20 February 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

February 19, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘పురుషార్థములో తీవ్రగతి లోపించడానికి రెండు ముఖ్య కారణాలు’’

♫ వినండి ఆడియో (audio)➤

ఈరోజు బ్రాహ్మణుల అనాది రచయిత అయిన బాప్ దాదా విశేషంగా తమ డైరెక్ట్ సమీప రచన, శ్రేష్ఠ రచన అయిన బ్రాహ్మణ పిల్లలను చూస్తున్నారు. బాప్ దాదాకు అతి ప్రియమైన రచన బ్రాహ్మణాత్మలు, మీరు సమీపంగా మరియు సమానంగా అయ్యేటువంటి లక్ష్యాన్ని సదా స్మృతిలో ఉంచుకొని ముందుకు వెళ్తున్నారు. ఈ రోజు ఇటువంటి ఆది రచనను విశేష రూపంలో చూస్తున్నారు. సర్వ తీవ్ర పురుషార్థులను మరియు పురుషార్థులను, ఇరువురి గతి విధులను చూస్తున్నారు. బాప్ దాదా ద్వారా లభించిన శ్రేష్ఠమైన సహజ విధి ద్వారా తీవ్రగతి కలవారు మరియు అప్పుడప్పుడు తీవ్రగతి, అప్పుడప్పుడు తక్కువ గతి కలవారు – రెండు రకాల బ్రాహ్మణ పిల్లలను చూసారు. చదువు, పాలన మరియు ప్రాప్తి – ఇవి అందరికీ ఒకేలా, ఒకరి ద్వారానే లభిస్తున్నాయి, మరి వేగంలో తేడా ఎందుకు? తీవ్ర పురుషార్థీ అనగా ఫస్ట్ డివిజన్ వారు, పురుషార్థీ అనగా సెకెండ్ డివిజన్ లో పాస్ అయ్యేవారు. ఈరోజు విశేషంగా అందరి చార్టు చెక్ చేసారు. కారణాలు ఎన్నో ఉన్నాయి కానీ విశేషంగా రెండు కారణాలు ఉన్నాయి. అందరి కోరిక ఫస్ట్ డివిజనే, సెకెండ్ డివిజన్ లోకి రావాలని ఎవ్వరూ కోరుకోరు. కానీ లక్ష్యము మరియు లక్షణాలు, ఈ రెండింటికీ తేడా వచ్చేస్తుంది. విశేషమైన రెండు కారణాలు ఏమి చూసారు?

ఒకటి – సంకల్ప శక్తి, ఏదైతే అన్నింటికన్నా శ్రేష్ఠ శక్తినో, దానిని యథార్థ రీతిలో స్వయం పట్ల మరియు సేవ పట్ల సమయ ప్రమాణంగా కార్యంలో ఉపయోగించే యథార్థ రీతి లేదు. రెండవ కారణము – వాణి శక్తిని యథార్థ రీతిలో, సమర్థ రీతిలో కార్యంలో ఉపయోగించడంలో లోపము. ఈ రెండింటిలోనూ లోపానికి కారణము – యూజ్ కి (ఉపయోగించడానికి) బదులుగా లూజ్. పదాలలో తేడా కొద్దిగానే ఉంది కానీ పరిణామంలో చాలా తేడా వచ్చేస్తుంది. బాప్ దాదా కేవలం 3-4 రోజుల రిజల్టును చూసారు, మొత్తం రిజల్టును చూడలేదు. ప్రతి ఒక్కరి 3-4 రోజుల రిజల్టులో ఏమి చూసారు? 50 శాతము అనగా సగం-సగం. సంకల్పాలు మరియు మాటలు, ఈ రెండు శక్తులలో 50 శాతం మంది ఆత్మలది, జమ ఖాతా 40 శాతం ఉంది మరియు వ్యర్థం లేక సాధారణత యొక్క ఖాతా 60 శాతం ఉండడాన్ని చూసారు. మరి ఆలోచించండి జమ ఎంత అయింది! ఎక్కువ బరువు దేనిది ఉంది? ఇందులో కూడా వాచా కారణంగా మనసుపై ప్రభావం పడుతుంది. మనసా అనేది వాచాను కూడా తనవైపు లాగుతుంది. ఈ రోజు బాప్ దాదా వాణి అనగా మాటల వైపు విశేష అటెన్షన్ ఇప్పిస్తున్నారు ఎందుకంటే మాటల సంబంధము స్వయంతో కూడా ఉంది మరియు సర్వులతో కూడా ఉంది. మరియు చూసిందేమిటి? మనసా ద్వారా స్మృతిలో ఉండాలి అనేదాని కోసమైతే ఎంతైనా మధ్య-మధ్యలో ప్రోగ్రాం పెట్టుకుంటారు. కానీ మాటల విషయంలో నిర్లక్ష్యం ఎక్కువ ఉంది. అందుకే బాప్ దాదా దీనిని విశేషంగా అండర్ లైన్ చేయిస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం బాప్ దాదా విశేషంగా పురుషార్థంలో, సేవలో ముందుకు వెళ్ళే మహారథి ఆత్మలకు మరియు అందరికీ, మాటలకు సంబంధించి మూడు విషయాలను చెప్పారు – ‘‘తక్కువగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి మరియు మధురంగా మాట్లాడండి’’. వ్యర్థం మాట్లడడానికి గుర్తు – వారు ఎక్కువ మాట్లాడుతారు, తప్పదు కాబట్టి సమయమనుసారంగా, సంగఠన అనుసారంగా స్వయాన్ని కంట్రోల్ చేసుకుంటారు, కానీ లోపల ఎవరో శాంతిగా, మౌనంగా ఉండేందుకు బంధించినట్లుగా అనుభవం చేస్తారు. వ్యర్థ మాటలు అన్నింటికన్నా ఎక్కువగా ఏమి నష్టం కలిగిస్తాయి? ఒకటేమో – శారీరిక శక్తి సమాప్తమవుతుంది, ఎందుకంటే ఖర్చవుతుంది మరియు రెండు – సమయం వ్యర్థంగా పోతుంది. వ్యర్థం మాట్లాడేవారి అలవాటు ఏముంటుంది? చిన్న విషయాన్ని చాలా పెద్దగా చేస్తారు మరియు మాట్లాడే తీరు కథలా ఉంటుంది. ఎలాగైతే రామాయణ, మహాభారత కథలను…. ఇంట్రెస్ట్ తో వినిపిస్తారు కదా. స్వయం కూడా ఇష్టంతో మాట్లాడతారు, ఇతరులలో కూడా ఇష్టాన్ని కలిగిస్తారు, కానీ రిజల్టు ఏమవుతుంది? రామాయణం, మహాభారతం యొక్క రిజల్టు ఏమిటి? రాముడు వనవాసానికి వెళ్ళాడు, కౌరవులు మరియు పాండవుల యుద్ధం జరిగింది. కథలా చూపిస్తారు, సారమేమీ ఉండదు, కానీ రాగం చాలా రమణీకంగా ఉంటుంది. దీనిని కథ అని అంటారు. వ్యర్థం మాట్లాడేవారు మాయ ప్రభావం కారణంగా బలహీన ఆత్మలుగా ఉంటారు, వారికి వినే మరియు వినిపించే సహచరులు చాలా త్వరగా తయారవుతారు. ఇటువంటి ఆత్మ ఏకాంతప్రియంగా అవ్వలేదు, అందుకే వారు సహచరులను తయారుచేసుకోవడంలో చాలా తెలివైనవారిగా ఉంటారు. బయటకు అప్పుడప్పుడు వీరి సంగఠన శక్తిశాలిగా మరియు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఒక విషయాన్ని సదా కోసం గుర్తుంచుకోండి – ఇది మాయ వెళ్ళిపోయేటువంటి అంతిమ చరణము, అందుకే వీడ్కోలు తీసుకుంటూ-తీసుకుంటూ కూడా తన బాణాన్ని వేస్తూ ఉంటుంది, అందుకే అప్పుడప్పుడు అక్కడక్కడ మాయ ప్రభావము తన పని చేసుకుంటుంది. అది ప్రశాంతంగా వెళ్ళేటువంటిది కాదు. చివరి ఘడియ వరకు డైరెక్టుగా కాకపోతే ఇన్ డైరెక్టుగా, చేదు రూపంలో కాకపోతే చాలా మధురమైన రూపంలో మరియు కొత్త-కొత్త రూపాలను ధారణ చేసి బ్రాహ్మణులపై ట్రయల్ వేస్తూ ఉంటుంది. అప్పుడు అమాయకమైన బ్రాహ్మణులు ఏమంటారు? ఈ రూపంలో కూడా మాయ వస్తుందని బాప్ దాదా అయితే వినిపించనే లేదు! అని అంటారు. నిర్లక్ష్యం కారణంగా స్వయాన్ని చెక్ కూడా చేసుకోరు, మరియు మాయ వస్తుంది… అని బాప్ దాదా అయితే చెప్పారు కదా అని ఆలోచిస్తారు. మాయ వస్తుంది… అని సగం మాటైతే గుర్తుంచుకుంటారు, కానీ మాయాజీతులుగా అవ్వాలి అన్నదానిని మర్చిపోతారు.

మరొక విషయము – వ్యర్థమైన మరియు సాధారణ మాటల యొక్క భిన్న-భిన్న రూపాలను చూసారు. ఒకటి – హద్దును దాటి అనగా లిమిట్ ను దాటి పరిహాసం చేయడము, రెండవది – టాంటింగ్ వే (విమర్శించడము), మూడవది – ఇక్కడి-అక్కడి సమాచారాన్ని పోగు చేసి వినడము మరియు వినిపించడము, నాల్గవది – కొంత సేవా సమాచారము మరియు సేవా సమాచారంతో పాటు సేవాధారుల బలహీనతల చింతన, ఈ మిక్స్ చట్నీ, మరియు ఐదవది – బ్రాహ్మణుల డిక్షనరీలో లేనే లేనటువంటి అయుక్తియుక్తమైన మాటలు – ఈ ఐదు రూపురేఖలను చూసారు. ఈ ఐదింటినీ బాప్ దాదా వ్యర్థమైన మాటలలో లెక్కిస్తారు. పరిహాసం ఆడటం మంచిది అని అనుకోకండి. ఏ పరిహాసంలోనైతే ఆత్మికత ఉంటుందో, అది మంచిది మరియు ఎవరితో పరిహాసం ఆడుతారో, ఆ ఆత్మకు లాభం కలిగిందా, టైం పాస్ అయ్యిందా లేక టైం వేస్ట్ అయ్యిందా? రమణీకతా గుణాన్ని మంచిదిగా భావిస్తారు కానీ వ్యక్తి, సమయము, సంగఠన, స్థానము, వాయుమండలం అనుసారంగా రమణీకత బాగా అనిపిస్తుంది. ఒకవేళ ఈ అన్ని విషయాలలోనూ ఒక్క విషయం సరిగ్గా లేకపోయినా రమణీకత కూడా వ్యర్థం యొక్క లైనునో లెక్కించబడుతుంది మరియు సర్టిఫికెట్ ఏం లభిస్తుంది, చాలా బాగా నవ్విస్తారు కానీ చాలా మాట్లాడుతారు అని. కనుక అది మిక్స్ చట్నీ అయినట్లు కదా. కనుక సమయం యొక్క లిమిట్ పెట్టుకోండి. వీరిని మర్యాదా పురుషోత్తములని అంటారు. నా స్వభావమే ఇలా ఉంది అని అంటారు. ఇదేమి స్వభావము? బాప్ దాదా వంటి స్వభావమా? కనుక ఇటువంటివారిని కూడా మర్యాదా పురుషోత్తమ్ అని అనరు, సాధారణ పురుష్ అని అంటారు. మాటలు సదా ఎలా ఉండాలంటే, వీరు ఏదైనా మాట్లాడాలి మరియు మేము వినాలి అని వినేటువంటి వారు చాతకులుగా ఉండాలి – వీటిని అమూల్యమైన మహావాక్యాలు అని అంటారు. మహావాక్యాలు ఎక్కువ ఉండవు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మాట్లాడుతూ ఉండటము – వీటిని మహావాక్యాలని అనరు. కనుక సద్గురువు పిల్లలు – మాస్టర్ సద్గురువులవి మహావాక్యాలుగా ఉంటాయి కానీ వాక్యాలుగా కాదు. వ్యర్థం మాట్లాడేవారు తమ బుద్ధిలో వ్యర్థ విషయాలను, వ్యర్థ సమాచారాన్ని, నలువైపుల ఉన్న చెత్తా-చెదారాన్ని తప్పకుండా పోగు చేసుకుంటారు. ఎందుకంటే వారికి కథకు రమణీకమైన రూపాన్ని ఇవ్వాల్సి ఉంటుంది కదా. శాస్త్రవాదుల బుద్ధి ఉంటుంది కదా. అందుకే ఏ సమయంలో మరియు ఏ స్థానంలో, ఏ మాటలు అవసరమో, యుక్తియుక్తమో, స్వయానికి మరియు ఇతర ఆత్మలకు లాభదాయకమో, అవే మాటలు మాట్లాడండి. మాటలపై అటెన్షన్ తక్కువగా ఉంది, అందుకే దీనిని డబల్ అండర్లైన్ చేయండి.

విశేషంగా ఈ సంవత్సరం మాటలపై అటెన్షన్ పెట్టండి. చెక్ చేసుకోండి – మాటల ద్వారా శక్తిని మరియు సమయాన్ని ఎంత జమ చేసుకున్నారు మరియు ఎంత వ్యర్థంగా పోయాయి? ఎప్పుడైతే ఇది చెక్ చేసుకుంటారో, అప్పుడు స్వతహాగానే అంతర్ముఖత యొక్క రసాన్ని అనుభవం చేయగలరు. అంతర్ముఖతా రసము మరియు మాటల రసము – వీటి మధ్యన రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. అంతర్ముఖీ సదా భృకుటి కుటీరంలో తపస్వీ మూర్తిగా అనుభవం చేస్తారు. అర్థమయిందా!

అర్థం చేసుకోవడము అనగా తయారవ్వడము. ఎప్పుడైనా ఏదైనా విషయం అర్థమైతే, దానిని తప్పకుండా చేస్తారు, తప్పకుండా అర్థం చేసుకుంటారు. టీచర్లు ఉన్నదే తెలివైనవారిగా, అందుకే భాగ్యం లభించింది కదా. నిమిత్తంగా అయ్యే భాగ్యము – దీని మహత్వము ప్రస్తుతం అప్పుడప్పుడు సాధారణంగా అనిపిస్తుంది కానీ ఈ భాగ్యాన్ని సమయానికి అతి శ్రేష్ఠంగా అనుభవం చేస్తారు. ఎవరు నిమిత్తంగా చేసారు, ఆత్మనైన నన్ను దీనికి యోగ్యంగా ఎవరు ఎన్నుకున్నారు – ఈ స్మృతినే స్వతహాగా, శ్రేష్ఠంగా తయారుచేస్తుంది. ‘‘తయారుచేసేది ఎవరు’’! – ఒకవేళ ఈ స్మృతిలో ఉన్నట్లయితే చాలా సహజంగా, నిరంతర యోగులుగా అవుతారు. సదా హృదయంలో తయారుచేసేటువంటి తండ్రి యొక్క గుణాల పాటలను పాడుతూ ఉన్నట్లయితే నిరంతర యోగులుగా అయిపోతారు. ఇది తక్కువ విషయమేమీ కాదు! మొత్తం విశ్వంలో ఉన్న కోటానుకోట్ల మంది ఆత్మలలో ఎంతమంది నిమిత్త టీచర్లుగా అయ్యారు! బ్రాహ్మణ పరివారంలో కూడా టీచర్లు ఎంతమంది ఉన్నారు! కావున కొద్దిమందిలో కూడా కొద్దిమందిగా అయ్యారు కదా! టీచర్ అనగా సదా భగవంతుడు మరియు భాగ్యము యొక్క పాటలు పాడుతూ ఉండాలి. బాప్ దాదాకు టీచర్ల విషయంలో గర్వంగా ఉంటుంది కానీ రాజయుక్త టీచర్ల విషయంలో గర్వంగా అనిపిస్తుంది. అచ్ఛా!

ప్రవృత్తిలోని వారు కూడా మజాలో ఉంటారు కదా. తికమకపడేవారా లేక మజాలో ఉండేవారా? బ్రాహ్మణ జీవితంలో ప్రతి సెకండు తనువు, మనసు, ధనము, జనముల మజానే మజా ఉంటుంది. ప్రశాంతంగా నిద్రిస్తారు, ప్రశాంతంగా తింటారు. ప్రశాంతంగా ఉండడము, తినడము, నిద్రించడము మరియు చదువుకోవడము, ఇంకేమైనా కావాలా? చదువుకోవడం కూడా బాగా చదువుకుంటున్నారా లేక అమృతవేళ నిద్రపోతారా? చాలామంది పిల్లలు ఇలా చేస్తారు, మొత్తం రాత్రంతా మేల్కొన్నాను, ఉదయం నిద్ర వచ్చేసింది అని అంటారు. లేదంటే ఒక సేవను చేస్తే అమృతవేళను విడిచిపెట్టేస్తారు. మరి ఏమైనట్లు? ఎక్స్ ట్రా అయితే జమ అవ్వలేదు. ఒకవైపు సేవ చేసారు, ఇంకొకవైపు అమృతవేళ మిస్ చేసారు. మరి ఏమైనట్లు? కానీ అలాగని నేమీనాథుల (నియమానుసారముగా ఉండేవారేగానీ ధారణ చేయనివారు) వలె కునుకుపాట్లు పడుతూ కూర్చోవద్దు. ఆ టీ.వి. చాలా బాగుంటుంది. ఎలాగైతే వారు యోగాసనాలు చేస్తారు కదా, అనేక రకాల భంగిమలను మారుస్తూ ఉంటారు. మరి ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. సహజయోగం కదా, అందుకే సుఖంగా, సౌకర్యంగా కూర్చుందామని అనుకుంటారు. చాలామంది ట్యూన్లు కూడా బాప్ దాదాకు వినిపిస్తాయి. బాప్ దాదా వద్ద ఆ క్యాసెట్ కూడా ఉంది. కావున ఇప్పుడు డబల్ అండర్లైన్ చేస్తారు కదా. అప్పుడు బాప్ దాదా రిజల్టులో ఎంత తేడా వచ్చిందో వినిపిస్తారు. అచ్ఛా –

నలువైపులా ఉన్న శ్రేష్ఠ లక్ష్యాన్ని మరియు శ్రేష్ఠ లక్షణాలను ధారణ చేసే తీవ్ర పురుషార్థీ ఆత్మలకు, సదా తమ మాటలను సమయానుసారంగా మరియు నియమానుసారంగా ఉంచుకునే పురుషోత్తమ ఆత్మలకు, సదా మహావీరులుగా అయి మాయ యొక్క సర్వ రూపాలను తెలుసుకునే నాలెడ్జ్ ఫుల్ ఆత్మలకు, సదా ప్రతి సెకండు ఆనందంలో ఉండే నిశ్చింత చక్రవర్తులకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో అవ్యక్త బాప్ దాదా కలయిక

1. సైలెన్స్ శక్తి గురించి బాగా తెలుసా? సైలెన్స్ శక్తి సెకెండులో తమ స్వీట్ హోమ్, శాంతిధామంలోకి చేరుస్తుంది. సైన్స్ వారు అయితే ఇంకా తీవ్ర వేగం గల యంత్రాలను తయారుచేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీ యంత్రము ఎంత తీవ్ర వేగం కలది! ఆలోచించారు మరియు చేరుకున్నారు. ఖర్చు లేకుండా ఇంత దూరం చేరుకునే యంత్రము సైన్సులో ఉందా? వారైతే ఒక్కొక్క యంత్రాన్ని తయారుచేయడానికి ఎంత ఖర్చు చేస్తారు, ఎంత సమయాన్ని మరియు ఎంత శక్తిని వినియోగిస్తారు, మీరేమి చేసారు? ఖర్చు లేకుండా లభించింది. ఈ సంకల్ప శక్తి అన్నింటికన్నా వేగవంతమైనది. మీకు శుభ సంకల్పాల యంత్రము లభించింది, దివ్య బుద్ధి లభించింది. శుద్ధమైన మనసు మరియు దివ్య బుద్ధితో చేరుకుంటారు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తిరిగి రండి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెళ్ళిపోండి. సైన్స్ వారికైతే సీజన్ ను కూడా చూసుకోవాల్సి ఉంటుంది. మీకైతే ఇది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉండదు, నేడు మేఘాలున్నాయి, వెళ్ళలేము అని. ఈరోజుల్లో చూడండి – మేఘాలేమిటి, కొద్దిగా పొగమంచు ఉన్నా కూడా విమానం ఎగరలేదు మరియు మీ విమానం ఎవర్రెడీగా ఉందా లేదా అప్పుడప్పుడు పొగమంచు వస్తుందా? ఎవర్రెడీగా ఉందా? క్షణంలో వెళ్ళగలిగేంత తీవ్రగతి ఉందా? మాయ ఎప్పుడూ ఆటంకమైతే వేయదు కదా? మాస్టర్ సర్వశక్తివంతులను ఎవరూ ఆపలేరు. ఎక్కడైతే సర్వశక్తులు ఉంటాయో, అక్కడ ఎవరు ఆపుతారు! ఏ శక్తి లోపించినా సరే సమయానికి మోసపోగలరు. ఉదాహరణకు మీలో సహనశక్తి ఉంది కానీ నిర్ణయించే శక్తి బలహీనంగా ఉన్నట్లయితే, నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏదైనా వచ్చినప్పుడు, ఆ సమయంలో నష్టం కలుగుతుంది. అవునా, కాదా అని నిర్ణయం తీసుకోవడానికి ఒక్క ఘడియనే పడుతుంది. కానీ దాని పరిణామం ఎంత పెద్దదిగా ఉంటుంది. కావున తమ వద్ద కల అన్ని శక్తులనూ చెక్ చేసుకోండి. బాగానే ఉంది, నడుస్తున్నాము, యోగమైతే జోడిస్తున్నాము అని అనుకోవడం కాదు, కానీ యోగంతో ఏవైతే ప్రాప్తులు కలుగుతాయో – అవన్నీ ఉన్నాయా? లేదంటే తండ్రి అయితే నా వారిగా అయ్యారు అని కొద్దిలోనే సంతోషిస్తున్నారా. తండ్రి అయితే మీ వారే కానీ ప్రాపర్టీ (వారసత్వం) కూడా మీదే కదా. కేవలం తండ్రిని పొందాను అన్నదే సరిపోయిందా? వారసత్వానికి యజమానులుగా అవ్వాలి కదా? సర్వశక్తులు తండ్రి యొక్క ప్రాపర్టీ. అందుకే తండ్రి మహిమయే సర్వశక్తివంతుడు, ఆల్మైటీ అథారిటీ. సర్వశకుల స్టాక్ జమ అయి ఉందా? లేక సంపాదించారు మరియు తిన్నారు, అంతే, ఇంత మాత్రమేనా! బాప్ దాదా వినిపించారు, మున్ముందు మాస్టర్ సర్వశక్తివంతులైన మీ వద్దకు అందరు బికారులుగా అయి వస్తారు. ధనము లేక ధాన్యము యొక్క బికారులు కాదు, కానీ శక్తుల యొక్క బికారులు వస్తారు. మరి ఎప్పుడైతే స్టాక్ జమ అయి ఉంటుందో, అప్పుడే ఇస్తారు కదా. ఎవరి వద్దనైతే తమ కోసం కంటే ఎక్కువ ఉంటుందో, వారే దానమివ్వగలరు. ఒకవేళ తమకు సరిపోయినంతే ఉంటే, ఇక దానమేమి చేస్తారు? కావున అంతగా జమ చేసుకోండి. సంగమంలో వేరే పనేముంది? జమ చేసుకునే పనే లభించింది. మొత్తం కల్పంలో జమ చేసుకోగలిగే యుగము ఇంకేదీ లేదు. అప్పుడిక ఖర్చు చేయాల్సి ఉంటుంది, జమ చేసుకోలేరు. కావున జమ చేసుకునే సమయంలో ఒకవేళ జమ చేసుకోకపోతే, అంతిమంలో ఏం అనాల్సి వస్తుంది? ‘‘ఇప్పుడు లేదంటే మరెప్పుడూ లేదు’’, అప్పుడిక టూ లేట్ బోర్డు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడైతే లేట్ అన్న బోర్డే ఉంది, టూ లేట్ ది కాదు.

మాతలందరూ ఇంతగా జమ చేసుకున్నారా? శివశక్తులా లేక ఇంట్లోని మాతలా? శివశక్తి అనడంతో శక్తులు గుర్తుకొస్తాయి. ఏ మాతలను తండ్రి శివశక్తులుగా తయారుచేసారు! ఒకవేళ ఎవరైనా వచ్చి మీ ముఖం చూస్తే ఏమంటారు! ఇటువంటి శక్తులుంటారా! అని అంటారు. కానీ ఆ ఆత్మలు శక్తిశాలి అయినవారు అని తండ్రి గుర్తించారు. తండ్రి అయితే ఆత్మలను చూస్తారు, వృద్ధులా, యువకులా, పిల్లలా అన్నది చూడరు. ఆత్మకైతే వృద్ధాప్యము లేక చిన్న వయసు ఉండనే ఉండదు. కావున బాబా మమ్మల్ని శివశక్తిగా తయారుచేసారని సంతోషముంది కదా. ప్రపంచంలో ఎంతమంది చదువుకున్న మాతలున్నారు. కానీ తండ్రికి పల్లెటూరి వారే ఇష్టము, ఎందుకిష్టము? సత్యమైన హృదయంపై సాహెబ్ రాజీ అవుతారు. తండ్రికి సత్యమైన హృదయం ప్రియమనిపిస్తుంది. ఎవరైతే అమాయకులుగా ఉంటారో, వారికి అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం రాదు. ఎవరైతే గడుసుగా, తెలివిగా ఉంటారో, వారిలో ఇవన్నీ ఉంటాయి. కనుక ఎవరి హృదయమైతే అమాయకంగా ఉంటుందో, అనగా ప్రపంచం యొక్క మాయావీ తెలివి నుండి దూరంగా ఉంటారో, వారు తండ్రికి అతి ప్రియమైనవారు. తండ్రి సత్యమైన హృదయాన్ని చూస్తారు. అంతేకానీ చదువును, ముఖాన్ని, ఊరిని, ధనాన్ని చూడరు. సత్యమైన హృదయం ఉండాలి. అందుకే తండ్రి పేరు ‘దిల్ వాలా’ (మనసున్నవారు).

వరదానము:-

దృఢ నిశ్చయము భాగ్యాన్ని నిశ్చితం చేస్తుంది. ఎలాగైతే బ్రహ్మా తండ్రి ఫస్ట్ నంబరులో నిశ్చితమయ్యారో, అలా మేము ఫస్ట్ డివిజన్ లో రావాల్సిందే – ఈ దృఢ నిశ్చయము ఉండాలి. డ్రామాలో పిల్లలు ప్రతి ఒక్కరికీ ఈ గోల్డెన్ ఛాన్స్ ఉంది. కేవలం అభ్యాసం పట్ల అటెన్షన్ ఉన్నట్లయితే, ముందు నంబరు తీసుకోగలరు, అందుకే మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ గా అయి ప్రతి కర్మను చేస్తూ వెళ్ళండి. తోడు యొక్క అనుభవాన్ని పెంచండి, అప్పుడు అంతా సహజమైపోతుంది, ఎవరి తోడుగానైతే స్వయంగా సర్వశక్తివంతుడైన తండ్రి ఉంటారో, వారి ఎదురుగా మాయ కాగితపు పులి వంటిది.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top