని. ఇది రాజయోగము, అటువంటప్పుడు మేము ప్రజలుగా ఎందుకు అవ్వాలి. మమ్మా-బాబా, రాజు-రాణిగా అవుతారు అన్నప్పుడు, మేము కూడా ఎందుకు రాజు-రాణిగా అవ్వకూడదు? మమ్మా అయితే యుక్త వయస్సులో ఉన్నారు, ఈ బాబా అయితే వృద్ధులు. అయినా కూడా అందరికన్నా చదువుతూ ఉంటారు కదా. యుక్త వయస్సులో ఉన్నవారైతే అందరికన్నా తీక్షణంగా ఉండాలి కదా. తండ్రి అంటారు – కేవలం నన్ను స్మృతి చేయండి, ఎంత వీలైతే అంత. మిగిలిన వారందరినీ మర్చిపోండి. పాత ప్రపంచంతో వైరాగ్యము. ఎలాగైతే కొత్త ఇల్లు తయారైనప్పుడు, బుద్ధి అటువైపు వెళ్ళిపోతుంది కదా. అది కళ్ళతో చూడడం జరుగుతుంది. ఇది బుద్ధితో తెలుసుకుంటారు. చాలా మందికి సాక్షాత్కారం కూడా జరుగుతుంది. నిజంగా వైకుంఠము, ప్యారడైజ్, హెవెన్ అని కూడా అంటారు. తప్పకుండా ఎప్పుడో ఉండేది కదా. ఇప్పుడు లేదు. ఇప్పుడు మళ్ళీ మీరు రాజ్యాన్ని ప్రాప్తి చేసుకోవడానికి రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. మొట్టమొదటి ముఖ్యమైన విషయమే ఇది – శివ భగవానువాచ. కృష్ణుడైతే భగవంతుడు కాలేరు. వారైతే పూర్తి 84 జన్మలను తీసుకుంటారు. భగవంతుడైతే జనన-మరణాలలోకి రాజాలరు. ఇదైతే చాలా స్పష్టంగా ఉంది. సత్యయుగంలో కృష్ణుడి రూపం ఏదైతే ఉండేదో, అది మళ్ళీ ఉండజాలదు. పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ నామ రూపాలు మారిపోతాయి. ఈ సమయంలో ఆ ఆత్మ కూడా తమోప్రధానంగా ఉంది. కొందరంటారు, కృష్ణుడు ద్వాపరంలో ఉండేవారు అని, కానీ వారి ఆ రూపమైతే ద్వాపరయుగంలో ఉండజాలదు. ద్వాపరంలో పతితుల నుండి పావనంగా చేయడానికి రాలేరు, కృష్ణుడైతే సత్యయుగంలోనే ఉంటారు. వారిని పతితపావనుడు అని అనలేము. గీత భగవంతుడు కృష్ణుడు కాదు, శివుడు. వారు తప్పకుండా వస్తారు కూడా. శివజయంతి కూడా ఉంది. తప్పకుండా ఏదో ఒక రథంలో ప్రవేశిస్తారు. స్వయం కూడా అంటారు – నేను సాధారణ తనువులో వస్తాను. వారి పేరు బ్రహ్మా అని పెడతాను. బ్రహ్మా ద్వారా విష్ణుపురి స్థాపన జరుగుతుంది. మహాభారత యుద్ధము కూడా ఎదురుగా నిలబడి ఉంది. ఈ జ్ఞానమును మంచిగా బుద్ధిలో గుర్తుంచుకోవాలి. బుద్ధిలో ఇది గుర్తుండాలి, మేము విద్యార్థులము, తండ్రి చదివిస్తున్నారు. ఇంకా కొద్ది సమయమే ఉంది. మళ్ళీ బాబా మనల్ని తిరిగి తీసుకువెళ్తారు. ఎవరైతే స్వయాన్ని ఉన్నతంగా తయారుచేసుకుంటారో, వారే ఉన్నత పదవిని పొందుతారు. కానీ మాయ ఎలాంటిదంటే, ఒక్కసారిగా వెర్రివాని వలె తయారుచేసేస్తుంది. చాలా మంది పిల్లలకు సేవ యొక్క అభిరుచి చాలా ఉంది. చిన్న-చిన్న గ్రామాలలో ప్రొజెక్టరు తీసుకువెళ్ళి సేవ చేస్తున్నారు. చాలామంది ప్రజలను తయారుచేస్తే స్వయం తప్పకుండా రాజుగా అవుతారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా కూడా ఉండాలి. చాలా శ్రమ చేయాలి. మాతలు పవిత్రంగా అవుతారు కానీ పతులు అవ్వనివ్వరు, అప్పుడు గొడవలు కూడా జరుగుతాయి. సన్యాసులు స్వయం పవిత్రంగా అయితే స్త్రీని విడిచిపెట్టేస్తారు. మీ రచనను ఎందుకు విడిచిపెట్టి పారిపోయారు అని తర్వాత వారిని ఎవరూ ఏమీ అనరు. పవిత్రంగా అవ్వడం కోసం ఎవరూ వద్దు అని చెప్పలేరు. మేము ఎవరికీ ఇల్లు-వాకిలి విడిచిపెట్టమని చెప్పము. కేవలం పవిత్రంగా అవ్వాలి అని చెప్తాము, మరి ఇందులో తిరస్కారం ఎందుకు ఉండాలి. కానీ ఇందులో మాట్లాడటానికి శక్తి చాలా కావాలి. భగవానువాచ – మీరు పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఇందులో అవస్థ చాలా మంచిగా, దృఢంగా ఉండాలి. మళ్ళీ గుర్తుకొస్తూ ఉండేటట్లుగా, బుద్ధియోగము కుటుంబం వైపుకు వెళ్తూ ఉండేటట్లుగా మోహము మొదలైనవి ఉండకూడదు. అందుకే మళ్ళీ సేవకు యోగ్యంగా అవ్వలేరు. ఇక్కడైతే అనంతమైన సన్యాసము కావాలి. ఇదైతే శ్మశానవాటిక. మనము స్మృతి చేయాలి – తండ్రిని. వారు పరిస్తాన్ లోకి తీసుకువెళ్ళేవారు. ఈ బ్రాహ్మణ కులంలో ఎవరైతే మంచి సేవ చేస్తారో, వారు పెద్దవారు అయినట్లు. వారి పట్ల చాలా గౌరవాన్ని ఉంచాలి. వారిలా సేవ చేయాలి. అప్పుడే ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడైతే మీ ఉన్నతి యొక్క చింత ఉండాలి. తమను తాము చూసుకోవాలి – మేము బాబా నుండి వారసత్వం పొందడానికి యోగ్యులుగా అయ్యామా? తండ్రి వచ్చారు – పావనంగా తయారుచేసి తమతో పాటు తీసుకువెళ్ళడానికి. దానినెలా తిరస్కరిస్తారు? బాబా అందరినీ అడిగినప్పుడు – మేమైతే మహారాణిగా అవుతాము అని అంటారు. మరి అలాంటి నడవడిక కూడా ఉండాలి కదా. చాలామంది చాలా మంచి పిల్లలుగా ఉన్నారు. కానీ ఎవరైతే పురుషార్థమే చేయరో, వారు ఏం పదవిని పొందుతారు? ప్రతి విషయంలో, పురుషార్థంతోనే ప్రారబ్ధము లభిస్తుంది. కొందరు వ్యాధిగ్రస్తులు అవుతారు, మళ్ళీ కోలుకోగానే రాత్రి-పగలు పురుషార్థంలో నిమగ్నమై చదువులో తీక్షణంగా అయిపోతారు. ఇక్కడ కూడా సేవలో నిమగ్నమైపోవాలి. సేవ యొక్క యుక్తులైతే బాబా చాలా తెలియజేస్తారు. ప్రదర్శనీపైన అర్థం చేయించడానికి అభ్యాసము చేయండి.

బాబా అయితే అంటారు – తమ ఉన్నతి చేసుకుని జీవితాన్ని తయారుచేసుకోండి. ఈ చింత ఉండాలి – నేను ఎంత సేవ చేసాను, ఎంతమందిని నా సమానంగా తయారుచేసాను. ఎవరినైనా తమ సమానంగా తయారుచేయకపోతే ఉన్నత పదవిని ఎలా పొందగలరు? అప్పుడిక అర్థం చేసుకోవడం జరుగుతుంది, ప్రజల్లోకి వెళ్ళిపోతారు లేక దాస-దాసీలుగా అవుతారు అని. చాలా సేవ ఉంది. ఇప్పుడు మీ వృక్షము చిన్నదిగా ఉంది. దృఢంగా లేదు. తుఫాన్లు రావడంతో కచ్చాగా ఉన్నవారు పడిపోతారు. మాయ చాలా హైరానా పెడుతుంది. మాయ యొక్క పనే ఉంది బాబా నుండి విముఖముగా చేయడము. నడుస్తూ-నడుస్తూ గ్రహచారము ఎప్పుడైతే తొలగిపోతుందో, అప్పుడు అంటారు, ఇప్పుడిక మేము బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము, తనువు-మనసు-ధనములతో పూర్తి సేవ చేస్తాము. అక్కడక్కడ మాయ పొరపాట్లు చేయిస్తుంది. ఇక శ్రీమతంపై నడవడం మానేస్తారు. మళ్ళీ ఎప్పుడైనా స్మృతి వస్తే, అప్పుడు శ్రీమతంపై నడుస్తారు. ఈ సమయంలో ప్రపంచంలో రావణ సంప్రదాయం ఉంది. ఈ దేవతలు రాముని సంప్రదాయానికి చెందినవారు. రావణ సంప్రదాయం వారు రాముని సంప్రదాయం వారి ముందు తల వంచి నమస్కరిస్తారు. మీకు తెలుసు, మేము విశ్వానికి యజమానులుగా ఉండేవారము. 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తండ్రి అందరి చేత పురుషార్థాన్ని చేయిస్తారు. లేదంటే, చాలా పశ్చాత్తాపపడాల్సి ఉంటుంది, మేము భగవంతుని శ్రీమతంపై నడుచుకోలేదు అని. బాబా అయితే ప్రతిరోజు అర్థం చేయిస్తారు – పిల్లలూ, నిర్లక్ష్యం చేయకండి. ఏ విధంగా మంచి సేవ చేస్తున్నారు అని సేవ చేసేవారిని చూస్తారు. ఫలానావారు ఫస్ట్ గ్రేడ్, ఫలానావారు సెకెండ్ గ్రేడ్ లో సేవ చేసేవారు. తేడా అయితే ఉంటుంది కదా. తండ్రి పిల్లలకు అర్థం అయితే చేయిస్తారు కదా. అజ్ఞాన కాలంలోనైతే తండ్రి చెంపదెబ్బ కూడా కొడతారు. ఇక్కడ ఈ అనంతమైన తండ్రి అయితే ప్రేమగా అర్థం చేయిస్తారు, మీ ఉన్నతిని చేసుకోండి అని. ఎలా వీలైతే అలా పురుషార్థం చేయాలి. తండ్రికి సంతోషం కలుగుతుంది, 5 వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి పిల్లలను కలిసాను, రాజయోగము నేర్పిస్తున్నాను అని. పాట ఉంది కదా – మీరు కూడా వారే, మేము కూడా అప్పటివారిమే. తండ్రి అంటారు – మీరు కూడా ఆ పిల్లలే. ఈ విషయాలను ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. అచ్ఛా!

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్వయాన్ని సేవకు యోగ్యులుగా తయారుచేసుకోవాలి. ఎవరైతే మంచి సేవ చేస్తారో, వారి పట్ల పూర్తి గౌరవం ఉంచాలి. తమ ఉన్నతి కోసం ఆలోచించాలి.

2. తనువు, మనసు, ధనములతో పూర్తి సేవ చేయాలి. శ్రీమతంపై నడుచుకోవాలి. నిర్లక్ష్యము చేయకూడదు.

వరదానము:-

ఎలాగైతే ఏదైనా మిషనరీని సెట్ చేసినప్పుడు, ఒకసారి సెట్ చేస్తే తర్వాత అది ఆటోమేటిక్ గా నడుస్తూ ఉంటుందో, అలా స్వయాన్ని మాస్టర్ ఆల్మైటీ అథారిటీ స్టేజిపై ఒకసారి సెట్ చేసుకున్నట్లయితే, ఎప్పుడూ బలహీనత యొక్క పదాలు వెలువడవు. ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ అదే సెటింగ్ ప్రమాణంగా ఆటోమెటిక్ గా నడుస్తూ ఉంటాయి. ఇదే సెటింగ్ సహజంగా మరియు సదాకాలికంగా కర్మయోగిగా, నిరంతర నిర్వికల్ప సమాధిలో ఉండేటువంటి సహజయోగిగా తయారుచేస్తుంది.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top