21 May 2021 TELUGU Murli Today – Brahma Kumaris

20 May 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - చాలా సమయం గడిచిపోయింది, ఇక కొద్ది సమయమే మిగిలి ఉంది, ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి, ఈ ఛీ-ఛీ శరీరాన్ని మరియు ప్రపంచాన్ని మర్చిపోవాలి అనేది సదా గుర్తుంచుకోండి”

ప్రశ్న: -

ఏ నషా నిరంతరం ఉన్నట్లయితే స్థితి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది?

జవాబు:-

నిరంతరం ఈ నషా ఉండాలి – మిరువా మౌత్ మలూకా షికార్ (వేటగానికి అది షికారు, వేటకు అది మృత్యువు). మనం మలూక్ గా (ఫరిశ్తాలుగా) అయి మన ప్రియునితో పాటు ఇంటికి వెళ్తాము, మిగిలినదంతా సమాప్తమవ్వనున్నది. ఇప్పుడు మనం ఈ పాత చర్మాన్ని వదిలి కొత్తది తీసుకుంటాము. ఈ జ్ఞానం రోజంతా బుద్ధిలో చుక్క-చుక్కగా పడుతూ ఉన్నట్లయితే అపారమైన సంతోషం ఉంటుంది. స్థితి ఫస్ట్ క్లాస్ గా తయారవుతుంది.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఈ రోజు ఉదయాన్నే ఎవరు వచ్చారు….. (యహ్ కౌన్ ఆజ్ ఆయా సవేరే….)

ఓంశాంతి. ఇలా ఎవరన్నారు? పిల్లలు అన్నారు. మీరు అతీంద్రియ సుఖమయ జీవితంలోకి ప్రవేశించి అనంతమైన తండ్రి వచ్చారని చెప్తారు. ఎందుకు వచ్చారు? ఈ పతిత ప్రపంచాన్ని మార్చి పావన ప్రపంచంగా తయారుచేసేందుకు వచ్చారు. పావన ప్రపంచం ఎంత పెద్దగా ఉంటుంది మరియు పతిత ప్రపంచం ఎంత పెద్దగా ఉంది అనేది పిల్లలైన మీ బుద్ధిలోకి రావాలి. ఇక్కడ ఎన్ని కోట్ల మంది మనుష్యులున్నారు. దీనిని పతిత భ్రష్టాచారీ ప్రపంచమని అంటారు. మా కొత్త ప్రపంచం ఎంత చిన్నగా ఉంటుంది, మేము ఎలా రాజ్యం చేస్తాము అనేది మధురాతి మధురమైన పిల్లల హృదయంలోకి రావాలి. మన భారత్ వంటి దేశము ఇంకేదీ ఉండదు. భారత్ స్వర్గంగా ఉండేదని, అలాంటి దేశం ఇంకేదీ ఉండదని ఎవరికీ అర్థం కాదు. ఈ భారత్ ఇప్పుడు దేనికీ పనికి రాకుండా ఉందని మీకు అర్థమవుతుంది. భారత్ స్వర్గంగా ఉండేది, ఇప్పుడు అలా లేదు. మా భారత్ అన్నింటికన్నా ఉన్నతమైనదిగా ఉండేదని, అన్నింటికన్నా ప్రాచీనమైనదని ఎవరికీ గుర్తు రాదు. ఈ విషయం పిల్లలైన మీ బుద్ధిలోకి వస్తుంది, అది కూడా నంబరువారు పురుషార్థానుసారంగా వస్తుంది. మరి అంతటి సంతోషం, అంతటి గౌరవం ఉంటుందా? అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారు. కల్ప-కల్పం వస్తారు. మాయా రావణుడు మన నుండి ఏదైతే రాజ్య భాగ్యాన్ని లాక్కున్నాడో, ఆ రాజ్య భాగ్యాన్ని తండ్రి వచ్చి ఆత్మలైన మనకు మళ్ళీ ఇస్తారు. రాజ్య భాగ్యము యుద్ధం చేసి లాక్కోవడం జరిగిందని కాదు. రావణ రాజ్యంలో మన మతం భ్రష్టాచారిగా అయిపోతుంది. మనం శ్రేష్ఠాచారుల నుండి భ్రష్టాచారులుగా అవుతాము. ప్రపంచం ఎంతగా పెరిగిపోయిందో చూడండి, మన భారత దేశం ఎంత చిన్నగా ఉండేది. స్వర్గంలో ఎంత సుఖంగా ఉంటారు. వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఉంటాయి. అక్కడ రావణుడు ఉండడు. పిల్లలైన మీ బుద్ధిలో సంతోషముండాలి, అతీంద్రియ సుఖముండాలి. దేహీ-అభిమానులుగా అవ్వండి అని తండ్రి అంటారు. దేహ భానాన్ని తొలగించుకునేందుకు 108 అతుకులు ఉన్న బట్టలను ధరించమని బాబా అన్నారు. (ఈ బాబాకు) గొప్ప వ్యక్తులతో, వజ్రాల వ్యాపారులతో సంబంధాలుండేవి, ఆ నషా ఎలా తొలగుతుంది. దేహీ-అభిమానులుగా అవ్వాల్సి ఉంటుంది. నేను ఆత్మను, ఇది పాత శరీరము. దీనిని వదిలి, కొత్త ఫస్ట్ క్లాస్ శరీరాన్ని తీసుకోవాలి. సర్పం ఒక కుబుసాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. ఈ పాత చర్మాన్ని వదిలి, మేము మరొక కొత్తదానిని తీసుకుంటామని, తర్వాత మరొక శరీరం లభిస్తుందని పిల్లలైన మీ బుద్ధిలో జ్ఞానముంది. ఈ జ్ఞానమంతా పిల్లల బుద్ధిలో చుక్క-చుక్కగా పడుతూ ఉండాలి. ఇది ఛీ-ఛీ ప్రపంచం, దీనిని చూస్తూ కూడా బుద్ధి ద్వారా మర్చిపోవాల్సి ఉంటుంది. మనం యాత్రకు వెళ్తున్నాము, మన బుద్ధి యోగం ఇంటి వైపుకు వెళ్తూ ఉంది. అభ్యాసమైతే చేయాల్సి ఉంటుంది కదా. ఈ శరీరం కూడా పాతదే, ప్రపంచం కూడా పాతదే. ఇప్పుడు ఈ దేహం మరియు దేహపు సర్వ సంబంధాలను వదిలి ఇంటికి వెళ్ళాలని మీకు సాక్షాత్కారం కలిగింది. ఇప్పుడు మేము తిరిగి వెళ్ళాలి అని లోలోపల సంతోషం ఉంటుంది. బుద్ధియోగాన్ని అక్కడ జోడించవలసి ఉంటుంది. ఒకరికొకరు మన్మనాభవ అని చెప్పుకుంటూ ఉండాలి. ఇది చాలా జబర్దస్త్ (శక్తిశాలి) మంత్రము. గీతను చాలా మంది చదువుతారు కానీ అర్థం తెలియదు. ఎలాగైతే వేరే శాస్త్రాలను చదువుతారో, అలానే గీతను కూడా చదువుతారు. మేము భవిష్యత్తు కోసం రాజయోగాన్ని నేర్చుకుంటున్నామని ఎవరి బుద్ధిలోకి రాదు. చాలా సమయం గడిచిపోయింది, ఇప్పుడు ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది. స్వయానికి ఆహ్లాదపరుచుకుంటూ, సంతోషంగా ఉండాలి. ఇదంతా సమాప్తం అవ్వనున్నది. మిరువా మౌత్ మలూకా షికార్ (వేటగానికి అది షికారు, వేటకు అది మృత్యువు). మనం మలూక్ గా (ఫరిశ్తాలుగా) అయి, మన ప్రియునితో పాటు ఇంటికి వెళ్తాము. ఈ ఆత్మల తండ్రి కూర్చొని శిక్షణను ఇస్తారు. సాధారణంగా ఉన్నా కానీ వీరు ఉన్నతోన్నతమైనవారు. తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు, కల్ప-కల్పం వస్తారు. ఇది ఛీ-ఛీ ప్రపంచము. మీతో మీరు ఇలాంటి మాటలను మాట్లాడుకోవాల్సి ఉంటుంది. దీనినే విచార సాగర మథనం అని అంటారు. ఈ శాస్త్రాలు మొదలైనవాటిని జన్మ-జన్మలుగా చదివారు. భారతవాసులైన మనం ఎన్ని జప-తపాదులు మొదలైనవి చేశామో, అంతగా ఇంకెవ్వరూ చేయలేదు. ఎవరైతే మొట్టమొదట వచ్చారో, వారే భక్తి చేసారు మరియు వారే జ్ఞాన-యోగాలలో కూడా చురుకుగా ముందుకు వెళ్తారు ఎందుకంటే వారు మళ్ళీ మొదటి నంబరులోకి రావాలి. కొంతమంది చాలా బాగా పురుషార్థం చేయడాన్ని మీరు చూస్తారు.

పిల్లలైన మీలో ఎవరైతే ఈ ఆత్మిక సేవలో నిమగ్నమై ఉంటారో, వారికి చాలా బాగుంటుంది. వారు నిజంగా భట్టీలో కూర్చొని ఉన్నారు. వారి ఈ సంబంధం తెగిపోనిదిగా అయ్యింది, మరియు ఎవరైతే గృహస్థ వ్యవహారంలో ఉంటూ, ఇది వింటూ-వినిపిస్తూ ఉంటారో, వారు పాతవారికన్నా చురుకుగా ముందుకు వెళ్తున్నారు. కొత్తగా వచ్చేవారు చాలా చురుకుగా ముందుకు వెళ్ళడాన్ని చూస్తారు. మీరు లిస్ట్ తీస్తే తెలిసిపోతుంది. మొదట్లో మీ మాలను తయారుచేసేవారు, తర్వాత చాలామంది మంచి-మంచి పిల్లలు, 3-4 నంబర్లలో ఉన్నవారు కూడా వెళ్ళిపోవడం చూశారు. మొత్తానికి వెళ్ళిపోయి ప్రజల్లో పడిపోయారు. ఇప్పుడిది మీ స్టూడెంట్ లైఫ్, గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ కోర్సును కూడా చదువుకుంటున్నారు. చాలా మంది పిల్లలు డబల్ కోర్సులు చేస్తారు, వారికి లిఫ్ట్ లభిస్తుంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఇది చదువుకోడం మీ కోర్సు. ఇందులో కూడా కన్యలు చాలా చురుకుగా ముందుకు వెళ్ళాలి. కన్యల కారణంగానే కన్నయ్య మరియు గోపాలుడు అనే పేర్లు గాయనం చేయబడ్డాయి. అయితే, గోపులు కూడా ఉన్నారు ఎందుకంటే ఇది ప్రవృత్తి మార్గం కదా. మీరు సత్యయుగంలో దేవీ దేవతా ధర్మం వారిగా ఉండేవారు. ఈ లక్ష్మీనారాయణులు ప్రవృత్తి మార్గంలో రాజ్యం చేసేవారు. మేము ఎలా తయారవ్వబోతున్నాము అనేది మీ బుద్ధిలో చుక్క-చుక్కగా పడుతూ ఉండాలి. దేవతలు ఎంత ఫస్ట్ క్లాస్ వారు! వారి ముందుకు వెళ్ళి – మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు….. అని మహిమను పాడుతారు. మేము పాపులము, కపటులము, నిర్గుణులమైన మాలో ఏ గుణాలు లేవు….. అని అంటారు. ఇప్పుడు ఇందులో భగవంతుడు దయ చూపించడం లేదా కృప చూపించడం అనేది ఉండదు. వాస్తవానికి దయ మరియు కృప అనేది మీపై మీరే చూపించుకోవాల్సి ఉంటుంది. మీరే దేవతలుగా ఉండేవారు, ఇప్పుడు ఎలా తయారయ్యారు, స్వయాన్ని చూసుకోండి, మరియు పురుషార్థం చేసి దేవతలుగా అవ్వండి. శ్యామం నుండి సుందరంగా తయారయ్యేందుకు పురుషార్థం చేయవలసి ఉంటుంది. మేము మరణించబోయాము, ఫలానా వారు కృప చూపించారు, వారి ఆశీర్వాదాలతో బ్రతికిపోయాము అని భక్తి మార్గంలో అంటారు. మహాత్ములు మొదలైనవారి చేతులను పట్టుకొని, మీ ఆశీర్వాదాలు కావాలని అడుగుతారు. ఇక్కడ ఉండేది చదువు. కృప మొదలైనవాటి విషయం లేదు. మన్మనాభవ అన్న పదానికి అర్థముంది కదా. మంత్రాలనైతే చాలా మంది ఇస్తారు. అనేక రకాల హఠయోగాలు నేర్పిస్తారు. ప్రతి ఒక్కరి శిక్షణ వేరు-వేరుగా ఉంటుంది. హఠయోగం స్యాంపుల్స్ చూడాలనుకుంటే, జైపూర్ మ్యూజియంకు వెళ్ళి చూడండి. ఇక్కడైతే మీరు ఎంత ప్రశాంతంగా కూర్చొన్నారు. బాబా మాకు మళ్ళీ రాజ్యాన్ని ఇస్తున్నారని మీ బుద్ధిలో ఉంది. అక్కడే అద్వైత దేవీ దేవతా ధర్మముండేది, వేరే ధర్మమేదీ ఉండేది కాదు. రెండు చేతులతోనే చప్పట్లు మ్రోగుతాయి. ఒకే ధర్మముంటే మారణహోమం జరగదు. ఇప్పుడిది కలియుగము. కలియుగం పూర్తి అయితే భక్తి కూడా పూర్తవుతుంది. ఇప్పుడు మనుష్యుల వృద్ధి ఎంతగా జరుగుతూ ఉంది. భారత్ యొక్క భూమి పెరగదు. భూమి అంతే ఉంటుంది, కానీ మనుష్యులు తగ్గుతూ, పెరుగుతూ ఉంటారు. అక్కడ చాలా తక్కువమంది మనుష్యులుంటారు, ఇదే ప్రపంచం ఉంటుంది. ప్రపంచమేమీ చిన్నగా అవ్వదు. కావున పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. మనం యోగబలంతో తండ్రి శ్రీమతమనుసారంగా మన రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నాము. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమవుతాయని తండ్రి అంటారు. ఆత్మలోనే మాలిన్యం చేరుకుంది కదా. కేవలం సతో, రజో, తమో…… అని అంటూ ఉంటారు కానీ ఆత్మలోనే మాలిన్యం చేరుతుందని చూపించరు. మొట్టమొదట బంగారు యుగం వారిగా ఉండేవారు, స్వచ్ఛమైన బంగారంగా ఉండేవారు, తర్వాత వెండి కలుస్తుంది, దానిని వెండి యుగం అని అంటారు, చంద్రవంశీయులని అంటారు. గోల్డెన్, సిల్వర్, కాపర్, ఆ తర్వాత ఐరన్ – ఈ ఇంగ్లీషు పదాలు ఎంత బాగున్నాయి. ఆత్మలో మాలిన్యం చేరుకుంది, ఇప్పుడది ఎలా తొలగుతుంది అనేది బాబా అర్థం చేయిస్తారు. సతో నుండి తమోగా అయ్యారు, తర్వాత తమో నుండి సతోగా ఎలా అవ్వాలి. గంగలో స్నానం చేయడంతో సతోప్రధానంగా అవుతారని భావిస్తారు. కానీ ఇది సాధ్యం కాదు. గంగా స్నానాలు మొదలైనవి రోజూ చేస్తూ ఉంటారు. కొందరు నిష్ఠగా ఉంటారు. కొలనులోకి కూడా వెళ్ళి స్నానం చేస్తారు. బాబాను స్మృతి చేసే నియమాన్ని పెట్టుకోండి అని బాబా మీకు చెప్తున్నారు. స్మృతి అనే స్నానాన్ని మరియు స్మృతి యాత్రను చేయండి. జ్ఞాన స్నానాన్ని కూడా చేయిస్తారు, యోగ యాత్రను నేర్పిస్తారు. తండ్రి జ్ఞానాన్ని ఇస్తారు. వీరిలో యోగానికి సంబంధించిన జ్ఞానం, సృష్టి చక్ర జ్ఞానం కూడా ఉంది. ఇకపోతే శాస్త్రాల జ్ఞానాన్ని ఎంతోమంది ఇస్తారు, వారికి యోగం గురించి అసలు తెలియదు. హఠయోగమని అనుకున్నారు. యోగాశ్రమాలు చాలా ఉన్నాయి. మన్మనాభవ మంత్రాన్ని ఇస్తారు కానీ ఒక్క తండ్రి వద్ద తప్ప ఇంకే మనుష్యుల వద్ద ఈ జ్ఞానం లేదు. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తి అయ్యింది. తర్వాత కొత్త ప్రపంచం ఉంటుంది. వృక్షం ఎలా వృద్ధి చెందుతుంది అనేది మీ బుద్ధిలో ఉంది. రాజ్య స్థాపన జరుగుతుంది, అందరూ కలిసి ఒకేసారి వెళ్ళరు. బ్రాహ్మణుల వృక్షం చాలా పెద్దదవుతుంది. అప్పుడు కొంతమంది చొప్పున వెళ్తారు. ప్రజలు తయారవుతూ ఉంటారు. కొద్దిగా విన్నా సరే ప్రజల్లోకి వచ్చేస్తారు. సేవా కేంద్రాలు చాలా వృద్ధి చెందుతాయి. ఎన్నో ప్రదర్శనీలు అన్నిచోట్లా జరుగుతూ ఉంటాయి. ఎలాగైతే మందిరాలను అన్ని చోట్లా నిర్మిస్తూ ఉంటారో, అలా మీ ప్రదర్శనీలు కూడా ప్రతి గ్రామంలో జరుగుతాయి. ప్రతి ఇంట్లోనూ ప్రదర్శనీని పెట్టవలసి ఉంటుంది. వృద్ధి చెందుతూ ఉంటారు, అందుకే చివరికి ఈ చిత్రాలను కూడా ముద్రించవలసి ఉంటుంది. అందరి వద్దకు తండ్రి సందేశం చేరుకోవాలి. పిల్లలైన మీరు చాలా గొప్ప సేవను చేయాలి. ఇప్పుడు ఈ ప్రొజెక్టరు, ప్రదర్శనీల ఫ్యాషన్ వెలువడింది, కావున వీటిని ప్రతి గ్రామంలోనూ చూపించవలసి ఉంటుంది. వారు చాలా బాగా అర్థం చేసుకుంటారు, స్వీకరిస్తారు. శివజయంతి గాయనం చేయబడుతుంది, కానీ వారు (శివుడు) ఎలా వస్తారు అనేది ఎవరికీ తెలియదు. శివపురాణం మొదలైనవాటిలో ఈ విషయాలు లేవు. ఈ విషయాలను మీరు వింటారు. వినే సమయంలో బాగా అనిపిస్తుంది కానీ తర్వాత మర్చిపోతారు. పాయింట్లు మంచి రీతిలో ధారణ అయితే, సేవ కూడా బాగా చేయగలరు. కానీ అన్ని పాయింట్లు ఎవరికీ ధారణ అవ్వవు. భాషణ చేసి వచ్చిన తర్వాత – ఈ పాయింట్లు కూడా చెప్పి ఉంటే బాగుండేది అన్న ఆలోచన వస్తుంది. ఎవరికైతే దేహాభిమానం ఉండదో, వారు వెంటనే చెప్తారు. భాషణ చేసి వచ్చిన తర్వాత – నేను అన్ని పాయింట్లు సరిగ్గా అర్థం చేయించానా అని ఆలోచిస్తారు. ఇంకా ఈ పాయింట్లు మర్చిపోయానని అనుకుంటారు, ఈ పాయింట్లు ఏమీ మీతో పాటు రావు. ఇవి కేవలం ఇప్పటి కోసమే. తర్వాత ఇవి సమాప్తమైపోతాయి. ఈ కళ్ళతో ఇప్పుడు ఏవైతే చూస్తున్నారో, అవి సత్యయుగంలో ఉండవు. ఇప్పుడు మీకు జ్ఞానం యొక్క మూడవ నేత్రం లభిస్తుంది. ఇప్పుడు మీరు త్రినేత్రులుగా అవుతారు. బాబా వచ్చి మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు, దానిని ఆత్మ ధారణ చేస్తుంది. ఆత్మకు మూడవ నేత్రం లభిస్తుంది. నేను ఆత్మను, ఈ శరీరం ద్వారా ఇది చేస్తున్నాను అన్న జ్ఞానం ఎవరిలోనూ లేదు. బాబా మమ్మల్ని చదివిస్తున్నారని బుద్ధిలో ఉంచుకోవాలి – ఇందులోనే శ్రమ ఉంది. పిల్లలు కృషి చేయాలి మరియు సంతోషంలో ఉండాలి. ఇప్పుడిక మన రాజ్యం వచ్చేసినట్లే. మన రాజ్యంలో ఏమేమి ఉంటాయో మీకు తెలుసు. మేము ఈ చదువు ద్వారా రాజ్యాన్ని తీసుకుంటున్నామని పిల్లలైన మీకు చాలా సంతోషముండాలి. చదువుకునేవారికి పదవి గుర్తుంటుంది. మనం భవిష్యత్తు కోసం చదువుకుంటున్నాము. బాగా చదువుకుంటే రాజ్య సింహాసనంపై కూర్చొంటారు. వారు ప్రసిద్ధమవుతారు. ఇప్పుడు లిస్ట్ తీసి, మాలను తయారుచేస్తే, ఫలానా కుమారిని మా వద్దకు రిఫ్రెష్ చేసేందుకు పంపించండి అని అందరూ అడుగుతారు. భాషణ చేసేవారిని పిలుస్తారు, కావున వారికి గౌరవం కూడా ఇవ్వాలి. మేము వీరి వలె చురుకైనవారిగా అవ్వాలని భావించాలి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసేందుకు దేహ భానాన్ని తెంచే పురుషార్థం చేయాలి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి కావున బుద్ధియోగం ఇంటితో జోడించబడి ఉండాలి.

2. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ చదువును కూడా చదువుకోవాలి, డబల్ కోర్సు చేయాలి. జ్ఞాన స్నానాన్ని మరియు స్మృతి యాత్రను చేయాలి మరియు చేయించాలి.

వరదానము:-

ఎలాగైతే ఏవైనా వస్త్రాలను ధరించడం లేదా ధరించకపోవడం అనేది మీ చేతుల్లో ఉంటుందో, అలాంటి అనుభవం ఈ శరీరం రూపీ వస్త్రం విషయంలో ఉండాలి. వస్త్రాన్ని ధరించి కార్యం చేస్తారు మరియు ఆ కార్యం పూర్తి అవుతూనే వస్త్రం నుండి అతీతంగా అవుతారు. శరీరం మరియు ఆత్మ, ఈ రెండింటి అతీతత్వం నడుస్తూ-తిరుగుతూ అనుభవమవ్వాలి – అప్పుడు నిరంతర సహజయోగులు అని అంటారు. ఇలా డిటాచ్ గా ఉండే పిల్లల ద్వారా అనేక ఆత్మలకు ఫరిశ్తా రూపం మరియు భవిష్య రాజ్య పదవి యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. అంతిమంలో ఈ సేవ ద్వారానే ప్రభావం వెలువడుతుంది.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top