21 June 2021 TELUGU Murli Today | Brahma Kumaris

21 june 2021 Read and Listen today’s Gyan Murli in Telugu 

20 June 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - పావనంగా అయ్యేందుకు ఒకే ఒక ఉపాయము - తండ్రి స్మృతి, స్మృతి యొక్క శ్రమయే అంతిమంలో ఉపయోగపడుతుంది”

ప్రశ్న: -

సంగమంలో ఏ తిలకాన్ని దిద్దుకున్నట్లయితే స్వర్గ రాజ్యం యొక్క తిలకం లభిస్తుంది?

జవాబు:-

ఆత్మనైన నేను బిందువును, నేను శరీరం కాదు – సంగమంలో ఈ తిలకాన్ని దిద్దుకోండి. నేను ఆత్మను, నేను తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి – లోలోపల ఇదే అభ్యాసాన్ని చేస్తూ ఉండండి. బాబా కూడా బిందువు, నేను కూడా బిందువును. ఈ తిలకంతో స్వర్గ రాజ్యం యొక్క తిలకం ప్రాప్తిస్తుంది. బాబా అంటారు – మీరు స్మృతి చేసినట్లయితే, అర్ధకల్పం కోసం ఏడవడం నుండి ముక్తులైపోతారని నేను గ్యారెంటీ ఇస్తున్నాను.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. ఆత్మనైన నేను తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలనే చింత ఉండాలి, అప్పుడే పావనంగా అవ్వగలరు. శ్రమ అంటూ ఉంటే అది ఇదే, కానీ పిల్లలు అంతగా శ్రమించలేకపోతున్నారు. మాయ చాలా ఇబ్బంది పెడుతుంది. ఒక్క తండ్రి స్మృతిని మరపింపజేస్తుంది, ఇతరుల స్మృతి వస్తుంది. తండ్రిని లేక ప్రియుడిని స్మృతి చేయరు. ఇటువంటి ప్రియుడిని తక్కువలో తక్కువ 8 గంటలు స్మృతి చేసే సేవ చేయాలి అనగా ప్రియునికి స్మృతి చేసే సహాయం చేయాలి. అనగా పిల్లలు తండ్రిని స్మృతి చేయాలి – ఇదే చాలా గొప్ప శ్రమ. గీతలో కూడా మన్మనాభవ అని ఉంది. తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. లేస్తూ-కూర్చుంటూ, నడుస్తూ-తిరుగుతూ ఒక్క తండ్రినే స్మృతి చేస్తూ ఉండండి, ఇంకేమీ చేయనవసరం లేదు. అంతిమంలో ఈ స్మృతియే పనికొస్తుంది. స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించండి, ఇప్పుడు మనం తిరిగి వెళ్ళాలి. ఈ విషయంలో చాలా శ్రమ చేయాలి. ఉదయాన్నే స్నానం మొదలైనవి చేసుకొని, ఏకాంతంలో మేడ పైన లేదా హాలులో కూర్చుండిపోండి. ఎంత ఏకాంతం ఉంటే అంత మంచిది. సదా ఇదే ఆలోచన చేయండి – నేను తండ్రిని స్మృతి చేయాలి, తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. మీరు ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత, ఈ శ్రమను చేయాల్సి ఉంటుంది. సత్య, త్రేతా, ద్వాపర, కలియుగాలలో ఎక్కడా మీరు ఈ శ్రమను చేయవలసిన అవసరం ఉండదు. నన్ను స్మృతి చేయండి, చాలు – అని ఈ సంగమంలోనే తండ్రి మీకు చెప్తారు. నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్పే వేళ ఇదే. తండ్రి రావడం కూడా సంగమంలోనే వస్తారు, ఇంకెప్పుడూ తండ్రి రారు. మీకు కూడా నంబరువారు పురుషార్థానుసారంగా తెలుసు. చాలా మంది పిల్లలు తండ్రిని మర్చిపోతారు, అందుకే చాలా మోసపోతారు. రావణుడు చాలా మోసకారి, అతను అర్ధకల్పం యొక్క శత్రువు. అందుకే తండ్రి అంటారు – రోజు ఉదయాన్నే లేచి విచార సాగర మథనం చేయండి మరియు ఈ విధంగా చార్టును పెట్టుకోండి – నేను తండ్రిని ఎంత సమయం స్మృతి చేసాను? ఎంత తుప్పు తొలగి ఉంటుంది? అంతా స్మృతిపైనే ఆధారపడి ఉంది. తమ పూర్తి వారసత్వాన్ని పొందేందుకు, పిల్లలు పూర్తిగా ప్రయత్నించాలి. నరుని నుండి నారాయణునిగా అవ్వాలి. ఇది సత్యమైన సత్య నారాయణ కథ. భక్తులు పౌర్ణమి రోజున సత్య నారాయణుని కథను చెప్పుకుంటారు. 16 కళల సంపూర్ణులుగా అవ్వాలని ఇప్పుడు మీకు తెలుసు. సత్యమైన తండ్రిని స్మృతి చేయడంతోనే ఈ విధంగా అవుతారు. తండ్రి శ్రీమతాన్ని ఇచ్చేవారు. తండ్రి అంటారు – గృహస్థంలో ఉండండి, వ్యాపార వ్యవహారాలు మొదలైనవి ఏవైనా చేసుకోండి, తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి మరియు పావనంగా అవ్వాలి, అంతే. స్మృతి చేయకపోతే ఎక్కడో ఒక చోట రావణుని వల్ల మోసపోతూ ఉంటారు, అందుకే స్మృతి చేయడమే ముఖ్యమైన విషయమని అర్థం చేయిస్తారు. శివబాబాను స్మృతి చేయాలి. దేహ సహితంగా దేహం యొక్క సంబంధీకులందరినీ మరచి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. తండ్రి పదే-పదే అర్థం చేయిస్తారు – స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి లేదంటే అంతిమంలో చాలా-చాలా పశ్చాత్తాపపడతారు, చాలా మోసపోతారు. ఎంత గట్టిగా చెంపదెబ్బ తగులుతుందంటే, మాయ పూర్తిగా నల్ల ముఖం చేసేస్తుంది. తండ్రి తెల్ల ముఖంగా చేసేందుకు వచ్చారు. ఈ సమయంలో అందరూ ఒకరి ముఖాన్ని ఒకరు నల్లగా చేస్తూ ఉంటారు. తెల్లగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారి స్మృతితో మీరు తెల్లగా, స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఇది పతిత ప్రపంచము. తండ్రి పతితులను పావనంగా చేసేందుకే వస్తారు. ఇకపోతే మీ వ్యాపార వ్యవహారాలు మొదలైనవాటితో బాబాకు ఎటువంటి సంబంధం లేదు. శరీర నిర్వహణార్థం మీరు ఏమి చేయాల్సి ఉంటే అది చేయండి. తండ్రి అయితే కేవలం మన్మనాభవ అని అంటారు. మేము పావన ప్రపంచానికి యజమానులుగా ఎలా అవ్వాలి అని మీరంటారు కూడా. కేవలం నన్ను స్మృతి చేయండి, అంతే అని తండ్రి అంటారు. పావనంగా అయ్యేందుకు ఇంకే ఉపాయము లేదు. దాన-పుణ్యాలు మొదలైనవి ఎన్ని చేసినా, ఎంత శ్రమించినా, నిప్పులపై అటు-ఇటు నడిచినా సరే – ఒక్క తండ్రి స్మృతి తప్ప ఇవేవీ ఉపయోగపడవు. ఇది చాలా సాధారణ విషయము, దీనిని సహజయోగమని అంటారు. రోజంతటిలో నేను నా మధురాతి మధురమైన తండ్రిని ఎంత స్మృతి చేసాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నిద్రలోనైతే ఏ పాపము జరగదు, అశరీరిగా అయిపోతారు. ఇకపోతే, పగలు చాలా పాపాలు జరుగుతూ ఉంటాయి మరియు పాత పాపాలు కూడా చాలా ఉన్నాయి. స్మృతి యొక్క శ్రమ చేయాలి. ఇక్కడకు వచ్చారు కనుక ఈ శ్రమను చేయాలి. బయటి వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేయండి లేకపోతే వాయుమండలాన్ని చాలా పాడు చేస్తారు. ఇంటి గురించి, పొలం గురించి ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు పిల్లలు గుర్తుకొస్తారు, అప్పుడప్పుడు గురువు గుర్తుకొస్తారు. సంకల్పాలు నడుస్తూ ఉన్నట్లయితే వాయుమండలాన్ని పాడు చేస్తారు. శ్రమ చేయనివారు విఘ్నాలు కలిగిస్తూ ఉంటారు. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. మీరు కూడా ఇప్పుడే తెలుసుకుంటారు, ఇంకెప్పుడూ తెలుసుకోరు. తండ్రి ఇప్పుడే వారసత్వాన్ని ఇస్తారు, తర్వాత అర్ధకల్పం కోసం నిశ్చింతగా అయిపోతారు. లౌకిక తండ్రి చింతలకు (ఆలోచనలకు) మరియు అనంతమైన తండ్రి చింతలకు ఎంత తేడా ఉంటుంది. తండ్రి అంటారు – నాకు భక్తి మార్గంలో ఎంత చింత ఉంటుంది. భక్తులు పదే-పదే ఎంతగా గుర్తు చేసుకుంటారు. సత్యయుగంలో ఎవరూ స్మృతి చేయరు. తండ్రి అంటారు – మీకు ఎంత సుఖాన్ని ఇస్తాను అంటే, అక్కడ మీకు నన్ను స్మృతి చేయవలసిన అవసరం ఉండదు. ఆ సమయంలో నా పిల్లలు సుఖధామంలో, శాంతిధామంలో కూర్చున్నారని నాకు తెలుసు. ఇతర మనుష్యులెవరూ ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. ఇటువంటి తండ్రి పట్ల నిశ్చయబుద్ధి కలిగి ఉండడంలో మాయ విఘ్నాలను కలిగిస్తుంది. తండ్రి అంటారు – కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే మీలో ఏదైతే మాలిన్యం చేరుకుందో, వెండి, రాగి, ఇనుము….. అదంతా తొలగిపోతుంది. బంగారు యుగం నుండి వెండి యుగానికి వచ్చినప్పుడు కూడా రెండు కళలు తగ్గిపోతాయి. ఈ విషయాలను మీరు వింటారు మరియు అర్థం చేసుకుంటారు. ఎవరైతే సత్యమైన బ్రాహ్మణులో, వారికే మంచి రీతిగా బుద్ధిలో కూర్చుంటాయి, లేకపోతే కూర్చోవు. స్మృతి నిలవదు. తండ్రిని స్మృతి చేయడంపైనే అంతా ఆధారపడి ఉంది. పిల్లలూ, తండ్రిని స్మృతి చేయండి అని పదే-పదే చెప్తారు. శివబాబాను స్మృతి చేయండి అని ఈ బాబా కూడా చెప్తారు. తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని స్వయం శివబాబా కూడా అంటారు. ఓ పిల్లలూ, అని ఆత్మలను పిలుస్తారు. ఆ నిరాకార పరమాత్మ కూడా ఆత్మలకే చెప్తారు. ఇదే ముఖ్యమైన విషయము. ఎవరు వచ్చినా సరే వారికి మొట్టమొదట అల్ఫ్ ను (భగవంతుడిని) స్మృతి చేయమని చెప్పండి, ఇంక దేని గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయమని చెప్పండి. నేను ఒక ఆత్మను అని లోలోపల ఈ అభ్యాసమే చేస్తూ ఉండాలి. తులసీదాసు చందనాన్ని నూరి, రఘువీరునికి తిలకం దిద్దారు….. అని పాడుతారు కదా. తిలకమంటే స్థూలమైనదేమీ కాదు. వాస్తవానికి తిలకమనేది ఈ సమయానికి చెందిన స్మృతి చిహ్నమని మీరు అర్థం చేసుకున్నారు. మీరు స్మృతి చేస్తూ ఉంటారు అనగా రాజ్య తిలకాన్ని దిద్దుకుంటారు. మీకు రాజ్య తిలకం లభిస్తుంది, డబల్ కిరీటధారులుగా అవుతారు. రాజ్య తిలకం లభించడమనగా స్వర్గానికి మహారాజా-మహారాణులుగా అవుతారు. తండ్రి ఎంత సహజంగా తెలియజేస్తారు. నేను ఆత్మను, శరీరాన్ని కాదు – కేవలం ఇది గుర్తు చేయండి. మనం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి.

ఆత్మలైన మనం బిందువుల వలె ఉన్నామని, బాబా కూడా బిందువని మీకు తెలుసు. బాబా జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు. వారు మనకు వరదానమిస్తారు. వీరి పక్కనే వచ్చి కూర్చుంటారు. గురువు, తన శిష్యుడిని పక్కన కూర్చోబెట్టుకొని నేర్పిస్తారు. అలాగే వీరు కూడా పక్కనే కూర్చున్నారు. పిల్లలకు కేవలం ఇదే చెప్తారు – స్వయాన్ని ఆత్మగా భావించండి, నన్నొక్కడినే స్మృతి చేయండి. సత్యయుగంలో కూడా మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు కానీ తండ్రి గురించి తెలియదు. ఆత్మనైన నేను శరీరాన్ని వదిలి మరొకటి తీసుకోవాలి. డ్రామానుసారంగా మీ పాత్ర ఈ విధంగానే ఉంది, అందుకే అక్కడ మీ ఆయుష్షు ఎక్కువగా ఉంటుంది, మీరు పవిత్రంగా ఉంటారు. సత్యయుగంలో ఆయుష్షు ఎక్కువగా ఉంటుంది, కలియుగంలో తగ్గిపోతుంది. అక్కడ యోగులు ఉంటారు, ఇక్కడ భోగులు ఉంటారు. యోగులు పవిత్రంగా ఉంటారు. అక్కడ రావణ రాజ్యము ఉండదు. ఆయుష్షు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆయుష్షు ఎంత తక్కువ ఉంటుంది, దీనిని కర్మ భోగం అని అంటారు. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువులు సంభవించవు. కనుక తండ్రి అంటారు – తండ్రిని గుర్తించారు కనుక శ్రీమతాన్ని అనుసరించండి. ఒక్క తండ్రిని స్మృతి చేయండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. మనమిప్పుడు వెళ్ళాలి, ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. మిగిలిన సమయాన్ని సేవలో వినియోగించాలి.

పిల్లలైన మీరు చాలా పేదవారు, అందుకే తండ్రికి దయ కలుగుతుంది. వృద్ధులు, కుబ్జలు మొదలైనవారికి ఏ కష్టాన్ని ఇవ్వరు. వృద్ధ మాతలను కుబ్జలని అంటారు. తండ్రిని స్మృతి చేయండి అని వృద్ధ మాతలకు అర్థం చేయించడం జరుగుతుంది. మీరు ఎక్కడకు వెళ్తున్నారు అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే, గీతా పాఠశాలకు వెళ్తున్నాము, అక్కడ ఆ కృష్ణుని ఆత్మ 84 జన్మలు తీసుకొని ఇప్పుడు తండ్రి నుండి జ్ఞానాన్ని తీసుకుంటుంది అని చెప్పండి.

పిల్లలు ప్రదర్శినీ మొదలైనవాటిపై ఎంత ఖర్చు చేస్తారు. ఫలానా వారు బాగా ప్రభావితులయ్యారని రాస్తారు కూడా. కానీ బాబా అంటారు – తప్పకుండా ఈ సమయంలో, అనంతమైన తండ్రి ఈ బ్రహ్మా తనువులోకి వచ్చి ఉన్నారని, వారి నుండే స్వర్గ వారసత్వం లభిస్తుందని రాసేవారు ఒక్కరు కూడా లేరు. ఒక్కరికి కూడా నిశ్చయం ఏర్పడలేదని బాబాకు అర్థమవుతుంది. ఈ జ్ఞానం చాలా బాగుందని, మెట్ల చిత్రాన్ని సరైన రీతిగా చూపించారని ప్రభావితులవుతారు కానీ స్వయం యోగంలో ఉంటూ తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వడమనేది చేయరు. పరమాత్మ నుండి వారసత్వాన్ని పొందే ఈ వివరణ చాలా బాగుంది అని మాత్రం అంటారు. కానీ స్వయం వారసత్వం పొందాలి అనేది మాత్రం ఉండదు, ఏ పురుషార్థము చేయరు. ఎంతోమంది ప్రజలు తయారవుతారు. ఇకపోతే రాజుగా అవ్వడమే శ్రమతో కూడినది. నేను ఎంతవరకు తండ్రి స్మృతిలో హర్షితంగా ఉంటున్నానని ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోండి. నేను మళ్ళీ దేవతగా అవుతానని ఈ విధంగా ఏకాంతంలో కూర్చుని మీతో మీరే మాట్లాడుకోండి, ప్రయత్నించి చూడండి. తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే, మీరు అర్ధకల్పం కోసం ఎప్పుడూ ఏడవరని తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు. బాబా వచ్చి మాయ రావణుడిపై మాకు విజయాన్ని ఇప్పిస్తారని ఇప్పుడు మీరంటారు. ఎవరు ఎంత శ్రమించినా, అది స్వయం కోసమే చేసుకుంటారు. తర్వాత మీరు కొత్త ప్రపంచంలోకి వస్తారు. మీరు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వాలంటే, పాత ప్రపంచం యొక్క లెక్కాచారాలను కూడా సమాప్తం చేసుకోవాలి. పావనంగా అయ్యే యుక్తులను కూడా తెలియజేస్తారు. ఇది వినాశన సమయం, అందరి వినాశనం జరగనున్నది. కొత్త ప్రపంచ స్థాపన జరగనున్నది. మనం ఈ మృత్యులోకంలో ఈ శరీరాన్ని వదిలి, మళ్ళీ కొత్త ప్రపంచమైన అమరలోకంలోకి వస్తామని మీకు తెలుసు. మనం కొత్త ప్రపంచం కోసమే చదువుకుంటున్నాము. భవిష్యత్తు కోసం చదివించే ఇటువంటి పాఠశాల ఇంకేదీ లేదు. ఎవరైతే చాలా దాన-పుణ్యాలు చేస్తారో, వారు రాజుల వద్ద జన్మ తీసుకుంటారు. గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్ (నోటిలో బంగారు స్పూను) అని అంటారు. మీకు అది సత్యయుగంలో లభిస్తుంది. కలియుగంలో కూడా ఎవరైతే రాజుల వద్ద జన్మ తీసుకుంటారో, వారికి ఇది లభిస్తుంది. అయినా, ఇక్కడైతే అనేక రకాల దుఃఖాలుంటాయి. మీకైతే భవిష్య 21 జన్మల కోసం ఎటువంటి దుఃఖం ఉండదు. ఎప్పుడూ అనారోగ్యంపాలు అవ్వరు. స్వర్గంలో గోల్డెన్ స్పూన్ ఉంటుంది. ఇక్కడి రాజ్యం అల్పకాలికమైనది. మీది 21 జన్మల కోసం ఉంటుంది. బుద్ధిని మంచి రీతిగా ఉపయోగించాలి, తర్వాత అర్థం చేయించాలి. భక్తి మార్గంలో రాజులుగా అవ్వలేరని కాదు. ఎవరైనా కాలేజ్ లేదా హాస్పిటల్ నిర్మించినట్లయితే వారికి కూడా ప్రతిఫలం లభిస్తుంది. హాస్పిటల్ నిర్మించినట్లయితే మరుసటి జన్మలో మంచి ఆరోగ్యం లభిస్తుంది. వీరికి పూర్తి జీవితంలో జ్వరం కూడా రాలేదు అని అంటారు కదా. దీర్ఘాయుష్షు ఉంటుంది. దానాలు మొదలైనవి ఎక్కువగా చేసినట్లయితే, హాస్పిటల్ మొదలైనవి నిర్మించినట్లయితే ఆయుష్షు పెరుగుతుంది. ఇక్కడైతే యోగంతో మీరు సదా ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా అవుతారు. యోగంతో మీరు 21 జన్మల కోసం ఆరోగ్యాన్ని పొందుతారు. ఇది చాలా పెద్ద హాస్పిటల్, చాలా పెద్ద కాలేజ్. తండ్రి ప్రతి విషయాన్ని మంచి రీతిగా అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు – ఎవరికి ఎక్కడ ఆనందం కలిగితే, మనసుకు ఎక్కడ నచ్చితే అక్కడకు వెళ్ళి చదువు చదువుకోవచ్చు. మా సెంటరుకు రావాలి, వారి వద్దకు ఎందుకు వెళ్తున్నారు అని అనకూడదు. ఎవరికి ఎక్కడ నచ్చితే, అక్కడకు వెళ్ళచ్చు. విషయమైతే ఒక్కటే. మురళీ అయితే చదివి వినిపిస్తారు. ఆ మురళీ ఇక్కడి నుండే వెళ్తుంది, తర్వాత కొంతమంది విస్తారంగా మంచిగా అర్థం చేయిస్తారు, కొంతమంది కేవలం చదివి వినిపిస్తారు. భాషణ చేసేవారు మంచి సవాళ్ళను విసురుతూ ఉండవచ్చు. ఎక్కడ భాషణ చేసినా సరే మొట్టమొదట ఇదే చెప్పండి – స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయని మరియు పావనంగా అయి పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారని శివబాబా చెప్తున్నారు అని. ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. బయటి వ్యర్థమైన ఆలోచనలను వదిలి, ఏకాంతంలో కూర్చుని స్మృతి యొక్క శ్రమను చేయాలి. ఉదయాన్నే లేచి విచార సాగర మథనం చేయాలి మరియు తమ చార్టును చూసుకోవాలి.

2. ఎలాగైతే భక్తిలో దాన-పుణ్యాలకు మహత్వముందో, అలా జ్ఞాన మార్గంలో స్మృతికి మహత్వముంది. స్మృతితో ఆత్మను సదా ఆరోగ్యవంతంగా, ఐశ్వర్యవంతంగా చేసుకోవాలి. అశరీరిగా ఉండే అభ్యాసం చేయాలి.

వరదానము:-

ఎవరైతే వాచా ద్వారా జ్ఞాన రత్నాలను దానం చేస్తారో, వారికి మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ అనే వరదానం ప్రాప్తిస్తుంది. వారి ఒక్కొక్క మాటకు చాలా విలువ ఉంటుంది. వారి ఒక్కొక్క మాట వినేందుకు అనేక ఆత్మలు దాహంతో ఉంటారు. వారి ప్రతి మాటలో సెన్స్ (సారం) నిండి ఉంటుంది. వారికి విశేషమైన సంతోషం ప్రాప్తిస్తుంది. వారి వద్ద ఖజానా నిండుగా ఉంటుంది. అందుకే వారు సదా సంతుష్టంగా మరియు హర్షితంగా ఉంటారు. వారి మాటలు ప్రభావశాలిగా అవుతూ ఉంటాయి. వాణిని దానం చేయడంతో వారి వాణిలో చాలా గుణాలు వస్తాయి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top