21 August 2022 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
20 August 2022
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
‘‘మహాశివరాత్రిని జరుపుకోవడము అనగా ప్రతిజ్ఞ చేయడము, వ్రతాన్ని చేపట్టడము మరియు బలి అవ్వడము’’
♫ వినండి ఆడియో (audio)➤
ఈ రోజు దివ్య మహాజ్యోతి అయిన తండ్రి తమ జ్యోతిర్బిందు పిల్లలతో కలుస్తున్నారు. బాప్ దాదా కూడా మహాన్ జ్యోతి మరియు పిల్లలైన మీరు కూడా మహాన్ జ్యోతి స్వరూపులు. కనుక దివ్య జ్యోతి అయిన తండ్రి దివ్య జ్యోతులైన ఆత్మలను కలుసుకుంటున్నారు. ఈ మహాన్ జ్యోతి ఎంత ప్రియమైనది మరియు అతీతమైనది! బాప్ దాదా ప్రతి ఒక్కరి మస్తకం మధ్యన మెరుస్తున్న జ్యోతిని చూస్తున్నారు. ఇది ఎంత దివ్యమైన మరియు ప్రియమైన దృశ్యము. మెరుస్తున్న ఆత్మిక నక్షత్రాలతో కూడిన ఎంత మంచి సంగఠనను చూస్తున్నారు. ఈ ఆత్మిక జ్యోతిర్మయ నక్షత్ర మండలము అలౌకికమైనది మరియు అతి సుందరమైనది. మీరందరూ కూడా ఈ దివ్యమైన తారా మండలంలో మెరుస్తున్న తమ బిందు స్వరూపాన్ని చూస్తున్నారా? ఇదే మహాశివరాత్రి. శివ జ్యోతితో పాటు అనేక జ్యోతిర్బిందు సాలిగ్రామాలైన మీరు ఉన్నారు. తండ్రి కూడా మహాన్, పిల్లలు కూడా మహాన్, అందుకే మహాశివరాత్రి మహిమ చేయబడుతూ ఉంది. మీరు ఎంతటి శ్రేష్ఠమైన భాగ్యశాలి ఆత్మలు! మీరు చైతన్య సాకార స్వరూపంలో తండ్రి అయిన శివునితో పాటు శివరాత్రిని జరుపుకుంటున్నారు. ఇటువంటి అలౌకిక శివరాత్రిని జరుపుకునేటువంటి సాలిగ్రామ ఆత్మలము మేము అని సంకల్పంలో గానీ, స్వప్నంలో గానీ ఎప్పుడూ ఆలోచించలేదు. మీరందరూ చైతన్య రూపంలో జరుపుకుంటారు. దాని స్మృతిచిహ్నమే ఇప్పుడు భక్తుల ద్వారా జడ చిత్రాలలో చైతన్య భావనతో జరుపుకోవడాన్ని చూస్తున్నారు. సత్యమైన భక్తులు చిత్రం పట్ల భావనతో, భావనా స్వరూపులై అనుభవం చేస్తారు మరియు సాలిగ్రామ ఆత్మలైన మీరు సమ్ముఖంలో జరుపుకునేవారు. కనుక ఎంతటి భాగ్యము! మిలియన్లు, మల్టీ మిలియన్లు, మల్టీ బిలియన్లు… ఇవి కూడా మీ భాగ్యం ముందు ఏమీ కాదు, అందుకే పిల్లలందరూ నిశ్చయంతో కూడిన నషాతో అంటారు, మేము చూసాము, మేము పొందాము… ఈ పాట అందరిదా లేక కొందరిదేనా? అందరూ పాడుతారు కదా? లేక చూస్తాములే, పొందుతాములే అని పాడుతారా? పొందేసారా లేక పొందాలా? డబల్ విదేశీయులు ఏమనుకుంటున్నారు, పొందేసారా? తండ్రిని చూసారు కూడా కదా? తండ్రిని చూసాము, పొందాము అని హృదయపూర్వకంగా అంటారు. చూడడము మరియు పొందడమే కాదు, కానీ తండ్రిని తమవారిగా చేసుకున్నారు. తండ్రి మీవారిగా అయిపోయారు కదా. చూడండి, మీ తండ్రి అయిపోయారు, అందుకే మీరు పిలవగానే తండ్రి వచ్చేస్తారు కదా. మరి అధికారులుగా అయిపోయారు కదా.
మహాశివరాత్రి విశేషతలేమిటి? ఒకటేమో, తండ్రి ఎదురుగా ప్రతిజ్ఞ చేస్తారు మరియు రెండవది, తండ్రి యొక్క ప్రేమలో వ్రతాన్ని చేపడతారు ఎందుకంటే ప్రేమ మరియు సంతోషంలో అంతా మర్చిపోతారు, అందుకే వ్రతాన్ని చేపడతారు. సంతోషమనే ఔషధాన్ని తింటారు కనుక వేరే ఔషధం యొక్క అవసరం ఉండదు. మిలనం యొక్క సంతోషం కారణంగా వ్రతాన్ని చేపడతారు. వ్రతము సంతోషానికి కూడా గుర్తు మరియు వ్రతం చేపట్టడము అనగా ప్రేమలో త్యాగ భావనను ఉంచుకోవడము. ఏదైనా వదిలేయడము అనగా త్యాగ భావనకు గుర్తు. మూడవ విషయము – శివరాత్రి అనగా బలి అవ్వడము. స్మృతిచిహ్న రూపంలోనైతే స్థూలమైన బలినిస్తారు కానీ జరగాల్సింది ఏమిటంటే, మనసు, బుద్ధి మరియు సంబంధాలతో సమర్పితమవ్వడము – బలి అవ్వడము అంటే వాస్తవానికి ఇదే. కనుక ఈ మూడు విశేషతలే మహాశివరాత్రి యొక్క విశేషతలు. శివరాత్రిని జరుపుకోవడము అనగా ఈ మూడు విశేషతలను ప్రాక్టికల్ జీవితంలోకి తీసుకురావడము. కేవలం చెప్పడము కాదు కానీ చేయడము. చెప్పడము మరియు చేయడము సదా సమానంగా ఉండాలి. భారత్ యొక్క పిల్లలు కావచ్చు, డబల్ విదేశీ పిల్లలు కావచ్చు, అందరూ మహాశివరాత్రి యొక్క ప్రాక్టికల్ స్వరూపంగా ప్రతిజ్ఞ చేసారు అన్న పిల్లల యొక్క శుభవార్తతో కూడిన సమాచారాన్ని కూడా బాప్ దాదా విన్నారు. మరి ప్రతిజ్ఞ అనగా చెప్పడము మరియు చేయడము, రెండూ సమానంగా ఉండడము. చాలా మంచి విషయము – అందరూ మొదట బాప్ దాదాకు ప్రతిజ్ఞ అనగా శ్రేష్ఠ సంకల్పాల యొక్క అన్నింటికన్నా అతి పెద్ద జన్మదిన కానుకను ఇచ్చారు. కనుక బాప్ దాదా కూడా పిల్లలందరి కానుకలకు ధన్యవాదాలు చెప్తున్నారు. కానుకగా ఇచ్చిన ప్రతిజ్ఞ సదా స్మృతి ద్వారా సమర్థంగా తయారుచేస్తూ ఉంటుంది. ముందు నుండే ఇలా ఆలోచించకండి, ప్రతిజ్ఞ అయితే చేస్తాము కానీ నడవగలమా లేమా! నిర్వర్తించగలమా లేమా! ఇలా ఆలోచించడము అనగా బలహీనతను ఆహ్వానించడము. కనుక బలహీనతను అనగా మాయను ఎప్పుడైతే స్వయమే ఆహ్వానిస్తూ ఉంటారో, ఆ బలహీనత కూడా ముందుగానే వచ్చేందుకు తయారుగా ఉంటుంది. ఇలా అయితే మీరే దానిని ఆహ్వానిస్తున్నారు, అందుకే ఏదైనా సంకల్పము లేక కర్మ చేస్తున్నప్పుడు సమర్థ స్థితిలో స్థితులై సమర్థతతో చేయండి. బలహీన సంకల్పాలను మిక్స్ చేయకండి. ధైర్యం మాది, అటెన్షన్ మాది మరియు సహాయం తండ్రిది ఉండనే ఉంది, ఈ శ్రేష్ఠ సంకల్పం పెట్టుకోండి. ఈ విధి ద్వారా ప్రతిజ్ఞను ప్రాక్టికల్ లోకి తీసుకురావడము చాలా సహజమని అనుభవం చేస్తారు. అనేక కల్పాల విజయీ ఆత్మను నేను అని ఎల్లప్పుడూ ఇదే ఆలోచించండి. విజయం యొక్క సంతోషం, విజయం యొక్క నషా శక్తిశాలిగా చేస్తుంది. విజయము బ్రాహ్మణాత్మలైన మీ కోసం సదా సహచరునిగా అయి బంధించబడి ఉంది, ఇంకెక్కడికి వెళ్తుంది? పాండవులకు తప్ప విజయము ఇంకెవరికి తోడుగా ఉంటుంది? మీరు ఆ పాండవులే కదా! తండ్రి ఎప్పుడైతే సహచరునిగా ఉన్నారో, అప్పుడు విజయము కూడా మీ సహచరునిగానే ఉంటుంది. సదా మీ మస్తకంలో విజయ తిలకం పెట్టబడే ఉంది అని చూడండి. ఎవరైతే ప్రభువు మెడలో హారంగా అయ్యారో, వారికి ఓటమి ఎప్పుడూ జరగజాలదు. సంపూర్ణ విజయీ రూపంలో తమ స్మృతిచిహ్నమైన విజయ మాలను చూస్తున్నారు కదా? విజయము మరియు ఓటమి యొక్క మాల అని ఇలా అయితే గాయనం లేదు కదా! అలా కాదు, విజయ మాల. విజయీ మణులైతే మీరే కదా! కనుక విజయ మాలలోని మణులు ఎప్పుడూ ఓటమిని పొందలేరు. ప్రతి ఒక్కరు ఏ సంకల్పమైతే చేసారో, బాప్ దాదా మొత్తం దృశ్యాన్ని చూసారు. మంచి ఉల్లాస-ఉత్సాహాలతో, చాలా సంతోషంతో ప్రతిజ్ఞ చేసారు. మరియు చైతన్య సాలిగ్రామాలైన మీరు ప్రతిజ్ఞ చేసారు, అందుకే భక్తులు కూడా దాని స్మృతిచిహ్నాన్ని జరుపుకుంటూ ఉంటారు. (తపస్యకు సంబంధించి నిన్న అందరూ 56వ శివ జయంతి నాడు 56 ప్రతిజ్ఞలు చేసారు)
బలి అయిపోయారు. బలి అవ్వడము అనగా మహాబలవంతులుగా అవ్వడము. దేనిని బలి ఇస్తారు? బలహీనతలను. బలహీనతలను బలి ఇవ్వడము వలన ఎటువంటివారిగా అయ్యారు? మహాబలవంతులుగా అవుతారు. అన్నింటికన్నా పెద్ద బలహీనత దేహాభిమానము. దేహ భానాన్ని సమర్పితము చేయడము అనగా దాని వంశాన్ని కూడా సమర్పితము చేసారు ఎందుకంటే దేహాభిమానం యొక్క సూక్ష్మ వంశం చాలా పెద్దది. అనేక రకాల చిన్న-పెద్ద దేహ భానాలు ఉన్నాయి. కనుక దేహ భానాన్ని బలి ఇవ్వడము అనగా వంశం సహితంగా సమర్పితమవ్వడము. అంశం కూడా ఉంచుకోకూడదు. అంశమాత్రం కూడా ఒకవేళ ఉండిపోయినా పదే-పదే అయస్కాంతం వలె ఆకర్షిస్తూ ఉంటుంది. మీకు తెలియను కూడా తెలియదు. వద్దనుకున్నా కూడా అయస్కాంతం తన వైపుకు ఆకర్షిస్తుంది. ఏదైనా సమయంలో ఈ దేహాభిమానము పనికొస్తుంది కదా అని దానిని కాస్త పక్కన పెట్టుకుంటాము అని ఇలా అనుకోకండి. ఇంకా ఏమంటారు – ఇది లేకుండా పని జరగదు అని అంటారు. పని జరుగుతుంది కానీ కొంత సమయం కొరకు విజయం కనిపిస్తుంది. అభిమానాన్ని స్వమానముగా భావిస్తారు. కానీ ఈ అల్పకాలిక విజయంలో బహుకాలపు ఓటమి ఇమిడి ఉంది. మరియు దేనినైతే కొంత సమయం యొక్క ఓటమిగా భావిస్తారో, అది సదాకాలపు విజయాన్ని ప్రాప్తి చేయిస్తుంది, అందుకే దేహాభిమానాన్ని అంశమాత్రము సహితంగా సమర్పితము చేయాలి – దీనినే, తండ్రి అయిన శివునిపై బలి అవ్వడము అనగా మహాబలవంతులుగా అవ్వడము అని అంటారు. ఇటువంటి శివరాత్రిని జరుపుకున్నారు కదా? ఈ వ్రతాన్ని ధారణ చేయాలి. మనుష్యులు స్థూల వస్తువుల యొక్క వ్రతాన్ని పెట్టుకుంటారు కానీ మీరు ఏ వ్రతాన్ని చేపడతారు? శ్రేష్ఠ వృత్తి ద్వారా, సదా బలహీన వృత్తిని తొలగించి, శుభమైన మరియు శ్రేష్ఠమైన వృత్తిని ధారణ చేస్తాము అన్న ఈ వ్రతాన్ని చేపడతారు. ఎప్పుడైతే వృత్తిలో శ్రేష్ఠత ఉంటుందో, అప్పుడు సృష్టి శ్రేష్ఠంగానే కనిపిస్తుంది ఎందుకంటే వృత్తితో దృష్టికి మరియు కృతికి కనెక్షన్ ఉంది. ఏదైనా మంచి లేక చెడు విషయం మొదట వృత్తిలో ధారణ అవుతుంది, తర్వాత వాణి మరియు కర్మలోకి వస్తుంది. వృత్తి శ్రేష్ఠంగా అవ్వడము అనగా వాణి మరియు కర్మ స్వతహాగా శ్రేష్ఠంగా అవ్వడము. మీ విశేష సేవ అయిన విశ్వ పరివర్తన కూడా శుభ వృత్తి ద్వారానే జరుగుతుంది. వృత్తి ద్వారా వైబ్రేషన్ ను, వాయుమండలాన్ని తయారుచేస్తారు. కనుక శ్రేష్ఠ వృత్తి యొక్క ఈ వ్రతాన్ని ధారణ చేయడము – ఇదే శివరాత్రిని జరుపుకోవడము. ఇదైతే విన్నారు కదా, జరుపుకోవడము అనగా తయారవ్వడము, చెప్పడము అనగా చేయడము. ఎవరైతే సిద్ధులను ప్రాప్తి చేసుకున్న ఆత్మలుగా ఉంటారో, మనుష్యులు తమ భాషలో సిద్ధ పురుషులు అని అంటారు మరియు మీరు సిద్ధి స్వరూప ఆత్మలు అని అంటారు – కనుక వారు స్వయం పట్ల లేక ఇతరుల పట్ల చేసే ప్రతి సంకల్పం కర్మలో సిద్ధిస్తుంది, ఏ మాటలనైతే మాట్లాడుతారో అవి సిద్ధిస్తాయి. వాటిని సత్య వచనాలు అని అంటారు. కనుక అందరికన్నా అతి పెద్ద సిద్ధి స్వరూప ఆత్మలు మీరే కదా. కనుక సంకల్పాలు మరియు మాటలు సిద్ధిస్తాయి కదా, సిద్ధించడము అనగా సఫలమవ్వడము. ప్రత్యక్ష స్వరూపంలోకి రావడము, ఇది సిద్ధించడము. కనుక సదా దీనిని స్మృతిలో ఉంచుకోండి, మనమందరము సిద్ధి స్వరూప ఆత్మలము, సిద్ధి స్వరూప ఆత్మలమైన మన ప్రతి సంకల్పము, ప్రతి మాట, ప్రతి కర్మ స్వయానికి లేక సర్వులకు సిద్ధిని ప్రాప్తి చేయించేదిగా ఉండాలి, వ్యర్థమవ్వకూడదు. చెప్పాము మరియు చేసాము అంటే అది సిద్ధి అయినట్లు. చెప్పాము, ఆలోచించాము మరియు చేయలేదు అంటే అది వ్యర్థమైనట్లు. చాలామంది ఇలా ఆలోచిస్తారు, మాకు చాలా మంచి సంకల్పాలు వస్తూ ఉంటాయి, స్వయం గురించి లేక సేవ గురించి చాలా మంచి-మంచి ఆలోచనలు, ఉల్లాసము వస్తూ ఉంటాయి, కానీ అవి సంకల్పాల వరకే ఉండిపోతాయి. ప్రాక్టికల్ కర్మలోకి, స్వరూపంలోకి రావు. మరి దీనిని ఏమంటారు? సంకల్పాలు చాలా మంచిగా ఉన్నాయి కానీ కర్మలలో తేడా ఎందుకు వస్తుంది? దీనికి కారణమేమిటి? ఒకవేళ బీజం చాలా బాగుంది కానీ ఫలం మంచిది రాలేదంటే ఏమంటారు? ధరణి లేక పథ్యం యొక్క లోపము ఉంది. అలాగే సంకల్పం రూపీ బీజము బాగుంది. బాప్ దాదా వద్దకు సంకల్పాలు చేరుకుంటాయి. బాప్ దాదా కూడా సంతోషిస్తారు – చాలా మంచి బీజాన్ని నాటారు, చాలా మంచి సంకల్పం చేసారు, ఇప్పుడిక ఫలం లభించేసినట్లే అని. కానీ జరుగుతున్నది ఏమిటి? దృఢమైన ధారణ అనే ధరణిలో లోపము ఉంది మరియు పదే-పదే అటెన్షన్ పెట్టడము అన్న పథ్యం ఉంచడములో లోపము ఉంది. బాప్ దాదా హాస్యభరితమైన ఆటను చూస్తూ ఉంటారు. ఎలాగైతే పిల్లలు గ్యాస్ బెలూన్ ను ఎగరేస్తారు కదా, చాలా బాగా గ్యాస్ ను నింపి ఎగరేస్తారు మరియు బెలూన్ పైకి వెళ్ళింది, చాలా బాగా ఎగురుతోంది అని సంతోషిస్తారు. కానీ ఎగురుతూ-ఎగురుతూ కిందకు వచ్చేస్తుంది. కనుక ఎప్పుడూ కూడా పురుషార్థంలో నిరాశ చెందకండి. చేయాల్సిందే, జరగాల్సిందే, అవ్వాల్సిందే, విజయ మాల నా స్మృతిచిహ్నమే. నిరాశ చెంది, అచ్ఛా చేస్తాములే, చూస్తాములే అని ఆలోచించకండి. అలా కాదు, రేపటి వరకు కూడా కాదు, ఇప్పుడు చేయాల్సిందే. ఒకవేళ నిరాశకు కొన్ని క్షణాల కోసమైనా లేక నిమిషాల కోసమైనా, మీ లోపల స్థానమిచ్చినట్లయితే తర్వాత అది అంత సులభంగా వెళ్ళదు. దానికి కూడా బ్రాహ్మణాత్మల వద్ద మజా వస్తుంది అందుకే ఎప్పుడూ నిరాశావాదిగా అవ్వకండి. అభిమానం కూడా ఉండకూడదు, నిరాశ కూడా ఉండకూడదు. కొందరు అభిమానంలోకి వస్తారు, కొందరు నిరాశలోకి వస్తారు. ఈ రెండు మహాబలవంతులుగా అవ్వనివ్వవు. ఎక్కడైతే అభిమానం ఉంటుందో, అక్కడ అవమానం యొక్క ఫీలింగ్ కూడా ఎక్కువగా వస్తుంది. ఒక్కోసారి అభిమానములోకి, ఒక్కోసారి అవమానములోకి – రెండింటితో ఆడుకుంటూ ఉంటారు. ఎక్కడైతే అభిమానము ఉండదో, వారికి అవమానము కూడా అవమానము వలె అనిపించదు. వారు ఎల్లప్పుడూ నిర్మానము మరియు నిర్మాణం యొక్క కార్యంలో బిజీగా ఉంటారు. ఎవరైతే నిర్మానులుగా ఉంటారో, వారే నిర్మాణము చేయగలరు. కనుక శివరాత్రిని జరుపుకోవడము అనగా నిర్మానులుగా అయి నిర్మాణము చేసే కర్తవ్యంలో నిమగ్నమవ్వడము. అర్థమయిందా!
కనుక ఈ రోజు అందరూ తమ హృదయంలో శ్రేష్ఠ సంకల్పమనే దారంతో విజయ జెండాను ఎగరవేయండి. ఈ జెండా ఎగర వేయడము అనేదే బ్రాహ్మణుల సేవ యొక్క పద్ధతి, విధి. కానీ దానితో పాటు సదా విజయము యొక్క జెండా ఎగురుతూ ఉండాలి. ఏదైనా దుఃఖం యొక్క విషయం ఉన్నప్పుడు జెండాను కిందికి దించుతారు కానీ మీ జెండా ఎప్పుడూ కిందికి రాజాలదు. సదా ఉన్నతంగా ఉంటుంది. కనుక ఇటువంటి జెండాను ఎగరేస్తారు కదా? అచ్ఛా.
తపస్యా సంవత్సరం యొక్క రిజల్టు కూడా లభించింది. అందరూ తమకు తామే జడ్జిగా అయి స్వయానికి నంబరు ఇచ్చుకున్నారు. మంచిగా చేసారు. మెజారిటీ నలువైపులా ఉన్న రిజల్టులో ఏం కనిపించింది అంటే, ఈ తపస్యా సంవత్సరము అందరికీ స్వ పురుషార్థము పట్ల మంచి అటెన్షన్ ఇప్పించింది. ఎప్పుడైతే దాని పట్ల అటెన్షన్ వెళ్తుందో, అప్పుడు టెన్షన్ కూడా పోతుంది కదా! కనుక చాలా మందిది పూర్తి రిజల్టు మంచిగా ఉంది. సెకెండ్ నంబరులో మెజారిటీ ఉన్నారు. థర్డ్ కూడా ఉన్నారు కానీ ఫస్ట్ మరియు నాల్గవ నంబరులో తక్కువమంది ఉన్నారు. సెకెండు నంబరు లెక్కతో ఫస్ట్ మరియు ఫోర్త్ వారు తక్కువగా ఉన్నారు. ఇకపోతే, సెకెండ్ మరియు థర్డ్, వీరు మెజారిటీ ఉన్నారు మరియు అందరూ ఈ తపస్యా సంవత్సరానికి మహత్వమిచ్చారు, అందుకే పేపర్లు వచ్చినా కానీ మెజారిటీ మంచి రూపంతో పాస్ అయ్యారని బాప్ దాదాకు ఈ విషయంలో విశేషమైన సంతోషము ఉంది. తపస్య చేయాలి అన్న సంకల్పాన్ని ఏదైతే పెట్టుకున్నారో – ఈ సంకల్పం యొక్క సమర్థత సహయోగమిచ్చింది, అందుకే రిజల్టు బాగుంది, చెడుగా లేదు. దానికి అభినందనలు. ఇకపోతే, ఇప్పుడు ప్రైజ్ అయితే దాదీలు ఇస్తారు, తండ్రి అందరికీ చాలా బాగుంది, చాలా బాగుంది అనే ప్రైజ్ ను ఇచ్చేసారు. తపస్యా సంవత్సరం పూర్తి అయిపోయింది, ఇప్పుడు నిర్లక్ష్యులుగా అయిపోవచ్చు అని ఇలా ఉండకూడదు. అలా కాదు, ఇంకా పెద్ద ప్రైజ్ ను తీసుకోవాలి. వినిపించారు కదా – కర్మ మరియు యోగముల బ్యాలెన్స్ యొక్క ప్రైజ్ ను తీసుకోవాలి, సేవ మరియు తపస్యల బ్యాలెన్స్ యొక్క బ్లెస్సింగ్స్ ను అనుభవం చేయాలి మరియు నిమిత్తమాత్రంగా ప్రైజ్ ను తీసుకోవాలి. సత్యమైన ప్రైజ్ అయితే తండ్రి మరియు పరివారముల బ్లెస్సింగ్స్ యొక్క ప్రైజ్. అదైతే అందరికీ లభిస్తోంది. అచ్ఛా.
ఈ రోజు సూక్ష్మవతనాన్ని తయారుచేసారు. మంచిది, మంచి వాయుమండలం తయారయింది. ఆ జ్యోతుల ప్రపంచము ముందు అయితే ఈ అలంకరింపబడిన సూక్ష్మవతనము మోడల్ గానే అనిపిస్తుంది కదా. అయినా కూడా పిల్లల ఉల్లాస ఉత్సాహాలతో కూడిన వాయుమండలము వృత్తిని తప్పకుండా ఆకర్షిస్తుంది. అందరూ సూక్ష్మవతనంలో కూర్చున్నారా? సాకార శరీరంలో ఉంటూ మనసు ద్వారా సూక్ష్మవతనవాసిగా అయి మిలనము జరుపుకోండి. బాప్ దాదాకు సంతోషం ఉంది, పిల్లలకు సూక్ష్మవతనము ఇంత ప్రియమనిపిస్తుంది అందుకే తయారుచేసారు కదా. చాలా బాగా శ్రమించి తయారుచేసారు మరియు ప్రేమతో తయారుచేసారు, శ్రేష్ఠమైన ఉల్లాస-ఉత్సాహాల సంకల్పాలతో తయారుచేసారు, అందుకే బాప్ దాదా సంకల్పం చేసినవారికి, సాకారంలోకి తీసుకువచ్చిన వారికి అందరికీ అభినందనలు తెలుపుతున్నారు. ఇది కూడా అనంతమైన ఆటలో ఒక ఆట, ఇంకే ఆటను ఆడుతారు. ఈ ఆటనే ఆడుతారు కదా. ఒకసారి స్వర్గాన్ని తయారుచేస్తారు, ఒకసారి సూక్ష్మవతనాన్ని తయారుచేస్తారు. ఇవి బుద్ధిని ఆకర్షిస్తాయి. అచ్ఛా. నలువైపులా ఉన్న సర్వ జ్యోతిర్బిందు సాలిగ్రామాలకు తండ్రి దివ్య జన్మ లేక పిల్లల దివ్య జన్మ యొక్క శుభాకాంక్షలు.
ఇటువంటి సర్వ శ్రేష్ఠ సదా సిద్ధి స్వరూప ఆత్మలకు, సదా దివ్యముగా మెరుస్తున్న సితారలకు, సదా అభిమానము మరియు అవమానము నుండి అతీతంగా ఉంటూ స్వమానంలో స్థితులై ఉండే ఆత్మలకు, సదా శ్రేష్ఠ పురుషార్థము మరియు శ్రేష్ఠ సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలనే శ్రేష్ఠ ఆశల దీపాన్ని వెలిగించే ఆత్మలకు, సదా తమ హృదయంలో విజయ జెండాను ఎగరవేసే శివమయీ శక్తి సైన్యానికి, సదా పురుషార్థంలో సఫలతను సహజంగా అనుభవం చేసే సఫలతా స్వరూప పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
శివజయంతి సందర్భంగా బాప్ దాదా జెండాను ఎగరేస్తూ పిల్లలందరికీ అభినందనలు తెలిపారు
విశ్వంలో తండ్రి మరియు విజయీ పిల్లల సుఖ-శాంతులనిచ్చే ఈ జెండా ఎల్లప్పుడూ ఎగురుతూ ఉంటుంది. నలువైపులా శివబాబా మరియు శివశక్తుల ఆత్మిక సైన్యం యొక్క ఈ పేరు ప్రసిద్ధమవుతూ ఉంటుంది. ఈ మహాన్, ఉన్నతమైన జెండా విశ్వానికి సదా ఎగురుతూ కనిపిస్తుంది. ఈ అవినాశీ జెండా, అవినాశీ తండ్రి మరియు అవినాశీ శ్రేష్ఠ ఆత్మల స్మృతిచిహ్నము. కనుక సదా సంతోషపు అలలతో, సంతోషం యొక్క జెండాను, తండ్రి పేరును ప్రసిద్ధం చేసే జెండాను, తండ్రిని ప్రత్యక్షం చేసే జెండాను ఎగరేస్తున్నారు, ఎగరేస్తూనే ఉంటారు. ఈ విధంగా మహాశివరాత్రి రోజున పిల్లలైన మీ అందరికీ మరియు నలువైపులా ఉన్న సర్వ విశేషమైన బ్రాహ్మణాత్మలకు జన్మదినము యొక్క చాలా-చాలా శుభాకాంక్షలు మరియు ప్రియస్మృతులు.
వరదానము:-
ఎలాగైతే ఎవరిలోనైనా ఏదైనా స్వభావం ఉంటే అది స్వతహాగానే తన పని చేస్తుంది. ఆలోచించాల్సిన లేక చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే విశేషతల యొక్క సంస్కారం కూడా స్వభావంగా అయిపోవాలి మరియు ప్రతి ఒక్కరి నోటి నుండి, మనసు నుండి, ఈ విశేష ఆత్మ స్వభావమే విశేషతలతో కూడినది అని వెలువడాలి. సాధారణ కర్మలు సమాప్తమవ్వాలి, అప్పుడే మరజీవా అని అంటారు. సాధారణత నుండి మరణించారు, విశేషతలలో జీవిస్తున్నారు. సంకల్పంలో కూడా సాధారణత ఉండకూడదు.
స్లోగన్:-
సూచన:- ఈరోజు నెలలో మూడవ ఆదివారము, రాజయోగి తపస్వీ సోదర-సోదరీలందరూ సాయంకాలం 6.30 నుండి 7.30 గంటల వరకు, విశేషమైన యోగాభ్యాసం యొక్క సమయంలో తమ శుభ భావనల శ్రేష్ఠ వృత్తి ద్వారా మనసా మహాదానిగా అయి అందరికీ నిర్భయత యొక్క వరదానాన్ని ఇచ్చి అందరినీ చింతాముక్తులుగా చేయండి.
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!