22 April 2021 TELUGU Murli Today – Brahma Kumaris

April 21, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Malayalam. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - భారత్ కు ముక్తినిచ్చేందుకు తండ్రి వచ్చారు, పిల్లలైన మీరు ఈ సమయంలో తండ్రికి సహాయకులుగా అవుతారు, భారత్ యే ప్రాచీన ఖండము”

ప్రశ్న: -

ఉన్నతమైన గమ్యంలో ఆటంకాలు కలిగించేటువంటి చిన్న-చిన్న విషయాలు ఏమిటి?

జవాబు:-

ఒకవేళ దేనిపట్లనైనా కొద్దిగా ఆసక్తి ఉన్నా, అనాసక్త వృత్తి లేకపోయినా, మంచివి ధరించాలి, తినాలి అని బుద్ధి భ్రమిస్తూ ఉన్నట్లయితే….. ఈ విషయాలు ఉన్నతమైన గమ్యానికి చేరుకోవడంలో ఆటంకాలను కలిగిస్తాయి, అందుకే బాబా అంటారు – పిల్లలూ, వనవాహంలో ఉండండి, మీరు అన్నింటినీ మర్చిపోవాలి, ఈ శరీరం కూడా గుర్తుండకూడదు.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. ఈ భారత్ యే అవినాశీ ఖండమని మరియు దీని అసలైన పేరు భారత ఖండమని పిల్లలకు అర్థం చేయించారు. హిందుస్థాన్ అనే పేరు తర్వాత వచ్చింది. భారత్ ను ఆధ్యాత్మిక ఖండమని అంటారు, ఇది ప్రాచీన ఖండము. కొత్త ప్రపంచంలో భారత ఖండము ఉన్నప్పుడు, వేరే ఖండాలేవీ ఉండేవి కావు. ముఖ్యమైన ధర్మాలు ఇస్లామ్, బౌద్ధ మరియు క్రిస్టియన్ ధర్మాలు. ఇప్పుడైతే చాలా ఖండాలు ఏర్పడ్డాయి. భారత్ అవినాశీ ఖండము, దీనినే స్వర్గం, హెవెన్ అని అంటారు. కొత్త ప్రపంచంలో కొత్త ఖండముగా ఒక్క భారత్ మాత్రమే ఉంటుంది. కొత్త ప్రపంచాన్ని రచించేవారు పరమపిత పరమాత్మ, స్వర్గ రచయిత హెవెన్లీ గాడ్ ఫాదర్. ఈ భారత్ అవినాశీ ఖండమని భారతవాసులకు తెలుసు. భారత్ స్వర్గంగా ఉండేది. ఎవరైనా మరణించినప్పుడు, వారు స్వర్గస్థులయ్యారని అంటారు, స్వర్గం ఎక్కడో పైన ఉందని భావిస్తారు. దిల్వాడా మందిరంలో కూడా వైకుంఠం యొక్క చిత్రాలను పైకప్పులో చూపించారు. భారత్ యే స్వర్గంగా ఉండేదని, ఇప్పుడు అలా లేదని ఎవరి బుద్ధిలోకీ రాదు. ఇప్పుడైతే ఇది నరకముగా ఉంది. కావున ఇది కూడా అజ్ఞానమే. జ్ఞానము మరియు అజ్ఞానము అనే రెండు విషయాలుంటాయి. జ్ఞానాన్ని పగలు అని, అజ్ఞానాన్ని రాత్రి అని అంటారు. అపారమైన ప్రకాశము మరియు ఘోరమైన అంధకారమని అంటారు. ప్రకాశము అనగా ఉదయము, అంధకారమనగా అస్తమయము. మనుష్యులు సూర్యాస్తమయాన్ని చూడడానికి సన్ సెట్ పాయింటు వద్దకు వెళ్తారు. అది హద్దు విషయము. దీనిని బ్రహ్మా పగలు, బ్రహ్మా రాత్రి అని అంటారు. ఇప్పుడు బ్రహ్మా అయితే ప్రజాపిత కనుక తప్పకుండా ప్రజలకు తండ్రి అవుతారు. జ్ఞాన అంజనాన్ని సద్గురువు ఇచ్చారు, అజ్ఞాన అంధకారము వినాశనమయిందని అంటారు. ఈ విషయాలను ప్రపంచంలోని వారెవరూ అర్థం చేసుకోరు. ఇది కొత్త ప్రపంచం కోసం కొత్త నాలెడ్జ్. హెవెన్ కోసం హెవెన్లీ గాడ్ ఫాదర్ ఇచ్చే నాలెడ్జ్ కావాలి. ఫాదర్ ఈజ్ నాలెడ్జ్ ఫుల్ అని కూడా పాడుతారు కనుక వారు టీచర్ అయినట్లు. ఫాదర్ ను పతితపావనుడు అని అంటారు, ఇంకెవ్వరినీ పతితపావనుడు అని అనలేరు. శ్రీకృష్ణుడిని కూడా అలా అనలేరు. ఫాదర్ అయితే అందరికీ ఒక్కరే. శ్రీకృష్ణుడు అందరికీ ఫాదర్ కాదు. అతను పెద్దవాడై, వివాహం చేసుకున్న తర్వాత, ఒకరిద్దరు పిల్లలకు తండ్రి అవుతారు. రాధా-కృష్ణులను రాకుమారీ, రాకుమారుడు అని అంటారు. వారి స్వయంవరం కూడా ఎప్పుడో జరిగి ఉంటుంది. వివాహం తర్వాతనే తల్లిదండ్రులుగా అవ్వగలరు. అతడిని ఎవ్వరూ ఎప్పుడూ వరల్డ్ గాడ్ ఫాదర్ అని అనలేరు. వరల్డ్ గాడ్ ఫాదర్ అని కేవలం నిరాకార తండ్రి ఒక్కరినే అంటారు. గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని శివబాబాను అనలేరు. గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ప్రజాపిత బ్రహ్మా. వారి నుండి వంశవృక్షం వెలువడుతుంది. వారు (శివబాబా) నిరాకార గాడ్ ఫాదర్, నిరాకార ఆత్మలకు తండ్రి. నిరాకారీ ఆత్మలు ఇక్కడ శరీరంలో ఉన్నప్పుడు, భక్తి మార్గంలో వారిని పిలుస్తారు. మీరు ఈ కొత్త విషయాలను వింటున్నారు. యథార్థ రీతిలో ఇవి ఏ శాస్త్రాలలోనూ లేవు. నేను సమ్ముఖంలో కూర్చొని పిల్లలైన మీకు అర్థం చేయిస్తాను అని తండ్రి అంటారు. తర్వాత ఈ జ్ఞానమంతా మాయమైపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే తండ్రి వస్తారో, అప్పుడు యథార్థమైన జ్ఞానాన్ని వినిపిస్తారు. పిల్లలకే సమ్ముఖంలో అర్థం చేయించి వారసత్వాన్నిస్తారు. తర్వాత శాస్త్రాలు తయారవుతాయి. అవి యథార్థంగా తయారవ్వవు ఎందుకంటే సత్యమైన ప్రపంచము సమాప్తమై, అసత్య ఖండంగా మారిపోతుంది. కనుక ఇక్కడ అసత్యమైన విషయాలే ఉంటాయి ఎందుకంటే దిగే కళే ఉంటుంది. సత్యం ద్వారా ఎక్కే కళ ఏర్పడుతుంది. భక్తి రాత్రి వంటిది, అంధకారంలో ఎదురు దెబ్బలు తినవలసి ఉంటుంది. తల వంచి నమస్కరిస్తూ ఉంటారు. అంతటి ఘోరమైన అంధకారం ఉంటుంది. మనుష్యులకైతే ఏమీ తెలియదు. ప్రతి ముంగిట ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. ఈ సూర్యునికి కూడా ఉదయించడం మరియు అస్తమించడం ఉంటుంది, పిల్లలు వెళ్ళి దానిని చూస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు జ్ఞాన సూర్యుడు ఉదయించడాన్ని చూడాలి. భారత్ యొక్క ఉన్నతి మరియు భారత్ యొక్క పతనము. సూర్యుడు అస్తమించినట్లుగా, భారత్ కూడా అస్తమిస్తుంది. భారత్ యొక్క నావ కిందకు వెళ్ళిపోతుందని, మళ్ళీ తండ్రి వచ్చి దానికి ముక్తినిచ్చారని సత్యనారాయణ కథలో చూపిస్తారు. మీరు ఈ భారత్ కు మళ్ళీ ముక్తినిస్తారు. ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మీరు ఆహ్వానం కూడా ఇస్తారు. నవ-నిర్మాణ ప్రదర్శినీ అనే పేరు బాగుంది. కొత్త ప్రపంచం ఎలా స్థాపనవుతుంది అన్నది చూపించే ప్రదర్శినీ ఇది. చిత్రాల ద్వారా అర్థం చేయించడం జరుగుతుంది, కనుక అదే పేరు కొనసాగడం మంచిది. కొత్త ప్రపంచ స్థాపన ఎలా జరుగుతుంది మరియు ఉన్నతి ఎలా జరుగుతుంది అనేది మీరు చూపిస్తారు. తప్పకుండా పాత ప్రపంచం పతనమవుతుంది, అందుకే ఉన్నతి ఎలా జరుగుతుంది అనేది మీరు చూపిస్తారు. రాజ్యాన్ని తీసుకోవడము మరియు కోల్పోవడము అనేది కూడా ఒక కథ. 5 వేల సంవత్సరాల క్రితం ఏముండేది. సూర్యవంశీయుల రాజ్యముండేదని అంటారు. తర్వాత చంద్రవంశీయుల రాజ్య స్థాపన జరిగింది. వారు ఒకరి నుండి మరొకరు రాజ్యాన్ని తీసుకుంటారు. ఫలానావారి నుండి రాజ్యాన్ని తీసుకున్నట్లుగా చూపిస్తారు. వారు మెట్ల చిత్రాన్ని ఏమీ అర్థం చేసుకోరు. మీరు స్వర్ణిమ యుగం నుండి వెండి యుగంలోకి మెట్లు దిగుతూ వెళ్ళారని తండ్రి అర్థం చేయిస్తారు. ఇది 84 జన్మల మెట్లు వరుస. మెట్లు దిగవలసి ఉంటుంది, మళ్ళీ ఎక్కవలసి ఉంటుంది కూడా. పతనం యొక్క రహస్యాన్ని కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. భారత్ యొక్క పతనం ఎంత సమయము, ఉన్నతి ఎంత సమయము. భారతవాసుల పతనము మరియు ఉన్నతి. మనుష్యులకు ఉత్సుకతను ఎలా కలిగించాలి అని విచార సాగర మథనం చేయవలసి ఉంటుంది. అంతేకాక సోదరీ సోదరులారా, వచ్చి తెలుసుకోండి అన్న ఆహ్వానాన్ని కూడా ఇవ్వాలి. ముందు తండ్రి మహిమను తెలియజేయాలి. శివబాబా మహిమను తెలిపే ఒక బోర్డు కూడా ఉండాలి. పతితపావనుడు, జ్ఞాన సాగరుడు, పవిత్రతా సాగరుడు, సుఖ-శాంతుల సాగరుడు, సంపత్తి సాగరుడు, సర్వుల సద్గతిదాత, జగత్ పిత, జగత్ శిక్షకుడు, జగత్ గురువు అయిన శివబాబా నుండి మీ సూర్యవంశీ, చంద్రవంశీ వారసత్వాన్ని తీసుకోండి అని ఉండాలి. అప్పుడు మనుష్యులకు తండ్రి గురించి తెలుస్తుంది. తండ్రి మహిమ మరియు శ్రీకృష్ణుని మహిమ వేర్వేరు. ఇది మీ బుద్ధిలో కూర్చొని ఉంది. సర్వీసబుల్ పిల్లలు ఎవరైతే ఉంటారో, వారు రోజంతా పరుగులు పెడుతూ ఉంటారు. తమ లౌకిక ఉద్యోగం ఉన్నప్పటికీ, సెలవు తీసుకొని సర్వీసులో నిమగ్నమవుతారు. ఇది ఈశ్వరీయ గవర్నమెంట్. విశేషంగా కుమారీలు, ఒకవేళ ఇటువంటి సర్వీసులో నిమగ్నమైనట్లయితే, ఎంతో పేరును తీసుకురాగలరు. సర్వీసబుల్ పిల్లల పాలన అయితే మంచి రీతిగా జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే శివబాబా భండారా నిండుగా ఉంటుంది. ఏ భండారా నుండైతే భుజించారో, ఆ భండారా నిండుగా, కాల కంటకాలకు దూరంగా ఉంటుంది.

మీరు శివ వంశీయులు. వారు రచయిత, ఇది వారి రచన. బబుల్ (తండ్రి) అనే పేరు చాలా మధురమైనది. శివుడు ప్రియుడు కూడా కదా. శివబాబా మహిమయే వేరు. నిరాకారుడు అనే పదం రాయడం వలన, వారికి ఎటువంటి ఆకారం లేదని భావిస్తారు. అత్యంత ప్రియమైనవారు శివబాబా – పరమ ప్రియుడు అని తప్పకుండా రాయాలి. ఈ సమయంలో ఇది వారికి మరియు మీకు కూడా యుద్ధ మైదానమే. శివశక్తులు అహింసకులని గాయనం చేయడం జరుగుతుంది. కానీ చిత్రాలలో దేవీలకు కూడా ఆయుధాలనిచ్చి హింసను చూపించారు. వాస్తవానికి మీరు యోగబలం లేక స్మృతిబలం ద్వారా విశ్వరాజ్యాధికారాన్ని తీసుకుంటారు. ఆయుధాలు మొదలైనవాటి మాటే లేదు. గంగ యొక్క ప్రభావం చాలా ఉంది. చాలామందికి సాక్షాత్కారం కూడా జరుగుతుంది. గంగా జలం లభిస్తే ఉద్ధరణ జరుగుతుందని భక్తి మార్గంలో భావిస్తారు, అందుకే గుప్త గంగ అని అంటూ ఉంటారు. బాణం వేయగానే గంగ వెలువడిందని అంటారు. గోముఖం నుండి కూడా గంగను చూపిస్తారు. మీరు అడిగితే, గుప్త గంగ వెలువడుతూ ఉందని అంటారు. త్రివేణిలో కూడా సరస్వతిని గుప్తంగా చూపించారు. మనుష్యులు ఎన్నో విషయాలను తయారుచేసారు. ఇక్కడైతే ఒకటే విషయము. కేవలం అల్ఫ్ (భగవంతుడు), అంతే. అల్లాహ్ వచ్చి బహిష్త్ ను స్థాపన చేస్తారు. ఖుదా హెవెన్ ను స్థాపన చేస్తారు. ఈశ్వరుడు స్వర్గాన్ని స్థాపన చేస్తారు. వాస్తవానికి ఈశ్వరుడైతే ఒక్కరే. వారు తమ-తమ భాషల్లో రకరకాల పేర్లను పెట్టుకున్నారు. కానీ అల్లాహ్ నుండి తప్పకుండా స్వర్గ రాజ్యాధికారం లభిస్తుందని భావిస్తారు. ఇక్కడైతే తండ్రి, మన్మనాభవ అని అంటారు. తండ్రిని స్మృతి చేయడంతో వారసత్వం తప్పకుండా గుర్తుకొస్తుంది. స్వర్గము రచయిత యొక్క రచన. రాముడు నరకాన్ని రచించారని అనరు. నిరాకార రచయిత ఎవరు అనేది భారతవాసులకు అసలు తెలియదు. నరకానికి రచయిత రావణుడని, అతడిని కాలుస్తారని మీకు తెలుసు. రావణ రాజ్యంలో భక్తి మార్గపు అంటు ఎంత పెద్దది. రావణుని రూపాన్ని కూడా చాలా భయంకరంగా తయారుచేసారు. రావణుడు మా శత్రువు అని కూడా అంటారు. విస్తారము ఎక్కువగా ఉన్నందుకు, రావణుని శరీరాన్ని కూడా పెద్దదిగా తయారుచేస్తారు అని తండ్రి దీని అర్థాన్ని తెలియజేసారు. శివబాబా అయితే బిందువు కానీ చిత్రాన్ని పెద్దదిగా చేసారు. లేదంటే బిందువుకు ఎలా పూజ జరుగుతుంది. పూజారులుగా అయితే అవ్వాలి కదా. ఆత్మ గురించి – భృకుటి మధ్యలో ప్రకాశించే అద్భుతమైన నక్షత్రమని అంటారు. మళ్ళీ ఆత్మయే పరమాత్మ అని అంటారు. అటువంటప్పుడు వారు వేలాది సూర్యుల కన్నా తేజోమయంగా ఎలా ఉండగలరు. ఆత్మను వర్ణిస్తారు కానీ అర్థం చేసుకోరు. ఒకవేళ పరమాత్మ వేలాది సూర్యుల కన్నా తేజోమయంగా ఉన్నట్లయితే, ప్రతి ఒక్కరిలోనూ ఎలా ప్రవేశించగలరు. ఇవి ఎంతటి అయథార్థమైన విషయాలు, వీటిని విని ఎలా అయిపోయారు. ఆత్మయే పరమాత్మ అని అంటారు, మరి తండ్రి రూపం కూడా అలాగే ఉండాలి కదా, కానీ పూజ కోసం పెద్దగా తయారుచేసారు. రాతితో ఎంతో పెద్ద-పెద్ద చిత్రాలను తయారుచేస్తారు. గుహలలో పాండవులను పెద్ద-పెద్ద రూపాలలో చూపించారు కానీ ఏమీ తెలియదు. ఇది చదువు. వ్యాపారము మరియు చదువు వేర్వేరు. తండ్రి చదివిస్తారు, అలాగే వ్యాపారాన్ని కూడా నేర్పిస్తారు. బోర్డుపై కూడా ముందు తండ్రి మహిమ ఉండాలి. తండ్రి యొక్క పూర్తి మహిమను రాయాలి. ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలో కూడా నంబరువారు పురుషార్థానుసారంగా వస్తాయి, అందుకే మహారథులు, గుర్రపు స్వారీ చేసేవారు అని అంటారు. ఆయుధాలు మొదలైనవాటి విషయమేమీ లేదు. తండ్రి బుద్ధి తాళాన్ని తెరుస్తారు. ఈ గోద్రెజ్ తాళాన్ని ఎవరూ తెరవలేరు. తండ్రిని కలుసుకోవడానికి వచ్చినప్పుడు, బాబా పిల్లలను – ఇంతకుముందు ఎప్పుడైనా కలిసారా, ఇదే స్థానంలో, ఇదే రోజున ఎప్పుడు కలిసారు, అని అడుగుతారు. అప్పుడు పిల్లలు – అవును బాబా, 5 వేల సంవత్సరాల క్రితం కలిసాము అని అంటారు. ఇప్పుడు ఈ విషయాలను ఎవరూ ఇలా అడగలేరు. ఇవి ఎంతో గుహ్యమైన, అర్థం చేసుకోవాల్సిన విషయాలు. బాబా జ్ఞానానికి చెందిన యుక్తులను ఎన్ని అర్థం చేయిస్తారు. కానీ ధారణ నంబరువారుగా జరుగుతుంది. శివబాబా మహిమ వేరు, బ్రహ్మా-విష్ణు-శంకరుల మహిమ వేరు. ప్రతి ఒక్కరి పాత్ర వేర్వేరుగా ఉంటుంది. ఒకరి పాత్ర మరొకరు పాత్రతో కలవదు. ఇది అనాది డ్రామా. ఇదే మళ్ళీ రిపీట్ అవుతుంది. మనం మూలవతనానికి ఎలా వెళ్తాము, మళ్ళీ పాత్రను అభినయించేందుకు ఎలా వస్తాము అనేది ఇప్పుడు మీ బుద్ధిలో కూర్చుంది. వయా సూక్ష్మవతనం వెళ్తాము కానీ తిరిగి వచ్చే సమయంలో సూక్ష్మవతనం ఉండదు. సూక్ష్మవతనం యొక్క సాక్షాత్కారం ఎప్పుడూ ఎవరికీ కలగదు. సూక్ష్మవతనం సాక్షాత్కారం కోసం ఎవరూ తపస్సు చేయరు ఎందుకంటే దాని గురించి ఎవరికీ తెలియదు. సూక్ష్మవతనానికి భక్తులెవరూ ఉండరు. సూక్ష్మవతనాన్ని ఇప్పుడు రచిస్తారు, వయా సూక్ష్మవతనం వెళ్ళి, మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వస్తారు. ఈ సమయంలో మీరు అక్కడికి వెళ్తూ- వస్తూ ఉంటారు. మీ నిశ్చితార్థం జరిగింది, ఇది పుట్టినిల్లు. విష్ణువును తండ్రి అని అనరు. అది అత్తవారిల్లు. కన్య అత్తవారింటికి వెళ్ళినప్పుడు, పాత దుస్తులన్నింటినీ వదిలి వెళ్తుంది. మీరైతే పాత ప్రపంచాన్నే వదిలేస్తారు. మీ వనవాహానికి మరియు వారి వనవాహానికి ఎంత తేడా ఉంటుంది. మీరు కూడా చాలా అనాసక్తులుగా ఉండాలి, దేహాభిమానాన్ని వదిలివేయాలి. విలువైన చీరను ధరించినట్లయితే, వెంటనే దేహాభిమానం వచ్చేస్తుంది. నేను ఆత్మను అన్నది మర్చిపోతారు. ఈ సమయంలో మీరు వనవాహంలోనే ఉన్నారు. వనవాహము మరియు వానప్రస్థము, రెండూ ఒక్కటే. శరీరాన్నే వదిలేయాలి అన్నప్పుడు, చీరను వదలరా. మామూలు చీర లభించినట్లయితే, మనసు చిన్నబుచ్చుకుంటుంది. కానీ నిజానికి ఇందులో సంతోషించాలి, మామూలు వస్త్రం లభించడం ఎంతో మంచిది. మంచి వస్తువులనైతే సంభాళించవలసి ఉంటుంది. ఇవి ధరించాలి, ఇవి తినాలి అనే చిన్న-చిన్న విషయాలు కూడా ఉన్నత గమ్యాన్ని చేరుకోవడంలో ఆటంకాలను కలిగిస్తాయి. గమ్యం చాలా పెద్దది. కథలో కూడా వినిపిస్తారు కదా – ఈ చేతి కర్రను కూడా వదిలేయండి అని పతికి చెప్పినట్లుగా చూపిస్తారు. తండ్రి అంటారు – ఈ పాత వస్త్రము, పాత ప్రపంచము, అంతా సమాప్తమవ్వనున్నది, అందుకే ఈ ప్రపంచమంతటి నుండి బుద్ధియోగాన్ని తొలగించాలి, దీనిని అనంతమైన సన్యాసమని అంటారు. సన్యాసులైతే హద్దు సన్యాసం చేసారు, ఇప్పుడు వారు మళ్ళీ లోపలికి వచ్చేసారు. ఇంతకుముందు వారిలో చాలా శక్తి ఉండేది. దిగజారేవారికి మహిమ ఏముంటుంది. చివరివరకు కొత్త-కొత్త ఆత్మలు కూడా పాత్రను అభినయించేందుకు వస్తూనే ఉంటాయి, వారికి ఎంత శక్తి ఉంటుంది. మీరైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. ఇవన్నీ అర్థం చేసుకునేందుకు ఎంత మంచి బుద్ధి కావాలి. సర్వీసబుల్ పిల్లలు సర్వీసులో ఉత్సాహంగా ఉంటారు. బాబా ఏ విధంగా ఉత్సాహంతో ఉంటారో, అదే విధంగా జ్ఞానసాగరుని పిల్లలు కూడా భాషణ చేయాలి, ఇందులో నిరుత్సాహపడకూడదు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. బుద్ధితో అనంతమైన సన్యాసం చేయాలి. ఇది తిరిగి ఇంటికి వెళ్ళే సమయము కనుక పాత ప్రపంచము మరియు పాత శరీరము నుండి అనాసక్తులుగా ఉండాలి.

2. డ్రామాలోని ప్రతి దృశ్యాన్ని చూస్తూ సదా హర్షితంగా ఉండాలి.

వరదానము:-

సంపూర్ణ నిర్వికారీ అనగా ఏ శాతంలోనూ, ఏ వికారము వైపు ఆకర్షణ వెళ్ళకూడదు, ఎప్పుడూ వాటికి వశమవ్వకూడదు. హైయ్యెస్ట్ పొజిషన్ లో ఉండే ఆత్మలు, సాధారణ సంకల్పాలను కూడా చేయలేరు. కనుక ఏవైనా సంకల్పాలను లేక కర్మలను చేసేటప్పుడు, ఉన్నతమైన పేరుకు తగ్గట్టుగా, కర్మలు కూడా ఉన్నతంగా ఉన్నాయా అన్నది చెక్ చేసుకోండి. ఒకవేళ పేరు ఉన్నతంగా, కర్మలు నీచంగా ఉన్నట్లయితే, పేరును అప్రతిష్టపాలు చేస్తారు, అందుకే లక్ష్యం అనుసారంగా లక్షణాలను ధారణ చేయండి, అప్పుడు సంపూర్ణ నిర్వికారీ అనగా హోలియెస్ట్ ఆత్మ అని అంటారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top