22 August 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

21 August 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - మీరు లేస్తూ-కూర్చుంటూ అంతా చేస్తూ మౌనంగా ఉండండి, తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వారసత్వము లభిస్తుంది, ఇందులో పాటలు, కవితలు మొదలైనవాటి అవసరము కూడా లేదు’’

ప్రశ్న: -

తండ్రిని లిబరేటర్ అనడము వలన ఏ విషయం ఋజువు అవుతుంది?

జవాబు:-

తండ్రి దుఃఖాల నుండి లేక 5 వికారాల నుండి విముక్తులుగా చేసేవారు అన్నప్పుడు తప్పకుండా అందులో చిక్కుకునేలా చేసేవారు ఇంకొకరు ఉంటారు. లిబరేటర్ ఎప్పుడూ చిక్కుకునేలా చేయజాలరు. వారిని దుఃఖహర్త, సుఖకర్త అని అంటారు, కావున వారు ఎప్పుడైనా ఎవరికైనా దుఃఖాన్ని ఎలా ఇవ్వగలరు. ఎప్పుడైతే పిల్లలు దుఃఖితులుగా అవుతారో, అప్పుడు ఆ తండ్రిని స్మృతి చేస్తారు. దుఃఖాన్ని ఇచ్చేవారు రావణుడు. రావణ మాయ శ్రాపితులుగా చేస్తుంది. తండ్రి వారసత్వాన్ని ఇచ్చేందుకు వస్తారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఎవరైతే ప్రియునితో పాటు ఉంటారో… (జో పియా కే సాథ్ హై…)

ఓంశాంతి. ఈ జ్ఞాన మార్గంలో పాటలు, కవితలు, డైలాగులు మొదలైనవాటి అవసరం లేదు. అదంతా భక్తి మార్గంలో నడుస్తుంది. ఇక్కడైతే ఇవి అర్థము చేసుకునే విషయాలు. ప్రతి విషయాన్ని బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి మరియు ఇవి చాలా సహజమైనవి అనగా ఈ జ్ఞానం చాలా సహజమైనది. ఒక్క పాయింటుతో కూడా మనుష్యులు పురుషార్థము చేయడము మొదలుపెడతారు. పాటను వినే లేక కవితను తయారుచేసే అవసరమేమీ లేదు. గృహస్థ వ్యవహారంలో ఉండాలి, వ్యాపార-వ్యవహారాలు చేసుకోవాలి. అవన్నీ చేస్తూ మీరు నా నుండి వారసత్వాన్ని ఎలా తీసుకోవచ్చు అన్నది తండ్రి చెప్తారు. వారు అర్థం చేయిస్తారు, లేస్తూ-కూర్చుంటూ అన్నీ చేస్తూ మౌనంగా ఉండాలి, లోలోపల ఆలోచనలు నడుస్తూ ఉండాలి. తండ్రి అర్థం చేయించారు, అర్థం చేసుకునేందుకు ఈ విషయము చాలా సహజమైనది. కొత్త ప్రపంచము పాత ప్రపంచముగా అవ్వడానికి సమయం పడుతుంది. మళ్ళీ పాతదాని నుండి కొత్తదిగా అవ్వడానికి ఇంత సమయం పట్టదు. తండ్రి కొత్త సృష్టిని రచిస్తారని, అది పాతదిగా అవుతుందని పిల్లలకు అర్థం చేయించబడింది. సుఖము మరియు దుఃఖము యొక్క ప్రపంచము తప్పకుండా తయారై ఉంది. కానీ సుఖాన్ని ఎవరు ఇస్తారు, దుఃఖాన్ని ఎవరు ఇస్తారు, ఇది ఎవ్వరికీ తెలియదు. ఇది తప్పకుండా తయారై తయారుచేయబడినది. ఈ చక్రము నుండి మనము బయటపడలేము. దీనిని డ్రామా అని అంటారు. నాటకం అనేందుకు బదులుగా డ్రామా అని అనడము మంచిగా అనిపిస్తుంది. నాటకం ఏదైతే ఉంటుందో, అందులో మార్పు-చేర్పులు జరగవచ్చు. ఎవరినైనా తీయవచ్చు, ఎవరినైనా కలపవచ్చు. ఇంతకుముందు నాటకాలు ఉండేవి, బయోస్కోప్ లైతే ఇప్పుడు వెలువడ్డాయి. బయోస్కోప్ లో ఏ ఫిల్మ్ అయితే షూట్ చేయబడుతుందో, అదే రిపీట్ అవుతుంది. ఈ బయోస్కోప్ లు కూడా వాటి ద్వారా జ్ఞానాన్ని పూర్తిగా అర్థము చేసుకునేందుకే వెలువడ్డాయి. నాటకంలో మార్పులు జరగవచ్చు. బయోస్కోప్ లో మార్పులు జరగజాలవు. ఇది కొత్త పావన ప్రపంచము మరియు పాత పతిత ప్రపంచము యొక్క కథ. కేవలం మనుష్యులకు డ్రామా యొక్క ఆయువు ఎంత అన్నది తెలియదు. చాలా పెద్ద ఆయువును ఇచ్చేసారు. మనుష్యులు ఏమీ అర్థం చేసుకోలేరు. కొత్త ప్రపంచంలో ఇంత తెలివైనవారిగా, ధనవంతలుగా, పవిత్రులుగా, సర్వ గుణ సంపన్నులుగా ఉండేవారు. బాబా ఈ రోజు ఈ విధంగా ఎందుకు అర్థం చేయిస్తున్నారు? పిల్లలు కూడా వెళ్ళి ఈ విధంగా భాషణ చేయాలని అర్థం చేయిస్తున్నారు. మొట్ట మొదట భారత్ యొక్క మహిమను చేయాలి. భారత్ ను ఈ విధంగా ఎవరు తయారుచేసారు? అప్పుడు పరమపిత పరమాత్మ మహిమ వెలువడుతుంది, వారిని అందరూ స్మృతి చేస్తారు. ఎందుకు స్మృతి చేస్తారు? ఎందుకంటే పాత ప్రపంచంలో చాలా దుఃఖము ఉంది. 5 వికారాలే దుఃఖాన్ని ఇస్తాయి. సత్య-త్రేతా యుగాలను సుఖధామము అని అంటారు. అది ఉన్నదే ఈశ్వరీయ స్థాపన. ఇది మళ్ళీ ఆసురీ స్థాపన. ఇందులో మనుష్యులు పంచ వికారాలలో చిక్కుకుని ఉంటారు. తండ్రే లిబరేట్ చేస్తారని అర్థము చేసుకుంటారు కూడా. ఎవరు లిబరేటర్ గా ఉన్నారో, వారు చిక్కుకునేలా చేస్తారా ఏమిటి. వారి పేరే ఉంది దుఃఖహర్త -సుఖకర్త. వారిని మనం దుఃఖకర్త అని అనలేము. ఈ దుఃఖాన్ని ఇచ్చేది పంచ వికారాలే అన్నది ఎవ్వరికీ తెలియదు. వీటి నుండి తండ్రి వచ్చి విడిపిస్తారు. ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన విషయము. మొత్తం ప్రపంచములో ఈ సమయము రావణ రాజ్యము ఉంది. కేవలం లంక యొక్క విషయము కాదు. మనుష్యులకు తమ-తమ అభిప్రాయాలు ఉంటాయి. ఎవరి బుద్ధిలోకి ఏది వస్తే అది రాసేస్తారు. ఈ శాస్త్రాలు కూడా అలాగే తయారుచేయబడ్డాయి. తమ-తమ శాస్త్రాలను తయారుచేసుకుంటారు. మనుష్యులకు ఏమీ తెలియదు. భగవానువాచ – ఈ వేద శాస్త్రాలు చదవడము, యజ్ఞ తపాదులు మొదలైనవి చేయడము ఏదైతే మీరు చేస్తూ వచ్చారో, అవన్నీ దిగే కళకు చెందినవి. ఏవైతే మీరు తయారుచేసారో, అవన్నీ మిమ్మల్ని పడేసేందుకే. మీకు కిందకు పడిపోయే మతమే లభిస్తుంది ఎందుకంటే ఇది ఉన్నదే దిగే కళ. ఒకప్పుడు పావన ప్రపంచము ఉండేది. ఇప్పుడు పతిత ప్రపంచము ఉంది. అర్ధకల్పము కొత్త ప్రపంచము, అర్ధకల్పము పాత ప్రపంచము ఉంటుంది. ఎలాగైతే 24 గంటలు ఉంటాయి. 12 గంటల తర్వాత పగలు పూర్తయి, మళ్ళీ రాత్రి అవుతుంది. అలాగే ఇది బ్రహ్మా యొక్క పగలు, బ్రహ్మా యొక్క రాత్రి అని అంటూ ఉంటారు. విష్ణు యొక్క పగలు, రాత్రి అని అనరు. ఇవి ఎంత గుహ్యమైన విషయాలు. కేవలం తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. తండ్రి అర్థం చేయిస్తారు, ఇప్పుడు తమోప్రధానము నుండి సతోప్రధానములోకి వెళ్ళాలి. ఇప్పుడింకా మన రాజ్య స్థాపన జరగలేదు. తండ్రి ఎంత సహజంగా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. కేవలం శివబాబాను స్మృతి చేయాలి. తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలి. ఈ విషయాలను అబలలైన మీరే అర్థం చేసుకోగలరు. కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచము. కొత్త ప్రపంచాన్ని రచించేవారు తండ్రి. కొత్త ప్రపంచము స్వర్గంగా ఉండేది. మళ్ళీ నరకాన్ని ఎవరు తయారుచేసారు? రావణుడు. రావణుడు ఎవరు? ఈ రహస్యం కూడా మీకు అర్థం చేయించారు. విద్వాంసులు, పండితులు మొదలైనవారెవ్వరూ కూడా అర్థం చేసుకోలేరు. వారైతే జగత్తు మిథ్య, అంతా కల్పన అని అనేస్తారు. మీరు అర్థము చేయించవచ్చు – ఒకవేళ జగత్తు తయారవ్వకపోతే మీరు ఎక్కడ కూర్చుని ఉన్నారు? ఈ ప్రపంచము ఏదైతే రిపీట్ అవుతుందో, దాని పూర్తి జ్ఞానము కావాలి కదా. జ్ఞానం లేని కారణంగా అంతా మిథ్య అని అంటారు, ఎవరు ఏది వినిపిస్తే అది సత్యము అని అంటారు. మీరైతే ఒక్క విషయంలోనే సంతోషపడతారు. తండ్రి అయితే చాలా మంచి రీతిలో అర్థం చేయిస్తారు. తండ్రి అయితే అర్ధకల్పం యొక్క వారసత్వాన్ని ఇచ్చారు. మళ్ళీ రావణుడితో ఓడిపోయారు. ఈ ఆట తయారై ఉంది.

పిల్లలైన మీకు తెలుసు, ఇప్పుడు మనము ఈశ్వరునికి చెందినవారిగా అయ్యాము మరియు వారి శ్రీమతముపై నడుచుకుంటున్నాము. ఈ చిత్రాలైతే ఎంత మంచిగా ఉన్నాయి. అందరి వద్ద పెద్ద చిత్రాలు ఉండాలి. పెద్ద చిత్రాల పైన అర్థం చేయించడము బాగుంటుంది. చక్రము ఎదురుగా ఉంది. సంగమయుగం కూడా మీ ముందు ఉంది. కలియుగము నల్లగా, పతితముగా ఉంది. దానిలో లోహపు కల్తీ కలవడము వలన నల్లగా అయిపోయారు. భారత్ ఎంత బంగారు యుగముగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఇది ఇనుప యుగము నుండి మార్పు చెందాలి. దాని స్థాపన మరియు దీని వినాశనం జరగాలి. పరమపిత పరమాత్మకు త్రిమూర్తి అని గాయనం కూడా ఉంది. త్రిమూర్తి యొక్క అర్థాన్ని కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు. రోడ్డుకు కూడా త్రిమూర్తి అన్న పేరును పెట్టారు. వాస్తవానికి త్రిమూర్తులు బ్రహ్మా, విష్ణు, శంకరులు. ఈ ముగ్గురు దేవతలు వేర్వేరు. వీరందరికన్నా ఉన్నతోన్నతమైనవారు పరమపిత శివ పరమాత్మ, వారే చేసేవారు చేయించేవారు. వారిని మాయం చేసేసారు. దేవతల కన్నా కూడా ఉన్నతమైనవారు నిరాకారుడైన భగవంతుడే. ఎలాగైతే తండ్రి నిరాకారుడో, అలా ఆత్మలమైన మనము కూడా నిరాకారులము. మనము ఇక్కడకు పాత్రను అభినయించడానికి వచ్చాము. లక్ష్మీ-నారాయణుల వంశము ఉండేది. ఒకరి వెనుక ఒకరు రాజ్యం చేస్తూ వస్తారు. కనుక స్వర్గం యొక్క మహిమను వినిపించాల్సి ఉంటుంది. భారత్ ఎంత సంపన్నంగా ఉండేది. పవిత్రత, శాంతి, సంపన్నత ఉండేది. ఎప్పుడూ అకాల మృత్యువులు జరిగేవి కావు, కొత్త ప్రపంచం ఉండేది. తండ్రే కొత్త ప్రపంచాన్ని రచించారు. తండ్రి 16 కళల సంపూర్ణులుగా చేస్తారు. పిల్లలూ, మన్మనాభవ, నన్నొక్కరినే స్మృతి చేయండి అని అంటారు. ఇది భగవానువాచ. వారిని పతిత-పావనుడు అని అంటారు. శ్రీకృష్ణుడిని జ్ఞానసాగరుడు అని అనరు. మరి గీతలో శ్రీకృష్ణుని పేరును ఎందుకు వేసారు! ఎవరి ద్వారానైనా సాక్షాత్కారము జరిగితే, ఇక అంతే వీరు శ్రీకృష్ణుని రూపము అని అంటారు. ప్రపంచంలోనైతే అనేక రకాల మనుష్యులు ఉన్నారు. ఎవరిపైన అయినా భావన కూర్చుంటే, వారి లాకెట్ ను తయారుచేసుకుని మెడలో వేసుకుంటారు. గురువు చిత్రమున్న లాకెట్ ను వేసుకొని గురువును స్మృతి చేస్తారు. ఈశ్వరుడు సర్వవ్యాపి, కావున గురువు మరియు ఈశ్వరునిలో తేడాయే లేదు అని ఇలా అనేవారు లెక్కలేనంతమంది ఉన్నారు. తండ్రి పిల్లలైన మీకు పాత ప్రపంచము మరియు కొత్త ప్రపంచము యొక్క రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. తండ్రి కూర్చుని కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. ఇప్పుడు అందరూ తండ్రిని పిలుస్తూ ఉంటారు, వచ్చి పావన ప్రపంచాన్ని స్థాపన చేయండి లేక మమ్మల్ని పావనంగా తయారుచేసి తీసుకువెళ్ళండి. ధామాలైతే రెండు – నిర్వాణ ధామము మరియు సుఖధామము. సన్యాసులైతే ముక్తి కోసం జ్ఞానాన్ని ఇస్తారు. జీవన్ముక్తి కోసం ఇవ్వలేరు. మీరు దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు. ఎవరైతే పూజారిగా అయ్యారో, వారే మళ్ళీ పూజ్యులుగా అవ్వాలి. శ్రీకృష్ణుడు సత్యయుగం యొక్క రాకుమారుడు. వారికి మహిమ జరుగుతుంది. కుమార-కుమారీలకే మహిమ జరుగుతుంది ఎందుకంటే వారు పవిత్రంగా ఉంటారు కదా. నిజానికి శ్రీకృష్ణుని కన్నా రాధేకు ఎక్కువ మహిమ జరగాలి కానీ ఇది ఎవ్వరికీ తెలియదు. మొదట రాధే, ఆ తర్వాత కృష్ణుడు, ఇలా ఎందుకు! రాధే-కృష్ణులు అని అంటారు. కృష్ణ-రాధే అని అతి కష్టం మీద ఎవరో అంటారు. కుమారుడు వారసత్వానికి హక్కుదారునిగా అవుతాడు, అందుకే శ్రీకృష్ణునికి మహిమ ఎక్కువగా ఉందని భావిస్తారు. ఇక్కడ మీరందరూ పుత్రులే.

తండ్రి అంటారు – ఎంతగా పురుషార్థము చేస్తారో, అంతగా కల్ప-కల్పాంతరాలకు తమ కోసమే ఉన్నత పదవిని పొందుతారు. తండ్రి ఆత్మలతో మాట్లాడుతున్నారు, పురుషార్థముతో మీరు ఉన్నత పదవిని పొందగలరు. విదేశాలలో కుమార్తె జన్మిస్తే సంతోషాలు జరుపుకుంటారు. ఇక్కడ కుమారుడు పుడితే సంతోషిస్తారు. ప్రతి ఒక్కరి ఆచారాలు ఎవరివి వారివి. కావున పిల్లల బుద్ధిలో ఇప్పుడు కూర్చుని ఉంది, తండ్రి వారసత్వాన్ని ఇస్తారు, మళ్ళీ మాయ శాపాన్ని ఇస్తుంది. ఆ గాడ్ ఫాదర్ స్వర్గ రచయిత. శ్రీకృష్ణుని కోసం ఎప్పుడూ అలా అనలేరు, పరమాత్మయే నరకాన్ని స్వరంగా తయారుచేస్తారు. సహజ జ్ఞానాన్ని మరియు యోగాన్ని వారే నేర్పిస్తారు. ఈ విధంగా మీరు భాషణ చేయవచ్చు. గీతలో శ్రీకృష్ణుని పేరు వేసి ఖండితం చేసేసారు. గీతా భగవంతుడు నిరాకార పరమాత్మ, శ్రీకృష్ణుడు కాదు. శ్రీకృష్ణుడు అయితే రచన. వారికి కూడా వారసత్వము తండ్రి నుండి లభించింది. అది ఎలా అన్నది మీరు వస్తే అర్థం చేయిస్తాము. ఏ విషయాన్ని అయినా తీసుకొని దానిపై అర్థం చేయించడము మొదలుపెట్టండి. పాత ప్రపంచము, కొత్త ప్రపంచములపై అర్థం చేయించడముతో అందులో అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు అనేక ధర్మాలు ఉన్నాయి. వాటి మధ్యలో ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం స్థాపన అవుతూ ఉంది. ఎంతగా అర్థము చేయించడము జరుగుతుంది, ఈ 5 వికారాలను విడిచిపెట్టండి. ఇంట్లో కూడా ఎవరిపైనా క్రోధము చేయకండి. నేను ఎటువంటి కర్మను చేస్తానో, నన్ను చూసి మళ్ళీ ఇతరులు చేస్తారు అన్న ఆలోచన రావాలి. నేను వికారిగా అయితే నన్ను చూసి ఇతరులు కూడా వికారిగా అవుతారు. తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు, ఇప్పుడు పవిత్రంగా అవ్వండి. స్త్రీని కూడా పవిత్రంగా చేయండి. ఎవరిపైనా క్రోధం చేయకండి. మిమ్మల్ని చూసి వారు కూడా చేయడము మొదలుపెడతారు. పురుషుడైతే రచయిత కావున స్త్రీకి కూడా అర్థం చేయించాలి, అయినా ఒకవేళ భాగ్యములోనే లేకపోతే ఏం చేయగలము. పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి యజమానిగా అవుతారని అర్థం చేయించాలి. మీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారు అన్నది తండ్రి అర్థం చేయిస్తారు. మొదట మీరు సతోప్రధానంగా, పావనంగా ఉండేవారు. తర్వాత రజో, తమోగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ మీరు నన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా అవుతారు. గీతలోని మహావాక్యాలే భగవంతుడు చెప్తున్నారు. గీతలో శ్రీకృష్ణుని పేరు వేయడంతో వారి మొత్తం జీవిత కథ సమాప్తమైపోతుంది. ఇవి అర్థం చేయించేందుకు కూడా ధైర్యము ఉండాలి. బాబా అర్థం చేయిస్తూ ఉంటారు, చాలామంది పిల్లలు మేమైతే శివబాబానే అంగీకరిస్తాము, వారి ద్వారానే కళ్యాణము జరగనున్నది అని భావిస్తారు. పొరపాటు చేస్తే, బాబా సూచననిస్తారు. కానీ చాలామంది పిల్లలు ఉప్పు నీరుగా అయిపోతారు, ఉప్పునీరుగా అవ్వకూడదు. అలా చేయకండి అని అర్థం చేయించడము జరుగుతుంది. కొంతమంది ఎలా ఉంటారంటే, ఒకరిపై ఒకరు గౌరవాన్ని కూడా ఉంచుకోరు. తమ కన్నా పెద్దవారితో కూడా నువ్వు-నువ్వు అంటూ మాట్లాడుతారు. తెలివైన పిల్లలకు సేవపై చాలా అభిరుచి ఉండాలి. ఫలానా సెంటర్ తెరిచి ఉంది, మేము అక్కడికి వెళ్ళి సేవ చేయాలి అని ఉండాలి. ఎవరైతే చెప్పకముందే చేస్తారో వారు దేవతలు. చెప్తే చేసేవారు మనుష్యులు, చెప్పినా కూడా చేయకపోతే… అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సదా ఈ విషయం గుర్తుంచుకోవాలి, ఏ కర్మలు మనము చేస్తామో, మనల్ని చూసి ఇతరులు కూడా చేయడము మొదలుపెడతారు, అందుకే ఎప్పుడూ కూడా శ్రీమతానికి విపరీతంగా, వికారాలకు వశమై ఏ కర్మను కూడా చేయకూడదు.

2. సేవ యొక్క అభిరుచి ఉంచుకోవాలి. చెప్పకముందే సేవలో నిమగ్నమవ్వాలి. ఎప్పుడూ పరస్పరంలో ఉప్పునీరులా అవ్వకూడదు.

వరదానము:-

సంగమయుగము ఆత్మిక ఆనందాలలో ఉండే యుగము, అందుకే సదా ఆనందంగా ఉండండి, ఎప్పుడూ తికమకపడకండి. ఏదైనా పరిస్థితి లేక పరీక్షలో కొద్ది సమయం కోసమైనా తికమకపడ్డారు మరియు ఆ ఘడియే అంతిమ ఘడియ వస్తే, అంత మతి సో గతి ఏమవుతుంది! అందుకే సదా ఎవర్రెడీగా ఉండండి. ఏ సమస్య కూడా సంపూర్ణంగా అవ్వడంలో విఘ్న రూపంగా అవ్వకూడదు. సదా ఈ స్మృతి ఉండాలి, నేను ప్రపంచంలో అందరికన్నా విలువైన, విశేషమైన ఆత్మను, నా ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ విశేషంగా ఉండాలి, ఒక్క క్షణం కూడా వ్యర్థమవ్వకూడదు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top