20 April 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

19 April 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - ఏ సంతోషమైతే స్వయానికి లభించిందో, అది అందరికీ ఇవ్వాలి, మీరు సుఖ-శాంతులను పంచే వ్యాపారం చేయాలి’’

ప్రశ్న: -

పిల్లలైన మీకు ఈ అనంతమైన డ్రామా యొక్క ప్రతి దృశ్యం చాలా ఇష్టము – ఎందుకు?

జవాబు:-

ఎందుకంటే స్వయం క్రియేటర్ కు (రచయితకు) ఈ డ్రామా ఇష్టము. ఎప్పుడైతే రచయితకు ఇష్టమనిపిస్తుందో, అప్పుడు పిల్లలకు కూడా తప్పకుండా ఇష్టమనిపిస్తుంది. మీరు ఏ విషయంలోనూ కోప్పడలేరు. మీకు తెలుసు, ఈ సుఖ-దుఃఖాల నాటకం చాలా సుందరంగా తయారుచేయబడి ఉంది. ఇందులో గెలుపు-ఓటముల ఆట నడుస్తూ ఉంటుంది, దీనిని బాగోలేదు అని అనలేరు. పగలు కూడా మంచిదే, రాత్రి కూడా మంచిదే… ఈ డ్రామాలో ఏ పాత్ర అయితే లభించి ఉందో, దానిని సంతోషంతో అభినయించేవారు చాలా ఆనందంగా ఉంటారు. ఈ అనంతమైన నాటకం యొక్క జ్ఞానాన్ని స్మరించేవారు సదా హర్షితంగా ఉంటారు. బుద్ధి నిండుగా ఉంటుంది.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

మా తీర్థ స్థానాలు అతీతమైనవి… (హమారే తీర్థ్ న్యారే హై…)

ఓంశాంతి. వాస్తవానికి స్కూల్ లో ఏ పాటలూ పాడడం జరగదు. ఇది పాఠశాల. అయినా ఇక్కడ పాటలు ఎందుకు పాడడం జరుగుతుంది? సత్యయుగంలోనైతే ఈ పాటలు పాడడం జరగదు. ఇప్పుడు మనం సంగమంలో కూర్చున్నాము, అందుకే భక్తి మరియు పాటలు మొదలైనవాటిని తీసుకుని, వాటి అర్థాన్ని అర్థం చేయిస్తారు, మనుష్యులైతే అర్థాన్ని అర్థం చేసుకోరు. ఇప్పుడు మనం ఇక్కడా లేము, అక్కడా లేము, మధ్యలో కూర్చున్నాము, కనుక కొంచెం వీటి ఆధారాన్ని తీసుకుంటాము. పిల్లలకు జ్ఞానం మరియు భక్తి యొక్క రహస్యాలనైతే అర్థం చేయించడం జరిగింది. ఈ సమయంలో మీరు భవిష్యత్తు కొరకు జ్ఞానాన్ని వింటున్నారు. భవిష్యత్తు కోసం పురుషార్థం చేసి ఏదైనా ప్రారబ్ధాన్ని తయారుచేసుకునేటువంటి మనుష్యులెవ్వరూ లేరు. మీరు పురుషార్థం చేస్తారు భవిష్య కొత్త ప్రపంచం కోసము. మనుష్యులు మరుసటి జన్మ కోసం దాన-పుణ్యాలు మొదలైనవి చేస్తారు. అది భక్తి, ఇది జ్ఞానము, కొంతమంది అంటారు కూడా, జ్ఞానం, భక్తి మరియు వైరాగ్యము అని. సన్యాసులది హద్దు వైరాగ్యము. మీది అనంతమైన వైరాగ్యము. వారు ఇళ్ళు-వాకిళ్ళ నుండి వైరాగ్యాన్ని కలిగిస్తారు, ప్రపంచంతో కాదు. ఇది తమోప్రధానమైన శిథిలావస్థలో ఉన్న సృష్టి అని, దీని వినాశనం జరగనున్నదని వారికి తెలియనే తెలియదు ఎందుకంటే కల్పం ఆయువును చాలా పెద్దదిగా చేసేసారు. ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు, బుద్ధి కూడా చెప్తుంది, ఈ విషయమైతే పూర్తిగా సరైనది. ముఖ్యమైన విషయము, పవిత్రతకు సంబంధించినది, దాని కోసం వారు ఇళ్ళు-వాకిళ్ళను విడిచిపెట్టేస్తారు. మీరు మొత్తం పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోతారు. పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళేందుకు పవిత్రంగా అవుతారు. మీ యాత్ర బుద్ధికి సంబంధించినది. కర్మేంద్రియాలతో ఎక్కడికీ వెళ్ళనవసరం లేదు, మీది శారీరకమైనది ఏదీ నడవదు. ఇప్పుడు మనం ఆత్మిక తండ్రి వద్దకు వెళ్తాము, ఆ దైహిక యాత్రలైతే అనేకమున్నాయి. ఒకసారి ఒక చోటుకు వెళ్తారు, మరోసారి ఇంకొక చోటుకు. మీ బుద్ధి ఒక్కరి వైపే ఉంది. దీనిని అవ్యభిచారి భక్తి అని అన్నా కూడా అది సరైనదే. మీరు ఒక్కరినే స్మృతి చేస్తారు. వారందరిదీ వ్యభిచారి భక్తి. అనేకులను స్మృతి చేస్తారు. మీది అవ్యభిచారి ఆత్మిక యాత్ర, దీనిలో మనం తిరిగి మన ఇంటికి వెళ్తున్నాము. వారు నిర్వాణధామాన్ని ఇల్లు అని కూడా భావించరు. పరలోకానికి నిర్వాణం చెందారని అంటారు. మీకు తెలుసు, అక్కడ ఆత్మలైన మనం బాబాతో పాటు ఉంటాము. ఇప్పుడు బాబా మనల్ని తీసుకువెళ్ళడానికి వచ్చారు. మనమంతా ఈశ్వరుని రూపాలము అని వారు భావిస్తారు. ఎన్ని శాస్త్రాలు మొదలైనవి చదువుతారు, ఇక్కడ మీకు అవేవీ నేర్పించడం జరగదు. మీ చేత ఈ కర్మకాండను కూడా సన్యాసం చేయించడం జరుగుతుంది. ఇవన్నీ భక్తి యొక్క కర్మకాండలు. ఎలాగైతే ప్రభువు యొక్క గతి మతి అతీతమైనది. మొట్టమొదట మీకు అల్ఫ్ (భగవంతుడి) గురించి నేర్పిస్తారు. తండ్రి స్వయంగా మధ్యవర్తిగా అయ్యి వస్తారు. పాడుతారు కూడా, కానీ అర్థం చేసుకోరు. మీకు భక్తి పట్ల అసహ్యం ఏమీ లేదు. ఎవరి పట్ల కూడా అసహ్యం కలగదు, డ్రామా తయారుచేయబడి ఉందని తెలుసు. అయితే, తప్పకుండా అర్థం చేయిస్తారు, ఈ పాత ఛీ-ఛీ ప్రపంచాన్ని విడిచిపెట్టాలి, తిరిగి వెళ్ళాలి అని. ఎప్పుడైతే భక్తిలో ఉండేవారో, అప్పుడు భక్తి పట్ల ప్రేమ ఉండేది. పాటలు మొదలైనవి వినడం వలన ఆనందం కలిగేది. అవైతే దేనికీ ఉపయోగపడవని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. వినడంలో అభ్యంతరమేమీ లేదు, కానీ ఇది కూడా భక్తిలో చేసే పని. ఇప్పుడు మన బుద్ధియోగం దాని నుండి తొలగి జ్ఞానంతో జోడించబడింది. జ్ఞానం మరియు భక్తి రెండింటి గురించి మీకు తెలుసు. మనుష్యులకు ఎప్పటివరకైతే జ్ఞానం లభించదో, అప్పటివరకు భక్తినే చాలా మంచిదని భావిస్తారు. మనం జన్మ-జన్మాంతరాలుగా భక్తి చేస్తూ వచ్చాము. భక్తి పట్ల స్నేహం పెరిగింది. ఇప్పుడు మన బుద్ధిలో ఉంది – ఇది సుఖ-దుఃఖాలు, గెలుపు-ఓటములతో తయారుచేయబడిన డ్రామా. కనుక వారిపై దయ కలుగుతుంది, వారికి కూడా రచయిత మరియు రచనల జ్ఞానం ఎందుకు లభించకూడదు, అప్పుడు బాబా యొక్క వారసత్వాన్ని పొందగలరు. ఏ సంతోషమైతే తమకు లభించిందో, దానిని ఇతరులకు ఇవ్వాలి. సింధ్ వృత్తి వారు (విదేశాలలో వ్యాపారం చేయడానికి వెళ్ళేవారు) ఎప్పుడైతే, ఫలానా స్థానంలో వ్యాపారం బాగా నడుస్తుందని చూస్తారో, అప్పుడు తమ మిత్ర-సంబంధీకులకు కూడా, ఫలానా స్థానానికి వెళ్ళండి, అక్కడ సంపాదన చాలా బాగుంటుందని సలహానిస్తారు.

మీకు తెలుసు, ఈ రావణ రాజ్యంలో దుఃఖమే దుఃఖం ఉంది. జ్ఞానమంటే ఏమిటి అన్నది మనుష్యులకు తెలియదు. ఈ జ్ఞానంతో స్వరాజ్యం లభిస్తుందని సాధు-సత్పురుషులకు కూడా తెలియదు. ఈ జ్ఞానంతో ఏం ప్రాప్తి ఉంటుంది అని అడుగుతారు. అప్పుడు రాయడం జరుగుతుంది, శాంతి మరియు సుఖం రెండూ లభిస్తాయి, అది కూడా అవినాశీ. ఎవరికైనా సుఖ-శాంతుల యొక్క వ్యాపారం లభించినట్లయితే ఇక అందులోనే నిమగ్నమైపోతారు. అయితే, దైహిక సేవ కూడా కొంత సమయం కోసం చేయవలసి ఉంటుంది. సత్సంగం సమయం కూడా ఉదయం మరియు సాయంత్రం ఉంటుంది. మాతలకు ఇంటి యొక్క బంధనం ఉంటుంది కనుక వారి కోసం మళ్ళీ పగలు సమయం పెట్టడం జరుగుతుంది. ఉదయం సమయం అన్నింటికన్నా మంచిది, ఫ్రెష్ మైండ్ ఉంటుంది. ఏదైతే వింటారో, దానిని మళ్ళీ ధారణ చేసి నెమరువేయాలి. ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు, నిరాకార పరమాత్మ కూడా చదివించడానికి వస్తారు అని. భగవానువాచ – మీకు రాజయోగాన్ని నేర్పించి నరుని నుండి నారాయణునిగా చేస్తాను. ఈ యోగం చాలా ప్రసిద్ధమైనది. మనుష్యులు వినాశీ ధనం యొక్క దాన-పుణ్యాలు చేస్తారు కనుక రాజు ఇంట్లో మంచి జన్మ తీసుకుంటారు. ఇక్కడైతే మీరు 21 జన్మల వారసత్వాన్ని పొందుతున్నారు. మీరు అంతా దానం చేస్తారు, 21 జన్మల కోసం. మళ్ళీ ఏ పదవి కూడా పొందడం కోసం పురుషార్థం చేయాల్సిన అవసరం ఉండదు. పదవి ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మీరు తమ వారసత్వాన్ని తండ్రి నుండి తీసుకుంటున్నారు, అందుకే బాబా అంటారు, మంచి రీతిగా చదువుకున్నట్లయితే జన్మ-జన్మాంతరాలు రాజులుగా అవుతారు. మొదటి జన్మ లభించడమే ఉన్నతమైనది లభిస్తుంది. ప్రజలకు కూడా ఉన్నతమైనదే లభిస్తుంది. రాజ్యంలో దాస-దాసీలు మొదలైనవారందరూ కావాలి. ఎంతగా చదువుకుంటారో, మహాదానులుగా అవుతారో, అంతగా ఉన్నతమైన పదవిని పొందుతారు. బాబా కూడా మహాదాని. అందరినీ షావుకార్లుగా చేస్తారు. సుఖం మరియు శాంతి యొక్క వారసత్వాన్ని ఇస్తారు. మొట్టమొదట సుఖంలోకే వస్తారు, అందరూ సుఖమయంగా ఉండేవారు ఎందుకంటే మొదటి సమయంలో సతోప్రధానంగా, తర్వాత రజో, తర్వాత తమోలలోకి వస్తారు. వారి పాత్ర వారిది మరియు మన పాత్ర మనది. ఎవరైతే ఈ ధర్మానికి చెందినవారో, వారిదే అంటు కట్టబడుతుంది. ఎప్పుడైతే మీరు సంపూర్ణంగా అయిపోతారో, అప్పుడు వెంటనే తెలుసుకుంటారు, వీరు మన ధర్మానికి చెందినవారా, కాదా అని.

పిల్లలైన మీరు అందరికీ అర్థం చేయిస్తారు, తండ్రి కొత్త ప్రపంచాన్ని రచించినప్పుడు భారత్ కే వారసత్వం లభించింది, తర్వాత మాయమైపోయింది. డ్రామానుసారంగా వారసత్వాన్ని తీసుకోవాలి కూడా మరియు పోగొట్టుకోవాలి కూడా. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మనం వారసత్వాన్ని పోగొట్టుకున్నాము, ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నాము. లక్ష్మీ-నారాయణుల రాజ్యం గురించి ఎవ్వరికీ తెలియదు, అందుకే అడగడం జరుగుతుంది, లక్ష్మీ-నారాయణులకు ఈ రాజ్యం ఎప్పుడు మరియు ఎలా లభించింది? ఎలాగైతే వారు కృష్ణుడిని ముందు పెట్టి లక్ష్మీ-నారాయణులను మాయం చేసేసారు మరియు మనం మళ్ళీ లక్ష్మీ-నారాయణులను ముందు పెట్టి కృష్ణుడిని మాయం చేసేస్తాము. లక్ష్మీ-నారాయణులు ఉన్నారే సత్యయుగానికి చెందినవారు, నారాయణ వాచ అయితే ఉండజాలదు. తండ్రి అంటారు, నేను రావడమే సంగమంలో వస్తాను. లక్ష్మీ-నారాయణులు తప్పకుండా ముందు జన్మలో సంగమంలోనే రాజ్యాన్ని తీసుకున్నారు. లక్ష్మీ-నారాయణులే 84 జన్మలు అనుభవించి ఇప్పుడు అంతిమ జన్మలో ఉన్నారు. లక్ష్మీ-నారాయణులకు కూడా రాజ్యాన్ని ఇచ్చేవారు తప్పకుండా ఎవరో ఉంటారు కదా. కనుక భగవంతుడే ఇచ్చారు. ఈ సమయంలో మీరు పూర్తిగా బికారులుగా ఉన్నారు, మళ్ళీ రాకుమారులుగా అవుతారు. రాకుమారుడిదైతే తప్పకుండా రాజా-మహారాజా వద్ద జన్మ జరుగుతుంది. ఇప్పటికీ కూడా కొందరు మంచి-మంచి రాజులున్నారు, వారికి ప్రజల పట్ల చాలా ప్రేమ ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసు, మనం రాజయోగం నేర్చుకుంటున్నాము, దీని ద్వారా మనం రాజ్య భాగ్యాన్ని పొందుతాము. మనకు ఈ నిశ్చయం ఉంది ఎందుకంటే ఇది అనాది డ్రామా, గెలుపు-ఓటముల ఆట. ఏదైతే జరుగుతుందో అది సరైనది, రచయితకు డ్రామా ఇష్టమనిపించదా ఏమిటి! తప్పకుండా ఇష్టమనిపిస్తుంది. కనుక రచయిత యొక్క పిల్లలకు కూడా ఇష్టమనిపిస్తుంది. మనం ఎవరినీ అసహ్యించుకోలేము. భక్తిది కూడా డ్రామాలో పాత్ర ఉందని అయితే భావిస్తారు. డ్రామా అంతా మంచిదే. చెడు డ్రామా అని ఎందుకంటారు! డ్రామా రహస్యం బుద్ధిలో ఉంది, దానిని మీకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు భక్తి పాత్ర పూర్తి అవుతుంది. ఇప్పుడు పురుషార్థం చేసి తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి. తండ్రి అంటారు, ఇదంతా ఆసురీ సంప్రదాయము, దీనిని అసహ్యించుకునే విషయమే లేదు. ఇది ఈశ్వరీయ సంప్రదాయం మరియు ఆసురీ సంప్రదాయం యొక్క ఆట. వారు ఏమైనా స్వయాన్ని దుఃఖితులుగా భావిస్తారా. భక్తి చేస్తూ ఉంటారు మరియు ఒక రోజు భగవంతుడు వచ్చి భక్తి యొక్క ఫలాన్ని ఇస్తారు. ఇంట్లో కూర్చొని ఉండగానే ఏదో ఒక రూపంలో భగవంతుడు వచ్చి కలుస్తారు అని భావిస్తారు. సన్యాసులు, మేము మా అంతట మేమే నిర్వాణధామంలోకి వెళ్తామని భావిస్తారు. తమ పురుషార్థంతో తత్వంతో యోగాన్ని జోడిస్తారు మరియు మేము లీనమైపోతామని భావిస్తారు. ప్రపంచంలో అనేక మతాలున్నాయి, బాబా వచ్చి ఏక మతాన్ని తయారుచేస్తారు. అర్థం చేయిస్తారు, ఈ డ్రామా అనాదిగా తయారై ఉంది, చాలా సుందరమైన నాటకం తయారై ఉంది. డ్రామాలో సుఖ-దుఃఖాల పాత్ర రచించబడి ఉంది, దానిని చూసి చాలా సంతోషం కలుగుతుంది. ఈ అనంతమైన ఆట చాలా బాగా తయారై ఉంది. కనుక అందరికీ ఇష్టం అనిపించాలి. పగలు కూడా మంచిదే, రాత్రి కూడా మంచిదే. ఆట కదా. ఇప్పుడు రాత్రి పూర్తి కానున్నదని, మనం పగలులోకి వెళ్ళి ఉన్నత పదవిని పొందాలని తెలుసు. కోపం ఏం చెందుతాము? డ్రామాలో ఏ పాత్ర లభించిందో అదైతే అభినయించాల్సిందే. చాలా మంచి డ్రామా. దీనిని బాగోలేదని అనలేరు. ఈ ఆట ఎప్పుడూ ఆగిపోదు. చాలా ఫస్ట్ క్లాస్ ఆట. దీనిని తెలుసుకోవడంతో బుద్ధి నిండుగా అయిపోయింది. ఎలాగైతే తండ్రి నాలెడ్జ్ ఫుల్ గా ఉన్నారో, అలా పిల్లలు కూడా నాలెడ్జ్ ఫుల్ గా ఉన్నారు. ఎంత సమయం సుఖం, ఎంత సమయం దుఃఖం పొందాలి, ఇది కూడా మీరంతా తెలుసుకున్నారు. అప్పుడే కదా వాహ్ ప్రభూ, మీ లీల అని అంటారు. ప్రభు యొక్క రచన తప్పకుండా మంచిగానే ఉంటుంది. దానిని బాగోలేదని ఎవరంటారు! డ్రామాలో ఏ పాత్ర లభించిందో, దానిని అభినయించాల్సిందే. ఈ ఆట ఎప్పుడూ ఆగిపోయేదే లేదు. దీనిని అర్థం చేసుకోవడం ద్వారా ఆనందమే ఆనందం కలుగుతుంది. భక్తిలో సత్యయుగీ రాజ్యం గురించి కూడా తెలియదు. సత్యయుగీ రాజ్యంలో మళ్ళీ భక్తి గురించి తెలియనే తెలియదు. భక్తిలో కూడా ఎంత సుందరమైన పాటలు పాడుతారు, ఓ ప్రభూ, మీ లీల విచిత్రమైనదని అని పాడుతారు. దీనిని పిల్లలైన మీరే అర్థం చేసుకోగలరు, వేరెవ్వరికీ ఈ లీల గురించి తెలియనే తెలియదు. బాబా నుండి మనకు ఎంత వారసత్వం లభిస్తుంది. రోజంతా బుద్ధిలో ఆలోచన నడవాలి, ఎంత అద్భుతమైన ఆట ఉంది! దీని వివరణ అద్భుతమైనది. తండ్రి యొక్క లీల ఎంత మంచిగా ఉంది! మీకు ఈ అనంతమైన నాటకం గురించి తెలుసు. మళ్ళీ ఏ పదవి అయితే లభిస్తుందో, దానిని కూడా చూసి హర్షిస్తారు. మనుష్యులు నాటకాన్ని చూసి సంతోషిస్తారు కదా. అవి వెరైటీ నాటకాలు ఉంటాయి, ఇది ఒకటే నాటకము. ఈ నాటకాన్ని తెలుసుకోవడం ద్వారా మనం విశ్వానికి యజమానిగా అవుతాము. ఎంత అద్భుతమైన విషయము! తండ్రి ద్వారా మీరే తెలుసుకున్నారు. ఈ విషయాలను రమించవల్సి ఉంటుంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ 2-3 గంటలు తీసి ఆ నాటకాన్ని చూసి వస్తారు. అది కూడా ఎవరినైనా అడగడం జరుగుతుందా ఏమిటి? బుద్ధిలో కూర్చుండిపోతుంది. అలాగే ఇది కూడా అనంతమైన నాటకము, దీనిని ఎందుకు మర్చిపోవాలి! ఈ చక్రం యొక్క స్మృతి అయితే పూర్తిగా సహజమైనది. దీని గురించి ఇంకెవ్వరికీ తెలియదు. మీరు బుద్ధితో తెలుసుకుంటారు మరియు దివ్యదృష్టితో చూస్తారు కూడా. మున్ముందు ఇంకా చాలా దృశ్యాలను చూస్తారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి సమానంగా మహాదానిగా అవ్వాలి. అందరికీ సుఖ-శాంతుల వారసత్వాన్ని ఇవ్వాలి. జ్ఞానాన్ని ధారణ చేసిన మళ్ళీ నెమరువేయాలి.

2. అనంతమైన నాటకాన్ని చూస్తూ సదా హర్షితంగా ఉండాలి. ప్రభు యొక్క లీల మరియు ఈ డ్రామా ఎంత విచిత్రమైనది అని దీనిని స్మరిస్తూ ఆనందంగా ఉండాలి.

వరదానము:-

పురుషార్థం ధరణిని తయారుచేస్తుంది, అది కూడా అవసరమే కానీ పురుషార్థంతో పాటు యోగ ప్రయోగంతో అందరి వృత్తులను పరివర్తన చేసినట్లయితే సఫలత సమీపంగా కనిపిస్తుంది. దృఢ నిశ్చయం మరియు యోగ ప్రయోగం ద్వారా ఎవరి బుద్ధినైనా పరివర్తన చేయగలరు. సేవలో ఎప్పుడైనా అలజడి జరిగినప్పుడు అందులో విజయం యోగ ప్రయోగం ద్వారానే లభించింది. అందుకే పురుషార్థంతో ధరణిని తయారుచేయండి. కానీ బీజాన్ని ప్రత్యక్షం చేయడానికి యోగ ప్రయోగం చేయండి. అప్పుడు విజయీ భవ అనే వరదానం ప్రాప్తిస్తుంది.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top